Home Blog Page 8374

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ


భారత సంతతి మహిళ కమలా హ్యారీస్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన తొలి భారత సంతతి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా కమలా హ్యారీస్ నిలిచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయులు, భారత సంతతి ఓట్లు కీలకంగా మారాయి. దీంతో కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ను డెమొక్రాట్ల వైస్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ మంగళవారం ప్రకటించి అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చింది.

Also Read: రేపు విడుదల కానున్న రష్యా వ్యాక్సిన్.. ‘కరోనా’కు చెక్!

అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లిక్ పార్టీ తరుఫున డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థిగా జో బిడెన్ పోటీ పడుతున్న సంగతి తెల్సిందే. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నిక కోసం ఇరుపార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా డెమొక్రాట్ పార్టీ తమ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ, నల్లజాతీయురాలైన కాలిపోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది.

భారత సంతతి అయిన కమలా హ్యారిస్ కు తమిళ మూలలున్నాయి. హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో జన్మించారు. వృత్తిపరంగా వైద్యురాలైన శ్యామలా కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత జమైకాకు చెందిన హ్యారిస్ ను పెళ్లి చేసుకున్నారు. శ్యామలా-హరీష్ దంపతులకు 1964 అక్టోబర్ 20న కమలా హ్యారీస్ జన్మించారు. కమలా హ్యారిస్ విద్యాభ్యాసం తర్వాత న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు.

Also Read: కరోనాను ఆ దేశం తరిమికొట్టిందా?

ఓవైపు న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా కమలా హ్యారీస్ విజయం సాధించారు. ఇటీవల కార్నిఫోర్నియా నుంచి బరిలో దిగి గెలుపొందారు. ఇక తొలి ప్రయత్నంలోనే కమలా హ్యారీస్ యూఎస్ సెనెట్‌ గా ఎంపికైంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలువడం గమనార్హం. ఓ పెద్ద పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న నాలుగో మహిళగా కమలా హ్యారిస్ రికార్డు సృష్టించింది.

డెమొక్రాట్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష బరిలో కమల హ్యారీస్ పేరు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈమేరకు డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. జో బిడెన్ అమెరికన్ ప్రజల కోసమే తన జీవితాంతం పోరాడుతున్నారని.. ఆయన ఆదర్శమైన అమెరికాను నిర్మిస్తారనే ఆశాభావాన్ని కమలా హ్యారీస్ తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు.

కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా


కరోనా పేరు చెబితేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఈ భయాన్నే కొందరు వైద్యులు, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. కాసుల కక్కుర్తితో మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వేస్తున్న బిల్లులు చూస్తుంటే అవాక్కవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ కరోనా రోగుల నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తుండటం మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వ పెద్దల అండతోనే పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల ఒకట్రెండు ఆస్పత్రులపై కోరఢా ఝళిపించింది. అయినప్పటి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాల వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

కరోనా రోగి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే బ్రతుకుతాడో.. లేదో తెలియదుగానీ బిల్లు చూస్తే మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చిపోవడం ఖాయమనే సైటర్లు విన్పిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు అద్దంపడుతున్నాయి. లక్షల్లో బిల్లులు చూస్తుంటే కరోనా భయాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రాణభయంతో పలువురు కరోనా రోగులు ఆస్తులు తాకట్టు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో కొందరు డబ్బులు పోగుట్టుకున్నప్పటికీ ప్రాణాలు దక్కుంచుకున్నారు. మరికొందరేమో డబ్బులతోపాటు ప్రాణాలను పొగొట్టుకొని వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

ప్రైవేట్ అంబులెన్సుల దోపిడీని కట్టడి చేసేవారేరీ..
కార్పొరేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తి బాటలోనే ప్రైవేట్ అంబులెన్సులు కూాడా నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా పేషంట్లను బ్రతికుండగానే పీల్చిపిప్పి చేస్తుండగా.. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు కరోనా శవాలపై కాసులదందాకు పాల్పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దందా మితిమీరిపోయిందనే ప్రచారం జరుగుతోంది. గాంధీ, నిమ్స్ , కింగ్ కోఠి, ఉస్మానియాతోపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం కోవిడ్ చికిత్సలకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాంతాల్లోనే ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు అత్యధికంగా తిష్ట వేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 550పైగా ప్రైవేట్ అంబులెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా రోగి పరిస్థితి విషమించగానే ఈ సమాచారం అంబులెన్స్ నిర్వహాకులు వెళుతుంది. ప్రైవేట్ అంబులెన్సులు ఈ ప్రాంతాలకు చేరుకొని బేరసారాలు సాగిస్తాయి.

కరోనా శవాలపై ఏమాత్రం కనికరం లేకుండా నిర్వహాకులంతా ఒకే మాటపై ఉంటారని తెలుస్తుంది. హైదరాబాదులో కరోనాతో రోగి చనిపోతే 10 కిలోమీటర్ల దూరానికైతే రూ10వేలు, 20కిలోమీటర్ల దూరానికి రూ.20వేలు, శివారు ప్రాంతాలకు 50కిలోమీటర్ల లోపు దూరమైతే రూ.25నుంచి రూ.30వేలు, వంద కిలోమీటర్లు, ఆపై దూరానికి రూ.40నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల గాంధీ నుంచి కరోనా శవాన్ని మెదక్ తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహాకులు 40వేలు డిమాండ్ చేయగా చివరకు రూ.35వేలకు ఒప్పుకున్నారట. అదేవిధంగా గాంధీకి 8కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగండికి ఓ శవాన్ని తరలించేందుకు రూ.15వేలు ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహాకులు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు.

Also Read: రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మెట్రో అక్కడే!

కార్పొరేట్ ఆస్పతుల్లో లక్షల్లో బిల్లు చెల్లించి ప్రాణం దక్కించుకోలేక దీనస్థితిలో ఉన్నవారి నుంచి శవాలను కొద్దిపాటి దూరం తరిలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు వేలల్లో ఛార్జి చేస్తుండటంపై అమానుషంగా మారింది. ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలు వెళ్లినా పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థిత్లుల్లో ప్రజలంతా ఆర్థికంగా చితికిపోతున్నవేళ కొందరు శవాలపై కాసుల కక్కుర్తికి పాల్పడుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కరోనా రోగులు, శవాలపై జరుగుతున్న దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

“పోలవరం కూలిపోయిందా…?” ఎంత దురదృష్టకరం….మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి?

Polavaram Project

Polavaram Project

రాజకీయాల్లో ఆరోపణలు సహజం. పోలవరం ప్రాజెక్టును తెలుగు దేశం పార్టీ అధినేయ చంద్రబాబు, అతని కొడుకు నారా లోకేష్ ఏ రకంగా తమ ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆరోపించడం విశేషం. పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిధులు కూడా కేంద్రమే కేటాయిస్తుంది కానీ నిర్మాణాలు మాత్రం రాష్ట్రం చేపడుతుంది. కానీ అంతా కేంద్రం అజమాయిషీలో ఉంటుంది. ఇలాంటి గందరగోళం మధ్య పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.

 

ఇలాంటి సమయంలో… “సగం కొట్టుకుపోయిన కాఫర్‌ డ్యాం కట్టి పోలవరం పూర్తి చేసినట్లు బిల్డప్‌ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్ళ పాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యాం పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్‌ వేపై ర్యాంప్‌ వాక్‌ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్‌..,” ఇదీ తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్న మాట.

ఇక విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం సగం కొట్టుకుపోయిన మాట వాస్తవమేనా? అసలు ఇలాంటి ఒక ఆరోపణ చేయడం ఆషామాషీ కాదు. ఇది చాలా సీరియస్ అంశం. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది కాఫర్ డ్యాం. అది కొట్టుకుపోయింది అంటే.. “ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎలా ఉంది? అసలు అది ఎప్పుడు కొట్టుకుపోయింది? దీనిని ఎవరు దాచి ఉంచారు?” అన్నది తేలాల్సి ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక అది తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయినా చంద్రబాబు మీద ఆరోపణలు చేసే క్రమంలో విజయసాయి రెడ్డి ఏకంగా కేంద్రాన్ని టచ్ చేసాడు.

పోలవరం చంద్రబాబుది కాదు, కేంద్రానిది కాదు, వైఎస్సార్ ది…. అతని కొడుకు జగన్ ది అసలే కాదు. అది ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నిర్మితమవుతున్న ప్రాజెక్టు. అసలు ఇంతటి గొప్ప ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో నిర్మితమయ్యే అవకాశమే లేదు. మరి అంత ప్రతిష్టాత్మకంగా భావించాల్సిన పోలవరం ప్రాజెక్టుని దురదృష్టవశాత్తు రాజకీయానికి వాడుకోవడం…. నిజంగా ఎవరు చేయకూడని పని.

అయితే పోలవరం ప్రాజెక్టు ను ఒక పొలిటికల్ అస్త్రంలో ఎప్పటి నుండో రాజకీయ పార్టీలు వాడేస్తూ ఆ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు సృష్టించాయి. మొదలుపెట్టిన దానిని తమ ప్రభుత్వం పూర్తి చేసి ఆ ఘనత సాధించే ఆలోచనలు మానేసి…. మీ పాలనలో కొట్టుకుపోయింది…. మీ పాలనలో నాశనమైపోయింది…. మీరు డబ్బులు తినేశారు అన్న మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఏదో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్లు ఈ అరుపులు దేనికి..? తిరిగి పూర్తే చేసి సత్తా చూపించడం మానేసి.. ఈ ఆరోపణలతో ఎవరైనా చేసేది ఏముంది?

ఎక్స్ క్లూజివ్: రాపాక విషయంలో పవన్ కి హెల్ప్ చేసిన జగన్..! ఏమన్నా రాజకీయమా….?

జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పుడు బాగా కోపం తెప్పిసున్నది ఏదైనా ఉంది అంటే…. రాపాక వరప్రసాద్ విషయంలో తమ పార్టీ నిర్లక్ష్యత, నిస్సహాయత. వారంతా రాపాకను తిట్టేందుకు తిట్లు సరిపోక, తిట్టలేక చివరికి తమ కోపాన్ని పవన్ కళ్యాణ్ పై వెళ్లగక్కుతున్నారు. అసలు ఇప్పటివరకు రాపాక వరప్రసాద్ ను పవన్ పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడం ఏమిటి? అతను ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఇంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అతని మాటలను భరించాల్సిన అవసరం ఏమిటి? నేరుగా కెమెరా ముందుకు వచ్చి “నేను వైసిపి నాయకుడిగా కొనసాగుతున్నానని… జనసేన గాలికి ఎగిరి పోయే పార్టీ…. దాని మీద నాకు నమ్మకం లేదు…”. అని అన్న తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏమిటి? అని అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి మనం రెస్పాన్స్ ఆశించడం కొంచెం కష్టతరమైన విషయం అయినా కూడా దీని వెనుక పవన్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన వర్గాల్లో మాట ఏమిటంటే…. ఎన్నిసార్లు సస్పెన్షన్ విషయం పార్టీ డిస్కషన్లో వచ్చినా కూడా పవన్ దానిని దాటవేస్తూ ఉన్నారట. ఎప్పటి నుండో రాపాక పై ఒక కన్నేసి ఉంచిన పవన్…. మూడు రాజధానుల విషయంలో అతను అసెంబ్లీలో వ్యతిరేకత చూపించకపోవడం పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని సరైన స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

మనం సరిగ్గా గమనించినట్లైతే నర్సాపురం రఘురామరాజు విషయంలో కూడా ముందు వైసీపీ నేతలు తెగ గగ్గోలు పెట్టారు. ఢిల్లీకి పరిగెత్తారు. శాస్వతంగా సస్పెన్షన్ వేద్దామని చూశారు. ఆ ప్రాసెస్ మొత్తం లో కూడా రఘురామ రాజు పైచేయి సాధించారు. ఎంతో పవర్ పెట్టుకున్న వారు ఒక లీడర్ పైన ఏ చర్యలు తీసుకున్నా కూడా మొత్తం ఫోకస్ అనేది అటువైపు కి షిఫ్ట్ అవుతుంది. ఒక్కసారిగా అతని రేంజ్ ను పెంచేసినట్లు ఉంటుంది. కొద్దికాలం గడిచిండి…. వైసీపీ వారికి తమ తప్పు తెలిసొచ్చింది. ఇప్పుడు ఎంపీ రాజు గారు రోజూఏదో ఒక విషయంలో జగన్ సర్కార్ ను తిడుతున్నా…. ఆరోపణలు చేస్తున్నా…. గొతు చించుకొని విరుచుకుపడుతున్నా…. పట్టించుకునే నాథుడే లేడు. ఎందుకంటే అతని మాటలకు ఇప్పుడు వైసీపీ నేతల్య్ రియాక్ట్ వాట్లేదు. జగన్ ఇదే విషయాన్ని గమనించాడు.. అలాంటి వారితో ఎలా నడుచుకోవాలో పవన్ కు నేర్పించాడు. అసలు ఇప్పుడైతే జనాలు ఎంపీ రాజుని పూచిక పుల్ల కన్నా ఘోరంగా తీసిపారేస్తుండడం గమనార్హం.

ఇప్పుడు పవన్ కూడా దాదాపు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు. కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు కూడా మొగ్గు చూప్పట్లేదు. ఇప్పటికీ అతను ‘వెన్నుపోటు’ దారుడు, నీచ రాజకీయాలు చేసేవాడు అని వైసిపి, టిడిపి సపోర్టర్లలో కూడా బలమైన ముద్ర పడిపోయింది .ఎట్టిపరిస్థితుల్లోనూ అటువంటి వ్యక్తిని జగన్ తన పార్టీ లోకి రానివ్వను అన్నది అందరి నమ్మకం. జనసేన కూడా తిరుగి అతనిని ఆదరించే అవకాశాలున్నాయి నూటికి నూరు శాతం లేవు. ఏ పార్టీ కి వెళ్తాడు …?ఎక్కడ తన బాధ చెప్పుకుంటాడు.

ఐదేళ్లు పదవిలో ఉన్నా కూడా రాపాక… ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ.. అందరి దగ్గర వెన్నుపోటు దారుడు అనే ముద్రతో బ్రతుకుతూ ఉండాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరి వాళ్ళు చేసే తీవ్ర విమర్శలకు కోపం వచ్చి అతని ఏమైనా చేయాల్సిందే కానీ పవన్ మాత్రం పక్కా ప్లాన్ తో అతనిని పట్టించుకోకపోవడమే…. అతనిని శిక్షించడం అని ఫిక్స్ అయిపోయాడు.

కాపు ఉద్యమ పగ్గాలు చేపట్టిన చేగొండి..!


రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాపు ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేగొండి హరిరామజోగయ్య ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం ఇటీవల ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొందరు తనపై చేస్తున్న ఆరోపణకు మనస్తాపం చెందడంతో ఉద్యమం నుంచి దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సీనియర్ రాజకీయ నాయకులైన చేగొండి హరిరామ జోగయ్య రంగంలోకి దిగారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంస్థను స్ధాపించడం పూర్తి చేశారు.

Also Read: రాపాక మనసులో మాట ఇదే..!

కాపు సంక్షేమ సేనలో అన్నిపార్టీలు, వివిధ వృత్తులకు చెందిన ప్రముఖులకు అవకాశం కల్పించారు. ప్రధానంగా కాపు రిజర్వేషన్ ల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధం అవతున్నారు. సిఎం జగన్ కాపు రిజర్వేషన్ ల అంశం కేంద్రం పరిధిలోనే ఉందని పక్కన పెట్టేశారు. గత టిడిపి ప్రభుత్వం ఈబీసీ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించినా అమలు జరగడం లేదు. కాపులకు రిజర్వేషన్ లకు సంబందించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింనా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో హరి రామ జోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ఈ వ్యవహారంపై పోరాటం చేపట్టనుంది.

Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

గతంలో కాపు ఉద్యమానికి రాజకీయ ముద్ర పడింది. ముద్రగడ పద్మనాభం అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ పోద్భలంతోనే కాపు ఉద్యమాన్ని పున: ప్రారంభించారని టిడిపి ప్రభుత్వం విమర్శలు చేసింది. తుని రైలు దహనం ఘటనలో వైసీపీ గుండాలు ఉన్నట్లు ఆరోపించింది. పలు జిల్లాల్లోని కాపునేతలపై కేసులు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఆ కేసులను కోట్టి వేసింది. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ముద్రగడ సైలెంట్ అయిపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఉద్యమం నుంచి తప్పుకున్నారు. తాజాగా కాపు ఉద్యమాన్నితలకెత్తుకున్న సీనియర్ రాజకీయ నాయకులు హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ఏ మేర వత్తిడి తెస్తారో వేచి చూడాలి.

జీతాలు, పెన్షన్ ల కోతపై… వడ్డీ వాత..!


కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు, పెన్షన్ ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై హై కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. జీతాలు, పెన్షన్ లలో 50 శాతం కోత విధించిన ఆర్ధిక సమస్యల నుంచి వెసులు బాటు పొందాలనుకున్న ప్రభుత్వానికి, 12 శాతం వడ్డీతో కలిపి కోత విధించిన జీతం, పెన్షన్ లు రెండు నెలల్లో చెల్లించాలని చెప్పడం ప్రస్తుతం ఆర్ధికంగా అదనపు భారంగా పడినట్లయ్యింది.

Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

మార్చి, ఏప్రిల్ నెలల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల వ్యవస్థలన్నీ స్ధంబించాయి. ప్రభుత్వానికి ఆదాయం బాగా తగ్గిపోయింది. రోజుకు రూ.400 నుంచి 500 కోట్లు మేర వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభించాల్సి ఉండగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో రోజుకు రూ.30 నుంచి 50 కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగులు జీతాలు, పెన్షనర్ల పెన్షన్ చెల్లింపులపై 50 శాతం వరకూ కోత విధించింది. కరోనా వారియర్స్ గా పని చేస్తున్న వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి మాత్రం పూర్తి స్థాయి జీతాలు చెల్లించారు.

జీతాల చెల్లింపుల్లో 50 శాతం కోత విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. పెన్షనర్ల పెన్షన్ పై కోత విధించడం దారుణమని ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి లేఖలు రాశాయి. వృద్యాప్యంలో ఉన్న వారికి కోతలు విధించడం సరికాదని హితవు పలికాయి. దీంతో ఏప్రిల్ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పెన్షన్ లను అందించింది. మే నుంచి ఉద్యోగులకు జీతాలు పూర్తి స్థాయిలో అందజేశారు. కోత విధించిన జీతాలు త్వరలో చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టింది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

ఈ వ్యవహారంపై రిటైర్డు జిల్లా జడ్జి లక్ష్మీ కామేశ్వరి హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటీషన్ పై విచారించిన హై కోర్టు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించకుండా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైన చర్య కాదని పేర్కొంది. పెన్షనర్ల పెన్షన్ లోను కోత విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్ధానం ఆదేశాల ప్రకారం కోత విధించిన జీతాలు చెల్లించాలని ఆదేశించింది.

అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?


ప్రతిపక్షాల చెవుల్లో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ లు పూలు పెట్టేశారా? అన్నాదమ్ముల వలే ఆలింగనం చేసుకున్న వీళ్లిద్దరూ ఎందుకు నీటి కోసం కొట్టుకుంటున్నారు. సామరస్యంగా సాగే వీళ్లిద్దరూ ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటూ ఎందుకు పంచాయితీ పెడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజలను ఇప్పుడు ఈ నీటియుద్ధం చుట్టే ఎందుకు లాగారు? దీనివెనుక ఏదో పెద్ద మతలబు ఉందనే అనుమానాలు బలబడుతున్నాయి.. ‘సాగునీటి లొల్లి’ని తెరపైకి తీసుకొచ్చి వీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగా ఇది అభివర్ణిస్తున్నారు. దీనికి వెనుక అసలు కారణమేంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Also Read: రాజధాని రగడ లో బిజెపి పాత్ర

దాదాపు నెలరోజులుగా ప్రజలను, ప్రతిపక్షాలను కేసీఆర్, జగన్ లు వ్యూహాత్మకంగానే డైవర్ట్ చేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రతిపక్షాలు తామేదో ఉద్దరిస్తున్నామంటూ తెగ హడావుడి చేస్తూ వారి బుట్టలో పడిపోతున్నారన్న చర్చ సాగుతోంది. కీలకమైన ఈ నెలలో ప్రజల్లో తమ ఇమేజ్ దెబ్బతినకుండా.. ప్రతిపక్షాలు పోరాడకుండా కేసీఆర్, జగన్ లు వేసిన ప్లాన్ మాత్రం అద్భుతంగా వర్కవుట్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్, జగన్ ట్రాప్ లో ప్రతిపక్షాలన్నీ పడిపోయాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.. తెలంగాణ, ఏపీలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. తెలంగాణలో పరీక్షలు చేయకుండా.. వైద్య సేవలు అథమంగా మారి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ పీక్స్ లో ఉంది. ఇక సచివాలయం కోసం 400 కోట్లు కేటాయించడం వివాదాస్పదమైంది. వీటన్నింటిని కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ గానే అభివర్ణిస్తున్నారు.

Also Read: కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?

ఇక జగన్ కు చూసుకుంటే మూడు రాజధానుల వంటి పెద్ద వివాదాస్పద నిర్ణయం తలకెత్తుకున్నాడు. నిమ్మగడ్డ నియామకంలో అభాసుపాలయ్యారు. తాజాగా విజయవాడలో కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి చెందారు. ఇక ఏపీలో 10వేలు చొప్పున రోజుకు కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై కూడా పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సమస్యలన్నింటిపై ప్రజలు, ప్రతిపక్షాల దృష్టిని మరల్చి కృష్ణ జలాల సమస్యలపై, కొట్లాటలపై వారంతా ఫోకస్ చేసేలా కేసీఆర్, జగన్ లు వ్యూహాత్మకంగానే దీన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. తమ ఫెయిల్యూర్ లను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణ జలాల పేరిట కేసీఆర్, జగన్ కలిసి ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎంతైనా కేసీఆర్, జగన్ లది బుర్రే బుర్ర అని.. ఈ మాయలో ప్రతిపక్షాలు పడి కొట్టుకుపోతున్నాయని అంటున్నారు.

-ఎన్నం

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మెట్రో అక్కడే!


ఓరుగల్లు అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రెండో అతిపెద్ద నగరంగా ఎదిగింది. ఆదాయపరంగా, జనాభా పరంగా ఉమ్మడి వరంగల్ ప్రాంతం హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుంది. ఇప్పటికే 10లక్షల జనాభా దాటిన ఈ ప్రాంతం విద్యా కేంద్రంగా అలవారుతూ అభివృద్ధిపరంగా దూసుకెళుతుంది. ఐటీ రంగంలోనూ కొద్దికొద్దిగా సత్తాచాటుతోంది. దీంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లాలో మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?

ఉద్యమాలకు నిలయంగా ఉన్న వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ తొలి నుంచి ఫోకస్ పెట్టారు. జిల్లాను అన్నివిధలా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లాలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రూ. 1400కోట్ల వ్యయంతో జిల్లాలో 15కి.మీ. మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

వరంగల్ జిల్లాలో మెట్రోను ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్రకు చెందిన ‘మహా మెట్రో’ ముందుకొచ్చింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్, థానే, పూణే, నాసిక్ నగరాల్లో మహా మెట్రో అనుసరించిన విధానంలోనే వరంగల్ నగరంలోనూ మెట్రో ఏర్పాటు చేయనుందని సమాచారం. కాజీపేట నుంచి పెట్రోల్‌ పంపు.. అక్కడి నుంచి పోచమ్మ మైదాన్‌.. అక్కడి నుంచి వెంకట్రామ టాకీస్‌ మీదుగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని మహా మెట్రో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.1400కోట్ల మేర ఖర్చవుతుందని మహా మెట్రో ప్రతినిధులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Also Read: కేసీఆర్ తో ఫైట్.. జగన్ తట్టుకుంటాడా?

ఇప్పటికే కోటి రూపాయాలతో మహా మెట్రో సంస్థ జిల్లాలోని నగర ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థ, ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహా మెట్రో ప్రతినిధులు గత డిసెంబర్లో వరంగల్ వచ్చి మెట్రో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసినట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో త్వరలోనే జిల్లాలో మెట్రో పరుగులు తీయడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ఎప్పటిలోగా పూర్తి చేస్తుందో వేచి చూడాల్సిందే..!

పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !


బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి ఛాన్స్ లు కావాలట. అదీ స్టార్ హీరోల సినిమాల్లో. అందుకే అందరికీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరిని వేడుకుంటుందట. తన కెరీర్ మరో నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతానని దయచేసి అవకాశాలు ఇవ్వండని తన బాధను ఇలా వ్యక్త పరుస్తోందట. అందాలు ఆర‌బోయ‌డంలో కూడా ఇక తనకు హ‌ద్దులు లేవని, వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కోసమే తాను రొమాంటిక్ సీన్స్ లో విజ‌య్ తో పోటీ పడి మరీ నటించానని, బెడ్ సీన్స్‌లో అయితే దేవరకొండను సైతం డామినేట్ చేస్తూ రెచ్చిపోయానని.. ఇప్పుడు చేయబోయే సినిమాల్లో ఏ రేంజ్ రొమాన్స్ కైనా తాను సిద్ధం అని.. మొత్తానికి రాశీ ఖ‌న్నా తనలోని రొమాన్స్ గురించి ఫుల్ గా చెప్పేస్తోందట.

Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

ఏమైనా అమ్మడుకు పెద్దగా యాక్టింగ్ టాలెంట్ లేకపోయినా మంచి గ్లామర్ ఉంది. సో.. తనకు ఉన్న దాన్నే క్యాష్ చేసుకోవాలని బాగానే ఫిక్స్ అయినట్టు ఉంది ఈ భారీ బ్యూటీ. నిజానికి ఈ అందాల బొమ్మకు పెద్దగా హిట్లు కూడా లేవు. అయినా తాను స్టార్ హీరోయిన్ లానే ఫీల్ అవుతుంది. పెద్ద ఛాన్స్ లు వస్తే.. రెమ్యునిరేషన్ ను భారీగా డిమాండ్ చేసి.. త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉబలాట పడుతుంది. ఒక బిజినెస్ మెన్ తో ప్రస్తుతం పేమ కబుర్లు చెబుతుందట. బహుశా ఆ బిజినెస్ మెన్ తోనే పెళ్లి పాటలు కూడా పాడబోతుందేమో. అసలు ఈ బిజినెస్ మెన్ లంతా హీరోయిన్స్ తోనే ప్రేమలో పడి పెళ్లి ఎందుకు చేసుకుంటారో.

Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

ఇక మన స్టార్ హీరోలు రాశీకి ఛాన్స్ లు ఇస్తారని నమ్మలేం. ఎప్పటికప్పుడు కొత్త భామల కోసం ఎదురుచూసే మన మేకర్స్ కి రాశి ఖన్నా లాంటి సైడ్ ట్రాక్ హీరోయిన్ ఎంతవరకు ఎక్కుతుందనేది పెద్ద డౌట్.

విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !


డేరింగ్ డైరెక్టర్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరోగా ఉన్నదాని కంటే కాస్త ఎక్కువ నటించే రామ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ అనే ఆ మధ్య వచ్చిన మూవీతో పూరి భారీ విజయాన్నే నమోదు చేసాడు. సినిమా రామ్ వల్లే హిట్ అయింది అన్నా.. హిట్ క్రెడిట్ మాత్రం పూరికి కూడా వచ్చింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరిలో మ్యాటర్ తగ్గిపోయిందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపించే డైలాగ్. ఏది ఏమైనా పూరి పడిపోయి ప్లాప్ ల పాతాళంలో కొట్టుకుపోతున్న ప్రతిసారి.. ఏదొక హిట్ వచ్చి పూరిని నిలబెడుతుంది. ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ తన పాత చింతకాయ పచ్చడి గ్యాంగ్ డ్రామాతో మళ్లీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు.

Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధం అవుతొంది. వచ్చే నెల 25 నుండి హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో మొదలుకానుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ స్ తీయబోతున్నారని పూరి టీంలోని ఓ సభ్యుడు వ్యక్తపరిచిన లేటెస్ట్ అప్ డేట్. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. సునీల్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడని ఇంతవరకూ ఫైటర్ టీమ్ రివీల్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఈ మాజీ బాలీవుడ్ ఫేడ్ అవుట్ హీరో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ – సునీల్ శెట్టి మధ్య వచ్చే సీన్స్ వెరీ ఇంట్రస్ట్ గా ఉంటాయని సమాచారం.

Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

ఏమైనా పూరి మాత్రం ఇలాంటి యాక్షన్ రొట్ట కొట్టుడు కథలను ఇంకా ఎన్నాళ్ళు రాస్తాడో.. ఇప్పటికైనా పూరి ట్రాక్ మారిస్తే.. మరో పదేళ్లు ఫామ్ లో ఉండొచ్చు. లేదు అంటే.. గతం గొప్పగా భవిష్యత్తు బాధగా ఉంటుంది. అన్నట్టు విజయ్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడట. అంటే అప్పటివరకు విజయ్ కి తానూ డాన్ కొడుకును అని తెలియదట. ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కారణంగానే విజయ్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.

రాజధాని రగడ లో బిజెపి పాత్ర

రామ్ మాధవ్ ఉపన్యాసం రాజధాని పై ఇరుపక్షాలు తమకనుకూలంగా వుందని చెప్పుకోవటం ఆంధ్ర రాజకీయాల డొల్లతనాన్ని బయటపెడుతుంది. సాక్షి చానల్ ఆయన ఉపన్యాసం లోని తమకనుకూల భాగాన్ని కోట్ చేస్తే చంద్రబాబు అనుకూల చానళ్ళు అందులో తమకనుకూల భాగాన్ని కోట్ చేసారు. దీన్నిబట్టి వార్తల్ని ఎలా వక్రీకరిస్తున్నారో అర్ధమవుతుంది. రామ్ మాధవ్ భారతీయ జనతా పార్టీ లో సీనియర్ నాయకుడు. పార్టీకి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు రామ్ మాధవ్ ట్రబుల్ షూటర్. అటు కాశ్మీర్ లోగానీ, ఇటు ఈశాన్య భారతం లోగాని రాజకీయల్లో వ్యూహాలు పన్నాల్సి వచ్చినప్పుడు పార్టీ తనని పంపిస్తుంది. కాబట్టి రామ్ మాధవ్ లాంటి వ్యక్తి మాట్లాడితే దానికి వాళ్ళ పార్టీలో ఎంతో విలువ వుంటుంది.

రామ్ మాధవ్ ఏం చెప్పాడు?

రామ్ మాధవ్ వాళ్ళ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాడు. ముందుగా అసలు హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ విజయవాడ వచ్చి టెంటుల్లో, తాత్కాలిక క్యాంపు ఆఫీసుల్లో ఎందుకు వుండాల్సి వచ్చిందో అందరికీ తెలుసని చంద్రబాబు కి చురకలంటించాడు. అమరావతి ఒక్క రాజధాని లోనే ఇంత అవినీతి జరిగితే మూడు రాజధానుల్లో ఇంకెంత అవినీతి జరుగుతుందోనని జగన్ కి కూడా చురకలంటించాడు. ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి కూడా ఒక్కటే రాజధాని వుందని గుర్తుచేసాడు. అదే సమయం లో అమరావతి రైతులకు న్యాయం చేయాలనేది తమ పార్టీ విధానమని ప్రకటించాడు. దానితో పాటు పార్టీ వేరు ప్రభుత్వం వేరని విపులంగా వివరించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా విజయవాడ పరుగెత్తుకొచ్చి తాత్కాలిక కార్యాలయాల్లో వున్నా , అమరావతి రాజధాని గా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అలాగే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులుగా ప్రకటించినా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగం లో ఎవరి విధులు ఏమిటో స్పష్టంగా  వుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటే అది చేయలేదు. ఇప్పటికే రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి రామ్ మాధవ్ కేంద్ర ప్రభుత్వానికి వున్న పరిమితులు వివరించి తమ పార్టీ మాత్రం అమరావతి రాజధాని గా కొనసాగాలని కోరుకుంటుందని చెప్పాడు. విశేషమేమంటే దీన్ని ఎవరికివాళ్ళు ముక్కలు చేసి వాళ్లకు అనుకూలంగా ప్రసారం చేసారు.

మరి గొడవ ఎక్కడుంది?

ఆంధ్ర రాష్ట్రం లో టిడిపి , వై ఎస్ ఆర్ సి పి లు రాజకీయాల్ని శాసిస్తూ తెలివిగా కేంద్రాన్ని ఇరికిస్తుంటాయి. అదేమంటే మోడీ శంఖుస్థాపన కి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మోడీ జోక్యం చేసుకోవాలనేది వాదన. అప్పుడేమో మోడీ మట్టి, నీళ్ళు తెచ్చాడని విమర్శించారు, ఇప్పుడేమో జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని ఆపలేదని విమర్శ. ఆరోజు అమరావతి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకెక్కడ పెట్టినా కూడా మోడీ వచ్చి ఉండేవాడు. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ఎక్కడా అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం. ప్రధానమంత్రి హోదా లో శంఖుస్థాపనకు రావటం ఆనవాయితీ. అంతేగానీ ఏదో కోర్టుల్లో వాదనలు లాగా ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టటం సబబుకాదు. ఇటీవల బిజెపి లో చేరిన కొంతమంది ముఖ్యంగా సుజనా చౌదరి , లంకా దినకర్ లాంటి వాళ్ళు బిజెపి విధానానికి విరుద్ధంగా టిడిపి తో మమేకమై పోయి బిజెపి ప్లాట్ ఫార్మ్ ని వాడుకోవలనుకోవటం తోనే పేచీ అల్లా. బిజెపి పార్టీగా వ్యతిరేకించటం వేరు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని భ్రమలు కల్పించటం వేరు. వచ్చిన గొడవల్లా ఇక్కడే. ముఖ్యంగా సుజనా చౌదరి రైతుల్ని తన స్వార్ధానికి వాడుకోవటానికి బిజెపి వేదికని వాడుకోవటం తో ఇదేదో బిజెపి లో అంతర్గత తగాదా లాగా మిగతా పార్టీలు, మీడియా ప్రచారం చేయటానికి ఆస్కారం ఏర్పడింది. అసలు సుజనా చౌదరి ప్రవేశం తో రైతుల ఉద్యమంపై అనుమాన బీజాలు మొదలయ్యాయి.  జగన్ పార్టీ వ్యక్తులు దీనివెనక రియల్ ఎస్టేట్ లాబీ వుందని ప్రచారం చేయటానికి సుజనా చౌదరి రంగ ప్రవేశాన్ని ప్రముఖంగా ఎత్తిచూపుతున్నారు. అనొచ్చు , ఎవరు మద్దత్తిచ్చినా తీసుకుంటామని . కానీ ఉద్యమం నడిపేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు సుజనా చౌదరి , ఏమి చెబుతారు? బిజెపి ని విమర్శిస్తూ బయటకు వస్తారా? సందేహమే. వ్యాపారవేత్తల్ని అతిగా నమ్మటం మొదటికే మోసం. ఇప్పటికైనా రైతులకు అర్ధమై వుండాలి.

బిజెపి దూకుడు సబబేనా?

సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చినమాట నిజమే. కానీ భిన్నాభిప్రాయం వ్యక్తపరిచిన వాళ్ళను పార్టీనుంచి సస్పెండ్ చేయటం లో కొంత తొందరపాటు వున్దేమోననిపిస్తుంది. మొదట్లో రమణ పత్రికల్లో పార్టీ లైన్ కి భిన్నంగా వ్యాసం రాయటంతో సస్పెండ్ చేయటం జరిగింది. అది సింబాలిక్ గా , మిగతావాళ్లకు హెచ్చరికగా వుండటం కోసంగా చేసారని సర్దిపుచ్చుకోవచ్చు. కానీ అదేపనిగా అందర్నీ సస్పెండ్ చేసుకుంటూ పోకూడదు. ముందుగా వారితో మాట్లాడాలి. మౌఖికంగా హెచ్చరించాలి. ఆ తర్వాతనే తప్పని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా సీనియర్ల విషయం లో , పెద్ద వాళ్ళ విషయం లో కొంత సంయమనం పాటిస్తే బాగుండేది. వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ భావోద్రేకంలో తనకు తాను చెప్పుతో కొట్టుకొని అతిగా ప్రవర్తించి ఉండొచ్చు. కాకపోతే వెంటనే సస్పెండ్ చేయకుండా పిలిచి మాట్లాడి వుంటే బాగుండేది. అతను ఇంటర్వ్యూ చూసిన తర్వాత తను పరిపక్వత వున్న వ్యక్తిలాగా అనిపించింది. అటువంటి వాళ్ళ విషయం లో తొందరపడే  దానికన్నా సంయమనం తో వ్యవహరించాలి. ధృడమైన నిర్ణయాలు తీసుకోవాలి కాకపోతే తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా రాజకీయేతర వ్యక్తుల విషయం లో. ఏది ఏమైనా రాజధాని విషయం లో బిజెపి సెంటర్ స్టేజి లోకి వచ్చింది. రాష్ట్రం లో టిడిపి , వై ఎస్ ఆర్ సి పి నే కాదు మూడో ప్రత్యామ్నాయం కూడా వుందని ప్రజలకు తెలిసేలా వ్యూహాత్మకంగా బిజెపి వ్యవహరించిదనిపిస్తుంది. ఒకవిధంగా సోము వీర్రాజు ప్రో ఆక్టివ్ రాజకీయాలకు ఇది సంకేతమా?

రాజధాని విషయం లో కిం కర్తవ్యం?

మూడు రాజధానుల విషయం లో తెగిందాకా లాగటం అనవసరం. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారముందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కోర్టుల్లో దీన్ని లాగిద్దామనుకున్నా అది ఎక్కువకాలం నిలబడదని గుర్తుంచుకోవాలి. సంవత్సరం లోపల మండలి లో కూడా జగన్ పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇప్పటి అసెంబ్లీ నిర్ణయం తప్పని కోర్టులు అభిప్రాయపడినా ( నా దృష్టిలో ఆ అవకాశాలు తక్కువ) వచ్చే సంవత్సరమైనా ఆ నిర్ణయం ఆగదు. అటువంటప్పుడు సాధించేదేమిటి? దానికన్నా రైతుల సమస్యలపై ప్రత్యెక దృష్టి పెడితే మంచిది. రైతులు కూడా రాజధాని విషయం వదిలిపెట్టి తమ ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఏమేమి హక్కులు, సదుపాయాలు కావాలో ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా ప్రభుత్వం, రైతులు భేషిజాలు వదిలి ఓ ఒప్పందానికి రావటం మంచిది. రాజకీయపార్టీలు నిజంగా రైతుల మేలు కోరే వాళ్ళయితే రాజధాని విషయాన్ని పక్కన పెట్టి రైతుల సమస్యపై కార్యాచరణ తో ముందుకెళ్తే ఆచరణ సాధ్యంగా వుంటుంది.

 

 

 

 

సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?

సినిమా హీరో సుశాంత్ సింగ్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంతవరకు ప్రత్యక్షంగా పేరు చెప్పటానికి జంకుతున్న చానళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆదిత్య థాకరే పేరు తెర మీద స్క్రోల్ చేస్తున్నారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్ని కూడా మలుపు తిప్పుతిందనటం లో ఎటువంటి సందేహం లేదు. అంత ధైర్యంగా స్క్రోల్ చేయటానికి కారణం సుప్రీం కోర్టులో బీహార్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్. అందులో స్పష్టంగా ఈ కేసులో ఆదిత్య థాకరే పేరు వినిపిస్తుంది కాబట్టి ముంబై పోలీసులు నిస్పక్షపాతం గా దర్యాప్తు చేయలేరని అభిప్రాయపడింది. దీనితో చానళ్ళకు ఎటువంటి ఇబ్బందిలేకుండా స్క్రోల్ చేయగలుగుతున్నారు. ఇప్పటికే ఎ యు కోడ్ నేమ్ పేరుతో చాటింగ్ లో ఉండటంతో డొంకతిరుగుడుగా ఇన్నాళ్ళు ఒక మంత్రి కొడుకు అని ప్రసారం చేస్తున్న చానళ్ళు ఒక్కసారి ఆదిత్య థాకరే పేరు ప్రచారం చేయటం తో మహారాష్ట్ర రాజకీయాలు పెద్ద మలుపు తిరిగాయనే చెప్పొచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అవేమిటో చూద్దాం.

  1. ఇప్పటికి 56 రోజులు దాటినా ముంబై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయలేదు. అసలు కేసు ఆత్మహత్య లేక హత్య అనేది ప్రకటించలేదు.
  2. ఇంతవరకు మేజిస్ట్రేట్ ముందు నివేదిక ప్రవేశపెట్టలేదు.
  3. ఎటువంటి సాక్ష్యాలు సేకరించిన దాఖలాలు లేవు.
  4. పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రత్యక్ష సాక్షులు ఇవ్వటం కూడా అనుమానాలకు తావిస్తుంది.
  5. ప్రధాన అనుమానితురాలు రియా చక్రవర్తి ని ఇంతవరకు రిమాండ్ లోకి తీసుకోలేదు.
  6. సుశాంత్ సింగ్ తండ్రి తమ అబ్బాయి కి రక్షణ కల్పించమని చేసిన విజ్ఞప్తి ని డి ఎస్ పి పెడచెవిన పెట్టాడు.
  7. బీహార్ పోలీసులు విచారణకు వస్తే సహకరించక పోగా క్వారంటైన్ పేరుతో నిర్బంధం లో ఉంచారు.
  8. సుశాంత్ సింగ్ మేనేజర్ దిశా ఇలియన్ ఆత్మహత్య పై కూడా అనేక అనుమానాలున్నాయి.
  9. బీహార్ ప్రభుత్వ అభ్యర్ధనపై సి బి ఐ విచారణ చేపట్టింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కెళ్ళింది. దీనిపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరచ నుంది.

ఇప్పటికే మహారాష్ట్ర వికాస్ అగది కూటమి లో ఎన్నో లుకలుకలున్నాయి. ఈ కేసుతో అవి మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విలయతాండవం తో మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. ఈ ఘటన తో పూర్తిగా దెబ్బతగిలింది. దీన్నుంచి బయటపడటానికి ప్రాంతీయ విద్వేషాలు శివసేన రెచ్చగొడుతుంది. ఇదంతా ఎన్నికల కోసం బీహార్ ప్రభుత్వం కుట్ర పన్నిందని చెబుతుంది. కానీ పాత రోజుల్లో లాగా ఈ చిట్కాలు పనిచేయక పోవచ్చు. ఈ కేసులో ప్రభుత్వ ఒత్తిడి వుందని ప్రజలు నమ్ముతున్నారు. ఏ ఒత్తిడి లేకపోతే ముంబై పోలీసులు ఎందుకు నిర్వీర్యంగా వున్నారని అందరికీ సందేహమొస్తుంది. ఒకవేళ ఆదిత్య థాకరే కాకపోతే ప్రభుత్వం లో ఇంకెవరు ముంబై పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారో చెప్పాలి కదా. దీనితో శివసేన పని గోవిందా అని జనం అంటున్నారు. అది నిజమేననిపిస్తుంది.

బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

Balakrishna-focus on Market

Balakrishna-focus on Market
నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం.. ఆయన దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబుతో డీల్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మిమ్మల్ని ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే చూపిస్తా అని బోయపాటి స్క్రిప్ట్ చెప్పినప్పుడే బాలయ్యకి క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఓకే చెప్పిన బాలయ్య, ఇప్పుడు మాత్రం నో చెబుతున్నాడట. ఇప్పటికే ఇద్దరం రెండు సినిమాలు చేశాము, మళ్ళీ అలాంటి యాక్షన్ సినిమానే చేస్తే జనం చూడరేమో.. ఎంత కాదనుకున్నా ఈ లాక్ డౌన్ లో తెలుగు ప్రేక్షకులు కూడా వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. ఇప్పుడు వారిని మెప్పించడం మాములు విషయం కాదు.

Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకు యాక్షన్ సినిమానే చేయడం.. అని బాలయ్య తన వెర్షన్ ను చెబుతున్నాడట. నిజానికి బాలయ్య చెప్పింది అక్షర సత్యం. పైగా బోయపాటి సినిమాలో యాక్షన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే విమర్శ ఎలాగూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా.. వీరి కలయికలో యాక్షన్ సినిమా అంటే కచ్చితంగా రెగ్యులర్ గానే ఉంటుంది. అన్నిటికి మించి కొత్తగా చేయాలనేది బాలయ్య తాపత్రయం. అందుకే కథ వినగానే పాత్రకు తగ్గట్లు గుండు కూడా కొట్టించుకున్నాడు. ఏమైనా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును బాలయ్య చాటుకుంటూ తన అభిరుచిని వ్యక్త పరుస్తూనే ఉంటాడు. ఒక్కటి మాత్రం నిజం.. బాలయ్యను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిదే.

Also Read: మహేశ్‌తో సినిమాపై రాజమౌళి సైలెన్స్‌ ఎందుకంటే..

పైగా బాలయ్య మాస్ హీరో అని ఒప్పుకుని తీరాలి. బాలయ్య అభిమానులకు ఆయన మాస్ కావాలి. కానీ బాలయ్యకు మాత్రం ఇప్పుడు కొత్తదనం కావాలి. అయితే బాలయ్య కొత్తదనం కోసం చూపించే ఇంట్రస్ట్, కాంబినేషన్ మీద కూడా చూపిస్తే.. నిజంగా బాలయ్యకు మునపటి స్టార్ వాల్యూ వచ్చేస్తోంది. స్టార్ డైరెక్టర్స్ తో బాలయ్య సినిమాలను సెట్ చేసుకుంటే.. బాలయ్య మార్కెట్ కూడా పెరుగుతుంది. మరి బాలయ్య, ముందుగా తన మార్కెట్ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

రాపాక మనసులో మాట ఇదే..!


జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన మనసులో మాట ఎట్టకేలకు బయట పెట్టారు. ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టకుండా ఏవో సాకులు చెబుతూ తప్పించుకుంటున్న ఆయన ఎట్టకేలకు ఆసలు విషయాన్ని వెల్లడించారు. తాను వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నానని అవకాశం రాకపోవడంతో జనసేన నుంచి పోటీ చేశానని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ గెలిచి, పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో జనసైనికులు ఆయనను ఒక హిరోగా భావించారు.

Also Read: ఏపీలో ప్రతిపక్షం ఖాళీ..!

అనంతరం ఈ పరిస్థితులు తారుమారు అయ్యాయి. వరప్రసాద్ క్రమంగా వైసీపీకి దగ్గరవుతూ జనసేనకు దూరమయ్యారు. వివిధ అంశాల్లో, ప్రజా సమస్యలపై ఆయన జనసేన వైఖరిని, విధానాన్ని ఆయన శాసనసభలో ఎప్పుడూ వినిపించలేదు. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఆయన ప్రసంగం ఎప్పుడూ కనిపించలేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధికే ఓటు వేశారు. తనకు పార్టీ నుంచి ఎటువంటి సూచనలు రాలేదని, తన ఇష్ట ప్రకారం వైసీపీ అభ్యర్ధికే ఓటు వేశానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఇలా అనేక సందర్భాల్లో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. దీంతో జనసైనికులు ఆయనపై సోషల్ మీడియాలోను విమర్శలు ఎక్కుపెట్టారు.

Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

జనసేన విషయంలో రాపాక చేసిన వ్యాఖ్యలు జనసైనికులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను జనసేన పార్టీ అభ్యర్ధిగానే ఎన్నికల్లో విజయం సాధించానని ఇప్పడు ఆ పార్టీ ఉందో… లేదో తెలియదని వ్యాఖ్యానించారు. జనసేనపై ఇష్టం లేకపోయినా చాలా మంది ఓటర్లు తనను చూసే ఓటు వేశారంటూ వైసీపీ విషయంలో రాఘురామ కృష్ణంరాజు చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను వైసీపీ వైపే ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో జనసేనకు ఉన్న ఎకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇక ఆ పార్టీకి దూరమైనట్లే. దీని బట్టీ చూస్తే రాపాక తన అవసరానికి జనసేనను వాడుకున్నారనేది స్పష్టం అవుతుంది.

ఏపీలో ప్రతిపక్షం ఖాళీ..!


రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనా.. ఇక ఆ పార్టీ ప్రతి పక్ష స్థానానికి పనికిరానంత దీన స్థితికి చేరుకుందా అంటే బీజేపీ నాయకులు అవునే చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. కేవలం 23 సీట్లే సాధించింది. వీరిలో ముగ్గురు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మరి కొందరు అదే బాటలో ఉన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ నాయకులు అలా మాట్లాడి ఉండవచ్చు.

Also Read: బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని సూచించారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి వచ్చే నాలుగేళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

మరోవైపు బీజేపీలోకి టీడీపీ, వైసీపీ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల వెల్లడించారు. ధీంతో ఆ పార్టీలో కాన్ఫెడెన్స్ లెవల్స్ బాగా పెరినట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 2024 నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము ప్రకటించారు.

Also Read: వైసీపీ కి షాక్..? రాజధాని విషయంలో చివరికి వెనక్కి తగ్గిన జగన్..!

టీడీపీ పరిస్థితి బీజేపీ నేతలు చెబుతున్న అంత దీనంగా లేదు. టీడీపీ నాయకులు పార్టీని వీడినా క్షేత్ర స్ధాయిలో క్యాడర్ టిడిపి ఉంది. బీజేపీకి క్యాడర్ లేదు. అందుకే 2014 ఎన్నికల్లో టిడిపి పొత్తుతో నాలుగు సీట్లు సాధించినా, గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. క్యాడర్ లేకుండా నాయకులు ఉన్నంత మాత్రాన పార్టీ భలం ఉండదు. బీజేపీ అధికారంపై దృష్టి తగ్గించి ముందు పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసి క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటే అధికారం సాధించడం సాధ్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి ఇది అంత తేలికైన పని కాదు. అదే విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చెప్పారు. రోడ్లపైకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. మరి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తారో చూద్దాం.

పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలకంగా పని చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తొందర్లోనే వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వకీల్‌సాబ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీ హిట్‌ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ పవర్ఫుల్‌ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాతలు. దాదాపు యాభై శాతం షూటింగ్‌ పూర్తయింది. వేసవి లేదా దసరా కానుకగా రిలీజ్‌ చేయాలని చిత్రబృందం భావించింది. కరోనా దెబ్బకు ప్రణాళికలు అన్నీ తలకిందలయ్యాయి. లాక్‌డౌన్ తర్వాత చిత్రీకరణ ఆగిపోగా.. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ షూటింగ్‌ వద్దంటున్నాడు పవన్‌. దాంతో, ఈ మూవీ 2021లోనే విడుదల కానుంది.

Also Read: మళ్ళీ తెర పైకి ‘రామాయణం’.. కీలక పాత్రలో ఎన్టీఆర్ ?

ఈ లోపు తన తదుపరి చిత్రాలపై పవన్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్‌, హరీశ్‌ శంకర్ తో ఒక్కో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పుడు మరిన్ని కథలు వింటున్నాడు. ఈ క్రమంలో మలయాళ హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’ (ఏకే) రీమేక్‌పై పవన్‌ ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. దీనిపై తన మిత్రుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సలహా తీసుకున్నాడట. ఈ మూవీ గురించి ఈ మధ్య పవన్‌, త్రివిక్రమ్‌ చర్చలు జరిగాయని సమచారం. ఏకే మూవీ చూసిన పవన్‌ స్టోరీ నచ్చడంతో రీమేక్‌లో నటించాలని అనుకున్నాడు. ఈ మూవీ రీమేక్‌ రైట్స్‌ను హారిక, హాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్టైన్మెంట్స్‌ సొంతం చేసుకున్నాయి. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.

Also Read: ‘బ్యాచ్‌ల‌ర్’ కష్టాలు.. నాగ్ ని ఎలా ఒప్పిస్తారో !

తొలుత ఈ రీమేక్‌లో రవితేజ, దగ్గుబాటి రానా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు పవన్‌ పేరు తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ కూడా ఆసక్తిగా ఉండడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒప్పుకోవడం లేదట. అయినప్పటికీ ఈ మూవీ చేసేందుకు పవన్‌ ఓకే చెబితే సరైన దర్శకుడిని వెతకాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ మూవీ కావడంతో పవన్‌తో కలిసి నటించే మరో హీరోను కూడా వెతకాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఓకే అవుతుందో లేదో చూడాలి మరి.

మహేశ్‌తో సినిమాపై రాజమౌళి సైలెన్స్‌ ఎందుకంటే..


బాహుబలి 1,2 తర్వాత కొంత విరామం తీసుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ, పరిస్థితి చూస్తుంటే 2021 చివరి వరకూ కూడా వచ్చేలా లేదు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. గత నెలలో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని అనుకున్నా.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ లోపు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని తమ ఫామ్‌హౌజ్‌లో వాళ్లంతా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండి కోలుకుంటున్నారు. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. దాంతో, తన తదుపరి ప్రాజెక్టుపై రాజమౌళి దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

Also Read: నిర్మాతగా టాలెంటెడ్ బ్యూటీ.. గెస్ట్ రోల్ లో కూడా !

ఆర్ఆర్ఆర్ తర్వాత మహేశ్‌ బాబుతో సినిమా చేస్తానని ఈ స్టార్ డైరెక్టర్ కొన్ని నెలల కిందటే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మహేశ్‌ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ నెల 9వ తేదీన రాజమౌళి- మహేశ్‌ మూవీ గురించి ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, సర్కారు వారి పాట టైటిల్‌ ట్రాక్ టీజర్ మాత్రమే రాగా… రాజమౌళి వైపు నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఫ్యాన్స్‌ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే, మహేశ్‌ మూవీపై రాజమౌళి కావాలనే సైలెన్స్‌ మెయింటేన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది., రిలీజయ్యేందుకు కనీసం ఏడాది సమయం పట్టనుంది. ఆ చిత్రం షూటింగ్ అయినా కంప్లీట్‌ కాకముందే మహేశ్‌ మూవీ గురించి అధికారిక ప్రకటన చేయకూడదని రాజమౌళి నిర్ణయానికి వచ్చేశాడట. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాతే కొత్త ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలని భావిస్తున్నాడట. పైగా, మహేశ్‌తో మూవీ పట్టాలెక్కినా షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ చేసేందుకు ఎంతలేదన్నా మరో రెండు మూడేళ్లయినా పడుతుంది. అందువల్ల ఇప్పటినుంచే సినిమా గురించి మాట్లాడి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచి, వారిని ఎదురు చూసేలా చేయడం మంచిది కాదని రాజమౌళి భావిస్తున్నాడట.