Home Blog Page 8373

Birthday Special: Vintage Pictures Of Sridevi

Anupama Parameswaran Looking Gorgeous

Shivani Narayanan Stunning Pics

Samantha Akkineni Latest Photos

జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?


ఇప్పటివరకు జేసీ సోదరులకు అనంతపురం జిల్లా కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో ఆ కోటకు బీటలు వారాయి. సీఎం జగన్ నజర్ పెట్టడంతో ఇప్పుడు కోట గోడలు కూలాయి. ఏకంగా జైలు పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ హయాంలో రాజులుగా బతికిన జేసీ కుటుంబం ఇప్పుడు కేసులతో జైలు పాలు అవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది.

Also Read: చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?

వైసీపీ… జేసీ సోదరులను ఆర్థికంగా.. సామాజికంగా అనంతపురం జిల్లాలో చావు దెబ్బతీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఏ సహాయం అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేసుల మీద కేసులు నమోదవుతుంటే ఏం చేయాలో పాలుపోక బీజేపీ వైపు చూస్తున్నారు జేసీ బ్రదర్స్.

జేసీ ఫ్యామిలీ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. బస్సుల నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అతడి కుమారుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో వీరికి మద్దతు ఇచ్చేవారు కూడా జిల్లాలో నోరు మెదపడం లేదు. అనంతపురంకే చెందిన టీడీపీ దిగ్గజ నేతలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ సహా ఏ నేత వీరికి సానుభూతి తెలపడం లేదు. ఇక ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అన్నయ్య జేసీ దివాకర్ రెడ్డి నోరు కూడా మూగబోయింది.

Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

ప్రస్తుతం వైసీపీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి జేసీ సోదరులు బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే బీజేపీ తమకు ఎలాంటి పదవులు ఇస్తుంది? కేసుల విషయంలో వైసీపీపై ఒత్తిడి తెస్తుందా? ఖచ్చితంగా హామీ లభించడం లేదట.. బీజేపీలో చేరితే తమపై కేసుల నుంచి కొంత విరామం పొందవచ్చని భావిస్తున్నారు.

అయితే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నాయకత్వం మాత్రం జేసీ సోదరుల పట్ల ఆచితూచి ఆలోచిస్తున్నట్టు సమాచారం. జేసీ సోదరుల వివాదాస్పద వ్యాఖ్యలు.. వారి నియంత్రణ లేని రాజకీయాలు.. పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతీస్తుందని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. అందువల్ల జేసీ సోదరులను చేర్చుకునే అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. దీంతో జేసీ బ్రదర్స్ కు బీజేపీ తలుపులు తెరవడం లేదని తెలుస్తోంది.

ముచ్చటగా మూడవ సారి వాయిదా..!


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ఇళ్ల స్థలాల పంపిణీకి ముందడుగు పడటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ పథకం ముచ్చటగా మూడవ సారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వేడుకలతోపాటు ఇళ్ళ స్థలాల పంపిణీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి 29 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయాలని భావించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తాజాగా మరోమారు అక్టోబరు 2 గాంధీ జయంతి నాటికి వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?

ఇందుకు కారణం ప్రధానంగా పట్టాల పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఈ నెల 16వ తేదీన ప్రధానితో మూడు రాజధానుల శంకుస్థాపనతోపాటు ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ప్రధాని ఆధ్వర్యంలో ప్రారంభించాలని సిఎం భావించారు. మూడు రాజధానుల శంకుస్థాపన రద్దు కావడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను ఐదేళ్ల అనంతరం అమ్మకోవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. హై కోర్టు ఈ ఉత్తర్వులు చట్ట విరుద్దమని కోట్టేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆ కేసు ఇప్పటికీ తేలకపోవడంతో ఈ విషయంలోను సందిగ్ఘత నెలకొంది.

తొలుత మార్చి 25వ తేదీన ఉగాది పండుగు సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులో ఉండటంతో పథకాన్ని ప్రారంభించలేదు. అనంతరం జూలై నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పడు లాక్ డౌన్ తోపాటు, స్థలాలకు ఎంపిక చేసిన భూములపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటం, ప్రభుత్వంపట్టాల నిబంధనలపై న్యాయస్థానం అభ్యంతరాలు తదితర అంశాలతో మరోమారు వాయిదా పడింది.

Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

అయితే ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి భారీ స్థాయిలో లే అవుట్ లు వేశారు. భూముల కొనుగోలు విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో అవ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. స్థానికులు, టీడీపీ న్యాయస్థాన్ని ఆశ్రయించారు. కొన్ని గ్రామాల్లో చెరువును పూడ్చి ఇళ్ల స్థలాలుగా మార్చారు. మరికొన్ని చోట్ల కొండలపై ఇళ్ల స్థలాలు కేటాయించడం వివాదస్పదమయ్యింది.

ఏపీ గవర్నర్ మారనున్నారా?


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ త్వరలోనే మారబోతున్నారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ఏపీలో బలపడేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. దీనిలో భాగంగానే త్వరలోనే గవర్నర్ మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగారు. ఆయన స్థానంతో తెలంగాణకు తమిళ సై సుందరరాజన్, ఏపీకి ఒరిస్సాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్లుగా నియమాకం అయిన సంగతి తెల్సిందే. తెలంగాణ గవర్నర్ తమిళ సై కేంద్రం నిర్ణయం మేరకు నడుస్తుండగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సొంత నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. దీంతో ఆయనను ఏపీ నుంచి తప్పించేందుకు కేంద్రం ఆలోచిస్తుందనే టాక్ విన్పిస్తుంది.

Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న పలు సంఘటనలు ఇందుకు కారణమని తెలుస్తోంది. మూడు రాజధానుల విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ కేంద్రాన్ని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం కేంద్రానికి తలనొప్పిగా మారిందట. అదేవిధంగా ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియామకమైన నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలోనూ గవర్నర్ ఇలాంటి దూకుడు నిర్ణయమే తీసుకోవడం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అప్పట్లో కేంద్రంపై హైకోర్టు వ్యక్తం చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ గవర్నర్ సొంత నిర్ణయాల కారణంగా కేంద్రంలోని బీజేపీ ఇరుకున పడుతుండటంతో ఆయనను తప్పించేందుకు బీజేపీ యత్నిస్తుందనే టాక్ విన్పిస్తుంది.

Also Read: చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?

మూడురాజధానులపై గవర్నర్ సంతకం, నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుతో కేంద్రం ఇరుకున పడింది. దీంతో ఆయన పక్కకు తప్పించి ఆయన స్థానంలో వేరే వారిని నియమించే పనిలో బీజేపీ సర్కార్ ప్రయత్నాలు మొదలేట్టింది. ఈ లిస్టులో పాండిచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గా పని చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ పేరు తెరపైకి వస్తోంది. కిరణ్ బేడీని ఏపీ గవర్నర్ గా నియమిస్తే సీఎం జగన్ దూకుడుకు కూడా కళ్లెం వేయొచ్చని కేంద్రం భావిస్తుందట. అయితే గతంలోనే కిరణ్ బేడీని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. దీంతో కిరణ్ బేడీ విషయంలో మోడీ-అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

ఏనుగులతో కేక్ కటింగ్.. వారెవ్వా అనాల్సిందే..!


నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం(World Elephant Day). ప్రకృతిలో ఏనుగుల అవశ్యతను వివరించేందుకు ఈ డేను ప్రతీయేటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏనుగులు అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఏనుగును మేధస్సుకు చిహ్నంగా.. వినాయకుడికి ప్రతీరూపంగా పూజిస్తుంటారు. పలు దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా కేరళలో ఏనుగులు ఎక్కువగా కన్పిస్తుంటాయి. మనదేశంతోపాటు చాలాదేశాల్లో ఏనుగుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా

World Elephant Dayను పురస్కరించుకొని హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కులో వేడుకలను నిర్వహించారు. ఈ జూ పార్కులో మొత్తం ఐదు ఏనుగులు ఉన్నాయి. వీటిలో ఒక మగ ఏనుగు, నాలుగు ఆడ ఏనుగులు ఉన్నాయి. ఈ ఐదు ఏనుగుల్లో రాణి అనే ఏనుగు వయస్సు 82 అని జూ అధికారులు తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగు పేర్లతో ప్రత్యేకంగా రాగిపిండి, బియ్యం పిండితో కేకులను తయారు చేయించారు. ఈ కేకులతోపాటుగా వాటికి ఇష్టమైన చెరకు, బెల్లం, పైనాపిల్, మొక్కజొన్న, కొబ్బరి, పచ్చిగడ్డి వంటి వాటిని ఆహారంగా అందించారు.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఏనుగులన్నీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. వీటికి రోజు వాటి ఇన్ చార్జిలు, అధికారుల సమక్షంలోనే రోజు ఆహారం అందిస్తున్నారు. ఈ జూలో సూజీ అనే చింపాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని వయస్సు 33. ఇటీవల సూజీ 34వ పుట్టిన రోజును జూ అధికారులు ఘనంగాచేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకొని ఏనుగులతో కేక్ కట్ చేయడంపై పలువురు వారెవ్వా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ మంత్రికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న తుమ్మల, నామా?


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇటీవల కాలంలో బద్ధశత్రువులు నేతలంతా ఒకే పార్టీలో చేరడం.. వ్యతిరేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి సంఘటన జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు, నామా నాగేశ్వర్ రావుల మధ్య తాజాగా సయోధ్య కుదరిందని టాక్ విన్పిస్తుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా

తుమ్మల, నామాలు టీడీపీలో ఉన్నప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో తుమ్మల హవా కొనసాగుతున్న సమయంలోనే నాడు చంద్రబాబు నామాకు ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ వర్గపోరు మొదలైంది. 2004లో వీరిద్దరు ఒకరిని ఓడించేందుకు ఒకరు ప్రయత్నం చేయడంతో ఆ ఎన్నికల్లో వీరిద్దరు ఓటమి పాలయ్యారు. 2009లో వీరిద్దరు గెలిచిన టీడీపీ అధికారంలోకి రాలేదు. మళ్లీ 2014లో వీరిద్దరు ఒకరిని ఓడించేందుకు మరికొరు ప్రయత్నం చేసుకున్నారు. దీంతో ఖమ్మం ఎమ్మెల్యేగా తుమ్మల.. ఎంపీగా నామ నాగేశ్వర్ రావులు ఓడిపోయారు. అనుహ్యంగా తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ చేరి మంత్రి పదవీ దక్కించుకొని జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.

ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ లోని గ్రూపు రాజకీయాలే ఆయన ఓటమి కారణమని తెలుస్తోంది. అలాగే ఆ ఎన్నికల్లో నామా మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ నేతలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన పువ్వాడ అజ‌య్‌కుమార్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి అయిన ఖమ్మం రాజకీయాలను శాసిస్తున్నారు. తమపై అజయ్ పెత్తనం చేస్తుండటంతో ఈ ఇద్దరు నేతలు మంత్రి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో విన్పిస్తోంది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

ఇటీవల కాలంలో వీరిద్దరు నేతలు ఒకరికొకరు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నామా తుమ్మల వద్ద వెళ్లి పరామర్శించడంతోపాటు తన కంపెనీలో తయారైన శానిటైజర్లను కూడా ఆయన అందజేశారని వినికిడి. ఖమ్మంలో మంత్రి అజయ్ హవాకు చెక్ పెట్టేందుకు వీరిద్దరు కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారట. జిల్లాలోని కీలక పదవులన్నీ మంత్రి అజయ్ వర్గానికి చెందిన నేతలే వస్తుందటంతో వీరిద్దరు ఒక్కటవుతున్నారు. మంత్రి అజయ్ కు జిల్లాలో గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.

మరోవైపు మంత్రి అజయ్ సైతం ఈ ఇద్దరు నేతల కలయికపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారట. వీరి వ్యూహాలకు ప్రతీవ్యూహాలను అజయ్ సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ నేతల ఆధిపత్య పోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!

వైసిపి లో మొదటి వికెట్ డౌన్..! జగనే సస్పెండ్ చేశాడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఏకగ్రీవంగా అధికారాన్ని చేపట్టిన తర్వాత అందరి ఆలోచనలు ఒకటే. ఇప్పటివరకూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమర్థవంతంగా అవినీతిరహితంగా నడిపించగలడా లేదా అని. అయితే ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా వాటికి ఎక్కడా రుజువు లేదు. ప్రతిపక్షాలు కొంతమంది, అధికార పార్టీ అంటే గిట్టనివాళ్లు చేసిన ఆరోపణలు మినహాయించి పెద్దగా స్థాయిలో అవినీతి కుంభకోణం బయటకు రాకపోవడం విశేషం.

 

అయితే ఇప్పుడు వైసిపి సీనియర్ నాయకుడు… ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ మాజీ చైర్మన్ కోయ ప్రసాద్ రెడ్డి ని బుధవారం భూసేకరణ కబ్జా ఆరోపణలపై పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ముందుగా ప్రసాద్ రెడ్డి పై చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపి క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. అనంతరం ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్నం కు చెందిన ప్రసాద్ రెడ్డి ని వైసిపి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేరును విశాఖ నగరంలో కొన్ని ఒప్పందాలను పరిష్కరించడంలో విశాఖపట్నం కలెక్టర్ వద్ద దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కేవలం ప్రసాద్ రెడ్డి ని సస్పెండ్ చేస్తే చాలదని విపక్షాల వాదన. పార్టీలో ఉంటూ అధికార దర్పంతో అక్రమాలు చేసే నాయకుల పేర్లు ఒకటి బయటకు రావాలని.. ప్రసాద్ రెడ్డి కేవలం పావు మాత్రమేనని…. అతని వెనక ఇంకా వైసీపీ లీడర్లు ముఖానికి మంచోళ్ళలా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారని వైసిపి వ్యతిరేక దాడులు వాదిస్తున్నారు.

కేవలం ప్రసాద్ రెడ్డి ని సస్పెండ్ చేసి ఈ కోటింగ్ ఇచ్చే బదులు ఈ కుంభకోణం వెనుక అసలైన ఆధారాలు, తెరచాటు వ్యవహారాలు, మనుషులు, లెక్కలు అన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక డేరింగ్ స్టెప్ వేసిన జగన్ మళ్లీ వారి కోరికను తీర్చగలడా…?

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్?


రాజస్థాన్ లో ఈనెల 14నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎడారి రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటి సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదం చివరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీసింది. బోటాబోటి మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే ఝలక్ ఇవ్వడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. సచిన్ పైలట్ సహా, ఆయన వర్గం నేతలపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయడంతో రాజస్థాన్ రాజకీయాల్లో కుదుపు తప్పదని అందరూ భావించారు. అయితే అనుహ్యంగా సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?

సచిన్ పైలట్ కాంగ్రెసులోకి తిరిగి రావడంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. సచిన్ వర్గం సీఎం గెహ్లాట్ పై తిరుగుబాటు చేశాక ఆయన బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జరిగింది. దీనిని ఆయన ఖండిస్తూ తాను బీజేపీలో చేరేది లేదని ప్రకటించారు. దీంతో ఆయన సొంత పార్టీ పెడుతారనే టాక్ విన్పించింది. ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నెలరోజులు గెలిచిన పార్టీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయనకు పార్టీ పెట్టే ఆలోచన లేదని తేలిపోయింది. గత సోమవారం రాహుల్, ప్రియాంకగాంధీతో పైలట్ బేటి అయ్యారు. తాను పార్టీకి వ్యతిరేకం కాదని చెబుతూనే సీఎం గెహ్లాట్ పై తన అసంతృప్తిని వెళ్లగాక్కారు. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక ముందు తన డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది.

సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ చేరేందుకు రాహుల్, ప్రియాంక ముందు తన కోరికల చిట్టాను వినిపించినట్లు తెలుస్తుంది. దీనికి వారిద్దరూ సానుకూలత వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి పార్టీలోకి రానున్నారు. ప్రధానంగా ఆయన రాబోయే రోజుల్లో సీఎం పదవీ తనకే కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది. తనకు ప్రభుత్వం ఇంతక ముందున్న డిప్యూటి సీఎం పదవీ, పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల కక్ష్య సాధింపులు లేకుండా మరో డిప్యూటి సీఎం పదవీని తన వర్గం ఎమ్మెల్యేలకు కేటాయించాలని కోరారు. వీటితోపాటు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవీ తనకు కట్టబెట్టాలని సచిన్ షరతులు పెట్టాడట. వీటిన్నింటికి కాంగ్రెస్ అధిష్టానం సానుకూలత వ్యక్తం చేయడంతో తిరిగి సొంతగూటికిలోకి చేరుతున్నారు.

Also Read: అర్ధరాత్రి రఫేల్స్ తో భారత్ సీక్రెట్ ఫైట్?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లదే హవా నడుస్తోంది. వీరి కారణంగానే రాహుల్ సైతం పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టడం లేదని టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి దేశంలో నానాటికీ దిగజారుతోంది. సీనియర్ల కారణంగానే కాంగ్రెస్ యువనేతలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవీని కావాలని కోరడం ఆసక్తిని రేపుతోంది. ఇకపై కాంగ్రెసును సచిన్ పైలట్ నడిపించబోతున్నారనే టాక్ విన్పిస్తుంది. దీంతో రానున్న రోజుల్లో కాంగ్రెసులో యువకులకు పెద్దపీఠ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

జాతీయ స్థాయిలో రాహుల్, ప్రియాంకకు తోడుగా సచిన్ పైలట్ కలిస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెసులోనూ యువరక్తం ఉరకలేత్తడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈ పరిణామాలను ఆ పార్టీలోని సీనియర్లు ఏమేరకు స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే..!

తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?


తమ్మినేని సీతారాం ఏపీ స్పీకర్ గా అందరిచేత అధ్యక్షా అని పిలిపించుకుంటున్నా.. ఆయన మనసంతా మంత్రి పదవీపై ఉందనే టాక్ తరుచూ విన్పిస్తుంది. ఏడు పదుల వయస్సులో మంత్రి పదవీ చేపట్టి రాజకీయాల్లో నుంచి రిటైర్ కావాలని తమ్మినేని భావిస్తున్నారట.ఈ కారణంగానే ఆయన స్పీకర్ పదవీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతల మాదిరిగానే ప్రతిపక్ష పార్టీలపై విరుచుపడేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే.. వీలైనప్పుడల్లా జగన్ ను ఆకాశానికేత్తేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ కు తొలి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా తమ్మినేని సైలంటవడంపై ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

తమ్మినేని సీతారం స్పీకర్ గా కొనసాగుతున్నా ఆయనలోని రాజకీయ నాయకుడు మాత్రం ఆయనను స్థిమితంగా ఉంచలేకపోతుంది. దీంతో ఆయన జగన్ క్యాబినెట్లో చోటు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. తనకు అవకాశం వస్తే మంత్రి కావాలని ఆశపడ్డారు. అయితే ఇటీవల జగన్ క్యాబినెట్లో రెండు సీట్లు ఖాళీ అవగా ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందని భావించారు. మంత్రి పదవీ కోసం ఆయన సతీసమేతంగా సీఎం జగన్ ఇంటి వెళ్లి కలిశారు. దీంతో ఆయనకు మంత్రి పదవీ దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా సీఎం జగన్ తమ్మినేనికి గట్టి షాకిచ్చారు.

తొలి నుంచి జగన్ కు మద్దతు ఇస్తున్న తమ్మినేని సీతారంని కాదని సీఎం జగన్ ఆయన కంటే చాలా జూనియర్ అయిన సీదర్ అప్పలరాజుకు మంత్రిపదవి ఇచ్చారు. ధర్మాన సోదరులకు సన్నిహితంగా ఉండే అప్పరాజుకు మంత్రి పదవీ ఇవ్వడంతో జిల్లాలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన భావిస్తున్నారట. అంతేకాకుండా తన సామాజిక వర్గంలో, తన జిల్లా వరకు వచ్చిన మంత్రి పదవీ తాను చేజిక్కించు లేకపోయాననే బాధలో తమ్మినేని ఉన్నారట. దీంతో ఆయన ప్రస్తుతం సైలంట్ అయ్యారనే టాక్ విన్పిస్తుంది.

Also Read: “పోలవరం కూలిపోయిందా…?” ఎంత దురదృష్టకరం….మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి?

ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన కుమారుడు తమ్మినేని నాగ్ చిరంజీవిని వచ్చే ఎన్నికల బరిలో నిలిపేందుకు యత్నిస్తున్నారు. నాగ్ చిరంజీవి ప్రస్తుతం ఆముదాలవలస వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. తమ్మినేని మంత్రి పదవీ దక్కితే జిల్లాలో తన పట్టును మరింత పెంచుకొని తన తనయుడికి మార్గం సుగమం చేయాలని భావించారు. అయితే అనుహ్యంగా ఆయనకే వైసీపీ చెక్ పడుతుండటంతో ఆయన కలత చెందారనే టాక్ విన్పిస్తుంది.

గతంలో మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే రచ్చ రచ్చ చేసిన తమ్మినేని ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారు. తనకు మంత్రి పదవీ ఇవ్వకపోడంతోనే ఆయన అలక బూనినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేసినా ఆయన కనీసం ఒక్క మాట మాట్లాడలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీఎం జగన్ ఎలా కూల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?


నాడు తెలంగాణ.. నేడు రాయలసీమ.. టీడీపీ అధినేత చంద్రబాబులో అదే సందిగ్ధత. అదే వ్యూహాత్మక మౌనం.. ఒప్పుకుంటే ఓ ప్రాంతానికి నష్టం.. ఒప్పుకోకుంటే రాజకీయంగా తీవ్ర నష్టం. ఏమీ చేయాలో తెలియక చంద్రబాబు ‘వ్యూహాత్మక మౌనం’ అనే ఎజెండాను ఎంచుకుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. కానీ అదిప్పుడు తెలంగాణలో వలే రాయలసీమలోనూ చంద్రబాబుకు మరణశాసనాన్ని లిఖిస్తోందన్న వాదన టీడీపీ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోందట.. చంద్రబాబుది ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమే.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు విసిరిన పాచిక ఎంత పాపులర్ అయ్యిందో మనం చూశాం.. తెలంగాణను వ్యతిరేకించకుండా ఆంధ్రాను కాదనకుండా బాబు గారు ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతం ఇప్పుడు మళ్లీ ఆయనకు అవసరమైంది.

Also Read: ఎక్స్ క్లూజివ్: రాపాక విషయంలో పవన్ కి హెల్ప్ చేసిన జగన్..! ఏమన్నా రాజకీయమా….?

సీఎం జగన్ రాయలసీమ కరువు తీర్చేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమ రూపురేఖలే మారతాయి. అది జరిగితే చంద్రబాబుకు రాయలసీమలో రాజకీయ సమాధి తప్పదు. అందుకే రాయలసీమ ప్రయోజనాల కన్నా తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ… ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకునే వెన్నుపోటు రాజకీయానికి తెరతీశారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ చేస్తుంటే తెలంగాణ నేతల వాదానికి అనుకూలంగా, సీమకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కరువు సీమ జనం నోట్లో మరోసారి మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అందుకు పోలవరమే ఉదాహరణ. ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటిదో ఎడారిగా మారిన సీమను చూస్తే అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే ఆయన గొప్పతనం. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఒక్కటై దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నాయి. ఏపిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ లాంటివి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆగిపోవాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలను జగన్ పూర్తి చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు అక్కడ సమాధి అనే ఆందోళన టీడీపీలో ఉంది.

Also Read: “పోలవరం కూలిపోయిందా…?” ఎంత దురదృష్టకరం….మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి?

రాయలసీమ ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు. సీమ ఎత్తిపోతలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.

ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సీఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో తెలంగాణాలో కాంగ్రెస్ లోని గ్రూపులు, బిజెపీ నేతలు ఇటు ఏపీ, అటు తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తుండటం స్పందించక తప్పని పరిస్థితి నెలకొనటంతో ఏపీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచకపోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా ఉండాల్సిన చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అటు కేసీఆర్ ను, తెలంగాణ రాజకీయపక్షాలను ఎగదోస్తూ.. ఇటు ఏపీలో సీమ ఎత్తిపోతల జరగకుండా అడ్డుపుల్లులు వేస్తూ ఏపీని నాశనం చేసేలా చంద్రబాబు చర్యలు ఉంటాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

-ఎన్నం

పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ అవుట్ ఫుట్ బాగా రాలేదా.. ఇండస్ట్రీ జనం మాటల్లో మాత్రం కొంచెం అవుట్ ఫుట్ అటు ఇటుగానే ఉందని.. మొత్తానికి పవన్ పై కొన్ని రెగ్యులర్ సీన్స్ వర్కౌట్ అయ్యేలా లేవని, ఇప్పటికే దిల్ రాజు ఆ సీన్స్ ను సినిమా నుండి తీసి వేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఇలా తాజాగా వకీల్ సాబ్ గురించి కాస్త బయట బ్యాడ్ టాక్ నడుస్తోంది. ఒకపక్క ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో ఇలాంటి టాక్ రావడం అనేది పవన్ ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరచడమే. ఏది ఏమైనా ఈ సారి కూడా పవన్ హిట్ కొట్టలేక పోతే అది ఫ్యాన్స్ కి పర్సనల్ గా తీవ్ర నిరాశే.

Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి.. ఇక పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ అని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ ఓ రేంజ్ లో హడావుడి చేశారు. ఇప్పుడు చూస్తే అసలుకే మోసం వచ్చేలా ఉంది. వకీల్ సాబ్ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్న పవన్ ఫ్యాన్సే అవుట్ ఫుట్ తేడా వస్తే సినిమాని పక్కన పెట్టేస్తారు. నిజానికి పింక్ సబ్జెక్టులోనే పక్కా కమర్షియల్ అంశాలు ఉండవు. పైగా పవన్ ఇదివరకు చేసినట్లు డాన్స్ లు అండ్ రొమాన్స్ చేసే పరిస్థితి లేదు. అలాగే కాస్త మోతాదుకు మించి యాక్షన్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ రెడీగా లేడు.

Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

మరి వీటన్నిటి మధ్యలో అవుట్ ఫుట్ బాగా రాలేదు అంటే.. ఇక ఈ సినిమా పై ఉన్న నమ్మకం పోవడమే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. కాకపోతే కరోనా కరుణించాలి. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవన్ కమ్ బ్యాక్ ఎలా అయ్యారో, అలా వకీల్ సాబ్ తో మళ్ళీ కమ్ బ్యాక్ అవుతాడని పెట్టుకున్న బాక్సాపీస్ ఆశలు పై ఇక ఆల్ మోస్ట్ చిత్రబృందం ఇప్పటికే ఆ ఆశలు వదిలేసుకుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఇక నుండి ఈ సినిమా పై మీ గురి పెట్టుకోండి.

కరోనాలో కూడా లవ్ సీన్స్ కోసం.. !


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ‘ మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్నా.. పెద్దగా కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది. కలెక్షన్స్ రాబట్టలేని సినిమాని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ, జెర్సీ సినిమాని మాత్రం అందరూ పొగిడారు. పైగా పక్క భాష వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అయి మరీ రీమేక్ రైట్స్ ను తీసుకున్నారు. ఈ క్రమంలో హిందీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. షాహిద్ – మృణాల్ జంట బాగుందని ఇప్పటికే బాలీవుడ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది.

Also Read: విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !

అయితే ఇప్పటికే ఈ సినిమా చాల భాగం రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాల షూట్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ పార్ట్ ను గుజరాత్ లో షూట్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నా, షూట్ ను మాత్రం పోస్ట్ ఫోన్ చేయకుండా పూర్తి చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అందుకే కరోనా ప్రభావంలో కూడా గుజరాత్ లోనే చిత్రబృందం ఈ నెల మూడో వారం నుండి షూట్ ప్లాన్ చేస్తోందని.. గుజరాత్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. అందుకే కష్టం అయినా అక్కడే లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

కాగా షాహిద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ క్రికెటర్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుని మరీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకోవడం, మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమానే రీమేక్ చేస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాకి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ నిజంగా లక్కీ అనే చెప్పాలి. మూడో సినిమాకే వంద కోట్ల హీరోని పట్టేశాడు.

షాకింగ్ : రష్యా వ్యాక్సిన్ వల్ల కరోనా కే మేలు…? కొంప ముంచారు

ఇప్పటికీ కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచంలోని చాలా దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజుకి లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో ప్రపంచ ప్రజలకు ఏమి చేయాలో తోచని స్థితిలో ఆశా కిరణం లాగా రష్యా వ్యాక్సిన్ ఇప్పుడు బయటకు వచ్చింది. గత రెండు రోజుల నుండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న శాస్త్రవేత్తల్లో మొదలైంది. అన్ని దేశాలు ఇంకా వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఉన్నట్టుండి… మంగళవారం వ్యాక్సిన్ విడుదలను ప్రకటించి దానిని మనుషులకు ఇవ్వడం కూడా ప్రారంభించింది.

అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే…. రష్యా వారు మూడవ ఫేజ్ అంటే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించకుండా వ్యాక్సిన్ కు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం. భారత్ కు చెందిన బయో టెక్ వారి వ్యాక్సిన్ ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకునేందుకు సిద్ధ గా ఉంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్న భారత్ బయోటెక్ వారు మాత్రం ఇంకా వ్యాక్సిన్ విడుదల చేయకపోగా… అసలు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టకుండానే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చేశారు రష్యా వారు.

సాధారణంగా ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలంటే…. కనీసం 7 నుండి 10 ఏళ్ల సమయం పడుతుంది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వేలాది కోట్లు వెచ్చించి టీకాను సత్వరం సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే…. ఈ వ్యాక్సిన్ లో ఉన్న కెమికల్ పదార్ధాలు వైరస్ ను చంపలేకపోతే మనుషుల్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా ఆ కెమికల్స్ కు వైరస్ తన ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. అంటే ఆ వ్యాక్సిన్ లో ఉండే కెమికల్స్ వైరస్ ను ప్రభావితం చేయలేకపోతే. ఇక వైరస్ ను అదే రసాయన పదార్థాలతో తయారైన ఏ మిశ్రమం కూడా మళ్ళీ ఏమీ చేయలేదు.

దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీ కోసం కొంచెం అటు ఇటుగా ఒకే రకమైన ఫార్ములాను వాడుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా వారు తయారుచేసిన వ్యాక్సిన్ కనుక ఫెయిల్ అయితే…. కరోనా వైరస్ సదరు కెమికల్స్…. తర్వాత కూడా తనని నాశనం చేయకుండా తనని రాను రూపుమార్చుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయని…. అన్ని దశల్లో ప్రయోగాలలు జరిపి వ్యాక్సిన్ ను విడుదల చేయడమే ఉత్తమం అని శాస్త్రవేత్తల మాట. మరి రష్యా వారు వైరస్ ను అంతమొందిస్తారో.. లేక అసలుకే మోసం తెస్తారో చూడాలి.

‘మిస్ ఇండియా’ని సీక్రెట్ గా అమ్మేశారు !


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా‘. ఈ సినిమా కోసం కీర్తి చాల కష్టపడిందట. అయితే త్వరలో ఈ సినిమా ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కానుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు అది వర్కౌట్ అయ్యేలా లేదు. అందుకే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మారని.. అలాగే మా టీవీకి శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ రేటుకే అమ్మారని తాజా అప్ డేట్. అయితే మేకర్స్ ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఎవరికీ అమ్మలేదని చెబుతూనే మొత్తానికి సీక్రెట్ గా తమ సినిమాని అమ్ముకున్నారు.

Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

అయితే ఈ సినిమా అమెజాన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు గాని, దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ కోనేరుకి క్రిటిక్ గా మంచి నేమ్ ఉంది. అలాంటి వ్యక్తి ఒక కథను ఓకే చేసాడు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుంది. అందుకే ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించబోతున్నారట.

Also Read:  విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !

ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ యాక్టింగ్ చేసిందట. ఒకవేళ నిజంగానే కీర్తి ఈ సినిమాతో కూడా ఆ రేంజ్ హిట్ అందుకుంటే.. కీర్తి రేంజ్ మరింతగా పెరుగుతుంది. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా కీర్తి ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని కొరుకుందాం. మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటం.. అలాగే ఒక తమిళ్ హీరో గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమా పై ఆసక్తి క్రియేట్ అవుతుంది.