Home Blog Page 8357

అధిక విద్యుత్ ఉత్పత్తే.. కొంప ముంచిందా?


శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో పరిధిలోకి వచ్చే శ్రీశైలంలోని ఎడమ భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్లో గురువారం సామర్థ్యానికి మించి అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే టాక్ విన్పిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో 150 నుంచి 180 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా నిన్న 200 మెగావాట్లకు మించి విద్యుత్ ఉత్పత్తి అయినట్లు సమాచారం. అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండగానే ఒక్కసారిగా లోడ్ అధిక కావడంతో మంటలు చేలరేగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

ఊహించని విధంగా భారీగా మంటలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. యూనిట్ ను పూర్తిగా షట్ డౌన్ చేశారు. ఇందులో పనిచేస్తున్న 20మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ బృందం మంటలను ఆర్పే ప్రయత్నం చేసి ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 10మందిని ఇప్పటికే కాపాడారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకో తొమ్మిది మంది విద్యుత్ కేంద్రంలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే దట్టమైన పోగ కారణంగా సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద సంఘటనపై మంత్రి జగదీష్‌ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని సీఎం వారిని ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కాపాడేందుకు ఇప్పటికే అధికారులు సింగరేణి సాయం కోరినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

ఈ ప్రమాదం వల్ల తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్దఎత్తున ఆటంకం ఏర్పడటంతోపాటు భారీ నష్టం కలుగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అండగా ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిందేనని పలువరు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కన్పిస్తుంది.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై అనుమానం?

Srisailam Accident

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు   ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది.

Also Read : ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

గతంలో ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 ను తీసుకువచ్చింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ప్రమాదం జరిగిందా? లేదంటే కుట్ర జరిగిందా అని ప్రశ్నించారు.  పొరుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కి.. సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ హెల్ప్ చేస్తున్నారని.. అందుకే ఈ  ప్రమాదం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదాన్ని బట్టి చూస్తే విద్యుత్ ప్రాజెక్టులను చంపే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై నిజనిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.  అప్పుడు జరిగింది ప్రమాదమో.. కుట్ర తెలుస్తోందని ఆరోపించారు. కాగా రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సర్కార్ ఇంతవరకు స్పందించలేదు.

Also Read : మిసెస్‌ గ్లోబల్‌ షో టాపర్‌గా హైదరాబాదీ యువతి

కులాంత‌ర ప్రేమ‌క‌థతో అల్లు అరవింద్ ఫెయిల్ !


మంచి కంటెంట్ సినిమాలనే తన ఓటీటీ సంస్థ ఆహా కోసం తీసుకుంటారనే నమ్మకం రోజురోజుకు పోతుంది. ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి…’ అనే సినిమాని ఆహా సంస్థ ప్రకటించగానే.. టైటిలే విచిత్రంగా ఉంది. సినిమాలో కూడా మ్యాటర్ బాగానే ఉంటుందనే నమ్మకం పెట్టుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది.

Also Read: వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

తనను కాదన్న అమ్మాయి పై అబ్బాయి పెంచుకున్న ద్వేషాన్ని మెయిన్ కథగా తీసుకుని.. ఆ అమ్మాయి కోసం పిచ్చోడై మద్యానికి బానిసైన ఆ కుర్రాడి కథగా వచ్చిన ఈ నాసిరకం ప్రేమ కథకు అల్లు అరవింద్ 70 లక్షల ఎమౌంట్ నే సమర్పించుకున్నాడంటే.. అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ గాడి తప్పిందనే అర్ధం. ఈ సినిమా అసలు బాగాలేదు, మరి అల్లు అరవింద్ ఒక్కడే ఈ సినిమాని ఎందుకు అంతగా నమ్మాడో.. అంత నమ్మకంతో ఈ సినిమాని ఎలా కొనగలిగాడో.. అర్ధం కావడం లేదు.

కాగా ప‌చ్చ‌ని ప‌ల్లెటూరు.. కులాంత‌ర ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో న‌వ‌త‌రం న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించిన ఈ ‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ తాజాగా `ఆహా` ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమాని ఒకసారి స‌మీక్షిస్తే.. ముందుగా కథాక‌మామీషు ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే హీరో బాలు (మున్నా) జీవితంలోని ప్రేమ‌క‌థ వ్యవహారం బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి అనే విలేజీలో ఎలా సాగిందనేదే కథలో మెయిన్ బాగోతం.

Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

మూవీ ఆద్యంతం ల్యాగ్ తో బోర్ ప్లేతో సాగుతూ విసిగిస్తోంది. కామెడీ కూడా ఆశించినంత స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక చెత్త సినిమాగా నిలిచింది. ప‌రువు కోసం ప్రాణం తీసే పెద్ద‌మ‌నుషుల క‌థ‌లో ఎంత సీరియస్ నెస్ ఉండాలి. కానీ ఈ సినిమా సిల్లీ కథనంతో సాగింది. దీనికి తోడు కొత్త నాయ‌కానాయిక‌లు కూడా చెత్తగా నటించారు. చిత్తూరు యాస ప్ర‌య‌త్నించినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

ఈ సినిమాలో ప్ల‌స్ పాయింట్స్‌ అంటూ ఏమి లేవు. మైన‌స్ పాయింట్స్ ను పరిశీలిస్తే.. రొటీన్ ప్రేమ‌క‌థ‌, చెత్త టేకింగ్, క‌థ‌నంలో ల్యాగ్ బాగోతం, బోరింగ్ ప్లే ఇలా ఎన్నైనా ముచ్చటించుకోవచ్చు. మొత్తానికి కామన్ సెన్స్ లేని కులాంత‌ర ప్రేమ‌క‌థ‌లో కనీసం నిజాయితీ కూడా లేదు.

బాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.!


వైసీపీ, టీడీపీ రెండు ఒకే రకమైన విధానాలను అవలంభిస్తాయని ఈ రెండింటి మధ్య ఏలాంటి తేడా ఉండదని కమ్యూనిష్టులు చెబుతుంటారు. రాజకీయ లబ్ధికోసం ఎదుటివారిపై విమర్శలు చేసినా తమ దాఖా వస్తే మళ్లీ అదే విధానాన్ని ఈ రెండు పార్టీల నాయకులు అవలంభిస్తారు. కరోనా భారిన పడి వైసీపీ నేతలు హైదరాబాదు వెళ్లి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పోందడం చూశాం. వీరిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఏంపీ విజయసాయిరెడ్డి, మరి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అంశంపై టీడీపీ అధికార పక్షాన్ని ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యంపై నమ్మకం లేక వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారని విమర్శించింది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

తాజాగా టీడీపీ నాయకులు కరొనా వైరస్ సోకడంతో చికిత్స కోసం హైదరాబాదు వెళ్లడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్లే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా భారిన పడ్డారు. కరొనా టెస్టులో పాజిటివ్ అని తెలియడంతో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బైయిలు మంజూరు చేసింది. కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి కడప నుంచి నేరుగో హైదరాబాదుకు వెళ్లి అక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స పొందుతున్నారు.

Also Read: మోడీ బాటలో పవన్ ?

వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చికిత్స పొందడం తప్పని సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఏండగట్టింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చారు. మరి ఇప్పుడు టీడీపీ నాయకులు కరోనా చికిత్స కోసం హైదరాబాదు పరిగెత్తడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తుంది. కరోనా సోకిన ప్రజల గురించి పట్టించుకోని ఈ నేతలు తమ వరకూ వస్తే మాత్రం ముందు వెనుకా చూడకుండా కార్పోరేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

అచ్చెన్న, జేసీ అరెస్టులు పథకం ప్రకారమే..? ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయ్

Jagan Following KCR Modus-Operandi in Crushing Opposition?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలో ఆయన పాలన పై ప్రశంసల వర్షం కురిసినా…. ఆ తర్వాత మాత్రం నిదానంగా ఎంత మంది విమర్శకులు రాష్ట్రంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక రెండు నెలలు ముందు టీడీపీ నేతల వరుస అరెస్టులు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని సొంతం నివాసం నుండి అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిన తీరు.. ఎప్పుడో జెసి దివాకర్ పైన ఉన్న కేసులను ఒక్కసారిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బయటకు వెలికితీసి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకోవడం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయింది. 

Also Read : మోడీ బాటలో పవన్ ?

అయితే ఇప్పుడు రోజులు గడిచేకొద్దీ టిడిపి నేతలు జగన్…. కుట్రపూరితంగా ఆ అరెస్టులు చేయించారు అన్న వాదనను పక్కన పెట్టేసి పరిస్థితులకు అలవాటు పడిపోతున్న తరుణంలో ఇప్పుడు కొత్త అనుమానాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటివరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన వందల కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కాం కు సంబంధించి ఒక్క రూపాయి అవినీతి సొమ్ము కూడా కూడా బయట పడలేదు. ఇంకా ఏసీబీ అధికారులు మీడియా ముందుకు వచ్చి అచెన్నాయుడుకి ఈ స్కామ్ వలన ఆర్థికంగా రూపాయి కూడా లాభం లేదని అతను కేవలం అధికారులు స్కామ్ చేసేందుకు సహాయ పడ్డాడని తెలపడం జరిగింది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు బలంగా లేకపోవడంతో అతనికి బెయిల్ కూడా వచ్చేసింది. 

ముఖ్యంగా అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఆరోగ్యం బాగాలేకపోయినా రెండు నెలలు విపరీతమైన వరుస విచారణలు జరిపినా కూడా ఒక్కరి పేరూ బయటికి రాలేదు. ఒక్క రూపాయి అవినీతి సొమ్ము కూడా అధికారులు వెలికి తీయలేకపోయారు. ఇన్ని రోజులు ఒక చార్జిషీటు లేదు, కీలకమైన వ్యక్తుల అరెస్టులు లేవు, అవినీతి సొమ్ము వెలికితీత లేదు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మూడు రాజధానులు విషయంలో అటు టిడిపి రాయలసీమ నేతలను…. ఇటు టిడిపి ఉత్తరాంధ్ర నేతల నుండి తామకు ఏమాత్రం వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అరెస్టులతో వారిలో భయం నెలకొల్పి …అదుపులో ఉంచేందుకు వీరిని అరెస్టు చేసినట్లు ఉంది అని కొత్త వాదనలు తెరమీదకు వస్తున్నాయి. 

ఎలాగో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు రాజధాని వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా ఏడ్చి గగ్గోలు పెడతారు. అలాంటి సమయంలో ఉత్తరాంధ్ర నేతలు కూడా వారికి జత కలిస్తే కొత్త చిక్కులు తప్పవు.. అందుకే ముందు జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ రెండు ప్రాంతాల నుండి ఒకరిద్దరు నేతలు ఈ ప్రాంతం నుండి ఒక నేతపై అసలు బలమైన కేసులు కాకపోయినా కావాలని అధికారులను  అధికారులను ఒత్తిడి చేసి వారిపై ఆ కేసులను బనాయించి అరెస్టు చేయించారని అంటున్నారు. మరి ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని మీరంటారా?

Also Read : సీపీ రివార్డు ప్రకటన సరైందేనా?

బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది. అమెజాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం అమెజాన్ పే ద్వారా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డ్ వాల్ట్ పేరుతో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్ ను తాజాగా అమెజాన్ లాంచ్ చేసింది. ఇందుకోసం అమెజాన్ సేఫ్ గోల్డ్ సంస్థతో గోల్డ్ డిపాజిట్ సర్వీసుల కొరకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ 5 రూపాయల నుంచి డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.

Also Read : ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?

గూగుల్ పే, మొబిక్విక్, ఫ్రీచార్జ్ , ఫోన్ పే, పేటీఎం లాంటి సంస్థలతో తాజా సర్వీసుల వల్ల అమెజాన్ పోటీ పడనుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచి సులభంగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెజాన్ అకౌంట్ కలిగి ఉన్నవారు మరింత సులభంగా డిజిటల్ అకౌంట్ ను కొనుగోలు చేయవచ్చు. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో గోల్డ్ ను కొనుగోలు చేయడంతో పాటు అవసరమైతే దానిని విక్రయించవచ్చు.

మొదట పేటీఎం డిజిటల్ గోల్డ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఫోన్ పే డిజిటల్ గోల్డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థలు మూడేళ్ల క్రితమే డిజిటల్ గోల్డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాగా అమెజాన్ తాజాగా ఈ సర్వీసులోకి అడుగుపెట్టింది. ఏ రంగంలో అడుగు పెట్టినా శరవేగంగా దూసుకెళుతున్న అమెజాన్ ఈ రంగంలో కూడా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. మొబిక్విక్ 2018లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాగా గూగుల్ పే 2019లో ఈ సర్వీసులను లాంచ్ చేసింది.

Also Read : ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!

ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?

ఇల్లు, చెట్టు ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే మన ఇంటికి దగ్గరలో కొన్ని చెట్లు ఉంటే మేలు జరుగుతుంది. అదే సమయంలో కొన్ని చెట్లు ఉంటే మాత్రం మంచిది కాదు. ఆ చెట్లు చెడ్డవి కాకపోయినా వాటి వల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాబట్టి ఆ చెట్లు లేకపోతేనే మంచిది. కొన్ని చెట్లు దుష్ప్రభావం కలిగిస్తాయి.

Also Read : ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!

దుష్ప్రభావం కలిగించే చెట్లు మన ఇంటికి సమీపంలో ఉంటే ఇంట్లో ఉండే వాళ్లు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లో ముళ్లు ఉండే చెట్లు, పాలు కార్చే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోను ఉండకూడదు. ఇంటి ఆవరణలో తుమ్మ చెట్లను, రేగు పండ్ల చెట్టులను కూడా పెంచకూడదు. ఈ చెట్లు ఇప్పటికే ఇంటి సమీపంలో ఉంటే వీలైనంత త్వరగా తొలగిస్తే మంచిది. ప్రతికూల ప్రభావం చూపించే ఈ చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే చేసే పనుల్లో ఏకాగ్రత లోపించడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి.

పొడవాటి, సగం ఎండిన, సగం కాలిన వృక్షాలు కూడా సమీపంలో ఉండకూడదు. ఈ చెట్లు ఉంటే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. ఈ చెట్లు పిల్లల చదువు, సక్సెస్ పై కూడా ప్రభావం చూపుతాయి. చింత, మర్రి లాంటి చెట్లు దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. ఈ చెట్లపై దుష్ట శక్తులు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అందువల్ల ఇంటి పరిసరాల్లో ఈ చెట్లు ఎట్టి పరిస్థితుల్లోను ఉండకుండా జాగ్రత్త పడాలి. పెద్దపెద్ద వృక్షాలను ఇండ్లలో పెంచుకుంటే ఇంటి గోడలు, పునాదులు కదిలే అవకాశం ఉంది. అలాంటి చెట్లను పొలాల్లో, ఊరి బయట పెంచితే మంచిది.

Also Read : బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?

ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?


ఉమ్మడి ఏపీ విడిపోయాక.. తెలంగాణ, నవ్యాంధ్ర ఏర్పడ్డాయి. ఆరేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలోనే నీటి పంచాయితీలు మొదలయ్యాయి. కృష్ణా జలాల వివాదం.. అన్నాదమ్ముల వలే కొనసాగుతున్న ఇరురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం తెలుగు రాజకీయాలను వేడెక్కిస్తోంది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

అటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటూ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సాగునీటికే ప్రాధాన్యమిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని తరలించి రాయలసీమలో కరువుఛాయలు దూరం చేసేందుకు భగీరథ యత్నాలు జగన్ మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.

దీంతో ఏపీ, తెలంగాణ జలవివాదంలో బీజేపీ ఎటువైపు నిలుస్తుంది.? ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తుంది? చాలామంది రాజకీయ మేధావులను తొలుస్తున్న ప్రశ్న ఇదీ..

బీజేపీ ప్రస్తుతం జాతీయ పార్టీగా.. దేశాన్ని ఏలుతున్న పార్టీగా అన్ని రాష్ట్రాల్లో ఎదగాలని కోరుకుంటోంది. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య ఏ రాష్ట్రాన్ని ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఏపీని పక్కనపెట్టి తెలంగాణకే మొగ్గు చూపుతోంది.

కృష్ణా నది జలవివాదంలో బీజేపీ మద్దతు తెలంగాణ రాష్ట్రానికే ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉంది. బీజేపీకి కనీసం 1శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీలో దాదాపు సున్నాగానే ఉంది. 2024నాటికి తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

కానీ తెలంగాణలో బీజేపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. బలమైన క్యాడర్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కుదేలు అవుతున్న వేళ తెలంగాణలో నంబర్ 2గా పార్టీ ఎదగడానికి ప్రయత్నిస్తోంది.

Also Read: మోడీ బాటలో పవన్ ?

కాబట్టి నీటి వివాదంలో ఏపీ కంటే తెలంగాణ వాదనలకే బీజేపీ మద్దతు ఇస్తోంది. అందుకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపాలని బీజేపీ తెలంగాణ నేతలు లేఖ రాయగానే.. కేంద్రం ఈ ప్రాజెక్టును ఆపాలంటూ అనుమతి లేదని పేర్కొనడం విశేషం.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్ర బిజెపి మౌనంగా ఉంది, ఇక్కడ తెలంగాణ బీజేపీ శాఖ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగం అని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఓటర్ల సానుభూతి.. మద్దతు పొందాలనే బీజేపీ.. ఏపీ కంటే తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని అర్థమవుతోందంటున్నారు.

పొడిగాలిలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశంలో వేగంగా, పలు దేశాల్లో తక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు వాతావరణానికి సంబంధం ఉందా…? అనే ప్రశ్నకు చాలా అధ్యయనాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు పొడి గాలి, తక్కువ తేమలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తేల్చారు.

Also Read : బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?

ఎమర్జింగ్ డిసీజెస్ జర్నల్‌లో తాజాగా ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యయన పరిశోధకుడు మైఖేల్ వార్డ్ కరోనా వైరస్ వ్యాప్తికి తేమ ఒక ముఖ్య కారకం అని చెప్పారు. గాలిలో సాపేక్ష ఆర్ధ్రత 10 శాతం కంటే తగ్గితే వైరస్ సోకే అవకాశాలు రెండు రెట్లు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రదేశం, సమయాన్ని బట్టి కరోనా వైరస్ వ్యాప్తిలో తేడాలు ఉంటాయని తేల్చారు.

సిడ్నీలో తక్కువ తేమ శాతం ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు గుర్తించామని అన్నారు. తక్కువ తేమ ఉన్న సమయంలో పొడి గాలి ఉంటుందని… తక్కువ తేమలో తుంపరలు చిన్నగా ఉండటం వల్ల తుంపరలు ఎక్కువ సమయం గాలిలో ఉండగలవని శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా రోగి దగ్గినా లేదా తుమ్మినా గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటే వైరస్ ఉండే తుంపరలు ఇతరులు పీల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. తేమ ఎక్కువగా ఉంటే తుంపరలు పెద్దవిగా ఉండి గాలిలో పడిపోతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని శాస్త్రవేత్తలు తేల్చారు.

Also Read : ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?

పిచ్చి పట్టిస్తున్న హోం ఐసొలేషన్‌?

Home Isolation‌

కరోనా వైరస్ కేవలం ఆ వ్యాదికే పరిమితం అవడం లేదు. దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగాపడుతోంది. అనేకమంది మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మానసిక సమస్యలకు గురి అవుతున్నారని ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురం చేసింది. అయితే 95 శాతం మంది తాము మానసిక సమస్యకు గురి అవుతున్నామని అంగీకరించలేకపోతున్నారట. ప్రత్యేకించి కరోనా పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్స్ లు, పోలీసులు తదితరులు మరింత మానసిక సమస్య ఎదుర్కుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్ లు, నర్స్ లు వంటి వారు ఎంతో ధైర్యం చేసి కరోనా వైద్యం చేస్తున్నారు. కాని సమాజంలో వారికి సరైన విశ్వాసం కల్పించడానికి ముందుకు రావడం లేదని వారు బాధపడుతున్నారు. అలాగే పోలీసులు సైతం నిత్యం ఎక్కడో చోట మరణాలు చూసి కలత చెందుతున్నారు. ఇలా ఆయా వర్గాలవారు విపరీతమైన యాంగ్జైటీ, ఒత్తిడి వంటి వాటికి గురి అవుతున్నారు. వీరు మానసిక ప్రశాంతత దిశగా వెళ్లవలసిన అవసరం ఉంది.

మరోవైపు కరోనా సోకి హోం ఐసొలేషన్‌ లో ఉండే వారిలో చాలామందికి చికిత్స సరిగా అందడం లేదు. వారి ఆరోగ్య పరిస్థితిని చాలాచోట్ల పట్టించుకోవడం లేదు. దీంతో అనేకమంది ఆందోళనకు, మానసిక ఒత్తుడులకు గురై మానసిక రోగులుగా మారుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది బాధితులు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ పరిణామం అనర్థాలకు దారితీస్తోంది. ఇంట్లోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమించే ప్రమాదమూ పెరుగుతోంది. దీంతో టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నారు. టెస్ట్ చేయించుకోకపోతే.. కుటుంబంలో ఎవరికి కరోనా ఉందో తెలియక వాళ్ళల్లో వాళ్ళే సతమౌతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక లక్షలమంది హోం ఐసొలేషన్‌ లో ఉన్నారు. ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు కొవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం ఐసొలేషన్‌ లో ఉంచుతున్నారు. వీరి బాగోగుల పర్యవేక్షణ సరిగా లేదు. సరైన వైద్య సలహాలు అందకపోవడంతో బాధితులు ఆందోళనకు గురై సొంతంగా మందులు వాడుతున్నారు. ఈ విషయమై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గత వారం ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంతవరకు బాధితులు నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

మిసెస్‌ గ్లోబల్‌ షో టాపర్‌గా హైదరాబాదీ యువతి


తెలంగాణకు చెందిన చైతన్య పోలోజు మిసెస్ గ్లోబల్ షో టాపర్-2020 కీరిటాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలో వర్చువల్ గా నిర్వహిస్తున్న మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో హైదరాబాద్ కు చెందిన ఎన్నారై యువతి చైతన్య పోలోజు ఈ పోటీల్లో టాపర్ గా నిలిచింది. ఈ షోకు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ డిజైనర్‌ కీర్తి రాథోడ్‌ చైతన్య విజేతగా ప్రకటించారు. హైదరాబాదీ యువతి ప్రతిష్టాత్మకమైన కీరిటాన్ని సొంతం చేసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇంటింటికీ నల్లా.. తెలంగాణనే నెంబర్ వన్

చైతన్య పోలోజు గ్లోబల్ షో టాపర్-2020 కీరిటాన్ని తాజాగా సొంతంగా చేసుకోగా.. 2019లో మిసెస్ భారత్ న్యూయార్క్ కీరిటాన్ని దక్కించుకొని సత్తాచాటింది. చైతన్య ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్‌ ఫెస్టివల్‌కు అందాల సుందరి కోఆర్డినేటర్‌ గా వ్యవహరిస్తున్నారు. టాటావారి ‘తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్‌ గెస్ట్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా మై డ్రీం గ్లోబల్‌ ఫౌండేషన్‌ వర్జీనియా చాప్టర్‌ కో ఆర్డినేటర్‌ గా చైతన్య సేవలందిస్తున్నారు.

Also Read: భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!

చైతన్య అందాల పోటీలతోనే కాకుండా.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్ రంగంలో రాణిసున్న చైతన్య సినిమాల్లో రాణించడమే తన లక్ష్యమని చెబుతోంది. 2019లో మిసెస్ భారత న్యూయార్క్.. 2020లొ మిసెస్ గ్లోబల్ షో టాపర్ కీరిటం దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. మోడలింగ్, అందాల పోటీల్లో రాణిస్తున్న తెలంగాణ యువతి చైతన్య వెండితెరపై త్వరలో మెరవడం ఖాయంగా కన్పిస్తుంది. సినిమాల్లో చైతన్య సత్తా చాటాలని ఆశిద్దాం.

సీపీ రివార్డు ప్రకటన సరైందేనా?


స్వర్ణా ప్యాలెస్ క్వారంటైన్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి బాధ్యులను అరెస్టు చేసే పనిలో పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ వ్యవహారంలో రమేష్ ఆసుపత్రికి చెందిన కొందరిని ఇప్పటికే విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కీలక నింధితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డ్ అందజేస్తామని విజయవాడ సీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంలో అక్కడ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణ విషయంలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. అయితే ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ పై రివార్డు ప్రకటించడానికి ఆయన నక్సలైట్ లేక ఉగ్రవాది కాదు. వైద్యం చేసి డబ్బు తీసుకున్నా… దశాబ్దాలుగా ఎంతో మందికి గుండె చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన వైద్యుడు. ఆ కోణంలోను పోలీసులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో ఆసుపత్రి నిర్లక్ష్యానికి రమేష్ కుమార్ ని బాధ్యుణ్ని చేయడం తప్పు కానప్పటికీ… ఇన్ని రోజులుగా ఆయన ఆచూకీ కనుగొన లేకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించాల్సి వస్తుంది.

విజయవాడ పోలీసులు రమేష్ కుమార్ ఆచూకీ తెలుసుకోకపోవడంలో విఫలమవడం ఒక అంశమైతే, రమేష్ కుమార్ ఆచూకి చెబితే రూ.లక్ష అందజేస్తామంటూ రివార్డు ప్రకటించడం మరో తప్పిదంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎంఎ వంటి సంఘాలు స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో పూర్తిగా ఆసుపత్రి యాజమాన్యాన్నే బాధ్యులను చేయడం సరైంది కాదని విమర్శిస్తున్నాయి. హోటల్ యాజమాన్యం బాధ్యత, అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యత ఉంటుందని అంటున్నారు.

Also Read: భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!

కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీలకు మధ్య కొన్ని రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. తాజాగా విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు రివార్డు ప్రకటనతో ఈ అంశం మరింత వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?

0


చూసి చూసి మన పిల్లలు కళ్లు మండుతున్నాయి. ఫోన్లు, టాబ్, కంప్యూటర్ స్క్రీన్లను రోజంతా చూస్తూ విద్యార్థుల మైండ్ లు హీటెక్కుతున్నాయి. క్రియేటివిటీ చచ్చిపోయి అందరికీ కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు విద్యార్థులందరికీ ఆన్ లైన్ చదువులు పెను భారమవుతున్నాయి.

Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

కరోనా వైరస్ తో మన పిల్లలు చదవులు అటకెక్కాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేవంట.. వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ చదువులు చక్కబడే చాన్స్. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ చదువులతో నెట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలైతే మొత్తం అందులోనే బోధించేస్తున్నాయి. అయితే ఈ విద్యావిధానం విద్యార్థులకు అలవడిందా? వారికి సౌకర్యంగా ఉందా అనే దానిపై తాజాగా జాతీయ విద్యాపరిశోధన మరియు శిక్షణ సంస్థ ( ఎన్సీఈఆర్టీ) సర్వే నిర్వహించింది.

ఆన్ లైన్ విద్యా విధానంతో సర్వేలో పాల్గొన్న 50శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇక క్లాసులకు హాజరు కావాలంటే ఇంటర్నెట్, సిగ్నల్స్, అప్ లోడ్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. ఇక విద్యార్థులకే కాదు టీచర్లకు కూడా ఈ కొత్త సిస్టంతో చికాకులే.. పాఠాలను వీడియో కెమెరాను చూసి చెప్పాల్సి రావడం.. పిల్లలకు అర్థం అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇక పిల్లలకు పాఠాల్లో డౌట్లు వస్తే అంతే సంగతులు. ఇలా బాలారిష్టలతో సాగుతున్న ఆన్ లైన్ చదువులు విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు పెను భారమవుతున్నాయి.

విద్యార్థులకు ఆన్ లైన్ చదువులతో చుక్కలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. స్కూళ్లతో పోలిస్తే ఇళ్లలో ఉండే సౌకర్యాల కొరతతో పాటు ఇతర సమస్యలూ విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆన్ లైన్ చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయని తేలింది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

విద్యార్థులకు ఇళ్ల వద్ద ఉండే వాతావరణంతోపాటు కరెంట్ కోతలు.. ఆన్ లైన్ విద్యకు అవసరమైన ఫోన్ , ట్యాబ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఉందని కేంద్రం సర్వేలో తెలిపింది. 27శాతం మంది విద్యార్థులు కరెంట్ కోతలతో.. 28శాతం విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల కొరతను ఎదుర్కొంటున్నట్టు సర్వేలో తేలింది.

మొత్తం కరోనా చేయబట్టి ఆన్ లైన్ చదువులతో విద్యార్థుల బుర్రలు హీటెక్కుతున్నాయి. వారికి పాఠాలు అంతగా అర్థం కావడం లేదని సర్వేలో తేలింది. ఇలానే సాగితే మన విద్యార్థుల శక్తి సామర్థ్యాలు కనుమరుగైపోతాయి. అందుకే ఆన్ లైన్ విద్యావిధానంపై సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం మార్గదర్శకాలు రెడీ చేయడానికి సిద్ధమైంది. ఈ విధానం లోపభూయిష్టం అని తేలడంతో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది..

-ఎన్నం

పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !


టాలీవుడ్ లో గత నాలుగైదు సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పూజా ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’, లాంటి విజయాలతో పాటు అన్నిటికి మించి ‘అల వైకుంఠపురంలో’ అనే ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. దీంతో ఈ మధ్య ఈ టాల్ బ్యూటీకి డిమాండ్ బాగా పెరిగిందట. పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న హీరోయిన్స్ లో కాజల్, తమన్నా, శ్రుతి హసన్ లాంటి వారు హిట్ ట్రాక్ తప్పడం.. ఒక్క రష్మిక మందన్నా తప్ప పూజాకి పోటీ ఇచ్చే వారే లేకపోవడం.. మొత్తానికి పూజా హెగ్డేకి తిరుగులేకుండా పోయింది.

Also Read: అరె.. హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ !

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శకనిర్మాతలంతా ఇప్పుడు పూజా వైపే చూస్తున్నారట. అందుకే కరోనా కాలంలో కూడా పూజా మాత్రం రెమ్యూనరేషన్ పెంచే ఆలోచనలో ఉందని.. ఒక్కో సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని.. దీనికి తోడు తన మేకప్ అండ్ తన సెటప్ ఖర్చులు కోసం అదనంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వచ్చే నెల నుండి అక్షయ్ కుమార్ తో చేస్తోన్న హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందట ఈ బ్యూటీ. ఆ సినిమాకి ఇలాగే పుచ్చుకుంటుందట. అందుకే టాలీవుడ్ సినిమాలకు కూడా ఇంతే ఇవ్వాలని మేనేజర్ చేత నిర్మాతలకు కబురు పెట్టింది. బాలీవుడ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి.. రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ఉంటుంది.

Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

అంతమాత్రాన అన్ని చోట్లా అంతే ఇవ్వాలంటే.. ఎలా అనేది మన నిర్మాతల అంతర్మథనం. పైకి ఇవ్వం అని చెప్పలేని పరిస్థితి. కొంతమంది హీరోలకు పూజా లాంటి స్టార్ హీరోయిన్ తమ సినిమాలో నటించడం కావాలి. మొత్తానికి తన డిమాండ్ ను అర్ధం చేసుకున్న పూజా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అయిపోతోంది ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కూడా హిట్టైతే 2 కోట్లును కాస్త పూజా 3 కోట్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా ఈ మధ్య పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది.

మోడీ బాటలో పవన్ ?

Pawan modi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగించడంలో మోడీ బాట లో నడుస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ ద్వారా మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని  ఉటంకిస్తూ… రాష్ట్ర ప్రజలకు పవన్ మన దేశీ ఉత్పత్తులను వాడాలని పిలుపునిచ్చారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడమేనని అన్నారు. దీని ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుందని వివరించారు.

Also Read : న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి

గతంలో పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తలెత్తిన అపోహలను పోగొట్టడంలో బీజేపీ సర్కార్ కి పవన్ సహాయం చేసారు. అనేకమైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ముస్లింలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడంలో పవన్ కళ్యాణ్ మోడీ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రజలలో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసేందుకు జనసేన, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఈ వినాయక చవితి నుంచి కార్యక్రమాలు చేపడతాయని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఏ పనైనా ప్రారంభించినప్పుడు విజయం కలగాలని విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి మొదలు పెడతాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వినాయక చవితి పర్వదినాన్ని ఎంచుకున్నామని పవన్ తెలిపారు.

మన పండగల్లో, సంప్రదాయ కార్యక్రమాల్లో మనకి తెలియకుండానే విదేశీ వస్తువులు చేరిపోతున్నాయి. విదేశాల్లో తయారైన దేవతామూర్తుల విగ్రహాలు, పూజా ద్రవ్యాలు, పూజా సామగ్రిలు ఉపయోగిస్తున్నాం. తద్వారా ఆ దేశ అభివృద్ధికి తమకు తెలియకుండానే తోడ్పడుతున్నాం. ఈ వినాయక చవితికి మనం ఏదీ కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా..? లేక విదేశీ ఉత్పత్తా అని చూడాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Also Read : జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

ఉదయం తొందరగా లేచేవారిలో దారుణమైన వ్యాధి.. ఏంటంటే?

మనలో చాలామందికి తెల్లవారుజామునే లేచే అలవాటు ఉంటుంది. అయితే తెల్లవారుజామున లేచేవాళ్లకు మతిమరపు ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. త్వరగా నిద్ర లేచేవారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఉదయం నిద్రతో అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు అర మిలియన్ మందిపై పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read : స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ మంచు.. అసలు ఏమైందంటే?

శాస్త్రవేత్తలు 5 లక్షల మందికి సంబంధించిన జన్యు సమాచారం, నిద్ర విషయాలను లోతుగా విశ్లేషించారు. ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేచేవారిని మార్నింగ్ పీపుల్ అని పిలుస్తారు. వీరిలో సాధారణ వ్యక్తులతో పోలిస్తే అల్జీమర్స్ ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయం త్వరగా నిద్ర లేచే వారు తక్కువ సమయం నిద్ర పోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిద్ర విధానాలు వ్యాధికి కారణం కాకపోయినా వ్యాధి ప్రారంభానికి సంకేతం అని శాస్త్రవేత్తలు తెలిపారు. అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ అబ్బాస్ డెహగాన్ అల్జీమర్స్ కు గురయ్యేవారు ఉదయం త్వరగా నిద్ర లేస్తున్నట్టు కనుగొన్నామని చెప్పారు. అల్జీమర్స్ బారిన పడే ముందు చాలామంది ప్రజలు నిద్రకు సంబంధించిన రుగ్మతలను ఎదుర్కొంటున్నారని అన్నారు. యూరోపియన్లపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని… వివిధ జాతుల ప్రజాలకు ఈ ఫలితాలు వర్తించవని పేర్కొన్నారు. నిద్ర విధానాలు, అల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధాల గురించి తాము పరిశోధనలు చేశామని శాస్త్రవేత్తలు చెప్పారు. అడుకానుమాబ్ మందు ద్వారా వ్యాధి పురోగతిని ఆపవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read : ఒత్తిడితో బాధపడేవాళ్లు యోగా చేస్తే ఏం అవుతుందో తెలుసా?