Home Blog Page 79

ఎన్డీఏ కు టిడిపి గుడ్ బై.. ప్రధానికి లోకేష్ చెప్పింది అదే!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: తెలుగుదేశం ఎన్డీఏ కు దూరం కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని చూసిందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిశారా? ఇదే రూమర్ గతంలో వెలుగు చూసింది. నిన్నను కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా కాంక్లేవుకు హాజరయ్యారు. అక్కడే ఈ రూమర్ ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు అటువంటి ప్రయత్నం జరిగిందా అని జర్నలిస్ట్ ప్రశ్నించేసరికి.. లోకేష్ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అసలేం జరిగింది? దాన్ని తెర వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది వివరించారు లోకేష్. ఆ వెంటనే తాను ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు.

* గత పరిణామాల దృష్ట్యా..
గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. నాడు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అయితే విభజన హామీలకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసేసరికి ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. అలా ఎన్డీఏ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారు. జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా రాజకీయంగా 2019 ఎన్నికల్లో నష్టపోయారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలంగానే బిజెపితో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ పుణ్యమా అని మళ్లీ అంతా కలిశారు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం సైతం రాజకీయంగా, రాష్ట్ర ప్రయోజనాలపరంగా పెద్దపీట వేస్తోంది ఏపీకి. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు మొన్న ఆ మధ్యన ప్రచారం నడిచింది.

* ఆయన రాజీనామాతో..
మొన్న మధ్యన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి చేసి రాజీనామా చేయించందన్నది ఒక విమర్శ. జగదీప్ బిజెపి వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ దేశానికి. కానీ బిజెపి ఆదేశాలు కాకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్లారు. ఇది ఎంత మాత్రం కేంద్ర పెద్దలకు రచించలేదు. అందుకే ఆయన పై ఒత్తిడి చేయించి రాజీనామా చేయించినట్లు వార్తలు వచ్చాయి. అలా రాజీనామా చేసిన జగదీప్ ను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా టాక్ నడిచింది.

* ప్రధానికి వివరణ..
అయితే టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ.. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు. ముంబైలో మాజీ ఉపరాష్ట్రపతిని కలిసింది నిజమేనని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఒప్పుకున్నారు. అది రాజకీయ భేటీ కాదని.. యాదృచ్ఛిక సమావేశం అని చెప్పుకొచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అయితే లోకేష్ వివరణ ఇచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోడీ నవ్వేశారట. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ గ్యాప్ వస్తుందన్న ఆందోళన లోకేష్ లో ఉంటే… ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఉంటుందని.. అందులో ఎంత మాత్రం తప్పు లేదని.. తాము సైతం క్రాస్ చెక్ చేసామని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఊపిరి పీల్చుకున్నారు లోకేష్. నిన్న కాంక్లేవ్ లో అదే విషయాన్ని చెప్పారు మంత్రి నారా లోకేష్.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం చిరంజీవి కి ఇష్టం లేదా..? అనుమానాలకు దారి తీస్తున్న లేటెస్ట్ కామెంట్స్..

Chiranjeevi Peddi Success Event
Chiranjeevi Peddi Success Event

Chiranjeevi Peddi Success Event: మన టాలీవుడ్ నుండి మొట్టమొదటి నేషనల్ అవార్డు ని అందుకున్న హీరో గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం మన తెలుగు వాళ్లకు గర్వ కారణం కావొచ్చు , కానీ సినీ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలకు కాస్త అసూయ ని కలిగించే విషయమే. పైకి శుభాకాంక్షలు తెలియజేస్తారు కానీ , లోపల మాత్రం అయ్యో మనకి రాలేదే అనే బాధ, అసూయ అలా ఉండిపోతుంది. అలాంటి అసూయ మెగాస్టార్ చిరంజీవి లో కూడా ఉండిపోయిందా?, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం తో లేరా?, తన కొడుక్కి రావాల్సిన అవార్డు అల్లు అర్జున్ కి వచ్చింది అనే ఫీలింగ్ తో ఉన్నారా ? , ఇలాంటి అనుమానాలు నిన్న జరిగిన ‘పెద్ది’ విజయోత్సవ సభలో మెగాస్టార్ మాట్లాడిన మాటలు తర్వాత నెటిజెన్స్ లో కలిగాయి.

సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి పై ట్రోల్స్ చేస్తున్నారు , విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘పెద్ది చిత్రాన్ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అవార్డు ని రప్పించుకోవడానికి అనేక దార్లు ఉండొచ్చు, కానీ నా బిడ్డ నటన చూసిన తర్వాత జనాల్లో ఇతనికి నేషనల్ అవార్డు వస్తే బాగుంటుంది అనే భావన కలిగింది చూడు , అంతకు మించిన అవార్డు ఇంకేమి కావాలి’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆయన ‘నేషనల్ అవార్డుని రప్పించుకోవడానికి అనేక దారులు ఉండొచ్చు’ అనేది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినదే అని, ఆయనకు అవార్డు వచ్చినందుకు అసూయ తో మెగాస్టార్ రగిలిపోతున్నాడని , కొడుక్కి నేషనల్ అవార్డు రావాలని కోరుకోవడం లో తండ్రి ఎలాంటి తప్పు లేదని , కానీ అందుకోసం ఒకరు సాధించిన ఘనత ని తక్కువ చేసి మాట్లాడడం అన్యాయం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి పై విరుచుకుపడుతున్నారు.

అయితే ఇది కావాలని చిరంజీవి ని టార్గెట్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుందని , ఆయన సాధారణంగా మాట్లాడిన మాటలకు పెడార్థాలు తీసి ఆయన్ని ట్రోల్ చేయడం అన్యాయమని , సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే , భుజాలు తడుముకున్నట్టు అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అంశంపై ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన చిరంజీవి కామెంట్స్ కి రాబోయే రోజుల్లో ఆయన క్లారిటీ ఇస్తాడా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని క్రింద అందిస్తున్నాము మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

పెద్ది సక్సెస్ మీట్.. ఎవరెవరు వచ్చారో తెలుసా?

Peddi Success Meet
Peddi Success Meet

పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే దద్దరిల్లిపోయిన 'పెద్ది' విజయోత్సవ సభ.. షాక్ కి గురైన చిరంజీవి..

Peddi Success Meet
Peddi Success Meet

Peddi Success Meet: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ , ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తోటి స్టార్ హీరోలు నేడు పాన్ ఇండియా లో అడుగుపెట్టి మార్కెట్ పరంగా ఆయన్ని దాటేసి ఉండొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన క్రేజ్ , ఫాలోయింగ్ ని అందుకోవడం అంత తేలికైన విషయం కాదు అనేది విశ్లేషకుల వాదన. ఆయనది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని , ఒక సినిమా ఫ్లాప్ తో పోయేది కాదని రాజకీయాల్లోకి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయ్యాక సినిమాల్లో క్రేజ్ తగ్గుతుందని అనుకున్నారని , కానీ ఇసుమంత కూడా తగ్గలేదని విషయం గత ఏడాది విడుదలైన ‘ఓజీ’ చిత్రం తో తెలిసొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ కి మరో ఉదాహరణ గా నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరిగింది ‘పెద్ది’ సక్సెస్ మీట్ నిల్చింది.

ఈ విజయోత్సవ సభలో ఆ చిత్ర నిర్మాత సతీష్ కిలారి ‘పెద్ది’ సినిమాకు టిక్కెట్ రేట్స్ , స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు , ఉప ముఖ్యమంత్రులకు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ క్రమం లో ఆయన పవన్ కళ్యాణ్ పేరు తీయగానే ఒక్కసారిగా సభ మొత్తం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. నిర్మాతని దాదాపుగా 30 సెకండ్ల వరకు అభిమానులు అరుపులు , ఈలలు, కేకలతో హోరెత్తించారు. పాపం నిర్మాతకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఈ ఈవెంట్ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి షాక్ కి గురై అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు అత్తారింటికి దారేది ఆడియో లంచ్ ఈవెంట్ ని గుర్తు చేసుకున్నారు.

ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడేందుకు మైక్ అందుకోగా, అభిమానులు ఉత్సాగంతో అరుస్తూ , ఈలలు ఇస్తూ ఒక 30 సెకండ్ల వరకు ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేశారు. ఈ ఈవెంట్ జరిగి 13 ఏళ్ళు అయ్యింది , అప్పటికీ ఇప్పటికీ కాలం లోనే మార్పు , పవన్ కళ్యాణ్ క్రేజ్ లో కాదు అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్ కి సుకుమార్, అనిల్ రావిపూడి వంటి వారు కూడా స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహానికి చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Rohith Kumar (@thetfiupdates)

ఈ చిన్న పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారు.. అవేంటంటే..

Morning Healthy Habits
Morning Healthy Habits

Morning Healthy Habits: ప్రతిరోజూ ఉదయం మనం ఎలా ప్రారంభిస్తామన్నదే ఆ రోజు మొత్తం మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజంతా ఉత్సాహంగా, పాజిటివ్‌గా ఉండాలంటే నిద్ర లేవగానే కొన్ని మంచి అలవాట్లను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చిన్నచిన్న మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పనితీరును కూడా పెంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దామా..

గోరువెచ్చటి నీరు:
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చటి నీటిని తాగడం చాలా మంచిది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరానికి ఇది హైడ్రేషన్ అందిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ అలవాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

డీప్ బ్రీతింగ్:
ఉదయం కేవలం ఐదు నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆందోళనలను దూరం చేస్తుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో రోజంతా తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉండటంతో పాటు పనుల్లో ఫోకస్ కూడా మెరుగవుతుంది.

రోజువారీ పనులకు ప్లాన్:
ఉదయం కొన్ని నిమిషాలు కేటాయించి ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ఒక నోట్‌బుక్‌లో లేదా మొబైల్‌లో రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఏ పనిని ఎప్పుడు చేయాలనే స్పష్టత వస్తుంది. టైమ్ మేనేజ్మెంట్ మెరుగుపడి పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా అనవసర ఒత్తిడి కూడా తగ్గుతుంది.

30 నిమిషాలు వ్యాయామం:
ఉదయం వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్, జాగింగ్, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శక్తి స్థాయిలు పెరిగి రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి.

మొబైల్‌కు దూరంగా..:
చాలామంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చెక్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇది ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉదయం మొదటి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి పెట్టడం మంచిది.

పెళ్లి కాకుండానే ప్రియుడితో మొదలుపెట్టింది.. చివరికి తల్లిదండ్రులను, సొంత చెల్లిని.. ఇలాంటి ఆడపిల్ల ఏ ఇంట్లో పుట్టకూడదు

Shwetha Case
Shwetha Case

Shwetha Case: ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించారో.. ఆమె ఎదుగుతుంటే ఎంతగా ఆనందించారో.. ఆమె నడుస్తుంటే.. చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే.. ఎదుగుతుంటే గర్వపడ్డారు. ఉన్నత చదువులు చదువుతుంటే ఆనందపడ్డారు. కానీ.. ఆమె తమ గుండెల మీద తన్నుతుందని.. తమకు తల వంపులు తీసుకొస్తుందని.. చివరికి ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు..

ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మనుషులనే వారు ఎవరైనా సరే కన్నీటి పర్యంతమయ్యే ఘటన. దీనిని ఎలాంటి దారుణం అనాలో తెలియదు. ఎంతటి ఉన్మాదం.. ఎంతటి పైశాచికం.. ఎంతటి క్రూరం.. ఇలా ఎన్ని పదాలు చెప్పినా సరే తక్కువే. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి.. ఇలాంటి బుద్ధులు ఎందుకు పుడతాయి.. అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కూడా కలుగుతోంది..

కర్ణాటకలోని బెంగళూరు నగరంలో సాయి గ్రీన్ హోమ్స్ ప్రాంతంలో సోమ సుందర్.. మత్తు లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్వేత.. సుప్రియ కుమార్తెలు.. శ్వేత మొదట్లో బాగానే ఉండేది..ఆ తర్వాత విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కెన్నెత్ అనే యువకుడితో పెళ్లి కాకముందే సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం సోమ సుందర్.. ముత్తు లక్ష్మి కి తెలియడంతో వారు నిలదీశారు. ఇది పద్ధతి కాదు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శ్వేత తన ధోరణి మార్చుకోలేదు. పైగా మరింత దారుణంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

ఇక్కడితోనే శ్వేత విచ్చలవిడితనం ఆగిపోలేదు. తన తండ్రి పేరుని వాడుకుని దాదాపు 30 లక్షల వరకు అప్పు చేసింది. అప్పు ఇచ్చినవాళ్లు సోమసుందర్ ఇంటికి రావడం మొదలుపెట్టారు. దీనిపై సోమ సుందర్ శ్వేతను నిలదీశాడు. కొద్దిరోజులుగా అప్పుల వ్యవహారానికి సంబంధించి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శ్వేత తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంది. తన ప్రియుడుతో కలిసి ఒకరోజు ఇంటికి వచ్చింది. అప్పుడు ముత్తు లక్ష్మీ మాత్రమే ఇంట్లో ఉంది. కెన్నెత్, శ్వేత, ముత్తు లక్ష్మీ మధ్య గొడవలు జరిగాయి.

ఈ నేపథ్యంలో కెన్నెత్, శ్వేత కలిసి ముత్తు లక్ష్మి మీద కత్తితో దాడి చేశారు. ఆమె చనిపోయింది. రక్తపు మరకలను శుభ్రం చేసిన తర్వాత.. సోమ సుందర్.. సుప్రియ ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో శ్వేత.. కెన్నెత్ వారి మీద దాడి చేశారు. సుప్రియ చనిపోయింది. సోమ సుందర్ గాయపడి రక్షణ కోసం బయటికి పరుగులు తీశాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్వేత, కెన్నెత్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. చివరికి బాధ్యత గల ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దారుణంగా ప్రవర్తించింది. ఘటన జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కూడా తుడిచివేసే ప్రయత్నం చేసింది. నాడు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ మెడికల్ పిజి స్టూడెంట్ తల్లి కన్నీటితో విన్నవించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. సాటి ఆడదాని బాధను మమతా బెనర్జీ గుర్తించలేదు. పట్టించుకోలేదు.

ఇప్పుడు మమతా బెనర్జీ కన్నీటి పర్యంతమవుతున్నారు. తాను ఎందుకు చేయలేదా అని బాధపడుతున్నారు. ఎందుకంటే నాడు మెడికల్ పిజి స్టూడెంట్ పై జరిగిన దారుణం కేసులో బిజెపి ఒకే స్టాండ్ తో ఉంది. మమత ఏలుబడిలో ఘోరానికి గురై, చనిపోయిన విద్యార్థినికి న్యాయం చేసేందుకు బిజెపి రంగంలోకి దిగింది. ఇటీవల ఎన్నికల్లో ఆ మెడికల్ పిజి స్టూడెంట్ తల్లి రత్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో రత్న విజయం సాధించింది.

ఇది ఒక తల్లిగా ఆమెకు లభించిన మొదటి సానుకూలత. బెంగాల్ ముఖ్యమంత్రిగా సుభేందు అధికారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. ఈ కేసు మీద ఆయన దృష్టి పెట్టారు. అంతేకాదు న్యాయం చేస్తానని రత్నకు హామీ ఇచ్చారు. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. నాటి ఘటన విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇల్లును నేలమట్ట చేశారు. అంతేకాదు.. ఇది శాంపిల్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని బెంగాల్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆయన చెబుతున్న ఆ మాటలు విని రత్న కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీలోనే కుప్పకూలిపోయారు. తన కూతుర్ని తలుచుకుంటూ రోదించారు.

ముఖ్యమంత్రిగా సుభేందు అధికారి నూటికి నూరు శాతం విజయవంతమయ్యారు. ఒక కన్నతల్లి బాధను అర్థం చేసుకొని.. ఆమెకు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆడదై ఉండి కూడా.. ఆడదాని బాధను అర్థం చేసుకోక రాక్షసి లాగా మిగిలిపోయారు మమత బెనర్జీ.. ఇద్దరికీ ఎంత తేడా..

'పెద్ది' విజయోత్సవ సభలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పేరు మర్చిపోయిన రామ్ చరణ్..

Peddi Success Event
Peddi Success Event

Peddi Success Event: 2024 వ సంవత్సరం, డిసెంబర్ న విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో కళ్లారా చూశాము . దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం అప్పట్లో అనేక వివాదాలకు కూడా దారి తీసింది. సంధ్య థియేటర్ ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ రావడం వల్ల, తొక్కిసలాట ఘటన జరిగి ఒక మహిళ చనిపోవడం , ఆమె బిడ్డ శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లి , ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడం వంటివి దురదృష్టకరమైన సంఘటనలు. ఇకపోతే సినిమా విడుదలైన మూడు రోజులకు మూవీ టీం ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా వివాదాలకు దారి తీశాయి.

ఆయన తన ప్రసంగం లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తన పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అనే ప్రచారం కూడా చాలా బలంగా జరిగింది. అంతే కాదు మన ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పేరుని కూడా ఆయన పక్కవాళ్ళను అడిగి తెలుసుకున్నాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే నిన్న హైదరాబాద్ లోని ‘పెద్ది’ సక్సెస్ ఈవెంట్ లో జరిగింది. ఆ చిత్ర హీరో రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతఙ్ఞతలు చెప్తూ , కందుల దుర్గేష్ పేరు మర్చిపోయారు, ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. రాష్ట్రాన్ని నడిపించే మంత్రుల పేర్లను రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి స్థాయి ఉన్న సెలబ్రిటీలు మర్చిపోతే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కి ఎంతో సహకారం అందిస్తోంది , టిక్కెట్ రేట్స్ విషయం లో ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదు , అలాంటి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నప్పుడు హీరోలు కూడా అదే స్థాయిలో గౌరవం ఇవ్వాలి అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే రామ్ చరణ్ కి మొదటి నుండి పేర్లను మర్చిపోయే అలవాటు ఉంది. #RRR మూవీ కి సంబంధించి ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో ఎన్టీఆర్, రాజమౌళి లు కూడా ఈ విషయాన్నీ ప్రస్తావించారు. కాబట్టి ఇది కావాలని దుర్గేష్ పేరు మర్చిపోయిన సందర్భం కాదని , నిజంగానే చరణ్ కి మతిమరుపు సమస్య ఉండడం వల్ల జరిగిన పొరపాటు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు.

'పెద్ది' తర్వాత నా కూతురు నన్ను నాన్న అని పిలవడం మానేసింది - రామ్ చరణ్

Peddi Success Meet
Peddi Success Meet

Peddi Success Meet: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టించిందో మనమంతా చూశాము. గత కొంత కాలంగా లాంగ్ థియేట్రికల్ రన్ అంటే ఏంటో మర్చిపోయిన మన టాలీవుడ్ కి , లాంగ్ రన్ అంటే ఏంటో రుచి చూపించిన చిత్రమిది. మెగా ఫ్యామిలీ హీరో కి పాజిటివ్ టాక్ పబ్లిక్ లో ఉంటే వసూళ్లు ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుద్దో ఎవ్వరూ చెప్పలేరు అనడానికి మరో నిదర్శనమే ఈ పెద్ది. కమర్షియల్ గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది , అది ప్రతీ సినిమాకు సాధారణమే కానీ , ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ సంపాదించుకున్న పేరు , గౌరవ మర్యాదలు మాత్రం చాలా గొప్పవి.

ఇకపోతే నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభ ని నిర్వహించారు మేకర్స్. ఈ సభ లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకా పెద్ద హిట్స్ రావొచ్చు , కానీ పెద్ది మాత్రం నా కెరీర్ లో ఎంతో స్పెషల్. ఈ సినిమా తర్వాత చాలా మంది నా పేరు రామ్ చరణ్ అనే విషయం మర్చిపోయారు , పెద్ది పెద్ది అని పిలుస్తున్నారు. నా కూతురు ‘పెద్ది’ విడుదలకు ముందు నాన్న అని పిలిచేది. కానీ ఇప్పుడు ‘పెద్ది’ అని పిలుస్తోంది. నన్ను నాన్న అని పిలవడం పూర్తిగా మర్చిపోయింది. ఆ స్థాయిలో ఈ పాత్ర జనాల్లోకి దూసుకుపోయింది , అందుకు ఎంతో ఆనందం గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ బుచ్చి బాబు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాను అని అనిపించలేదు , ఒక గొప్ప సినిమా చేయబోతున్నాను అనిపించింది. కథని బలంగా నమ్మి ఈ చిత్రాన్ని చేశాను , అందుకు ఆడియన్స్ మా పై కురిపించిన ఈ ప్రేమ మరువలేనిది. ప్రతీ టెక్నీషియన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారికి మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ వెన్నుముక లాగా నిల్చింది. ఇక నిర్మాత సతీష్ గారి గురించి చెప్పాల్సి వస్తే , నేను చాలా మంది నిర్మాతలతో పని చేశాను కానీ , సతీష్ గారి లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతతో పని చెయ్యలేదు. ఇది ఆయన మొదటి సినిమాగా మాకు అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

'పెద్ది' విజయోత్సవ సభలో #RC17 అప్డేట్ పై డైరెక్టర్ సుకుమార్ హాట్ కామెంట్స్..

Peddi Success Celebrations
Peddi Success Celebrations

Peddi Success Celebrations: ‘బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని , ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో అభిమానుల మధ్య ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సక్సెస్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా, డైరెక్టర్ సుకుమార్ మరియు అనిల్ రావిపూడి వంటి వారు స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ నటన గురించి , పెద్ది సినిమా గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆయన రామ్ చరణ్ తో చేయబోయే సినిమా పై మాట్లాడిన మాటలు అభిమానుల్లో సరికొత్త క్యూరియాసిటీ ని పెంచాయి.

ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటల్లో హైలైట్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘చిరంజీవి గారు, చిన్నప్పుడు మీ సినిమాలు ఫ్లాప్ అయితే మీరు నిద్రపోయేవారేమో కానీ , మేము మాత్రం మీరు మరో హిట్ కొట్టేవరకు నిద్రపోయేవాళ్ళం కాదు, అంతటి అభిమానం మీరంటే. అలాంటి మీరు రామ్ చరణ్ లాంటి నటుడిని ఇండస్ట్రీ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం పెద్ది గురించి మాట్లాడుతూ ‘బుచ్చి బాబు ముందుగా నన్ను , చరణ్ ని కూర్చోబెట్టి , ఈ కథ చెప్తున్నప్పుడు మేము ఆశ్చర్యానికి గురయ్యాము. చాలా ముచ్చటపడ్డాము, చరణ్ కళ్ళలో అయితే నీళ్లు తిరిగాయి. మాస్ ఇమేజ్ ఉన్న చరణ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాని , విలన్ లేకుండా పరిస్థితులే విలన్స్ గా నిలిచే సినిమాని ఒప్పుకొని చేయడం చాలా పెద్ద గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం ఇలాంటి సినిమాని మీరంతా ఆదరించి , గొప్ప బ్లాక్ బస్టర్ చేయడం’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కమర్షియల్ ఫార్మటు సినిమా తీరునే మార్చేసిన చిత్రమిది. బుచ్చి బాబు కి ఈ విషయం లో థాంక్స్ చెప్పాలి. ఒక ఉప్పెన తీసిన అబ్బాయి , పెద్ది లాంటి పెద్ద సినిమాని తీయడం గొప్ప విషయం. చరణ్ కష్టానికి ఫలితమే ఈ సినిమా. చాలా మంది చరణ్ చాలా అద్భుతంగా చేసాడని అంటున్నారు అని తన దృష్టికి తీసుకెళ్తే , ఇలాంటి కథ లేకపోతే నాకు ఎక్కడ అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు స్కోప్ ఉంటుంది. తన చుట్టూ తిరిగే వాళ్లకు , చరణ్ తో కలిసి పనిచేసేవాళ్లకు తెలుసు , మా చరణ్ బంగారం’ అంటూ చెప్పుకొచ్చాడు . ఇక #Rc17 అప్డేట్ చెప్పాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున గోల చేయగా, నేనేమి చెప్పను , చెప్పడం నాకు ఇష్టం లేదు, మీరే ఎలా ఉండబోతుందో ఊహించుకుంటూ ఉండండి అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు పట్టలేని అదృష్టం..

Today 24 June 2026 Horoscope
Today 24 June 2026 Horoscope

Today 24 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలకు వారి కెరీర్ దశ తిరగనుంది. మరికొన్ని రాష్ట్ర వ్యాపారులకు అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థులపై కనీసం ఉంచాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. ఈ సమయంలో తోటి వారి సహాయంతో వీటిని పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. అయితే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వారి మద్దతును పొందాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల సహాయం ఉంటుంది పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి వారి సహాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొన్ని ప్రయాణాలు ఈరోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల వాయిదాలు వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా ఇంట్లోకి ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. వీరు చేసిన కొన్ని పనులకు ప్రోత్సాహంతో పాటు పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అప్పుల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అయితే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారులు లాభాలు పొందాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపానులు వస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. వ్యాపారులకు ప్రత్యర్థులు ఆటంకాల సృష్టించే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు విని అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లేందుకు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు సాధించే క్రమంలో ఇతరుల సహాయం తీసుకుంటారు. పెండింగు పనులను పూర్తిచేయాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

'ఎబోవ్ యావరేజ్' గ్రాసర్ గా నిల్చిన 'పెద్ది'.. వచ్చిన నష్టాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Peddi OTT
Peddi OTT

Peddi Movie Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని వసూళ్ల సునామీ ని సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఈ హద్దులు దాటిన రేట్స్ కి ఈ చిత్రాన్ని అమ్మడం వల్ల ఓవరాల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ నెంబర్ ని దాటలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఎబోవ్ యావరేజ్ గ్రాసర్ గా నిల్చింది. ఓవర్సీస్ , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లోనే కాకుండా , తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ , నెల్లూరు జిల్లాలోనూ నష్టాలను మిగిలించింది ఈ చిత్రం. మిగతా ప్రాంతాల్లో కూడా నిర్మాత రిటర్న్ జీఎస్టీ ఇస్తే తప్ప బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేని పరిస్థితి. ఒకవేళ ఈ సినిమాని రీజనబుల్ రేట్స్ కి అమ్మి ఉండుంటే , భారీ లాభాలు వచ్చి ఉండేవి.

ఓవర్సీస్ లో రామ్ చరణ్ సినిమాలకు మొదటి నుండి భారీ డిమాండ్ ఉండేది కాదు. రంగస్థలం తప్ప , ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఒక్కటి కూడా ఓవర్సీస్ మార్కెట్స్ లో లేవు. #RRR చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, అది రామ్ చరణ్ ఖాతాలో రాలేదు , రాజమౌళి ఖాతాలోకి వెళ్ళింది. అలాంటి మార్కెట్ ఉందని తెలిసి కూడా ‘పెద్ది’ చిత్రం 10 మిలియన్ డాలర్లకు అమ్మారు. కట్ చేస్తే 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఓవర్సీస్ బయ్యర్స్ మొత్తానికి 50 శాతానికి పైగా నష్టాలు వాటిల్లింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఇక్కడ రామ్ చరణ్ సినిమాకు టాక్ భారీ వసూళ్లు కచ్చితంగా వస్తాయి , కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కూడా.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇరగకుమ్మేసిన ‘పుష్ప 2’, ‘#RRR ‘ క్లోజింగ్ షేర్స్ ని మించి ఈ సినిమాని కొనుగోలు చేశారు. ఒక్క ఫెస్టివల్ డే లేకపోయినా కూడా , ఈ రేంజ్ రేట్స్ కి అమ్మడం ముమ్మాటికీ నిర్మాత తప్పే. కచ్చితంగా ‘పెద్ది’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి అద్భుతమైన థియేట్రికల్ షేర్స్ వచ్చాయి. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ హద్దులు దాటడం వల్లే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది. చివరికి ఇంత బాగా ఆడినప్పటికీ కూడా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ అనిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా నిర్మాతలు కళ్ళు తెరుచుకొని, రీజనబుల్ రేట్స్ కి బిజినెస్ చేస్తే భారీ లాభాలను బయ్యర్స్ కి చూపించవచ్చు. భవిష్యత్తులో ఇది మారుతుందో లేదో చూద్దాం.

బుచ్చిబాబు ఆ విషయంలో సుకుమార్ కి బ్యాడ్ నేమ్ తీసుకువస్తున్నాడా..?

Babu Sana And Sukumar
Babu Sana And Sukumar

Babu Sana And Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో సుకుమార్ ఒకరు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నప్పటికి ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే తన ప్రియ శిష్యుడిగా పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు విషయంలో సుకుమార్ చాలా వరకు కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బుచ్చిబాబు చేసిన ఉప్పెన, పెద్ది రెండు సినిమాల వెనక సుకుమార్ ఉన్నాడనే విషయం మనందరికి తెలిసిందే. అయితే బుచ్చిబాబు మాత్రం ఉప్పన సినిమాని తో భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత రీసెంట్ గా చేసిన పెద్ది సినిమాతో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడనే చెప్పాలి. ఒక రకంగా బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అవ్వడం వల్ల అతనికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. దానికి తోడుగా స్టార్ హీరోలు సైతంతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం సుకుమార్ బ్రాండ్ నేమ్ ని చెడగొడుతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…

బుచ్చిబాబు తనను తాను మార్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ కంటెంట్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే తన గురువు అయిన సుకుమార్ కి ఎలాంటి రిమార్క్ రాకుండా చూసుకుంటే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమాతో సుకుమార్ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు రామ్ చరణ్ కి మరో సక్సెస్ ను అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇరుముడి మూవీ చూసిన చిరంజీవి... ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Irumudi Movie
Irumudi Movie

Irumudi Movie: కెరియర్ మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న నటుడు రవితేజ… మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో చాలావరకు డీలా పడ్డాడు. ఇక ఎట్టకేలకు ఆయన ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో మరో భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రషెస్ ను మెగాస్టార్ చిరంజీవి చూశారట…ఈ సినిమా అతనికి విపరీతంగా నచ్చేసిందనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి చిరంజీవికి అంత ఈజీగా ఏ సినిమా నచ్చదు.

కానీ రవితేజ చేసిన ఈ సినిమా అతనికి నచ్చడమే కాకుండా ఈ మూవీ లో మనం కొత్త రవితేజ ని మనం చూడబోతున్నాం అంటూ సినిమా మేకర్స్ తో కూడా చెప్పారట. మొత్తానికైతే శివ నిర్వాణ ఈ సినిమా ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇంతకుముందు లవ్ స్టోరీస్ చేసిన ఆయన ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కూడా సినిమాను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే కెపాసిటి తనకు ఉందని మెచ్చుకున్నారట. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తూనే తన కూతురి కోసం తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది. ఒక అయ్యప్ప స్వామి భక్తుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూడా క్లారిటిగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇరుముడి సినిమా రవితేజ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారుతుందని చిరంజీవి చెప్పిన మాటలను సినిమా యూనిట్ అయితే బాగా బలంగా నమ్ముతున్నారు. ఇక తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు…

మహేష్ బాబు తప్ప ఆ సినిమాను ఎవరు చేసిన ప్లాప్ అయ్యేదా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో చాలా విభిన్న తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి బొక్క బోర్లా పడ్డ మహేష్ బాబు ఆ తర్వాత కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కూడా భారీ ప్రయోగం చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి సుకుమార్ ఈ సినిమా చేసినందుకు గాను అతనికి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మొత్తానికైతే మహేష్ బాబు కెరియర్ లోనే ఇదొక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమాని అంతకుముందు వేరే హీరోతో చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ బాబు తోనే ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మహేష్ బాబు తో చేయడం వల్లే సూపర్ సక్సెస్ అయిందని వేరే హీరోలు చేసి ఉంటే అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండేది కాదని చాలామంది ఈ సినిమాని చూసిన సీనీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు… ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు కూడా ఒక సోషల్ మెసేజ్ ను ఇస్తూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా తన పంథాను మార్చి ప్రయోగాత్మకమైన సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

పాన్ ఇండియాలో తన తోటి దర్శకులందరు ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం కొంతవరకు డీలా పడ్డాడు. కాబట్టి ఎలాగైనా సరే పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలు చేయడానికి పూనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో చేయబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది…

మరో మహిళతో భర్త దుకాణం.. ఈ భార్య గుడిలో ఏం చేసిందో తెలుసా..

Hyderabad Temple Incident
Hyderabad Temple Incident

Hyderabad Temple Incident: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద ఏది చెప్తే అది శాసనంగా ఉండేది. ఫలితంగా మిగతా కుటుంబ సభ్యులు హద్దుల్లో ఉండేవారు. జాగ్రత్తగా మెసలుకునేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎవరికి వారే అన్నట్టుగా మారిపోతుంది. దీనికి తోడు మనుషుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. తాత్కాలిక సంబంధాల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవడానికి మనుషులు తెగబడుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే విలువను కోల్పోయి జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా బంధాలు మరింత పెరిగిపోయాయి.

ఇటువంటి దారుణమైన సంబంధాల వల్ల ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి దోషులను శిక్షిస్తున్నారు. అయినప్పటికీ ఈ తరహా దారుణాలు ఆగడం లేదు. కొందరైతే భర్తలను హద్దులు పెట్టడానికి రకరకాల విధానాలు పాటిస్తున్నారు. చివరికి క్షుద్ర పూజలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటువంటి సంఘటన హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకుంది.image.png

హైదరాబాద్ నగర శివారులో సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత ఆలయ పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుని తింటారు. ఈ ఆలయానికి ఒక మహిళ వచ్చింది. ఆమె వయసు 40 లోపు ఉంటుంది. అందరూ అమ్మవారికి మొక్కలు చెల్లిస్తుంటే ఆమె మాత్రం ప్రత్యేకంగా కూర్చుంది. చేతిలో కొబ్బరి చిప్పలు పట్టుకుంది. గాజులు, పసుపు, కుంకుమతో పూజలు చేసింది. చాలాసేపు అలానే కూర్చుంది. పైగా చిత్ర విచిత్రంగా చూపులు చూసింది. దీంతో ఆ ఆలయానికి వచ్చే భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెను సిబ్బంది అక్కడి నుంచి పంపించారు.

ఆ మహిళ భర్త కొంతకాలంగా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. భార్యను పట్టించుకోవడం లేదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడటం లేదు. దీంతో భర్త ప్రవర్తనతో విసిగి వేసారి పోయిన ఆమె ఇలా ఆలయానికి వచ్చింది. క్షుద్ర పూజల మాదిరిగానే పూజలు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం నాశనం కావాలని అమ్మవారిని కోరినట్టు ఆమె అరుపుల ద్వారా తెలిసిందని మిగతా భక్తులు అంటున్నారు. ఆమె వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కాబోయే మొగుడిని ప్రియుడితో.. ఇది మరో ఇండోర్ ఘటన.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు..

Ketan Agarwal Death
Ketan Agarwal Death

Ketan Agarwal Death: గత ఏడాది ఇండోర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి రఘు వంశీ మేఘాలయలో హత్యకు గురయ్యాడు. అతడి మరణం వెనుక భార్య ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉండడంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ తరహా ఘటనలు మనదేశంలో తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘటన కూడా అటువంటిదే.

మహారాష్ట్రలోని పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడు. ఇతడిది సహజ మరణమని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం మొదలైంది. కేతన్ అగర్వాల్ చనిపోవడం వెనక పెద్ద కుట్ర ఉందని.. దానికి పాల్పడింది ఒక కీలకమైన వ్యక్తి అని పోలీసులు తేల్చారు. దీంతో కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కేతన్ అగర్వాల్ వయసు 26 సంవత్సరాలు. ఇతడు ఈనెల 18న అత్యంత చారిత్రాత్మకమైన లోహ గడ్ కోట వద్ద దాదాపు 500 అడుగులకు మించిన లోతు ఉన్న ఒక లోయలో పడి చనిపోయాడు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. కేతన్ కు సియా అనే అమ్మాయితో వివాహం కుదిరింది. ఇటీవల వారు సరదాగా గడిపేందుకు లోహగడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతుండగా గాలులు వచ్చాయి. దీంతో లోయలో పడి చనిపోయాడని సియా పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఈ సంఘటనను ప్రమాదంగానే భావించారు.

పోలీసులు విచారిస్తున్నప్పుడు సియా సంబంధం లేకుండా సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సియాకు మరొక వ్యక్తితో రిలేషన్ ఉంది. కేతన్ తో పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే అతడిని చంపడానికి కుట్ర చేసింది. బయటికి వెళ్దామని అతడిని లోహ గడ్ ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడికి సియా ప్రియుడు వచ్చాడు. వారిద్దరూ కలిసి కేతన్ ను లోయలోకి తోసి వేశారు. అతడు చనిపోయిన తర్వాత అసలు నాటకం మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఈ నిజాలు తెలియడంతో సియా, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు.

కేతన అగర్వాల్ స్వస్థలం పూనేలోని గహుంజే ప్రాంతం. ఇక్కడికి స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఒక వ్యాపార కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇతడికి సియాతో ఎంగేజ్మెంట్ జరిగింది. అదే కాదు, వచ్చే నవంబర్ నెల 17న జరిగే పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించడానికి 17 కోట్లతో ఉదయపూర్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను బుక్ చేశారు. అంతేకాదు బంధువులను తీసుకురావడానికి రెండు హెలికాప్టర్లు కూడా బుక్ చేశారు. అంతేకాదు ఈనెల 19న సియా జన్మదిన సందర్భంగా.. కాబోయే భార్యకు అద్భుతమైన కానుక ఇవ్వడానికి లోహ గడ్ కోటకు వెళ్లారు. అక్కడే కేతన్ తన ప్రాణాలు కోల్పోయాడు.