Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie: ఇరుముడి మూవీ చూసిన చిరంజీవి... ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Irumudi Movie: ఇరుముడి మూవీ చూసిన చిరంజీవి… ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Irumudi Movie: కెరియర్ మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న నటుడు రవితేజ… మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో చాలావరకు డీలా పడ్డాడు. ఇక ఎట్టకేలకు ఆయన ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో మరో భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రషెస్ ను […]

Irumudi Movie: కెరియర్ మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న నటుడు రవితేజ… మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో చాలావరకు డీలా పడ్డాడు. ఇక ఎట్టకేలకు ఆయన ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో మరో భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రషెస్ ను మెగాస్టార్ చిరంజీవి చూశారట…ఈ సినిమా అతనికి విపరీతంగా నచ్చేసిందనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి చిరంజీవికి అంత ఈజీగా ఏ సినిమా నచ్చదు.

కానీ రవితేజ చేసిన ఈ సినిమా అతనికి నచ్చడమే కాకుండా ఈ మూవీ లో మనం కొత్త రవితేజ ని మనం చూడబోతున్నాం అంటూ సినిమా మేకర్స్ తో కూడా చెప్పారట. మొత్తానికైతే శివ నిర్వాణ ఈ సినిమా ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇంతకుముందు లవ్ స్టోరీస్ చేసిన ఆయన ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కూడా సినిమాను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే కెపాసిటి తనకు ఉందని మెచ్చుకున్నారట. ఇక ఏది ఏమైనా కూడా రవితేజ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తూనే తన కూతురి కోసం తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది. ఒక అయ్యప్ప స్వామి భక్తుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూడా క్లారిటిగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇరుముడి సినిమా రవితేజ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారుతుందని చిరంజీవి చెప్పిన మాటలను సినిమా యూనిట్ అయితే బాగా బలంగా నమ్ముతున్నారు. ఇక తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper