Home Blog Page 8330

కరోనాపై మరో అధ్యయనం.. షాకింగ్ న్యూస్

0

covid 19కరోనా పేరు చెబితే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరికి ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మందికి కరోనా బారినపడ్డారు. కొంతమంది కరోనాను జయించి బ్రతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా విషయంలో రోజుకో షాకింగ్ న్యూస్ బయటపడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా కరోనా గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

జిత్తులమారి కరోనా ఉసిరివెల్లిలా రంగులు మారుస్తూ సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికీ కూడా సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనా గురించి రోజుకో విషయం వెలుగు చూస్తుండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అది ఏమేరకు పని చేస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ గాలి ద్వారా ఎక్కువగా వ్యాపిందని ప్రకటించింది. అయితే తాజాగా అధ్యాయనంలో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిస్తుందని తేలింది. గాలి ద్వారా 7 నుంచి 8మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా వైరస్ సోకుతుందని వెల్లడైంది.

కరోనా తొలినాళ్లలోనే బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి 24మంది కరోనా వ్యాపించింది. దీంతో అప్పట్లోనే గాలి ద్వారా కరోనా సోకుతుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో మాస్కుల నిబంధన లేకపోవడంతో గాలి ద్వారా వారికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే గాలిలో కరోనా వైరస్ ఎక్కువ దూరం ప్రయాణించలేదని పలు వైద్య సంస్థలు ప్రకటించడం అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ప్రతీఒక్కరు మాస్కులు ధరిస్తున్నారు. భౌతికదూరం పాటించడం.. చేతులను శుభ్రం చేసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. తాజాగా గాలి ద్వారా కూడా వైరస్ సోకనుందని తేలడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సరిహద్దుల్లో సంపుకుంటున్నారు!

ఇప్పుడు ఏపీలో అన్నిటికంటే ప్రియమైనది ఏదో తెలుసా? ఇంకేముందీ ‘మందు’. అవును ఏపీలోని జగన్ సర్కార్ మద్యపాన నిషేధం దిశగా ఎప్పుడైతే మద్యం ధరలు రెండింతలు చేసిందో అప్పటి నుంచి ఏపీ జనాలు ఒర్రి చస్తున్నారు. ధరలకు తాళలేక పక్క రాష్ట్రాల నుంచి చీప్ మద్యం ఏపీకి పోటెత్తుతోంది. ఇక బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో దొరకకపోవడంతో తెలంగాణ నుంచి అది అక్రమంగా చేరుతోంది. ఏపీలో ఏవేవో పేర్లతో లోకల్ బ్రాండ్లను విపరీతమైన ధరలతో అమ్ముతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ విభాగాన్ని పెట్టి మరీ ఒక్క బాటిల్ బయట రాష్ట్రం నుంచి తెచ్చినా స్వాధీనం చేసుకొని కేసులు పెడుతోంది. దీంతో కొందరు హైకోర్టుకు ఎక్కగా..  వేరే రాష్ట్రం నుంచి ఒక్కో వ్యక్తి మూడు ఫుల్ బాటిల్స్ కు మించకుండా తెచ్చుకోవచ్చని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇదో లాభసాటి వ్యాపారంగా మారిందట..

హైకోర్టు తీర్పు రాగానే తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోంచి జనాలను పంపిస్తూ ఒక్కొక్కరిని మూడు బాటిళ్ల చొప్పున తీసుకొస్తున్నారు. కొందరిని ఇదే పనిమీద అటూ ఇటూ తిప్పుతున్నారు. చీప్, ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లు ఇప్పుడు ఏపీకి తెలంగాణ, కర్ణాటక, తమిళ నుంచి పోటెత్తుతున్నాయి.

ధర తక్కువ.. క్వాలిటీ బ్రాండెడ్ సరుకు కావడంతో వీటికి మంచి డిమాండ్ నెలకొంది. ఏపీలోని లోకల్ బ్రాండ్ల కంటే వీటినే తాగడానికి జనం ఎగబడుతున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వగానే ఇప్పుడు మద్యం దందా ఏపీలో జోరుగా సాగుతోందట.. వందలమాదిని ఇదే పనిమీద పెట్టుకొని తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారట.. సో ఇలా ఏపీ ప్రభుత్వానికి మద్యం ధరల పెంపు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు.

ఏపీ-తెలంగాణ మధ్య అంతర్యుద్ధం?

Road transport ap telangana

దేశ మంతటా ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇటీవల కేంద్రం రిలీజ్‌ చేసిన గైడ్‌లైన్స్‌లో అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ సర్వీసులు తమవే అంటే తమవే ఉండాలంటున్న ఇరురాష్ట్రాల గొడవతోనే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాల మధ్య అన్ని ఆంక్షలు ఎత్తివేసి అన్నిరకాల సర్వీసులు తిరుగుతూనే ఉన్నాయి. కానీ.. మన తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రావడం లేదు. మొన్నటివరకు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను సైతం చెక్‌ పోస్టుల ద్వారా అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా కేంద్రం ఆగ్రహంతో వాటిని ఎత్తేసింది. ఆర్టీసీ బస్సుల పునఃప్రారంభంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రెండు దఫాలుగా చర్చలు చేపట్టిన అవి ఫలితం ఇవ్వలేదు. దీంతో తదుపరి చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

లాక్‌ డౌన్‌ కారణంగా మార్చి 22న నిలిచిపోయిన అంతర్‌ రాష్ట్ర రవాణా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏపీ బస్సులను సైతం తెలంగాణకు రానివ్వడం లేదు. అయితే బస్సుల రాకపోకలు పునఃప్రారంభం కాకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఎవరు ఎన్ని బస్సులు నడపాలి, ఎన్ని కిలోమీటర్లు నడపాలి అన్న దానిపై ఒప్పందం కుదరకపోవడమేనని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అయితే బస్సులు నడుస్తున్నాయో లాక్ డౌన్ ముందు వరకు అలానే నడిచాయి. అయితే, ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ బస్సులు ఏపీకి తక్కువగా సంఖ్యలో ఉన్నాయని, అదే ఏపీ నుంచి తెలంగాణకి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని అభ్యతరం తెలిపింది. తెలంగాణ బస్సు సర్వీసులు పెంచుకునేందుకు ఒప్పుకోవాలని ఏపీని కోరుతోంది. దీనికి ఏపీ ఒప్పకోకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

వాస్తవానికి కరోనాకు ముందు ఇరు రాష్టాల మధ్య ఎన్ని బస్సులు నడిచాయో ఇప్పుడూ అంతే సంఖ్యలో వాటిని నడపాలని ఏపీ కోరుతుండగా.. టీఎస్‌ఆర్టీసీ అందుకు అంగీకరించడం లేదు. కరోనా కారణంగా ఇరు రాష్ట్రాలూ నష్టపోయాయని, ఆ నష్టాలను పూడ్చుకోవాలంటే తమకు అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే హైదరాబాద్‌ నుంచి ఏపీ సర్వీసులను పెంచుకుంటామని తెలంగాణ ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తే ఇప్పటివరకూ రెండు వైపులా అత్యధికంగా బస్సులు తిప్పుతున్న ఏపీఎస్ ఆర్టీసీకి ఆ మేరకు నష్టాలు తప్పవు. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ దీనికి ససేమిరా అంటోంది. ఈ విషయంలో టీఎస్‌ఆర్టీసీ కూడా అదే పట్టు కొనసాగిస్తుండంతో మరికొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగే అవకాశముంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరిన కిలోమీటర్ల దూరంలో సగం తగ్గించుకుంటామని ఏపీ అధికారులు లేఖ రాసినా తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు.

కార్పొరేట్ కక్కుర్తికి బాలింత బలి.. కరోనా చికిత్సకు 29లక్షల బిల్లు


తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రులు కాసుల కక్కుర్తితో ప్రజలను ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే రోగుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. కరోనా విషయంలో వైద్యులు మానవత్వంతో మెలగాలని ప్రభుత్వాలు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. కరోనాకు ఇంత ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. ప్రాణాల కాపాడుకునేందుకు రోగులు పడుతున్న గోసను ఆసరాగా చేసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు లక్షల్లో దండుకుంటున్నాయి.

కరోనా నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణ మాత్రం శూన్యంగా కన్పిస్తోంది. తుతూమంత్రంగా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగించుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాహాకానికి ఓ బాలింత మృతిచెందింది. ఆమె మృతికి సంబంధించిన రిపోర్టులు చూపించకుండానే రూ.29లక్షల బిల్లులు వసూలు చేయడం కార్పొరేట్ ఆస్పత్రుల దోపీడికి నిదర్శకంగా కన్పిస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని బల్సురుగొండకు చెందిన శ్వేతారెడ్డికి ఇటీవల గ్రూపు-2లో ఏసీటీవోగా ఎంపికైంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె ఇటీవల గర్భవతి అయ్యారు. ఈక్రమంలోనే జులై 27న స్వల్పజ్వరం రావడంతో ఆమె భర్త మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బంధువులు చేర్పించారు. అయినా జర్వం తగ్గలేదు. అక్కడి వైద్యులు కరోనా భావించి చికిత్సకు నిరాకరించారు. దీంతో ఆమెను ఆగస్టు 4న డెలివరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. రూ.2లక్షలు చెల్లిస్తేనే సిజేరియన్ చేస్తామని చెప్పి డబ్బలు కట్టించుకొని డెలవరీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమెకు కొద్దిగా ఆయాసం ఉండటంతో అనుమానంతో కరోనా టెస్టులు చేశారు.

అయితే వైద్యులు మాత్రం ఆమె రిపోర్టులు చూపించకుండా 20రోజులు ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో తన భార్యను కాపాడుకునేందుకు మాధవరెడ్డి వారిడినంత డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో రూ.29లక్షలు ఫీజు వసూలు చేశారు. అయితే చివరకు ఆమె మృతదేహాన్ని భర్త అప్పగించడంతో ఆయన ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వాలని నిలదీయగా వారు సేసేమీరా అనడంతో ఆ ఆస్పత్రిపై హైదరాబాద్ డీఎంహెచ్ఓకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కత్తులు నూరుతున్న కేసీఆర్!

k.chandrashekar rao

మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌‌ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా వాదోపవాదాలకు పోకుండా సమావేశాలు సామరస్యంగా సాగేలా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్‌‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రస్తావించండం ప్రత్యేకతను చాటుకుంది. కొత్త రెవెన్యూ చట్టానికి ఈ సమావేశాల్లోనే ఆమోద ముద్ర వేయాలని కేసీఆర్‌‌ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని కట్టడి చేసేందుకు కేసీఆర్‌‌ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశారు. రోజురోజుకూ రెవెన్యూలో పెద్ద సంఖ్యలో అవినీతి కేసులు పెరుగుతుండడంతో ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌‌ పట్టుదలతో ఉన్నారు. ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంకా దానిని అమల్లోకి తీసుకురాలేదు. ప్రధానంగా రెవెన్యూలో భూ రికార్డుల నిర్వహణ, మ్యుటేషన్‌, అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి.. కొత్త రెవెన్యూ చట్టంలో ఏయే అంశాలు ఉన్నాయి? ఇది అమల్లోకి వస్తే రెవెన్యూ వ్యవస్థలో వచ్చే మార్పులు ఏమిటి? అంతిమంగా ప్రయోజనాలు ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. భూములు కొన్నవారికి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ (వివరాల నమోదు) చేయించుకోవడం ప్రహసనంగా మారింది.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత రైతులు మ్యుటేషన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ చేతులు తడిపితే తప్ప మ్యుటేషన్‌ చేసే పరిస్థితి ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పోనీ మ్యుటేషన్‌ అయ్యాక వెంటనే రైతులకు పాస్‌బుక్‌లు అందుతున్నాయా అంటే అదీ లేదు. వాటిని జారీ చేసే క్రమంలోనే అవినీతే జరుగుతోంది. ఇది స్వయంగా సీఎం కార్యాలయే నిర్ధారించింది. ఏసీబీ అధికారులు కూడా తమ నివేదికల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో కొత్త రెవెన్యూ చట్టంతో ఈ ఇబ్బందులన్నీ తొలగించాలని చూస్తున్నారు. మ్యుటేషన్ అయ్యాక వీఆర్వోలు, తహసీల్దార్‌‌ల చుట్టూ తిరగకుండా ఇంటికే ‘ఎలక్ర్టానిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌పుస్తకం’ పంపిస్తారని తెలుస్తోంది.

భూముల రిజిస్ట్రేషన్‌ అయిపోగానే జాప్యం లేకుండా రికార్డుల్లో రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ చట్టం ప్రకారం మ్యుటేషన్‌ జరగాలని, దీనికోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. బ్యాంకు ఖాతాల్లో నగదు లావాదేవీల సమాచారం లాగే క్రయ విక్రయదారులకు సంబంధించి ఆధార్‌ అనుసంధానం చేసిన ఫోన్‌ నంబర్లకు భూముల లావాదేవీల సమాచారం చేరనుంది. రిజిస్ట్రేషన్ల కోసం సమీకృత భూరికార్డుల యాజమాన్య పథకం(ధరణి) వెబ్‌సైట్‌ను వినియోగించుకోనున్నారు. కొత్త చట్టంలో రిజిస్ట్రేషన్‌ అధికారాలను తహసీల్దార్లకు ఇవ్వడమే కాకుండా ఏ మాత్రం జాప్యం లేకుండా భూముల లావాదేవీలు నమోదు చేయకుంటే… తగిన చర్యలు తీసుకునేలా చట్టంలో క్లాజులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.  శాసనసభ సమావేశాలు పూర్తయిన వెంటనే ధరణి వెబ్‌సైట్‌ను లాంఛనంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న సమగ్ర రెవెన్యూ చట్టంలో రెండు అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒకటి రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ (ఆర్‌వోఆర్‌) సవరణ చట్టం కాగా మరొకటి అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం(పీవోటీ). ఈ రెండు చట్టాలకు ముడిపడి డజన్ల కొద్దీ చట్టాలున్నాయి. ఈ రెండు చట్టాలను అమలు చేయాలంటే పలు చట్టాల అమలు కీలకం కానుంది. వాటినన్నింటినీ కలుపుకొని సమగ్ర రెవెన్యూచట్టం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 145 చట్టాల్లో కాలానుగుణంగా లేని, కాలంచెల్లిన చట్టాలుగా భావిస్తున్నవాటిని రద్దు చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. కాగా.. నెల రోజులుగా సీఎం కేసీఆర్‌‌ పర్యవేక్షణలో కొత్త రెవెన్యూ చట్టానికి తుదిరూపు ఇచ్చే ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పర్యవేక్షణలో మూడు అంచెల్లో కమిటీలు వేగంగా పనిచేస్తున్నాయి. ఈ కమిటీలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందర్‌రావు, మాజీ ఐఏఎస్‌లు షఫీకుజ్జమాన్‌, మహ్మద్‌అలీ రఫత్‌, బి.రామయ్యతోపాటు పూర్వ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ తదితరులతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌లను చేర్చారు. సీసీఎల్‌ఏ స్థాయిలో కీలక అధికారులను కూడా భాగస్వాములను చేశారు. సీఎంవో స్థాయిలోని అధికారులు ఒక అంచెలో, రెండో అంచెలో రిటైర్డ్‌ ఐఏఎస్‌/రెవెన్యూ అధికారులు, మూడో అంచెల్లో సచివాలయ స్థాయి అధికారులు, చివరి అంచెలో సీసీఎల్‌ఏ స్థాయి అధికారులు ఈ కమిటీల్లో ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూచట్టంపై కూడా చర్చిస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో కొత్త చట్టానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

 ‘పవన్-త్రివిక్రమ్’ కో‘బలి’? ఈసారి ఏమవుతుంది?

pawan trivikram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలను ప్రారంభించేందుకు పవన్ రెడీ అవుతున్న సమయంలో పవన్ 30వ సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో పవన్ 30వ సినిమా ఉండనుందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో విన్పిస్తోంది.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు దర్శకులు సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించారు. పవన్ వరుస సినిమాల అప్డేట్స్ అందించి ఆకట్టుకున్నారు. ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్ రిలీజు అయింది. అదేవిధంగా దర్శకుడు క్రిష్ సైతం పవన్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మూవీకి సంబంధించి ఒక బైక్ పోస్టర్ విడుదల చేసి ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి పని చేయబోతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఈ సినిమాలతో పవన్ మరో మూడేళ్లపాటు బీజీగా ఉండబోతున్నాయి. అయితే అప్పుడే పవన్ 30వ సినిమాలపై వార్తలు విన్పిస్తున్నాయి. పవన్ 30వ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, అతని శిష్యుడు వెంకీ కుడుముల పోటీపడుతున్నారు. ఇక గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’.. ‘అత్తారింటికి దారేదీ’ మూవీలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అయితే పవన్ చివరి చిత్రంగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మాత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

తాజాగా పవన్ తో మరోసారి త్రివిక్రమ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలోనే ఈమేరకు త్రివిక్రమ్ మాట తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ‘కోబలి’ చిత్రం రాబోతుందని సమాచారం. గత ఏడేళ్ల క్రితమే పవన్ కల్యాణ్ తో ‘కోబలి’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయితే అనివార్య కారణాలతో సినిమా ప్రారంభానికి నోచుకోలేదు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ‘కోబలి’ ఉంటుందని అప్పట్లో టాక్ విన్పించింది. మంచి కమర్షియల్ అండ్ మెసెజ్ ఒరియేంటెడ్ కథ అయిన ‘కోబలి’ని పవన్ కోసం మళ్లీ తెరపైకి త్రివిక్రమ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాలని త్రివిక్రమ్ ‘కోబలి’ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈసారైనా ‘కోబలి’ పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

వైసీపీ గుర్తింపు రద్దు కోసం టీడీపీ స్కెచ్?

ycp flag
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ను అటు ప్రతిపక్ష టీడీపీ.. మరికొందరు ప్రత్యర్థులు ప్రశాంతంగా పాలించుకోవడం లేదు. ముఖ్యంగా కోర్టులతో వైఎస్ జగన్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడుతున్నారనే చర్చ సాగుతోంది. వైసీపీ పార్టీని ఎలాగైనా సరే అస్థిరపరచాలని చేస్తున్న ఈ యవ్వారాలు ఆ పార్టీకి శరాఘాతంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన వైసీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ అనే  ఢిల్లీ హైకోర్టులో పిటీషన్వేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అన్న పేరు వాడేందుకు వీళ్లేదని కేంద్ర ఎన్నికలకమిషన్ ఆదేశించినా.. అధికార వైసీపీ దాన్ని లెక్క చేయడం లేదని.. అందుచేత దాని గుర్తింపును రద్దు చేయాలని మహబూబ్ పిటీషన్ వేశారు.


ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి నాలుగు వారాలు గడువు ఇచ్చారు. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేశారు.

వైసీపీ పార్టీ తనదేనని.. జగన్ సారథ్యంలోని వైసీపీ కాదని.. అందరికంటే ముందే తాను వైసీపీని రిజిస్ట్రర్ చేయించానని మహబూబ్ అంటున్నారు.

కానీ కొంతమంది మాత్రం మహబూబ్ వెనుకాల టీడీపీ ఉండే ఈ నాటకాలు ఆడిస్తోందని.. వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు కోసం పోరాడుతోందని ఆరోపిస్తున్నారు.

యాంకర్ ప్రదీప్ అంటే క్రష్ అంటున్న హీరోయిన్ !


బుల్లితెర పై అత్యధిక ఆదరణ పొందిన టీవీ షోలలో ఢీ షో కూడా ఒకటి. ఈ షో దక్కించుకున్న ఆదరణ దెబ్బకు మిగతా షోల పరిస్థితి దారుణంగా పడిపోయింది. అంతలా ఢీ షో జనంలోకి వెళ్ళింది. దీనికి తోడు రోజురోజుకూ ఈ షోలో మసాలా కంటెంట్ కూడా ఎక్కువైపోతుంది. రొమాంటిక్ సాంగ్స్ లో హీట్ పుట్టించే స్టెప్స్ తో పాటు ఇక ఈ మధ్య కాస్త బూతు డైలాగ్ లను కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఈ షోలో. మొత్తానికి ఈ షో యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని రోజురోజుకు ఇంకా జనంలోకి చొచ్చుకొని పోతోంది. అయితే ఈ షోలో ఒక జడ్జ్‌గా ఉన్న హీరోయిన్ పూర్ణ తన మనసులో దాగిన ఇష్టాన్ని అందరి ముందు విడమరిచి చెప్పేసింది. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే.. ఈమెగారికి యాంకర్ ప్రదీప్ అంటే బాగా క్రష్ అట. ఇంతకీ ఈ బ్యూటీ ఇంత ఓపెన్ గా సడెన్ గా ప్రదీప్ పేరు చెప్పడానికి ఒక రీజన్ ఉందిలేండి.

Also Read: గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు

తాజాగా విడుదల చేసిన ఈ షో ప్రోమోలో.. ఓ కంటెస్టెంట్ పూర్ణ క్యారెక్టర్‌ ను పోషించింది. పోషిస్తే పోషించింది.. ఉరికినే ఉందా.. పూర్ణగారి హృదయంలో ప్రదీప్ తిష్ట వేసుకుని కూర్చున్నాడని ఆ కంటెస్టెంట్ కనిపెట్టినట్టు.. పూర్ణ క్యారెక్టర్ ను పోషిస్తున్న ఆ కంటెస్టెంట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేస్తున్నంత సేపూ ప్రదీప్ వైపే గుచ్చి గుచ్చి చూసేసింది. అంటే, పూర్ణ.. ప్రదీప్ ను అలాగే చూస్తోంది అనే సెన్స్ తో. పైగా ఢీ షోలో వచ్చాక నువ్ మారిపోయావ్ పూర్ణ అంటూ ఖడ్గం సినిమాలోని అహా అల్లరి అల్లరి చూపులతో అనే పాటకు ప్రదీప్‌ను చూస్తూ డ్యాన్స్ ఇరగతీసింది. ఇలా ఈ పర్ఫామెన్స్ చూసిన పూర్ణ తెగ ఎగ్జైట్ అయిపోయి.. ‘నాకు ప్రదీప్ అంటే క్రష్ అని సెలవిచ్చింది’. అయితే నెటిజన్లు మాత్రం పూర్ణను ఉద్దేశిస్తూ ఈమెగారు ఇప్పటికే వారంటే క్రష్.. వీరంటే క్రష్ అని చాలామంది పేర్లు చెప్పింది.

Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త !

మరి ఈవిడ కావాలని చెబుతుందా..? లేక నిజంగానే ఈవిడకు క్రష్ పడుతుందా ?అని వ్యంగ్యంగా నెటిజన్లు పూర్ణ పై సెటైర్లు వేస్తున్నారు. అన్నట్టు పూర్ణ తన మనసులో దాగిన క్రష్ ను బయటకు చెప్పడమే కాకుండా, తన కలల రాకుమారుడు ప్రదీప్ కోసం స్టేజ్ మీదకి వచ్చి మరీ, రొమాంటిక్ స్టెప్పులతో హస్కీ చూపులతో ప్రదీప్ తో కలిసి అదరగొట్టేసింది. ఆ విధంగా వీరిద్దరి రొమాంటిక్ స్టెప్పులతో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఏమైనా గతంలో వచ్చిన ఢీ షో సీజన్స్‌ కు ఈ మధ్య వస్తోన్న ఢీ షోకు చాలా తేడా కనిపిస్తుంది. గతంలోని షోలో కొత్తగా వస్తోన్న డాన్సర్ల టాలెంట్ కనిపించేది.. ఇప్పుడు వస్తోన్న షోలో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఎక్కువుగా హైలైట్ అవుతూ ఉంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త !


కొవిడ్‌-19తో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ప్రకారం బాలుగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. ‘నాన్నగారి ఆరోగ్యం వరుసగా నాలుగో రోజూ కూడా నిలకడగా ఉంది. వచ్చే సోమవారం నాటికి నాన్నగారి ఆరోగ్యం విషయంలో శుభవార్త వింటామని ఆశిస్తున్నాను. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. ఈ వీడియో సందేశంను బట్టి బాలుగారు కరోనాని జయించబోతున్నారు. ఆయన కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించనున్నారని తెలియగానే బాలుగారు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పవన్ 30వ సినిమా కోసం గురుశిష్యుల పోటీ?

ఇక బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది ఆయనకి చికిత్సను అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యం కూడా. హాస్పిటల్ రిలీజ్ చేసిన హెల్త్‌ బులిటెన్ ను బట్టి.. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నాము. అలాగే ఆయన ఐసీయూలో ఉన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది. ప్రత్యేకమైన వైద్య బృందం నిరంతరం బాలుగారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మొత్తానికి బాలుగారి ఆరోగ్యం విషయంలో పాజిటివ్ న్యూస్ రావడంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.

Also Read: ఎన్టీఆర్ పాత ఇంట్లో త్రివిక్రమ్ !

గత కొన్ని రోజులుగా బాలుగారు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురైయ్యారు. అలాగే సినీ మహామహులతో పాటు యావత్తు సినీ లోకమంతా బాలుగారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవ్వన్నీ ఆ దేవుడు అలకించాడేమో.. బాలుగారు పూర్తిగా కోలుకోబోతున్నారనే శుభవార్త వచ్చింది. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు బాలుగారి ఆరోగ్యం కోసం ముందు నుంచీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన పూర్తిగా కోలుకున్నేలా శాయశక్తులా ప్రయత్నించారు. ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులకు బాలుగారి అభిమానులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.

గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు

pawankalyan

కరోనాతో ఏపీ అల్లకల్లోలం అయినా.. ఏపీలో ఎన్ని ఉపద్రవాలు ఘోరాలు జరిగినా.. గత మార్చి ఏప్రిల్ నుంచి జనసేనాని ఏపీ యాక్టివ్ పాలిటిక్స్ లోనే లేరు. కరోనా కారణంగా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు.ఓ వైపు ప్రతిపక్షం టీడీపీ ప్రతీసారి ఏదో ఒక రచ్చ చేస్తూ వైసీపీ సర్కార్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా పవన్ మాత్రం స్పందించలేదు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోమువీర్రాజు కొత్తగా నియామకం అయ్యి హల్ చల్ చేస్తున్నా పవన్ ఏపీకి రాలేదు.

ఎందుకో కానీ పవన్ కరోనా వచ్చాక ఏపీ రాజకీయాల కంటే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇప్పటికే 3 సినిమాలు అనౌన్స్ చేయగా.. నాలుగో సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.

ఇలా ఐదురు నెలలుగా స్పందనలు లేని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు స్పందనలు ఎక్కువయ్యాయన్న చర్చ జరుగుతోంది. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు వచ్చింది. ఆయనకు సినీ, రాజకీయ, ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అయితే ఇన్నాళ్లు ట్విట్టర్ ముఖం చూడని పవన్ తాజాగా బర్త్ డే సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపడం విశేషం.

ఎప్పుడూ స్పందించని పవన్.. ఇలా నిన్న అంతా అందరితో టచ్ లోకి రావడం చూసి ఆఖరుకు టాలీవుడ్ కామెడీ హీరో ‘సంపూర్ణేష్ బాబు’ కు కూడా రిప్లై ఇవ్వడంతో అతడు.. ఏకంగా దాన్ని ‘ఫ్రేం కట్టుకుంటా భయ్యా.. నువ్వు నాకు రిప్లై ఇచ్చావా’ అని ఆశ్చర్యపోయాడు.. ఇలా పవన్ నిశ్శబ్ధం కూడా ఇంత ప్రశాంతంగా ఉంటుందని.. అతడి స్పందనలు అందరికీ హాయిని  ఇస్తాయని అందరికీ అర్థమైంది..

-నరేశ్.ఎ

టీడీపీ సోషల్ మీడియా వేగులను ఏరేస్తున్న జగన్ సర్కార్

హైదరాబాద్ లో దాక్కొని ఏపీని అస్థిరపరుస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్రదారుల వేట మొదలైంది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ను అభాసుపాలు చేసేందుకు వీరంతా విచ్చలవిడిగా తప్పుడు పోస్టులు పెడుతున్నారు.  విచ్చలవిడి కామెంట్లతో, అసభ్యకర పోస్టులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ పోలీసులు కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కేవలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు మాత్రమే పార్టీలకు అండగా నిలిచేవి. కానీ ఇప్పుడు వాటికన్నా బలమైన, క్షణాల్లోనే కోట్ల మందికి సమాచారం చేరవేయగల సోషల్ మీడియా పార్టీలకు వేదికగా మారింది. ముఖ్యంగా యువతను చేరుకోవాలంటే పార్టీలు ఈ బాటలోకి రావడం తప్పనిసరి అయ్యింది. ఏపీలో రాజకీయ పార్టీల సోషల్ మీడియాలు కాస్త ఎక్కువగానే యాక్టివ్‌లో ఉంటున్నాయి. అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు సోషల్‌ మీడియాలో చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి.

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టింగులతో ఇప్పటికే టీడీపీ పరువు పోగొట్టుకుంది. పలువురు టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ‘పచ్చ’ రంగు వేసుకున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

గతంలో టీడీపీ కార్యకర్త, సాఫ్ట్‌వేర్‌‌ ఉద్యోగి అయిన అవినాష్‌ హైదరాబాద్‌లో పనిచేస్తూ.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అసభ్యకర పదజాలంతో టిక్‌టాక్‌ చేసి అనవసరంగా బుక్‌ అయ్యాడు. దీనిపై వైసీపీ ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అరెస్టు చేశారు. వెంటనే అక్కడి నుంచి మాచర్లకు తరలించారు. ఏదో సందర్భంలో పిన్నెల్లి ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌‌గా ఈ అవినాష్‌ ఇష్టం వచ్చినట్లుగా భాష వాడుతూ.. పిన్నెల్లిని కించపరుస్తూ పోస్టింగ్‌ పెట్టాడు. మంచి సాఫ్ట్‌వేర్‌‌ ఫ్యూచర్‌‌ ఉన్న అవినాష్‌ కాస్త కేసుల పాలయ్యాడు.

తదుపరి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పేరొందిన నలంద కిశోర్‌‌ వైఎస్సార్‌‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముతంసెట్టి శ్రీనివాసరావులపై సోషల్‌ మీడియాలో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. దీన్ని జగన్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) నుంచి ఓ బృందం కిశోర్‌‌ ఇంటికి వెళ్లింది. అదుపులోకి తీసుకొని వెంటనే సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లింది. అరెస్ట్ గురించి తెలుసుకున్న గంటా వెంటనే సీఐడీ కార్యాలయానికి పరుగెత్తారు. కానీ అతన్ని ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదు.

మరో సంఘటనలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఆరోపణలపై కృష్ణ జిల్లాలోని నందిగమకు చెందిన చిరుమామిల్లా కృష్ణ (35)ను సైతం సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనతోనే ఆగిపోకుండా పోలీసులు ఇంకా చాలా మందినే అదుపులోకి తీసుకున్నారు.

ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపాలి. కానీ.. 40 ఇయర్స్‌ ఇండస్ర్టీ అని చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏమిటి..? అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తట్టుకోలేక ఎన్నోసార్లు ఊగిపోయిన ఆయన ఇప్పుడు ఏ వైఖరిలో వెళ్తున్నట్లు..? దేశంలో తనకన్నా సీనియర్‌‌ లేడంటూ చెప్పుకునే ‘పచ్చ’ పార్టీ లీడర్‌‌.. ఆయన సిద్ధాంతాలను ఎందుకు మరిచినట్లు..? ఇలా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడానికేనా ఇంకా ప్రజల్లో తిరుగుతున్నది..? ప్రభుత్వంపై ఈయనకు ఎందుకింత అక్కసు..? అధికార పార్టీ లీడర్లపై అభ్యంతకర పోస్టుల పెట్టేందుకు సోషల్‌ మీడియాను మెయింటెన్ చేస్తున్నది..? అధికారం వస్తూ ఉంటుంది.. పోతూ ఉంటుంది.. అంత మాత్రానా ఇలాంటి కించపరిచే పోస్టులు పెడుతూ.. అవమానాల పాలు కావడం ఎంతవరకు సమంజనం..?

మీకు అర్థమవుతోందా.. తెలుగు రాష్ట్రాల్లో మరో ఛానలంట..!

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో పోటాపోటీ నడుస్తోంది. ఒకరిని చూసి మరొకరు.. ఎవరి అవసరాలకు వారు.. ఇబ్బడిముబ్బడిగా న్యూస్‌ ఛానల్స్‌ ప్రారంభిస్తున్నారు. టీఆర్‌‌పీ రేటింగ్స్‌ విషయం పక్కనపెడితే చిన్నా పెద్దా కలిపి పదుల సంఖ్యలో.. వీటికి తోడు సిటీ ఛానల్స్‌ అంటూ నడుస్తూనే ఉన్నాయి. టాప్‌ రేటింగ్స్‌ కోసం ఎవరికి తోచిన విధంగా వారు ప్రోగ్రాంస్‌ ప్రవేశపెడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఛానల్స్‌ జాబితాలోకి మరో ఛానల్‌ వచ్చి చేరబోతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా AP24X7 ఛానల్‌ను ప్రారంభించారు. గతంలో మా టీవీని రన్‌ చేసిన మాజీ అధినేత మురళీకృష్ణంరాజు దీనికి చైర్మన్‌గా వ్యవహరించారు. మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభించిన ఈ ఛానల్‌ మొదట్లో బాగానే నడిచింది. తర్వాతర్వాత బోర్డ్‌ మెంబర్స్‌ మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. వీటికితోడు ఉద్యోగుల మధ్య కూడా ఆధిపోత్య పోరు కొనసాగడంతో ఛానల్‌ భవిష్యత్‌ సంక్షోభంలో పడింది. ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన చైర్మన్‌ మురళీకృష్ణంరాజు ఛానల్‌కు షాక్‌ ఇచ్చారు. ‘తను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా’ అంటూ చైర్మన్‌ స్థాయిలోనే లేఖ రాయడం మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది.

దీనికి సంబంధించిన పరిణామాలు ఇలా ఉన్నాయి. అదే ఛానల్‌కు సీఈవోగా పనిచేసిన జర్నలిస్ట్‌ వెంకట కృష్ణ పలు ఆరోపణల కారణంగా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొన్నాళ్లపాటు సీఈవో లేకుండానే నడిచిన ఛానల్‌.. ఒకానొక దశలో క్లోజ్‌ చేయాలని బోర్డు మెంబర్స్‌ డిసైడ్‌ అయ్యారు. కంపెనీలో 60 శాతం వాటా చైర్మన్‌కే అమ్మేయాలని అనుకున్నారు. ఈ దశలో ఛానల్‌ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కొన్నాళ్ల క్రితమే చైర్మన్‌ మురళీకృష్ణం రాజు సుధాకర్‌‌ని తీసుకొచ్చారు. ఆయననే సీఈవోగా నియమించారు. సుధాకర్‌‌ ది బిజినెస్‌ నేపథ్యం. ఐఐఎం గ్రాడ్యుయేట్‌. పలు కంపెనీలకు సీఈవోగా కూడా వ్యవహరించారు. అధికార పార్టీ వైసీపీతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 40 శాతం వాటాలు ఇస్తామనే అంగీకారంతో సుధాకర్‌‌ని సీఈవోగా తీసుకొచ్చారని సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం.. ఛానల్‌ నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక రాజకీయ పక్షం మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తే సీఈవోగా రావడంతో ఇక ఛానల్‌కు మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కానీ.. ఇంతలోనే మళ్లీ బోర్డు సభ్యుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఓ కీలక మెంబర్‌‌ వాటా విషయంలో చైర్మన్‌కు వ్యతిరేకంగా పావులు కదిపి మిగతా సభ్యులతో కుమ్మక్కయ్యారు. తనకున్న పలుకుబడితో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇప్పించారు. ఛానల్‌ని ఒక స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌‌కు ఈ రాజకీయాలన్నీ నచ్చలేదు. దీంతో ఆయన మర్యాదపూర్వకంగానే తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా సర్కిల్‌లో ప్రస్తుతం వినిపిస్తోతంది.

రెండు నెలలు సీఈవోగా కొనసాగిన సుధాకర్‌‌కు ఛానల్‌ నిర్వహణపై ఓ అవగాహన వచ్చిందంట. ఇంకేంటి అసలే బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ నేపథ్యం ఉన్న ఆయనకు పాత ఛానల్‌ని నడపడం కంటే కొత్త ఛానల్‌ పెట్టి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయానికి వచ్చారంట. ఎలాగూ అధికార పార్టీతో ఉన్న సత్సంబంధాలు ప్లస్‌ అవుతాయని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు సీనియర్‌‌ జర్నలిస్టులతోనూ పంచుకున్నారని సమాచారం. టెక్నికల్‌ టీం కూడా ఏర్పటైనట్లు తెలిసింది. ఇప్పటికే పేరున్న ఛానల్స్‌లో పనిచేస్తున్న కొందరు ఎలక్ర్టానిక్‌ మీడియా సీనియర్లు కూడా సుధాకర్‌‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. త్వరలోనే AP 24X7కి గుడ్ బై చెప్పి.. కొత్త ఛానల్‌ ప్రకటన చేసే అవకాశం ఉందనే మీడియా వర్గాల్లో టాక్.. అదే జరిగితే ఇప్పడున్న ఛానళ్లకు తోడు మరొకటి చేరబోతున్నట్లే.