Homeజాతీయ వార్తలుఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!

ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు. వీరిద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ వీరిద్దరు చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు. వీరిద్దరి కామన్ శత్రువు కూడా ఒక్కరే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో వీరిద్దరి స్నేహం మరింత బలపడింది. కిందటి ఎన్నికల్లో ఏపీలో జగన్ సీఎం అయ్యేందుకు తెలంగాణ సీఎం తనవంతు సహకారం అందించారనే టాక్ రాజకీయాల్లో వర్గాల్లో ఉంది. కేసీఆర్ ఊహించినట్లుగా ఏపీకి సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరింత స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ కంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇరు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు సీఎంలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ కొంతకాలంగా ముందుకెళుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు కాకుండా అంతకుమించి రిలేషన్ ను ఇద్దరు సీఎంలు మేయింటేన్ చేస్తున్నారు. ఒకరి ఇంటికి ఒకరి వెళుతూ అప్యాయం భోజనం చేసుకున్న సంఘటలున్నాయి. ఇలాంటి వీరిమధ్య నీళ్ల పంచాయతీ చోటుచేసుకోవడం పరిస్థితులు మారిపోతున్నాయి. ఇద్దరు సీఎం బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ ఎవరికి వారు నీటి కోసం కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు.

లక్షల క్యూసెక్కుల నీళ్లు గోదావరి పాలవుతుందని.. ఆ నీటిని రాయలసీమకు తరలించాలని సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. ఆ నీటిని తరలించకుండా తెలంగాణను ఎండబెట్టేలా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని రాయలసీమకు తరలించడంపై కేసీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది విభజన హామీలకు పూర్తి వ్యతిరేకమని కేసీఆర్ బలంగా వాదిస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమకు రావాల్సిన నీటి వాటానే రాయలసీమకు తరలిస్తున్నామని పేర్కొంటున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల వద్ద నీటిని తెలంగాణ తోడేస్తుండటంతో రాయలసీమకు నీరందడటం లేదంటున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు ఎత్తుపెంచి నీటిని తరలిచేందుకు జగన్ రెడీ అవుతున్నారు.

Also Read: మౌనమే కేసీఆర్ ఆయుధం!

ఈ విషయంలో తెలంగాణ, ఏపీలు మధ్య వివాదం నెలకొలనడంతో కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈమేరకు ఇరురాష్ట్రాల సీఎం కూర్చోబెట్టి మాట్లాడేందుకు రెడీ అవుతోంది. ఈనెల 8న జరుగాల్సిన అపెక్స్ కమిటీ మీటింగ్ వాయిదా పడింది. తెలంగాణ సీఎం అభ్యర్థనతో ఈనెల 25కు ఈ భేటి వాయిదా పడినట్లు సమాచారం. ఈ బేటిలో ఇరురాష్ట్రాలు నీళ్ల పంచాయితీని తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికారుల మధ్య పలుమార్లు భేటి జరిగిన ఏమి తేలలేదు. దీంతో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల బేటిలోనైనా నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. నీటి విషయంలో ఇరుప్రాంతాల ప్రయోజనాలు ఉండటంతో ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతుండటం గమనార్హం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular