Homeఎంటర్టైన్మెంట్Peddi Success Meet: 'పెద్ది' తర్వాత నా కూతురు నన్ను నాన్న అని పిలవడం మానేసింది...

Peddi Success Meet: ‘పెద్ది’ తర్వాత నా కూతురు నన్ను నాన్న అని పిలవడం మానేసింది – రామ్ చరణ్

Peddi Success Meet: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టించిందో మనమంతా చూశాము. గత కొంత కాలంగా లాంగ్ థియేట్రికల్ రన్ అంటే ఏంటో మర్చిపోయిన మన టాలీవుడ్ కి , లాంగ్ రన్ అంటే ఏంటో రుచి చూపించిన చిత్రమిది. మెగా ఫ్యామిలీ హీరో కి పాజిటివ్ టాక్ పబ్లిక్ లో ఉంటే వసూళ్లు ఎక్కడ […]

Peddi Success Meet: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టించిందో మనమంతా చూశాము. గత కొంత కాలంగా లాంగ్ థియేట్రికల్ రన్ అంటే ఏంటో మర్చిపోయిన మన టాలీవుడ్ కి , లాంగ్ రన్ అంటే ఏంటో రుచి చూపించిన చిత్రమిది. మెగా ఫ్యామిలీ హీరో కి పాజిటివ్ టాక్ పబ్లిక్ లో ఉంటే వసూళ్లు ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుద్దో ఎవ్వరూ చెప్పలేరు అనడానికి మరో నిదర్శనమే ఈ పెద్ది. కమర్షియల్ గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది , అది ప్రతీ సినిమాకు సాధారణమే కానీ , ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ సంపాదించుకున్న పేరు , గౌరవ మర్యాదలు మాత్రం చాలా గొప్పవి.

ఇకపోతే నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభ ని నిర్వహించారు మేకర్స్. ఈ సభ లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకా పెద్ద హిట్స్ రావొచ్చు , కానీ పెద్ది మాత్రం నా కెరీర్ లో ఎంతో స్పెషల్. ఈ సినిమా తర్వాత చాలా మంది నా పేరు రామ్ చరణ్ అనే విషయం మర్చిపోయారు , పెద్ది పెద్ది అని పిలుస్తున్నారు. నా కూతురు ‘పెద్ది’ విడుదలకు ముందు నాన్న అని పిలిచేది. కానీ ఇప్పుడు ‘పెద్ది’ అని పిలుస్తోంది. నన్ను నాన్న అని పిలవడం పూర్తిగా మర్చిపోయింది. ఆ స్థాయిలో ఈ పాత్ర జనాల్లోకి దూసుకుపోయింది , అందుకు ఎంతో ఆనందం గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ బుచ్చి బాబు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాను అని అనిపించలేదు , ఒక గొప్ప సినిమా చేయబోతున్నాను అనిపించింది. కథని బలంగా నమ్మి ఈ చిత్రాన్ని చేశాను , అందుకు ఆడియన్స్ మా పై కురిపించిన ఈ ప్రేమ మరువలేనిది. ప్రతీ టెక్నీషియన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారికి మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ వెన్నుముక లాగా నిల్చింది. ఇక నిర్మాత సతీష్ గారి గురించి చెప్పాల్సి వస్తే , నేను చాలా మంది నిర్మాతలతో పని చేశాను కానీ , సతీష్ గారి లాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతతో పని చెయ్యలేదు. ఇది ఆయన మొదటి సినిమాగా మాకు అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper