
ఇప్పటికీ కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచంలోని చాలా దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజుకి లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ దశలో ప్రపంచ ప్రజలకు ఏమి చేయాలో తోచని స్థితిలో ఆశా కిరణం లాగా రష్యా వ్యాక్సిన్ ఇప్పుడు బయటకు వచ్చింది. గత రెండు రోజుల నుండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్న శాస్త్రవేత్తల్లో మొదలైంది. అన్ని దేశాలు ఇంకా వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఉన్నట్టుండి… మంగళవారం వ్యాక్సిన్ విడుదలను ప్రకటించి దానిని మనుషులకు ఇవ్వడం కూడా ప్రారంభించింది.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే…. రష్యా వారు మూడవ ఫేజ్ అంటే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించకుండా వ్యాక్సిన్ కు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం. భారత్ కు చెందిన బయో టెక్ వారి వ్యాక్సిన్ ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకునేందుకు సిద్ధ గా ఉంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్న భారత్ బయోటెక్ వారు మాత్రం ఇంకా వ్యాక్సిన్ విడుదల చేయకపోగా… అసలు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టకుండానే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చేశారు రష్యా వారు.
సాధారణంగా ఏ వ్యాధికైనా వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలంటే…. కనీసం 7 నుండి 10 ఏళ్ల సమయం పడుతుంది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వేలాది కోట్లు వెచ్చించి టీకాను సత్వరం సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే…. ఈ వ్యాక్సిన్ లో ఉన్న కెమికల్ పదార్ధాలు వైరస్ ను చంపలేకపోతే మనుషుల్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా ఆ కెమికల్స్ కు వైరస్ తన ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. అంటే ఆ వ్యాక్సిన్ లో ఉండే కెమికల్స్ వైరస్ ను ప్రభావితం చేయలేకపోతే. ఇక వైరస్ ను అదే రసాయన పదార్థాలతో తయారైన ఏ మిశ్రమం కూడా మళ్ళీ ఏమీ చేయలేదు.
దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీ కోసం కొంచెం అటు ఇటుగా ఒకే రకమైన ఫార్ములాను వాడుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా వారు తయారుచేసిన వ్యాక్సిన్ కనుక ఫెయిల్ అయితే…. కరోనా వైరస్ సదరు కెమికల్స్…. తర్వాత కూడా తనని నాశనం చేయకుండా తనని రాను రూపుమార్చుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయని…. అన్ని దశల్లో ప్రయోగాలలు జరిపి వ్యాక్సిన్ ను విడుదల చేయడమే ఉత్తమం అని శాస్త్రవేత్తల మాట. మరి రష్యా వారు వైరస్ ను అంతమొందిస్తారో.. లేక అసలుకే మోసం తెస్తారో చూడాలి.