Homeబిజినెస్Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మీరు ట్రై...

Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మీరు ట్రై చేశారా

Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్.. సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీని ద్వారానే తమ అప్డేట్ లు ఇస్తున్నారు. కొంతమంది దీని ద్వారా ఇన్ఫ్లుయన్సర్స్ గా మారిపోతున్నారు. దీని ద్వారా వచ్చే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాప్ మొదట్లో అంతగా ఆదరణ సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్ […]

Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్.. సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీని ద్వారానే తమ అప్డేట్ లు ఇస్తున్నారు. కొంతమంది దీని ద్వారా ఇన్ఫ్లుయన్సర్స్ గా మారిపోతున్నారు. దీని ద్వారా వచ్చే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాప్ మొదట్లో అంతగా ఆదరణ సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్ వాడుతున్నారు.

మెటా కంపెనీ ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. యూజర్ల ఆసక్తిగా అనుగుణంగా కొత్త కొత్త మార్పులను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా యూజర్లకు న్యూ మ్యూజ్ ఇమేజ్ మోడల్ ను అనే ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. దీని ప్రకారం యూజర్లు పబ్లిక్ గా ఉన్న ఇతర అకౌంట్ లో ఫోటోలను ఏఐ ఇమేజెస్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఎకౌంటు పబ్లిక్ గా ఉంటేనే అందులో ఉన్న ఫోటోలను.. రీల్స్ ను ఇతరులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగకూడదు అనుకుంటే ఎకౌంట్ మొత్తాన్ని ప్రైవేట్ లో పెట్టుకోవాలి. లేదా సెట్టింగ్స్లో రీల్స్.. పోస్ట్ల షేరింగ్.. రీ యూస్ ఆప్షన్ మొత్తాన్ని డిజేబుల్ చేయాలి.

యూజర్లకు మెరుగైన అనుభూతి అందించడానికి ఇటువంటి ఫీచర్ తీసుకొచ్చామని మెటా కంపెనీ చెబుతోంది. కొంతకాలంగా దీని మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్న మెటా కంపెనీ ఆర్ అండ్ డి విభాగం.. మొత్తానికి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట్లో అమెరికా లో మాత్రమే దీనిని అందుబాటులో తీసుకొచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ వైస్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఆసక్తికరంగా ఉందని మెజారిటీ యూసర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకసారి కొత్త చిత్రాలు.. వీడియోలు రూపొందించడానికి ఆస్కారం ఏర్పడుతోందని యూజర్లు చెబుతున్నారు.

కొన్ని సందర్భాలలో ఇవి మిస్ యూస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని కొంతమంది యూజర్లు అంటున్నారు. కొంతమంది కావాలని కక్ష కట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు.. వీడియోలను రూపొందించి.. వేరే విధంగా వాడుకుంటే ఇబ్బంది ఉంటుందని.. అలాంటప్పుడు ఈ ఫీచర్ విషయంలో ఇంకా మెటా కంపెనీ అనేక జాగ్రత్తలు.. సెక్యూరిటీ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని యూసర్లు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ కొత్త ఫీచర్ సరి కొత్తగా ఉందని.. క్రియేటివిటీకి ఎక్కువగా ఆస్కారం కల్పించే విధంగా ఉందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper