Homeఆంధ్రప్రదేశ్‌సోము వీర్రాజు రాజకీయ ప్రస్థానం

సోము వీర్రాజు రాజకీయ ప్రస్థానం


సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ వరకు 40 ఏళ్లుగా బీజేపీనే నమ్ముకున్న ఆయనకు అధిష్టానం అందలం ఎక్కించింది.అక్కున చేర్చుకొని న్యాయం చేసింది. బీజేపీలో సమర్థులకు అందలం దక్కుతుందని నిరూపించింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే.. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసిన అడిగిన మనిషి. అందుకే సోమును అధ్యక్షుడిగా ప్రకటించగానే పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. నిజమైన కార్యకర్తకు గౌరవంగా.. గుర్తింపుగా దీన్ని అభివర్ణించారు.

Also Read: టిడిపిలో ఆ మాజీ మంత్రి మిస్సింగ్..! దొరికితే కటకటాల వెనక్కే…?

*సోము వీర్రాజు ప్రస్థానం..

సోము వీర్రాజు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో 1957లో సోము జన్మించారు. రాజమండ్రిలోని దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ లో, వీటీ కాలేజీ, బీమవరం డీఎన్ఆర్ కాలేజీలో చదివారు. బాల్యంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో సాన్నిహిత్యంతో బీజేపీ వైపు అడుగులు వేశారు. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 23ఏళ్ల వయసులోనే బీజేపీలోకి ప్రవేశించాడు. స్వతహాగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. 1980లో రాజమండ్రి బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు.

*1987-90 వరకు యువమోర్చా కార్యదర్శిగా ఉన్నారు. 1991-94 బీజేపీ రాష్ట్రకార్యదర్శిగా చేశారు. 1996-2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2003లో రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యాడు. మళ్లీ 2006-2010 వరకు తిరిగి 2010-2013 వరకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2013 తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు.

* గత చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అసెంబ్లీలో తమ వాణి గట్టిగా వినిపించడంలో సిద్ధహస్తలు. అనంతరం తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు ఆర్ఎస్ఎస్ వల్లే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని అంటారు.

*నిజానికి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా చేసేటప్పుడు క్యాడర్ సోము వీర్రాజునే చేయాలని కోరుకుంది. కానీ కొన్ని సమీకరణాల వల్ల అప్పుడు పార్టీ కన్నాకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సోము వీర్రాజును రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా చేసింది.

Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!

రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు 2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేశారు..

పార్టీ ప్రకటించిన ఏ కార్యక్రమమైనా సరే తిరుగులేని నిబద్ధతతో అకుంఠిత దీక్షతో చేయడం.. కార్యకర్తలను నాయకులను తన మాట జవదాటకుండా నడిచేలా చూసుకోవడం వీర్రాజు సమర్థతకు నిదర్శనం.

గోదావరి జిల్లాల్లో అప్పట్లో బీజేపీ విజయభేరి వెనుక సోమువీర్రాజు వ్యూహాలు పనిచేశాయి. ఆయన గోదావరి జిల్లాల జోనల్ ఇన్ చార్జిగా ఉన్నప్పుడే కృష్ణం రాజు, ముద్రగ, వెంకటస్వామి నాయుడు, అయ్యాజీ వేమ, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణలను పోటీచేయించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. వీర్రాజు ప్రజానాడిని అంచనావేయడంలో మెరుగ్గా ఉంటారని పేరుంది. అందుకే ఈ కీలక సమయంలో వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర సారథ్యం చేపట్టడం సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular