Home Blog Page 78

ఎన్డీఏలోకి స్టాలిన్.. పెద్ద ప్రయత్నాల్లో లోకేష్!

Stalin NDA Entry
Stalin NDA Entry

Stalin NDA Entry: రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. ఎవరికి ఎవరు శత్రువులో.. ఎవరు మిత్రులో కూడా అంచనా వేయలేం. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒక్క ఏపీ తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని అనుబంధ ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకే దక్షిణాదిన మరింత పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అయితే ఏపీలో మాత్రం టిడిపి కూటమి అధికారంలో ఉంది. కర్ణాటకలో విజయ్ నేతృత్వంలోని టీవీ కి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే మొన్నటి ఎన్నికల వరకు డీఎంకేతో స్నేహాన్ని కొనసాగించారు జగన్. కానీ ఎప్పుడైతే విజయ్ గెలిచారో.. వైసీపీ నేతలు రూటు మార్చారు. జగన్ సైతం స్టాలిన్ కంటే విజయ్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. జాతీయస్థాయిలో ఎన్డీఏ స్టాండ్ తీసుకున్న టిడిపి స్టాలిన్ తో పాటు విజయ్ ను సైతం రాజకీయ ప్రత్యర్థి గా చూసింది.

* మారిన బిజెపి వైఖరి..
అయితే స్టాలిన్ విషయంలో బిజెపి వైఖరి మారినట్లు తెలుస్తోంది. స్టాలిన్ సైతం ముస్లిం లీగ్ పార్టీని విడిచిపెట్టి ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే కాంగ్రెస్ డీఎంకేకు దూరమైంది. తద్వారా బిజెపికి వ్యతిరేకం అన్న అంశాన్ని దాటి బయటకు వచ్చేసింది డిఎంకె. మారిన పరిస్థితుల నేపథ్యంలో విజయ్ బలపడకుండా ఉండాలి అంటే ఎన్డీఏలో చేరడం శ్రేయస్కరమని స్టాలిన్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి బిజెపి నుంచి తనకు ఇబ్బంది రాకుండా చూసుకోవడంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారు. తమిళనాడు రాజకీయాలు తనకు ఇబ్బందికరంగా మారితే స్టాలిన్ ఎన్డీఏ గూటికి చేరుకునే అవకాశం ఉంది.

* డీఎంకే ప్రభుత్వం పై ప్రశంసలు
మరోవైపు స్టాలిన్ కోసం కేంద్ర ప్రభుత్వం లోకేష్ ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ ను విడిచిపెట్టి విజయ్ తో స్నేహం చేస్తున్నారు. అయితే జగన్ కోసం చంద్రబాబుతో ఉన్న మంచి సంబంధాలను వదులుకున్నారు స్టాలిన్. అందుకే లోకేష్ ద్వారా ఎన్డీఏలో చేరేందుకు స్టాలిన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఢిల్లీలో జరిగిన ఓ కాంక్లేవ్ లో అప్పటి డిఎంకె ప్రభుత్వాన్ని పొగిడారు. స్టాలిన్ సర్కార్ విధానాలను ప్రశంసించారు. పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో తమిళనాడు ప్రభుత్వం ఏపీతో పోటీపడేదని.. ఈ క్రమంలో పారదర్శకంగా డీఎంకే ప్రభుత్వం వ్యవహరించేదని.. ఈ విషయాన్ని స్వయంగా పారిశ్రామిక వేత్తలే చెప్పారని ప్రకటించారు లోకేష్ . తద్వారా స్టాలిన్ ను ఎన్డీఏలోకి తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం ప్రారంభమైంది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.

నచ్చకపోతే చెప్పేయాలి.. అంతం చేసే క్రూరత్వం ఏంటి

Maharashtra Shocking Crime
Maharashtra Shocking Crime

Maharashtra Shocking Crime: వెనకటి రోజులో పెద్దలు కఠినంగా ఉండేవారు. పిల్లల విషయంలో ప్రతి నిర్ణయం వారు మాత్రమే తీసుకునేవారు. కేవలం తాము తీసుకునే నిర్ణయానికి తల ఊపే అవకాశం మాత్రమే పిల్లలకు ఇచ్చేవారు. దీనివల్ల నాటి కాలంలో పెద్దల మాటకు ఎదురులేకుండా పోయేది. అందువల్లే పిల్లలు భయంతో ఉండేవారు. క్రమశిక్షణను కలిగి ఉండేవారు. తద్వారా దారణమైన ఘటనలు.. ఘోరమైన ఉదంతాలు జరిగేవి కావు.

ఇప్పటి కాలంలో పూర్తిగా మనుషుల వ్యవహార శైలి మారిపోయింది. పెద్ద కుటుంబాలు కనిపించడం లేదు. కుటుంబాలలో పెద్దలు వృద్ధాశ్రమాలకు పరిమితమవుతున్నారు. యువత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని విహంగం మాదిరిగా తిప్పుతున్నారు. దీనివల్ల వారు ఇబ్బంది పడడమే కాకుండా.. కుటుంబంలో మిగతా వారికి కూడా కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘోరం మరోసారి సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తోంది.

మహారాష్ట్రలోని పూణేలో ఫియాన్సీ చేతిలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు. కేతన్ కు సియా అనే యువతితో వివాహం కుదిరింది. మరి కొద్ది రోజుల్లో వారిద్దరికీ పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లిని అత్యంత ఘనంగా జరపడానికి కేతన్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ప్రత్యేకంగా రాజస్థాన్లోని ఉదయపూర్ లో 17 కోట్లు పెట్టి ప్యాలస్ బుక్ చేశాడు.. బంధువులను తీసుకురావడానికి హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచాడు. తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నా అతడిని సియా తన ప్రేమికుడితో కలిసి అంతం చేసింది.

పూణే కు సుదూర ప్రాంతంలో ఉన్న ఒక కోట వద్దకు తీసుకెళ్లిన సియా.. తన ప్రేమికుడి సహాయంతో కేతన్ ను లోయలోకి తోసివేసింది. అతడు అందులో పడిపోయి చనిపోయాడు. వాస్తవానికి ఈ ఘటన కంటే ముందు నాలుగు రోజుల క్రితమే అతడిని అదే లోయలో తోసివేసి చంపడానికి ప్రయత్నించినట్టు కేతన్ తండ్రి ఆరోపిస్తున్నాడు. మరోవైపు కేతన్ చనిపోయిన తర్వాత సియా ఇన్ స్టా గ్రామ్ లో విషాదకరమైన పోస్టులు పెట్టింది. మరోవైపు సోషల్ మీడియాలో సియా కు కేతన్ ప్రపోజ్ చేసిన వీడియో.. హగ్ చేసుకున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. కాగా.. కేతన్ నచ్చకపోతే సియా ముందే చెప్పాలి.. అంతేగాని ఇలా చంపడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

పశ్చిమాసియాలో ఇంత భారీగా చమురు నిల్వలు ఎలా వచ్చాయో తెలుసా?*

Middle East Oil Reserves
Middle East Oil Reserves

Middle East Oil Reserves: దేవుడు కొన్ని ఇస్తే.. కొన్ని తీసుకుంటారు అంటారు. మిడిల్‌ ఈస్ట్‌లో దేశాలు ప్రస్తుతం పూర్తి ఎడారి దేశాలు ఇక్కడ వర్షాలు కురవవు. పంటలు పండవు. చివరకు తాగునీరు దొరకడం కూడా కష్టమే. కానీ ఇలాంటి దేశాలకు దేశుడు క్రూడ్‌ బంగారం ఇచ్చాడు. ఈ దేశాల భూగర్భంలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం దేశాలకు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచే చమురు సరఫరా జరుగుతోంది. అందుకే ఈ దేశాలతో ఏ దేశాలూ వైరం పెట్టుకోవు. మరి ఇంత భారీ మొత్తంలో చమురు నిల్వలు రావడానికి, అక్కడి భౌగోళిక పరిస్థితులతోపాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది.

మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు అంటే..
మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ. ప్రపంచంలోని సంప్రదాయిక చమురు నిల్వల్లో సుమారు 48 శాతం వరకు కలిగి ఉన్నాయి. నేడు వేడి ఎడారులుగా కనిపించే ఈ ప్రాంతంలో ఇంత విపరీతమైన క్రూడ్‌ ఆయిల్‌ ఎలా నిల్వలు ఏర్పడడం యాదృచ్ఛికం కాదు. కోట్ల సంవత్సరాల భౌగోళిక చరిత్ర, సముద్రాల నుంచి జరిగిన మార్పులు, టెక్టోనిక్‌ కదలికలు దీనికి కారణం. శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ రహస్యాన్ని వెల్లడి చేస్తున్నాయి.

క్రూడ్‌ ఆయిల్‌ ఎలా ఏర్పడుతుంది..
క్రూడ్‌ ఆయిల్‌ ఏర్పడటానికి లక్షల నుంచి కోట్ల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లోని సూక్ష్మ జీవులు(ప్లాంక్టన్, ఆల్గే), చనిపోయిన చేపలు, సముద్ర వ్యర్థాలు సముద్ర అడుగున చేరుతాయి. ముఖ్యంగా ఆక్సిజన్‌ లేని (అనాక్సిక్‌) పరిస్థితుల్లో ఈ సేంద్రియ పదార్థాలు కుళ్లిపోకుండా సంరక్షించబడతాయి. కాలక్రమేణా భూమి పొరల్లో వచ్చే మార్పుల వల్ల వాటిపై మట్టి, ఇసుక, కార్బోనేట్‌ శిలలు కప్పబడతాయి. లోతైన భూమి అడుగున (సాధారణంగా 2–4 కిలోమీటర్ల లోతు) అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడి కారణంగా ఈ పదార్థాలు మొదట ‘‘కెరోజెన్‌’’గా మారి, తర్వాత ద్రవ క్రూడ్‌ ఆయిల్‌గా మారుతాయి. ఇది రసాయనిక మార్పు (క్యాటాజెనెసిస్‌). కొన్ని చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల గ్యాస్‌గా మారుతుంది. ఈ చమురు సహజంగా పోరస్‌ రాళ్లలోకి వలసపోయి (మైగ్రేషన్‌) నిల్వ అవుతుంది.

నాడు సముద్ర గర్భంలో మిడిల్‌ ఈస్ట్‌…
సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం (జురాసిక్‌–క్రెటేషియస్‌ కాలం) మిడిల్‌ ఈస్ట్‌ మొత్తం ఒక విశాలమైన, వెచ్చని, నిస్సారమైన సముద్రంగా ఉండేది. దీన్ని టెథిస్‌ సముద్రం అంటారు. ఇది గోండ్వానా, లారేషియా ఖండాల మధ్య ఉండేది. ఈ సముద్రంలో సూక్ష్మ సముద్ర జీవులు సమృద్ధిగా ఉండేవి. వాటి అవశేషాలు అడుగున చేరి, తర్వాతి కాలంలో చమురు ఏర్పడటానికి ప్రధాన ముడి పదార్థంగా మారాయి. శాస్త్రవేత్తలు రాళ్లలోని అవశేషాలు, భూమి పొరల అధ్యయనం ద్వారా ఈ వాస్తవాన్ని నిర్ధారించారు.

ఖండాల కదలికలు, ఆస్ట్రాయిడ్‌ ఘటనలు..
భూమి చరిత్రలో ఆస్ట్రాయిడ్‌లు ఢీకొట్టడం వంటి ఘటనలు జరిగాయి. ఇవి వాతావరణ మార్పులు, జీవుల అంతరించిపోవడానికి కారణమయ్యాయి. అయితే, మిడిల్‌ ఈస్ట్‌ ఆకృతి మారడానికి ప్రధాన కారణం ప్లేట్‌ టెక్టోనిక్స్‌ (ఖండాల కదలికలు). అరేబియన్‌ ప్లేట్‌ ఉత్తరం వైపు కదిలి, యూరేషియన్‌ ప్లేట్‌తో ఢీకొట్టడంతో జాగ్రోస్‌ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇది భూమి పొరలను మడతలు పెట్టి (ఫోల్డ్స్, యాంటిక్లైన్స్‌), చమురును నిల్వ చేసే సహజ ‘‘ట్రాప్స్‌’’ (ఉచ్చులు) సృష్టించింది. దీంతో సముద్రం క్రమంగా భూమి అడుగునకు వెళ్లిపోయింది. ఈ ప్రక్రియలో సముద్ర గర్భం నుంచి భూభాగం పైకి లేచింది. ఈ స్థిరమైన భౌగోళిక పరిస్థితులు చమురును సురక్షితంగా నిల్వ చేయడానికి సహాయపడ్డాయి.

ఎడారి ఏర్పాటు, చమురు నిల్వల సంరక్షణ…
మిడిల్‌ ఈస్ట్‌ ఉపరితలం క్రమంగా ఎడారిగా మారింది (వాతావరణ మార్పులు, భౌగోళిక స్థానం కారణంగా). కానీ భూమి అడుగున చమురు నిల్వలు సంరక్షించబడ్డాయి. పోరస్‌ రాళ్లు (లైమ్‌స్టోన్, శాండ్‌స్టోన్‌) చమురును గ్రహించి నిల్వ చేస్తాయి. అంతర్లీనంగా ఉన్న అభేద్య శిలలు (షేల్, సాల్ట్, అన్‌హైడ్రైట్‌) ‘‘క్యాప్‌ రాక్‌’’లుగా పని చేసి చమురు బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఈ ‘‘సోర్స్‌ రాక్‌ – రిజర్వాయర్‌ రాక్‌ – క్యాప్‌ రాక్‌ – ట్రాప్‌’’ అనే నాలుగు అంశాలు సరిగ్గా కలిసినప్పుడే భారీ నిల్వలు ఏర్పడతాయి. మిడిల్‌ ఈస్ట్‌లో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద నిల్వలు..
సౌదీ అరేబియాలోని ఘవార్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇలాంటి భారీ నిల్వలు జురాసిక్‌ కాలపు మూల శిలల నుంచి వచ్చాయి. ఇరాన్, ఇరాక్, కువైట్‌లోనూ ఇలాంటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్థిరమైన భౌగోళిక చరిత్రే ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ నిల్వలను సృష్టించింది.

ఆర్థిక వైవిధ్యం అవసరం..
ఈ చమురు నిల్వలు అంతులేనివి కావు. ఉత్పత్తి కొనసాగుతున్న కొద్దీ అవి తగ్గిపోతాయి. దీంతో గల్ఫ్‌ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. సౌదీ అరేబియా విజన్‌ 2030 కార్యక్రమం ద్వారా చమురుపై ఆధారపడటం తగ్గించి, పర్యాటకం, వినోదం, సాంకేతికత, పునరుత్పాదక ఇంధనాలు, వాణిజ్యం వైపు మొగ్గు చూపుతోంది. యుఏఈ, కువైట్‌ వంటి దేశాలు కూడా పర్యాటక కేంద్రాలు, స్పోర్ట్స్‌ ఈవెంట్లు, ఆధునిక నగరాల నిర్మాణంపై దృష్టి పెట్టాయి. ఇది భవిష్యత్తులో చమురు ఆదాయం తగ్గినప్పుడు స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది.

మిడిల్‌ ఈస్ట్‌లోని పెట్రోలియం నిల్వలు కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. అవి కోట్ల సంవత్సరాల టెథిస్‌ సముద్రం, సూక్ష్మ జీవుల అవశేషాలు, ఖండాల కదలికలు, సరైన భౌగోళిక ట్రాప్స్‌ కలయిక ఫలితం. ఈ విషయం మనకు భూమి యొక్క డైనమిక్‌ స్వభావం, సహజ వనరుల పరిమితి, సుస్థిర అభివృద్ధి అవసరాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో చమురుపై ఆధారపడటం తగ్గించి, వైవిధ్యపరచడం ద్వారా ఈ దేశాలు మరింత స్థిరంగా ముందుకు సాగవచ్చు.

'ఓజీ 2' లో బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్.. ఇక పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలే..

OG 2 Movie
OG 2 Movie

OG 2 Movie: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ అప్డేట్ కారణంగా , మళ్లీ ఫుల్ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మేనియా నే కనిపిస్తోంది. ‘ఓజీ’ పేరు తీస్తే చాలు , అభిమానులు మొత్తం పూనకాలొచ్చి ఊగిపోతుంటారు. సరైన సమయం లో , సరైన బ్లాక్ బస్టర్ తగలడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనలు జరిగినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఇలాంటి అనుభవాలను పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అందించడం లో దిట్ట. అలా ‘ఓజీ’ చిత్రం తో అలాంటి అరుదైన అనుభవాన్ని అందించాడు అభిమానులకు. అందుకే ‘ఓజీ 2’ పై ప్రేక్షకుల్లో ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ఓజీ’ క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం , సీక్వెల్ పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ని పెంచాయి.

ఇకపోతే ‘ఓజీ 2’ చిత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణే నిర్మించబోతున్నాడు. పలు సంస్థలు నిర్మాణం లో భాగస్వామ్యం పంచుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ , ప్రస్తుతానికి అయితే ఏది ఖరారు అవ్వలేదు. ఈ ఏడాది నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టడానికి అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ మేరకు ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్ద కపూర్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతం లో ఈమె ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సాహూ’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్రాండ్ గా మారిపోయింది. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంది.

ఈమె ‘ఓజీ 2’ లో నటిస్తే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం పై క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ కి , ఈమె డేట్స్ సింక్ అవుతాయా లేదా అనేది ఒక్కటే చూడాలి. ఇందులో ఈమె ఓజాస్ గంభీర్ కి తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈమె ఫ్లాష్ బ్యాక్ మొత్తం జపాన్ లోనే ఉంటుంది. ఈమె షెడ్యూల్స్ ఇండియా లో జరిగే అవకాశాలే లేవట. పవన్ కళ్యాణ్ ఈసారి ఫారిన్ షెడ్యూల్స్ కి భారీగానే డేట్స్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. మరో నెలరోజుల్లో హీరోయిన్ కి సంబంధించిన అధికారిక అప్డేట్ ని ప్రకటించబోతున్నారట మేకర్స్.

ట్రంప్ నకు గట్టి ఎదురుదెబ్బ.. అధికారాలు కట్ చేసిన అమెరికా సెనేట్.. ఏం జరుగనుంది..

Trump
Trump

Trump: కళ్లెంలేని గుర్రం లాగా రెచ్చిపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ మొత్తాన్ని ఇబ్బంది పెడుతూనే.. అమెరికాను అప్పుల ఊబిలాగా మార్చుతున్నాడు. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అమెరికా ప్రజలు అనవసరమైన ట్యాక్స్ లు కడుతున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల అమెరికా ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ప్రజల కంటే ఎక్కువగా అక్కడి సెనేట్ తీవ్రంగా స్పందిస్తోంది.

అరుదైన పరిణామం

అమెరికాలో అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి. ఈ పవర్స్ ను ఆయన కేవలం దేశం బాగు కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ ట్రంప్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులను యుద్ధం కోసం ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల అమెరికాలో అభివృద్ధి ఆగిపోతుంది. ఒకరకంగా అమెరికా ప్రజల్లో తీవ్రమైన అశాంతిని కలగజేస్తోంది. ఇదంతా కూడా అమెరికా పెత్తనాన్ని ప్రపంచం మీద తగ్గిస్తోంది. ఇదే సమయంలో పోటీదేశాలు ఘోరంగా రెచ్చిపోతున్నాయి. చైనా.. భారత్.. యూరప్ దేశాలు ఆర్థికంగా శక్తివంతమవుతున్నాయి. ఈ పరిణామాలు అమెరికా సెనెట్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. అందువల్లే ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రంప్ కు ఉన్న అధికారాలను తగ్గిస్తూ అమెరికా సెనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన ఈ నిర్ణయాన్ని ఆమోదించింది… అమెరికా అత్యున్నత సభ అనుమతి లేకుండా యూఎస్ రక్షణ దళాలను ఇరాన్ లో దించకూడదని.. ఎటువంటి ఘర్షణలోకి దించకూడదని సెనేట్ తీర్మానం చేసింది. దీనికి తోడు ట్రంప్ పరిపాలన యంత్రాంగం మిలిటరీ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. దీని పట్ల ట్రంప్ సొంత పార్టీలో నాయకులే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డెమోక్రాట్లతో వారు చేతులు కలపడం చర్చకు దారి తీస్తోంది.

సెనేట్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ అధికార రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన నలుగురు సేనేటర్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఓటు వేయడం విశేషం. మరోవైపు డెమొక్రటిక్ పార్టీకి సంబంధించిన ఒక సేనేటర్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా స్వరం కలిపారు. మరోవైపు దీనిపై ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. దీనిని పనికిమాలిన వ్యవహారం లాగా కొట్టిపడేశారు.

గూస్ బంప్స్ రప్పిస్తున్న రజినీకాంత్ 'ధర్మన్' ఫస్ట్ లుక్ పోస్టర్.. కమల్ హాసన్ కి జాక్ పాట్ తగిలినట్టే..

Rajinikanth Dharman First Look
Rajinikanth Dharman First Look

Rajinikanth Dharman First Look: ‘కూలీ’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ముందు సీబీ చక్రవర్తి ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి అస్వత్ మారిముత్తు ని ఎంచుకున్నారు. గతం లో ఈయన ‘ఓ మై కడవలే ‘, ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. యూత్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు తీయడం లో ఇతను దిట్ట. అందుకే ఇతన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ ని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నాడు.

ఇందులో హీరోయిన్స్ గా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ , రాశి ఖన్నా నటించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రజినీకాంత్ చాలా వైల్డ్ డాక్టర్ గా కనిపించడం తో , అసలు కథ ఏమి అయ్యుంటుంది అనే ఆత్రుత అభిమానుల్లో , ప్రేక్షకుల్లో కలిగింది. ఈ వయస్సులో కూడా సూపర్ స్టార్ రజిని చెక్కు చెదరని స్టైల్, స్వాగ్ తో కనిపించడం అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది ఆరంభం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రాన్ని పూర్తి చేశాడు . సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.

ఇక పోతే ‘ధర్మన్’ విషయం లో అభిమానుల్లో కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు దర్శకులు మారారు. ఇప్పుడు మూడవ దర్శకుడు వచ్చాడు , అంటే స్టోరీ సరిగా లేదా?, ఎందుకని ఇంతకు ఇద్దరు డైరెక్టర్స్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు?, రజినీకాంత్ తో సినిమా చేసే బంపర్ ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా?, ఈ అస్వత్ మారిముత్తు అయినా చివరి వరకు నిలకడగా నిలబడి షూటింగ్ ని పూర్తి చేసి వెళ్తాడా?, లేదా మధ్యలోనే వెళ్ళిపోతాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ‘ధర్మన్’ ఫస్ట్ లుక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.

పవన్ ను విమర్శిస్తే ఊరుకోను.. పేర్ని నాని హెచ్చరిక!

Perni Nani
Perni Nani

Perni Nani: దెబ్బ తగిలే దాక గాయం బాధ తెలియదంటారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను ఇప్పుడు సమీక్షించుకుంటుంది. కొన్ని వర్గాల విషయంలో తాము అనుసరించిన తీరును గుర్తు చేసుకుంటుంది. తప్పిదాలను సరి చేసుకునే పనిలో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో స్ట్రాటజీ మార్చినట్లు స్పష్టమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడం వల్లే కాపులు తమకు దూరమయ్యారన్న విషయాన్ని గ్రహించింది. ఇకముందు ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలని భావిస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో వైసిపి కాపు నాయకులు సమావేశం అవుతున్నారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మారిన వైసీపీ వైఖరిని అది స్పష్టం చేస్తోంది.

* అదేపనిగా అవమానపరిచి..
2019లో అఖండ మెజారిటీతో విజయం సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జనసేన ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అది మొదలు పవన్ కళ్యాణ్ పై వీరవిహారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాపులు అండగా నిలవలేదు. అయినా అదే పనిగా వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ ను అవమానపరచడంతో.. కాపుల్లో ఒక రకమైన ఆవేదన ప్రారంభం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో పాటు పవన్ కళ్యాణ్ పై విపరీతమైన సానుభూతి వ్యక్తం అయింది. అయితే ఈ విషయాన్ని గ్రహించని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పదునైన అస్త్రాలతో పవన్ పై వ్యక్తిగత దాడిని కొనసాగించింది. మాటల దాడి పెరిగే కొలది పవన్ కళ్యాణ్ పై కాపుల అభిమానం పెరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ద్వేషం పెరిగింది. 2024 ఎన్నికల నాటికి అది పతాక స్థాయికి చేరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది.

* ఎట్టకేలకు నష్టాన్ని గుర్తించి
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి తమకు నష్టం చేసిందన్న విషయాన్ని గ్రహించలేక పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల కాపు అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తనకు కులం పట్టింపులు లేవంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని అస్త్రంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ పై సుత్తిమెత్తటి విమర్శలకే పరిమితం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకనుంచి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు వద్దు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సూచించారు. ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే తాను చేస్తానని.. ఇది పార్టీ లైన్ అని చెప్పే ప్రయత్నం చేశారు నాని. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల వల్లే కాపులు దూరమయ్యారన్న విషయాన్ని గ్రహించింది వైసిపి. మరి తరువాత అడుగులు ఎలా వేయబోతుందో చూడాలి పవన్ విషయంలో.

జగన్ మనసు మార్చే పనిలో డీకే శివకుమార్, విజయ్

DK Shivakumar Strategy On Jagan
DK Shivakumar Strategy On Jagan

DK Shivakumar Strategy On Jagan: జాతీయస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఎన్డీఏ హవా నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించిన చాలా పార్టీలు ఇప్పుడు.. అదే కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నాయి. మొన్నటికి మొన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీన ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీకి దూరమైన బలమైన నేతలను వెనక్కి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించిన మిగతా పార్టీలు ఇప్పుడు.. అదే హస్తం పార్టీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్రెడ్డిని ఇండియా కూటమిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

* ఎన్డీఏ బలంగా..
ఏపీలో ఎన్డీఏ కూటమి విషయంలో పూర్తిగా స్పష్టత ఉంది. ఆ మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడం ఖాయం. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని కూటమిని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నాయి టిడిపి, జనసేనలు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తోంది. పరోక్ష సహకారంతో బిజెపితో ఒక అవగాహన ఉన్న వైసీపీకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక బిజెపిని నమ్ముకుంటే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అలాగని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో పాటు వామపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వైసిపి బలానికి ఆ రెండు పార్టీల బలం తోడైతే అతి కష్టంగానైనా ఏపీలో అధికారంలోకి రావచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది.

* విజయ్ తాజా ప్రతిపాదన..
తమిళనాడులో సీఎంగా ఉన్నారు దళపతి విజయ్. కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలోపేతానికి విజయ్ సైతం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి విజయ్ కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఒకవైపు డీకే శివకుమార్, మరోవైపు విజయ్ జగన్మోహన్ రెడ్డి కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరి అందులో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

భారత్ దయా దక్షిణ్యాల మీద అమెరికా.. అగ్ర రాజ్యానికి ఏమైంది.. ఎందుకిలా..

US Depends On India
US Depends On India

US Depends On India: అమెరికా అగ్రరాజ్యం.. సంపన్నమైన రాజ్యం. ఆర్మీ నుంచి మొదలు పెడితే న్యూక్లియర్ వెపన్స్ వరకు అమెరికాకు తిరుగులేదు. పైగా ప్రపంచ ట్రేడ్ మొత్తం అమెరికా చేతుల్లో ఉంటుంది. అమెరికా ఏం చేస్తే ప్రపంచం మొత్తం అదే చేయాలి.. అమెరికా ఏం చెబితే ప్రపంచం మొత్తం అదే వినాలి. ఇటీవల యుద్ధాలు.. గతంలో జరిగిన యుద్ధాలు.. జరగబోయే పరిణామాలు మొత్తం అమెరికా చుట్టూ.. అమెరికా వల్లే జరుగుతూ ఉంటాయి.

అంతటి అగరాజ్యం ఇప్పుడు భారత్ సహాయం కోరుతోంది. మాకు మీ తోడ్పాటు కావాలి అంటూ అడుగుతోంది. అంతటి శక్తివంతమైన అమెరికా భారత్ వద్దకు రావడం ఏంటి.. భారత్ సహాయం కోరడమేంటి.. ఇప్పటికిప్పుడు అమెరికాకు భారత్ తో ప్రయోజనం ఏంటి.. అమెరికా కోరింది భారత్ వద్ద ఏముంది.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

అమెరికా కోరిన కోరిక మరి ఏంటో కాదు క్యాన్సర్ ఔషధాలు. అవి మన వద్ద దండిగా ఉన్నాయి. అందువల్లే అమెరికా మన వైపు ఆశగా ఎదురుచూస్తున్నది. ముఖ్యంగా లంగ్స్.. టెస్టుకిల్స్.. కిడ్నీ కి సోకే క్యాన్సర్ నివారణలో వెంటనే ఐపోస్పామైడ్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని ఐడిఎమ్ఏ ను అమెరికా కోరడం విశేషం. దీంతో ఇండియన్ ఫార్మా కంపెనీలకు ట్రేడ్ ఈజీ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా దగ్గర ప్రస్తుతం ఐఫో స్పామైడ్ ను తయారుచేసే ప్లాంట్ లో సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. దీంతో ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థ మొత్తం నాశనమైంది అందువల్లే అమెరికాలో ఈ మెడిసిన్ కు విపరీతమైన కొరత ఉంది. అందువల్లే అమెరికా భారత్ సహాయాన్ని కోరుతోంది. అమెరికా రిక్వైర్మెంట్ వల్ల ఇండియన్ ఫార్మ కంపెనీలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మెడిసిన్ ను సిప్లా, జైడూస్, ఆల్కమ్, లారస్ ల్యాబ్, అలీవస్ కంపెనీలు తయారుచేస్తాయి. గ్లాండ్ ఫార్మా ఇంజక్షన్లు కూడా తయారు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కంపెనీలు దండిగా లాభాలు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రేమికుడి కోసం స్పైడర్ ఉమెన్ అయింది..ఇంత పిచ్చి ఏంటి తల్లి నీకు

Love Obsession Story
Love Obsession Story

Love Obsession Story: పురాణాలనుంచి మొదలు పెడితే నేటి ఆధునిక కాలం వరకు ప్రేమ కోసం త్యాగాలు చేసిన వారి జాబితాలో మగవాళ్ళు మాత్రమే కనిపిస్తారు. ముంతాజ్ కోసం షాజహాన్.. లైలా కోసం మజ్ను.. పార్వతీ కోసం దేవదాసు.. ఇలా చాలామంది ప్రేమికులు తమ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతోమందిని ఎదిరించారు. చివరికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కొత్త ట్రెండు మొదలైంది. గతంలో అబ్బాయిలు అలా చేస్తే.. ఇప్పుడు అమ్మాయిలు ఆ జాబితాలోకి వచ్చేసారు. ఈమెకు అయితే ఆ లిస్టులో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే.

అది జార్ఖండ్ రాష్ట్రం.. బొకారో జిల్లాలోని గోమియా పోలీస్ స్టేషన్లో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడిదే అనే గ్రామానికి చెందిన ఉపయోగపడు తన కూతుర్ని నిర్బంధించాడని ఓ వ్యక్తి ఈ నెల 18న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అతడిచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యువతిని అతడి నిర్బంధం నుంచి బయటికి తీసుకు రాగలిగారు. ఆ తర్వాత ఆ యువతిని తల్లికి అప్పగించారు. నిర్బంధించిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇంతవరకు కథ మొత్తం సాఫీగానే సాగిపోయింది. కానీ అసలు మలుపు తెల్లవారి మొదలైంది.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ యువతి తెరపైకి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి తప్పించుకొని గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది. అక్కడ ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కేసింది. దాదాపు ఆటో ఎత్తు 100 అడుగుల వరకు ఉంటుంది. అక్కడ నుంచి దూకి ప్రాణాలు కోల్పోతాను అంటూ హెచ్చరించింది. తనను అతడు నిర్బంధించలేదని.. ఇష్టమై తాను వెళ్లిపోయానని చెప్పింది. అంతేకాదు అతనితో వివాహం జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆ తర్వాత ఆమెకు నచ్చ చెప్పారు. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె మధ్యాహ్నం మూడు గంటలకు కిందికి దిగి వచ్చింది. ప్రేమ కోసం స్పైడర్ ఉమెన్ లాగా టవర్ ఎక్కిన ఆమె.. దాదాపు 5 గంటల పాటు సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన కేకలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.

ఆమె కిందికి దిగిన తర్వాత పోలీసులు వెంటనే ప్రత్యేకమైన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ యువకుడికి దాదాపు 20 సంవత్సరాల వరకు వయసు ఉంటుందని తెలుస్తోంది. అతడిది రాంచీప్రాంతమని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరికీ ఎక్కడ పరిచయం అయిందో తెలియదని.. చివరికి ఇలా మారిపోయిందని పోలీసులు అంటున్నారు. మరోవైపు కుమార్తె ప్రవర్తన తీరు సరిగా లేకపోవడంతో ఆమె పేరెంట్స్ తీవ్రమైన చెందుతున్నారు.

నాడు తండ్రులు.. నేడు కుమార్తెలు..'కోట' పై పాగా ఎవరు?!

Vizianagaram Politics
Vizianagaram Politics

Vizianagaram Politics: విజయనగరం అంటే ముందుగా గుర్తొచ్చేది రాజకుటుంబం. విజయనగరం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆస్తులన్నీ పూసపాటి రాజ కుటుంబానిదే. అందుకే అక్కడ పూసపాటి కుటుంబం రాజకీయాల్లో రాణించింది. తమ కోసం రాజులు యావదాస్తిని విడిచిపెట్టడం అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. పార్టీ ఏదైనా.. విజయనగరంలో మాత్రం రాజులకు అక్కడి ప్రజలు పట్టం కడుతూ ఉంటారు. అటువంటి రాజకుటుంబ హవాకు బ్రేక్ వేసింది మాత్రం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కోలగట్ల.. వచ్చే ఎన్నికల నాటికి తన కుమార్తె శ్రావణిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఒకసారి అశోక్ గజపతి రాజును.. ఇంకోసారి ఆయన కుమార్తె అదితి గజపతిరాజును ఓడించారు వీరభద్ర స్వామి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు కుమార్తెతో కోలగట్ల కుమార్తె శ్రావణి తలపడనున్నారు.

* గోవా గవర్నర్ గా..
పూసపాటి అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన చేయని పదవి అంటూ లేదు. రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. మొన్ననే ఆయనకు గోవా గవర్నర్గా అవకాశం వచ్చింది. తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దించారు. ఆమె ఎమ్మెల్యే అయ్యారు. 197 8 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న అశోక్.. 2004లో మాత్రం కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోయారు. 2009లో అదే వీరభద్ర స్వామిని ఓడించారు. 2014లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. 2019లో ఎంపీగా పోటీ చేసిన అశోక్, ఎమ్మెల్యేగా పోటీచేసిన కుమార్తె ఓడిపోయారు. ఆమెపై కోలగట్ల గెలిచి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికయ్యారు.

* శ్రావణి సిద్ధం..
అయితే ఇప్పుడు కోలగట్ల కుమార్తె శ్రావణి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఆమెకు విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజల్లోకి కూడా బలంగా వెళ్తున్నారు. అదితి గజపతిరాజును ఢీకొట్టగల సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే విజయనగరం పరిధిలో తూర్పు కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఈసారి అక్కడ బీసీ నినాదం వినిపిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తెకు టిడిపి టికెట్, కోలగట్ల కుమార్తెకు వైసిపి టికెట్ లభించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఏపీలో కీలక సర్వే : కూటమి వర్సెస్ వైసీపీ.. గెలుపు ఎవరిదంటే..

Andhra Pradesh Political Survey
Andhra Pradesh Political Survey

Andhra Pradesh Political Survey: ఏపీలో రాజకీయాలు ఎప్పటికీ హాట్ గానే ఉంటాయి. కులాలు అక్కడ ఎక్కువ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అక్కడ నాయకుల వ్యవహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు.. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు ఎప్పటికీ అంతు పట్టదు. పైగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంలో ఏపీ రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా ఉండదు.

ఏపీలో నిత్యం సర్వేలు జరుగుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ.. అధికారంలో లేని పార్టీ నిత్యం సర్వేలు జరిపిస్తూనే ఉంటాయి. సమీకరణాలు.. జనాల మనోగతం.. ఇతర అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా రాజకీయాలు చేస్తూ ఉంటాయి. ఇటీవల వైసిపికి అనుకూలంగా ఉండే ఒక డిజిటల్ మాధ్యమం సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. అంతేకాదు ఆ ఫలితాలను బయటికి చెప్పకుండా.. ఆ డిజిటల్ మాధ్యమ నిర్వాహకులు తెలివిగా సీన్ డైవర్ట్ చేయడానికి.. ఆన్లైన్లో ఒక పోల్ పెట్టారు. అందులో కూడా దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ డిజిటల్ మాధ్యమంలో పెట్టిన పోల్ ఆధారంగా పరిశీలిస్తే కూటమి ప్రభుత్వానికి 61% ఓటు బ్యాంకు పెరిగింది.. గతంతో పోల్చి చూసుకుంటే ఇది చాలా ఎక్కువ. ఈ ప్రకారం 150 కి పైగా స్థానాలు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. ఇక వైసిపికి ఓటు బ్యాంకు 31 శాతానికి పడిపోయింది. గతంలో 40 శాతం ఓట్లు వస్తే 11 స్థానాలు మాత్రమే వైసిపికి వచ్చాయి. ఇప్పుడు ఓట్ల శాతం 31 కు పడిపోతే 8 సీట్లు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వైసిపి ఆస్థాన డిజిటల్ మీడియాలో పరిస్థితి ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో జనం ఏమనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి పరిపాలన జనాలకు ఇంత బాగా నచ్చినప్పుడు.. వైసీపీ వాళ్లు ఇంకా రాజకీయాలు చేయడం దేనికని విశ్లేషకులు అంటున్నారు.

ఐదేళ్ల పరిపాలన కాలంలో అన్ని అక్రమాలు జరిగాయి.. విధ్వంసాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇన్ని జరిగిన తర్వాత ప్రజలకు మేము ఇది చేశామని ఎలా చెప్పుకుంటారు.. అందువల్లే ప్రజలకు కూడా ఎవరు మంచి చేస్తారో అర్థం అయిందని.. అందువల్లే మొహమాటం లేకుండా తమ అభిప్రాయాన్ని వైసిపి ఆస్థాన డిజిటల్ మీడియాలో పేర్కొన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 8 సీట్లు మాత్రమే వస్తే వైసిపి పరిస్థితి ఊహించుకోడానికే ఇబ్బందిగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే గనక జరిగితే ఏపీ ఎన్నికల్లో వరుసగా రెండవ పర్యాయం కూడా ప్రతిపక్షం అనేది ఉండదు. ఎంతైనా ఏపీ ప్రజలు తెలివైనవారు. ఎవరికి ఓటు వేయాలి.. ఎవరికి వేటు వేయాలి వారికి బాగా తెలుసు.

బ్రిటన్‌ రాజకీయాలను శాసిస్తున్న పాకిస్తాన్‌ గ్యాంగులు.. పదేళ్లలో ఆరుగురు మారింది అందుకే!

UK Politics
UK Politics

UK Politics: బ్రిటన్‌లో మరో ప్రధాని మారబోతున్నారు. కీర్‌ స్టార్మర్‌ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. యురోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బ్రిటన్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. తాజాగా జూన్‌ 22న కీర్‌ స్టార్మర్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో లేబర్‌ పార్టీలోని ఆయన ప్రత్యర్థి ఆండీ బర్న్‌హామ్‌ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈయన విజయం సాధించాడు. ఇప్పుడు స్ట్రాంగ్‌ ప్రధాని అభ్యర్థిగా మారారు. అయితే ఈయన కూడా పూర్తికాలం పనిచేసే అవకాశం కనిపించడం లేదు.

పడిపోయిన పాపులారిటీ..
స్టార్మర్‌ పాపులారిటీ సొంత పార్టీలోపడిపోయింది. ఆయనపై అవిశ్వాసం పెరుగుతుందని ఇటీవలి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. దారుణం ఏమిటంటే ముస్లిం వలసవాదుల విషయంలో ఆయన అనుసరించిన విధానంతో బ్రిటిషర్లలో వ్యతిరేకత పెరిగింది. ముస్లిం వలసవాదుల నేరాలు, దాడులు పెరుగుతున్నాయి. పాకిస్తాన్‌ ముస్లింలు బ్రిటిష్‌ బాలికలపై లైంగిక దాడులు చేస్తున్నారు. మతం మారుస్తున్నారు. దీనిని స్టార్మర్‌ ఎదుర్కొనడంలో విఫలమయ్యారు. విమర్శించకుండా సమర్థించారు. దీంతో బ్రిటిషర్లలో లేబర్‌ పార్టీపై వ్యతిరేకత పెరిగింది.

వివాదాస్పద వ్యక్తి అమెరికా రాయబారిగా..
బ్రటిష్‌ సెక్యూరిటీ విభాగం అనుమతించకుండానే ఒక వివాదాస్పద వ్యక్తిని అమెరికాకు రాయబారిగా పంపించారు. ఈ ఏకపక్ష నిర్ణయం కూడా స్టార్మర్‌పై వ్యతిరేకతకు కారణమైంది. ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయం స్టార్మర్‌ పదవికి ఎసరు తెచ్చింది.

పాకిస్తాన్‌ గ్యాంగుల విషయంలో ఉదాసీనత..
ఇక స్టార్మర్‌ పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగుల విషయంలో అనుసరించిన విధానం వివాదాస్పదమైంది. గ్యాంగులను విమర్శించినవారిని అతివాద పార్టీలుగా స్టార్మర్‌ అభివర్ణించారు. ఎలాన్‌మస్క్‌ కూడా స్టార్మర్‌ పాలనను విమర్శించారు. పాలస్తీనాను సమర్థించే విషయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇజ్రాయెల్‌పట్ల వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఇవన్నీ స్టార్మర్‌పై వ్యరేకతకు కారణమైంది.

పదేళ్లలో ఆరుగురు మార్పు..
బ్రిటిష్‌ రాజకీయాల్దో దశాబ్ద కాలంగా అస్థిరత పెరుగుతోంది. గడిచిన పదేళ్లలో ఆరుగురు మారగా, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మాత్రమే కాస్త మెరుగ్గా పాలించారు. పాకిస్తాన్‌ గ్యాంగులను అణచివేశారు. ముస్లిం ఓట్ల కోసం పాకులాడలేదు. అనేక ప్రాంతాల్లో ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా మారింది.

1980 నుంచి గ్రూమింగ్‌ గ్యాంగులు..
బ్రిటన్‌లో 1950 నుంచే గ్రూమింగ్‌ గ్యాంగులు ఉన్నాయి. అయితే 1980 నుంచి గ్రూమింగ్‌ గ్యాంగ్‌లు యాక్టివ్‌ అయ్యాయి. రోటహ్యాం పట్టణంలో 1,500 మంది బ్రిటిష్‌కు చెందిన అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు. మరో పట్టణంలో వెయ్యి మంది లైంగికదాడికి గురయ్యారు. దాదాపు 2.5 లక్షల మంది మతమార్పిడికి, లైంగికదాడికి, వేధింపులకు గురయ్యారు. అయినా కీర్‌ స్టార్మర్‌ వీటిని పట్టించుకోలేదు. వాస్తవాలను అంగీకరించలేదు. దీంతో లేబర్‌ పాక్టీకి కూడా అనుమానం రావడంతో పదవి వదులుకోవాల్సి వచ్చింది.

మొత్తంగా ముస్లింలే బ్రిటన్‌ రాజకీయాలను దశాబ్దంగా శాసిస్తున్నారు. వారి మద్దతు ఉన్నవారే పదవిలో ఉంటున్నారు. కానీ బ్రిటిషర్లలో వారిపైవ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్‌ అసలు స్వభావం కోల్పోతోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వలసవాదులను అరికట్టాలని రోడ్లెక్కుతున్నారు. ఇప్పటికైనా నియత్రణ చేయకుండా ఇబ్బందులు తప్పవు.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు.. 24 శాతానికి పడిపోయిన ట్రంప్ నకు మద్దతు!

Donald Trump
Donald Trump

Donald Trump: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టింది. సుమారు 100 రోజులు సాగింది. తర్వాత తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిచింది. ప్రస్తుతం శాశ్వత శాంతి కోసం డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్లు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాయిటర్స్‌/ఇప్సోస్‌ నిర్వహించిన తాజా పోల్‌ ప్రకారం, కేవలం 24 శాతం మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నారు. మెజారిటీ ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫలితాలు అమెరికా విదేశాంగ విధానం, ప్రజా మద్దతు, అధ్యక్షుడి ప్రజాదరణపై ముఖ్యమైన సంకేతాలు ఇస్తున్నాయి.

పోల్‌ ఫలితాలు..
రాయిటర్స్‌/ఇప్సోస్‌ పోల్‌ ప్రకారం, ఇరాన్‌తో యుద్ధం లేదా సైనిక చర్యలకు మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం 24 శాతం మంది మాత్రమే ట్రంప్‌ వైఖరికి మద్దతు తెలిపారు. ఇది గతంలో ఉన్న కొంత మద్దతు కంటే గణనీయంగా తక్కువ. పోల్‌లో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది యుద్ధం వల్ల కలిగే పరిణామాలను ఆందోళనగా చూస్తున్నారు.

యుద్ధ ఖర్చు, శాంతి ఒప్పందాలపై సందేహాలు..
చాలామంది అమెరికన్లు యుద్ధానికి అయ్యే ఖర్చు దాని విలువకు సరిపోదని అభిప్రాయపడుతున్నారు. అమెరికన్‌ సైనికుల ప్రాణాలు, ఇంధన ధరల పెరుగుదల, వ్యక్తిగత ఆర్థిక ప్రభావం వంటి అంశాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అలాగే, ఇరాన్‌తో జరిగే శాంతి ఒప్పందం ఎక్కువకాలం నిలవకపోవచ్చని, మళ్లీ సంఘర్షణలు తలెత్తవచ్చని చాలామంది భావిస్తున్నారు. ప్రజలు సైనిక చర్యల కంటే దౌత్య మార్గాలను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

ట్రంప్‌ అప్రూవల్‌ రేటింగ్‌లో క్షీణత
ఈ పోల్‌ ఫలితాలు ట్రంప్‌ అప్రూవల్‌ రేటింగ్‌ను కూడా ప్రభావితం చేశాయి. ఆయన అప్రూవల్‌ రేటింగ్‌ 34 శాతానికి పడిపోయింది. ఇది ఆయన పదవీకాలంలోని అత్యంత తక్కువ స్థాయిలలో ఒకటి. ఇరాన్‌ విషయంలో సైనిక చర్యలు చేపట్టడం వల్ల ప్రజలు ఆయనను ‘‘సైనిక శక్తిని అధికంగా ఉపయోగించే వ్యక్తి’’గా చూస్తున్నారని పోల్‌ సూచిస్తోంది.అధికార పార్టీలోని అభిప్రాయ భేదాలుఆసక్తికరమైన విషయం ఏమిటంటే,

అధికార పార్టీలోనూ వ్యతిరేకత..
అమెరికా అధికార రిపబ్లికన్‌ పార్టీ బలమైన స్థితిలో ఉందని భావించట్లేదు. ఇది ట్రంప్‌ వైఖరికి మద్దతు ఇచ్చే పార్టీలోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయని చూపిస్తుంది. కొంతమంది రిపబ్లికన్లు కూడా యుద్ధం వల్ల కలిగే ఖర్చులు, దీర్ఘకాలిక పరిణామాలను ఆందోళనగా చూస్తున్నారు.

అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం…
ఈ పోల్‌ ఫలితాలు అమెరికా ప్రజలు ఇప్పుడు సైనిక జోక్యాల కంటే దౌత్యం, ఆర్థిక స్థిరత్వం, దేశీయ సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. గత యుద్ధాల (ఇరాక్, అఫ్ఘనిస్తాన్‌) అనుభవాల తర్వాత ప్రజల్లో యుద్ధాలపై వ్యతిరేకత పెరిగింది. ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌ విషయంలో బలమైన వైఖరి తీసుకున్నప్పటికీ, దేశీయంగా మద్దతు తగ్గడం దీర్ఘకాలికంగా విధానాలను ప్రభావితం చేయవచ్చు. శాంతి ఒప్పందాలు త్వరగా కుదిరినా, వాటి స్థిరత్వం గురించి ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో అమెరికా విదేశాంగ విధానం మరింత జాగ్రత్తగా, దౌత్యపరంగా ఉండాలనే అవసరాన్ని సూచిస్తోంది.

మొత్తంమీద, ఈ పోల్‌ అమెరికా ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం ఎంత ముఖ్యమైనదో, అధ్యక్షుడి విధానాలు దేశీయ మద్దతుపై ఆధారపడి ఉండాలనే వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. యుద్ధం వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

'రతనాల' సీమ.. అందరి చూపు ఏపీ వైపే!

Kurnool Gold:
Kurnool Gold:

Andhra Pradesh Gold Mine: జాతీయస్థాయిలో మరో అరుదైన ఘనత సాధించనుంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని ఏపీలో ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఈ గని అందుబాటులోకి వచ్చింది. తొలి దశ ప్రాసెసింగ్ యూనిట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రెండో దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తున్న బంగారం గని ఇది. గత 20 సంవత్సరాలుగా ఈ గని అభివృద్ధి చేశారు. ఇప్పుడు గని ఉత్పత్తి ప్రారంభం కానుంది. దేశంలోనే ఇదో కీలక ప్రాజెక్ట్ అని.. రాయలసీమకి మణిహారం గా నిలిచే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఒక్క కర్నూలు జిల్లా మాత్రమే కాదు అనంతపురం తో పాటు చిత్తూరు జిల్లాలో కూడా బంగారు గనులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

* 1500 ఎకరాల విస్తీర్ణంలో..
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా.. దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును తలపెట్టాయి. గత కొన్ని దశాబ్దాలుగా జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తో పాటు ప్రైవేట్ సంస్థలు విస్తృత పరిశోధనలు జరిపి.. ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గన్నుల్లో 50 టన్నుల వరకు పసిడి నిల్వలు ఉండవచ్చు అని భూగర్భ గనుల శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. ఈరోజు నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు ద్వారా 400 కిలోల ఉత్పత్తిని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాదికి 900 కిలోలకు.. ఆ తరువాత 2000 కిలోలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ కు హింద్రినావా నుంచి అవసరమయ్యే నీటిని సరఫరా చేయనున్నారు. 18 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించి నీటిని అందిస్తున్నారు.

* ప్రభుత్వానికి ఆదాయం..
బంగారు గనికి సంబంధించి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరు నుంది. నాలుగు శాతం రాయల్టీ దక్కనుంది. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడనున్నాయి. తొలి ఏడాది రూ.57 కోట్లు, రెండో ఏడాది రూ.147 కోట్లు ఆదాయం రూపంలో రానుంది. ప్రత్యక్షంగా 700 మందికి ఉపాధి దొరకనుంది. దేశంలో బంగారు గని రూపంలో మరోసారి ఏపీ పేరు ప్రముఖంగా మారుమోగిపోవడం ఖాయం. ఇదే స్ఫూర్తితో రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో బంగారగనుల విస్తరణకు ఒక అవకాశం దక్కనుంది. కాగా ఈరోజు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది కర్నూలు జిల్లా యంత్రాంగం.

ఇక నుండి మెగాస్టార్ నేను కాదు.. రామ్ చరణ్ మాత్రమే అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..

Chiranjeevi Emotional Comments
Chiranjeevi Emotional Comments

Chiranjeevi Emotional Comments: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ విజయం సాధించిన సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ ని నిర్వహించారు మేకర్స్. ఈ సభకు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి , రామ్ చరణ్ మధ్య చోటు చేసుకున్న కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ కూడా అభిమానులకు ఒక అద్భుతమైన జ్ఞాపకం లాగా మిగిలిపోనుంది. 24 నిమిషాల మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం లో , రామ్ చరణ్ పట్ల తన పుత్రోత్సాహాన్ని చాటి చెప్పుకున్నాడు మెగాస్టార్. ఆయన ప్రసంగం లోని కొన్ని హైలైట్స్ ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

ఆయన మాట్లాడుతూ ‘రంగస్థలం చూసినప్పుడు కొంత వరకు నాకు రామ్ చరణ్ ని చూసి పుత్రోత్సాహం కలిగింది కానీ, ‘పెద్ది’ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో నాకు పుత్రోత్సాహం కలిగింది. ఈ సినిమాలో నా బిడ్డ నటించలేదు , జీవించాడు. సినిమా చూస్తున్నంతసేపు నాకు రామ్ చరణ్ కనిపించలేదు , పెద్ది నే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. నిన్న చరణ్ ముంబై లో ఒక ఈవెంట్ కి వెళ్ళాడు , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలుసుకున్నాడు, ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ ని నిర్వాహకులు ‘న్యూ ఏజ్ మెగాస్టార్ ‘ అంటూ ఒక ట్యాగ్ ఇచ్చారు. నేను కూడా సాధించలేనిది చరణ్ నేడు సాధించి చూపిస్తున్నాడు , నాకంటే ఒక అడుగు ముందు ఉన్నాడు కాబట్టి , అతన్ని ముందుకు పెట్టి , నేను వెనక ఉండడం బెటర్. అవును , చరణ్ నిజంగానే న్యూ ఏజ్ మెగాస్టార్, నేడు అతన్ని మీరంతా చరణ్ జీవి అని పిలుస్తున్నారు, అందుకు చాలా సంతోషం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకోసం చరణ్ పడే కష్టాన్ని చూసి నాకు చాలా బాధ కలిగేది. షూటింగ్ చేసి బాగా అలిసిపోయి ఇంటికి వస్తాడు , 5 నిమిషాలు అలా కూర్చొని వర్కౌట్స్ చేసి పొద్దునే షూట్ కి రెడీ అయిపోయేవాడు. ఒకరోజు చరణ్ కంటికి దెబ్బ తగిలింది అనగానే కంగారుపడిపోయాను. అందుకు సంబంధించిన ఫోటోలు చూసి నా మనసు చలించిపోయింది, వాడి అమ్మకు చూపిద్దామా వద్దా అనిపించింది. డాక్టర్లు చరణ్ చాలా లక్కీ, గుడ్డు కి దెబ్బ తగిలి ఉండుంటే కన్ను పోయేది, కానీ మధ్యలో తగిలింది , ఎలాంటి సమస్య లేదు చెప్పినప్పుడు నా మనసు శాంతించింది. అంతలా నా బిడ్డ కష్టపడి పనిచేసినందుకు నేడు సినిమా చూసిన వాళ్లంతా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావాలని అంటుంటే చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

ఎన్డీఏ కు టిడిపి గుడ్ బై.. ప్రధానికి లోకేష్ చెప్పింది అదే!

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: తెలుగుదేశం ఎన్డీఏ కు దూరం కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని చూసిందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిశారా? ఇదే రూమర్ గతంలో వెలుగు చూసింది. నిన్నను కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా కాంక్లేవుకు హాజరయ్యారు. అక్కడే ఈ రూమర్ ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు అటువంటి ప్రయత్నం జరిగిందా అని జర్నలిస్ట్ ప్రశ్నించేసరికి.. లోకేష్ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అసలేం జరిగింది? దాన్ని తెర వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది వివరించారు లోకేష్. ఆ వెంటనే తాను ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు.

* గత పరిణామాల దృష్ట్యా..
గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. నాడు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అయితే విభజన హామీలకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసేసరికి ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. అలా ఎన్డీఏ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారు. జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా రాజకీయంగా 2019 ఎన్నికల్లో నష్టపోయారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలంగానే బిజెపితో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ పుణ్యమా అని మళ్లీ అంతా కలిశారు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం సైతం రాజకీయంగా, రాష్ట్ర ప్రయోజనాలపరంగా పెద్దపీట వేస్తోంది ఏపీకి. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు మొన్న ఆ మధ్యన ప్రచారం నడిచింది.

* ఆయన రాజీనామాతో..
మొన్న మధ్యన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి చేసి రాజీనామా చేయించందన్నది ఒక విమర్శ. జగదీప్ బిజెపి వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ దేశానికి. కానీ బిజెపి ఆదేశాలు కాకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్లారు. ఇది ఎంత మాత్రం కేంద్ర పెద్దలకు రచించలేదు. అందుకే ఆయన పై ఒత్తిడి చేయించి రాజీనామా చేయించినట్లు వార్తలు వచ్చాయి. అలా రాజీనామా చేసిన జగదీప్ ను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా టాక్ నడిచింది.

* ప్రధానికి వివరణ..
అయితే టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ.. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు. ముంబైలో మాజీ ఉపరాష్ట్రపతిని కలిసింది నిజమేనని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఒప్పుకున్నారు. అది రాజకీయ భేటీ కాదని.. యాదృచ్ఛిక సమావేశం అని చెప్పుకొచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అయితే లోకేష్ వివరణ ఇచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోడీ నవ్వేశారట. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ గ్యాప్ వస్తుందన్న ఆందోళన లోకేష్ లో ఉంటే… ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఉంటుందని.. అందులో ఎంత మాత్రం తప్పు లేదని.. తాము సైతం క్రాస్ చెక్ చేసామని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఊపిరి పీల్చుకున్నారు లోకేష్. నిన్న కాంక్లేవ్ లో అదే విషయాన్ని చెప్పారు మంత్రి నారా లోకేష్.