Home Blog Page 8372

అరుదైన వీడియో.. నెట్టింట వైరల్!

మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనం జీవితంలో ఉన్నత విజయాలు అందుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొందరిలో మాత్రం అరుదైన టాలెంట్ ఉంటుంది.  ఆ టాలెంట్ గురించి విన్నా, చూసినా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. తాజాగా ఇద్దరు యువకులు ఎండలో నీటితో వేసిన ఆర్ట్ కు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎండలో నీటితో ఆర్ట్ వేయడం అసాధ్యమైనా ఇద్దరు యువకులు దానిని సుసాధ్యం చేశారు.

బాస్కెట్ బాల్ కోర్టులో ఒక వ్యక్తి ఆడుతున్నట్టుగా రోడ్డుపై నీటితో వేసిన అరుదైన ప్రతిభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకుల టాలెంట్ ను చూసి నెటిజన్లు వాళ్లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మాజీ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాంప్‌మాన్ 22 సెకండ్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రెక్స్ పోస్ట్ లో గతంలో తాను ఇలాంటి వీడియోను చూడలేదని… ఇది నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు.

ఇద్దరు యువకులు 95 డిగ్రీల ఎండలో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ ఆర్ట్ వేశారు. నెటిజన్లు యువకులు పడిన కష్టాన్ని చూసి మనుషుల్లో కూడా సాధారణమైన ప్రతిభ ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఒక యువకుడు పడుకుని ఉండగా అతని చుట్టూ లే అవుట్ గీసి బాస్కెట్ బాల్ ఆడుతున్న రీతిలో వేసిన ఆర్ట్ అద్భుతం అని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రెక్స్ పోస్ట్ చేసిన ట్వీట్ కు మిలియన్ వ్యూస్ వచ్చాయి.

https://twitter.com/RexChapman/status/1293385698582593537

ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !


గోవా బ్యూటీ ఇలియానా నడుము ఎంత ప్ర‌త్యేకమో.. ఆమె వ్యక్తిత్వం కూడా అంతే ప్రత్యేకం. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఘాటు ప్రేమల్లో ఆమెను అనవసరంగా ఇన్ వాల్వ్ చేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. దీనికి తోడు ప్రేమ విఫ‌లం అయినా మరో కుర్రాడ్ని చూసుకుంటా అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. నిజానికి ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ‌తో ఇలియానా చాలా కాలం ప్రేమ కథను నడిపింది. పైపెచ్చు అతని ప్రేమ‌లో పూర్తిగా నానిపోయింది కూడా. మొత్తానికి ఇలియానా ప్రేమ‌లోని తీయ‌ద‌నాన్ని కూడా ఆండ్రూ పూర్తిగా ఆస్వాదించి.. ఇక లవ్ కి శుభం కార్డు వేసి వెళ్ళిపోయాడు.

Also Read: కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

ఏమైనా ఆ నీబోన్‌ దూరమైనప్పటికీ, ఇలియానా మాత్రం అతన్ని మర్చిపోలేక.. త్వరగా అన్ని విధాలుగా ఆకట్టుకునే బాయ్ ఫ్రెండ్ దొరకక కాస్త మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గురవుతుందట. ఎంతో ఇష్ట‌ప‌డే నీబోన్‌‌ దూరమయ్యాడనే విర‌హ వేద‌న నుంచి తను ఇంకా బ‌య‌టప‌డ‌లేకపోతుంది. కార‌ణం లేకుండానే ఎవరు మాత్రం ఎందుకు విడిపోతారు. ఇలియానా తన ప్రియుడితో విడిపోవడానికి కారణం మాత్రం అతనేనట. మన ప్రేమలో మూడో వ్యక్తి ఎందుకు అన్నట్టు అతను ఇలియానా పై పెంచుకున్న అనుమానం కారణంగానే ఈ జంట జాగ్రత్తగా గౌరవంగా విడిపోయింది.

Also Read: అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

ప్రస్తుతం ఇలియానా తన సింగిల్‌ లైఫ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని, నన్ను నేను ప్రేమించుకుంటున్నా అని చెప్పుకొస్తోంది. ఇక ప్రస్తుతం రవితేజ – రమేష్ వర్మ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇలియానా నటించబోతుంది. అలాగే బాలయ్య – బోయపాటి సినిమాలోనూ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది.

పొడి దగ్గుకు అద్భుతమైన ఇంటి చిట్కాలు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అయితే కొందరికి మందులు వాడితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరికి ఎన్ని మందులు వాడినా తగ్గినట్లే తగ్గి దగ్గు సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంటి చిట్కాలు పాటించి సులభంగా దగ్గును తగ్గించుకోవచ్చు. తేనె దగ్గుకు దివ్యౌషధంలా పని చేస్తుంది. తేనెను నేరుగా కానీ గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

తేనె, పసుపును మిశ్రమంగా చేసుకుని తాగితే దగ్గు త్వరగా తగ్గుముఖం పడుతుంది. మన పెద్దలు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగినా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. కొందరికి దగ్గుతో పాటు నోట్లో నుంచి నంజు వస్తూ ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడే వాళ్లు నీళ్లలో ఉప్పు వేసుకుని పుక్కలిస్తే దగ్గు తక్కువ సమయంలో తగ్గుముఖం పడుతుంది.

అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి నీటిలో మరిగించి తాగినా దగ్గు త్వరగా తగ్గుతుంది. కఫంతో కూడా దగ్గుతో బాధ పడుతున్నట్లయితే మిరియాలు మంచి ఫలితాన్నిస్తాయి. పొడి చేసిన మిరియాలను పాలలో లేదా నీళ్లలో కలుపుకుని తాగితే మంచిది. అయితే పొడి దగ్గు ఉన్నప్పుడు మాత్రమే మిరియాలను వాడాలి. రోజుకు రెండు తులసి ఆకులు నమలడం, పుదీనా టీ తాగడం లాంటి చిట్కాలు పాటించి దగ్గును సులభంగా తగ్గించుకోవచ్చు.

తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?


తెలంగాణలో పీసీసీ మార్పు ఖాయమని తేలడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఐదేళ్లు పదవీ పూర్తి చేసుకున్నారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. అయితే కొద్దిరోజులుగా పీసీసీ మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం సైలంట్ గా ఉంటుంది. దీంతో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ నే తిరిగి కొనసాగిస్తారా? లేదా కొత్తవారిని నియమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: సరిగ్గా 2వేల కేసులే.. కేసీఆర్ సార్ దాచేస్తున్నారా?

పీసీసీ మార్పు తప్పదనే సంకేతాలు ఉండటంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆశావహులు తమ లాబీయింగ్ మొదలుపెడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్ననేతలతో తమ పని చేయించుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ కు అధిష్టానం వద్ద మంచి పరపతి ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. శివకుమార్ ను ప్రసన్నం చేసుకొని తెలంగాణ పీసీసీ కావాలని నేతలు ఆయన వద్ద క్యూ కడుతున్నారు.

ఇటీవలే డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన ప్రమాణ స్వీకరానికి తెలంగాణకు చెందిన ముగ్గురు కీలక నేతలు హాజరయ్యారట. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీరంతా ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు చూసే కేసీ వేణుగోపాల్‌ తో డీకే శివకుమార్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో టీపీసీసీ పోస్టుపై తెలంగాణ చెందిన ఓ కాంగ్రెస్ నేత శివకుమార్ చెవిలో వేశారనే టాక్ విన్పిస్తుంది. దీంతో మిగిలిన నేతలు కూడా ఆయనతో లాబీయింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

Also Read: ఆ మంత్రికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న తుమ్మల, నామా?

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎక్కడా చూసిన డీకే శివకుమార్ ను కలిసిన విషయంపై చర్చ జరుగుతుందట. టీపీసీసీ పోస్టును ఆశించే వారంతా కూడా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. దీంతో టీపీసీసీ చీఫ్‌ వయా కర్నాటక అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ చెప్పిన వారికి టీపీసీసీ ఇస్తుందా? లేక పార్టీని అన్నివిధలా బలోపేతం చేసేవారిని ఎంపిక చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే కొత్త టీసీసీపీ చీఫ్ ఎవరనేది తేలిపోనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

లెప్ట్ హ్యాండ్ తో సత్తాచాటిన ప్రముఖులు వీరే..!


కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అని అక్కినేని నాగేశ్వర్ రావు ‘దేవదాసు’ సినిమాలో పాటపాడారు. అవునండీ.. కుడి ఎడమైతే పొరపాటు లేదని ప్రతీఒక్కరు తెలుసుకోవాలి. చిన్నతనంలో పిల్లలు ఎడమచేతితో పనులు చేస్తే చాలామంది అది కీడుగా భావిస్తుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎడమచేతితో పనులు చేయకుండా శతవిధలా ప్రయత్నిస్తుంటారు. అయితే కుడిచేతిని ఉపయోగించే వారికంటే ఎడమచేతిని ఎక్కువ ఉపయోగించే వారే చాలా ప్రభావంతంగా ఉంటారని తేలింది.

Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో 17శాతం లెప్ట్ హ్యాండర్స్ ఉన్నారని ఒక అంచనా. వీరికోసం ప్రత్యేకంగా లెప్ట్ హ్యాండర్స్ క్లబ్బులు కూడా ఉన్నాయి. డీన్ ఆర్ క్యాంప్ బెల్ అనే లెప్ట్ హ్యాండర్ 1976లో లెప్ట్ హ్యాండర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ను స్థాపించారు. ఆ తర్వాత 1977 ఆగస్టు 13 నుంచి లెప్ట్ హ్యాండర్స్ డేను ప్రతీయేటా అధికారికంగా నిర్వహిస్తున్నారు. లెప్ట్ హ్యాండ్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రతికూలతలపై అవగాహన పెంచేందుకు లెప్ట్ హ్యాండర్స్ డే ప్రతీయేటా నిర్వహిస్తున్నారు. చాలామంది లెప్ట్ హ్యాండర్స్ సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను ఈరోజున పంచుకుంటున్నారు.

ఇక ఎడమ చేతివాటం వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అత్యున్నత పదవులు, మంచి విజయాలు సాధించడం ద్వారా వీరంతా కూడా ప్రజల్లో ఎడమ చేతివాటంపై ఉండే అపోహలను దూరం చేశారు. ఎడమచేతివాటం వారిలో రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఫిల్మ్ మేకర్లు, క్రీడాకారులు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబమా కూడా ఎడమచేతివాటం వారే. ఇక మనదేశ ప్రధాని మోదీ కూడా ఎడమచేతివాటం వారేననే ఎంతమందికి తెలుసు..!

Also Read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ సంతతి మహిళ

ఇక క్రికెట్లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, జయసూర్య, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్ తదితరులు ఎడమచేతితో మెరుపులు మెరిపించారు. సినిమా రంగంలో ప్రఖ్యాత కామెడియన్ చార్లీ చాప్టిన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మహానటి సావిత్రి, మైకేల్ జాక్సన్, సోనాక్షి సిన్హా వంటి ప్రముఖులు ఉన్నారు. అయితే ఎడమచేతివాటం వారిలో ఆడవారి కంటే మగవారే ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. వైద్యశాస్త్ర ప్రకారంగా పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎడమ, కుడి అనేది నిర్ధారణ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎడమ చేతిని ఉపయోగించే వారిలో సృజనాత్మక కూడా ఎక్కువనే తేలిందట. ఈ కారణంగా తల్లిదండ్రులు పిల్లలు ఎడమ చేతివాటం వాళ్లు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

తప్పు చేశాడు.. తల్లితండ్రుల వింతైన శిక్ష వేశారు.. అసలు కథ ఏంటంటే?

ఒక దేశానికి మరో దేశానికి చాలా విషయాల్లో అనేక మార్పులు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో, పిల్లల పెంపకంలో ప్రధానంగా ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఆలోచన తీరు మారుతుంది. తాజాగా అమెరికాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఇరుగుపొరుగు వారికి తమ పిల్లవాడు ఇబ్బంది కలిగించాడనే కారణంతో తల్లిదండ్రులు బాలుడికి విచిత్రమైన శిక్షను విధించారు. బాలుడు రోడ్డు పక్కనే నివాసం ఉండాలని ఇంటికి రాకూడదనే శిక్ష విధించారు.

పూర్తి వివరాలలోకి వెళితే అమెరికాలోని ఆరిజోనాలోని ఫోనిక్స్ కు చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడైన ఏంజెల్ మార్టినెజ్ ను ఇంట్లోనే వదిలి తమ పెళ్లిరోజు సందర్భంగా లాస్ వెగాస్ కు వెళ్లారు. ఆ సమయంలో మార్టినెజ్ కారుతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేసి ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించాడు. ఇరుగు పొరుగు వారు చివరకు సహనం కొల్పోయి బాలుడి విన్యాసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన మార్టినెజ్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయితే కొడుకుపై ఉన్న ప్రేమ వల్ల స్టేషన్ నుంచి విడిపించుకుని వచ్చిన తల్లిదండ్రులు బాలుడిని రోడ్డు పక్కనే ఉండాలని ఆదేశించడంతో పాటు అతని బెడ్, టీవీ, టేబుల్ అన్నీ రోడ్డు పక్కన పెట్టారు. అక్కడ బాలుడు ” నా తల్లిదండ్రుల కారును వారి అనుమతి లేకుండా తీసుకుని ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించానని… నన్ను క్షమించాలి” అని బోర్డు పెట్టాడు. బాలుడు మీడియాతో కారును నీటితో శుభ్రం చేసి అక్కడికక్కడే గుండ్రంగా తిప్పానని నీరు డ్రై అవుతుందనే ఉద్దేశంతో అలా చేశానని చెబుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు మాత్రం చేసిన తప్పు అర్థం కావాలనే ఈ శిక్ష విధించామని చెబుతున్నారు.

హిందూ ఆలయంలో న్యూజిలాండ్ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే?

ప్రపంచ దేశాలలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కొన్ని దేశాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అలా వైరస్ ను కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. 102 రోజుల పాటు న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే వైరస్ ను కట్టడి చేయడంలో సక్సెస్ కావడంతో ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆర్డర్న్ పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా జెసిండా ఆక్లాండ్ లోని రాధాకృష్ణుల ఆలయాన్ని సందర్శించారు.

ప్రధాని ఆలయాన్ని సందర్శించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణలో సక్సెస్ కావడం వల్లే ప్రధాని దర్శనానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రధాని చెప్పులను ఆలయం బయట వదిలి… హారతి పూజలో పాల్గొని ప్రసాదం తీసుకొని పూరీ, పప్పును తింటున్న ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

గతంలో కరోనా కేసులు నమోదు కాని సమయంలో సైతం ప్రధాని జెసిండా హిందూ ఆల‌యానికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తాజాగా జెసిండా మరోసారి గుడికి వెళ్లడం వాస్తవం అయినా ఆమె వచ్చే నెలలో జరిగే ఎన్నికలు జరగబోతూ ఉండటంతో ఆలయానికి వెళ్లారని కరోనా కేసులు నమోదు కాకపోవడం వల్ల కాదని అధికారిక వర్గాల సమాచారం. క‌రోనాను క‌ట్ట‌డి చేసినందుకు జెసిండా ఆలయానికి వెళ్లారని వస్తున్న వార్తలు నిజం కాదు. మరోవైపు 102 రోజుల పాటు కేసులు నమోదు కాని న్యూజిలాండ్ లో నిన్న కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి.

సరిగ్గా 2వేల కేసులే.. కేసీఆర్ సార్ దాచేస్తున్నారా?


కేంద్రం కరోనా బులిటెన్ మారినా.. పక్కనున్న ఏపీ కరోనా బులిటెన్ లో కేసులు ఎక్కువ అవుతున్నా.. తెలంగాణ కరోనా బులిటెన్ లో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఠంచనుగా కేసీఆర్ సర్కారు 2వేల లోపు కేసులను మాత్రమే ప్రతీరోజు చూపిస్తోంది. టెస్టుల సంఖ్యను 40వేల వరకు పెంచినా కూడా కేసులను మాత్రం 2వేలకే కంట్రోల్ చేస్తోందన్న చర్చ సాగుతోంది.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా

రాష్ట్ర స్థాయి కరోనా హెల్త్ బులిటెన్ కు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే హెల్త్ బులిటెన్ కు తెలంగాణలో చాలా తేడాలుంటున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. కానీ రాష్ట్ర బులిటెన్ లో మాత్రం 2వేల లోపు మాత్రమే కేసులు ఆగిపోతున్నాయి. జిల్లాలో తీవ్రతకు.. రాష్ట్రంలో కేసులకు పొంతన లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు పదుల సంఖ్యలో కరోనా కేసుల విషయంలో రాష్ట్రస్థాయికి.. జిల్లా స్థాయి హెల్త్ బులిటెన్లకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. చాలా మందికి సోకుతోంది. ఇక జిల్లాలకు కరోనా బాగా విస్తరిస్తోంది. కానీ ఈ కేసుల లెక్కలెవీ రాష్ట్రస్థాయి బులిటెన్ లో కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: గోల్కొండలో ఆగస్టు 15 వేడుకలు ఉండవా?

ఇక తెలంగాణ సర్కార్ మృతదేహాల లెక్కలను దాస్తోందన్న ప్రచారం సాగుతోంది. బులిటెన్ లో మాత్రం కరోనా మృతులను తక్కువగా వేస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. బయట మాత్రం కరోనా మృతుల సంఖ్యను మీడియాల్లో బాగా చూపిస్తున్నారు. దీంతో మొత్తంగా తెలంగాణ బులిటెన్ లో ఏదో మతలబు ఉందన్న అనుమానాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

తెలంగాణలో కరోనా కల్లోలాన్ని కేసీఆర్ సర్కార్ దాచేస్తోందా అన్న భయాలు నెలకొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వెల్లడించే కేసులకు.. క్షేత్రస్థాయిలో కేసులకు చాలా తేడా ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నింటిని వెల్లడించాలని.. కరోనా తీవ్రతను ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత ఉందని ప్రజలు కోరుతున్నారు. దాచడం వల్ల మరింతగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రానా పెళ్ళిలో సమంత కుస్తీ.. వీడియో వైరల్


రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ల వివాహం ఆగస్టు 8న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి రోజున జరిగిన కొన్ని సరదా కార్యక్రమాల్లో సమంత చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత అక్కడ ఉన్నవారితో చేతి కుస్తీ పోటీలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !


సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, తన తరువాత సినిమాని పట్టుకోవడానికి మాత్రం నానా ఇబ్బందలు పడుతున్నాడు. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి మంచి పనితనం చూపించాడు. కానీ, ఆ సినిమా భారీ సక్సెస్ కాకపోవడం, ఇప్పుడు సురేందర్ రెడ్డికి పెద్ద సమస్య అయిపొయింది. ప్రభాస్ స్థాయి హీరో నుండి దిగువ స్థాయి హీరోలకు ట్రై చేసుకునే లెవల్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి పడిపోయాడు.

Also Read: కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

ఆ మధ్య తన తరవాత సినిమాని సురేందర్ రెడ్డి, రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్లాన్ చేస్తారని టాక్ వినిపించింది. ఆ మేరకు కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయట. కానీ అది ఏమయిందో తెలియదు గానీ, మళ్ళీ సురేందర్ రెడ్డి చైతు పేరు లైన్ లోకి వచ్చింది. క్రిష్ కథ, నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరక్షన్లో సినిమా అని నాగార్జున ఇచ్చిన ఐడియా అట. అయితే ఈ మధ్య మళ్లీ అది పక్కకు వెళ్లింది.

Also Read: బాలయ్యకి లావణ్య సెట్ అయింది !

ఇప్పుడు రవితేజ హీరోగా వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి మరో సినిమా అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఏమైందో ఏమో గానీ, సురేందర్ రెడ్డి మళ్లీ ఇప్పుడు అఖిల్ దగ్గరకే వెళ్తున్నారని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తరువాత చేయబోయే సినిమా సురేందర్ రెడ్డితోనే అట. ఇప్పటికే సురేందర్రెడ్డి అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు చేస్తున్నాడట.

భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?


సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమైన వార్త.. ఏదీ తప్పుడు వార్త అన్నది తెలియకుండా ఉంది. పుంకాను పుంకానులుగా తప్పుడు వార్తలు సోషల్ మీడియాలోకి వచ్చిపడుతున్నాయి. కనీసం నిర్ధారణ చేసుకోకుండా అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయి.

Also Read: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్?

తాజాగా కర్ణాటకలో బెంగళూరులో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధీకులు ఒక మతం గురించి ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. బెంగళూరు నగరాన్ని నిన్న నిద్రలేకుండా చేసింది. గొడవలు, దాడులు, వాహనాలు, ఆస్తుల దహనాలతో రావణ కాష్టంగా మారింది. ఏకంగా పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 78మంది పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఇక తాజాగా దేశంలోనే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఘోరమైన తప్పు చేశారు. కనీసం ఆలోచించకుండా నిన్న రాత్రి భారత మాజీ రాష్ట్రపతి ‘ప్రణబ్ ముఖర్జీ ’ చనిపోయాడని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. అది దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్రవేసిన ప్రణబ్ కు మన తెలంగాణ నేతలు, ప్రజలు కూడా కీర్తిస్తూ నివాళులర్పించారు.

కానీ దారుణమైన విషయం ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదు. ఆయన వెంటిలేటర్ పై విషమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడే వెల్లడించాడు. ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మరణించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి బతికే ఉన్నారని.. వదంతులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

Also Read: సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆదిత్య థాకరే?

దీంతో తెల్లవారి తప్పు తెలుసుకున్న జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రణబ్ కుటుంబ సభ్యులకు.. ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్టు నకిలీ వార్తలకు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ నకిలీ వార్తల మాయలో పడి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను.. ట్వీట్ చేసే ముందు దాన్ని తిరిగి ధృవీకరించకపోవడం నా వృత్తిపరమైన తప్పు. అందరికీ క్షమాపణలు .. ప్రణబ్ కుటుంబానికి సారీ చెబుతున్నట్టు సర్దేశాయ్ వివరించారు.

ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డం కట్టడంతో ఆయనకు ఢిల్లీలో మిలటరీ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వెంటి లేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నారు.

ఇలా దిగ్గజ మీడియాలు.. వాటి అధినేతలు.. ప్రముఖులు కూడా ఫేక్ న్యూస్ మాయలో పడిపోయి కనీసం నిర్ధారించుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. తద్వారా బతికున్న వారిని కూడా చంపేస్తున్నారు. చూస్తుంటే భారతదేశ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిమ్మిని బమ్మిని చేసే మీడియా కనీసం సమాచారం సేకరించకుండా ఫీల్డ్ వర్క్ చేయకుండా వార్తలు వండివార్చుతోందన్న సంగతి తేటతెల్లమైంది.

-ఎన్నం

23వ అంతస్తుపై నుంచి.. 14 ఏళ్ల బాలిక డేంజర్ గేమ్?

దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రజల్లో భయాందోళన పెంచుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల పలు ప్రాంతాల్లో నేటికీ లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ అమలు వల్ల ఎంతో బిజీగా ఉండే వారికి సైతం విశ్రాంతి దొరుకుతోంది. పాఠశాలలు తెరవకపోవడంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అన్నా చెల్లెలు మాత్రం ఆన్ లైన్ గేమ్స్ ఆడి బోర్ కొట్టిందేమో ప్రాణాలనే ప్రమాదంలో పెట్టే డేంజర్ గేమ్ ఆడారు.

అన్నా చెల్లెలు ఒకరికొకరు తమకే ధైర్యం ఎక్కువని పందెం వేసుకున్నారు. అన్న కంటే తనే ధైర్యవంతురాలని నిరూపించుకోవాలని చెల్లెలు భావించింది. 23వ అంతస్తు కొనభాగం మీద నుంచి నడిచి తనకే అన్న కంటే ధైర్యం ఎక్కువని నిరూపించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా 23వ అంత‌స్థు కొన నుంచి మూడుసార్లు నడిచింది. ఇంత భయానక సాహసం చేసిన బాలిక వయస్సు కేవలం 14 ఏళ్లే కావడం గమనార్హం.

ఈ నెల 6వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23వ అంతస్తుపై బాలిక నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలిక కాలు జారితే ప్రాణాలకే ప్రమాదం కావడంతో బాలిక తల్లిదండ్రులపై సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైకు స‌మీపంలోని కేళంబ‌క్క‌మ్‌లో జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు బాలిక, బాలిక సోదరుడిని ఇలాంటి ప్రమాదకరమైన పందేల వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని సున్నితంగా హెచ్చరించి వదిలేశారు.

కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !


హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ లోని గొప్ప సేవా గుణం ఏమిటంటే.. కుర్రాళ్ళ కోసం తనలోని అందాలను కావాలని మరీ చూపించడానికి తన వంతు కృషి తాను పర్ఫెక్ట్ గా చేస్తోంది. నిధిని ఆమె ఫొటోల్లోనో లేదా వీడియోల్లోనో చూడ‌గానే మనకు అర్ధమైపోతుంది. ఎక్స్ పోజింగ్ చేయడానికి పాప తెగ ఉబలాటపడుతుందని.. అలాగే ఈ విషయం అప్పుడే కుర్రకారులో అడుగు పెడుతున్న వారికి కూడా అర్ధం అవుతూనే ఉంటుంది. ఎంతైనా ఆడది కూడా త‌న వైపు చూపు మ‌ర‌ల్చుకునే సౌంద‌ర్యం నిధి అగర్వాల్ సొంతం. అందానికి నిధి ఒక “నిధి”లాంటిదే. కాకపోతే ఆ నిధిని వాడుకోవడమే కరెక్ట్ గా తెలియాలి.

Also Read: బాలయ్యకి లావణ్య సెట్ అయింది !

నిధి అగ‌ర్వాల్ ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో పూరి వాడిన రేంజ్ లో ఎవ్వరూ వాడలేదు. ఏమైనా నిధి అగ‌ర్వాల్ దిశ‌, ద‌శ‌ను మార్చిన సినిమా అంటే, అది కచ్చితంగా ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమానే. ఈ సినిమాతోనే నిధికి టాలీవుడ్ లో అమాంతం ఫాలోవ‌ర్లు పెరిగారంటే ఆ సినిమానే కారణం. మొత్తానికి త‌న అభిమానుల్ని నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో ఎదర భాగం అంతా కనిపించేలా హాట్ హాట్ లుక్స్ల్ లో కనిపిస్తుంటుంది. త‌న‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉన్న ముందుగా అభిమానుల‌తోనే షేర్ చేసుకుంటుంది.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !

డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో క‌వ్విస్తూ మరో యాంగిల్ లో ఓర చూపులు చూస్తూ మొత్తానికి నిధి అగర్వాల్ సోష‌ల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. పైగా ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపించే నిధి అగర్వాల్ కు బ్రేక్ ఇంకా సాలిడ్ గా రాలేదు. .

ఏకంగా రాష్ట్రపతి కంట్లో పడ్డ వైసీపీ…! ఇక చిక్కులు తప్పవా…?

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసు లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతి కార్యాలయానికి బాధితుడు రాసిన లేఖకు ఏకంగా రాష్ట్రపతి స్పందించారు. వెంటనే అతడిని ఏపీ సాధారణ పరిపాలన శాఖ లో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్న జనార్ధన్ ను కలవాలని సూచించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల ప్రోద్బలం తో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారకులైన అధికార పార్టీ నేతల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు.

వివరాల్లోకి వెళితే…. గత నెల 20న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో వరప్రసాద్ అనే దళిత యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో తీవ్రమైన దాడి జరిగింది. ఇక పోలీసుల సమక్షంలో అతడిని కొట్టడమే కాకుండా పోలీసులే అతనికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమక్షంలో శిరోముండనం చేశారు. అయితే ఇందుకు సంబంధించి జగన్ తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించి ఎస్సై ను సస్పెండ్ చేశారు. అయితే బాధితుడు లేఖలో తనపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కొందరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారని…. వీరిలో A1 నుంచి A6 వరకు ఇసుక మాఫియాకు చెందినవారని బాధితుడు రాష్ట్రపతికి వివరించడం జరిగింది. వారు అందరినీ వదిలేసి A7 అయిన ఎస్సై ను మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపించారని…. అసలైన నిందితులు అధికార బలంతో తప్పించుకున్నారని.. వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని అందులో పేర్కొన్నారు.

ఇంకా మరింత విస్తుపోయేలా 48 గంటలకు ముందే అక్కడ డ్యూటీ లో చేరిన ఎస్ఐకి తనపై ఇలాంటి సొంత కక్ష లేకపోయినా…. అతనికి కోరుకున్న చోటకి పోస్టింగ్ ఇప్పిస్తామని ప్రలోభపెట్టి వైసీపీ నేతలే తనపై దాడి చేయించారని వరప్రసాద్ పేర్కొన్నాడు… అలాగే మంత్రులతో సహా పలువురు అధికార పార్టీ నాయకులు తన వద్దకు వచ్చి డబ్బులిస్తాం కేసుని ఉపసంహరించుకోవాలని సూచించిచారే గాని కానీ ఒక్కరు కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను నక్సలైట్లలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని తాను భావిస్తున్నట్లు అందులో పేర్కొనడం పెద్ద సంచలనానికి దారితీసింది.

దీంతో రాష్ట్రపతి కోవింద్ వెంటనే స్పందించారు. దళితుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతని బాధను అర్థం చేసుకుని వెంటనే ఆయనకి సహాయపడ్డారు. అయితే వైసీపీ పార్టీ ఇప్పటికే దేశంలో అత్యధిక శాతంలో నేర చరిత్ర ఉన్న నాయకులు కలిగిన పార్టీల లిస్టులో టాప్ స్థానంలో ఉండగా…. ఇటువంటి ఘటనలు మళ్లీ వారి పార్టీ నేతాల నుండే జరుగుతుండడం దురదృష్టకరం. దీంతో రాష్ట్రపతి కన్ను కూడా ఒక్కసారిగా ఏపీ అధికార పార్టీపై పడింది. ఇక రానున్న రోజుల్లో వారికి చిక్కులు తప్పవు అని రాష్ట్రపతి భవన్ లోని మాట.

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంకి… ఏపీ కరోనా మరణాలకి మధ్య షాకింగ్ లింక్…!

 

భారత దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధిస్తున్నా గాని వాస్తవంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం ఎవరికీ కనిపించడం లేదు. రోజుకి దగ్గర దగ్గర 10 వేల కేసులు ఏపీలో నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి కేసులలో వృద్ధిరేటు ఏపీ లోనే చాలా ఎక్కువ. అంతే కాకుండా దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాల రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. ఒక ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజూ కనీసం 80 నుండి 100 మంది మృత్యువాత పడుతున్నారు. అసలు ఏపీలో కరోనా మరణాలకు స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి లింక్ ఏమిటి?

స్వర్ణ ప్యాలెస్ అనేది హాస్పిటల్ కాదు. రమేష్ ఆసుపత్రి వారు దానిని కోవిడ్ సెంటర్ ఉపయోగించుకునేందుకు లీజుకు తీసుకున్నారు. తీరా చూస్తే పేషెంట్లు, వైద్య సిబ్బందితో కలిపి 50 మంది ఉన్నా ఆ భవనంలో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ఏపీలో కరోనా మరణాలు కూడా అన్ని అలా జరుగుతున్నాయని కాదు. విషయం ఏమిటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అన్ని చోట్లా ఇలా అరకొర సదుపాయాలు ఉన్న భవనాలను డబ్బులకు కక్కుర్తిపడి కోవిడ్ సెంటర్లుగా మారుస్తున్నారు.

అదే ఆస్పత్రిలో అయితే…. పరిస్థితి విషయం కాగానే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ యూనిట్లు అప్రమత్తమై అందుకు సంబంధించిన పరికరాలను సమకూరుస్తారు. ఎంతైనా ఈ కోవిడ్ సెంటర్ లలో మాత్రం అటువంటి పరిస్థితి ఉండేది లేదని విశ్లేషకుల మాట. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ కోవిడ్ సెంటర్లు రిస్క్ అని తెలిసినా కూడా… ప్రభుత్వాసుపత్రుల పై నమ్మకం లేక అక్కడ చేరడానికే మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్రంలోని సొంత నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము పాలిస్తున్న, తమ పర్యవేక్షణ లో ఉన్న ఆస్పత్రిలలో చికిత్స తీసుకోకుండా హైదరాబాద్ మహానగరంలో కార్పొరేట్ ఆస్పత్రులకి వెళితే ఇక్కడి ప్రజలకు నమ్మకం ఎలా వస్తుంది..? అందుకని ఇలా కోవిడ్ సెంటర్లలో చాలామంది సరైన చికిత్స సరిగ్గా అందక చనిపోతున్నారు అని ఆరోపణ. అంతేకాకుండా ఇలాంటి చోట్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సేఫ్టీ యూనిట్లు సరిగ్గా పనిచేసే పరిస్థితి లేదని విజయవాడ ఘటన తో అర్థం అయిపోయింది. మరి ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల పై నమ్మకం కలిగించడం లేదా ఇటువంటి సెంటర్లపై తీవ్రమైన చర్యలు తీసుకునే పనులు చేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

బాలయ్యకి లావణ్య సెట్ అయింది !


నట సింహం అని గొప్పగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సింహం లాంటి సినిమా చేస్తున్నానని అంటున్నాడు. కాకపోతే, ఈ సింహానికి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. పాపం హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా పూర్తిచేశారు. ఏమైనా అప్పటి నుండి బాలయ్యకి హీరోయిన్ దొరకలేదు. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే, చాలామంది హీరోయిన్ల పేర్లు బాలయ్యకి జోడీగా తెరపైకొచ్చాయి, వెళ్ళాయి. కానీ బాలయ్య మాత్రం సినిమాలో ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !

ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బోయపాటి హీరోయిన్ గురించి చెబుతూ.. ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆ కొత్త హీరోయిన్ గురించి ఇంకా అడ్రెస్ లేదాయే. బాలయ్య పక్కన చేస్తే ఒక్క సినిమాకే పాత హీరోయిన్ అయిపోతానని భయపడి సైడ్ అయిందో ఏమో గాని, ఇప్పుడు ఆ కొత్త హీరోయిన్ ప్లేస్ లో లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. అమలాపాల్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించినా.. బోయపాటి లావణ్య త్రిపాఠి వైపే మొగ్గు చూపాడట. లావణ్య ప్రస్తుతం సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తూ ఉంది.

Also Read: కరోనాలో కూడా లవ్ సీన్స్ కోసం.. !

పాపం బాలయ్య సినిమా కోసం పేరున్న, క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకుందామంటే కనీసం ఒక్కరు కూడా బాలయ్య సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. బాలయ్యే స్వయంగా నయనతారకు ఫోన్ చేస్తే.. ముందు జాలి పడి చేస్తా అన్నా, అ తరువాత తన ప్రియుడితో గడిపే ఏకాంతానికి ఎక్కడ సినిమా అడ్డు వస్తోందో అని.. చివరకి ఈ సినిమా చేయలేనని సైలెంట్ గా తప్పుకుంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి తిరిగి షూటింగ్ మొదలవుతుందట.

మూడు రాజధానులపై మరో ట్విస్ట్..!


మూడు రాజధానుల విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించినందున చట్టపరంగా తమకు ఇబ్బందులు లేవని భావిస్తున్న ప్రభుత్వానికి తాజాగా చట్టపరంగా మరో చిక్కు వచ్చిపడింది. ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపిన బిల్లులపై శాసన మండలి ఛైర్మన్ సంతకం లేకపోవడంతో ఈ బిల్లుల ఆమోదం చెల్లుబాటు కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరమే గవర్నర్ ఆమోదించేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.

Also Read: ఏపీ గవర్నర్ మారనున్నారా?

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఈ నెల 17న శాసనసభలో ఆమోదించి శాసన మండలికి పంపారు. మండలిలో ఈ బిల్లులు ప్రవేశపెట్టలేదు. అధికార, విపక్ష సభ్యుల మధ్య నెలకొన్న వివాదంలో మండలిని చైర్మన్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ సంతకాలు చేయలేదు. శాసన మండలికి పంపిన 30 రోజుల అనంతరం మండలిలో ఆమోదించినట్లుగా ప్రభుత్వం భావించి గవర్నర్ ఆమోదానికి పంపింది. మండలి ఛైర్మన్ సంతకం లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదం చెల్లుబాటు కాదని, బిల్లులు చట్ట రూపం దాల్చవనే వాదనలు వినిపిస్తున్నాయి.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదం, మూడు రాజధానుల విషయంపై ఎమ్మెల్సీ అశోక్ బాబు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తన పిటీషన్ లో ఈ అంశాలను ప్రస్తావించినట్లు ఆయన తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులపై శాసన మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సంతకాలు ఉన్నప్పుడే గవర్నర్ ఆమోదించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అశోక బాబు తన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ, హోం శాఖలను ప్రతివాదులుగా చేర్చారు.

Also Read: జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?

ఇప్పటికే హై కోర్టులో ఈ అంశాలకు సంబంధించి అనేక పిటీషన్ లు దాఖలు అవడంతో హై కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీ అశోక్ బాబు పిటీషన్ ఇందుకు సంబంధించినదే కావడంతో ఈ నెల 14వ తేదీన జరిగే విచారణలో ఈ పిటీషన్ కూడా పరిగణలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. మరోవైపు 14వ తేదీన ఈ అంశంపై ప్రభుత్వం తన కౌంటర్ పిటీషన్ ను హై కోర్టులో దాఖలు చేయనుంది. హై కోర్టు విచారణలో ఏం ఆదేశాలు జారీ చేస్తుందనేది వేచి చూడాల్సిందే.