Home Blog Page 8329

అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

Ts Dgp in Asifabadతెలంగాణలో అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గ్రేహౌండ్స్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మూడు రోజులుగా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. విశేషం ఏంటంటే.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సైతం మూడు రోజులుగా ఆదిలాబాద్ లోనే ఉంటున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా మొత్తం అడవులను స్వయంగా పరిశీలిస్తూ పోలీసులకు సలహాలు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

Also Read: ఏపీ మంత్రి ప్రాణాలకు ముప్పు? పటిష్ట భద్రత

డీజీపీ సైతం ఆదిలాబాద్ లోని అడవుల్లోని సమస్యాత్మక ప్రాంతాలను సందర్శిస్తూ పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేస్తూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి డీజీపీ అయ్యిండి స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

కాగా చత్తీస్ ఘడ్ , గడ్చిరోలి నుంచి మావోయిస్టులు ఆదిలాబాద్ వచ్చారని ఉప్పందింది. ప్రాణహిత నదీతీరం వెంబడి ఉన్న అటవీ ప్రాంతం గుండా వచ్చారని.. ప్రజాప్రతినిధులు, పోలీసులను టార్గెట్ చేశారని నిఘా విభాగాలు సమాచారం అందించాయి.

Also Read: హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

ఒకప్పుడు తెలంగాణ వస్తే మావోయిస్టులకు కేంద్రంగా మారుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆడిపోసుకున్నారు. అలా కాకూడదని కేసీఆర్ బాగా కూంబింగ్ లు నిర్వహించి అరికట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ మూలాలు బయటపడడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి మరీ మావోల ఏరివేత ఆపరేషన్ లో పాల్గొంటుండడం సంచలనంగా మారింది.

చంద్రబాబు, పీవీ.. ఒక మరుపు కథ.!

పాలన వికేంద్రీకరణ.. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌. ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా అదే రూట్‌లో పయనిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు మరో 13 కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల పేర్లపై రాష్ట్రమంతటా చర్చ మొదలైంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు.. రాజకీయాల్లో దివికేగిన వారు.. వివిధ ప్రముఖుల పేర్లు పెడతుంటారు. ఏ నాయకుడికి ఏ జిల్లాతో సంబంధం ఉంది.. అక్కడి జిల్లా ప్రజలకు ఆ నాయకుడి పేరు నచ్చుతుందా లేదా అని చూసి పేరు పెట్టాలి. ఇక జగన్‌ కూడా తన పాదయాత్ర సందర్భంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌‌ వంటి మహనీయుల పేర్లు కొత్త జిల్లాలకు పెడుతామంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఇంకొంత మంది మహానుభావుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

Also Read: ఏపీ మంత్రి ప్రాణాలకు ముప్పు? పటిష్ట భద్రత

తాజాగా.. 13 కొత్త జిల్లాల్లో ఏదేని జిల్లాకు దేశ మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్‌ వస్తోంట. పీవీ నరసింహారావుది తెలంగాణ రాష్ట్రం.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో వంగర గ్రామం. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరును ఏ జిల్లాకూ పెట్టని కేసీఆర్‌‌ ఇప్పుడు శత జయంతి ఉత్సవాల పేరిట హంగామా చేస్తున్నాడు. అంతేకాదు ఆయన పేరుని వాడుకుంటూ భారతరత్న ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నాడు. ఇక ఏపీలో కూడా వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పీవీ పేరును ప్రతిపాదిస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. పీవీ మన ఠీవీ అని.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుగు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ అనుబంధ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కూడా కొందరు జగన్‌కు లేఖ రాశారు. వారిదీ సేమ్‌ డిమాండ్‌.

ఇక పాతికేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే 1995 సెప్టెంబర్ 1న ఎన్టీయార్‌‌ను కూలదోసి చంద్రబాబు ఉమ్మడి ఏపీకి కొత్త సీఎం అయ్యారు. ఆనాడు కేంద్రంలో ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. నిజానికి అదే ఏడాది ఉగాదికి ప్రధాని హోదాలో ఉన్న పీవీని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు ఎన్టీఆర్‌‌. అలాగే పీవీ ప్రధానిగా నెగ్గిన తరువాత నంద్యాల నుంచి పీవీ పోటీ చేస్తే టీడీపీ నుంచి పోటీ పెట్టకుండా రామారావు తన సహకారం అందించారు. ఇవన్నీ ఉన్నా కూడా ఎన్టీఆర్‌‌ను అక్రమంగా చంద్రబాబు తొలగించిన ఎపిసోడ్ లో పీవీ మౌన పాత్ర వహించారని ప్రచారం. ఎన్టీఆర్ ఈ విషయంలో తనకు సాయం చేయాలని ప్రధాన హోదాలో ఉన్న పీవీని కోరినట్లుగానూ ప్రచారం జరిగింది. కానీ పీవీ మాత్రం మామా అల్లుడు వివాదంగా దాన్ని చూశారని అంటుంటారు. అంతే కాదు.. రాజ్యాంగం ప్రకారం ఎలా చేయాలో అలా చేయమన్నట్లుగా నాటి గవర్నర్ కృష్ణ కాంత్‌కు చెప్పారని కూడా చెబుతుంటారు. ఆ విధంగా మెజారిటీ చంద్రబాబుకే ఉండడంతో ఆయన్ని సీఎంగా ప్రకటించారు గవర్నర్‌‌. దీన్ని చూసి పీవీ కూడా సరేనని వదిలేశారు. అంటే ఓ విధంగా చంద్రబాబు సీఎం అయన ఎపిసోడ్‌లో పీవీ జోక్యం చేసుకోకపోవం అతి పెద్ద వరంగా చెప్పుకోవాలి. మరి దానికి ధన్యవాదంగా అయినా చంద్రబాబు పీవీ పేరు ఏపీకి పెట్టమని జగన్‌ని కోరాల్సిందే.

Also Read: బ్రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు

ముందు నుంచీ కాంగ్రెస్‌ ఉన్న వైఎస్సార్‌‌ కుటుంబం.. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్‌ కొత్త పార్టీని స్థాపించారు. అయితే.. వైఎస్సార్‌‌ కుటుంబానికి, పీవీకి ఏదో తెలియని రాజకీయ అగాధం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌‌ను సీఎం కానీయలేదని చెబుతుంటారు. మరి ఇప్పుడు బంతి జగన్‌ కోర్టులో ఉండిపోయింది. అప్పటి వివాదాలు.. పొరపొచ్చాలు అన్నీ వదిలి జిల్లాకు పేరు పెడతారా..? లైట్‌ తీసుకుంటారా..? దీని మీదనే ప్రధాన చర్చ నడుస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో.

ఏపీ మంత్రి ప్రాణాలకు ముప్పు? పటిష్ట భద్రత


జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయ నాయకుడిగా ఎదిగి.. ప్రస్తుతం ఏపీ వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న కురసాల కన్న బాబు ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసింది. ఉగ్రవాదుల నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్న బాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించి పటిష్ట భద్రతను కల్పించింది.

Also Read: రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు

కన్నబాబును ఉగ్రవాదులు టార్గెట్ చేశారని.. 10 రోజుల క్రితం రాష్ట్ర పోలీసు విభాగానికి నివేదిక ఇచ్చింది. గత కొన్ని నెలలుగా కన్న బాబు కదలికలపై నిఘా శాఖ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి కన్నబాబు ఎక్కువ సమయం తన సాధారణ కారులో ప్రయాణిస్తాడు. చాలా ఎక్కువగా ప్రజలలోకి వెళ్తాడు. అతను తూర్పు గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాలకు కూడా వెళ్తాడు. ఈ క్రమంలోనే మావోయిస్టులు, ఉగ్రవాదులు ఆయన కిడ్నాప్ కు పథకం వేశారని నిఘా విభాగానికి ఉప్పు అందింది.

ఇది వరకు టీడీపీ హయాంలోనూ విశాఖలో ఓ టీడీపీ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి చంపిన దృష్ట్యా పోలీసులు మంత్రి కన్నబాబుకు పటిష్ట భద్రత కల్పించారు. కన్న బాబు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం భావించి ఈ చర్య చేపట్టింది.

Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

ఈ బెదిరింపులు రావడంతో మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందించాలని నిఘా విభాగం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి సిఫారసు చేసింది. కన్న బాబు ఇకపై ఎక్కడికి వెళ్లినా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. ఈ విషయంలో పోలీసులతో సహకరించాలని వారు మంత్రిని కోరారు. పోలీసులు ఆయనకు సెక్యూరిటీని పెంచారు.

వర్షకాలంలో ఇవి తింటే డేంజరట..

ఇది వర్షాకాలం.. వానలకు అస్సలు దాహం వేయదు..చెమట పట్టదు.. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా ఉండదు.. వాతావరణం చల్లగా ఉండడంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా తినాలని అనిపిస్తుంటుంది. కానీ వర్షకాలంలోకానీ, శీతాకాలంలో కానీ నూనెల్లో వేయించిన పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుస్నారు.

జిహ్వచాపల్యం కోసం ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా .. బరువు కూడా పెరిగిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. అలా వర్షకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. వేడి వేడి, నూనెలో వేపే బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం మంచిందంటున్నారు. అలాగే పార్టీలకు వెళ్లినా.. అక్కడ వెరైటీలు కంటి ముందు కనిపిస్తున్నా.. మితంగా తినాలిని సూచిస్తున్నారు.

నెయ్యిని మొత్తం పక్కనపెట్టేయాలి. నూనెతో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట మితంగా ఆహారం తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకుంటే.. పండ్లు, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పబ్ జీకి పోటీగా భారతీయ ‘ఫౌ-జీ’

దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ‘పబ్ జీ’ గేమ్ ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిషేధించింది. మనదేశంపైకి దండెత్తి వస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు ఆ దేశం రూపొందించిన పబ్ జీ గేమ్ సహా 118 యాప్ లపై దేశంలో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

Also Read: బాలీవుడ్ లో హీరోయిన్లకే ఎక్కువ మగతనం : వర్మ

ఆత్మనిర్భర భారత్ లో భాగంగా భారతీయులు రూపొందిస్తున్న అచ్చం పబ్ జీని పోలిన‘ఫౌజీ’ యాక్షన్ గేమ్ ను తీసుకొస్తున్నట్టు తాజాగా బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ ప్రకటించాడు.

‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్ లెస్ అండ్ యూనైటెడ్: గార్డ్స్’ (ఫౌజీ) పేరుతో యాక్షన్ గేమ్ ను రూపొందించింది. హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ గురించి అక్షయ్ ట్వీట్ చేశాడు.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమస్ఫూర్తితో ఫౌజీ గేమ్ ను సగర్వంగా ప్రకటిస్తున్నామని.. ఈ గేమ్ ఆడడం.. వినోదంతోపాటు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని.. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్ట్ కు అందుతుందని అక్షయ్ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

బాలయ్యతో నటిస్తా కానీ.. హీరోయిన్ డిమాండ్ !


హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయోమయంలో కొట్టుమిట్టాడుతుందట. ఆమెకు ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. చేయాలా వద్దా అని ఆమె ఏటు తేల్చుకోలేక తెగ ఇబ్బంది పడుతుందట. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎందుకు ఆమె ఇంతలా ఇబ్బంది పడుతుందంటే.. ఏమి చెబుతాం, ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది నటసింహం బాలయ్య బాబు సినిమాలో. బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గా చేసిన హీరోయిన్ల కెరీర్స్ ఏమైపోయాయో అనే విషయాలు లావణ్యకు కాస్త అవగాహన ఉంది. అందుకే ఏమి చెప్పాలో తెలియడం లేదు, నిజానికి లావణ్య ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి, ఈ సినిమా మంచి ఆఫరే. కాకపోతే అక్కడ బాలయ్య బాబు హీరో. అందుకే ఇంతలా ఆలోచిస్తోంది.

Also Read: ఆ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు

ఎంత లేదు అన్నా.. టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు లావణ్య. కాకపోతే కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు అనుకోండి. ఈ పరిస్థితుల్లో ఆమె ఈ సినిమా ఒప్పుకోక తప్పనిసరి. ఇక బాలయ్య బాబుకు కూడా హీరోయిన్ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా చాలా సహజమైన విషయం అయిపోయింది. కొత్తవారి నుండి ఫేడ్ అవుట్ హీరోయిన్స్ వరకూ ఇప్పటికే బాలయ్య దర్శకులు అందర్నీ చూసేశారు. అయినా బోయపాటికి మాత్రం హీరోయిన్ దొరకలేదు. అందుకే హీరోయిన్ ను ఫిక్స్ చేయకుండానే ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసి.. అలాగే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసేశాడు. నిజానికి ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని బోయపాటి చాలా ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే ఆ కొత్త హీరోయిన్ కి తమిళ్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చే సరికి అటు వెళ్లిపోయిందట.

Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

ఆ రకంగా ఇప్పుడు బాలయ్యకు హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికి వచ్చేసరికి, ఇక లాభం లేదనుకున్నా బోయపాటి రీసెంట్ గా లావణ్య త్రిపాఠికి ఫోన్ చేసి మరీ హీరోయిన్ ఆఫర్ ను ప్రకటించాడు. కానీ, ఆ ఆఫర్ కు ఆమె నుండి మొదట సమాధానం లేదట. కానీ, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం లావణ్య ఆల్ మోస్ట్ ఈ సినిమాలో నటించడానికే మొగ్గు చూపుతోందని.. ఈ మేరకు ఆమె బోయపాటికి ఒక ప్రపోజల్ కూడా పెట్టిందని.. బాలయ్య సినిమాలో నటిస్తా.. కానీ భవిష్యత్తులో మీరు చేసే సినిమాల్లో ఏదొక సినిమాలో నాకు హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వాలని మొర పెట్టుకుందట. బోయపాటి కూడా వీలు అయితే తప్పకుండా చేద్దామంటూ అభయం ఇచ్చాడట. కాకపోతే ఆ వీలు అనేది సాధ్యం అయిద్దా.. డౌటే.

బాలీవుడ్ లో హీరోయిన్లకే ఎక్కువ మగతనం : వర్మ


రాంగోపాల్‌ వర్మ అంటేనే సెన్సేషన్‌.. సెన్సేషన్‌ అంటే వర్మ. వివాదాలకు కేరాఫ్​ అడ్రస్‌ వర్మ. తను పట్టిన కోడికి నాలుగు కాళ్లు ఉంటాయంటాడు. ఎవరు ఏం వాదించినా లైట్‌గా తీసుకుంటాడు. వివాదస్పదమైన సినిమాలూ తీస్తుంటాడు. అదే స్థాయిలో రచ్చ చేసే ట్వీట్లూ చేస్తుంటాడు.

Also Read: హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి !

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయిన తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. (ఇప్పుడు దర్యాప్తు కూడా అదే కోణంలో జరుగుతోందనుకోండి.) ఈ కేసులో రియా తప్పులేదంటే ముందు నుంచీ ఆమెకు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటారు వర్మ. ఈ కేసులో మీడియానే ట్రయల్స్‌ చేయడంపై అసంతృప్తిని కూడా వెలిబుచ్చాడు. ఈ విషయంపై బాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై కూడా ఆర్జీవి తప్పుపట్టాడు. ఈ క్రమంలో మరోసారి వర్మ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి.

సుశాంత్‌ మరణంపై న్యాయం కావాలని కోరుతూ అమెరికాలో ప్రకటన బిల్‌ బోర్డుపై ‘Justice for Sushanth Singh Rajput’ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బిల్‌ బోర్డును తొలగించడంపై రాంగోపాల్‌ వర్మ స్పందించాడు. ‘ఎట్టకేలకు ఈ కేసు విచారణ పారదర్శకతలో జరుగుతోంది. న్యాయం ఎప్పటికైనా నిలుస్తుందనే ఫీలింగ్‌ కలుగుతోంది. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ బిల్‌బోర్డును అమెరికాలో తొలగించారు’ అనే విషయాన్ని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !

ఇక సుశాంత్ సింగ్ కేసులో మీడియా అందరూ కలిసి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రియాకు మద్దతుగా నిలిచిన తాప్సీ, విద్యాబాలన్, శిభానీ దండేకర్, మంచు లక్ష్మీ, స్వరభాస్కర్ ధైర్యానికి మెచ్చుకోవాలని వర్మ అన్నారు. బాలీవుడ్ లో మగాళ్ల కంటే ఈ బాలీవుడ్ మహిళలకే ఎక్కువ మగతనం ఉందనే విషయాన్ని రుజువు చేశారని వర్మ ట్వీట్ చేశారు.

హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయి. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని రంగాలు కోలుకుంటున్నాయి. వలస కార్మికులలు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారంతా సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం కూరగాయలు, నాన్ వెజ్ ధరలకు రెక్కలు రావడంతో తెలంగాణలో కోడి గుడ్డుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. సప్లయ్ కి మించి డిమాండ్ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో కోడిగుడ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: మరో ట్వీస్ట్: 139మంది రేప్ కేసు.. 36మందికి చేరిన సంఖ్య..!

కరోనా ఎఫెక్ట్ తో ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టిసారించారు. వైద్యులు, ప్రభుత్వం తాజా కూరగాయాలు, పండ్లు, నాన్ వెజ్ తిని రోగనిరోధక శక్తి పెంచుకోవాలని సూచిస్తోంది. దీంతో ప్రతీఒక్కరు తాజా కూరగాయలు, పండ్లను తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలోనే వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం కూరగాయ ధరలు కిలోకు రూ.70పైబడి ఉంటున్నాయి. చికెన్ తినడం వల్ల కరోనా రాదని సీఎం కేసీఆర్ సైతం చెప్పడంతో కొన్నిరోజులుగా రాష్ట్రంలో చికెన్ ధరలు పెరిగిపోయాయి. చికెన్, చేపలు, మాంసం ధరలు గతంలో కంటే భారీగా పెరిగాయి.

ఇక అందరికీ అందుబాటులో ఉండే కోడిగుడ్లను ప్రజలు ఎక్కువగా తింటున్నారు. సప్లయ్ కి మంచి డిమాండ్ ఉండటంతో కోడిగుడ్లు ప్రజలు అందుబాటులో ఉండలేదని తెలుస్తోంది. గతంలో రాష్ట్రంలో 1.8కోట్ల గుడ్లు అమ్ముడవగా ప్రస్తుతం ఆ సంఖ్య 2కోట్లకు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ కోడిగుడ్ల వాడకంలో మొదటి స్థానంలో ఉంది. గతంలో రాష్ట్రంలో రోజుకు 3.5కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికాగా 1.80 కోట్లు స్థానిక అవసరాలకు.. 1.70 కోట్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు.

Also Read: కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ ఫైర్

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తి 3కోట్లకు పడిపోయింది. అదే సమయంలో వినియోగం రెండు కోట్లకు పెరిగింది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కోడిగుడ్ల వాడకం ఎక్కువైనందునే డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ప్రతీఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కోడిగుడ్లను తినేందుకు ఇష్టపడుతుండటంతో వాటి గిరాకీ పెరిగింది.

సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్ !


కరోనా పుణ్యమా అంటూ డిజిటల్ స్ట్రీమింగ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి సంవత్సరాలలో రాని ఫాలోవర్స్ ఈ లాక్ డౌన్ కాలంలో రెట్టింపు సంఖ్యలో వచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు, జనానికి వెబ్ థియేటర్లు ఎంతగా కనెక్ట్ అయిపోయాయో.. చక్కగా ఫోన్స్ లోనే కొత్త సినిమా చూసుకోవచ్చు. పైగా ఏదైనా సీన్ నచ్చితే మళ్లీ వెనుకకు వెళ్లి ఆ సీన్ పెట్టుకుని మళ్లీ చూడొచ్చు. అలాగే సినిమా ఎన్ని సార్లు అయినా చూడొచ్చు. ఇంతకు మించిన అప్షన్ ఏముంటుంది. అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను జనం బాగా ఆదరిస్తున్నారు.

Also Read: ఆ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు

కాగా వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళ్తుండటంతో ఇప్పుడు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే బడా నిర్మాతలు సైతం కొంతమంది ఫేమస్ నటీనటులతో వెబ్ సిరీస్ లను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమిళ నిర్మాతలు కూడా తెలుగు – తమిళంలో ఒకేసారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మరియు టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కలయికలో ఓ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇద్దరి సవతుల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని, ఇందులో హీరోగా మాజీ హీరో మాధవన్ నటిస్తున్నాడని.. సిరీస్ లో కంటెంట్ కాస్త హద్దులు దాటి ఉండబోతుందని.. అలాగే మెయిన్ గా వరలక్ష్మి – ఐశ్వర్య రాజేష్ పాత్రల మధ్య వచ్చే ఆధిపత్య పోరు చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

ఈ సిరీస్ లో కొన్ని సీన్స్ బాగా బోల్డ్ గా ఉన్నా.. అలాగే ఆ సీన్స్ లో కాస్త పరిమితులు దాటి రొమాన్స్ చేయాల్సి వస్తోన్నా.. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఐశ్వర్య రాజేష్ ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారట. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని.. అలాగే కథా పరంగా కూడా ఈ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మరి వరలక్ష్మీకి ఈ సిరీస్ తోనైనా హీరోయిన్ గా సినిమాలు వస్తాయేమో చూడాలి. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌కు తమిళ్ దర్శకుడు సూర్య సుబ్రమణ్యన్ దర్శకత్వం వహించబోతుండగా.. అనంద్ వికటన్ సంస్థ ఈ సిరీస్ ను భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

బ్రేకింగ్: శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టు

nuthan naidu

దళితుడి శిరోముండనం కేసులో నటుడు, సినీ నిర్మాత నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని పెందూర్తిలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడి భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నూతన్ నాయుడిని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపర్చి త్వరలోనే విశాఖ పట్నంకు తీసుకురానున్నట్లు సీపీ మనీష్ కుమార్ తెలిపారు.

Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

*శిరముండనంలో నూతన్ నాయుడి పాత్ర ఏంటీ?
విశాఖలో సంచలనం సృష్టించిన దళితుడి శిరోముండనం కేసుకు సినీ నిర్మాత నూతన్ నాయుడికి సంబంధం ఏంటీ? అసలు ఆరోజు ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్రం ఉందని తేల్చిన పోలీసులు అతడికోసం వెతికి తాజాగా అరెస్ట్ చేశారు.తన భార్య మధుప్రియను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్ చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. భార్యతోనూ మాట్లాడినట్టు గుర్తించారు. అందుకే తాజాగా అరెస్ట్ చేశారు.

ఈ కేసు పూర్వాపరాలు గమనిస్తే.. శిరోముండనం కేసులో బాధితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి నిర్మాత నూతన్ నాయుడి ఇంట్లో నాలుగు నెలలు పని చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీకాంత్ ఉన్నట్లుండి నిర్మాత ఇంట్లో పని మానేశాడు. ఈ నేపధ్యంలో నిర్మాత ఇంటి భద్రతాసిబ్బంది శ్రీకాంత్ ను ఇంటికి పిలిచి ఎందుకు పని మానేశావని ప్రశించినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?

ఈ క్రమంలోనే గతంలో తమ ఇంటికి వచ్చిన ఓ బ్యూటీషన్ సెల్ ఫోన్ ను శ్రీకాంత్ హ్యక్ చేశాడని ఆరోపిస్తూ భద్రతా సిబ్బంది దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా ఓ క్షురకుడిని పిలిపించి అతడికి శిరోముండనం చేయించినట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన శిరోముండనం చేస్తున్న సమయంలో నూతన్ భార్య పక్కనే ఉన్నారని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో ఇప్పటికే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేసి ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి !


సింగర్ నోయల్ హీరోయిన్ ఏస్తర్ తో ప్రేమలో ఉన్నానని ప్రకటించినప్పుడే అందరూ షాక్ గురయ్యారు. అసలు వీరిద్దరికీ ఎలా కుదిరింది ప్రేమా అని. ఆ తరువాత ఈ జంట పెళ్లి కూడా చేసుకుని అందరికి మళ్లీ షాక్ ఇచ్చింది. మొత్తానికి ఇక అంతా హ్యాపీనే అనుకుంటే.. సడెన్ గా మాకు విడాకులు మంజూరు అయ్యాయని అందరికీ మళ్లీ డబుల్ షాక్ ఇచ్చారు ఈ జంట. ఇక అప్పటినుండీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు ఈ సింగర్ అండ్ హీరోయిన్. అయినా ఎంతో గొప్పగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట ఎందుకు అంత తొందరగా విడిపోయారు.. అసలు పెళ్లి అయి ఏడాది కూడా కాకుండానే అప్పుడే అభిప్రాయ బేధాలు వీళ్ళ మధ్య ఎలా వచ్చాయి.. ఇలా అనేక రకాలుగా నెటిజన్లు తమ అనుమానాలను సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వీరినే అడిగేస్తున్నారు.

Also Read: ఆ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు

కానీ విడాకులకు కారణాలను మాత్రం ఈ జంట బయటపెట్టలేదు. అలాగే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు గానీ, విమర్శలు గాని చేసుకోలేదు. పద్ధతిగానే స్నేహపూర్వకంగానే విడిపోయారు.
అయితే ఏస్తర్ మాత్రం నోయల్ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా కాస్త అంటీముట్టనట్లుగానే ట్వీట్ చేసింది. ‘విడాకులు తీసుకోవాలనే నా ఈ నిర్ణయం వెనుక ఉన్న సున్నితమైన అంశాలను దయచేసి మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నా ఈ నిర్ణయానికి మీరు మద్దతు తెలువుతారని.. నాకు మీ సపోర్ట్ ఎప్పటిలానే ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఎక్కడా నోయల్ గురించి పాజిటివ్ గా గాని, నెగిటివ్ గా గాని ఆమె ప్రస్తావించలేదు. నోయల్ మాత్రం ఏస్తర్ గురించి అంతా మంచిగానే ట్విట్టాడు. ఇంకా అలాగే ట్వీట్ చేసుకుంటూ పోతున్నాడు.

Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

మొదట ఏస్తర్ గురించి నోయల్ పూర్తి పాజిటివ్ గా ట్వీట్ చేస్తూ.. ‘ఏస్తర్ జీవితం ఎంతో బాగుండాలని, తను కన్న కలలు అన్ని నిజం కావాలని తానూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. దయచేసి ఈ విషయంపై ఎవ్వరూ బ్యాడ్ కామెంట్స్ చేసి బాధపెట్టొద్దని పనిలో పనిగా నెటిజన్లను కూడా నోయల్ వేడుకున్నాడు. ఇక అప్పటినుండి నోయల్ రోజూ ఏదో ఒకరకమైన పోస్ట్ పెడుతూనే వస్తున్నాడు. అయితే తాజాగా నోయల్ చేసిన ట్వీట్ ను చూస్తుంటే.. అతను ఎంతగా కుమిలిపోతున్నాడో అర్ధం అవుతుంది. నోయల్ బాధగా ట్వీట్ చేస్తూ.. ‘కోలుకోవాలి.. ముందుకు సాగుతూ ఉండాలి.. చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి.. ఎప్పడూ చీకట్లోనే కూర్చోలేము’ అంటూ హెవీ ఎమోషనల్ గా ఎంతో ఫీల్ అయిపోతూ నోయల్ ఈ ట్వీట్ చేసినట్టు అనిపిస్తోంది. ఏమైనా హీరోయిన్ తో విడాకులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ ఫైర్

Telangana-High-Court
అన్ని రాష్ట్రాల్లో వేలల్లో టెస్టులు.. కేసులు నమోదవుతున్నాయి. పక్కనున్న ఏపీ కూడా ప్రతీరోజు 60వేలకు పైగా టెస్టులు చేస్తోంది. అక్కడ ప్రతీరోజు 10వేల కేసులు నమోదవుతున్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఏకంగా 1500 పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన కేసులతో సమానంగా కేసులు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలంగాణలో ఇప్పటికీ టెస్టులు పెంచినా 1000-2000 మధ్యనే కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ మిస్టరీ ఎవ్వరికీ అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటికే తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంచడం లేదని.. సరిగ్గా పట్టించుకోవడం లేదని.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు తలంటింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

కాగా తాజాగా కరోనా చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక నిర్లక్ష్యంగా.. అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండడం అనుమానంగా ఉందని తెలిపింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. జిల్లాలో కరోనా కేసులకు.. రాష్ట్రాల బులిటెన్లకు తేడా బాగా ఉంటుందని హైకోర్టు హితవు పలికింది.

అంబులెన్సులను కరోనా రోగులకు పెంచాలని.. ల్యాబ్ ల సంఖ్య పెంచాలని.. బడ్జెట్ ను కరోనాకు కేటాయించాలని.. మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రజలకు పరీక్షలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు మండిపడింది. అవి చట్టానికి అతీతమా అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపి 22వరకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం బెడ్లను ప్రభుత్వానికి కేటాయిస్తానన్న మంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించింది.

ఇలా హైకోర్టులో మరోసారి తెలంగాణ సర్కార్ కు కరోనా చికిత్సల విషయంలో తలంటు పడింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడకపోతే ప్రభుత్వం మరింత అభాసుపాలు కావడం ఖాయమని పలువురు హితవు పలుకుతున్నారు.

జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

Jaganmohanreddy tdpసీఎం జగన్ కర్ర విరగకుండా పాము చచ్చేలా వ్యూహాత్మకంగా వెళుతున్నాడా? సీక్రెట్ గా టీడీపీ కుంభకోణాలు వెలికి తీయిస్తున్నాడా? అంటే ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో జగన్ పడ్డారు. గత ప్రభుత్వం హయాంలో అమలైన స్కీంలు.. వాటిలో జరిగిన అవినీతిని అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రబాబు అమలు చేసిన ‘నీరు–చెట్టు’ స్కీంపై ఫోకస్‌ పెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టారు.

Also Read : జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?

గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ‘పచ్చ’ పార్టీల నేతలు అందినకాడికి దండుకున్నారనేది ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో పత్రికల్లోనూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. దాదాపు 30 వేల కోట్లతో చేపట్టిన ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయి. గ్రామాల్లోని చెరువుల్లోని పూడిక తీసి.. ఆ మట్టితో చెరువు కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా.. ఆ మట్టినీ అమ్ముకుని ‘పచ్చ’దండు కోట్లు కొల్లగొట్టాయనే విషయంపై గతంలో కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇప్పుడు జగన్‌ టీం కూడా ప్రతీ స్కీం మీద లోతుగా ఆరా తీస్తున్నాయి. ప్రధాన పోస్టుల్లో ఉన్న ఐఏఎస్‌లందరూ అదే పనిలో ఉండిపోయారు.

‘నీరు–చెట్టు’ పథకంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామన్న జగన్‌.. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండడంతో ఇక మర్చిపోయారేమోనని అందరూ భావించారు. టీడీపీ నేతల్లోనే ఇక తమకు ఏం కాదనే ధీమా కనిపిచింది. కానీ.. వైసీపీ ప్రభుత్వం దీనిపై ఇప్పుడు చాపకింద నీరులా దర్యాప్తు ప్రారంభించిందని, పక్కా ఆధారాలతో చర్యలకు దిగేందుకు సిద్ధంగా ఉందని ఇప్పుడు బయటికి పొక్కడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఈ మేరకు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది.

Also Read : జగన్ సర్కార్ కు మరో షాక్.. రమేశ్ ఆస్పత్రికి ఊరట

‘నీరు–చెట్టు’ స్కీంకు సంబంధించిన నిధులు ప్రభుత్వం ఇంకా తమకు ఇవ్వడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్‌‌ ఇప్పటికే హైకోర్టును సంప్రదించారు. దీనిపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా.. ఈ స్కీంలో భారీగా అవకతవకలు జరిగాయని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎంక్వైరీ జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. అందుకే నిధుల విడుదల నిలిపివేశామని నివేదించింది. నివేదికలు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరువర్గాల వాదన హైకోర్టు కూడా విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

గ్రామాల్లో వినియోగంలో లేని చెరువులు, గట్లకు మరమ్మతుల పేరుతో గ్రామస్థాయి నుంచి టీడీపీ లీడర్లు దోచుకున్నారనే ఆరోపణలు ఉండడంతో ప్రభుత్వం విచారణ దిగింది. అంటే.. ఈ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో వైసీపీ ప్రభుత్వం బిజీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎట్‌ ద సేమ్‌ టైం అవినీతి రుజువు అయితే ఎంత మంది మెడకు ఉచ్చు బిగుస్తుందోనని టీడీపీ నేతల్లో భయం మొదలైంది.

Also Read : కరోనా: ‘ప్రైవేట్’ దోపిడీపై జగన్ ఉక్కుపాదం

జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?


jaganmohanreddy mask
ఈ కరోనా టైంలో అమెరికా ప్రెసిడెంట్‌ నుంచి అనకాపల్లి బుల్లోడు వరకు వినియోగిస్తున్నారు. ఆ మాస్కుల్లోనూ ఎన్నో వెరైటీలు. ఒక్కో మాస్క్‌కు ఒక్కో ధర.
కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎన్95 మాస్కులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి 200 రూపాయల లోపే దొరుకుతున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ కొందరు ధనికులు.. డబ్బున్న వాళ్లు మాస్క్ ల్లోనూ భారీతనం చూపిస్తున్నారు.

Also Read: జగన్ సర్కార్ కు మరో షాక్.. రమేశ్ ఆస్పత్రికి ఊర

ఇప్పటికే పూణేలో ఓ వినియోగదారుడు  2.89 లక్షల రూపాయల బంగారంతో తయారు చేసిన మాస్క్ ను తయారు చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  ఇప్పుడు నేనేమైనా తక్కువ తిన్నాన అని వజ్రాల సిటీ అయిన సూరత్ కు చెందిన ఒక ధనవంతుడు ఆభరణాలు.. వజ్రాలతో అలంకరించబడిన మాస్క్ లను తయారు చేయించుకున్నాడు. దీని ఏకంగా 4 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. ఎప్పుడూ సాదాసీదాగానే ఉండడానికే ప్రాధాన్యం ఇస్తాడు. వైట్‌ షర్ట్‌.. కాకి కలర్‌‌ ప్యాంట్‌ ఎక్కువగా ధరిస్తుంటాడు. ఏపీలోకి కరోనా వైరస్‌ వచ్చినా సీఎం మొదట్లో పెద్దగా మాస్క్‌లు వాడేవారు కాదు. ఎప్పుడో ఒకసారి బయట ప్రోగ్రాంలకు వెళ్తేనో.. పరామర్శలకు వెళ్తేనోసిబ్బంది ఇచ్చే సర్జికల్‌ మాస్క్‌లు ధరించేవారు. ఆ మాస్కులు ఆయనకు అంతగా పడలేదంట. అందుకే ఈ సారి ట్రెండ్‌ మార్చాడు. వైట్‌ షర్ట్‌ పైన ఆ బ్లూ కలర్‌‌ సర్జికల్‌ మాస్క్‌ అంతగా బాగాలేదనుకున్నాడు కావచ్చు.

తాజాగా జగన్‌ ధరించిన వైట్‌ మాస్క్‌ అందరిలోనూ చర్చకు దారితీసింది. ఇదేం మాస్క్‌ అబ్బా..? చాలా కంఫర్ట్‌గా కనిపిస్తోంది..? ఎక్కడ దొరుకుతుంది..? ఎంత ఉండొచ్చు..? అని ఆలోచనలు అందరినీవెంటాడాయి.

Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?

అంత పెద్ద హోదాలో ఉన్న జగన్‌ వాడుతున్న మాస్క్‌ ధర ఎంతో తెలుసా.. కేవలం.. యాభై రూపాయలు మాత్రమే. ఇటీవల ఎవరో తన గురువు ఆ మాస్క్‌ ధరించి జగన్‌ దగ్గరికి వచ్చారంట.దానిని చూసి ఫ్లాట్‌ అయిన జగన్‌ అలాంటి మాస్క్‌లే తెప్పించారంట. అవి ఎక్కడో కాదు రామ్‌ రాజ్‌ కాటన్‌ నుంచే. సీఎం జగన్‌ వాటిని ధరించి అలా కనిపించాడో లేదో ఇప్పుడు ఎవరి మొఖానికి చూసినా అవే మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి.

బ్రోకర్ పాత్రలో మహేష్.. ఫుల్ మాస్ మసాలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్పైసీ టైటిల్ ఉండడంతో ఆసక్తి నెలకొంది.

Also Read: నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

అయితే కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ లు మొదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. తాజాగా మరో ఆసక్తిర విషయం వెలుగుచూసింది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాలీవుడ్ టాక్. ఇందులో మహేష్ బాబు ఒక పాత్రలో ‘బ్రోకర్’గా కనిపిస్తాడని.. మరో పాత్రలో ‘బ్యాంకు ఆఫీసర్ గా’ కనిపిస్తారని వార్త వైరల్ అయ్యింది. ఒక్కడే ఇలా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడా? లేదా ద్విపాత్రాభినయమా అన్నది తేలాల్సి ఉంది.

Also Read: ఆ క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ ప్లేస్‌లో ఉంటే రెండు వేల కోట్లు సంపాదించే వాడిని: నాగబాబు

మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పైగా ఊర మాస్ లుక్ ‘బ్రోకర్’ పాత్రలో మహేష్ ఎలా అలరిస్తాడన్నది వేచిచూడాలి.