టీడీపీ పార్టీని పదవిని అల్లుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుండి లాగేసుకున్నాక ఆయనకు ఎదురులేకుండా పోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయ పదవులకు దూరంగా, కొన్ని ప్రయోజనాలకు దగ్గరగా బ్రతికేశారు. తండ్రి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో పునాది నుండి ఉన్న హరికృష్ణ మాత్రం ఓసారి రాజ్య సభ సభ్యడు పదవితో పాటు ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం జరిగింది. అంతకు మించి టీడీపీ చైతన్య రథసారధికి దక్కిందేమి లేదు. ఎప్పటికైనా హరికృష్ణతోనే తనకు ముప్పనుకున్న బాబు,ఆయన్ని పార్టీకి దూరం పెడుతూ వచ్చారు. ఆయనకు పార్టీలో కనీస ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఇక అవసరానికి 2009 ఎన్నికల కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తెచ్చుకున్న చంద్రబాబు, తరువాత పార్టీకి మరియు నందమూరి కుటుంబానికి దూరం చేశారు.
Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?
చంద్రబాబు ఏది చేసినా తన కొడుకు కోసమే చేశారు. లోకేష్ కి ప్రత్యామ్నాయంగా టీడీపీలో మరో బలమైన నాయకుడు ఉండకూడదు అనేది బాబు ఆచరిస్తున్న సూత్రం. అందుకే తెలివి తేటలు, వాక్చాతుర్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీకి చేరువ కానివ్వలేదు. విజయపథంలో ఉన్నప్పుడు నాయకుడు చేసే పొరపాట్లు, తప్పిదాలు అనేవి లెక్కలోకి రావు. ఎప్పుడైతే పరాజయం ఎదురవుతుందో ప్రతి ఒక్కరు తప్పులను ఎత్తి చూపుతారు. టీడీపీ పార్టీ ఘోరపరాభవానికి, నేటి దుస్థితికి చంద్రబాబు పుత్ర వాత్సల్యమే కారణమని తెలుగు తమ్ముళ్లు కూడా చెప్పే మాట. కొడుకుపై ప్రేమను మరచి ఎన్టీఆర్ లాంటి సమర్దుడిని దించితేనే టీడీపీకి భవిష్యత్తు అనేది టీడీపీ నేతల వాదన.
Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?
లోకేష్ భవిష్యత్ గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ని టీడీపీ ని కాపాడేవాడు అనే హోదాలో ఆహ్వానించడు. కారణం ఒకవేళ 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడే అయినా, తరువాత భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తుంది కానీ, లోకేష్ పేరు కాదు. కాబట్టి టీడీపీ ఏమై పోయినా ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం ఉండదు. ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేయడం వెనుక బాబు ఎజెండా స్పష్టంగా అర్థం అవుతుండగా, బాలయ్య అల్లుడు భరత్ కూడా వ్యతిరేకించడం ఆసక్తికరం. చంద్రబాబు వలే ఎన్టీఆర్ రాకను బాలయ్య చిన్నల్లుడు భరత్ అసలు ఇష్టపడడం లేదట. ఎన్టీఆర్ ని పార్టీలోకి తేవద్దనేది ఆయన వాదన అని సమాచారం. చంద్రబాబుకు ఈ విషయంలో సూచనలు ఇస్తున్నాడట భరత్ . గతంలో కూడా భరత్ ఎన్టీఆర్ పై నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్, వస్తే ఎవరూ కాదనరు అన్నారు. ఎన్టీఆర్ రాకపోయినా టీడీపీని సమర్ధవంతంగా నడిపే నాయకులు ఉన్నారు అన్నారు. ఎన్టీఆర్ రాకపై భరత్ ఎందుకు అభద్రతా భావం ఫీలవుతున్నాడు అనేది ఆలోచించాల్సిన అంశం.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: What is trouble for balakrishna son in law when ntr comes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com