
ఆగస్టు 22. మెగా కుటుంబానికి, మెగా అభిమానులకు పండగ రోజు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఆ రోజును ప్రత్యేకంగా మార్చాలని ఎన్నో నెలల నుంచి ప్లాన్ చేస్తుంటారు. భారీ కటౌట్లు, కేక్ కటింగ్స్ మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రక్త దాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అనాథలను, అభాగ్యులను ఆదుకుంటారు. మరో రెండు రోజుల్లో వచ్చే చిరు బర్త్‌డే ఫ్యాన్స్‌కు మరింత స్పెషల్. ఎందుకంటే అది చిరంజీవి 65వ పుట్టిన రోజు. దీన్ని ఓ రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో చిరు బర్త్‌డే కామన్ డీపీ హల్ చల్ చేస్తోంది. చిరు బర్త్ డే స్పెషల్‌గా రామ్ చరణ్ యువ శక్తి మెగా ర్యాంప్ సాంగ్ ‘నమస్తే మాస్టరు’ రెడీ చేసింది. ఇప్పటికే గ్లింప్స్ వదలగా… బర్త్‌డేకు ఒక రోజు ముందు అంటే 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
Also Read: విజయ్ – మురుగదాస్ నాలుగోసారి..
తన కోసం ఇంత చేస్తున్న అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు చిరంజీవి కూడా సమాయత్తం అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం నుంచి సర్ప్రైజ్ గిఫ్ ఇవ్వనున్నాడు చిరు. ఈ మూవీ పోస్టర్తో పాటు టీజర్ కూడా రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, వాళ్ల కోరికలో సగమే నెరవేరనుంది. ఎందుకంటే 22న ఆచార్య మోషన్ పోస్టర్ ఒక్కటే రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ను థ్రిల్ చేసేందుకు టీజర్ కూడా విడుదల చేద్దామన్న దర్శకుడు కొరటాల శివ ప్రతిపాదనను చిరు తిరస్కరించాడని సమాచారం. ఓ చిన్న డైలాగ్‌తో కూడిన టీజర్ అయినా వదులుదామని శివ చెబితే చిరు నో అన్నాడట. తన పుట్టిన రోజు నాడు కేవలం ఆచార్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఒక్కటే విడుదల చేద్దామని స్పష్టం చేసినట్టు సమాచారం.
Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !
షూటింగ్ ఎలాగూ వాయిదా పడింది కాబట్టి టీజర్ను మరో సందర్భంలో రిలీజ్ చేద్దామని చెప్పాడట. తద్వారా మూవీపై ప్రేక్షకుల్లో మరింత కాలం కొనసాగించొచ్చన్నది చిరు ప్లాన్ అని తెలుస్తోంది. అందువల్ల డైలాగ్ టీజర్ను ప్రస్తుతానికి హోల్డ్ పెట్టారని సమాచారం. కాబట్టి ఆగస్టు 22న మెగా అభిమానులు ఒక్క ‘ఆచార్య’ పోస్టర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. కాగా, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ను చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. మార్చిలో షూటింగ్ మొదలైంది. రెండు వారాల చిత్రీకరణ అనంతరం కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ మూవీలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నాడు చరణ్.