Home Blog Page 8355

సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం అవుతుందో తెలుసా?

మనం షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లకు వెళ్లిన సమయంలో అక్కడ కనిపించే పెయింటింగ్ లు, బొమ్మలు మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. మరీ ఎక్కువగా నచ్చితే వాటిని వెంటనే కొనుగోలు చేసి హాల్ లో ఉంచుతాం. ఎవరైనా మన ఇంటికి వచ్చిన సమయంలో కూడా వాటిని చూస్తే ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే బొమ్మలు, పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా..? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

Also Read : కేక్‌‌పై క్యాండిళ్లు పెట్టి ఊద‌కూడ‌దు… ఎందుకంటే…?

సీతాకోకచిలుకల బొమ్మలు, పెయింటింగ్స్ మన ఇళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంట్లో సీతాకోక చిలుకల పెయిటింగ్స్ కానీ బొమ్మలు కానీ ఉంటే చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేర్వేరు రంగుల్లో ఉండే సీతాకోకచిలుకలు మార్పునకు సంకేతాలు అని చెబుతున్నారు. వేర్వేరు రంగుల సీతాకోక చిలుకలను చూసిన సమయంలో లక్ష్యాన్ని సాధించిన భావన కలుగుతుందని చెబుతున్నారు

అందువల్లే చాలామంది సీతాకోక చిలుకల పెయింటింగ్స్ ఎక్కువ వెల పడినా కొనుగోలు చేస్తారని చెబుతూ ఉంటారు. ఈస్ట్ లేదా నార్త్ ఈస్ట్ ప్రదేశంలో సీతాకోక చిలుకల పెయింటింగ్స్ పెడితే మంచిదని సూచిస్తున్నారు. ఈశాన్యం మూలలో సీతాకోకచిలుకలను పెట్టడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని పొందగలుగుతామని…. ఈ విధంగా పెడితే వాస్తు ప్రకారం కూడా మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జిని సులభంగా పోగొడతాయని… పెయింటింగ్స్, బొమ్మల వల్ల మంచే తప్ప చెడు జరగదని చెబుతున్నారు.

Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

కేక్‌‌పై క్యాండిళ్లు పెట్టి ఊద‌కూడ‌దు… ఎందుకంటే…?

మనలో ప్రతి ఒక్కరికీ పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుకోవాలనే కోరిక ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలకు ప్రాధాన్యతనిస్తున్నారు. స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకునే పుట్టినరోజు వేడుకలో కేక్ మాత్రం కంపల్సరీ. అయితే పుట్టినరోజు వేడుక, ఇతర వేడుకల్లో ఎవరైనా కేక్ పై క్యాండిళ్లు పెట్టి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అయితే కేక్ పై క్యాండిళ్లు పెట్టి ఊదడం మంచిది కాదని అది చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

కేకులపై కొవ్వొత్తులు పెట్టి ఊదడం శ్రేయస్కరం కాదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మన నోటిపై ఉండే లాలాజలం కేక్ పై పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కేక్ పై పడిన వెంటనే కేక్ అంతటా వ్యాపిస్తుంది. కేక్ పై క్యాండిళ్లను ఊదిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి ప్రమాదం లేదని ఆ వ్యక్తికి రోగాలు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

క్యాండిల్ ఊదిన వ్యక్తికి దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే మాత్రం కేక్ తిన్న వారందరికీ ప్రమాదమే. అందువల్ల క్యాండిళ్లను ఊదే సాంప్రదాయాన్ని విడిచిపెడితే చాలా మంచిది. దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చాలా రోజుల క్రితమే పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. నోటి నుంచి కేక్ పై పడిన బాక్టీరియా పావుగంట సమయంలో 15 వేల శాతం ఎక్కువ‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనుషులకే ఎక్కువగా సోకుతుంది. అయితే జంతువులు సైతం ఈ వైరస్ బారిన పడతాయని పలు పరిశోధనల్లో తేలింది. కుక్కలు, పిల్లులు కరోనా బారిన పడినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో కొందరు పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, కుందేళ్లకు మాస్కులు పెడుతున్నారు. తాజాగా ఒక పాముల వాడు కూడా పాముకు మాస్క్ పెట్టాడు. పాములను ఆడించే వ్యక్తి తాను పాములపై ఆధారపడి జీవిస్తున్నానని పాముకు కరోనా సోకితే ఎలా…? అని ప్రశ్నిస్తున్నాడు.

Also Read : కారులో మంటలు.. పక్కనే ఫైర్ ఇంజిన్.. క్షణాల్లో!

పాముకు మాస్క్ కట్టి తాను ప్రేమగా పెంచుకునే పాముకు కరోనా రాదని ఆ వ్యక్తి గర్వంగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. పామును ప్రేమగా ఆడించి, పెంచుకుంటున్న ఆ వ్యక్తి పేరు గంగారం. ఆ వ్యక్తి పాములాట ఆడించే సమయంలో చుట్టూ గుమికూడే వ్యక్తులు మాస్క్ ను ధరించడం లేదు. పాములాట చూడటానికి వచ్చిన వ్యక్తులకు మాస్కులు పెట్టుకోండని సూచించినా వారు మాట వినడం లేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

వాళ్లు మాస్కులు పెట్టుకోక పోవడం వల్ల పామును ఆడించడం మానేస్తే జీవనం సాగించడం కష్టం. దీంతో పాముకే మాస్క్ కట్టేస్తే ఎటువంటి సమస్య ఉండదని ఆ వ్యక్తి భావించాడు. మాస్క్ కట్టిన బుజ్జిపాముకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాస్క్ తో ఉన్న పామును చాలామంది విచిత్రంగా చూస్తుంటే కొంతమంది మాత్రం పామును ఆడించే వ్యక్తి తెలివిని ప్రశంసిస్తున్నారు. మాస్క్ తో ఉన్న పామును చూడటానికి ఎక్కువమంది వస్తున్నారని గంగారాం కూడా సంబరపడిపోతున్నాడు.

Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

కారులో మంటలు.. పక్కనే ఫైర్ ఇంజిన్.. క్షణాల్లో!

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో మెజారిటీ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు కాగా మరికొన్ని ప్రమాదాలు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రమాదం జరిగినా కొన్ని సందర్భాల్లో అదృష్టం ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. తాజాగా ఒక వ్యక్తి ఊహించని విధంగా ఎదురైన ప్రమాదాన్ని తన తెలివితేటలతో పరిష్కరించాడు.

Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో మంటలు వస్తే ఎవరైనా భయాందోళనకు గురవుతారు. అయితే ఆ వ్యక్తికి మాత్రం అదే సమయంలో పక్కనే ఉన్న ఫైర్ ఇంజన్ కనిపించింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పవచ్చని ఆలోచించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయం కోరాడు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి కారును పైపుల సహాయంతో ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్ పక్కనే ఉండటంతో ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని నక్క తోకలు తొక్కితే ఇలాంటి అదృష్టం వస్తుందంటూ సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏం కాదని ఈ వ్యక్తికి చూస్తే అర్థమవుతోంది.

Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

అయితే పాలకులు.. లేకుంటే మొగుళ్ళు…! ఇదే సోము వీర్రాజు లెక్క

గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా మారిన టిడిపి రోజు రోజుకీ బలహీనపడుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ మాత్రం కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వాన చాలా బలంగా పుంజుకుంటోంది. ఇక కమలనాథులతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఈ విషయమై చాలా ఆశ్చర్యకర అంశాలను తెర మీదకి తీసుకువస్తున్నారు. కొన్ని లెక్కలు అందరూ చెప్పడం ఒక ఎత్తు… ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం మరో ఎత్తు..!

Also Read : లోకేష్ పై వాలింటీర్ ని పెట్టి గెలిపిస్తా

క్రియాశీలక రాజకీయాలలో ఇప్పుడిప్పుడే దూకుడుగా వ్యవహరిస్తూ అసలైన రాజకీయం నడిపేందుకు సిద్ధమైన సోము ఇప్పటికే ఏపీలో బీజేపీకి 25 శాతం మేర ఓటింగ్ ఉన్నట్లుగా ప్రకటించారు. ఎంత లేదన్నా వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రంలో నాలుగోవంతు ప్రభావాన్ని చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వీర్రాజు లెక్కలు కాస్తంత ఆశ్చర్యకరంగా…. ఇంటరెస్టింగ్ గా ఉన్నా కూడా మొత్తం లెక్కేసి చూపిస్తే ఇదీ నిజమే కదా అని అనిపించక మానదు.

ముఖ్యంగా వీర్రాజు చెప్పేది ఏమిటంటే… అధికారపక్షం, విపక్షాలకు వెళ్లకుండా మధ్యేమార్గంగా కనిపిస్తున్న ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో తాము సొంతం చేసుకుంటామని… మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఓట్లు బీజేపీకే అని లెక్కకట్టడం మొదలు పెట్టేశాడు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో బిజెపికి 18 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని వీర్రాజు గుర్తుచేశారు. 1998లో వాజ్ పయి నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి కూడా 18 శాతం ఓట్లతో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశాడు. అంటే ఎంత కాదనుకున్నా ఏపీలో అధికార విపక్షాలకు వెళ్లకుండా మధ్యే మార్గంగా కనిపిస్తున్న పార్టీలకు ఓటు వేసే వారు 18 శాతం అని ఆయన లెక్క.

Also Read : సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

ఇంకా అప్పటితో పోల్చుకుంటే విపక్షాలు ఇప్పుడు టిడిపి ఉన్నంత సాధారణంగా అయితే లేవు. అప్పుడు అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నప్పటికీ బిజెపి బాగానే నెట్టుకొచ్చింది. ఇప్పుడు కనీసం అదే స్థాయిలో ప్రభావం ఎందుకు చూపించదు అన్నది ఆయన ప్రశ్న. అంతేకాకుండా గత ఎన్నికల్లో బరిలోకి దిగిన జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించి మొత్తం కలుపుకుంటే పాతిక శాతం ఓట్లు తమ చేతిలోనే ఉన్నాయి అని తేల్చేశారు.

ఇక ఈ లెక్కలు చూసి రియాలిటీ లోకి వచ్చిన అధికార పక్షం, ప్రతిపక్షం నేతలకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. వీర్రాజు దూకుడుతో ఆ 25 సంఖ్య కాస్తా 40-50 అయితే మొదటికే మోసం వస్తుంది. రాజకీయాల్లో ఏదీ ఒక్క రాత్రిలో జరిగిపోదు. కానీ పెను మార్పులు సంభవించేందుకు మాత్రం ఒక పూట జరిగే పరిణామాలు చాలు. ఇక ఏకంగా అధికారపక్షం పైకి బాణం ఎక్కుపెట్టి 2024లో పాలకులు అవుతారో లేదా ప్రతిపక్షం వెన్ను విరిచి అధికార పక్షానికి మొగుళ్లు అవుతారో కమలనాథులు చేతుల్లోనే ఉంది.

Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?

సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడు హరీష్ రావు రాష్ట్రమంతటా అశేష ప్రజాదరణ కలిగిన నేత. కేసీఆర్, కేటీఆర్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుండి వినిపించే పేరు అతనిదే. కెసిఆర్ కు సొంత వాడైన హరీష్ రావు ని ముఖ్యమంత్రివర్యులు అతని కుమారుడి కోసం కావాలని సైడ్ చేస్తున్నారని వస్తున్న విమర్శలు ఇప్పటివి కాదు. ఇక తాజాగా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరగబోతుందని… కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

దీంతో తెలంగాణ ప్రజలంతా సెటైరికల్ గా అందుకే టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు…. అతని భార్య శ్రీనిత పాల ఉత్పత్తులు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు అని అంటున్నారు. తాజాగా దంపతులిద్దరూ.. తాము ఇలా పాల ఉత్పత్తుల వ్యాపారంలో అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వివరాలను హరీష్ రావు భార్య శ్రీనిత మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.

ముందు నుండి కేటీఆర్ కు, హరీష్ రావు కి పార్టీ నాయకత్వం విషయంలో విభేదాలు ఉన్నాయని తెరాస వర్గాలు చెబుతుంటాయి. ఇక ఎవరికి వారు వర్గాలుగా సపరేట్ గా విడిపోయి ఉంటారు. కెసిఆర్ కూడా వీరిద్దరి మధ్య సయోధ్య లేక అతని కొడుకు వైపు మొగ్గు చూపుతున్నారని…. ఇక హరీష్ రావుని పూర్తిగా సైడ్ చేస్తే అది తన పార్టీ భవిష్యత్తుకి…. తన ప్రస్థానాన్ని కే చెడ్డ పేరు తెస్తుంది అని భావించి హరీష్ రావుని కూడా కలుపుకొని వెళుతుంటారు అన్నది సగం మంది తెలంగాణ ప్రజల భావన.

అయితే హరీష్ రావు మాత్రం తాను ఎప్పుడూ పార్టీ విధేయుడనేనని…. కేసీఆర్ బంటునే అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ కేటీఆర్ ధోరణి మాత్రం కచ్చితంగా అలా ఉండదు అన్నది విశ్లేషకుల మాట. నిదానంగా హరీష్ రావు ప్రాముఖ్యతను పార్టీలో తగ్గించేందుకు అతను ఎన్ని కావాలంటే అన్ని వ్యూహాలు రచిస్తాడని.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతున్న దశలో కేటీఆర్ ఇక హరీష్ రావు పేరుని గులాబీ పార్టీ లో వినపడకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాలు చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నది రాజకీయ నిపుణుల మాట.

ఇక అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది కాబట్టి ఒక బ్యాక్ అప్ ప్లాన్ గా హరీష్ రావు ఈ పాల ఉత్పత్తులు వ్యాపారాన్ని పెట్టారని…. అతని ముందు చూపు కి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అని రాష్ట్ర ప్రజలతో పాటు టీఆర్ఎస్ క్యాడర్ కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి హరీష్ అలాంటి వారందరికీ సమాధానం ఇస్తాడా….? లేక…. కేటీఆర్ అందరూ అంటున్నంత పని చేస్తాడా….?

Also Read : టీఆర్ఎస్ నేతకు గాలం వేస్తున్న బీజేపీ.. వర్కౌట్ అవుతుందా?

మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రావడం లేదు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాజాగా ఈ వైరస్ మరో మూడు కొత్త మార్గాల్లో సోకుతోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈ వైరస్ మనకు తెలిసిన మార్గాల్లో కంటే తెలియని మార్గాల్లోనే వ్యాపిస్తుందని తెలుస్తోంది.

Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

గాలిలో దుమ్ము, పబ్లిక్ రెస్ట్ రూంలు, తక్కువ తేమ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని సమాచారం. తేమ ఎక్కువగా ఉన్న సమయంలో వైరస్ తక్కువగా వ్యాప్తి చెందుతుందని….. తేమ తక్కువగా ఉన్న సమయంలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిలో సాపేక్ష ఆర్ధ్రత తగ్గే కొద్దీ వైరస్ సోకే రేటు పెరుగుతుందని చెప్పారు. తేమ తక్కువగా ఉంటే కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

చైనా శాస్త్రవేత్తలు చేసిన మరో అధ్యయనంలో పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తేలింది. పబ్లిక్ టాయిలెట్స్ లో వైరస్ కణాలు వేగంగా చేరుకోగలవని అందువల్ల బహిరంగ టాయిలెట్స్ లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. మరో అధ్యయనం ప్రకారం గాలిలో దుమ్ము ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే మాస్క్ లను ఉపయోగించడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Also Read : ‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!

గాలిని శుద్ధి చేసే పరికరాన్ని చూశారా ?

0

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రెండడుగుల భౌతిక దూరం పాటిస్తే చాలని చెప్పిన నిపుణులు వైరస్ గాలిలో ఆరడుగుల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read : ‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!

అయితే తాజాగా తెలంగాణకు చెందిన ఒక ప్రొఫెసర్ స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి ఒక పరికరాన్ని రూపొందించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లోని బీవీఆర్ ఐటీ కాలేజ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్ గాలిలో వైరస్ ను నిర్మూలించే పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం వైరస్ నిర్మూలనతో పాటు దుమ్ము, ధూళి కణాలను శుద్ధి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.

గాలిని ఈ యంత్రం సహాయంతో నాలుగు దశల్లో శుద్ధి చేయవచ్చని ఆయన అన్నారు. తొలి దశలో యూవీ స్టెరిలైజేషన్ జరుగుతుందని, రెండో దశలో ఫ్లూడిజేషన్ జరుగుతుందని ఈ రెండు దశల ద్వారా గాలిలో వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. మూడు, నాలుగు దశలలో కార్బన్ డై యాక్సైడ్, గాలిలోని మలినాలను యంత్రం ద్వారా శుద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్లవచ్చని… ఈ పరికరం ధర కేవలం పది వేల రూపాయలు అని చెప్పారు. ఈ పరికరం గాలిలో కరోనా ఉన్నా సోకకుండా సహాయపడుతుంది.

Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!

బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!

సాధారణంగా ఒక మహిళ 18 నెలల్లో ఎంత మంది పిల్లలకు జన్మనివ్వగలదు అనే ప్రశ్నకు ఇద్దరు లేదా ముగ్గురు అనే సమాధానం వినిపిస్తుంది. అయితే ఒక మహిళ మాత్రం 18 నెలల్లో ఏకంగా ఎనిమిది మందికి జన్మనిచ్చింది. ఈ ఘటన జాతీయ ఆరోగ్య మిషన్ లో జరుగుతున్న అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం. బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read : గాలిని శుద్ధి చేసే పరికరాన్ని చూశారా ?

రాష్ట్రంలోని మజఫర్ పూర్ జిల్లా కోఠియా గ్రామంలో 65 సంవత్సరాల వృద్ధురాలు 18 నెలల్లో 8 మందికి జన్మనిచ్చినట్టు రికార్డుల్లో చూపించి జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం కింద ఇచ్చే 2 వేల రూపాయలను ఎనిమిది సార్లు సొంతం చేసుకుంది. అధికారులు ఆధారాలతో సహా చూపించడంతో లీల, ఆమె భర్త షాక్ అయ్యారు. లీల తాను 18 నెలల్లో 8 మంది పిల్లలకు జన్మనిచ్చిన మాట వాస్తవం కాదని చెప్పారు.

తాను 21 సంవత్సరాల క్రితం ఒక మగబిడ్డకు మాత్రమే జన్మనిచ్చానని అన్నారు. లీల అధికారులతో తనపై కేసు నమోదు చేయవద్దని డబ్బులను తిరిగి చెల్లిస్తానని అన్నారు. లీలతో పాటు ఎంతోమంది కేంద్ర పథకం ద్వారా అక్రమంగా డబ్బు పొందుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. ఇలా అక్రమంగా డబ్బు పొందిన లబ్ధిదారులు దాదాపు 50 మంది ఉన్నారని సమాచారం. అధికారులు శాంతాదేవి అనే వృద్ధురాలు ఒకే రోజు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్టు, సబినా ఖాతూన్ అనే మరో వృద్ధురాలి పేరును కూడా జాబితాలో చేర్చినట్టు గుర్తించారు.

Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

లోకేష్ పై వాలింటీర్ ని పెట్టి గెలిపిస్తా

0

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోమారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పీఎం మోదీకి ఫోన్ ట్యాపింగ్ గురించి లేఖ రాశారని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని పీఎంకు, సీఎస్ కు లేఖలు రాస్తున్నారని ఆయన దివాళా తీసిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు అని అన్నారు.

Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

కొన్ని పత్రిల్లో వచ్చిన కథనాల ఆధారంగా చంద్రబాబు లేఖ రాశారని… సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. 30 లక్షల మంది మహిళల జీవితాల్లో నిప్పులు పోసిన చంద్రబాబు అవినీతి సంఘానికి అధ్యక్షుడు అని అన్నారు. జగన్ చేసే కార్యక్రమాలను కోర్టుకు వెళ్లి శిఖండిలా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. నరకాసురుడిలా చంద్రబాబు అడ్డు పడినా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి తీరతామని అన్నారు.

చంద్రబాబు స్కాం బాబు అని చినబాబు సూట్ కేసు బాబు అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో సైతం చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి బయటకు రాకుండా అక్కడి నుంచే జూమ్ మీటింగుల్లో పాల్గొంటున్నారని అన్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ వ్యవస్థపై లోక జ్ఞానం లేని లోకేష్ విమర్శలు చేస్తున్నాడని… అ, ఆలు కూడా రాని లోకేష్ ను చంద్రబాబు మంత్రిని చేశారని చెప్పారు.

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ పై వాలంటీర్ ను పోటీగా నిలబెట్టి గెలిపిస్తామని చెప్పారు. లోకేష్ కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేరని విమర్శలు చేశారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Also Read : అత్యుత్సాహంతో జగన్ ను ఇరుకున పెట్టేసిన వల్లభనేని వంశీ..!

అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

మనం చాలా సందర్భాల్లో ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి అనే సామెతను వింటూ ఉంటాం. అదృష్టం తలుపుతడితే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు సైతం ధనవంతులు కావడానికి ఎంతో సమయం పట్టదు. తాజాగా ఆస్ట్రేలియాలోని బావ బావమరిదిలను అదే విధంగా అదృష్టం వరించింది. ఊహించని విధంగా వరించిన అదృష్టాన్ని చూసి వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also  Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని తరగుల్లా ప్రాంతాల్లో పసిడి దొరుకుతుంది. అయితే చిన్నచిన్న ముక్కలుగా ఆ ప్రాంతంలో బంగారం ముక్కలు లభిస్తాయి. బ్రెంట్ షాన్నొన్, ఇథన్ వెస్ట్ అనే బావాబావమరిదులు కొన్ని రోజుల క్రితం బంగారం కోసం వెళ్లారు. అలా వెళ్లిన వాళ్లకు 2.5 లక్షల అమెరికన్ డాలర్ల విలువైన 3.5 కిలోల బరువైన బంగారం ముద్దలు దొరికాయి. భారత కరెన్సీ ప్రకారం ఈ బంగారం ముద్దల విలువ కోటీ 80 లక్షల రూపాయలు

మెటర్ డికెటర్ సహాయంతో బంగారం నిల్వల కోసం గతంలో ఎవరూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి వీళ్లు పసిడి ముద్దలను కనిపెట్టారు. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మొత్తం రావచ్చని వీళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇథన్ వెస్ట్ నాలుగేళ్లుగా బంగారం అన్వేషణలో నిమగ్నమై చిన్నచిన్న బంగారం ముక్కలను సేకరించాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా భారీ మొతంలో బంగారం సొంతం కావడంతో ఎంతో సంతోషిస్తున్నాడు.

ఏడేళ్ల క్రితం ఈ ప్రాంతానికి సమీపంలో ఒక వ్యక్తికి ఐదున్నర కిలోల బంగారం దొరికింది. 1851 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో బంగారం లభ్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు. గతంలో కళ్ల ద్వారా బంగారం కోసం వెతికితే ఇప్పుడు మెటల్ డిటెక్టర్ల సహాయంలో బంగారం కనిపెడుతున్నారు.

Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?

Buses

కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో లాక్‌ డౌన్ తదితర పరిణామాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరగాల్సిన భేటీ… వాయిదా పడింది. సర్వీసుల పునరుద్ధరణ విషయమై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు జూన్‌ లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తెలంగాణకు 256 బస్సు సర్వీసులను తిప్పుతామని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది.

Also Read : విషాదం.. చనిపోతూ తోటి సిబ్బంది ప్రాణాలు కాపాడారు?

ఈ క్రమంలో… హైదరాబాద్‌ లో మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే… హైదరాబాద్‌ లోని బస్ భవన్‌ లో కరోనా కేసులు నమోదు కావడం, ఇతరత్రా పలు అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. కాగా… అన్‌ లాక్ 3.0 ఆగష్టు 30 తో పూర్తి కానున్న నేపధ్యంలో… వచ్చే వారం టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ నుంచి తెలంగాణకు ఎన్ని బస్సు సర్వీసులు తిప్పాలి ? అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని సర్వీసులు తిప్పాలన్న విషయాలను చర్చించి అధికారులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం తరచూ వాయిదా పడుతుండడంతోపాటు, అసలు సమావేశం ఎప్పుడు జరుగుతుందే విషయమై ఇరు రాష్ట్రాల అధికారుల్లోనూ స్పష్టత లేకుండా పోయింది. అంతేకాదు… ఈ ప్రశ్నకు సమాధానం కూడా దొరకడంలేదు.

Also Read : వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలుస్తారా?

నిన్నటి తోటి నాలుగురోజుల డెమోక్రాట్ల సదస్సు ముగిసింది. వచ్చేవారం రిపబ్లికన్ల సదస్సు జరగబోతుంది. వీటితో నవంబర్ మూడువరకు అమెరికా మొత్తం ఎన్నికల కోలాహలం లో మునిగి తేలుతుంది . కరోనా మహమ్మారి నేపధ్యం లో సహజంగా వుండే డెలిగేట్ల చప్పట్లు, అభిప్రాయ ప్రకటనలు, టివీల కోలాహలం లేదు. అందరూ దృశ్య మాధ్యమం ద్వారానే మాట్లాడారు. నాయకులకు డెలిగేట్ల కేరింతలతో వచ్చే పూనకం ఈసారి ఈ నాలుగురోజుల సదస్సులో చూడలేకపోయాము. అయినా ముఖ్యమైన నాయకులందరూ దృశ్య మాధ్యమం ద్వారా వారి గొంతుకను ప్రజల దగ్గరకి తీసుకెళ్ళటానికి ప్రయత్నించారు. ఇలా నాలుగు రోజుల సదస్సును ప్రత్యక్షంగా వీక్షించటం నాకు ఇదే ప్రధమం. అంతకుముందు కేవలం ముఖ్యమైన నాయకుల ఉపన్యాసాలే వినే వాళ్ళం. అమెరికాలో ఉండటంతో నాలాంటి రాజకీయ ఆసక్తిపరులకు మంచి పండగనే చెప్పాలి.

Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

సదస్సు ప్రధాన ఫోకస్ దేనిపైన?

ఈసారి సదస్సు లో మాట్లాడిన నాయకులందరూ వచ్చే నాలుగు సంవత్సరాల్లో అధికారం లోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేదానికన్నా ట్రంప్ మీద విమర్శకే సమయం కేటాయించారు. అది చూసిన తర్వాత ఇక్కడా మనలాగే రాజకీయాలు నడుస్తున్నాయా అని ఆలోచించాను. మన దగ్గర కూడా 2014, 2019 ల్లో ఇదే జరిగింది. యుపిఏ, వామపక్షాలు వాళ్ళేమి చేయాలనుకుంటున్నారో చెప్పేబదులు మోడీ ని బూచిగా చూపించటం పైనే కేంద్రీకరించారు. అయితే ఒక తేడా వుంది. మోడీ ఎప్పుడూ పత్రికా సమావేశాలు నిర్వహించి తన అభిప్రాయాలు చెప్పేవాడుకాదు. చెప్పాలనుకున్నది ప్రత్యక్షంగా బహిరంగ సమావేశాల్లో ప్రజలకే వివరించేవాడు. కానీ ట్రంప్ అలా కాదు ప్రతిరోజూ పత్రికా సమావేశం నిర్వహిస్తుంటాడు. కాకపోతే తన నోరే తన శత్రువు . దానివలనే సభ్య సమాజం లో ఎంతోమందిని దూరం చేసుకున్నాడు. మహిళల్లో ఎక్కువమంది తనంటే కోపగించుకోవటానికి తన మాటలు , తన ప్రవర్తనే కారణం. ఈ విషయం లో మోడీ కి ట్రంప్ కి పోలికే లేదు. మోడీ కి బలం క్యారక్టర్ అయితే ట్రంప్ కి బలహీనత అదే. కాకపోతే పోలికల్లా బలమైన నాయకుడుగా వున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఒకటవుతారనే వరకే. ఇందిరా గాంధీ విషయం లోనూ ఇదే జరిగింది. ఇక అసలు విషయానికొద్దాం.

సదస్సులో ప్రధానంగా విధానాల పైన చర్చ కన్నా జో బైడెన్ వ్యక్తిత్వం పైనే ఫోకస్ పెట్టటం జరిగింది. కుటుంబం లో భార్యని, కొడుకిని పోగొట్టుకున్న జో బైడెన్ కి కరోనా మహమ్మారి లో చనిపోయిన వ్యక్తుల కుటుంబం లో మనోవేదన ఎలా వుంటుందో అందరికన్నా ఎక్కువగా అర్ధమవుతుందనే విషయం పైనే ఫోకస్ చేశారు. అధ్యక్ష పదవి కి గౌరవం తీసుకురావటానికి జో తగిన అర్హుడని చెప్పటం జరిగింది. అంటే ఇప్పుడున్న అధ్యక్షుడి వలన ఆ గౌరవం పడిపోయిందని పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా చెప్పటం జరిగింది. అధ్యక్ష పదవి లో వుండే వ్యక్తికి క్యారక్టర్ చాలా ముఖ్యమని నొక్కి వక్కాణించారు. అవి ట్రంప్ కి లేవనీ చెప్పటం జరిగింది. ద్వేష భావాల్ని రెచ్చగొట్టటం కాదు అందరినీ కలుపు కెళ్ళటం చాలా అవసరమని ఆ పని ట్రంప్ చేయలేదనీ జో అయితే ఖచ్చితంగా చేస్తాడని చెప్పటం జరిగింది. జో బైడెన్ అయితే ఈ ఎన్నికలు అమెరికా దేశపు ఆత్మ కోసం ( Soul of the Nation) జరుగుతున్నాయని ఉద్ఘాటించాడు. ఒబామా ఇంకో అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించబడాలంటే ట్రంప్ ఓటమి అవసరమని చెప్పాడు. మొత్తం మీద ఈ సదస్సు మొత్తం ట్రంప్ కొనసాగితే సమాజానికి, అమెరికా విలువలకి ఎంత ప్రమాదమో అనే థీం మీదే నడిచినాయనే చెప్పొచ్చు. అందులో భాగంగానే జో బైడెన్ వ్యక్తిత్వం, హుందాతనం, అందర్నీ కలుపుకుపోయే తత్త్వం, క్యారక్టర్, సమాజం పై వుండే నిబద్ధత, దయాగుణం లాంటి లక్షణాల పైనే ఫోకస్ పెట్టి అవి ఏ విధంగా ట్రంప్ లో లేవో అనేది ప్రజల్లోకి చొప్పించాలనే తాపత్రయం కనబడింది. జో బైడెన్ ఉపన్యాసం విధానాల పైనకన్నా వీటిపైనే ఫోకస్ చేయటం జరిగింది. దీనిపై ప్రజల్లో సానుకూల స్పందన కనబడింది.

ఇలా జరగటానికి కారణం గత నాలుగు సంవత్సరాల్లో ట్రంప్ ప్రవర్తించిన తీరే. నోరు పారేసుకోవటం లో పిహెచ్ డి సంపాదించాడు. ముఖ్యంగా మహిళల్లో తర తమ భేదం లేకుండా అందరూ అసహ్యించుకునే స్థాయికి వచ్చారంటే తన ప్రవర్తన వలనే. అదేసమయం లో ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ పాలన బాగానే వుందని చెప్పొచ్చు. ఉద్యోగ కల్పన లో మంచి పురోగతి సాధించాడు. వ్యాపారం, ఆర్ధిక వృద్ధి కూడా మంచి ఫలితాలనే ఇచ్చాయి. వ్యక్తిగత పన్నులు, కార్పోరేట్ పన్నులు, సన్న, మధ్యతరగతి వ్యాపారస్తుల పన్నులు తగ్గించి పన్ను సానుకూల నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదంతా కరోనా మహమ్మారి రాకముందు. కరోనా మహమ్మారి తో ఒక్కసారి పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఈ మహమ్మారి ని అరికట్టడంలో ఎన్నో వివాదాస్పద ప్రకటనలతో మరింతమందిని దూరం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి రాకుండా వుండివుంటే తన ప్రవర్తన , క్యారక్టర్ లో ఎన్ని లోపాలున్నా తిరిగి ప్రజలు పట్టంకట్టే అవకాశాలు ఎక్కువగానే ఉండేవి. ఎందుకంటే ఆర్ధిక వృద్ధి, ఉద్యోగ కల్పన ప్రధాన ఎన్నిక అంశాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు షుమారు ఒక లక్ష డెభై ఐదువేలమంది మరణించిన తర్వాత అదే అంశం ప్రధాన అంశంగా మారటం సహజమే. కనీసం రోజూ పత్రికా సమావేశం నిర్వహించి నోటి దూల తీర్చుకోకుండా వుండి వుంటే ఇంత ప్రతికూల వాతావరణం ఏర్పడి  వుండేది కాదు. ఈ నాలుగు రోజుల డెమొక్రాట్ల సదస్సు లో ట్రంప్ ప్రవర్తన, వ్యక్తిత్వం పైనే కేంద్రీకరించటం వ్యూహాత్మక ఎత్తుగడనే. విధానాల కన్నా బరిలో వున్న ఇద్దరి వ్యక్తిత్వాలపైనే ఈ సదస్సు ఫోకస్ చేయటం  దాన్ని ప్రజలు సానుకూలంగా తీసుకోవటం ఈ వ్యూహం సరయినదేనని అర్ధమవుతుంది.

Also Read : బ్రహ్మం గారు చెప్పింది మరోసారి నిజమైంది.. ఏంటంటే?

డెమోక్రాట్లు ఐక్యంగా వుంటారా?

ఇది అందరిలో తొలుస్తున్న ప్రశ్న. దీనికి కూడా ఈ సదస్సు లో సమాధానం దొరికింది. ప్రతిపాదిత ఆర్ధిక, సామాజిక, దేశ భద్రతా అంశాలు చర్చకు వచ్చివుంటే వీళ్ళ మధ్య వున్న ఆంతరంగిక విభేదాలు బయకి వచ్చి ఉండేవి. ఎందుకంటే ఇటీవలి కాలంలో వామపక్ష ఉదారవాదులు గా , అభ్యుదయ వాదులు గా పిలవబడే వాళ్ళు డెమోక్రటిక్ పార్టీలో చురుకుగా ముందుకొచ్చారు. వీరు కొన్ని చోట్ల దిగ్గజాలనుకున్న వారిని ప్రైమరీల్లో ఓడించటం పెద్ద సంచలనం సృష్టించింది. కానీ ఈ సదస్సులో వాళ్ళు ఆ విధానాలను ముందుకు తీసుకొచ్చి వివాదం సృష్టించాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే అందరికీ ఎలాగైనా ట్రంప్ ఓడిపోవాలని బలంగా వుండటం తో వివాదాలను పక్కకు పెట్టి ఇక్యతను ప్రదర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే ట్రంప్ వీళ్ళ మధ్య ఐక్యతకు పరోక్షంగా దోహదం చేసాడని చెప్పొచ్చు. రెండోది, జో బైడెన్ వివాద రహితుడు కావటం. అందరినీ కలుపుకోనిపోయే గత చరిత్ర వుండటం కూడా దోహదం చేసింది. మూడోది, వామపక్ష ఉదారవాద ప్రభావం తో పార్టీ పనిచేస్తుందనే భావాన్ని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కూడా వైరి పక్ష విమర్శలకు తావివ్వకుండా చేసింది. నాలుగోది అందులో భాగంగా ట్రంప్ కి వ్యతిరేకంగా వున్న రిపబ్లికన్లను సదస్సులో మాట్లాడటానికి ప్రాధాన్యత కల్పించి మధ్యస్థ వోటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయటం. ఇలా మొత్తం మీద ఈసారి డెమోక్రాట్లు ఒకేమాట మీద వున్నారని దానితోపాటు రిపబ్లికన్లలో కూడా కొంతమంది ఈసారి బైడెన్ గెలవాలని కోరుకుంటున్నారనే భావన తీసుకు రావటానికి కృషి చేసారు. చాలావరకు ఈ వ్యూహంలో విజయవంతమయినట్లే కనిపిస్తుంది.

దానితోపాటు ముందుగానే వామపక్ష ఉదారవాద ఆర్ధిక విధానాల వైపు మొగ్గు చూపటం లేదనే సంకేతాలు బైడెన్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే వామపక్ష వుదార వాద అజెండా అయిన ” అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత కాలేజీ విద్య, విద్యార్ధులకు సంబంధించిన రుణాలు రద్దు, స్వేచ్చా బోర్డర్లు, కొత్త వాతావరణ ఒప్పందం, వలసవాద పర్యవేక్షణ రద్దు, పోలీసులకు నిధుల రద్దు, రక్షణ బడ్జెట్ లో కోత, షేల్ సాంకేతికతతో జరిపే ఇంధన తవ్వకాల నిషేధం, ఇజ్రాయెల్ పై ఆంక్షలు” లాంటి అంశాలను ఆమోదించలేదు. కాకపోతే సామాజిక, సాంస్కృతిక అంశాల్లో మధ్యేవాదులకు, అభ్యుదయ వాదులకు పెద్దగా అంతరం లేదు. వామపక్ష అభ్యుదయ వాదులు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఎన్నికల వరకూ వీటిపై మాట్లాడకూడదని ఆ తర్వాత ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఐక్యత ఎన్నికల వరకేనని తర్వాత అంతరంగిక యుద్ధం కొనసాగుతుందని చెబుతున్నారు.

మొత్తం మీద చూస్తే ఈ సదస్సు వాళ్ళు అనుకున్న వ్యూహం ప్రకారం విజయవంతమయ్యిందనే భావనలో వున్నారు. కానీ రిపబ్లికన్లు మాత్రం అప్పుడే ఈ సదస్సు పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అసలు చైనా పై విమర్శ కాదు కదా దాని ఊసు కూడా ఎత్తలేదని, అలాగే ఇటీవల జరిగిన షాపుల లూటీ , ఆస్తుల ధ్వంసం లాంటి హింసాత్మక సంఘటనల పై నోరు మెదపలేదనీ, అధిక పన్నులు వేయబోతున్నారని, వామపక్ష తీవ్రవాదులు పార్టీని , పార్టీ అజెండా ని హైజాక్ చేసారని ప్రచారం మొదలుపెట్టారు. వచ్చేవారం నాలుగురోజుల రిపబ్లికన్ల సదస్సు జరగబోతుంది. దానితో వారి వ్యూహం, ఎత్తుగడలు కూడా బయటకొస్తాయి. తర్వాత ఇద్దరి అభ్యర్ధుల మధ్య మూడు టివి డిబేట్లు జరుగుతాయి. వీటితోపాటు వలసవిధానం, భారత్ అమెరికా సంబంధాలు లాంటి అంశాలపై, ఎన్నికల్లో ఎవరికి విజయావకాశాలు లాంటి అన్ని అంశాలపై కూడా సవివరంగా రాబోయే రోజుల్లో మా అభిప్రాయాలు మీ ముందుంచుతాము, వేచి చూడండి.

Also Read : న్యాయవ్యవస్థకు శస్త్రచికిత్స జరగాలి

ఎన్నికల నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు ఇవే..!

Elections

దేశంలో వివిధ రాష్ట్రాలలో మున్ముందు జరగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బీహార్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా భయం వెంటాడుతున్న వేళ నామినేషన్‌ దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు తదితర సమయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచిస్తూ గతంలో ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.

Also Read : అత్యుత్సాహంతో జగన్ ను ఇరుకున పెట్టేసిన వల్లభనేని వంశీ..!

కీలక మార్గదర్శకాలివే..

  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ఈవీఎంలపై ఓటు వేసేందుకు ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇవ్వాలి.
  • ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి.
  • అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌ లైన్‌ లోనే సమర్పించి ఆ తర్వాత ప్రింట్‌ కాపీని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి.
  • నామినేషన్‌ సమయంలో డిపాజిట్‌ చేయాల్సిన మొత్తాన్ని ఆన్‌ లైన్‌ ద్వారానే చెల్లించాలి. ఇలా చేయడం ఇదే తొలిసారి.
  • కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించుకోవచ్చు.
  • ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో పాటు ఐదుగురు మించొద్దు.
  • పోలింగ్‌ కేంద్రం వద్ద థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
  • పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశ/ నిష్క్రమణ ప్రదేశాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి.
  • కరోనా లక్షణాలు ఉన్నవారికి చివరి గంటలో ఓటు వేసేందుకు వీలుగా టోకెన్లు జారీ చేయాలి.
  • భౌతికదూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చేయాలి.
  • బీఎల్‌వోలు, వాలంటీర్లు భౌతికదూరం నిబంధనలు సరిగా జరిగేలా చూడాలి.
  • పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాస్క్‌, శానిటైజర్‌, ఫేస్‌ షీల్డ్‌, గ్లౌజ్‌లు సమకూర్చాలి.

ఓట్ల లెక్కింపు ఇలా..

  • ఓట్లు లెక్కించేటప్పుడు ఒక హాల్‌ లో ఏడు టేబుళ్ల కంటే ఎక్కువ అనుమతించరు.
  • ప్రతి నియోజకవర్గంలో మూడు నాలుగు హాళ్లు ఏర్పాటు చేసి అదనపు సహాయ రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు.
  • వీవీప్యాట్‌ లను లెక్కింపునకు ముందు శానిటైజ్‌ చేయాలి. లెక్కింపు కేంద్రాలను కూడా లెక్కింపునకు ముందు, తర్వాత శానిటైజ్‌ చేయాలని ఈసీ ఆదేశించింది.

Also Read : మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?

కరోనా వ్యాక్సిన్ కి ఫిక్సయిన రేట్?

0

 

Corona Vaccine

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ ని కనుగొనుటకు అనేక మంది శాస్త్రవేత్తలు బహుగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కోవిద్ ని ఎదుర్కోవడానికి చైనా టీకా తెచ్చి సాయం చేస్తా అన్నా.. అది అందుకోవడం ప్రపంచానికి భారంగానే మారేట్లుంది. చాలా దేశాలు ప్రతి ఒక్కరికీ టీకా అందేట్లు చేయాలనే లక్ష్యంతో కొనుగోళ్లకు పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు టీకా ధరలు పెనుభారం కాకుండా చూసుకొంటున్నాయి. కానీ, చైనాకు చెందిన సినోఫార్మా నిర్ణయించిన ధర చూస్తే బెదిరిపోవాల్సిందే. ఇప్పటికే మూడో దశ క్లీనికల్‌ ట్రయల్స్‌‌ మొదలుపెట్టిన ‘సినోఫార్మా’ వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

Also Read : ఇకపై మాస్కులు వాడొద్దంటున్న చైనా..!

ఇటీవల సినోఫార్మ ఛైర్మన్‌ లి జింగ్‌జాన్‌ మాట్లాడుతూ తమ టీకా 1000 యువాన్లలోపే ఉంటుందని పేర్కొన్నారు. అంటే అమెరికా కరెన్సీలో దాదాపు 144డాలర్లు. దీనిని నేటి విలువ ప్రకారం భారత కరెన్సీలోకి మారిస్తే రూ.10,791. దీంతో పోల్చుకుంటే అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసే టీకా రెండు డోసుల ధర 37 డాలర్లలోపు ఉంటుంది. మన రూపాయిల్లోకి మారిస్తే రూ. 2,773 ఉంటుంది. ఇక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న టీకా ధర రెండు డోసులు కలిపి ఆరు డాలర్లు ( రూ.550) ఉండొచ్చు. ఇక భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ ధర మిగిలిన వాటి కంటే చౌకగానే ఉంటుందని ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్ల ఇప్పటికే తెలిపారు.

ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించిన రష్యా టీకా ధర మాత్రం వెల్లడికాలేదు. త్వరలోనే దీని ధరను కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారత్‌ కంపెనీలు కూడా ఈ వ్యాక్సిన్‌ పై ఆసక్తి చూపిస్తున్నట్లు రష్యా ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రియేవ్‌ వెల్లడించారు. భారత్‌ లో తయారయ్యే పక్షంలో వీటి ధర గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. ఒకవైపు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు జరుగుతుండగా వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో కరోనా వైరస్ కు సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 11 కొత్త లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

కండరాల నొప్పులు, రుచి, వాసన తెలియకపోవడం, ఆయాసం, జ్వరం, జలుబు, పొడి దగ్గు, కళ్లు ఎర్రబారడం, జుట్టు రాలిపోవడం తదితర లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా బారిన పడిన కొంతమంది రోగుల్లో ఎక్కిళ్లే ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. అయితే వేగంగా విజృంభిస్తున్న ఈ వైరస్ మన దేశంలో మరికొన్ని రోజుల్లో తగ్గుముఖం పట్టబోతుందని తెలుస్తోంది. ఇండియా ఔట్ బ్రేక్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సెప్టెంబర్ తొలివారానికి కేసుల సంఖ్య పెరుగుదల గరిష్ఠానికి చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. తొలి దశలో ముంబై, ఢిల్లీ నగరాల్లో భారీగా కేసులు నమోదు కాగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజా నివేదిక ప్రకారం వైరస్ ను ఎదుర్కొనే శక్తి భారతీయుల్లో క్రమంగా పెరుగుతోంది. చెన్నైలో అక్టోబర్ చివరి నుంచి వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ నివేదికలో వెల్లడైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యస్థాయి నగరాలపై దృష్టి పెట్టాలని ఈ నివేదిక వెల్లడించింది.

Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!


టాలీవుడ్‌లో మల్టీస్టారర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన విక్టరీ వెంకటేశ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2, తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో వెంటవెంటనే రెండు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’కు రీమేక్‌ ఇది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేటివిటీ ప్రకారం కథలో కొన్ని మార్పులు చేశారు. చిత్తురు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే నారప్పలో వెంకీ భార్య పాత్రను ప్రియమణి పోషిస్తోంది. వెంకీకి ఇది 74 చిత్రం. ఇప్పటికే షూటింగ్‌ మొదలవగా కరోనా రాకతో దానికి బ్రేక్‌ పడింది.

Also Read: తెలుగు మూవీలో కాల్‌ గర్ల్‌గా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ!

దాదాపు ఐదు నెలలుగా షూటింగ్‌కు విరామం రావడంతో తదుపరి సినిమాపై వెంకీ దృష్టి పెట్టాడు. వచ్చే సినిమా తన 75వ చిత్రం కావడంతో దాన్ని ప్రతేక్యంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. తన మైల్‌ స్టోన్‌ మూవీకి తగ్గ కథ కోసం అన్వేషణలో పడ్డాడు. ఈ క్రమంలో పలువురు టాప్‌ డైరెక్టర్లతో వెంకీ సంప్రదింపులు జరిపాడు. ఆ లిస్ట్‌లో పూరి జగన్నాథ్‌, కిషోర్ తిరుమల, త్రినాథ రావు నక్కిన, తరుణ్‌ భాస్కర్ పేర్లు వినిపించాయి. ఈ నలుగురూ వెంకీ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పాయింట్‌తో కథలు సిద్ధం చేశారట. కానీ, ఇవేవీ వెంకటేశ్‌కు నచ్చలేదట. దాంతో, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను లైన్లో పెట్టాడని సమాచారం. వెంకీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో సినిమా వస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలొచ్చాయి. కానీ, ఇన్నాళ్లకు వారిద్దరి ప్రాజెక్ట్‌ సెట్‌ అయిందట. అది వెంకీ మైల్‌స్టోన్‌ 75వ చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. త్రివిక్రమ్‌ ఇప్పటికే కథ రెడీ చేసి వెంకీకి వినిపించగా అతను వెంటనే ఓకే చెప్పాడట.

Also Read: నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!

‘అల వైకుంఠపురములో’తో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సి ఉంది. దీనికి ‘అయిననూ పోయిరావాలె హస్తినకు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించాడు త్రివిక్రమ్‌. కానీ, కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ వాయిదా పడింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కాబట్టి ఎన్టీఆర్ తో మూవీ ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో, ఈ విరామంలో వెంకీతో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. దీనిపై తొందర్లోనే ప్రకటన వచ్చే చాన్సుంది. పూరి సహా నలుగురు డైరెక్టర్లను కాదని మరీ వెంకీ… త్రివిక్రమ్‌కు ఓకే చెప్పాడంటే ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.