Home Blog Page 6

టమాటో తోటలో ఆ పని.. దరఖాస్తులు కోరిన మహిళా రైతు.. వైరల్ వీడియో

Tomato Farm Jobs
Tomato Farm Jobs

Tomato Farm Jobs: నెలకు 12,000 జీతం.. ఉదయం 6 గంటలకు వేడివేడి టీ ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కూల్ డ్రింక్ ఇస్తారు. అంతేకాదు వచ్చే ఆదివారం నుంచి కోడికూర.. పూరి.. రాగి సంగటి పెడతారు. ఇంత వేతనం ఇస్తున్నారు.. ఈ స్థాయిలో టీ.. శీతలపానీయం. చికెన్.. పూరీలు.. రాగి సంగటి పెడుతున్నారు.. ఎందుకు.. అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదా..

నేటి కాలంలో వ్యవసాయ పనులకు కూలీలు సరిగా లభించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో లేబర్ లభించడం లేదు. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకుని రావాల్సి వస్తోంది. ముఖ్యంగా యూపీ, బిహార్ నుంచి కూలీలు రెండు తెలుగు రాష్ట్రాలకు అధికంగా వస్తున్నారు. వరి నాట్లు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. మిర్చి కోతలు.. ఇతర పనుల చేయడానికి యూపీ,బిహార్ కూలీలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.

కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ఒక మహిళ రైతు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆ మహిళ రైతు టమాటా తోటను సాగు చేస్తోంది. పండిన టమాటా కాయలను రకరకాల మార్కెట్లకు సరఫరా చేస్తోంది. కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రతినెల 12000 ఇస్తామని.. ఉదయం వేడి వేడి టీ.. మధ్యాహ్నం కూల్ డ్రింక్.. ప్రతి ఆదివారం చికెన్, పూరీలు.. రాగి సంగటి పెడతామని చెప్పింది. టమాట తోటలో పనిచేయడానికి ఆసక్తిగల అభ్యర్థులు తమ చేను దగ్గరికి రావాలని ఆమె సూచిస్తోంది. నెలపాటు శిక్షణ ఇస్తామని కూడా ఆమె అంటున్నది. టమాటా గింజలు వేయడం.. మొక్కలు నాటడం.. కాయలు తెంపడం వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తామని ఆమె చెబుతోంది. ఇలా ఇస్తేనే గింజలు సక్రమంగా వేస్తారని.. కొమ్మలు విరగకుండా కాయలు సక్రమంగా కోస్తారని.. గ్రేడింగ్ కూడా పకడ్బందీగా చేస్తారని ఆమె చెబుతోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో కూలీల కొరత పెరిగిన నేపథ్యంలో.. చాలామంది పెద్దపెద్ద రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలను ఆకట్టుకునేందుకు కొంతమంది రైతులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహిళ రైతు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది.

ఇన్ స్టా గ్రామ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మీరు ట్రై చేశారా

Instagram New Feature
Instagram New Feature

Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్.. సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీని ద్వారానే తమ అప్డేట్ లు ఇస్తున్నారు. కొంతమంది దీని ద్వారా ఇన్ఫ్లుయన్సర్స్ గా మారిపోతున్నారు. దీని ద్వారా వచ్చే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాప్ మొదట్లో అంతగా ఆదరణ సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్ వాడుతున్నారు.

మెటా కంపెనీ ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. యూజర్ల ఆసక్తిగా అనుగుణంగా కొత్త కొత్త మార్పులను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా యూజర్లకు న్యూ మ్యూజ్ ఇమేజ్ మోడల్ ను అనే ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. దీని ప్రకారం యూజర్లు పబ్లిక్ గా ఉన్న ఇతర అకౌంట్ లో ఫోటోలను ఏఐ ఇమేజెస్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఎకౌంటు పబ్లిక్ గా ఉంటేనే అందులో ఉన్న ఫోటోలను.. రీల్స్ ను ఇతరులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగకూడదు అనుకుంటే ఎకౌంట్ మొత్తాన్ని ప్రైవేట్ లో పెట్టుకోవాలి. లేదా సెట్టింగ్స్లో రీల్స్.. పోస్ట్ల షేరింగ్.. రీ యూస్ ఆప్షన్ మొత్తాన్ని డిజేబుల్ చేయాలి.

యూజర్లకు మెరుగైన అనుభూతి అందించడానికి ఇటువంటి ఫీచర్ తీసుకొచ్చామని మెటా కంపెనీ చెబుతోంది. కొంతకాలంగా దీని మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్న మెటా కంపెనీ ఆర్ అండ్ డి విభాగం.. మొత్తానికి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట్లో అమెరికా లో మాత్రమే దీనిని అందుబాటులో తీసుకొచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ వైస్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఆసక్తికరంగా ఉందని మెజారిటీ యూసర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకసారి కొత్త చిత్రాలు.. వీడియోలు రూపొందించడానికి ఆస్కారం ఏర్పడుతోందని యూజర్లు చెబుతున్నారు.

కొన్ని సందర్భాలలో ఇవి మిస్ యూస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని కొంతమంది యూజర్లు అంటున్నారు. కొంతమంది కావాలని కక్ష కట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు.. వీడియోలను రూపొందించి.. వేరే విధంగా వాడుకుంటే ఇబ్బంది ఉంటుందని.. అలాంటప్పుడు ఈ ఫీచర్ విషయంలో ఇంకా మెటా కంపెనీ అనేక జాగ్రత్తలు.. సెక్యూరిటీ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని యూసర్లు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ కొత్త ఫీచర్ సరి కొత్తగా ఉందని.. క్రియేటివిటీకి ఎక్కువగా ఆస్కారం కల్పించే విధంగా ఉందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌–ఆస్ట్రేలియా అణు సహకారం.. ఇక తగ్గేదేలే!

India Australia Nuclear Cooperation
India Australia Nuclear Cooperation

India Australia Nuclear Cooperation: భారత ప్రధాని నరంద్రమోదీ ఆరు రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆస్ట్రేలియాలోనూ మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా–భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాలకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య పౌర అణుశక్తి సహకారంపై కీలక ఒప్పందం కుదిరింది. 12 సంవత్సరాల క్రితం కుదిరిన చారిత్రాత్మక అణు ఒప్పందం తర్వాత ఇది మరో ముఖ్యమైన అడుగు. ఈ ఒప్పందం భారత్‌ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను మరింత బలపరుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

మెల్బోర్న్‌లో మోదీ–అల్బానీస్‌ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌ మెల్బోర్న్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, సాంకేతికత, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం వంటి అంశాలపై విస్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికత, సప్లై చైన్లు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధన భద్రత సహా మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

సముద్ర భద్రతా సహకారం
భారత తీర రక్షక దళం, ఆస్ట్రేలియా మారిటైమ్‌ బోర్డర్‌ కమాండ్‌ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన పెంపు, సరిహద్దుల రక్షణ వంటి అంశాల్లో ఉమ్మడి కషికి దోహదం చేస్తుంది. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసి పనిచేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇంధన భద్రత, ఆర్థిక సహకారం..
బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువు స్థిరమైన సరఫరా ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానం వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

విద్యా రంగంలో కొత్త అడుగులు
ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లభించింది. గురుగ్రామ్‌లో విక్టోరియా విశ్వవిద్యాలయం, బెంగళూరులో ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ తమ క్యాంపస్‌లను నిర్వహించనున్నాయి. 2028–29 సంవత్సరానికి ఆస్ట్రేలియన్‌ డిఫెన్స్‌ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని కూడా నిర్ణయించారు.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..
ఉగ్రవాదం మానవాళి మొత్తానికి సవాలుగా మారిందని ఇరు దేశాలు గుర్తించాయి. దీంతో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. భారత్‌తో ఆస్ట్రేలియాకు ఉన్న సంబంధం ఎప్పటికంటే ఇప్పుడు మరింత కీలకమని అల్బానీస్‌ పేర్కొన్నారు.

పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది. అణు ఒప్పందం భారత్‌ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త బలం ఇస్తుంది. ఈ ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుంది.

అమర్ నాథ్ మంచు శివలింగం కరుగుతోంది.. ఎందుకిలా.. ఏం జరుగుతోంది..

Amarnath
Amarnath

Amarnath: జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రతి ఏడాది మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహలో ఈ శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. ఫలితంగా అమర్నాథ్ యాత్ర భక్తుల కోలాహలం మధ్య జరుగుతూ ఉంటుంది. అక్కడి వాతావరణం సహకరించకపోయినప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ యాత్రికులు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు.

మంచు శివలింగం ప్రతి ఏడాది నాలుగు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరిగిపోతూ ఉంటుంది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవలి క్లౌడ్ బరస్ట్ మినహా.. మిగతా సమయంలో అంతగా వర్షాలు కురవలేదు. రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు అమరనాథుడి మీద కూడా పడుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు..

మంచు శివలింగం కరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్ర త్వరగానే ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఈనెల 3న యాత్ర మొదలైంది. కేవలం ఐదు రోజుల్లోనే మంచు శివలింగం భారీగా కరిగిపోవడం విశేషం. వేలాదిమంది భక్తులు ఇప్పటికే యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం కరిగిపోతే వారు అమరనాథుడిని దర్శించుకునే అవకాశం ఉండదు.. పైగా హిమాలయ ప్రాంతాలలో ఉండే సహజ సిద్ధమైన మంచుకొండలు.. అక్కడి నదులు గ్లోబల్ వార్మింగ్ వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని పర్యావరణవేత్తలు కొంతకాలంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

వేడి వల్ల.. వాతావరణంలో మార్పుల వల్ల.. గాలుల తీవ్రత వల్ల ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అందువల్లే మంచు కరిగిపోతుంది. అమర్నాథ్ గుహలు సముద్రమట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. శివలింగం కరిగిపోవడం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతూనే ఉంది. అందువల్ల భక్తులకు ఆశించిన స్థాయిలో శివుడి దర్శన భాగ్యం లభించడం లేదు. వాతావరణ మార్పుల వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

ఇలా ఉన్నారేంట్రా.. 25వేల వోల్టుల హై-టెన్షన్ కేబుల్‌ను ఇలా కొట్టేస్తారా..

Bihar Railway Theft
Bihar Railway Theft

Bihar Railway Theft: చిన్నప్పుడు మనం స్టువర్టుపురం దొంగల గురించి పుస్తకాల్లో చదివి ఉంటాం లేదా టీవీలలో చూసి ఉంటాం. స్టువర్టుపురం దొంగలనే గజదొంగలని.. కరుడుగట్టిన చోర శిఖామణులు అని అనుకుంటాం.. కానీ నేటి కాలంలో వారిని మించిపోయారు వీరు. వీరు చేసిన దొంగతనం అలాంటిది మరి.. ఏకంగా జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడం మాత్రమే కాదు.. రైల్వే శాఖ కే చుక్కలు చూపించారు.

బీహార్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలంద, తక్షశిల వంటి విద్యాసంస్థలు ఉన్న ఆ ప్రాంతం.. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లోనే గుర్తింపు పొందింది.. కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రం లో అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ దారిద్రం.. నిరక్షరాస్యత.. పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పైగా అక్కడ పాలకులకు ప్రజల కేవలం ఓటు వేసే యంత్రాలు మాత్రమే. అభివృద్ధి అంతగా అక్కడ కనిపించదు. అందువల్లే ప్రజలు దొంగతనానికి పాల్పడుతుంటారు

తాజాగా బీహార్ రాష్ట్రంలో ఒక చోరీ సంఘటన జరిగింది. అక్కడి దొంగలు ఏకంగా రైల్వే శాఖకు సంబంధించిన 25 వేల వోల్టుల ఓవర్ హెడ్ హై టెన్షన్ వైర్ చోరీ చేశారు. ఈ వైరులో 100 మీటర్లు కత్తిరించారు. ఫలితంగా సిగ్నల్.. కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింగిల్ లైన్ లోనే రైళ్లను నడపాల్సి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టుకు సమీపంలోనే ఈ దొంగతనం జరగడం విశేషం. ఈ రైల్వే లైన్ అత్యంత బిజీగా ఉంటుంది. ఈ మార్గం మీదుగా రైళ్ల రాకపోకలు విపరీతంగా సాగుతూ ఉంటాయి.

ఈ దొంగతనం వెలుగులోకి రావడంతో మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసరమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనం జరగడం ఇదే తొలిసారి. అంతటి విద్యుత్తు ఉన్నప్పటికీ.. సమీపంలోకి వెళ్తేనే ఒళ్ళు వణికే పరిస్థితి ఉన్నప్పటికీ.. దొంగలు ఇలా దొంగతనం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.

కలయికలో ఉన్న సింహాలను రెచ్చగొట్టాడు..ఊరుకుంటుందా.. ఏం జరిగిందంటే..

Gujarat Lion Attack
Gujarat Lion Attack

Gujarat Lion Attack: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గిర్ అభయారణ్యం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సింహాలను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశించారు. అయితే వీరు సింహాలను చూసి తిరిగి వెళితె ఏ సమస్యా ఉండకపోవచ్చు. కానీ యువకులు కలయికలో ఉన్న సింహాలను రెచ్చగొట్టాడు. దీంతో సింహం తిరగబడింది. ఆ తరువాత ఏం జరిగిందంటే?

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు అనుమతి లేకుండానే గిర్ అభయారణ్యం వెలుపల ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కలయికలో ఉన్న సింహాల జంటను దగ్గరగా చూసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. అంతేకాకుండా వాటిని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించిన మగ సింహం వారిపైకి దూసుకొచ్చింది.

ఈ దాడిలో 21 ఏళ్ల సోహిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా, వారిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్ర మంత్రి అరుణ్ మాట్లాడుతూ, అడవి జంతువులను దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అక్రమంగా ప్రవేశించడం చట్టవిరుద్ధమని అన్నారు. ముఖ్యంగా కలయికలో ఉన్న వన్యప్రాణులను రెచ్చగొట్టడం అత్యంత ప్రమాదకరమని, ఈ నిర్లక్ష్యమే యువకుడి ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు.

అటవీశాఖ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గిర్ అటవీ ప్రాంతంలో పర్యాటకులు, స్థానికులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వన్యప్రాణులకు దూరంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. అడవిలో జంతువులను రెచ్చగొట్టడం లేదా వాటి సహజ జీవనానికి భంగం కలిగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు.

ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా..

Mannara Chopra Photos
Mannara Chopra Photos

సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోలేని స్థితిలో కేటీఆర్‌.. ఎందుకిలా

KTR CM Candidate
KTR CM Candidate

KTR CM Candidate: తెలంగాణలో కాంగ్రెస్‌« అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది. తెలంగాణను సాధించి.. రాష్ట్రాన్ని తొమ్మిదిన్నరేళ్లు పాలించిన కేసీఆర్‌ను కొట్టడం ఎవరికీ సాధ్యం కాదనుకున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ కూడా బీజేపీపై ఫోకస్‌ పెట్టారు. కానీ రేవంత్‌రెడ్డి బాహుబలిలా షాక్‌ ఇచ్చాడు. బలమైన కేసీఆర్‌ను ఒంటిచేత్తో ఓడించాడు. రెండున్నరేళ్లుగా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో కేజీఆర్‌ రాజకీయ జోష్యాలు చెబుతూ మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస ప్రభుత్వమే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అంటూ చెప్పుకుంటున్నారు. ఇవి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

వైఫల్యాలపై ఆధారపడి..
రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదని, తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ పాలనను పోల్చి చూసుకుంటున్నారని పేర్కొంటున్నారు. మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధిలో రేవంత్‌ సగం కూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్న ధీమా కేటీఆర్‌లో కనిపిస్తుంది. కానీ, రెండున్నరేళుల ఫామ్‌హౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ అయ్యే పరిస్థితిపై సందిగ్ధం నెలకొంది. కేసీఆర్‌ను ఇక శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని రేవంత్‌ అంటున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రకటించుకునే పరిస్థితి లేక..
ఎన్నికలు కేవలం ప్రత్యర్థి అనుభవ లోపాలపై ఆధారపడి జరుగవు. నాయకత్వం, కమ్యూనికేషన్, స్థానిక శ్రేణులలోని శక్తి సమీకరణం, సందర్భోచిత సంఘటనలు కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కాంగ్రెస్‌ విఫలమైందనే కారణంతో బీఆర్‌ఎస్‌ నిర్బంధ విజయమనే జోస్యం తాత్కాలికమే. కేసీఆర్‌ కూతురు పార్టీ నుంచి బయటకు వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేస్తున్నారు. కేటీఆర్‌ మాత్రం ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకుంటున్నారు. కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. తనను తాను సీఎంగా ప్రొజెక్టు చేసుకోలేకపోతున్నారు.

బీఆర్‌ఎస్‌ కుటుంబ రాజకీయాలు..
బీఆర్‌ఎస్‌కి పెద్ద పట్టు ఉన్నా, కుటుంబ రాజకీయాలకు సంబంధించిన అనుబంధ, అంతర్గత విభాగాల ఒత్తిళ్లు, కవిత వంటి నాయకత్వ కొత్త అంశాలు పార్టీకి కొత్త సవాళ్లు తీసుకురావచ్చు. ఒక పార్టీకి నిరంతరంగా అధికారంలో ఉండటానికి సమర్థ నాయకత్వానికి తోటి స్థాయి వ్యూహపరమైన నవీనత, యువ శ్రేణుల ఆకర్షణ, పాలనా ప్రదర్శనలో నిరంతర ఉత్తేజం అవసరం. బహుశా ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కీలకంగా కనిపించినా, గెలుపు హామీ సులభంగా చెప్పలేం.

బీజేపీ వ్యూహం..
తెలంగాణలో బీజేపీ ప్రభావం కూడా పెరిగింది. కేంద్ర స్థాయి మద్దతు, వనరుల వినియోగం, స్థానిక మద్దతుదారుల ఆకర్షణ వ్యూహాలు చివరికి స్థానిక బలహీనతలను ఉపయోగించవచ్చు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటోంది. బెంగాల్‌ తర్వాత తెలంణపై ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను నమ్ముకోవడం కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాజకీయ స్థితి ఒకే పరీక్ష పెడుతున్న సమయం. ఈ సమయంలో పార్టీని, క్యాడర్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులపై ఉంది. మరో ఏడాది గడిస్తే ఎన్నికల మూడ్‌ వస్తుంది ఆలోగా బలోపేతం కాకుంటే భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది.

డీమార్ట్ కు ఏరోజు వెళ్లాలి? ఎప్పుడు కొనాలి.. ఇది తెలిస్తే మీకు ఎంతో లాభం

D Mart Shopping Tips
D Mart Shopping Tips

D Mart Shopping Tips: భారతదేశంలో సూపర్ మార్కెట్ వేరియంట్ లో గుర్తింపు పొందింది డీ మార్ట్ (D-Mart). తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఒకే చోట కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయలు, గృహోపకరణాలు, దుస్తులు, కిచెన్ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, స్టేషనరీ, ప్లాస్టిక్ వస్తువులు వంటి వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దీంతో చాలా మంది ఆయా పట్టణాల్లో ఉండే ఈ స్టోర్లకు రావడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇందులోకి వెళ్లి తిరిగి రావడం అంటే పెద్ద ప్రయాసగా మారింది. ప్రముఖ నగరాల్లో ఈ స్టోర్లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఈ రద్దీలో కాకుండా ప్రశాంతంగా వస్తువులు కొనుగోలు చేయాలంటే ఈ ట్రిక్ పాటించాలని కొందరు చెబుతున్నారు. అదేంటంటే?

ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే డీమార్ట్ ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. దీంతో నిత్యావసర వస్తువులు, కిరాణా, గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు ఇక్కడికి వస్తుంటారు. అయితే కొన్ని రోజుల్లో స్టోర్‌లో భారీ రద్దీ ఉండగా, మరికొన్ని రోజుల్లో ప్రశాంతంగా షాపింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డీ మార్ట్‌లో నెల మొదటి వారంలో రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు అందే సమయం ఇదే. జీతం ఖాతాలో జమ అయిన వెంటనే చాలామంది కుటుంబాలు నెలకు అవసరమైన బియ్యం, పప్పులు, నూనెలు, కిరాణా సామగ్రి, శుభ్రత ఉత్పత్తులు, గృహోపకరణాలు వంటి వస్తువులను ఒకేసారి కొనుగోలు చేయడానికి డీ మార్ట్‌కు వెళ్తుంటారు. దీంతో నెల ప్రారంభంలో స్టోర్లలో వినియోగదారుల రాక గణనీయంగా పెరుగుతుంది.

నెల మొదటి వారం శనివారం లేదా ఆదివారం వస్తే రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఉద్యోగాలకు సెలవు ఉండటంతో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్‌కు రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిల్లింగ్ కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు కనిపిస్తుంటాయి. పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధిక రద్దీ కారణంగా షాపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. బిల్లింగ్ కోసం ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సి రావచ్చు. అలాగే డిస్కౌంట్ లేదా ప్రత్యేక ఆఫర్లలో ఉన్న కొన్ని ప్రముఖ ఉత్పత్తులు త్వరగా అమ్ముడైపోవడం వల్ల వినియోగదారులు కోరుకున్న వస్తువులు దొరకకపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. పిల్లలతో వెళ్లే కుటుంబాలకు రద్దీ మరింత అసౌకర్యంగా అనిపించవచ్చు.

ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఎప్పుడు వెళ్లాలి?
రిటైల్ రంగ నిపుణుల సూచనల ప్రకారం.. నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య డీ మార్ట్‌లో సాధారణంగా రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది ఇప్పటికే నెలవారీ కొనుగోళ్లు పూర్తి చేసుకుని ఉంటారు. దీంతో స్టోర్‌లో సౌకర్యంగా వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. సోమవారం నుంచి గురువారం వరకు డీమార్ట్ లోకి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో సాధారణంగా వీకెండ్‌తో పోలిస్తే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. శుక్రవారం సాయంత్రం నుంచే వీకెండ్ షాపింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో రద్దీ పెరగవచ్చు.

స్టోర్ తెరిచిన వెంటనే ఉదయం వెళ్లడం లేదా మధ్యాహ్నం ప్రారంభ సమయంలో వెళ్లడం ఉత్తమం. ఈ సమయంలో బిల్లింగ్ కౌంటర్ల వద్ద క్యూలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఉద్యోగాలు ముగిసిన తర్వాత వచ్చే సమయంతో పోలిస్తే ఉదయం షాపింగ్ మరింత వేగంగా పూర్తవుతుంది. షాపింగ్‌కు ముందు అవసరమైన వస్తువుల జాబితా సిద్ధం చేసుకోవడం మంచిది. దీంతో అనవసర ఖర్చులు తగ్గుతాయి. డిస్కౌంట్ ఉందని అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. ఆఫర్ ఉత్పత్తులపై గడువు తేదీ, పరిమాణం, ధరలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. వీలైతే డిజిటల్ చెల్లింపులు ఉపయోగించడం వల్ల బిల్లింగ్ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది.

ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ స్కెచ్‌.. గుట్టు రట్టు చేసిన ఇజ్రాయెల్‌!

Donald Trump
Donald Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ మళ్లీ స్కెచ్‌ వేసింది. ఇరాన్‌–అమెరికా యుద్ధ సమయంలోనే ఇరాన్‌ రెవల్యూషరనీ గార్డ్స్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ట్రంప్‌ హత్యకు కుట్ర చేసింది. కానీ సక్సెస్‌ కాలేదు. తాజాగా ఇజ్రాయెల్‌ అమెరికాకు ఇచ్చిన ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో మరోసారి ఇరాన్‌ కుట్రను బయటపెట్టింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎస్‌ బయటపెట్టింది. అదే సమయంలో వైట్‌ హౌస్‌ కొన్ని అధికారులు ఆ ఇన్ఫోను అమెరికాను ఇరాన్‌పై చర్యలకు ప్రేరేపించడానికి ఉపయోగించబడిందని అనుమానిస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ నివేదిక బదిలీ..
అమెరికా–ఇజ్రాయెల్‌ మిత్రదేశాలు. వీటి మధ్య ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ సహజ ప్రక్రియ. ఇందులో భాగంగా నెలనెలా తమ నివేదికలను పరస్పరం మార్చుకుంటాయి. తాజాగా ఇజ్రాయెల్‌ అమెరికాకు జూన్‌కు సంబంధించిన నివేదిక అందించింది. అందులో ఇరాన్‌ చేసిన కుట్రను బయటపెట్టింది. ఇప్పటికే హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌ హర్మూజ్‌ను తమ అధీనంలో ఉంచుకుని ఓడల నుంచి ట్యాక్స్‌ వసూలు చేయాలని చూస్తోంది. దీనిని అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ నివేదిక ఇప్పుడు ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.

ఇజ్రాయెల్‌ నివేదికపై అనుమానాలు?
ఇజ్రాయెల్‌ ఇచ్చిన నివేదిక సరైనదేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత నెలలో ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ను సంప్రదించలేదు. దీంతో శాంతి ఒప్పందం తర్వాత కూడా ఇరాన్‌ ప్రాక్సీ అయిన లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ తీరును తప్పు పట్టింది. అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. అందకు తాజాగా అమెరికాను రెచ్చగొట్టేందుకు తాజాగా ఇంటెలిజన్స్‌ నివేదికలో ట్రంప్‌ హత్య సమాచారం కూడా కావాలనే ఇచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా ఏం చేస్తుంది?
ఇజ్రాయెల్‌ నివేదికపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇప్పటికే అమెరికా–ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ నివేదికను అమెరికా పరిగణనలోకి తీసుకుంటే మళ్లీ పరస్పర దాడులు ఖాయం. అదే జరిగితే మళ్లీ హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదు.

ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్న పరిస్థితులు…
మూడు నెలల పాటు సాగిన అమెరికా–ఇరాన్‌ వార్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అనేక దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై తీవ్ర ప్రభావం పడింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. శాంతి ఒప్పందం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ రిపోర్టు ఇప్పుడు ప్రపంచ దేశాలను మళ్లీ టెన్షన్‌ పెడుతోంది.

అమరావతి కోసం సంకల్పం.. అడుగడుగునా ఆటంకం!

Amaravati Capital
Amaravati Capital

Amaravati Capital: తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆ సమయంలో పార్టీల, వర్గాల ఒక లక్ష్యం కోసం కట్టుబడ్డారు. ఆ యుద్ధ భావననతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఆంధ్రాప్రాంత ప్రజలు వ్యతిరేకించినా.. తెలంగాణ మొత్తం ఏకమైంది. లక్ష్యం చేరుకుంది. అలాంటి ఐక్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కనిపించడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా రాజధాని లేని రాష్ట్రంగానే మిగలిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసం సంకల్పం తీసుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనలూ వేగంగా జరుగుతున్నాయి. అయితే ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని వ్యతిరేకించడంతో రాజధానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ వాతావరణం, వ్యక్తిగత వ్యూహాలు, అధిష్టాన ఉద్దేశాల కారణంగా సమస్య మరింత క్లిష్టంగా మారింది.

అమరావతి ఒక బ్రాండ్‌..
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ఒక బ్రాండ్‌ తీసుకురావడానికి సీఎం చంద్రబాబునాయుడు అహర్షిలు కష్టపడుతున్నారు. అమరావతి పరపతి మాత్రమే కాదు, హక్కు కూడా. పార్లమెంట్‌ ద్వారా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ధ్రువీకరించి తీర్మానం ఉన్నప్పటికీ, అమరావతి ప్రాధాన్యతను అభివృద్ధి, ఆర్ధిక పునర్రూపకల్పన, రైతు సంకల్పంతో కూడిన సామాజిక ఒప్పందంగా చూడాలి. ఎన్నో వేల ఎకరాలు దిగుబడిలేని భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి తమ భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రూపొందింపు ఈ పట్టదారుల ఆశలపై ఆధారపడి ఉన్నాయి.

వ్యతిరేక రాజకీయం..
అయితే రాజకీయంగా పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రపతి స్థాయిలో అమరావతి నిర్ణయాన్ని సైతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. భవిష్యత్‌లో ‘మావిగన్‌‘ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇలాంటి రాజకీయ వ్యతిరేకతలు అమరావతికి ఆటంకంగా మారుతున్నాయి.

న్యాయ,పారిపాలనా సవాళ్లు
పార్లమెంటు ఆమోదం ఉన్నా, రాష్ట్ర స్థాయిలో అమలుకు అనేక సాంకేతిక, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. భూమి బదిలీలు, ప్రాజెక్ట్‌ ఫండింగ్, స్థానిక సంస్థల మంజూరు, వ్యవసాయ పరిష్కారాల అమలు వంటి పనులు అంతులేని కార్యయజ్ఞాలుగా మారతాయి. పెట్టుబడుల ప్రవాహం, మౌలిక వసతుల బహిర్గతత, ప్రభుత్వ లాజిస్టిక్స్‌ అన్ని సమన్వయం కావాలి. ఇదే సమయంలో రాజకీయ ఆందోళనలు, సహకారంతో కూడని పరిస్థితులు ఈ పనులను ఆలస్యం చేస్తాయి.

సామాజిక, ఆర్థిక పరిణామాలు..
అమరావతి నిర్మాణం వలన ఏర్పడే ప్రత్యక్ష ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్థానిక ఉపాధి అవకాశాలు, దారిద్య్ర తగ్గింపు, నగరీకరణ ద్వారా సేవల అందుబాటు. అయితే ఈ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆలస్యాలు, వివాదాలు ఎక్కవితే రైతుల ఆర్థిక భరోసా విచ్ఛిన్నం అవుతుందని భయంకరం. ప్రత్యేకంగా భూములను ఇచ్చిన రైతులు వారి జీవనాధారం మెరుగుపడుతుంది. రైతుల హక్కులు, పునరావాసం, పరిహారం, భవిష్య రక్షణ వంటి అంశాలు చట్టపరంగా భరోసా ఇవ్వాలి.

అమరావతి నిర్మాణం ప్రజల ఆశలు, ఆశయాలతో కూడిన సంకల్పం. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని సంక్షిష్టం చేయడం బాధాకరం. రాజధాని ఇబ్బందులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం రాజధాని లేకుండా చేస్తారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. రాజధాని కోసం అందరూ ఏకం కావాలి. తెలంగాణ తరహాల్లో ఐక్యంగా ముందుకు సాగాలి. అమరావతి నిలబడాలంటే నాయకత్వం పారదర్శకంగా, నిబద్ధతతో, ప్రజా ఆశల ప్రకారం ఆచరణలో కనిపించాలి.

వచ్చేస్తోంది ‘ఆషాఢం’.. ఈ నెలలో ఈ 5 పనులు ఎందుకు చేయరు..

Ashada Masam
Ashada Masam

Ashada Masam: తెలుగు సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే చాలామంది ఈ మాసం వస్తుందంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్త పనులు, వివాహాలు, గృహప్రవేశాలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఆషాఢం కూడా ఒకటి అని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ఎన్నో పుణ్యపర్వాలు, వ్రతాలు, దేవతారాధనలు జరుగుతాయి. కాబట్టి ఆషాఢాన్ని పూర్తిగా అశుభమాసంగా భావించడం సరైనది కాదని పండితులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం తర్వాత ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జులై 15న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. మరి ఆషాఢ మాసంలో ఈ పనులు ఎందుకు చేయరు?

ఆషాఢం ఎందుకు పవిత్రమైనదే..:
ఈ నెలలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాస్య వ్రతాలు కూడా ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి. సాధువులు, సన్యాసులు ఒకే ప్రాంతంలో ఉండి తపస్సు, ధ్యానం, శాస్త్ర అధ్యయనం చేస్తారు. భక్తులు ఉపవాసాలు, దానధర్మాలు, దేవాలయ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆషాఢాన్ని భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు.

గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. వర్షాకాలంలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా గోరింటాకు చల్లదనాన్ని అందిస్తుంది. చేతులు, కాళ్లలో వేడి తగ్గించి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే సౌభాగ్యానికి ప్రతీకగా భావించి వివాహిత మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. తెలంగాణలో బోనాల సందర్భంగా కూడా గోరింటాకుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఆషాఢంలో పెట్టుబడులకు ఎందుకు భయం?
చాలామంది ఆషాఢంలో వ్యాపారాలు ప్రారంభించకూడదు, పెట్టుబడులు పెట్టకూడదని నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రీయంగా లేదా చట్టపరంగా ఎలాంటి ఆధారం లేదు. గతంలో వ్యవసాయ ఆధారిత సమాజంలో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో పెద్ద ఆర్థిక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసేవారు. ఆ ఆచారమే క్రమంగా సంప్రదాయంగా మారింది. నేటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనేది ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ విశ్లేషణ ఆధారంగా నిర్ణయించుకోవాలి.

మాంసాహారం తింటే సమస్యేనా?
ఆషాఢం నుంచి వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో జీర్ణక్రియ కొంత మందగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే వర్షాకాలంలో సూక్ష్మజీవులు వేగంగా పెరిగే అవకాశం ఉండటంతో మాంసాహారం త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో మాంసాహారాన్ని తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచించారు. ఇది ఆరోగ్య రీత్యా తీసుకున్న జాగ్రత్తగా భావించాలి. అయితే వైద్యపరంగా పూర్తిగా నిషేధం అనే విషయం కాదు. పరిశుభ్రంగా వండిన, సురక్షితమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

కొత్త జంట ఎందుకు దూరంగా ఉండాలి?
ఆషాఢంలో కొత్తగా పెళ్లైన దంపతులు కొంతకాలం విడిగా ఉండే ఆచారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. గతంలో పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరిగేవి. ఆ వెంటనే వచ్చే వర్షాకాలంలో ప్రయాణాలు కష్టంగా ఉండటం, వ్యవసాయ పనులు ప్రారంభం కావడం వల్ల వధువు కొంతకాలం పుట్టింట్లో ఉండే సంప్రదాయం ఏర్పడింది. అలాగే గర్భధారణ జరిగితే ప్రసవ సమయం తీవ్రమైన వేసవిలో పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆచారం ఏర్పడిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని మతపరమైన నిషేధంగా కాకుండా సామాజిక సంప్రదాయంగా చూడాలి.

ఈ నెలలో వివాహాలు ఎందుకు చేయరు?
ఆషాఢంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడనే విశ్వాసంతో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ముహూర్తాలు సాధారణంగా నిర్ణయించరు. అయితే ఇది హిందూ జ్యోతిష్య సంప్రదాయంలో భాగం మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో పండితుల సూచనలతో ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయించే సందర్భాలు ఉన్నాయి.

చైనా ప్రజలకు కొత్త ముప్పు..!

China Floods
China Floods

China Floods: డ్రాగన్‌ కంట్రీ చైనాలో ఎప్పుడు ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియడం లేదు. వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది. తర్వాత అనేక వ్యాధులకు కారణమైన వైరస్‌లు కూడా చైనాలోనే మొదలయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక చైనాలో ప్రకృతి విపత్తులు సర్వ సాధారణం. వర్షాలు, వరదలు, కరువు, మంచు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇలా అనేకం సంభవిస్తుంటాయి. తాజాగా చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో తీవ్ర వరదలు సాధారణ విపత్తును మించి మరో ప్రమాదాన్ని తీసుకువచ్చాయి. సర్పాల పెంపక కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వందలాది పాములు వెలుపలకు వచ్చాయి. ఇందులో విషపూరిత జాతులు కూడా ఉండటం ప్రజల్లో ఆందోళనను పెంచింది. ఈ సంఘటన విపత్తుల సమయంలో జంతు పెంపక వ్యవస్థలు ఎలా అదనపు ముప్పుగా మారతాయో చూపిస్తుంది.

వరద విపత్తు..
తీవ్ర వర్షాలు, నదులు పొంగడం వల్ల పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, గ్రామాలు మునిగిపోవడంతో సాధారణ జీవితం స్తంభించింది. ఈ పరిస్థితి స్థానికంగా ఉన్న సర్ప పెంపక కేంద్రాలను ప్రభావితం చేసింది. వరద నీరు కేంద్రాల రక్షణ గోడలను బద్దలు కొట్టడంతో పాములు ఈదుకుంటూ బయటకు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలు ఈ పరిస్థితిని మరింత హైలైట్‌ చేశాయి.

సర్ప పెంపక కేంద్రాల నుంచి అపాయం..
గ్వాంగ్జీ ప్రాంతం సర్పాల పెంపకానికి ప్రధాన కేంద్రం. సంప్రదాయ వైద్యం, తోలు, ఆహారం కోసం ఇక్కడ లక్షలాది సర్పాలను పెంచుతారు. వరదలు ఈ కేంద్రాలను దెబ్బతీయడంతో విషపూరిత జాతులు సహా పాములు నివాస ప్రాంతాల్లోకి చేరాయి. ఈ పరిస్థితి ప్రజల రోజువారీ కదలికలను ప్రభావితం చేసింది. పాములు నీటిలో ఈదుతున్న దృశ్యాలు భయాన్ని పెంచాయి.

సర్ప పెంపక కేంద్రాల నుంచి బయటకు వచ్చిన పాముల్లో చాలా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పాములను పట్టుకున్నారు. ఇంకా 900 పాముల ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఇవి ఇళ్లలోకి చేరితో మనుషులకు ప్రమాదమని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రశాంత్ కిషోర్ తో కీలక చర్చలు..

Allu Arjun Politics
Allu Arjun Politics

Allu Arjun Politics: తమిళనాడులో విజయ్ ముఖ్య మంత్రి అయ్యాక , అనేక మంది హీరోల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశ పుట్టిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. విజయ్ కి జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది , అంతే కాకుండా ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడిమరీ చూస్తుంటారు. దశాబ్దాల నుండి సంపాదించుకున్న క్రెడిబిలిటీ ఇది. 2008 లోనే దూరదృష్టితో తన రాజకీయ రంగ ప్రవేశం కోసం తన ఫ్యాన్స్ అస్సోసియేషన్స్ అన్నిటిని ఒక తాటిపై తీసుకొచ్చి, వాళ్ళ చేత సేవా కార్యక్రమాలు చేయిస్తూ జనాలకు బాగా దగ్గర చేశారు విజయ్. సరైన సమయం చూసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు , పోటీ చేసిన మొదటిసారే ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. విజయ్ అనుసరించిన ఈ మోడల్ అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది. అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని వైపుల నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

అవును.. మీరు వింటున్నది నిజమే.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు , అందుకోసం ఆయన రెగ్యులర్ గా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ఆయన మామయ్య చంద్ర శేఖర్ కూడా తనవైపు నుండి పూర్తి సహకారం అందిస్తున్నారట. అయితే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ 2029 లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కి రాజకీయ పార్టీ ని స్థాపించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ , చరిష్మా కానీ లేదు. పుష్ప కారణం గా జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది కానీ , అది ఓట్లు వేసేంత రేంజ్ కాదు. అందుకే అల్లు అర్జున్ చాలా పకడ్బందీగా విజయ్ మోడల్ ని అనుసరిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతీ నెల వాళ్లకు ఫండింగ్ కూడా అల్లు అర్జున్ వైపు నుండి అందుతుంది. ఈ అభిమాన సంఘాల ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేయించే ప్లాన్ లో ఉన్నారు , ఇప్పటికే కొంతమంది కి ఆయన ఈ అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేయించారు. ఇలా సుదీర్ఘంగా ఒక దశాబ్దం పాటు చేసి , ఈ లోపు మంచి కాంబినేషన్స్ తో సినిమాలను సెట్ చేసుకొని, భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , అన్ని వర్గాల్లోనూ ఫ్యాన్ బేస్ ని పెంచుకొని , పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?, లేదా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

రంగస్థలం, దసరా, లెనిన్ ఈ మూడు మూవీస్ మధ్య ఉన్న సంబంధం ఇదే...

Lenin Vs Rangasthalam
Lenin Vs Rangasthalam

Lenin Vs Rangasthalam: కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ ఫుల్ సినిమా వచ్చిందంటే చాలు దాని రిఫరెన్స్ తో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా ఎప్పుడైతే వచ్చిందో దాని ఇన్స్పిరేషన్ తో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక రకంగా శ్రీకాంత్ ఓదెల చేసిన దసరా సినిమా కూడా దానికి ఇన్స్పిరేషన్ గా వచ్చిన సినిమానే కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు లెనిన్ సైతం ఇలాంటి కథతోనే తెరకెక్కిందనే వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో గోదావరి జిల్లాలో ఉండే ఆ ప్రాంతపు సెటప్ తో సినిమాను చేస్తే దసరా మూవీని మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని సినిమా చేశారు.

ఇక ఇప్పుడు లెనిన్ మాత్రం రాయలసీమ ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కించారు. ఈ మూడు సినిమాల కోర్ ఎలిమెంట్ అలాగే సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అన్ని ఒకేలా ఉన్నప్పటికి బ్యాక్ డ్రాప్ మాత్రం చేంజ్ చేశారు. మొత్తానికైతే లెనిన్ సినిమాకి మొదటి షో తోనే ఓకే టాక్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను రంగస్థలం, దసరాలతో పోల్చి చూస్తున్నారు.

దానివల్ల ఈ సినిమాకి ఏదైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే అఖిల్ చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడనే చెప్పాలి… ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది లాంగ్ రన్ లో ఈ సినిమాకి భారీ విజయం దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలేవి రాకపోవడంతో భారీ విజయాన్నైతే సాధించలేకపోతున్నారు. గత నెలలో పెద్ది సినిమా వచ్చినప్పటికి ఆ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రేక్షకులందరు స్టార్ హీరో సినిమాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు…

కాజల్ 10 సంవత్సరాలు ఆ స్టార్ హీరోను లవ్ చేయడానికి కారణం ఇదే...

Kajal Aggarwal Love Story
Kajal Aggarwal Love Story

Kajal Aggarwal Love Story: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి. వాళ్ళందరు కలిసి నటిస్తారు కాబట్టి సినిమాలో సీన్స్ బాగా పండడానికి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. దీనివల్ల నటీనటుల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కాజల్ లాంటి నటిమణి సైతం చాలా మంది హీరోలతో సినిమాలను చేసింది. అయితే ఒక హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్టు ఒక సందర్భంలో ఆమె తెలియజేయడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ప్రభాస్ గా తెలుస్తుంది. డార్లింగ్ సినిమాలో తనతో పాటు నటించింది. ఆ సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఆన్ స్క్రీన్ మీద వీళ్ళకి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయిందని చాలామంది కితాబ్ ఇచ్చారు.

మరి ఇలాంటి క్రమం లోనే ఆ తర్వాత ఆమె ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటారనని ఒక ప్రపోజల్ అయితే పెట్టిందట. కానీ ప్రభాస్ మాత్రం దాని మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో 10 సంవత్సరాలపాటు ప్రభాస్ కోసం వెయిట్ చేసి మరి ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక సందర్భంలో తెలియజేసింది.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు పెళ్లి చేసుకోవాలి అని ప్రతి ఒక్క నటిమణి కోరుకుంటుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. తన లైఫ్ ని తను ఒంటరిగా జీవించాలని చాలా ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా కాజల్ మాత్రం ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అలాగే తనకి ఒక బాబు కూడా పుట్టాడు ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తుంది. అయినప్పటికి తన బాబు ను చాలా కేర్ఫుల్ గా చూసుకోవడమే తన ప్రధాన లక్ష్యం అని చెబుతోంది…

రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లలో అందగాడు ఎవరో చెప్పేసిన కాజల్...వైరల్ వీడియో...

Kajal Aggarwal
Kajal Aggarwal

Kajal Aggarwal: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎప్పటికప్పుడు కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏ సినిమా చేసిన కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరిలో హ్యాండ్సమ్ గా కనిపించే హీరో ఎవరు అనే ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్నను హీరోయిన్ కాజల్ ని అడగగా ఆమె షాకింగ్ ఆన్సర్స్ చెప్పింది…

లుక్స్ ను బట్టి ఎవరెవరికి ఎంత రేటింగ్ ఇస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి కాజల్ నిర్మోహమాటంగా సమాధానం చెప్పింది. మొదటగా అల్లు అర్జున్ కి 10 కి ఎంత రేటింగ్ ఇస్తారు అని అడిగితే 6 అని చెప్పింది. ఎన్టీఆర్ కి కూడా 6 రేటింగ్ ఇచ్చింది. ప్రభాస్ కి మాత్రం వెయిట్ 8 ఇచ్చింది.

రామ్ చరణ్ కి 7 రేటింగ్ ఇచ్చింది. మొత్తానికైతే ప్రభాస్ కి 8 రైటింగ్ ఇచ్చి అందరికంటే అతను హ్యాండ్సమ్ హీరో అని కాజల్ చాలా క్లియర్ గా చెప్పేసింది. మొత్తానికైతే ఇది చూసిన మిగతా హీరోల అభిమానులు మాత్రం కాజల్ మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా హీరోలందరు అందంగానే ఉంటారు. కానీ అందులో ప్రభాస్ తన హైట్, వేటు కి తగ్గట్టుగా ఆ కటౌట్ భారీగా ఉండటంతో అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా కనిపించేవాడు.

కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ లుక్స్ చాలా వరకు చెడిపోయాయి. మొత్తానికైతే కాజల్ ఒక పది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం కాజల్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పరంగా సెట్ అయిపోయింది. మంచి అవకాశాలు దొరికినప్పుడు మాత్రమే తను సినిమాలు చేస్తుంది. సీనియర్ హీరోల పక్కన సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని కూడా చెబుతుండటం విశేషం…