Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Peddi Success Event: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం చిరంజీవి కి...

Chiranjeevi Peddi Success Event: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం చిరంజీవి కి ఇష్టం లేదా..? అనుమానాలకు దారి తీస్తున్న లేటెస్ట్ కామెంట్స్..

Chiranjeevi Peddi Success Event: మన టాలీవుడ్ నుండి మొట్టమొదటి నేషనల్ అవార్డు ని అందుకున్న హీరో గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం మన తెలుగు వాళ్లకు గర్వ కారణం కావొచ్చు , కానీ సినీ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలకు కాస్త అసూయ ని కలిగించే విషయమే. పైకి శుభాకాంక్షలు తెలియజేస్తారు కానీ , లోపల మాత్రం అయ్యో మనకి రాలేదే అనే బాధ, అసూయ అలా […]

Chiranjeevi Peddi Success Event: మన టాలీవుడ్ నుండి మొట్టమొదటి నేషనల్ అవార్డు ని అందుకున్న హీరో గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం మన తెలుగు వాళ్లకు గర్వ కారణం కావొచ్చు , కానీ సినీ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలకు కాస్త అసూయ ని కలిగించే విషయమే. పైకి శుభాకాంక్షలు తెలియజేస్తారు కానీ , లోపల మాత్రం అయ్యో మనకి రాలేదే అనే బాధ, అసూయ అలా ఉండిపోతుంది. అలాంటి అసూయ మెగాస్టార్ చిరంజీవి లో కూడా ఉండిపోయిందా?, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం పట్ల ఆయన సంతోషం తో లేరా?, తన కొడుక్కి రావాల్సిన అవార్డు అల్లు అర్జున్ కి వచ్చింది అనే ఫీలింగ్ తో ఉన్నారా ? , ఇలాంటి అనుమానాలు నిన్న జరిగిన ‘పెద్ది’ విజయోత్సవ సభలో మెగాస్టార్ మాట్లాడిన మాటలు తర్వాత నెటిజెన్స్ లో కలిగాయి.

సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి పై ట్రోల్స్ చేస్తున్నారు , విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘పెద్ది చిత్రాన్ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అవార్డు ని రప్పించుకోవడానికి అనేక దార్లు ఉండొచ్చు, కానీ నా బిడ్డ నటన చూసిన తర్వాత జనాల్లో ఇతనికి నేషనల్ అవార్డు వస్తే బాగుంటుంది అనే భావన కలిగింది చూడు , అంతకు మించిన అవార్డు ఇంకేమి కావాలి’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆయన ‘నేషనల్ అవార్డుని రప్పించుకోవడానికి అనేక దారులు ఉండొచ్చు’ అనేది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినదే అని, ఆయనకు అవార్డు వచ్చినందుకు అసూయ తో మెగాస్టార్ రగిలిపోతున్నాడని , కొడుక్కి నేషనల్ అవార్డు రావాలని కోరుకోవడం లో తండ్రి ఎలాంటి తప్పు లేదని , కానీ అందుకోసం ఒకరు సాధించిన ఘనత ని తక్కువ చేసి మాట్లాడడం అన్యాయం అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవి పై విరుచుకుపడుతున్నారు.

అయితే ఇది కావాలని చిరంజీవి ని టార్గెట్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుందని , ఆయన సాధారణంగా మాట్లాడిన మాటలకు పెడార్థాలు తీసి ఆయన్ని ట్రోల్ చేయడం అన్యాయమని , సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే , భుజాలు తడుముకున్నట్టు అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అంశంపై ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారిన చిరంజీవి కామెంట్స్ కి రాబోయే రోజుల్లో ఆయన క్లారిటీ ఇస్తాడా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని క్రింద అందిస్తున్నాము మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper