
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న సినిమా ‘మిస్ ఇండియా‘. ఈ సినిమా కోసం కీర్తి చాల కష్టపడిందట. అయితే త్వరలో ఈ సినిమా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు అది వర్కౌట్ అయ్యేలా లేదు. అందుకే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ కు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మారని.. అలాగే మా టీవీకి శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ రేటుకే అమ్మారని తాజా అప్ డేట్. అయితే మేకర్స్ ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఎవరికీ అమ్మలేదని చెబుతూనే మొత్తానికి సీక్రెట్ గా తమ సినిమాని అమ్ముకున్నారు.
Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !
అయితే ఈ సినిమా అమెజాన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు గాని, దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహేష్ కోనేరుకి క్రిటిక్ గా మంచి నేమ్ ఉంది. అలాంటి వ్యక్తి ఒక కథను ఓకే చేసాడు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుంది. అందుకే ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించబోతున్నారట.
Also Read: విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !
ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ యాక్టింగ్ చేసిందట. ఒకవేళ నిజంగానే కీర్తి ఈ సినిమాతో కూడా ఆ రేంజ్ హిట్ అందుకుంటే.. కీర్తి రేంజ్ మరింతగా పెరుగుతుంది. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా కీర్తి ప్రేక్షకుల మనసును గెలుచుకోవాలని కొరుకుందాం. మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటం.. అలాగే ఒక తమిళ్ హీరో గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమా పై ఆసక్తి క్రియేట్ అవుతుంది.