
కాలం మారుతోంది. కాలంతో పాటే మనుషుల్లో నైపుణ్యాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మనుషులు కలలో కూడా అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తున్నారు. తమకు నచ్చిన రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఫోటోగ్రాఫర్ ప్రతిభకు అద్దం పడుతోంది. ఒక చెట్టుపై కూర్చున్న గుడ్లగూబకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : ఆ గ్రహశకలం భూమిని తాకితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే…?
ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయ్యే ఫోటోలలో కొన్ని ఫోటోలు మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఆయా ఫోటోలలో ఉండే ప్రత్యేకతలే ఆ ఫోటోలు వైరల్ కావడానికి కారణమవుతూ ఉంటాయి. తాజాగా అలా వైరల్ అవుతున్న ఒక ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోను దూరం నుంచి చూస్తే చెట్టుకు కన్ను ఉందేమో అనేలా ఉంది.
‘ఒక కన్నుతో చెట్టు. మీకు నచ్చే ఉత్తమ ఫోటోలలో ఇది ఒకటి’ అనే ట్యాగ్ లైన్ తో సుశాంత్ సింగ్ షేర్ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గుడ్లగూబ చెట్టు తొర్రలో కూర్చోగా ఒక కన్ను మాత్రమే ఫోటోలో కనిపించేలా ఫోటోగ్రాఫర్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. ఫోటోను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రమే అక్కడ పక్షి ఉందని అర్థమవుతుంది. గుడ్లగూబ రంగు చెట్టు రంగును పోలి ఉండటంతో ఆ విధంగా కనిపిస్తోంది. చెట్టుకే కన్ను ఉందనిపించేలా ఫోటో తీయడం సాధారణ విషయం కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read : వామ్మో.. ‘జపాన్’లో మరో వింత వ్యాధి.. రోడ్లపైనే పడిపోతున్నారు!