
హైదరాబాద్ లో దాక్కొని ఏపీని అస్థిరపరుస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్రదారుల వేట మొదలైంది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ను అభాసుపాలు చేసేందుకు వీరంతా విచ్చలవిడిగా తప్పుడు పోస్టులు పెడుతున్నారు. విచ్చలవిడి కామెంట్లతో, అసభ్యకర పోస్టులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ పోలీసులు కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కేవలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు మాత్రమే పార్టీలకు అండగా నిలిచేవి. కానీ ఇప్పుడు వాటికన్నా బలమైన, క్షణాల్లోనే కోట్ల మందికి సమాచారం చేరవేయగల సోషల్ మీడియా పార్టీలకు వేదికగా మారింది. ముఖ్యంగా యువతను చేరుకోవాలంటే పార్టీలు ఈ బాటలోకి రావడం తప్పనిసరి అయ్యింది. ఏపీలో రాజకీయ పార్టీల సోషల్ మీడియాలు కాస్త ఎక్కువగానే యాక్టివ్‌లో ఉంటున్నాయి. అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు సోషల్ మీడియాలో చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులతో ఇప్పటికే టీడీపీ పరువు పోగొట్టుకుంది. పలువురు టీడీపీ కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ‘పచ్చ’ రంగు వేసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
గతంలో టీడీపీ కార్యకర్త, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అవినాష్ హైదరాబాద్‌లో పనిచేస్తూ.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అసభ్యకర పదజాలంతో టిక్‌టాక్ చేసి అనవసరంగా బుక్ అయ్యాడు. దీనిపై వైసీపీ ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌లో అతడిని అరెస్టు చేశారు. వెంటనే అక్కడి నుంచి మాచర్లకు తరలించారు. ఏదో సందర్భంలో పిన్నెల్లి ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌గా ఈ అవినాష్ ఇష్టం వచ్చినట్లుగా భాష వాడుతూ.. పిన్నెల్లిని కించపరుస్తూ పోస్టింగ్ పెట్టాడు. మంచి సాఫ్ట్‌వేర్ ఫ్యూచర్ ఉన్న అవినాష్ కాస్త కేసుల పాలయ్యాడు.
తదుపరి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పేరొందిన నలంద కిశోర్ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముతంసెట్టి శ్రీనివాసరావులపై సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. దీన్ని జగన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నుంచి ఓ బృందం కిశోర్ ఇంటికి వెళ్లింది. అదుపులోకి తీసుకొని వెంటనే సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లింది. అరెస్ట్ గురించి తెలుసుకున్న గంటా వెంటనే సీఐడీ కార్యాలయానికి పరుగెత్తారు. కానీ అతన్ని ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదు.
మరో సంఘటనలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఆరోపణలపై కృష్ణ జిల్లాలోని నందిగమకు చెందిన చిరుమామిల్లా కృష్ణ (35)ను సైతం సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనతోనే ఆగిపోకుండా పోలీసులు ఇంకా చాలా మందినే అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిపక్షాలు అంటే ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపాలి. కానీ.. 40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఏమిటి..? అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తట్టుకోలేక ఎన్నోసార్లు ఊగిపోయిన ఆయన ఇప్పుడు ఏ వైఖరిలో వెళ్తున్నట్లు..? దేశంలో తనకన్నా సీనియర్ లేడంటూ చెప్పుకునే ‘పచ్చ’ పార్టీ లీడర్.. ఆయన సిద్ధాంతాలను ఎందుకు మరిచినట్లు..? ఇలా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడానికేనా ఇంకా ప్రజల్లో తిరుగుతున్నది..? ప్రభుత్వంపై ఈయనకు ఎందుకింత అక్కసు..? అధికార పార్టీ లీడర్లపై అభ్యంతకర పోస్టుల పెట్టేందుకు సోషల్ మీడియాను మెయింటెన్ చేస్తున్నది..? అధికారం వస్తూ ఉంటుంది.. పోతూ ఉంటుంది.. అంత మాత్రానా ఇలాంటి కించపరిచే పోస్టులు పెడుతూ.. అవమానాల పాలు కావడం ఎంతవరకు సమంజనం..?