Home Blog Page 8358

అరె.. హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ !


కరోనా కాలం.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా లక్షల రూపాయల ఆదాయం వదులుకుని ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ కాలక్షేపం చేస్తుంటే.. కాస్త తెలుగు వచ్చి.. కాస్త అందాలని ప్రదర్శించే అలవాటు ఉన్న యాంకర్స్ మాత్రం కరోనా టైంలో కూడా లక్షలు సంపాదిస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంతా లాస్ లోనే ఉంది.. టీవీ ప్రొడ్యూసర్లు కూడా లాస్ లోనే ఉన్నారు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ చాలా సమస్యలనే ఫేస్ చేస్తోంది. సినిమా షూటింగ్ లతో పాటు థియేటర్లు మూతపడ్డాయనేది ఒకటి ఆయితే.. ఆర్టిస్టులకు అవకాశాలు లేక అన్ని వదిలేసి ఇంటికే పరిమితం అయిపోయారు. మరో పక్క హీరో హీరోయిన్లు కూడా తమ పారితోషకాన్ని తగ్గించుకొని సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారు.

Also Read: హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!

ఇక చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైందని కృష్ణ నగర్ గల్లీల్లో రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఇలా అందరూ కష్టకాలంలో ఉంటే.. టాలీవుడ్ టాప్ యాంకర్లు మాత్రం లక్షల పారితోషకాన్ని తీసుకుంటూ కరోనా కాలంలో కూడా బాగానే డబ్బు చేసుకుంటున్నారు. జనాలంతా టీవీలకు అతుక్కుపోయిన రోజులు ఇవి.. దీంతో రకరకాల షోలను ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో యాంకర్లకు గ్యాప్ లేకుండా పోయింది. సాధారణంగా స్టార్ యాంకర్లకు మొదటి నుండి డిమాండ్ ఉంది. పైగా ఇప్పుడు వాళ్లే షోని నడిపించాల్సిన బాధ్యత నెత్తిన వేసుకున్నారు.

Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

దాంతో రెమ్యునరేషన్ ను భారీగా తీసుకుంటున్నారు. మరి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ఒక లుక్కేద్దాం. టాప్ యాంకర్ సుమ షోకు 2.5 లక్షలు, హాట్ బ్యూటీ అనసూయ 2 లక్షలు, మరో హాట్ గ్లామర్ బ్యూటీ రష్మీ 1.25 లక్షలను తీసుకుంటున్నారు. ఇక సెకండ్ లెవల్ యాంకర్స్ వర్షిణి, మంజూష, శ్యామల లాంటి వారు షోకి 50 వేల వరకు తీసుకుంటున్నారు. ఇకపోతే ప్రత్యేక యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్న బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి, అలాగే గాయత్రి భార్గవి, ఝాన్సీ లాంటి వారు లక్ష వరకూ అడుగుతున్నారట. ఇక శ్రీముఖి ప్రొడ్యూసర్లను బట్టి అడుగుతుందట. మొత్తానికి సంపాదన విషయంలో ప్రస్తుతం హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ.

ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !


ముప్పై ప్లస్ లోకి వచ్చాక గాని, లావణ్య త్రిపాఠికి తత్వం బోధపడలేదు. హీరోయిన్ గా స్టార్ డమ్ రావాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం ఉండకూడదని. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అని ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చిన ఈ బ్యూటీ .. చివరికీ లిప్ టు లిప్ కిస్ కి కూడా సై అంటుంది. రవితేజ – రమేష్ వర్మ సినిమాలో ఓ బోల్డ్ క్యారెక్టర్ ఉంది. బికినీ సూట్ లతో పాటు కాస్త ఘాటు సీన్స్ లో కూడా నటించాలట. సహజంగా ఇలాంటి క్యారెక్టర్స్ కు లావణ్య కాస్త దూరంగా ఉంటుంది. కానీ ఆడిగి మరి ఆ బోల్డ్ క్యారెక్టర్ చేస్తానటుంది. మేకర్స్ ఈ రోల్ కోసం ‘నిధి అగర్వాల్’ను తీసుకోవాలనుకున్నారు. నిధి అయితేనే హద్దులు దాటి మరి బోల్డ్ క్యారెక్టర్ కి బోల్డ్ గా న్యాయం చేస్తోంది.

Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

కాగా లావణ్య మాత్రం నిధితో పోటీ పడుతుంది. రవితేజ కూడా నిధి వైపే మొగ్గు చూపాడని.. దాదాపు నిధి ఫైనల్ అనుకునే టైంకి ఆ రోల్ నేను చేస్తానని రవితేజను అప్రోచ్ అయిందట లావణ్య త్రిపాఠి. రవితేజ మాత్రం లావణ్య కోరికను ఎలా కాదనగలడు. పైగా ఇంతకు ముందెప్పుడూ లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ లో బోల్డ్ క్యారెక్టర్ చేయలేదు. అన్నిటికి మించి.. లావణ్య మంచి నటి. మొత్తానికి సినిమా హైప్ పరంగా చూసుకున్నా.. నిధి కంటే కూడా లావణ్యనే బెటర్. అందుకే రవితేజ కూడా లావణ్య వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

Also Read: హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!

ఇదే ఫీల్ అవుతుంది చిత్రబృందం కూడా. ఆ రకంగా నిధి అగర్వాల్ కి అన్యాయం చేసి.. బికినీ రోల్ ను పట్టేసింది లావణ్య. ఇక లావణ్య ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమా మొత్తం లావణ్య పాత్ర చుట్టే తిరుగుతుందట. కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రాబోతుంది. మొత్తం మీద కెరీర్ ను లేట్ గా అయినా కమర్షియల్ గా ప్లాన్ చేసుకుంటుంది లావణ్య.

మహిళలకు బతుకమ్మ కానుక సిద్ధం చేసిన టీసర్కార్?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించినప్పటి నుంచి ప్రభుత్వమే బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా పండుగల్లో ఆయావర్గాల వారికి కానుకలను అందజేస్తున్నారు. ఇక తెలంగాణలో ఘనంగా నిర్వహించే బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి వేడుకలను నిర్వహిస్తుంది. ఈ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా వస్తోంది.

Also Read: కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం

బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండటంతో ప్రభుత్వం చీరల పంపిణీకి సన్నహాలు చేస్తోంది. ఈ ఏడాది 75లక్షల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. చీరలను తయారీని బయట కంపెనీలకు ఇవ్వకుండా సిరిసిల్ల చేనేత కార్మికులకు అప్పగించింది. సిరిసిల్లలోని 20వేల మరమగ్గాలపై 15వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు చీరలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే చీరల ప్రాసెసింగ్, ప్యాకింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

సిరిసిల్ల నేతన్నలు తయారు చేస్తున్న బతుకమ్మ చీరలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. బంగారు, వెండి రంగుల్లో జరీతో కూడిన చీరలను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. 225 వైరటీల్లో నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగుల్లో చీరలు రూపొందుతున్నాయి. వీటిలో 10గజాల చీరలు 10లక్షలు ఉండగా.. మిగిలినవి 5.50మీటర్ల చీరె, 85సెం.మీ జాకెట్ వస్త్రాన్ని ఆడపడచుకులకు ప్రభుత్వం తరఫున అందించనుంది.

Also Read: సారూ… నోరిప్పండి!

నేతన్నలు తయారు చేసిన చీరలు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రవాణాకు ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సెప్టెంబరులో అన్ని జిల్లాలకు చీరలను పంపిణీ చేసేలా సన్నహాలు చేస్తుంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండి.. తెల్లరేషన్ కార్డు కలిగిన ఆడపచులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కె.వి ఉష శ్రీచరణ్ ఫేమ్ ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన సర్వే లో భారతదేశంలోని టాప్ -50 ఎమ్మెల్యేల లిస్టులో స్థానం దక్కించుకున్నారు. వైసిపి ఎమ్మెల్యే అయిన కె.వి ఉష శ్రీ చరణ్ అనంతపురం జిల్లా లోని కళ్యాణ దుర్గ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు ఇండియా ఏషియా సర్వే పోస్ట్ వారు నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో టాప్ 50 ఎమ్మెల్యేలలో ఒకరిగా నిలిచారు.

ఫేమ్ ఇండియా సర్వే వారు పాపులారిటీ, సామాజిక బాధ్యత, ప్రజలపై ప్రభుత్వం పై ఆయా ఎమ్మెల్యేల ప్రభావం, ప్రతిపాదించిన బిల్లుల్లో వారి పాత్ర, ఎమ్మెల్యే ఫండ్ ఖర్చు పెట్టే విధానం తదితర అంశాలను నిర్దేశక కొలమానాలుగా తీసుకొని ఈ సర్వేను చేశారు. ఈ లిస్టులో మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే వెనుకబడిన తరగతికి చెందిన ఈ మహిళా ఎమ్మెల్యే… ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను కంటికి రెప్పలా కాపాడింది అని ఇప్పటికీ ఎంతమంది కొనియాడారు.

ఆమె అసెంబ్లీలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన నీటి సమస్యను అసెంబ్లీలో లేవనిత్తిన తీరు నిజంగా హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ కరోనా కష్టకాలంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం…. తానే స్వయంగా వారి బాగోగులు చూడటం… అలాగే పోలీసులు, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలను, ఆహారాన్ని తానే దగ్గరుండి అందించడం…. ఇంకా మాస్కులు వంటి సేఫ్టీ పరికరాలను తన సొంత డబ్బులతో సహాయం చేయడం వంటివి ఎన్నో చేశారు. ఇలాంటి మనస్తత్వం గల ఆమె యొక్క సేవా భావన్ని పసిగట్టిన ప్రజలు దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో 2019 లో భారీ విజయం అందించారు.

ఇంటింటికీ నల్లా.. తెలంగాణనే నెంబర్ వన్


తెలంగాణ రాష్ట్రంలో మరో రికార్డు తిరగరాసింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనిని ధృవీకరిస్తూ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ‘దేశానికి ఆదర్శంగా నిలిచిన మన మిషన్ భగీరథ’ అంటూ ఒక పిక్ పోస్టు చేశారు.

Also Read: సారూ… నోరిప్పండి!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తాగునీటికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సురక్షితమైన మంచినీటిని ప్రతీ ఇంటికి అందించాలని లక్ష్యంతో ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారు. ఇందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. కేసీఆర్ మానస పుత్రికగా మిషన్ భగరథ పథకం పేరుగాంచింది. ఈ పథకం ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలువడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో 54.34లక్షల ఇళ్ళు ఉండగా 53.46లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఉందని పేర్కొంది. 98.31శాతం ఇళ్ళకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయిందని ప్రకటించింది. వీటి ద్వారా ప్రభుత్వం నీటి సరఫరా చేస్తోందని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవని ప్రకటించడం గమనార్హం.

Also Read: కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం

తెలంగాణ తర్వాత నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తున్న గోవా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 89.05 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నాయి. మూడో స్థానంలో పుదుచ్చేరి 87.02, నాలుగో స్థానంలో హర్యానా 79.78, ఐదో స్థానంలో గుజరాత్‌ 74.16శాతంతో నిలిచింది. చివరి స్థానంలో పశ్చిమబెంగాల్‌ 2.05 శాతంతో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో 95.66లక్షల ఇళ్ళు ఉండగా 33.21శాతం నివాసాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాక్సిన్ల పరిశోధనల్లో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. మన దేశంలోని పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఇతర వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే ఆయుర్వేద వైద్యులు కూడ కరోనాకు మందు కనిపెట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్‌(ఏఐఐఏ) నిసార్గ్ హెర్బ్స్ అనే సంస్థతో కలిసి ఆయుర్వేద మందుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలు కరోనాను కట్టడి చేయడంలో వేప పాత్ర గురించి కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం గమనార్హం. హ‌ర్యానా ఫరీదాబాద్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రి వేదిక‌గా వేప మందు పరీక్షలు జరుగుతున్నాయి.

ఈఎస్‌ఐసీ ఆస్ప‌త్రి డీన్ డాక్టర్ అసీమ్ సేన్‌, ఆరుగురు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. వేపమందు ప‌రీక్ష‌లు మొత్తం 250 మందిపై జరగనున్నాయి. వేప‌మందు వైరస్ సంక్రమణను నియంత్రించడంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందని అంశం గురించి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. మొదట 125 మందికి వేప గుళికలు ఇచ్చి అవి వైరస్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో పరిశీలిస్తున్నారు. సమర్థవంతమైన యాంటీ-వైరల్ ఔష‌ధంగా కరోనాకు వేప మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?


పాతికేళ్ల వయసులో బ్యాంక్‌ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదని ఫైన్‌ వేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ఫోర్బ్స్‌ 30 అండర్ 30లో చోటు. యువ నటుడు విజయ్‌ దేవరకొండ సక్సెస్‌కు ఓ ఉదాహరణ ఇది. ఓ సైడ్‌ యాక్టర్గా సైలెంట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. ‘పెళ్లి చూపులు’తో సైలెంట్‌గా హిట్‌ కొట్టిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో తన పేరు దేశ వ్యాప్తంగా రీసౌండ్‌ చేసేలా మారిపోయాడు. ఈ సెన్సేషనల్‌ స్టార్ టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలకు సమాన స్టార్డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడతను. సోషల్‌ మీడియాలో కూడా అతని జోరు మామూలుగా లేదు. యూత్‌ ఐకాన్‌ అనే పేరు తెచ్చుకున్న విజయ్‌తో సినిమాలు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. అర్జున్‌ రెడ్డి తర్వాత ట్యాక్సీవాలా, గీత గోవిందం కూడా హిట్‌ కావడంతో దేవరకొండ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్‌’తో తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా పేరు తెచ్చుకున్నాడు.

Also Read: బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

తన మూవీస్‌తో వంద కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో చేరాడతను. ఇప్పుడు అతని సినిమాకు వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సైతం నిర్మాతలు వెనుకాడడం లేదట. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో పాన్‌ ఇండియా మూవీ ‘ఫైటర్’ చేస్తున్న విజయ్ తర్వాత మోహన కృష్ణ ఇంద్రగంటితో పని చేయనున్నాడు. ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం. ఈ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ కోసం రాజు ఏకంగా వంద కోట్ల బడ్జెట్‌ రెడీ చేస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై రాబోయే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రి ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

ప్రస్తుతం విజయ్‌ కు ఉన్న స్టార్ డమ్‌ చూస్తే వంద కోట్ల బడ్జెట్‌ అంత పెద్దదేమీ కాదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.‘ఫైటర్’ రిలీజై హిట్టయితే విజయ్‌ పాన్‌ ఇండియా స్టార్ అవుతాడని చెబుతున్నాయి. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు కూడా విజయ్‌ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే చాన్సుంది.

కొడుకు కోసం సైకిల్ పై తండ్రి గొప్ప సాహసం..!

తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమ పిల్లలు జీవితంలో గొప్పగొప్ప విజయాలు సాధించాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. వాళ్ల సక్సెస్ కోసం జీవితంలో ఎన్నో కోరికలను, ఇష్టాలను త్యాగం చేస్తూ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తాజాగా ఒక తండ్రి తన కొడుకు పరీక్ష రాయడం కోసం 105 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని థార్ జిల్లా తనవార్ తహసీల్ లోని బేడీపూర్ అనే గ్రామంలో 38 ఏళ్ల శోభ్రామ్ నిరక్షరాస్యుడు. తాను చదువుకోకపోయినా తన కుమారుడు ఉన్నత చదువులు చదవాలని శోభ్రామ్ భావించాడు. తన కుమారుడు సకాలంలో పరీక్షకు హాజరు కావాలనే ఉద్దేశంతో 105 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. మధ్యప్రదేశ్ సర్కార్ తొలి ప్రయత్నంలో పాస్ కాని విద్యార్థుల కోసం రుక్ జానా నహీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తోంది.

పరీక్ష తన గ్రామం నుంచి 105 కిలోమీటర్ల దూరంలో జరుగుతుండటం, లాక్ డౌన్ వల్ల బస్సులు తిరగకపోవడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయడానికి సరిపడేంత డబ్బు లేకపోవడంతో కుమారుడిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకుని రెండు రోజులు కష్టపడి సైకిల్ పై పరీక్ష కేంద్రానికి చేరాడు. రెండు రోజులకు తనకు, కుమారునికి సరిపడా ఆహారం, నీళ్లను వెంట తీసుకెళ్లాడు. శోభ్రామ్ కుమారుడు అశిశ్ మాట్లాడుతూ తాను పదో తరగతి చదువుతున్నానని, సైకిల్ పై 105 కి.మీ ప్రయాణం చేసి పరీక్ష కేంద్రానికి చేరుకున్నానని చెప్పారు. శోభ్రామ్ మాట్లాడుతూ చదువు లేక తాను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని… తన కొడుకు అలా కాకూడదనే ఉద్దేశంతో పరీక్షలకు తీసుకొచ్చానని చెప్పారు.

ఒత్తిడితో బాధపడేవాళ్లు యోగా చేస్తే ఏం అవుతుందో తెలుసా?

0

మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఒత్తిడి పెరుగుతోంది. చిన్నచిన్న సమస్యలు ఎదురైనా ఒత్తిడిగా భావించే వాళ్లు మనలో ఎంతోమంది ఉన్నారు. మరి ఒత్తిడి సమస్యలు ఎదురు కాకముందే యోగా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి…? యోగా వల్ల మనకు శారీరకంగా, మానసికంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి…? యోగా చేయడం వల్ల నిజంగానే మంచి ఫలితాలు కనిపిస్తాయా…? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి.

ఆరోగ్య నిపుణులు యోగాకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. సాధారణంగా ఒత్తిడితో బాధ పడే వారు నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎల్లవేళలా నిరుత్సాహంతో జీవనం గడుపుతూ ఉంటారు. అవతలి వ్యక్తులపై కోపాన్ని చూపించలేక జీవితాన్ని భారంగా మోస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధ పడే వారికి యోగా చక్కని పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. మన నెగిటివ్ ఆలోచన తీరు సైతం యోగా వల్ల పాజిటివ్ గా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

యోగా చేయడం వల్ల మన ఫీలింగ్స్ మనకు తెలుస్తాయని… యోగా చేసే సమయంలో మనల్ని మనం విమర్శించుకోకూడదని… మనం ఏ విషయాల్లోనైనా నెగిటివ్ గా ఆలోచిస్తున్నామని తెలిస్తే ఆ ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చడానికి యోగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా మనం సొంతంగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి యోగా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏ వ్యాయామంతో పోల్చి చూసినా యోగాకు ప్రత్యేక విశిష్టతలు ఉన్నాయి. శరీరం, మెదడు, ఆత్మ అన్నింటినీ వృద్ధి చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది.

‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?


పాపం అనుష్క శెట్టి. ఆమె ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు దానికి తగిన ఫలితం రావడం లేదు. తన మంచితనం, అమాయకత్వం వల్ల అమెనే లాస్‌ అవుతోంది. ఎంతటి స్టార్డమ్‌ ఉన్నా.. తన డేట్స్‌ కోసం కోట్ల కట్టలతో దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంది స్వీటి. ఒకసారి హామీ ఇస్తే ఎంత కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా చివరి దాకా తోడుంటుంది. బాహుబలి చేస్తున్న టైమ్‌లో గ్యాప్‌ దొరికింది కదా అని ‘సైజ్‌ జీరో’ చేసిందామె. సహజత్వం కోసం బరువు పెరిగింది. ప్రాణం పెట్టి నటించింది. కానీ, ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ తర్వాత బహుబలి కోసం బరువు తగ్గేందుకు చాలా కష్టడాల్సి వచ్చింది. ఇక, బాహుబలి తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగినా, ఎన్నో ఆఫర్లు వచ్చినా మనసుకు నచ్చిన ‘నిశ్శబ్దం’ మూవీపైనే పూర్తిగా దృష్టి పెట్టిందామె. హేమంత్‌ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు కోన వెంకట్‌ కథ అందించి నిర్మించారు. అనుష్క ప్రధాన పాత్ర పోషించగా.. మాధవన్‌, అంజలి, మైఖేల్‌, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ ఇతర పాత్రల్లో నటించారు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కూడా జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేద్దామా? అనుకుంటోంది అనుష్క, చిత్ర బృందం.

Also Read: బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

ఓటీటీలో రిలీజ్‌ చేయమని పలువురు సలహా ఇచ్చినా ససేమిరా అన్నది. ఇది థియేటర్లో చూపించాల్సిన చిత్రం అన్నాడు నిర్మాత కోన వెంకట్‌. కానీ, థియేటర్లు ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవడంతో అతను మనసు మార్చుకున్నాడు. ‘థియేటర్ల కోసం జనవరి, ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే నిశ్శబ్దం సినిమాకు మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు?’ థియేటర్లోనా, ఓటీటీలోనా, ఎక్కడైనా సరేనా’ అని ట్విట్టర్లో పోల్‌ నిర్వహించాడు. ఎక్కువ మంది ఓటీటీకే మొగ్గు చూపడంతో పాటు ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యాక ఎక్కువ కాలం ల్యాబ్‌లో ఉంటే తనకే నష్టం అని భావించిన కోన.. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని డిసైడయ్యాడట. చిత్ర నిర్మాణంలో భాగమైన వారు కూడా ఒత్తిడి తేవడంతో మనసు మార్చుకున్నాడు.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌తో ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ అమెజాన్‌ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అయితే, ఆ రేటు తెలుగు హక్కులకేనా? లేకా అన్ని భాషలకా? అన్నది తేలాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో నిశ్శబ్దం స్ట్రీమ్‌ అవుతుందని తెలుస్తోంది. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేయనున్నారట. అయితే, వెండితెరనే శబ్దం చేయాల్సిన సినిమా అని ఇన్నాళ్లు ల్యాబ్‌లో మగ్గబెట్టిన నిశ్శబ్దం మొబైల్‌ తెరపై ఎలాంటి శబ్దం చేస్తుందన్నది ఆసక్తికరం.

వైరల్ ఫోటోలు: పబ్లిక్‌‌ అద్దాల టాయిలెట్స్..!

పబ్లిక్ టాయిలెట్స్… ఈ పేరు వింటేనే చాలామంది అదోలా భావిస్తారు. చాలామంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ ను ఆశ్రయిస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ లోని పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవసరాన్ని బట్టి ఏదో ఒక సందర్భంలో పబ్లిక్ టాయిలెట్స్ ను ఆశ్రయించే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకు లోపల ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది.

అయితే ఈ సమస్యలకు పరిష్కారంగా జపాన్ లోని షిబుయా జిల్లా అధికారులు ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా వాళ్లు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పారదర్శక గాజుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ఏర్పాట్లు చేశారు. యోయోగి ఫుకామాచి మినీ పార్క్, హారు-నో-ఒగావా కమ్యూనిటీ పార్కులలో షిగెరు బాన్ ఆర్కిటెక్ట్స్ ఈ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

పారదర్శక గోడలతో నిర్మించిన టాయిలెట్లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పారదర్శక గాజుతో నిర్మించిన టాయిలెట్ల ద్వారా లోపల ఎవరైనా ఉన్నారో లేదో సులభంగా తెలియడంతో పాటు టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయో

లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా లోపలికెల్లి తలుపు వేసుకుంటే మాత్రం ఆపారదర్శకంగా కనిపించేలా అర్కిటెక్ట్స్ ఏర్పాట్లు చేశారు. లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టకపోతే మాత్రం అంతే సంగతి. టోక్యో టాయిలెట్స్‌ ప్రాజెక్ట్స్‌ వెబ్‌సైట్‌లో పారదర్శక మరుగుదొడ్లు పార్కుకే అందాన్ని తెస్తున్నాయని పేర్కొన్నారు.

హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!


క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల అన్ని రంగాల వారి కంటే కూడా.. ఎక్కువగా ఇబ్బందులు పడింది సినిమా వాళ్లే. కరోనా కాలంలో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైపోయింది. అయితే మొత్తానికి కరోనాకి సినిమా వాళ్ళు అలవాటు పడుతున్నారు. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉన్నా.. షూటింగ్ ల ప్లాన్స్ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేకపోయినా.. ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఇంకా తెలియకపోయినా.. షూటింగ్స్ మాత్రం చకచకా చేసేందుకు మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

షూటింగ్ లు పూర్తి అయితే.. ఇక నాలుగు నెలల్లో దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను సెట్ చేసుకుంటారట. అందరూ కలిసి తమ సినిమాల మార్కెట్ రేంజ్ ను బట్టి సినిమాల మధ్య పోటీ లేకుండా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తారట. ఆ దిశగా ముందుకు వెల్లలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నా.. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే హీరోల ఇగోలను సంతృప్తి పరచడం అంత తేలిక కాదు. గత సంక్రాంతి సీజన్ లో హీరోలు ఒకరి పై ఒకరు పోటీ పడిన విధానం మనకు తెలియనది కాదు.

Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

మరి హీరోలను నిర్మాతలు ఎలా మ్యానేజ్ చేస్తారు అన్నదే ఇక్కడ మరొక పెద్ద సమస్య. దీనికి తోడు కరోనా వల్ల సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు. ముఖ్యంగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు కూడా ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. మరి ఇలాంటి మిడియమ్ రేంజ్ సినిమాలకు సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉండదు. ఈ సినిమాలు మాత్రం డైరెక్ట్ థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూస్తూ.. ఓటిటి ఆఫర్స్ ను కూడా కాదనుకుంటున్నాయి. ఇప్పుడు నిర్మాతలకు ఉన్న ఏకైక మార్గం.. హీరోల ఇగోలను సంతృప్తి పరచాలి. మరి పరుస్తారా.. !

స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ మంచు.. అసలు ఏమైందంటే?

స్విట్జర్లాండ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడ చాక్లెట్ల తయారీకి వాడే కోకోబీన్స్(కోకోవా) మంచు రూపంలో కురిసింది. కోకో బీన్స్ మంచు రూపంలో కురవడం ఏంటని అవాక్కవుతున్నారా..? అందుకు ముఖ్య కారణమే ఉంది. ఆకాశంలో నుంచి ఉన్నపళంగా మంచు కింద పడటం చూసిన స్విస్ వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ వ్యవస్థలో లోపాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతటా కోకోవా మంచు పడింది.

జూరిస్, బాసెల్ మధ్య ఓల్టెన్‌లోని ఫ్యాక్టరీలో కాల్చిన ‘కోకో నిబ్స్’ శీతలీకరణ వెంటిలేషన్‌లో చిన్న లోపం తలెత్తింది. ఫలితంగా బలమైన గాలులతో కలిసి సమీప ప్రాంతాలలో కోకో పౌడర్ శరవేగంగా వ్యాపించింది. లిండ్ట్ అండ్‌ స్ప్రూయంగ్లీ సంస్థ ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించింది. వెంటిలేషన్ వ్యవస్థలోని చిన్నచిన్న లోపాలే కోకోవా వ్యాప్తికి కారణమని తేలింది.

బలమైన గాలులతో కలిసిన కోకో పౌడర్ ఒక కారుపై పూతలా ఏర్పడింది. ఈ విషయం తెలిసిన సంస్థ సదరు కారును పూర్తిగా తామే బాగు చేయిస్తామని తెలిపింది. గాలిలో కలిసిన కోకో కణాల వల్ల ప్రజలకు, పర్యావరణానికి పెద్దగా హాని కలగదని పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే వెంటిలేషన్ వ్యవస్థను బాగు చేయించామని ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదని తెలిపింది. మనం తినే చాక్లెట్లలో కోకోవా కనీసం 60 శాతం ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోకోవా చాక్లెట్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

కరోనా వచ్చిపోతే బతుకుకు భరోసా..?

Corona conquered

ప్రపంచమంతా ఇప్పుడు కరోనాతోనే పోరాడుతోంది. అయితే అందరికీ వచ్చి తగ్గిపోతే ఇక ఆ వైరస్ ఏం చేయలేదు కదా అన్న సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే కరోనాకు మందులు లేవు. వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వైరస్ సోకి బయటపడితే ఇక తమ బతుకుకు భరోసా లేదని ఊహించుకుంటున్నారు.

అయితే కరోనాను జయించిన వారు వ్యాధి తగ్గిపోయిందని లైట్ తీసుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా అనంతరం శ్వాసకోస సమస్యలు.. పిల్లల్లో ఇమ్యూనిటీ లోపాలు తలెత్తే అవకాశం ఉందని ఈ మహమ్మారిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనాను జయించి కోలుకున్నారు. కానీ నాలుగు రోజులకే మళ్లీ శ్వాసకోస సమస్యలు ఒళ్లు నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. దీంతో తాజాగా నీతి అయోగ్ సభ్యుడు కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ హెడ్ వీకేపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా నుంచి కోలుకున్నాక వస్తున్న అనారోగ్యాలు కరోనాకు సంబంధించిన కొత్త కోణాలని.. దీనిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇటువంటి కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయని వీకే పాల్ హెచ్చరిస్తున్నారు. వ్యాధి తర్వాత కూడా సమస్యలు తలెత్తుతున్నాయని.. కరోనాను జయించాక కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కరోనా’ని తరిమికొట్టే శానిటైజ‌ర్ ప్రసాదిస్తున్న గ‌ణేశుడు!

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మ్రోగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. విజృంభిస్తున్న వైరస్ ప్రభావం పండుగలపై సైతం పడింది. మరో రెండు రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. గతంలో వినాయక చవితి పండుగ అంటే సందడి ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఈ సంవత్సరం మాత్రం పండుగ భిన్నంగా జరగనుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే వినాయక చవితి పండుగ విషయంలో ఆంక్షలు విధించారు.

పెద్దగా హడావిడి లేకుండా, ఎక్కువమంది గుమికూడకుండా ఉండేలా ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే కరోనా వల్ల విగ్రహాల తయారీలో కళాకారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముంబైలో ఏకంగా శానిటైజర్ వినాయకుడిని తయారు చేశారు. భక్తులు విగ్రహం ముందుకు వెళ్లి చేయి చాచగానే శానిటైజర్ పడే విధంగా రూపొందించిన వినాయకుని విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.

నితిన్ రామ్‌దాస్ చౌద‌రి అనే ముంబైకు చెందిన కళాకారుడు ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రతి సంవత్సరం భిన్నమైన గణేష్ ప్రతిమలను తయారు చేసే నితిన్ రామ్‌దాస్ చౌద‌రి ఈ సంవత్సరం శానిటైజ‌ర్ డిస్పెన్స‌ర్ ప్ర‌తిమ‌ను తయారు చేసి వార్తల్లో నిలిచాడు. నితిన్ ఈ ప్రతిమలో లైట్లను కూడా పొందుపరచటం గమనార్హం. రిమోట్ ద్వారా లైట్లను ఆన్/ ఆఫ్ చేయవచ్చని రామ్ దాస్ తెలిపాడు. రామ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ వినాయకుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పటాపంచలు చేస్తాడని… దేవుని ఆయుధంగా శానిటైజ‌ర్‌ను ప్ర‌తిమ‌లో పొందుపరిచానని చెప్పారు.

కాంగ్రెస్ దెబ్బ.. డిఫెన్స్ లో టీఆర్ఎస్, ఎంఐఎం


ముస్లిం మైనార్టీలను చేతబట్టి తెలంగాణలో రాజకీయం చేస్తున్న టీఆర్ఎస్, ఎంఐఎంలను ఒకే దెబ్బతో కొట్టాలని కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి అవకాశం దొరికింది. దీంతో హైదరాబాద్ లో రాజకీయం మొదలెట్టేసింది.

Also Read: సారూ… నోరిప్పండి!

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతలో భాగంగా అక్కడ ఉన్న మసీదును టీఆర్ఎస్ సర్కార్ కూల్చేసి కొత్త భవనం కడుతోంది. సచివాలయం పూర్తయ్యాక కొత్త మసీదును కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం.. దానికి ఆయన స్నేహితుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సరేననడంతో రాజకీయం చల్లబడింది.

అయితే టీఆర్ఎస్, ఎంఐఎం కూడబలుక్కొని రాజీకొచ్చిన ఈ వ్యవహారాన్ని పాతబస్తీలోని కొన్ని ముస్లిం సంఘాలు, మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ.. మైనారిటీ వర్గానికి చెందిన నాయకులతో కీలక సమావేశం నిర్వహించి ముందుకు సాగాలని నిర్ణయించింది.

ప్రధానంగా ఈ ఇష్యూతో టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా.. ముస్లిం వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఈ ఆందోళనను చేపట్టడం ద్వారా కాంగ్రెస్.. టీఆర్ఎస్ ను వెనక్కినెట్టి.. ముస్లిం ఓటర్లను తిరిగి పొందవచ్చు. అదే సమయంలో ముస్లింల పార్టీ అయినా ఎంఐఎంను లక్ష్యంగా చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ స్కెచ్ గీసింది.

ఎందుకంటే మసీదు కూల్చివేతపై ఎంఐఎం మౌనంగా ఉంటూ కేసీఆర్ సర్కార్ కు మద్దతు ప్రకటించింది. అదే స్థలంలో మసీదును పునర్నిర్మిస్తామని కేసీఆర్ అన్న మాటకు కృతజ్ఞతలు తెలిపింది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడురోజులేనా?

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం వ్యతిరేక మతాధికారుల సాయంతో ఈ ఆందోళనను ప్రారంభించడాలని చూస్తోంది. తద్వారా ఎంఐఎం ఓటు బ్యాంకును కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది.

అయితే ట్విస్ట్ ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముస్లిం నాయకులు ఎంఐఎంతో సాన్నిహితంగా ఉంటున్నారు. అందుకే కాంగ్రెస్ తీసుకునే ఏ స్టెప్ అయినా ఎంఐఎం అగ్రనేతలకు లీక్ అయిపోతున్నాయట.. మరి ఈ లీకేజీని అరికడితేనే కాంగ్రెస్ ప్లాన్లు వర్కవుట్ అవుతాయన్నమాట..

కరోనా తగ్గినా కలవరమే.. 75 శాతం మందిలో ఈ లక్షణాలు!

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య అదే స్థాయిలో ఉంది. చాలామంది కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బ్రిటన్ లో చేసిన అధ్యయనంలో కరోనా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత సైతం బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వల్ల ఆస్పత్రుల్లో చేరిన వారిలో దాదాపు 75 శాతం మంది కోలుకున్న తరువాత ఆయాసం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తేలింది. 110 మంది కరోనా రోగులపై పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కోలుకున్న వారిలో కొందరు రోజువారీ పనులు చేసుకోవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారని అధ్యయనంలో తేలింది.

వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు ఏర్పడుతున్నాయని సమాచారం. బ్రిస్టల్‌లోని సౌత్‌మిడ్ హాస్పిటల్ డాక్టర్లు వైరస్ నుంచి కోలుకున్న కొంతమంది రోగుల్లో మచ్చలను గుర్తించారు. కొందరు వైరస్ నుంచి కోలుకున్న తరువాత కూడా జ్వరం, దగ్గులాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయాసం, ఒళ్లు నొప్పుల సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కరోనా నుంచి కోలుకున్న తరువాత వచ్చే ఆరోగ్య సమస్యల కోసం చికిత్సను ప్రారంభించారు.