Home Blog Page 8375

నిశ్శబ్దం రిలీజ్‌పై కోన మనసు మార్చుకున్నాడా?


టాలీవుడ్‌ దేవసేన అనుష్క శెట్టిని తెరపై చూసి చాలా కాలం అవుతోంది. బాహుబలి తర్వాత భాగమతితో ప్రేక్షకుల ముందుకొచ్చిందామె. అది విడుదలై రెండేళ్లు అవుతోంది. గతేడాది సైరా నరసింహా రెడ్డిలో అతిథి పాత్ర చేసింది. సాధారణంగానే ఆచితూచి సినిమాలు చేసే స్వీటీ కథ నచ్చితే ప్రాణం పెట్టి నటిస్తుంది. నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు పెట్టింది పేరైన అనుష్క ప్రధాన పాత్ర‌ పోషించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధనవ్‌ కీలక పాత్ర పోషించాడు. హేమంత్‌ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. వేసవిలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేసినా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. మూగ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలు పెట్టుకుంది. ఇలాంటి పాత్ర చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ లో ఆమె అద్భుతంగా నటించిందని తెలిసిపోయింది. దాంతో, అనుష్కను తెరపై చూసేందుకు ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !

కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడంతో ఈ మధ్య పలు చిత్రాలు ఓటీటీల బాట పడుతున్నాయి. దాంతో, నిశ్శబ్దం మూవీని కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేయాలని పలువురు సూచించారు. కానీ, ఇది థియేటర్లో చూపించాల్సిన సినిమా అని చిత్ర నిర్మాత, కథ అందించిన కోన వెంకట్‌ ఇది వరకే స్పష్టం చేశాడు. కానీ, ఫస్ట్‌ కాపీ రెడీ అయి నెలలు గడవడం, థియేటర్లు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవడంతో కోన బెట్టు వీడాడు. రిలీజ్‌ విషయంలో అతను మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దాంతో, ఈ సినిమాను ఎలా రిలీజ్‌ చేయాలో చెప్పాలంటూ అభిమానుల సలహా కోరుతున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోల్‌ పెట్టాడు. ‘థియేటర్ల కోసం జనవరి, ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే నిశ్శబ్దం సినిమాకు మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’ అంటూ థియేటర్లు, ఓటీటీ, ఎక్కడైనా సరే అని మూడు ఆప్షన్లు ఇచ్చాడు. కాగా, మెజారిటీ నెటిజన్లు ఓటీటీకే ఓటు వేశారు. కొంతమంది మాత్రం అనుష్క పెర్ఫామెన్స్‌ను వెండితెరపైనే చూడాలని అంటున్నారు. మరి, వెంకట్‌ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

‘బ్యాచ్‌ల‌ర్’ కష్టాలు.. నాగ్ ని ఎలా ఒప్పిస్తారో !


సినిమా హిట్ ప్లాప్ అని డిసైడ్ చేసే మెయిన్ పాయింట్ బోరింగ్ అనే పదమే. ఆ బోరింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనవసరమైన లెంగ్త్ సీన్లే. అందుకే సినిమా నిడివి ఎంత అని అడుగుతుంటారు సినిమా ఇండస్ట్రీలో. సినిమాలో సోది ఎక్కువైతేనే లెంగ్త్ ఎక్కువ వస్తోంది. అప్పుడు సినిమాని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా కాపాడలేడు. సో.. లెంగ్త్ కి అంత ప్రాధాన్యత ఉంది. ఆయితే అఖిల్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‘ మరీ లెంగ్త్ ఎక్కువ వచ్చిందట. ఈ సినిమా గాని ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా ఉండదు. ఏమైనా హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన హైప్ ను సంపాధించిన ఈ అక్కినేని కుర్రాడు.. హీరో అయ్యాక మాత్రం ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు.

Also Read: చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…

బొమ్మరిల్లు భాస్కర్ చేస్తోన్న ఈ సినిమా ఎలా వచ్చిందో అని ‘బ్యాచ్‌ల‌ర్’ ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున ఇప్పటికే ఆల్ రెడీ చూశాడు. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయమని కూడా నాగ్ చెప్పాడు. ఆ మార్పులు ప్రధాన అంశం లెంగ్త్ తగ్గించమనే. అయినా భాస్కర్ మాత్రం ఆ సీన్స్ ను అలాగే ఉంచాడట. సినిమాలో అవి బాగా పేలతాయని భాస్కర్ అభిప్రాయం. అవి అసలు బాగాలేదని నాగ్ నిర్ణయం. ఈ అభిప్రాయం నిర్ణయం మధ్యన ఆ సీన్స్ ఉంచాలో తీయలో నిర్మాతకు అర్ధం కాని పరిస్థితి. కారణం దర్శకుడు నిర్మాతను కన్వీన్స్ చేశాడట.

Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !

మరి ఇప్పుడు నాగ్ కి ఏమి చెప్పాలి అనేది నిర్మాతకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. తాజాగా నాగ్ చెప్పిన మార్పులకు సంబంధించిన సీన్స్ వర్క్ ను నాగ్ అడిగాడట. తాను చేంజ్ చేయమన్నా లేటెస్ట్ వెర్షన్ చూడాలని నాగ్ అడుగుతున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో నాగ్ చెప్పిన వెర్షన్ కి తగ్గట్టు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎడిటింగ్ అయిపోయాక రెండు వెర్షన్ లను నాగార్జునకు చూపించి ఆయనను మొదటి వెర్షన్ కే ఒప్పించాలనేది భాస్కర్ ప్లాన్. కానీ నాగ్ చూస్తోంది అవుట్ ఫుట్ కాదు, సినిమా లెంగ్త్ అనే విషయం భాస్కర్ కి అర్ధమయ్యేలా చెప్పలేక నిర్మాత మౌనంగా ఉండిపోయాడట పాపం. ఒక్కటి మాత్రం ఫిక్స్.. ఈ సినిమా ఫలితం తేడా కొడితే.. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ ఇక కష్టమే.

భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు.. ఎక్కడంటే?

దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు పలు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తారాఖాండ్ రాష్ట్రాన్ని వర్షం గజగజా వణికించింది. పిథోర జిల్లాలోని కైలాష్-మానససరోవర్ యాత్రా మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోగా విరిగిపడ్డ కొండ చరియల వల్ల ఈ మార్గం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సైతం కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగి పడటంతో జాతీయ రహదారి 309 ఏపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని చాలా ఇళ్లు ప్రమాదంలో పడ్డాయి. లోతట్టు పాంతాలలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి.

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించింది. డెహ్రాడూన్ జిల్లాలో భారీ వర్షాల వల్ల థంస్సా నది నీరు పేరుప్రఖ్యాతలు గాంచిన తపకేశ్వర స్వామి గుడిని తాకింది. వరదల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇల్లు, రోడ్లు కొట్టుకుని పోయాయి. ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌ భారీ నష్టం వాటిల్లిన పితోర్ ఘర్ జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

అర్ధరాత్రి రఫేల్స్ తో భారత్ సీక్రెట్ ఫైట్?


‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’ అన్న పాపులర్ సినిమా డైలాగ్ ను భారత్ అక్షరాల నిజం చేస్తోంది. లేట్ గా భారత్ లోకి డెలివరీ అయిన ఫ్రాన్స్ తయారు చేసిన ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు రఫేల్స్ అప్పుడే ట్రయల్ ఫైట్ మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో చైనా భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న నేపథ్యంలో అంతే సన్నాహకంగా భారత్ ‘రఫేల్స్’తో సీక్రెట్ ఫైట్ ను అర్ధరాత్రి నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Also Read: సచిన్ పైలట్ తిరిగి రాక దేనికి సంకేతం?

జూలై 29న ఫ్రాన్స్ దేశం భారత్ కు ఐదు రఫేల్ యుద్ధ విమానాలను డెలివరీ చేసింది. భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఈ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ మంచుకొండలపై అర్ధరాత్రి ఎగురుతూ యుద్ధ సన్నహాలు నిర్వహిస్తున్నాయని తెలిసింది.

రక్షణ శాఖ నివేదికల ప్రకారం.. ఐదు రాఫెల్ జెట్స్ హిమాచల్ ప్రదేశ్ లోని పర్వత భూభాగంలో రాత్రి వేళ ఎలా యుద్ధం చేయాలనే దానిపై పైలెట్స్ కు శిక్షణ ఇస్తున్నారని సమాచారం.

చైనాతో భారత్ కు 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన నియంత్రణ రేఖ ఉంది. ప్రస్తుతం చైనా భారీగా లఢక్ సరిహద్దుల్లోకి యుద్ధ విమానాలను తరలిస్తోంది. దీంతో ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్స్ ద్వారా చైనా శత్రు సైన్యాలపై దాడికి దిగేలా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

రఫేల్ ద్వారా గాల్లోనే క్షిపణి ప్రయోగాలు.. భూమిపై లక్ష్యాలు.. ఆకాశంలోని లక్షణాలు.. ఇక గాల్లోనే ఇంధన నింపుకునే సౌలభ్యాలు ఎన్నో ఉన్నాయి.నింగి నేలపై అరవీర భయంకరమైన ఈ రఫేల్స్ కు అన్ని క్షిపణులను అమర్చి లఢక్ సరిహద్దుల్లో సిద్ధంగా ఉంచారు. మనకంటే బలమైన.. ఎక్కువ యుద్ధ విమానాలున్న చైనా వాయుసేనకు ఈ రఫేల్స్ తో చెక్ చెప్పే సామర్థ్యం భారత్ కు ఉంది.

ఓ వైపు చైనా.. మరోవైపు పాకిస్తాన్ లతో వివాదాల నేపథ్యంలో మొదటి బ్యాచ్ రఫేల్ జెట్ల రాక భారత దేశ వాయుసేన శక్తిని అమాంతం పెంచేసింది. దీంతో యుద్ధానికి ముందే వీటి సన్నద్థతపై భారత్ హిమాలయ పర్వతాల్లోనే ప్రయోగాలు చేస్తుండడం విశేషం.

-నరేశ్

‘కరోనా’ను జయించిన వారికి దారుణంగా ఊడిపోతున్న జుట్టు.. ప్రతి నలుగురిలో ఒకరికి?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా చాలామంది ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్న తరువాత రుచి, వాసనను పసిగట్టలేక పోతుంటే మరికొందరు జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తాజాగా ఒక సర్వేలో కరోనా సోకిన వాళ్ల జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్నట్టు తేలింది. మార్చిలో ఒక మహిళ కరోనా బారిన పడగా వైరస్ నుంచి కోలుకున్న తరువాత తలపై ఉన్న జుట్టు చాలావరకు ఊడిపోయింది.

సదరు మహిళకు ఇప్పటికే సగం కంటే ఎక్కువ జుట్టు ఊడిపోవడంతో తీవ్ర భయాందోళనకు లోనవుతోంది. ఎసెక్స్కు ప్రాంతానికి చెందిన గ్రూడ్ డుస్కే అనే మహిళ దిండుపై కుచ్చులు కుచ్చులుగా పడిపోయిన జుట్టును చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. కరోనా సోకిన ఇతర బాధితులు కూడా జుట్టు రాలిపోతుందని ఆరోపణలు వ్యక్తం చేయడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లపై 1500 మందిపై సర్వే చేసి పరిశోధకులు ఫలితాలను వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో నెత్తి మీద లేదా కనుబొమ్మల మధ్య జుట్టు రాలుతున్నట్టు తాము గుర్తించామని… ఫేస్ బుక్ ద్వారా చేసిన సర్వేలో 27 శాతం మందిలో ఈ సమస్యను గుర్తించామని తెలిపారు. తాత్కాలిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. ఈ సమస్యను telogen effluvium అంటారని… కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరిలో ఈ సమస్యను గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మళ్ళీ తెర పైకి ‘రామాయణం’.. కీలక పాత్రలో ఎన్టీఆర్ ?


అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణం’ అనే సినిమా రాబోతోందనే వార్త గత ఏడాది విపరీతంగా వైరల్ అయింది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో కలిసి బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు ఈ ‘రామాయణం’ను భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నారని ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా గురించి మళ్ళీ అప్ డేట్ లేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, కాకపోతే సౌత్ వరకూ ఇక్కడి హీరోలను, బాలీవుడ్ వరకూ అక్కడి హీరోలను తీసుకోవాలనేది మేకర్స్ ప్లాన్ అని తెలుస్తోంది.

Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

ఎలాగూ రామాయణం అనగానే బోలెడన్ని పాత్రలుంటాయి కాబట్టి.. అందరి స్టార్ హీరోలకు ఈ సినిమాలో కీలకమైన పాత్రలు ఉంటాయి. అయితే ఈ రామాయణంలో ఎంతో కీలకమైన పాత్ర రావణుడుది. ఈ పాత్రను చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు, అందుకే ఈ పాత్ర విషయంలోనే బాలీవుడ్ లో ఏ స్టార్ ను తీసుకోవాలో మేకర్స్ కు ఇంకా క్లారిటీ లేదట. కానీ సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందనేది ఒక ఆలోచన. మరి సౌత్ లో ఆ పాత్రను ఎవరు పోషించగలరో అని మేకర్స్ ఆసక్తిగా వెతుకుతున్నారు.

Also Read: చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…

కాగా రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ చేత ఆ పాత్ర చేయించాలని మేకర్స్ ను కోరుతున్నారాట ఇక్కడి వారి సినీ సన్నిహితులు. ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే అనేది ఇప్పటికే రుజువు అయింది. దీనికి తోడు పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు కూడా మన సౌత్ లో పెద్దగా లేరు. అందుకే అందరి చూపులు ఇప్పుడు ఎన్టీఆర్ పైకే వెళ్తున్నాయి. నిజంగా ఈ జనరేషన్ లో ఇలాంటి హిస్టారికల్ పాత్రలు చెయ్యగల సామర్ధ్యం ఒక్క ఎన్టీఆర్ కే ఉంది. మరి ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తాడా !

నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !


సాయి పల్లవి మొదటి నుండి ట్రెడిషినల్ అండ్ హోమ్లీ హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి డీ అనే ప్రోగ్రామ్ తోనే సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి డాన్సర్ గా గుర్తింపు ఉంది. అయితే ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మా టీవీ కోసం డీ లాంటి షో ఒకటి ప్లాన్ చేస్తోంది. ఈ షోకి అనుసంధాన కర్తగా అలాగే నిర్మాతగా కూడా సాయి పల్లవి ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఈ షో సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే సాయి పల్లవి కెరీర్ మీదే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎంత గొప్ప నటి అయినా మనోళ్ళకు నచ్చకపోతే పక్కన పెట్టేయడం తెలుగు సినిమాకి ఆనవాయితీగా వస్తోన్న ఆచారం అయ్యే. ప్రస్తుతం సాయి పల్లవి చైతు లవ్ స్టోరీ మూవీలో మెయిన్ పాత్ర చేస్తోంది.

Also Read: చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…

అలాగే మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆయితే ఓ మలయాళ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తోందట.. తనలోని నాజుకి తనాన్ని మార్చుకుని కాస్త బొద్దు తనానికి మారడానికి తగిన డైట్ ఫాలో అవుతుంది ఈ బ్యూటీ. అన్నట్టు ఈ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ లో నటించబోతుంది. స్వతహాగా మంచి నటి కావడం, పైగా అలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవ్వడంతో సాయి పల్లవి ఈ బ్లైండ్ క్యారెక్టర్ చేయాలని బాగా తాపత్రయ పడుతుందట. ఇక హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్ కాబోతున్న బాలీవుడ్ సూపర్ హట్ మూవీ ‘అంధాదూన్’లో ఓ గెస్ట్ రోల్ ఉందని.. పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న ఆ రోల్ చాలా కీలకమైనది కావడంతో ఆ రోల్ లో కూడా సాయి పల్లవి నటించనుంది.

Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయడానికి కారణం మాత్రం హీరో నాని అట. ఆ పాత్ర నువ్వు మాత్రమే చేయగలవు అని మొత్తానికి ఈ టాలెంటెడ్ బ్యూటీని కన్వీన్స్ చేసాడు. అందుకే మెయిన్ హీరోయిన్ గా మంచి సినిమాలు చేతిలో ఉన్నా.. గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకుంది. కానీ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించడానికి కూడా ఆమె పెద్ద మొత్తంలోనే డబ్బును డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. గెస్ట్ రోల్ అయినా, ప్రధాన పాత్ర కావడంతో.. పైగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుండటంతో అన్నిటికి మించి ఫామ్ లో ఉండటంతో ఆమె అడిగిన భారీ రెమ్యునిరేషన్ ను ఇచ్చేందుకు మేకర్స్ కూడా ఇంట్రస్ట్ గానే ఉన్నారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం రిపోర్టు వచ్చింది…! అంతే…. యాజమాని పరార్!

నిన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విజయవాడలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ ద్వారా సంభవించింది అని భావిస్తున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ. 50 లక్షల ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే బాధితుల కుటుంబాలకు ఇందుకు కారకులైన నిందితులకు శిక్ష పడితే తప్పించి ఈ పరిహారాలు వల్ల పెద్దగా మనశ్శాంతి ఉండదు. అలాంటిది ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన రమేష్ ఆసుపత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

 

మరోవైపు స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య, భద్రతా సిబ్బంది నివేదికలను కమిటీల సభ్యులు సిద్ధం చేశారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్ వద్దకు ఇవన్నీ వెళ్లనున్నాయి. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించినట్లు కమిటీల విచారణలో తేలినట్లు సమాచారం. స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని… కమిటీ ఎంతో సంచలనాత్మకంగా రిపోర్టులో కలప, ఫైబర్ తో తయారుచేసిన ఇంటీరియర్ డెకరేషన్ కు శానిటేషన్ ఎక్కువ కావడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని… విద్యుత్ శాఖ తేల్చింది.

ప్రమాదం జరిగిన వెంటనే దానిని గుర్తించే పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే ప్రాణ నష్టం జరిగినట్టు కమిటీ సభ్యులు గుర్తించినట్లు తెలిసింది. ఇక అతనిపై కేసు నమోదు చేశారు అని తెలిసిన వెంటనే రమేష్ బాబు ఇలా తప్పించుకోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. రిస్క్ అని తెలిసినా కూడా అక్కడ కరోనా పేషెంట్లు ని ఉంచడం ఏమిటని కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు వారికి ఎవరిచ్చారని అందరూ ఆగ్రహజ్వాల తో ఊగిపోతున్నారు. పోలీసులు ప్రస్తుతానికైతే అనేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

చిరుతో చరణ్‌ ఫైటింగ్‌…


ఖైదీ నెం 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర పోషించి తన కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాలతో చిరు చేయి కలపగానే ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగా అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఈ మూవీపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తొలుత సూపర్ స్టార్ మహేశ్‌ బాబు గెస్ట్ రోల్‌ చేస్తాడన్న పుకార్లు వచ్చాయి. కానీ, తన తనయుడు, నిర్మాత రామ్‌ చరణ్‌ ఆ పాత్ర చేస్తున్నాడని స్వయంగా చిరంజీవే ప్రకటించాడు. ఆచార్యలో చెర్రీ పాత్ర గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలిశాయి. అతనిది అతిథి పాత్ర మాత్రమే కాదు.. దాదాపు 30 నిమిషాల నిడివితో కూడిన బలమైన పాత్ర అని తెలిసింది. అంతేకాదు అతను మాజీ నక్సలైట్‌గా కనిపిస్తాడని, ఓ మిషన్‌లో పని చేస్తుండగా ప్రాణాలు కోల్పోతాడట.

Also Read: సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు రామ్‌ చరణ్‌ పాత్ర వస్తుందని సమాచారం. దాంతో మూవీ అనూహ్య మలుపు తీసుకోవడంతో పాటు ద్వితీయార్థంపై మరింత ఆసక్తి పెంచుతుందట. ఇంటర్వెల్‌కు ముందు మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుందని, దాంతో పాటు రోమాంచిత అనుభవం ఇచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కోసం ఓ పాట, చిరంజీవితో ఓ ఫైట్‌ కూడా ఉంటుందని సమాచారం. సినిమాలో అదే అతిపెద్ద సర్ప్రైజ్‌ కానుంది.

Also Read: టబును ఘాడంగా ప్రేమిస్తున్నాడట !

చిరుతో చెర్రీ సన్నివేశాలను కొరటాల ఎప్పుడూ చూడని విధంగా తెరకెక్కించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడని విశ్వసనీయ వర్గాల చెబుతున్నాయి. మొత్తంగా ఆచార్యలో చరణ్‌ పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుందనేది మాత్రం స్పష్టమవుతోంది. మగధీర, బ్రూస్‌లీలో చిరు.. ఖైదీ నెం.150లో చెర్రీ అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి అరగంట పాటు తెరపై కనిపించడం మెగా ఫ్యాన్స్‌కు పండగే. ఈ మూవీలో చిరు నక్సలైట్‌ పాత్ర పోషిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

బిజెపిని రాజకీయ కరోనా గా వైసీపీ మంత్రి కొడాలి నాని అభివర్ణించిన తీరు ఇప్పుడు చాలా వివాదాస్పదం అయింది. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఈ రేంజ్ లో బిజెపి ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అయితే తన దుందుడుకు స్వభావానికి బాగా ఫేమస్ అయిన కొడాలి నాని మాత్రం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా బిజెపి కరోనా లాగా ప్రమాదకర పార్టీ అని అంటున్నాడు. ఇండియా లో పుట్టిన బిజెపి కరోనా…. పశ్చిమబెంగాల్ లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ని కలిపి తినేస్తోందని…. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని, మరికొన్ని పార్టీలను ఫలహారం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం టిడిపి కూడా ఈ కరోనా బారిన పడింది అని చెప్పుకొచ్చారు.

 

మరి నాని అన్న మాటలకి ఇప్పుడు బీజేపీ నేతలు, సపోర్టర్లు తీవ్రమైన కౌంటర్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నాని అసలు ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైసిపి కన్నా రాష్ట్రాలను తినేసే రాజకీయ పార్టీ దేశంలోనే లేదని…. అమరావతి రైతుల భూములను నాశనం చేసిన ప్రమాదకర పార్టీ అని ఈ వైసీపీ నాయకుడి పైన భయంకరమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జనసేన పార్టీకి ఉన్న ఒక్క సీటుకి కూడా ఎంతో నిస్సిగ్గుగా రాపాక ని తమ ఉచ్చులో బిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.

ఇకపోతే మొదటి నుండి జనసేన-టిడిపికి కలిసి ఉంటున్నాయని తప్పుడు, ఆధారాలు లేని ప్రచారలతో ఎవరికీ ఓట్లు రానీయకుండా ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకున్న వైసిపికి ఇప్పుడు పార్టీల నాశనం గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుండి వచ్చింది అది వారి వాదన. అంతేకాకుండా స్థానికల ఎన్నికల్లో నామినేషన్ సమయంలో వారు సృష్టించిన హింస, నేతలపై అక్రమ కేసులు పెడుతూ…. ప్రజలను పట్టించుకోకుండా తమ సొంత నిర్ణయాలతో అనైతికంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఉండడం…. ఒక ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టులు చుట్టూ తిరిగి చివరికి అవమానం పాలై ఇప్పటికీ కక్షసాధింపు చర్యలను చేపడుతున్న వైసిపి పార్టీని కరోనా వ్యాధి కన్నా ఘోరంగా ఉండే ఏదైనా వ్యాధితో పోల్చాలి అని దుమ్మెత్తిపోస్తున్నారు. “మరి వీటన్నింటికీ కొడాలి నాని వద్ద సమాధానం ఉందా…?” అని కూడా అడుగుతున్నారు జనాలు.

కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎత్తిత్తే ముందుగా వినపడేది రేవంత్ రెడ్డిదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటం లో ఆయన శైలి చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరైన జగ్గారెడ్డి మాత్రం కెసిఆర్ విషయంపై కొద్దిగా సంశస్తున్నట్లు కనిపిస్తాడు. సీఎం పై ఎప్పుడు విరుచుకు పడతాడో ఎప్పుడు విమర్శలు పక్కనపెట్టి ప్రశంసలు అందుకుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి.

 

ఈ సమయంలో రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ఎంతగా కుదిరితే అంత ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తుంటే…. జగ్గారెడ్డి వంటి నేతల సహాయం కరువు అవడమే కాకుండా అప్పుడప్పుడు అతనికి అడ్డుపడుతున్నాయి కూడా. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై రైతు బంధు పథకం వర్తింపు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా పిసిసి పోస్ట్ కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు షాకిచ్చే కామెంట్లు చేస్తున్నారు.

పీసీసీ చీఫ్ పదవి కోసం పెద్ద ఎత్తున సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. టీపిసిసి అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియ్తమిస్తే తాను కూడా రేసులో ఉన్నట్టు బహిరంగంగానే చెబుతున్నాడు జగ్గా. తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ ప్రముఖులైన సోనియా, రాహుల్ గాంధీలని కోరుతూనే ఉన్నట్లు జగ్గారెడ్డి సెలవిచ్చారు. అయితే ఈ పోస్ట్ విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి రేవంత్ ను సహజంగానే టార్గెట్ చేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని రాజకీయం నడిపే విధంగా జగ్గారెడ్డి టార్గెట్ చేస్తున్నాడు అని కొందరు ఆరోపిస్తున్నారు. మరి వారి వాదనలకు బలం చేకూర్చేలా జగ్గారెడ్డి చర్యలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాలి.

సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!


బాహుబలి తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ లైఫ్ మారిపోయింది. ఇప్పుడతను ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అగ్ర నటుల్లో ఒకడు. స్టార్డమ్‌లో అతను పాన్‌ ఇండియా హీరోగా మారాడు. పారితోషికం విషయంలోనూ ప్రభాస్‌ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఇండియాలో వంద కోట్ల రూపాయలు తీసుకున్న తొలి హీరో ప్రభాసే అని తెలుస్తోంది. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం.. ఈ మధ్య హిందీ చిత్ర సీమను ఏలుతున్న అక్షయ్‌ కుమార్ ను మన డార్లింగ్‌ మించిపోయాడు. నాగ్‌ అశ్విన్‌ సినిమా కోసం అతను వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. వైజయంతి మూవీస్‌ బ్యానర్పై అశ్వినీ దత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘రాధేశ్యామ్‌’ అనంతరం ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Also Read: Buzz: Is Nayantara offered to play villain?

‘మహానటి’తో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే పూర్తి స్క్రిప్టు తయారు చేశాడు. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ నటించనుంది. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ కోసం ప్రభావం రూ. వంద కోట్లు తీసుకుంటున్నాడట. ఇందులో 70 కోట్లు రెమ్యునరేషన్‌ కాగా… 30 కోట్లు డబ్బింగ్‌ రైట్స్‌ కింద రెబల్‌ స్టార్ ఖాతాలో చేరనున్నాయి. ఈ విషయంలో సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ను ప్రభాస్‌ అధిగమించాడు. దర్బార్ సినిమా కోసం రజినీ అత్యధికంగా రూ. 70 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లో చేరనున్న ప్రభాస్‌ దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలవనున్నాడు.

Also Read: Is Suriya ready to release his next on OTT?

ప్రభాస్‌ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్‌’పై దృష్టి పెట్టాడు. లాక్‌డౌన్‌ ముందు వరకు జార్జియాలో చిత్రీకరణలో పాల్గొన్నాడు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. ఇప్పుడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక సెట్‌ వేసి షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌.

ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్న విద్యాశాఖ మంత్రి.. ఎవరంటే?

మనలో చాలామంది బాల్యంలోనే ఉన్నత చదువులు చదవాలని కలలు కంటారు. కొందరు ఆ కలలను నిజం చేసుకుంటే మరికొందరు వివిధ కారణాల వల్ల మధ్యలోనే చదువును ఆపివేస్తారు. కానీ ఆ చదువుపై ఉండే ఆసక్తి వల్ల, వివిధ కారణాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత చదువుకోవాలని ఆశతో పరీక్షలు రాసే వాళ్లు ఎంతోమంది ఉంటారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మంత్రి కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. అడ్మిషన్ తీసుకున్న మంత్రి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావడం గమనార్హం.

విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహ కేవలం పదో తరగతి వరకే చదివారు. కేబినెట్ విస్తరణలో ఆయనను మంత్రి పదవి వరించింది. ఆయనకు విద్యాశాఖ మంత్రిగా పదవి దక్కింది. అయితే ఆయన పదవి చేపట్టిన రోజు నుంచి ప్రతిపక్షాలు పదో తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి విధులు ఎలా నిర్వహిస్తాడని ప్రశ్నించాయి. ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్న విమర్శలు జగర్ నాథ్ మహను ఎంతో బాధించాయి.

అయితే ఉన్నత చదువులు చదవలేదనే కారణం వల్లే తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని… ఆయన ఉన్నత చదువులు చదివి విమర్శించిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని భావించి అనుకున్నడే తడవుగా బోకారో జిల్లాలోని దేవి మహోతో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. మంత్రి చదువుకు వయస్సుతో సంబంధం లేదని చదువును పూర్తి చేస్తానని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో పదో తరగతి చదివిన మంత్రి ఏం చేస్తాడని తనపై కొందరు విమర్శలు చేశారని అందువల్లే ఉన్నత చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

https://twitter.com/Jagarnathji_mla/status/1292803271644467200

వైసీపీ కి షాక్..? రాజధాని విషయంలో చివరికి వెనక్కి తగ్గిన జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా ఉంచేలా తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు లో విశాఖ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. అందుకు గవర్నర్ ఆహీస్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖ కు తరలించేందుకు ఈనెల 16ని సరైన తేదీగా ఖరారు చేసుకున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. నిజానికి ఆగస్టు 16న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి శంకుస్థాపన చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత భావించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించేలా కూడా జగన్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి పలు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తుండటంతో దాని నుండి విముక్తి పొందిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి శంకుస్థాపన చేపట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముందు ప్రత్యక్షం గానో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జగన్ ప్రభుత్వం భావించింది. అయితే ఈ నేపథ్యంలో కొత్త ముహూర్తంగా విజయదశమి నాడు ప్రధానిని విశాఖకు ఆహ్వానించే ప్రక్రియ మొదలైపోయినట్లు సమాచారం.విశాఖ శంకుస్థాపనకు ప్రధానిని స్వయంగా జగన్ ఢిల్లీ వెళ్లి ఆహ్వానించవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే అప్పటికైనా పరిస్థితి సద్దుమణుగుతుందా అన్న విషయం పై ఇంకా క్లారిటీ లేదు. ఇక మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రాష్ట్రం అంతటా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో జగన్ విశాఖ లో రాజధాని శంకుస్థాపన విషయంలో వెనక్కి తగ్గడం చిన్న విషయం కాదు. జగన్ అనుకుంటే శంకుస్థాపన అనుకున్న సమయానికి పూర్తి చేసేసేవాడు కానీ అతను వెనక్కి తగ్గాడు అంటే ఏదో బలమైన కారణం పైనే కేసులు నమోదయ్యాయని మళ్ళీ ఆ విషయంలో తొందరపడి పడడం ఇష్టంలేక జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న చర్చ జరుగుతోంది.

ఇక శంకుస్థాపన వాయిదా పడడం…. ఇలా ఎన్నో కొత్త అనుమానులు రావడం వైసీపీ అభిమానులకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. ఇక చివరికి ఏమవుతుందో చూడాలి.

రేపు విడుదల కానున్న రష్యా వ్యాక్సిన్.. ‘కరోనా’కు చెక్!

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు కరోనా తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంది. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన దేశంగా అరుదైన ఘనతను అందుకోనుంది. రేపు కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రష్యా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ను అందిస్తామని ఆ దేశం చెబుతోంది.

ఈ వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న మూడు వారాల తరువాత రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని…. మరో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం రెట్టింపవుతుందని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందించాయి. అడినో వైరస్ భాగాలతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను జూన్ నెలలో 76 మందిపై ప్రయోగించారు.

వ్యాక్సిన్ ను సగం మందికి ఇంజక్షన్ రూపంలో సగం మందికి పౌడర్ రూపంలో ఇచ్చామని… రెండు రకాల వేర్వేరు పరీక్షల్లో వ్యాక్సిన్ సానుకూల ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని వెల్లడిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాలని రష్యాకు సూచించింది. అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాక్సిన్ ను ప్రజలకు పంపిణీ చేసే ముందు సమస్యలు తలెత్తుతాయో లేదో పరిశీలించుకోవాలని రష్యాకు సూచించారు.

కోతికి గిఫ్ట్ ఇస్తే.. ఏం చేసిందో మీరే చూడండి !


కోతి పేరు చెబితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అలాగే కొన్నిసార్లు అచ్ఛం మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఎంతో ఆకట్టుకుంటాయి. మనకు ఏదైనా గిఫ్ట్ రాగానే… దాన్ని పద్ధతిగా ఓపెన్ చేస్తాం. మనలాగే ఓ కోతి కూడా… తనకు ఇచ్చిన గిఫ్టును చక్కగా ఓపెన్ చేసింది. మొదట మ్యానువల్‌ తీసి, చదివింది. అనంతరం థర్మాస్‌ ఓపెన్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

https://twitter.com/RexChapman/status/1291514990130876418?ref_src=twsrc%5Etfw

 

సోము వీర్రాజు రాజకీయ ప్రస్థానం


సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ వరకు 40 ఏళ్లుగా బీజేపీనే నమ్ముకున్న ఆయనకు అధిష్టానం అందలం ఎక్కించింది.అక్కున చేర్చుకొని న్యాయం చేసింది. బీజేపీలో సమర్థులకు అందలం దక్కుతుందని నిరూపించింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే.. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసిన అడిగిన మనిషి. అందుకే సోమును అధ్యక్షుడిగా ప్రకటించగానే పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. నిజమైన కార్యకర్తకు గౌరవంగా.. గుర్తింపుగా దీన్ని అభివర్ణించారు.

Also Read: టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?

*సోము వీర్రాజు ప్రస్థానం..

సోము వీర్రాజు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో 1957లో సోము జన్మించారు. రాజమండ్రిలోని దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ లో, వీటీ కాలేజీ, బీమవరం డీఎన్ఆర్ కాలేజీలో చదివారు. బాల్యంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో సాన్నిహిత్యంతో బీజేపీ వైపు అడుగులు వేశారు. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 23ఏళ్ల వయసులోనే బీజేపీలోకి ప్రవేశించాడు. స్వతహాగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. 1980లో రాజమండ్రి బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు.

*1987-90 వరకు యువమోర్చా కార్యదర్శిగా ఉన్నారు. 1991-94 బీజేపీ రాష్ట్రకార్యదర్శిగా చేశారు. 1996-2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2003లో రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యాడు. మళ్లీ 2006-2010 వరకు తిరిగి 2010-2013 వరకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2013 తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు.

* గత చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అసెంబ్లీలో తమ వాణి గట్టిగా వినిపించడంలో సిద్ధహస్తలు. అనంతరం తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు ఆర్ఎస్ఎస్ వల్లే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని అంటారు.

*నిజానికి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా చేసేటప్పుడు క్యాడర్ సోము వీర్రాజునే చేయాలని కోరుకుంది. కానీ కొన్ని సమీకరణాల వల్ల అప్పుడు పార్టీ కన్నాకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సోము వీర్రాజును రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా చేసింది.

Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు 2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేశారు..

పార్టీ ప్రకటించిన ఏ కార్యక్రమమైనా సరే తిరుగులేని నిబద్ధతతో అకుంఠిత దీక్షతో చేయడం.. కార్యకర్తలను నాయకులను తన మాట జవదాటకుండా నడిచేలా చూసుకోవడం వీర్రాజు సమర్థతకు నిదర్శనం.

గోదావరి జిల్లాల్లో అప్పట్లో బీజేపీ విజయభేరి వెనుక సోమువీర్రాజు వ్యూహాలు పనిచేశాయి. ఆయన గోదావరి జిల్లాల జోనల్ ఇన్ చార్జిగా ఉన్నప్పుడే కృష్ణం రాజు, ముద్రగ, వెంకటస్వామి నాయుడు, అయ్యాజీ వేమ, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణలను పోటీచేయించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. వీర్రాజు ప్రజానాడిని అంచనావేయడంలో మెరుగ్గా ఉంటారని పేరుంది. అందుకే ఈ కీలక సమయంలో వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర సారథ్యం చేపట్టడం సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.