Home Blog Page 8356

టీఆర్ఎస్ నేతకు గాలం వేస్తున్న బీజేపీ.. వర్కౌట్ అవుతుందా?


ఉమ్మడి ఆంధప్రదేశ్ సమయంలో రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్లో ఆయనొకరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ ఈ సీనియర్ నేతకు ఇంటికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో ఎప్పటి నుంచి ఆ నేతకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ముందస్తు ఎన్నికలకు ముందు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికే ఆ నేతకు ఎలాంటి పదవీ లేకపోవడంతో తీవ్ర అంసృప్తితో ఉన్నారని టాక్ విన్పిస్తోంది. దీంతో ఆ నేత ఎవరంటూ టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Also Read: ఆ ఎమ్మెల్యేలను జగన్ నిండా ముంచేశాడు..! ఇంకేం మిగిలిందని?

మండవ వెంకటేశ్వరరావు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో పని చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. అయితే ఇటీవల లోక్ సభ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ తో ఉన్న ఆయన మంచి సంబంధాలు ఉండటంతో మండవ టీఆర్ఎస్ లోకి వెళ్లారు. దీంతో ఆయన ప్రభుత్వం మంచి పదవీ దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పదవీ లేకపోవడంతో మండవ సైలంటయ్యారు.

అయితే లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమితో రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కూడా ఇందూరు జిల్లా నాయకులవైపు పెద్దగా చూసినట్లు కన్పించడం లేదు. ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పుంజుకోవడంతో మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావులకు పదవులు ఖాయమనే ప్రచారం జరిగింది. మండవను రాజ్యసభకు పంపి.. సురేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అయితే అనుహ్యంగా ఎమ్మెల్సీ బరిలోకి కవిత ఎంట్రీ ఇవ్వడంతో సురేష్‌రెడ్డిని కేసీఆర్ రాజ్యసభకు పంపారు. దీంతో మండవకు ఏ పదవీ దక్కలేదు.

Also Read: వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

సీఎం కేసీఆర్ మండవకు ప్రభుత్వ సలహాదారు పదవీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో డీఎస్ కు ఇచ్చినట్లుగానే మండవకు పదవీ ఇస్తారనే టాక్ విన్పిస్తుంది. ఒకవేళ డీఎస్ రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవీకి మండవకు కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే డీఎస్ ఇప్పట్లో రాజీనామా చేసేట్లు కన్పించడం లేదు. ప్రస్తుతానికి ఆయనకు ఏ పదవీ లేకపోవడంతో ఆయన అనుచరులు పార్టీ మారాలని సూచిస్తున్నారట.

ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుంది. మండవను బీజేపీలోకి లాగేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారట. మండవ లాంటి సీనియర్ నేతలు బీజేపీలోకి వస్తే తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారట. అయితే ఆయన బీజేపీలోకి వెళ్తారా? లేక టీఆర్ఎస్ కొనసాగుతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!

ముదురు భామతో సాగే ప్రేమ సీన్స్ హైలైట్ !


‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ అనే మంచి కామెడీ మూవీతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ కి ఆ తరువాత పెద్దగా టైం కలిసి రాలేదు. నిజానికి ఫస్ట్ సినిమా హిట్ కారణంగానే నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆ ఆఫర్ ను కొండా విజయ్ కుమార్ మాత్రం ఉపయోగించుకోలేక.. చైతుకి అట్టర్ ప్లాప్ సినిమాని తీసి చేతిలో పెట్టాడు. దాంతో మనోడి కెరీర్ కూడా సైడ్ కి వెళ్లిపోయింది. ఎట్టకేలకు మళ్లీ చాలా గ్యాప్ తరువాత రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఒరేయ్ బుజ్జిగా అనే మరో రొటీన్ సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా కొండా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడని నమ్మకంగా ఉన్నాడు.

Also Read: అవును.. వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే !

కాగా ఈ చిత్రం కథ గురించి ఓ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూనే.. లవ్ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో ఈ సినిమా ఫుల్ కామెడీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవిధంగా ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ చిత్రంలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే బాగా వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే కామెడీ వర్కౌట్ అవుతుందేమో చూడాలి. ఏమైన తనకు హిట్ ఇచ్చిన ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ గుడ్డిగా ఫాలో ఆవుతున్నట్లు ఉన్నాడు.

Also Read: నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!

కానీ సినిమాల విషయంలో ఒకసారి వర్కౌట్ అయింది.. మళ్లీ అంత తేలిగ్గా వర్కౌట్ అవ్వదు. అయితే రాజ్ తరుణ్ కి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి. సినిమాలో కూడా ‘కామిక్ వే’ స్క్రీన్ ప్లేతోనే సినిమాని నడిపితే.. అప్పుడు కామెడీ హైలైట్ గా నిలిచి.. సినిమాకి ప్లస్ అవొచ్చు. ఇక ఈ లవ్ స్టోరీ విషయానికి వస్తే.. గాలికి తిరిగే ఓ కుర్రాడు తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ప్రేమిస్తే.. జరిగే కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటనే పాయింట్ తో పాటు, ముదురు భామతో సాగే ప్రేమ సీన్స్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట.

ఇకపై మాస్కులు వాడొద్దంటున్న చైనా..!


కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా. వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతున్నాయి. ప్రజలంతా కరోనా పేరుచెబితేనే బెంబెలెత్తిపోతున్నారు. కరోనాకు కారణమైన చైనా మాత్రం వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే చైనాయేతర దేశాలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా చైనా ప్రభుత్వం ఆ దేశంలో ప్రజలెవరూ కూడా మాస్కులు ధరించొద్దని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: పిచ్చి పట్టిస్తున్న హోం ఐసొలేషన్‌?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో అన్నిదేశాలు కరోనా నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు పాటిస్తున్నాయి. చాలా దేశాలు ముఖానికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. భారత్, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలు కరోనా కట్టడిలో భాగంగా ముఖానికి మాస్కులు ధరించడం.. చేతులను శానిటైజర్లో శుభ్రం చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం లాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తున్నారు.

ఇక కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా నిలిచిన చైనాలో ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం ఆసక్తిని రేపుతోంది. దేశ రాజధాని బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన 13రోజులుగా బీజీంగులో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?

కరోనా నిబంధనలు, హోం క్వారంటైన్ ను చైనా కఠినంగా అమలు చేయడం వల్లే అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వమే మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం మాస్కుల్లోనే తిరుగుతుండటం గమనార్హం. ఇంకా పలువురిలో కరోనా భయం పోకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా వింతపోకడలతో ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదం సంగతి అందరికీ తెలిసిందే. మీ కట్టడాలు అక్రమమైనవి అంటే…. మీ కట్టడాలు అన్యాయమైనవి అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు, అధికారులు కాలం గడుపుతున్నారు. ఇక ఈ విషయమై కృష్ణా రివర్ బోర్డు, ట్రిబ్యునల్ వారు, అపెక్స్ కౌన్సిల్ రాజీ చేసేందుకు చూస్తున్న తర్వాత కూడా ఆ విషయం ఇంకా సద్దుమణగకపోవడం గమనార్హం. ఈ నెల ఆఖరి కల్లా అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఈ విషయమై ఒక ఏకాభిప్రాయంతో వస్తారని ఆశ కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే అటు కెసిఆర్ ఇటు జగన్ మొండితనం లో ఎవరికి వారే సాటి

ఇలాంటి సమయంలో ఎన్జీటీ వారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తెలంగాణ తరపు వాదనలు వినేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మళ్లీ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుని రీ- ఓపెన్ చేసేందుకు తెలంగాణ వారు పెట్టుకున్న అప్లికేషన్ ను ఒప్పుకున్నారు. గవినొల్ల శ్రీనివాస్ ఫైల్ చేసిన పిటిషన్ ను మన్నించిన ఎన్జీటీ ఇప్పుడు దీనిపై ఒక తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే ఈ విషయమై కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ఎన్నో సార్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు వాటిని బేఖాతరు చేయడం జరిగింది.

ఇక జగన్ అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పై మరొక అడుగు ముందుకు వేసి టెండర్లకు కూడా ఆహ్వానించాడు. దానితో మన తెలంగాణ ప్రభుత్వం ఇపుడు అపెక్స్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. ఇక తెలంగాణ ప్రభుత్వం వాదన ఏమిటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది జరిగితే దక్షిణ తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారులు అయిపోతాయట.

ఇక అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 25న జరగాల్సి ఉండగా…. జస్టిస్ రామకృష్ణ నేతృత్వంలోని ఈ ఎన్జీటీ బెంచ్ ఈ నెల 28న తెలంగాణ వారి తరఫున వాదన వినేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పట్లో ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎవరికీ ఇష్టం లేనట్టు ఉంది. వరుస పెట్టి కౌన్సిల్ లు, కమిటీలు తీర్పు చెప్పడం…. రాష్ట్ర ప్రభుత్వాలు తన ఇష్ట ప్రకారం నడుచుకోవడం తప్పించి… ఇక్కడ ఏదీ లేదు. ఏమైనా అంటే ఒకరి పై ఒకరు నిందించుకోవడం. ఇక్కడ వ్యర్థమవుతున్న ప్రజా సొమ్ము, విలువైన సమయం ఎవరికీ కనిపించడం లేదు.

అవును.. వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే !


బాలీవుడ్ లో ఆ మధ్య మంచి విజయాన్ని అందుకున్న ‘దే దే ప్యార్ దే’ సినిమా యొక్క రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అప్పుడే దక్కించుకున్నాడు. కానీ సినిమాని మొదలుపెట్టలేదు. ఈ ఏడాది చేయాలనుకంటే కరోనా వచ్చింది. అయితే వచ్చే ఏడాది అయినా ఈ సినిమాని ఎవరితో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడట సురేష్ బాబు. నిజానికి ఈ రీమేక్ ను మొదట వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు. వెంకీ కూడా మొదట్లో ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగానే ఉన్నాడు. కానీ ప్రస్తుతం వెంకీ ఈ సినిమా చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నాడట.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

వెంకీ ఇలా సందేహా పడటానికి కారణం నాగర్జున చేసిన ‘మన్మథుడు 2’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడమేనని.. ఆ సినిమాలో నాగార్జున తన వయసులో సగం వయసున్న అమ్మాయిను ప్రేమించడం అనే కాన్సెప్ట్ ను ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. పైగా వల్గర్ కామెడీ అంటూ ఆ సినిమాని తిప్పి కొట్టారు. ఆ సినిమాలో రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ ఉన్న నాగర్జుననే ప్రేక్షకులు చూడలేకపోయారంటే.. ఇక అలాంటి టైప్ కథలో.. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నన్ను చూస్తారా.. అని వెంకటేష్ డౌట్. ఒకవేళ చూసినా.. ఈ వయసులో నేను రొమాంటిక్ రోల్స్ చేయడం అవసరమా అని వెంకటేష్ ఈ సినిమా పట్ల అయిష్టత చూపిస్తున్నాడట.

Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

వెంకటేష్ ఫీలింగ్ కరెక్టే. ఎందుకంటే ‘దే దే ప్యార్ దే’ కథ కూడా దగ్గర దగ్గర ‘మన్మథుడు 2’ మాదిరిగానే సాగుతోంది. పైగా ఆ కథలో కుటుంబ ప్రేక్షకులు తనను చూస్తారా అని వెంకీ సందేహిస్తునట్లుగానే.. ఖచ్చితంగా చూడకపోవచ్చు. సహజంగానే ఇలాంటి సినిమాలకు మన తెలుగు ప్రేక్షకులు కాస్త దూరంగా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ‘వెంకీ’ అసురన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకీ తరుణ్ భాస్కర్, త్రినాథరావ్ నక్కినతో సినిమాలు చేయాల్సి ఉంది.

నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!


నేచురల్‌ స్టార్ నానికి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. తనను హీరోగా పరిచయం చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటితో తన 25వ సినిమా చేశాడు. తొలిసారి ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఔట్‌పుట్‌ కూడా బాగా వచ్చిందని టాక్‌. దాంతో 25వ మూవీని ప్రత్యేకంగా మార్చుకోవడంతో పాటు ఇంద్రగంటితో హ్యాట్రిక్‌ హిట్‌ కొడతానని నాని కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. వేసవి స్పెషల్‌గా రిలీజ్‌కు అంతా సిద్ధం చేసుకున్న టైమ్‌లో కరోనా దెబ్బకు ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. లాక్‌డౌన్‌ ముగిశాక అయినా రిలీజ్‌ చేద్దామని అనుకుంటే థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేయాల్సి వస్తోంది. వచ్చే నెల 5వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. తన 25వ చిత్రాన్ని థియేటర్లోనే చూపించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నాని వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇష్టం లేకున్నా ఓటీటీకి ఒప్పుకున్నా అతనికి అంతలోనే షాక్‌ తగిలింది.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

మరో 15 రోజుల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కథ లీకైంది. ఈ మేరకు ‘వి’ కథ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమాలో నాని, అదితి రావు భార్యభర్తలు. అయితే, కొందరు వ్యక్తులు అదితిని దారుణంగా హత్య చేస్తారు. అప్పటి నుంచి తన భార్యను చంపిన వాళ్లను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు నాని. ఈ ప్రతీకారంలో భాగంగా కొందరిని వరుస పెట్టి చంపుతూ ప్రతి హత్య దగ్గర ‘వి’ అనే లెటర్ను విడిచి పెట్టి వెళ్తాడు. ఈ హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే పోలీస్‌ ఆఫీసర్ గా సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడు. తనను పట్టుకునేందుకు సుధీర్ వేసే ఎత్తులన్నింటినీ నాని తిప్పికొడుతుంటాడు. అదితి రావును చంపింది ఎవరు? నాని ‘వి’ మార్క్‌ను ఎందుకు వదిలి వెళ్తాడు? సుధీర్ బాబు అతడిని పట్టుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఇలా అనేక ట్విస్టులు ఉండే సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని యూనిట్‌ భావిస్తోంది. నాని నిజంగానే విలనా? అన్నది కూడా ఆసక్తి కలిగిస్తుందట. ఈ సినిమాలో నివేదా థామస్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించింది.

Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

రిలీజ్‌కు ముందే కొంత స్టోరీ లీకవడం నానితో పాటు చిత్ర యూనిట్‌కు తలనొప్పే అయినా.. అసలు కథ మాత్రం సెప్టెంబర్ ఐదో తేదీనే తెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారని సమాచారం. మరోవైపు స్టోరీ లీక్‌ అనేది చిత్ర బృందం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కొన్ని నెలలుగా ల్యాబ్‌లో మగ్గిన ఈ సినిమా రిలీజ్‌ ముందు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బ్రహ్మం గారు చెప్పింది మరోసారి నిజమైంది.. ఏంటంటే?

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వింతలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు సైతం ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. దీంతో బ్రహ్మం గారు చెప్పిన విషయాల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సంవత్సరం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు జరిగాయి ఒక రోగంతో చాలామంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు.

బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ 8 నెలల నుంచి వ్యాప్తి చెందుతున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ కట్టడి సాధ్యమో కాదో తెలిసే అవకాశం ఉంది. తాజాగా బ్రహ్మం గారు చెప్పిన బంగారు తాబేలు గురించి చర్చ జరుగుతోంది.

నేపాల్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన బంగారు తాబేలు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. నేపాల్ దేశంలో బంగారు వర్ణంలో ఉన్న తాబేలును అక్కడి ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. స్వర్ణ వర్ణంలో ఉన్న తాబేలు చూడటానికి ఎంతో ముచ్చట గొలుపుతోంది. భక్తులు తాబేలు దైవ సృష్టి అని చెబుతుండగా వైద్యులు మాత్రం జన్యుపరమైన కారణాల వల్ల తాబేలు బంగారు రంగులో పుట్టినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తాబేళ్లు ఐదు ఉన్నాయని సమాచారం.

అయోధి.. ఆదిపురుష్‌ అయింది.. ఎందుకంటే?


‘ఇండియాలో ఇప్పుడు రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి సోనూ సూద్‌. రెండు ఆదిపురుష్‌’. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌ ఇది. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారందరికీ నటుడు సోనూసూద్‌ ఆపద్భాందవుడయ్యాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను వారి స్వస్థలాలకు తీసుకొచ్చి వారి పాలిట హీరోగా మారాడు ఈ వెండితెర విలన్‌. అందుకే సోషల్‌ మీడియాలో అతని పేరు మార్మోగుతోంది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ‘ఆదిపురుష్‌’ అనే మాట అందరి నోటా నానుతోంది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ ఓ భారీ చిత్రం అనౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే. ‘చెడు మీద మంచి సాధించిన విజయ సంబురం’ అనేది ట్యాగ్ లైన్‌. ఇందులో ప్రభాస్‌ రాముడి గెటప్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. రామరావణుల యుద్ధం ఇతివృత్తంలో సినిమా ఉంటుందని, రూ. 500 పైచిలుకు బడ్జెట్తో‌ టీ సిరీస్‌ దీన్ని తెరకెక్కించనుందని సమాచారం. కాగా ఈ మూవీ గురించి రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాస్‌ సరసన సీతగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను అనుకుంటున్నారని టాక్. తాజాగా ఈ చిత్రం గురించి ఇంకో ఇంట్రస్టింగ్‌ విషయం వెలుగు చూసింది.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్‌ ‘ఆదిపురుష్‌’ కాదట. కథ ఫైనల్‌ అయిన తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్‌, ప్రభాస్‌ ఫస్ట్‌ ‘అయోధి’ అనే పేరు పెట్టాలని నిర్ణయించారట. కానీ, రామ జన్మభూమి ఆయోధ్య పై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పేరు మార్చాలని డిసైటయ్యారని సమాచారం. అనేక చర్చల తర్వాత ‘ఆదిపురుష్‌’ పేరు ఖరారు చేశారట. మరో ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే ఈ మూవీలో హీరోగా తొలుత బాలీవుడ్‌ అగ్ర నటుడు హృతిక్ రోషన్‌ను అనుకున్నారట. ఓ రౌత్‌ అతనికి కథ కూడా చెప్పాడని, కానీ, హృతిక్‌ నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో వెంటనే ప్రభాస్‌ను సంప్రదించారట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషన్‌ కుమార్ ‘రాధేశ్యామ్‌’కు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. ఆయన చొరవతో ప్రభాస్‌కు ఓం రౌత్‌ కథ వినిపించగా.. మన డార్లింగ్‌ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయ‌కుడు రావ‌ణాసురుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ అనుకుంటున్నారు. ఓం రౌత్ తీసిన ‘తానాజీ’లో సైఫ్ విలన్‌గా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో విలన్‌ క్యారెక్టర్కు అతడిని ఎంపిక చేస్తే బాలీవుడ్‌ మార్కెట్‌కు ప్లస్‌ అవుతుందని ఓం రౌత్‌ భావిస్తున్నాడట. సైఫ్‌ కూడా సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు మరో ఐదారు భాషల్లో నేరుగా రిలీజ్‌ కానుంది.

ఫోన్ ట్యాపింగ్: జగన్ సర్కార్ మెడకు ఉచ్చు బిగుస్తోందా?


తెలంగాణలో కేసీఆర్ ను డిపెన్స్ లో పడేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ ను కూడా అదే అస్త్రంతో కొట్టబోతున్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా కోర్టుల ద్వారా నడిపించేస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఏపీలో ఫోన్ ట్యాిపంగ్ వ్యవహారంలో ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయగా.. ఈ వ్యవహారంతో సంబంధం లేని విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్ సోమవారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) ఇప్పుడు జగన్ సర్కార్ మెడకు ఉచ్చుగా బిగుసుకుంటోంది. దీని వెనుక ఎవరున్నారన్నది తెలియకున్నా.. సీఎం జగన్ తోపాటు.. డీజీపీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఈ ఫోన్ ట్యాపింగ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.

Also Read: ఆ ఎమ్మెల్యేలను జగన్ నిండా ముంచేశాడు..! ఇంకేం మిగిలిందని?

సోమవారం దాఖలు చేసిన ఈ పిటీషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తునకు లేదా సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని పిటీషనర్ కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు తొలుత 16మందికి నోటీసులు జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వారి స్పందన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.

ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీ హైకోర్టు తాజాగా సీరియస్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి 16మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో సీబీఐతోపాటు రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ గా స్పందించడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు, టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థకు కళంకం తెస్తున్నారని పీటీషనర్ ఆరోపించారు. న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తెలిసి హైకోర్టు దీనిపై సీరియస్ గా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

Also Read: బాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.!

ఈ క్రమంలోనే ఈ కేసు జగన్ సర్కార్ కు గుదిబండగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది.తెలంగాణలో ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు నాటి సీఎం చంద్రబాబు ఇదే ఫోన్ ట్యాపింగ్ ను కేసీఆర్ పై అస్త్రంగా సంధించారు. ఇప్పుడు అదే అస్త్రంతో జగన్ సర్కార్ ను కొట్టే ప్లాన్ చేశారు. మరి ఇది ఎంతవరకు వెళుతుందనేది వేచిచూడాలి.

అన్ లాక్ 4.0లో వాటికి అనుమతి ఇవ్వనున్న కేంద్రం….?

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. మరో పది రోజుల్లో దేశంలో అన్ లాక్ 3.0 ముగియనుంది. కేంద్రం అన్ లాక్4.0లో భాగంగా సెప్టెంబర్ నెల నుంచి థియేటర్లకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాల‌కు కేంద్రం అన్ లాక్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.

మార్చి నెల చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడ్డాయి. దీంతో చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను చవిచూస్తోంది. సామాజిక దూరం, శానిటైజేష‌న్ వంటి నిబంధ‌న‌లు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వనుందని తెలుస్తోంది. సీటింగ్ సామర్థ్యం, సీట్ల మధ్యలో దూరం లాంటి వాటి గురించి కేంద్రం త్వరలో ఆదేశాలను జారీ చేయనుంది.

వైరస్ విజృంభణ దృష్ట్యా థియేటర్లలో కనీస ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండే విధంగా కేంద్రం జాగ్రత్తలు తీసుకోనుంది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు మాస్క్ ధరించాలనే సరికొత్త నిబంధన కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. థియేట‌ర్ యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వానికి పలుమార్లు థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరాయి. థియేటర్ల యాజమాన్యాల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

కాంటాక్ట్‌లెస్ టికెటింగ్, రెగ్యులర్ శానిటైజేషన్‌తో థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి ఒకరు త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. మరోవైపు పాఠశాలలు, ఆంక్షలు విధించిన వాటి విషయంలో సైతం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.

వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

మన నిజ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా జర్మనీలో సింహం మలాన్ని భారీ మొత్తం చెల్లించి అక్కడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మలాన్ని అమ్మడం ఏమిటి…? సింహం మలానికి అంత డిమాండ్ ఏమిటి…? అనే అనుమానాలు తలెత్తుతున్నాయా…? జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన కొత్త బిజినెస్ గురించి తెలుసుకుంటే ఈ సందేహాలకు సులువుగా సమాధానాలు లభిస్తాయి.

కరోనా వైరస్ విజృంభణ వల్ల జర్మనీలోని ముంచీ అనే ప్రాంతంలోని క్రోనో సర్కస్ కు భారీగా నష్టాలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి సర్కస్ మూతబడటంతో ఉద్యోగులు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో సర్కస్ లో పని చేసే వ్యక్తుల్లో ఒకరు ‘‘సింహం మలాన్ని అమ్ముకుందాం’’ అని జోక్ చేయగా సర్కస్ నిర్వాహకులు ఆ మాటను సీరియస్ గా తీసుకుని మలాన్ని జాడీల్లో పెట్టి అమ్మడం ప్రారంభించారు.

సర్కస్ నిర్వాహకులు తమ దగ్గర ఫ్రెష్ మలం లభిస్తుందని… దానిని ప్రాణ మిత్రులకు బహుమానంగా ఇవ్వాలని ప్రచారం చేశారు. సింహం మలాన్ని బహుమతిగా ఇవ్వడం కొత్తగా భావించిన ప్రజలు పెద్దఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. రోజురోజుకు డిమాండ్ పెరగడంతో మలం గుర్తుతో ప్రత్యేక గుర్తును పెట్టి దుకాణం ఏర్పాటు చేశారు. ఒక్కో సింహం జాడీని మన దేశ కరెన్సీ ప్రకారం 445 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీళ్లు ఊరికే సింహం మలాన్ని విక్రయిస్తుండగా కొందరు సింహం మలాన్ని ఎరువుగా వాడవచ్చని… సింహం మలం క్రిమీసంహాకరంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

జాగ్రత్త: కరోనా సోకిన చిన్నారుల్లో అరుదైన డిసీజ్..!

0

భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ సోకితే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. యువత, మధ్య వయస్కులకు ఎక్కువగా కరోనా సోకుతుండగా చిన్నారులు కూడా తక్కువగానే వైరస్ బారిన పడుతున్నారు. చాలామంది పిల్లలకు కరోనా సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు.

కానీ కరోనా సోకిన రోగుల్లో వైద్యులు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేషన్ సిండ్రోమ్‌ సమస్యను డాక్టర్లు గుర్తించారు. ఈ సమస్య ఉండే వారిలో చర్మం లేదా కళ్లలో మంట, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, మెదడు, గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఎక్కువగా స్పందిస్తే ఈ విధంగా జరుగుతుంది. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎంఐఎస్-సికి చికిత్స అందించిన చిన్నారులను పరీక్షిస్తే వారికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది.

ఈ సిండ్రోమ్ బారిన పడిన చిన్నారులలో ఒకటి కంటే ఎక్కువ రోజులు జ్వరం, డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబారడం, చర్మంపై దద్దుర్లు, నాలుక, పెదాలు ఎర్రగా మారటం, అసాధరణంగా అలసట ఉండటం, పాదాలు లేదా చేతులు ఎర్రబారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కడుపునొప్పి, ముఖం నీలి రంగులోకి మారడం, శ్వాస సంబంధిత సమస్యలు, ఇతర సమస్యలు వీరిలో కనిపిస్తాయి. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

తెలుగు మూవీలో కాల్‌ గర్ల్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!


బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ‘బ్లాక్ రోస్‌’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ మూవీకి యువ దర్శకుడు సంపత్‌ నంది కథ, కథనం అందిస్తున్నారు. నాయికా ప్రాధాన్యం ఈ ఎమోషనల్‌ థ్రిల్లర్ సినిమాతో మోహన్‌ భరద్వాజ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. ఊర్వశి ప్రధాన పోషిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ అందాల తార ఊర్వశి కాల్‌ గర్ల్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం. విలియమ్ షేక్‌ స్పియర్ ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్’లోని షైలాక్‌ క్యారెక్టర్ స్ఫూర్తితో సంపత్‌ ఈ కథను రెడీ చేశాడని తెలుస్తోంది. కేవలం ఊర్వశిని దృష్టిలో ఉంచుకొని మొత్తం కథ రాశాడు. ఈ చిత్ర షూటింగ్‌ ఈ మధ్యే హైదరాబాద్‌లో మొదలైంది. ఊర్వశి కూడా మంగళవారం నుంచి సెట్స్‌కు వస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్‌లో క్రేజ్‌ఉన్న నటి తెలుగు సినిమాకు ఒప్పుకోవడమే కాకుండా… కాల్‌ గర్ల్‌ పాత్ర చేస్తుందంటే ఈ ప్రాజెక్టుపై అప్పుడే ఆసక్తి మొదలైంది.

Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

కాగా, ఈషా రెబ్బాను కాల్‌ గర్ల్‌గా చూపిస్తూ సంపత్‌ ఇది వరకు ఓ వెబ్‌ సిరీస్‌ ప్లాన్‌ చేశాడు. అతని దగ్గర పని చేసిన అశోక్‌ దర్శకత్వం వహించనున్నాడు. అయితే, వెబ్‌ సిరీస్‌కు ఈషా రెబ్బా భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో సంపత్‌ ఆమె స్థానంలో ఊర్వశి రౌతేలాను దింపాడని, వెబ్‌ సిరీస్‌ను కాస్త సినిమాగా మార్చేశాడన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అలాగే, ‘బ్లాక్‌ రోస్‌’ వేరు, వెబ్‌ సిరీస్‌ వేరు అని మరికొందరు అంటున్నారు. రెండు ప్రాజెక్టులు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై సంపత్‌ మాట్లాడితే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఇదిలా ఉంచితే ఊర్వశి పేరు చాలా కాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ కోసం ప్రొడ్యూసర్స్‌ ఆమెను సంప్రదించారన్న వార్తలు వస్తున్నాయి.

గోవా బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమాపైనే


గోవా బ్యూటీ ఇలియానా గుర్తుందా? ఎందుకు గుర్తుండదు. మరిచిపోయే అందమా ఆమెది. తెలుగులో ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్‌ ఆమె. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమెను టాలీవుడ్‌ అక్కున చేర్చుకుంది. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించిన ‘దేవదాసు’తో తెరంగేట్రం చేసిందామె. ఆ సినిమా హిట్‌ అవగా.. రెండో మూవీ ‘పోకిరి’ ఇండస్ట్రీ బ్లాక్‌ బ్లస్టర్ అయింది. ఈ రెండు సినిమాల్లో ఇలియానా అందాలకు తెలుగు యువత ఫిదా అయింది. అంతే, వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. పవన్‌ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, బన్నీ ఇలా టాప్‌ హీరోలందరి సరసన నటించి తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిందామె. కొన్ని ఫ్లాపులు పడ్డా టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న టైమ్‌లో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ గోవా భామ చేతులు కాల్చుకుంది. అక్కడ అవకాశాలు వచ్చినా ఆశించిన సక్సెస్‌ రాలేదు. కొన్ని హిట్లు పడ్డా అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోయాయి.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

దాంతో, నాలుగేళ్లు హిందీకే పరిమితమైన ఆమె మెట్టు దిగి తిరిగి పుట్టింటికి అదే.. టాలీవుడ్‌కు వచ్చేసింది. 2018లో రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌ కావడంతో తెలుగులో మరో చాన్స్‌ రాలేదామెకు. దాంతో, పెట్టె సర్దుకొని మళ్లీ హిందీ దర్శకుల తలుపు తట్టిందామె. కానీ, ఈ రెండేళ్లలో ఇలియానాకు రెండే అవకాశాలు వచ్చాయి. లాస్ట్‌ ఇయర్ రిలీజైన పాగల్‌పంటి ఫెయిలైంది. దాంతో, ఇప్పుడు అభిషేక్ బచ్చన్‌‌తో కలిసి నటించిన ‘బిగ్‌ బుల్’పైనే ఆశలన్నీ పెట్టుకుంది ఇలియానా. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. కుకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో అజయ్ దేవగన్, ఆనంద్ పండిట్, విక్రాంత్ శర్మ, మంగత్ నిర్మించారు.

Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

వ్యాపార రంగంలో ద బిగ్ బుల్‌ గా పిలిచే ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా చేసిన ఆర్థిక నేరారల ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. హర్షద్ మెహతా పాత్రని అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నాడు. ఇలియానా పోషిస్తున్నది ఈ స్కామ్‌‌ని వెలుగులోకి తెచ్చిన లేడీ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అని సమాచారం. అక్టోబర్‌‌లో ‌ రిలీజ్ ఉంటుందని గతంలోనే ప్రకటించింది చిత్ర బృందం. షూటింగ్‌ చివరి దశకు వచ్చేసింది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మూవీని హాట్‌‌ స్టా ర్‌‌‌‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన అతి పెద్ద ఆర్థిక కుంభకోణం బ్యాక్‌‌డ్రాప్‌ తో రూపొందిన ఈ మూవీలో నటించడం ఇలియానా అదృష్టం అనొచ్చు. మరి ఈ చిత్రంతో అయినా హిందీలో ఆమె నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.

రెడ్‌కు రెడ్‌ కార్డ్‌ వేసిన రామ్‌!


ఇది కరోనా కాలం. ఇదే చేస్తామని పట్టుబడితే కుదరదు. ఏ రంగంలో అయినా పట్టువిడుపులు ఉంటాయి. పరిస్థితులకు తగ్గట్టు మెట్టు దిగాలి. ఈ సూత్రం సినీ పరిశ్రమకు బాగా వర్తిస్తుంది. అందుకే తమ బొమ్మను థియేటర్లోనే చూపిస్తామని మడికట్టుకు కూర్చున్న దర్శక, నిర్మాతలు ఇప్పుడు బెట్టు విడుతున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా ఓటీటీలో వదులుతున్నారు. మొన్నటిదాకా చిన్న సినిమాలు మాత్రమే ‘బుల్లి తెర’పై కనిపించగా.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఆ వరుసలో ఉన్నాయి. ఈ విషయంలో బాలీవుడ్‌ ఇప్పటికే ఓ అడుగు ముందుండగా టాలీవుడ్‌ ఇప్పుడిప్పుడే ఓటీటీల దిశగా అడుగు వేస్తోంది.

Also Read: కులాంత‌ర ప్రేమ‌క‌థతో అల్లు అరవింద్ ఫెయిల్ !

నేచురల్‌ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత దిల్‌ రాజు దాదాపు 30 కోట్లకు అమెజాన్‌కు డిజిటల్‌ రైట్స్‌ అమ్మేశాడని సమాచారం. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ కూడా వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్‌ కానుందని సమాచారం. ఇది థియేటర్లో చూపించాల్సిన సినిమా అన్న నిర్మాతలు ఇప్పట్లో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కుతగ్గారు. ఈ మూవీని కూడా అమెజాన్‌ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

రెండు పేరున్న, భారీ ప్రాజెక్టులు ఓటీటీల బాట పట్టడంతో ఇప్పటికే షూటింగ్స్‌ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో రామ్‌ హీరోగా నటించిన ‘రెడ్‌’ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. కిశోక్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య, స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ పెద్ద ఆఫర్తో ముందుకొచ్చిందని సమాచారం. కానీ, హీరో రామ్‌, నిర్మాత రవికిశోర్ ఆ ఆఫర్ను తిరస్కరించారట. దానికి కారణం లేకపోలేదు. ‘రెడ్‌’ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌, తెలుగు శాటిలైట్‌ రైట్స్‌తోనే పెట్టిన బడ్జెట్‌ రికవరీ అయింది. దాంతో, ఆర్థిక పరంగా నిర్మాతపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పటికే పెట్టుబడి మొత్తం తిరిగి రావడంతో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని హీరో రామ్‌ భావిస్తున్నాడని సమాచారం. సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ కావడంతో రిలీజ్‌ విషయంలో అస్సలు రాజీపడొద్దని అతను భావిస్తున్నాడు. అందుకే ‘రెడ్‌’ డిజిటల్‌ రిలీజ్‌కు రెడ్‌ సిగ్నల్‌ వేశాడట.

ఓహో.. ఆ చెవి కమ్మలకు అంత పెద్ద కథ ఉందా..!

మనం ఎంతో కష్టపడి పని చేసి సంపాదించిన సొమ్ముతో కొన్న వస్తువు దూరమైతే ఆ బాధ వర్ణానాతీతం. ఆ వస్తువు దొరికే వరకు మన మనస్సు ధ్యాస అంతా ఆ వస్తువుపైనే ఉంటుంది. ఆ వస్తువు దొరకకపోతే మాత్రం రోజులు గడిచినా ఆ వస్తువు జ్ఞాపకాలు మనల్ని వదలవు. చివరకు ఆ వస్తువు ఏదో ఒక విధంగా మనల్ని చేరితే మాత్రం ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. తాజాగా 20 ఏళ్ల క్రితం పొలంలో పడిపోయిన కమ్మలు చిక్కడంతో బామ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కేర‌ళ‌లోని కాస‌ర్‌గ‌ఢ్ జిల్లాలోని ఈడంపూడి గ్రామానికి చెందిన నారాయణి అనే బామ్మ 20 సంవత్సరాల క్రితం బియ్యం అమ్మితే వచ్చిన డబ్బుల ద్వారా చెవి కమ్మలను కొనుగోలు చేసింది. కష్టార్జితంతో కొనుక్కొన్న కమ్మలు కావడంతో వాటిపై మమకారం పెంచుకుంది. అయితే వరి పొలంలో పని చేసే సమయంలో ఊహించని విధంగా కమ్మలు పొలంలో పడిపోయాయి. ఆ కమ్మల కోసం ఎంతో సమయం వెతికి నారాయణి నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది.

ఇష్టంతో కొనుగోలు చేసిన కమ్మలు మిస్ కావడంతో నారాయణి చాలా బాధ పడింది. 20 సంవత్సరాల తరువాత అదే పొలంలో మట్టిని తవ్వే సమయంలో బేబీకి రెండు కమ్మలు దొరికాయి. బేబీ ఆ కమ్మలు నారాయణి కూతురుకు చూపించగా ఆ కమ్మలు బామ్మవే అని నారాయణి కూతురు చెప్పింది. ఆ కమ్మలను కూతురు నారాయణికి అందించగా కష్టపడి సంపాదించిన సొమ్ము తన దగ్గరకు చేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అప్పట్లో ఆ కమ్మల విలువ 4400 రూపాయలు కాగా ఇప్పుడు 40 వేల రూపాయలు కావడం గమనార్హం.

షాహిద్ కపూర్ తోనా.. ఎన్టీఆర్ ‌తోనా ?


సౌత్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత.. ఆ రేంజ్ డైరెక్టర్ ఎవరు అంటే.. బాలీవుడ్ జనాలు చెప్పే మొట్ట మొదటి పేరు ‘ప్రశాంత్ నీల్’. ప్రశాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ డ్రామా దాదాపు 250 కోట్ల‌ వసూళ్లు సాధించిందంటే.. అది ప్రశాంత్ గొప్పతనమే. దాంతో సహజంగానే ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది పాన్ ఇండియా లెవల్లో. అయితే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్‌తోనా లేక బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తోనా. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని ఫిక్స్ అయ్యారు.

Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. దాదాపు ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అని అనుకున్నారంతా. కానీ, అంతలో షాహిద్ కపూర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలైంది. కాగా తాజాగా ప్రశాంత్ షాహిద్ కపూర్ ని మీట్ అవ్వనున్నారని, కథ చెప్పడానికే కలుస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వార్త నిజం అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం మొదలైనట్టే. ఎందుకంటే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ లాంటి డైరెక్టర్ పడితే.. ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Also Read: కులాంత‌ర ప్రేమ‌క‌థతో అల్లు అరవింద్ ఫెయిల్ !

ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ నీల్ మరో సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది. మరి అప్పుడు ఏ హీరో ఖాళీగా ఉంటాడో.. ఆ హీరోతో సినిమా ఫైనల్ చేస్తాడా లేక ఎన్టీఆర్ తోనే తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల పై మాఫియా కన్ను ఎలా ఉండేది అనే క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.