బుల్లితెర పై అత్యధిక ఆదరణ పొందిన టీవీ షోలలో ఢీ షో కూడా ఒకటి. ఈ షో దక్కించుకున్న ఆదరణ దెబ్బకు మిగతా షోల పరిస్థితి దారుణంగా పడిపోయింది. అంతలా ఢీ షో జనంలోకి వెళ్ళింది. దీనికి తోడు రోజురోజుకూ ఈ షోలో మసాలా కంటెంట్ కూడా ఎక్కువైపోతుంది. రొమాంటిక్ సాంగ్స్ లో హీట్ పుట్టించే స్టెప్స్ తో పాటు ఇక ఈ మధ్య కాస్త బూతు డైలాగ్ లను కూడా విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఈ షోలో. మొత్తానికి ఈ షో యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని రోజురోజుకు ఇంకా జనంలోకి చొచ్చుకొని పోతోంది. అయితే ఈ షోలో ఒక జడ్జ్‌గా ఉన్న హీరోయిన్ పూర్ణ తన మనసులో దాగిన ఇష్టాన్ని అందరి ముందు విడమరిచి చెప్పేసింది. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే.. ఈమెగారికి యాంకర్ ప్రదీప్ అంటే బాగా క్రష్ అట. ఇంతకీ ఈ బ్యూటీ ఇంత ఓపెన్ గా సడెన్ గా ప్రదీప్ పేరు చెప్పడానికి ఒక రీజన్ ఉందిలేండి.
Also Read: గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు
తాజాగా విడుదల చేసిన ఈ షో ప్రోమోలో.. ఓ కంటెస్టెంట్ పూర్ణ క్యారెక్టర్ ను పోషించింది. పోషిస్తే పోషించింది.. ఉరికినే ఉందా.. పూర్ణగారి హృదయంలో ప్రదీప్ తిష్ట వేసుకుని కూర్చున్నాడని ఆ కంటెస్టెంట్ కనిపెట్టినట్టు.. పూర్ణ క్యారెక్టర్ ను పోషిస్తున్న ఆ కంటెస్టెంట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేస్తున్నంత సేపూ ప్రదీప్ వైపే గుచ్చి గుచ్చి చూసేసింది. అంటే, పూర్ణ.. ప్రదీప్ ను అలాగే చూస్తోంది అనే సెన్స్ తో. పైగా ఢీ షోలో వచ్చాక నువ్ మారిపోయావ్ పూర్ణ అంటూ ఖడ్గం సినిమాలోని అహా అల్లరి అల్లరి చూపులతో అనే పాటకు ప్రదీప్‌ను చూస్తూ డ్యాన్స్ ఇరగతీసింది. ఇలా ఈ పర్ఫామెన్స్ చూసిన పూర్ణ తెగ ఎగ్జైట్ అయిపోయి.. ‘నాకు ప్రదీప్ అంటే క్రష్ అని సెలవిచ్చింది’. అయితే నెటిజన్లు మాత్రం పూర్ణను ఉద్దేశిస్తూ ఈమెగారు ఇప్పటికే వారంటే క్రష్.. వీరంటే క్రష్ అని చాలామంది పేర్లు చెప్పింది.
Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త !
మరి ఈవిడ కావాలని చెబుతుందా..? లేక నిజంగానే ఈవిడకు క్రష్ పడుతుందా ?అని వ్యంగ్యంగా నెటిజన్లు పూర్ణ పై సెటైర్లు వేస్తున్నారు. అన్నట్టు పూర్ణ తన మనసులో దాగిన క్రష్ ను బయటకు చెప్పడమే కాకుండా, తన కలల రాకుమారుడు ప్రదీప్ కోసం స్టేజ్ మీదకి వచ్చి మరీ, రొమాంటిక్ స్టెప్పులతో హస్కీ చూపులతో ప్రదీప్ తో కలిసి అదరగొట్టేసింది. ఆ విధంగా వీరిద్దరి రొమాంటిక్ స్టెప్పులతో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఏమైనా గతంలో వచ్చిన ఢీ షో సీజన్స్ కు ఈ మధ్య వస్తోన్న ఢీ షోకు చాలా తేడా కనిపిస్తుంది. గతంలోని షోలో కొత్తగా వస్తోన్న డాన్సర్ల టాలెంట్ కనిపించేది.. ఇప్పుడు వస్తోన్న షోలో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ఎక్కువుగా హైలైట్ అవుతూ ఉంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actress poorna admits to having a crush on host pradeep machiraju
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com