Home Blog Page 5

అఖిల్ కి సారీ చెప్పిన దర్శకుడు...

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు భారీ సక్సెస్ ని కొల్లగొట్టలేకపోయాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన భారీ డిజాస్టర్ గా మిగిలింది ఇప్పుడు ఎట్టకేలకు ఆయన లెనిన్ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సినిమా కథలో కొన్ని కీలకమైన విషయాలను అఖిల్ దగ్గరుండి మరి చూసుకున్నారట. మొదటి దర్శకుడు అఖిల్ చెప్పిన చేంజస్ కి ఒప్పుకున్నప్పటికి టీమ్ మొత్తం కలిసి డిస్కస్ చేసిన తర్వాత అఖిల్ చెప్పిన చేంజెస్ సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ఒప్పుకున్నారట.

మొత్తానికైతే ఇప్పుడు సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో దర్శకుడు అఖిల్ కి సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఖిల్ మొదట్లో చెప్పిన కొన్ని చేంజెస్ లను దర్శకుడు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అవే సినిమాలో చాలా వరకు ప్లస్ అయ్యాయని అందరు చెబుతుంటే అందుకు ఈరోజు సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక రాబోయే రోజుల్లో అఖిల్ చాలా మంచి కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సక్సెస్ ని కాపాడుకుంటూ ముందుకు సాగితేనే ఆయన కెరియర్ టాప్ హీరో రేంజ్ లో దూసుకుపోతుంది.

లేకపోతే మాత్రం డీలా పడిపోవడం ఖాయం అని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అఖిల్ మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేయాలి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన ఒక సక్సెస్ కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే అతనికి ఫ్యూచర్ ఉంటుంది. ఏ మాత్రం నెగ్లెట్ చేసిన కూడా ఆయన కెరియర్ అమాంతం పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది…

లెనిన్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో...

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ రాలేదు. దాంతో ఆయన ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో లెనిన్ సినిమాని చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ అఖిల్ దగ్గరికి రాకముందే మరొక స్టార్ హీరో వద్దకు వెళ్ళిందట. కానీ ఆయన ఈ కథనైతే రిజెక్ట్ చేశాడు. దాంతో దర్శకుడు అఖిల్ వద్దకు వెళ్ళాడు. ఈ సినిమా కథ అఖిల్ కి బాగా నచ్చి చేశాడు సూపర్ సక్సెస్ ను సాధించాడు.

ఈ కథ ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే నాచురల్ స్టార్ నాని దగ్గరికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. కానీ నాని మాత్రం ‘దసరా’ సినిమా తర్వాత ఆయన మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ కథకు తను బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో దర్శకుడు అతన్ని సంప్రదించారట. కానీ నాని మాత్రం ప్యారడైజ్ సినిమా బిజీలో ఉండడం వల్ల ఈ సినిమాని చేయలేనని చెప్పాడు.

దాంతో అఖిల్ దగ్గరికి వెళ్లి కథను వినిపించగా అతను ఈ సినిమా చేశాడు. దాంతో ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి అఖిల్ సిద్ధమయ్యాడు. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది.

ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతుందా ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని ఓన్ చేసుకోగలుగుతున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక రెండు మూడు రోజుల సమయం అయితే పడుతుంది…అఖిల్ కెరియర్ లోనే ఈ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన మూవీ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

బై బై వైభవ్ సూర్య వంశీ..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: నిజమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వైభవ్ సూర్య వంశీ కనీసం కలలో కూడా ఊహించి ఉండడు.. తన పట్ల సోషల్ మీడియాలో ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతుందని అంచనా వేసి ఉండడు. నిన్నటిదాకా తనమీద పూలు చల్లిన అభిమానులు ఇలా రాళ్లు కూడా వేస్తారని భావించి ఉండడు. కానీ ఇప్పుడు తలచుకొని బాధపడడం తప్ప వైభవ్ సూర్య వంశీ చేసేదేమీ లేదు.

ఐరిష్ సిరీస్ కోసం వైభవ్ సూర్య వంశీని ఎంపిక చేశారు. అతడు మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. దీనికి తోడు ఆ సిరీస్ టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత సూర్య వంశీకి ఇంగ్లాండ్ సిరీస్లో ఆడే అవకాశం వచ్చింది. గతంలో అతడు అండర్ 19 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ గడ్డమీద ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుపై సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఇప్పుడు కూడా సూర్య వంశీ అదరగొడతాడని.. దుమ్ము రేపు తాడని సగటు అభిమాని ఆశించాడు. కానీ అది సాకారం కాలేదు. పైగా సూర్యవంశీ ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

పదేపదే షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. ఒక సిక్సర్ లేదా ఫోర్ కొట్టి ఊపు తీసుకురావడం.. ఆ తర్వాత అవుట్ కావడం.. ఇలా సాగిపోయింది సూర్య వంశీ ఆట తీరు.. అసలు అలా ఎందుకు ఆడుతున్నాడు.. అలా ఎందుకు అవుట్ అవుతున్నాడు.. బ్యాటింగ్లో ఏమాత్రం మార్పు లేదు.. బంతులను ఎదుర్కొనే విధానంలో కొత్త తీరు కనిపించడం లేదు. ఇలా అయితే ఎలా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవల ట్రై సిరీస్ లో కూడా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడి దూకుడు మామూలుగా ఉండదని.. అతడు టీమిండియాలోకి వస్తే రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయని అందరు అనుకున్నారు. కానీ అతడు ఆశించిన స్థాయిలో ఆట తీరు కొనసాగించడం లేదు. ఐపీఎల్ మాదిరిగా పరుగుల ప్రవాహాన్ని సృష్టించడం లేదు. ఇలా వస్తున్నాడు.. అలా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ఒక ఫోర్ లేదా సిక్సర్ కొట్టి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఆ తర్వాత పేలని చిచ్చుబుడ్డి మాదిరిగా.. కాంతి విహీనంగా మారిపోతున్నాడు.

మొన్నటిదాకా అతని నామస్మరణ చేసింది సోషల్ మీడియా. అతడు అడుగుపెడితే మాస్.. బంతిని గట్టిగా కొడితే మాస్.. సిక్సర్ కొడితే మాస్ అన్నట్టుగా ఉపమానాలు రూపొందించింది. కానీ ఇప్పుడు అతని పరిస్థితి బై బై వైభవ్ సూర్యవంశీ.. కేవలం నువ్వు ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతావు.. బౌన్సీ మైదానాల మీద ఆడే సత్తా నీకు లేదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలకు సూర్య వంశీ ఎలాంటి సమాధానం చెప్పాడు.. ఐదో టి20 మ్యాచ్ లో తన సత్తా చూపిస్తాడా.. లేకుంటే తన దూకుడు పాలపొంగు అని సరిపెట్టుకుంటాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

బ్రాహ్మణి స్టీల్‌ భూముల వ్యవహారం.. కూటమి ప్రభుత్వానికి జాక్‌పాట్‌!

Brahmani Steel Lands
Brahmani Steel Lands

Brahmani Steel Lands: 2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో దాదాపు 14 వేల ఎకరాల భూమి గాలి జనార్దన్‌ రెడ్డి సంస్థకు కేటాయించబడింది. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంది. ఈ సంఘటన రాయలసీమ అభివృద్ధి, రాజకీయ సంబంధాలు, భూమి వినియోగం వంటి అంశాలపై ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

భూమి కేటాయింపు వివరాలు
జమ్మలమడుగు మండలంలో 10,700 ఎకరాలు స్టీల్‌ ప్లాంటు కోసం, 3,115 ఎకరాలు ఎయిర్‌ పోర్టు కోసం కేటాయించారు. మొత్తం సుమారు 13,885 ఎకరాలు. «స్టీల్‌ ప్లాంటుకు ఎకరానికి రూ.18 వేలు, ఎయిర్‌ పోర్టుకు ఎకరానికి రూ.25 వేలు చొప్పున భూములు కేటాయించారు. దీంతో గాలి జనార్దన్‌ రెడ్డి సంస్థ సుమారు 27 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఈ విస్తీర్ణ భూమిని పొందింది. ఆ సమయంలో రాయలసీమలో ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి జరుగుతాయని ప్రకటించారు.

రాజకీయ సంబంధాలు..
ఈ కేటాయింపు వెనుక రాజకీయ, వ్యాపార సంబంధాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. అప్పట్లో జగన్‌ మోహన్‌రెడ్డి బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేస్తుండగా, గాలి జనార్దన్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ సంబంధం ద్వారా కడపలో స్టీల్‌ ప్లాంటు ప్రాజెక్టు ముందుకు సాగింది. అనంతపురం, కర్ణాటక–ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఇనుప ఖనిజ గనులు కూడా కేటాయించబడ్డాయి. గాలి జనార్దన్‌ రెడ్డి బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటికీ, ఆయనకు వివిధ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు టూరిజం శాఖ మంత్రి పదవి లభించింది. బ్రాహ్మణి స్టీల్‌ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రాజెక్టు అమలులో విఫలం..
స్టీల్‌ ప్లాంటు, ఎయిర్‌ పోర్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ముఖచిత్రం మారుతుందని ఆశలు వ్యక్తం చేశారు. కానీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. గాలి జనార్దన్‌ రెడ్డి హవా పీక్‌లో ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు జరిగాయి. తర్వాత అక్రమ మైనింగ్‌ ఆరోపణలు, లోకాయుక్త, సీబీఐ దర్యాప్తులు మొదలయ్యాయి. యూపీఏ కేంద్ర ప్రభుత్వ కాలంలో కూడా ఫండింగ్‌ సంబంధిత ఆరోపణలు వచ్చాయి. యస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత గాలి జనార్దన్‌ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. బ్రాహ్మణి స్టీల్‌ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది.

బ్యాంకులో భూమి తాకట్టు..
ప్రాజెక్టు ఆగిపోయిన తర్వాత 10,700 ఎకరాల భూమిని యాక్సిస్‌ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.350 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఒప్పందంలో భూమిని తాకట్టు పెట్టకూడదని స్పష్టమైన నిబంధన ఉంది. ఈ రుణంలో కొంత భాగం ఎన్నికల ఖర్చులకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. యాక్సిస్‌ బ్యాంకు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులను అడ్డుకుంది. 18 ఏళ్ల పోరాటం తర్వాత కోర్టు బ్యాంకుకు ఎలాంటి హక్కు లేదని తీర్పు ఇచ్చింది.

కూటమి ప్రభుత్వం సా«్వధీనం..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కలెక్టర్‌ ఉత్తర్వుల ద్వారా ఈ భూములను వెనక్కి తీసుకుంది. వీటిని మళ్లీ పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ 14 వేల ఎకరాల విలువ సుమారు రూ.5,000 కోట్లుగా అంచనా. అదే జమ్మలమడుగు మండలంలో జిందాల్‌ సంస్థ రూ.16,000 కోట్ల పెట్టుబడితో రాయలసీమ స్టీల్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టింది.

ఈ వ్యవహారం రాజకీయ సంబంధాల ఆధారంగా చౌకగా ప్రజా భూములు కేటాయించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో చూపిస్తోంది. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతంలో అభివద్ధి ప్రాజెక్టులు రాజకీయ ప్రభావాలకు లోనవ్వకుండా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. 18 ఏళ్లపాటు ఒక ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల ప్రాంతీయ అభివృద్ధి ఆలస్యమైంది. ఇప్పుడు భూములు వెనక్కి రావడం ద్వారా ప్రభుత్వం చట్టబద్ధమైన చర్య తీసుకున్నట్లు కనిపిస్తోంది.

లోకేష్ బాటలో విజయ్.. తమిళనాడులో ఏపీ మాదిరిగానే..

CM Vijay
CM Vijay

CM Vijay: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అవి సరికొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయని.. నారా లోకేష్ తీసుకొచ్చిన నూతన విధానాలు ఏపీ రాష్ట్రాన్ని గేమ్ చేంజర్ లాగా మారుస్తున్నాయి. భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి.

ఇప్పుడు ఇదే దారిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపించిన తోవలో నడుస్తున్నారు. ఏపీ బాటలోనే తన రాష్ట్రాన్ని కూడా నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. క్లాస్ రూమ్ లలోకి రాజకీయ కార్యకర్తలు ప్రవేశించకూడదు. ప్రవేట్ వ్యక్తులు ఎంట్రీ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో విద్యాలయాల్లో ప్రైవేట్ కార్యక్రమాలు.. రాజకీయ కార్యక్రమాలు జరగకూడదు. కేవలం ఎన్నికైన నాయకులకు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతి ఉంటుంది. ప్రైవేట్ విద్యాలయాలలోకి ఎంట్రీ ఉంటుంది. ఇదే నిబంధన తీసుకొచ్చి నారా లోకేష్ ఏపీ విద్యాశాఖలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు.

ఇప్పుడు ఇదే మార్పును తమిళనాడులో అమలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ రాష్ట్ర మాదిరిగానే సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకువచ్చారు. విద్యాలయాలను రాజకీయ అనుకూల కార్యక్రమాలకు దూరంగా ఉండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా అక్కడ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యావేత్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యాలయాలలో రాజకీయ కార్యక్రమాలు జరగవని.. తద్వారా విద్యార్థులకు స్వేచ్ఛాయుత విధానంలో చదువుకునే అవకాశం ఉంటుందని విద్యావేత్తల అభిప్రాయపడుతున్నారు.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్.. తమిళనాడులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి విధానాన్ని తీసుకురావాలని.. రాజకీయాలకు విద్యాలయాలను దూరంగా ఉంచాలని.. విద్యార్థులకు స్వేచ్ఛతో కూడిన విద్యను అందించాలని.. అప్పుడే యువతరం బాగుపడుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో సరికొత్తమార్పులకు నాంది పలుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఎన్నికల్లో చెప్పినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తున్నారని..ఇది ఇలాగే కొనసాగాలని అక్కడి ప్రజల అంటున్నారు.

ఈ ఆకుల పేస్ట్ తో తెల్ల జుట్టు నల్లగా మారతుంది.. ఎలా తయారు చేసుకోవాలంటే..

Bhringraj Leaves For Hair
Bhringraj Leaves For Hair

Bhringraj Leaves For Hair: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటం, అధికంగా రాలిపోవడం, పలుచబడటం వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, రసాయనాలతో తయారైన హెయిర్ ప్రొడక్ట్స్ అధిక వినియోగం వంటి కారణాలతో ఈ సమస్యలు పెరుగుతున్నాయని కొందరు సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలామంది మార్కెట్‌లో లభించే హెయిర్ డైలు, నూనెలు, సీరమ్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రకృతిలో లభించే ఈ ఆకుతో జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పెరుగుదలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఇది ఏ ఆకు?

ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు, మొక్కలు ఉంటాయి. వీటిలో కొన్ని ఆరోగ్యకరంగా ఉపయోగపడుతాయి. వీటిలో భృంగరాజ్‌ (గుంటగలగర) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనిని ‘కేశరాజ్’ అని కూడా అంటారు. అంటే జుట్టుకు రాజు అనే అర్థం. శతాబ్దాలుగా జుట్టు సంరక్షణలో ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. భృంగరాజ్ ఆకులు, కాండం, నూనె, పొడి రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భృంగరాజ్ ఆకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ జుట్టుకు సహజ నలుపు రంగును ఇచ్చే మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజపరుస్తాయి. మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. భృంగరాజ్‌లోని సహజ సమ్మేళనాలు ఈ ప్రక్రియకు తోడ్పడవచ్చని కొన్ని ప్రయోగాత్మక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్తిగా తెల్లబడిన జుట్టు మళ్లీ నల్లబడుతుందని బలమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి.

భృంగరాజ్ ఆకులను శుభ్రంగా కడిగి పేస్ట్ చేసి తలకు అప్లై చేయవచ్చు. అలాగే భృంగరాజ్ నూనెతో వారానికి రెండు లేదా మూడు సార్లు మసాజ్ చేయడం కూడా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. కొందరు భృంగరాజ్ పొడిని ఉసిరి, మెంతులు వంటి సహజ పదార్థాలతో కలిపి హెయిర్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. కొత్తగా ఏదైనా పదార్థం ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించుకోవడం మంచిది.

మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. ఈ కెరాటిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను కెరాటినోసైట్స్ అంటారు. భృంగరాజ్ తలకు రక్తప్రసరణ మెరుగుపడేందుకు తోడ్పడటం ద్వారా జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు చేరడంలో సహాయపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో జుట్టు బలంగా పెరిగే అవకాశం ఉంటుంది.

సాధారణంగా ప్రతి రోజూ సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సహజ ప్రక్రియ. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి. జుట్టు పెరుగుదలలో విశ్రాంతి దశ (టెలోజెన్ దశ) ఉంటుంది. భృంగరాజ్‌లోని కొన్ని ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచి పెరుగుదల దశను ప్రోత్సహించవచ్చని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అయితే ఊడిన వెంట్రుకలు 10 నుంచి 12 రోజుల్లోనే తిరిగి మొలుస్తాయని నిర్ధారించే బలమైన క్లినికల్ ఆధారాలు ప్రస్తుతం లేవు. వ్యక్తుల ఆరోగ్యం, కారణాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు.

తలకు సరైన రక్తప్రసరణ, కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడితే జుట్టు బలంగా, దట్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. భృంగరాజ్ నూనెతో తలకు మృదువుగా మసాజ్ చేయడం వల్ల తలకు విశ్రాంతి లభించడంతో పాటు జుట్టు పొడిబారకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే జుట్టు దట్టంగా పెరగడం జన్యుపరమైన అంశాలు, పోషకాహారం, హార్మోన్లపై కూడా ఆధారపడి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కి పాలనలో కితాబులు జనంలో నీరాజనాలు కానీ..

Pawan Kalyan

Pawan Kalyan : రాజకీయ నాయకుడి విజయాన్ని కేవలం సభల్లో వచ్చే జనసందోహంతోనే కొలవలేం. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌లతో కూడా అంచనా వేయలేం. ఒక ప్రజాప్రతినిధి పనితీరు ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు, ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే మార్పులతోనే కొలవాలి. ఈ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల పనితీరుపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో ర్యాంకు సాధించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకంలో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరచడం వెనుక గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న చర్యలు కీలకంగా నిలిచాయని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు కూడా ఈ శాఖ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన సందర్భాలు ఉండటంతో, శాఖ పనితీరుపై సానుకూల చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన “మ్యాజిక్ డ్రెయిన్” ఆలోచన కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామాల్లో మురుగు నీటి నిర్వహణ, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే ఈ విధానంపై పలువురు నిపుణులు ప్రశంసలు వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపాలనే ప్రయత్నంగా దీనిని అభివర్ణిస్తున్నారు.

అటవీ శాఖలో కూడా ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో అనేక పరిపాలనా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న సిబ్బందికి ధైర్యం చెప్పడంతో పాటు, నిర్ణయాత్మకంగా వ్యవహరించే వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారని చెబుతున్నారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం శాఖ పనితీరుపై కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు.

పంచాయతీరాజ్ శాఖలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం మరో ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చింది. పదోన్నతులు రావడంతో గ్రామీణ పరిపాలనలో మరింత ఉత్సాహం, బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. పేపర్ మిల్లుల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని గుర్తించి సంబంధిత సంస్థలను హెచ్చరించడం, కాలుష్య నియంత్రణపై కఠిన వైఖరి అవలంబించడం ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చింది. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయబోమనే సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి ఇది ఉపయోగపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక విజయనగరం జిల్లాలోని “పెద్ద పెంకి” గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మురుగు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ గ్రామం పరిస్థితి ఎవరూ పట్టించుకోని స్థితికి చేరింది. ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులతో సమన్వయం చేసి గ్రామ అభివృద్ధి పనులు చేపట్టారు. ఒకప్పుడు మురికి కూపంగా మారిన గ్రామం ఇప్పుడు పరిశుభ్రమైన వాతావరణంతో మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్పు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖల్లో పరిపాలనపరంగా ప్రత్యేక ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. విమర్శల కంటే పనితో సమాధానం చెప్పాలనే ధోరణి కనిపిస్తోందని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే పరిపాలనలో మంచి మార్కులు రావడం ఒక విషయం అయితే, అది రాజకీయంగా కూడా అదే స్థాయిలో లాభం చేకూరుస్తుందా అన్నది మరో ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల అంచనాలు వేగంగా మారుతుంటాయి. ఒకవైపు పాలనలో విజయాలు, మరోవైపు రాజకీయ వ్యూహాలు, ప్రజల్లో నిరంతర అనుసంధానం..   ఈ మూడు అంశాల సమతుల్యతే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేవలం పరిపాలనలో ప్రశంసలు అందుకోవడం మాత్రమే సరిపోదని, ఆ విజయాలను ప్రజల్లో రాజకీయ మద్దతుగా మార్చుకోవడం కూడా నాయకత్వానికి కీలక పరీక్ష అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటివరకు కనిపిస్తున్న సంకేతాలు మాత్రం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల పనితీరుపై సానుకూల చర్చ పెరుగుతోందని సూచిస్తున్నాయి. గ్రామీణ రహదారుల నిర్మాణం నుంచి పారిశుద్ధ్యం వరకు, ఉద్యోగుల సంక్షేమం నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు అనేక అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే ఒకవైపు పాలనలో కితాబులు దక్కుతుండగా, మరోవైపు గ్రామాల్లో ప్రజలు కూడా నీరాజనాలు పలుకుతున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

పవన్ కళ్యాణ్ కి పాలనలో కితాబులు జనంలో నీరాజనాలు కానీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

చెర్నోబిల్‌ విస్పోటనం.. అక్కడ జంతువుల పరిస్థితి ఎంత దయనీయం అంటే

Chernobyl Explosion
Chernobyl Explosion

Chernobyl Explosion: చెర్నోబిల్‌ అణు విస్పోటనం 1990లో పాఠాలు చదువుకున్నవారికి ఈ ఘటన గురించి తెలిసే ఉంటేంది. 1986లో జరిగిన భారీ అణు విపత్తు తర్వాత ఆ భూభాగం ప్రజలను తరలించారు. అక్కడికి ఎవరూ వెళ్లకుండా నిషేధించారు. దీంతో అడవులు మళ్లీ విస్తరించాయి. తోడేళ్లు, యూరేషియన్‌ లింక్స్‌ వంటి జంతువులు సమృద్ధిగా పెరిగాయి. ఆ ప్రాంతం వన్యప్రాణులకు సురక్షితమైన ఆశ్రయంగా మారింది. మానవ జోక్యం తక్కువగా ఉండటం వల్ల అనేక జాతులు తిరిగి వచ్చాయి.

కెమెరా ట్రాప్స్‌ ద్వారా పరిశోధన..
2020లో స్విత్లానా కుడ్రెంకో అనే పరిశోధకురాలు (జర్మనీలోని ఫ్రీబర్గ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేసినవారు) మార్కో హ్యూరిచ్‌ ప్రొఫెసర్‌ సహకారంతో ఈ విస్తృతమైన జోన్‌లో వైల్డ్‌లైఫ్‌ కెమెరాలు అమర్చారు. ఈ పని వైల్డ్‌ పోలిసియా ప్రాజెక్టులో భాగం. ఆమె జంతువుల సంఖ్య, వైవిధ్యం, ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి ఈ కెమెరాలను ఉపయోగించారు.

2022 రష్యా ఆక్రమణ..
2022 ఫిబ్రవరి చివరి నుండి మార్చి చివరి వరకు రష్యా సైన్యాలు చెర్నోబిల్‌ ఎక్స్‌క్లూజన్‌ జోన్‌ను ఆక్రమించి సైనిక స్థావరంగా ఉపయోగించాయి. అయినప్పటికీ కెమెరాలు నిరంతరం చిత్రాలు, వీడియోలు రికార్డ్‌ చేశాయి. పరిశోధకులు 2022 కాలంలోని డేటాను 2021 అదే కాలంతో పోల్చి చూశారు. దాదాపు 2000 చిత్రాలు, వీడియోలను విశ్లేషించి జంతువుల కార్యకలాపాలలో మార్పులను గుర్తించారు.

జంతువుల ప్రవర్తనలో మార్పులు..
యుద్ధ కార్యకలాపాల తీవ్రత పెరిగేకొద్దీ క్షీరదాల దినచర్యలు స్పష్టంగా మారాయి. ఎర్రటి జింకలు, రో జింకలు, అడవి పందులు, నక్కలు వంటి జాతులు రాత్రి సమయంలో కార్యకలాపాలు తగ్గించాయి. కొన్ని జాతులు పగటి సమయంలో ఎక్కువగా కదలడం ప్రారంభించాయి. లింక్స్‌ జాతిలో మార్పులు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం మీద జంతువుల కార్యకలాపాలు తగ్గాయి, ముఖ్యంగా రాత్రిపూట. కొన్ని జాతులు మానవ సమీప ప్రాంతాల వైపు కదలికలు చూపించాయి.

ఈ అధ్యయనం సాయుధ సంఘర్షణల సమయంలో వన్యజీవులు ఎలా తక్షణం స్పందిస్తాయో నిజ సమయంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. యుద్ధం మానవులను మాత్రమే కాకుండా ప్రకృతిని కూడా బాధిస్తుందని, జంతువులు మానవులను ముప్పుగా భావించి ప్రవర్తన మార్చుకుంటాయని తెలిసింది. ఈ ఫలితాలు ప్రపంచంలోనే మొదటిసారి యుద్ధ ప్రభావాన్ని కెమెరా డేటా ద్వారా రుజువు చేశాయి.

మత్స్యకారులను ముప్పుతిప్పలు పెడుతున్న విదేశీ చేప.. ఇండియాకు ఎలా వచ్చింది..

Suckermouth Catfish
Suckermouth Catfish

Suckermouth Catfish: ప్రస్తుతం దేశంలోని అనేక జలాశయాల్లో మత్స్యకారులకు ఓ విదేశీ చేప పెద్ద తలనొప్పిగా మారింది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతానికి చెందిన ఈ చేప భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లలో వేగంగా వ్యాపిస్తోంది. ఒకప్పుడు అక్వేరియంలలో అలంకరణ కోసం తీసుకొచ్చిన ఈ చేప ఇప్పుడు సహజ జలవనరులను ఆక్రమించి స్థానిక చేపల మనుగడకే ముప్పుగా మారుతోంది. ఇంతకీ ఇది ఏ చేప? దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి? మత్స్యకారులకు ఇది ఎందుకు ముప్పుగా మారింది?

శక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ (Suckermouth Catfish). ఇది అమెజాన్ నదీ పరివాహక ప్రాంతానికి చెందిన చేప. దీని మల్లు చాలా పదునుగా ఉంటాయి. ఈ ఫిష్‌కు నోటి భాగం సక్షన్ కప్‌లా ఉంటుంది. దీంతో రాళ్లు, చెక్కలు లేదా నీటి అడుగుభాగానికి అతుక్కుని ఆల్గీ వంటి పదార్థాలను తింటుంది. నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా జీవించగలదు. అంతేకాదు నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా గంటల పాటు ప్రాణాలతో ఉండగల సామర్థ్యం దీనికి ఉంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని బతకగలగడం దీని ప్రత్యేకత.

అక్వేరియం నుంచి ప్రకృతిలోకి ఎలా వచ్చింది?
శక్కర్ మౌత్ క్యాట్ ఫిష్‌ను గాజు ట్యాంకుల అడుగుభాగాన్ని శుభ్రంగా ఉంచే చేపగా అక్వేరియం యజమానులు పెంచుతుంటారు. అయితే ఇది పెద్దగా పెరిగిన తర్వాత చాలామంది వాటిని సమీపంలోని చెరువులు, నదులు లేదా రిజర్వాయర్లలో వదిలేస్తున్నారు. ఈ విధంగా సహజ జలవనరుల్లోకి చేరిన ఈ చేపలు వేగంగా సంతానోత్పత్తి చేసి స్థానిక జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

మత్స్యకారులకు భారీ ఆర్థిక నష్టం
ఈ చేపలు సంప్రదాయ చేపల వేటకు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయి. వలల్లో పెద్ద సంఖ్యలో చిక్కుకున్నప్పటికీ వీటికి మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో మత్స్యకారులకు ఆదాయం రావడం లేదు. పైగా వలలు దెబ్బతినడం, ఇతర విలువైన చేపల సంఖ్య తగ్గిపోవడం వల్ల వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఉజని రిజర్వాయర్ ప్రాంతంలోని మత్స్యకారులు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

ఎందుకు ఆక్రమణ జాతిగా పరిగణిస్తున్నారు?
శక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ శరీరంపై గట్టి కవచం, పదునైన ముళ్లు ఉంటాయి. అందువల్ల ఇతర చేపలు లేదా సహజ శత్రువులు దీనిని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడవు. దీంతో వీటి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇవి ఆహారం, నివాసం కోసం స్థానిక చేపలతో పోటీ పడటమే కాకుండా వాటి సంతానోత్పత్తి ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే దీనిని ఆక్రమణ జాతి (Invasive Species)గా పరిగణిస్తున్నారు.

పరిశోధనల్లో వెలుగులోకి వచ్చిన విషయాలు
ఈ చేపల ప్రభావంపై ప్రముఖ సంస్థ Bombay Natural History Society (BNHS) అధ్యయనం నిర్వహించింది. పరిశోధనల్లో స్థానిక చేపల జీవవ్యవస్థపై ఈ జాతి ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. విదేశీ ఆక్రమణ జాతుల నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పలు రాష్ట్రాలు కూడా ఈ చేపల పెంపకాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ చేపను ఎందుకు తినరు?
శక్కర్ మౌత్ క్యాట్ ఫిష్‌ను భారతదేశంలో సాధారణంగా ఎవరూ ఆహారంగా వినియోగించరు. దీని గట్టి కవచం, ముళ్లు, మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. దీంతో మత్స్యకారుల వలల్లో చిక్కినా వాటిని విక్రయించలేక నష్టపోతున్నారు.

నిపుణుల సూచనలు
విదేశీ చేపలను అక్వేరియంల నుంచి సహజ జలవనరుల్లోకి వదలకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి చర్యల వల్ల స్థానిక చేపల జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం, ఆక్రమణ జాతుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం, మత్స్యశాఖ పర్యవేక్షణను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

నమ్మితే ..నన్ను బలి చేశారు అంటూ కంటతడి పెట్టిన సీఎం విజయ్..

CM Vijay
CM Vijay

CM Vijay: గత ఏడాది తమిళనాడు ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం విజయ్ కరూర్ ప్రాంతం లో నిర్వహించిన సభ లో తొక్కిసలాట జరిగి ఎంతో మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం లో అప్పటి ప్రభుత్వం విజయ్ ని దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ వాస్తవాలు తెలిసిన జనాలు వాటిని నమ్మలేదు. ఆ తర్వాత విజయ్ చనిపోయిన ప్రతీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మాట ఇచ్చారు. అంతే కాకుండా తన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత , చనిపోయిన ప్రతీ కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇక సీఎం అయ్యాక మొదటి సార్ కరూర్ ప్రాంతం లో పర్యటించిన విజయ్ , చాలా భావోద్వేగ పూరిత ప్రసంగాన్ని అందించారు.

ఆయన మాట్లాడుతూ ‘ ఏ మనిషి అయినా తన జీవితం లో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు వాళ్ళను వెంటాడుతూనే ఉంటాయి. నాకు అలాంటి జ్ఞాపాకులు ఈ కరూర్ లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల ఏర్పడ్డాయి. ఈ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డని కోల్పోయారు.దీనికి బాద్యులు ఎవరు చెప్పండి?, ఆరోజు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి , మాకు ముందస్తు సమాచారం అందించి అలెర్ట్ చెయ్యాల్సింది. లేదా సమావేశాన్ని ఆరోజు రద్దు చేయాల్సింది. వారి చేతిలోని పనే కదా, కానీ అవేమి చేయకుండా వారు తాపీగా చోద్యం చూస్తూ టైం పాస్ చేశారు. ఆరోజు ఉన్న జనాలను పోలీసులు కంట్రోల్ చేయగలరని నేను నమ్మాను.కానీ , నా వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందంటూ నిందలు వేశారు. ఘటన తర్వాత నేను అక్కడి నుండి పారిపోయానని ప్రత్యర్థులు నాపై విమర్శలు చేశారు. కానీ నేను పారిపోలేదు , ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వాచా, ఈరోజు మీ ముందు ఇలా నిల్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు విజయ్.

అంతే కాకుండా ఇటీవల తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రల గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. జనాలు తనవైపే ఉన్నారని , ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల చేత ఎంచుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కూల్చేయలేరని ఆయన డీఎంకే పార్టీ పై మండిపడ్డారు. తన హయాం లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగితే అసలు సహించను అని, ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు విజయ్. ఎన్నికలకు ముందు చనిపోయిన కుటుంబాలకు విజయ్ ఇచ్చిన హామీ ని నెరవేరుస్తూ , నేడు కరూర్ లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ , నియామక పత్రాలు అందించారు సీఎం విజయ్.

'టాక్సిక్' మూవీలో నటీనటుల రెమ్యూనరేషన్స్ వివరాలు ఇవే..ఇలా అయితే చాలా కష్టం..

Toxic Movie Cast Remuneration
Toxic Movie Cast Remuneration

Toxic Movie Cast Remuneration: కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ వచ్చే నెల 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ వంటివి విడుదలయ్యాయి , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇక రీసెంట్ గా విడుదలైన బోల్డ్ రొమాంటిక్ సాంగ్ కి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ , ఈ సినిమాకు ఖర్చు అయిన బడ్జెట్ ని చూస్తుంటే , ఇది ఎంత వరకు విడుదల తర్వాత రీకవరీ చేస్తుంది అనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి.

ఈ చిత్రానికి KVN ప్రొడక్షన్స్ తో పాటు, హీరో యాష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. కాబట్టి ఈయనకు ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ వంటివి ఉండవు , లాభాల్లో వాటాలు పంచుకోవడమే. కానీ ఈ చిత్రం లో నటించిన ఇతర నటీనటులకు మాత్రం రెమ్యూనరేషన్స్ భారీగానే ఇచ్చారట. హీరోయిన్ కియారా అద్వానీ అక్షరాలా 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకోగా , నయనతార 18 కోట్లు తీసుకున్నారట. ఇక కీలక పాత్ర పోషించిన మరో హీరోయిన్ రుక్మిణి వాసంత్ 5 కోట్లు , హ్యూమా ఖురేషీ 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ చిత్రం లో తారా సుతారియా కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆమెకు కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ , ఇతర టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ అన్నీ కలిపితే 100 కోట్ల రూపాయిల వరకు అయ్యిందని తెలుస్తోంది.

కేవలం రెమ్యూనరేషన్స్ కే ఇంత ఖర్చు అయితే, ఇక సినిమా సెట్స్ కి , భారీ లొకేషన్స్ లో తీసిన సన్నివేశాలకు ఏ రేంజ్ ఖర్చు అయ్యి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు. తెలుగు స్టార్ హీరో సినిమాకు ఎంత అవుతుందో , అంత పెట్టి కొన్నారట దిల్ రాజు. కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అవసరం. ఒకవేళ రాకపోతే భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

'లెనిన్' మూవీ పై సమంత హాట్ కామెంట్స్.. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్..

Samantha
Samantha

Samantha: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ సినిమాకు ఇలాంటి పాజిటివ్ టాక్ వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అక్కినేని ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు, చాలా డల్ గా బుకింగ్స్ జరిగాయి. కానీ నేడు పాజిటివ్ టాక్ రావడం తో ప్రతీ సెంటర్ లోనూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ తమ అభిమాన హీరో నుండి ఈ రేంజ్ బుకింగ్స్, ఓపెనింగ్స్ చూసి చాలా రోజులైంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ హీరోయిన్ సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అఖిల్ కి శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని షేర్ చేస్తూ ‘ లెనిన్ టీం కి , మా అక్కినేని అఖిల్ కి ఆల్ ది బెస్ట్. ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైబ్స్ ఈ చిత్రానికి ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆమె ఈ స్టోరీ షేర్ చేయడం తో అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత , సమంత కి అక్కినేని ఫ్యామిలీ తో ఉన్న సంబంధాలు మొత్తం తెగిపోయాయని అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదని ఈ ఒక్క స్టోరీ తో చెప్పకనే చెప్పింది సమంత.

గతంలో కూడా అఖిల్ కి రెగ్యులర్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండేది సమంత. కానీ ఈమధ్య కాలం లో ఆమె అలాంటివి చేయలేదు. దీంతో అఖిల్ తో కూడా సంబంధాలు కట్ అయ్యినట్టు ఉన్నాయని అనుకున్నారు. కానీ అవన్నీ అపోహలే అని ఇప్పుడు అర్థం అయ్యింది. అఖిల్ విషయం లో సమంత చాలా పాజిటివ్ గానే ఉంది కానీ , నాగ చైతన్య విషయం లో మాత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అతని పేరు పలకడానికి కూడా ఇష్టం చూపలేదు సమంత. ఇప్పుడు అటు సమంత , ఇటు నాగ చైతన్య ఇద్దరు వారి వ్యక్తిగత జీవితాల్లో స్థిరపడ్డారు , పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కాస్త అయినా సమంత కి కోపం తగ్గి ఉండొచ్చు , భవిష్యత్తులో ఆమె నాగ చైతన్య సినిమాకు కూడా ఇలాగే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెడుతుందేమో చూడాలి.

'I Nobody' మూవీ రివ్యూ : పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇలా ఉంటుందని ఊహించలేదు!

I Nobody Movie Review
I Nobody Movie Review

I Nobody Movie Review: వరుస సూపర్ హిట్ సినిమాలతో మలయాళం లో దూసుకుపోతున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, లేటెస్ట్ గా నటించిన ‘I nobody’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో, సినిమాలో ప్లస్సులు, మైనస్సులు ఏంటో ఒకసారి వివరంగా చూద్దాము.

కథ :

రాజీవ్ (పృథ్వి రాజ్ సుకుమారన్ ) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇతనికి భార్య మీరా (పార్వతి) , ఇద్దరు పిల్లలు ఉంటారు. వీళ్లది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఒక బ్యాంక్ లో జరిగిన దోపిడీ వ్యవహారంలో తన ప్రమేయం లేకుండానే చిక్కుకుంటారు రాజీవ్. ఆ తర్వాత ఈ నేరం చేసిన వ్యక్తులు చనిపోతారు. కానీ ఈ వ్యవహారంలో దోషిగా రాజీవ్ నిలుస్తారు. పోలీసులు కూడా అతన్నే అనుమానిస్తూ ఉంటారు. అతని వద్దనే కోట్ల కొద్దీ దోపిడీ సొమ్ము ఉండనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా లో జనాలు కూడా రాజీవ్ ని దోషిగా అనుకుంటూ ఉంటారు. మరి ఈ సమస్యల నుండి రాజీవ్ ఎలా భయటపడుతారు?, ఎలాంటి వ్యూహ రచన చేసి నిర్దోషి గా బయటకు వస్తారు అనేది చూడాలి.

విశ్లేషణ :

ఈ చిత్రాన్ని చూసినప్పుడు మనకి నెట్ ఫ్లిక్స్ లోని ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. డైరెక్టర్ ఆ సిరీస్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తీసాడేమో అనిపించక తప్పదు. దోపిడీకి ముందు , ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆద్యంతం ఉత్కంఠ కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత దమ్ము , సెకండ్ స్క్రీన్ ప్లే లో కనిపించదు . కొన్ని సన్నివేశాలను బాగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తాది. చాలా సన్నివేశాలను నేపధ్య సంగీతం రక్షించింది అనే చెప్పాలి. ఇక హీరో పృథ్విరాజ్ సుకుమారన్ అయితే ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా జీవించేసారు. ఆయన నటన చాలా సహజం గా అనిపించింది. ఫస్ట్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ ఉండుంటే ఈ సినిమా ఎక్కడో ఉండేది. ఆరంభం లో బ్యాంక్ దోపిడీ సన్నివేశంతోనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాడు డైరెక్టర్.

అక్కడి నుండి కథ లో ఎలాంటి డీవియేషన్స్ ఉండవు , సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ హీరో ఎప్పుడైతే కిడ్నాప్ డ్రామా మొదలు పెడుతాడో అక్కడి నుండి చాలా ఆర్టిఫీషియల్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనకు తెలుగు సినిమాని చూస్తున్న ఫీలింగ్ రాదు , అది కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్ అవ్వొచ్చు. కేరళ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను బాగా ఆదరిస్తుంటారు కాబట్టి , అక్కడ పెద్ద హిట్ అవ్వొచ్చు కానీ , తెలుగు లో మాత్రం కష్టమే.

చివరి మాట : సెకండ్ హాఫ్ ని కాస్త భరించగలము అనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. లేదంటే మీ సహనానికి కాస్త పరీక్ష :

రేటింగ్ : 2.25/5

లెనిన్ మూవీ రివ్యూ : పాస్ అయిన అయ్యగారి మాస్ అవతార్!

Lenin Movie Review
Lenin Movie Review

Lenin Movie Review: రివ్యూ: లెనిన్

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, సునీల్, ప్రమోద్ పంజు తదితరులు

సంగీత దర్శకుడు: థమన్ ఎస్.

ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో

ఎడిటర్: నవీన్ నూలి

దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు

నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ

ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని లెనిన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడంతో సినిమాను ఎలాగైనా హిట్ చేయాలనే అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని అందరికీ హింట్ ఇచ్చినట్టయింది. మహాభారతం రెఫరెన్స్ తో కట్ చేసిన ట్రైలర్, జూనియర్ యన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటివి ఈ సినిమాపై కొంతమేరకు అంచనాలు పెంచాయి. లెనిన్ ఆనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా అఖిల్ కు రిలీఫ్ ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

శ్రీరామాపురం గ్రామ నేపథ్యం, మహాభారతంలోని ద్రౌపది పాత్రను పూజించే ఆచారం.. దాని చుట్టూ ఉన్న భారతం మిట్ట ఆనే కొన్ని రోజుల ఉత్సవాల చుట్టూ తిరుగుతుంది ఈ చిత్రం. ఈ హై వోల్టేజ్ విలేజ్ యాక్షన్ డ్రామా ఫుల్ ఇంటెన్సిటీతో ప్రారంభమవుతుంది. పాతికేళ్ళ క్రితం 2001 ప్రాంతంలో కర్నూలు జైలు నుంచి విడుదలవుతాడు లెనిన్(అఖిల్). వెంటనే తన గ్రామానికి బయలుదేరతాడు. లెనిన్ పాత్రకు ఏదో బలమైన నేపథ్యం ఉందని, అదేంటో తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. ఊరిలో లెనిన్ పేరు వింటే కొందరు భయపడతారు, కొందరు అది గత చరిత్ర అంటారు ఇలా రకరకాలుగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడితే లెనిన్ శ్రీరామాపురం లోని ఒక పెద్ద కుటుంబంలో పెరిగిన అనాధ. అయితే వాళ్ళు ఇతన్ని కొడుకులాగా పెంచుకుంటారు. అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అప్పటి దాకా సాఫీగా జరిగిన లెనిన్ జీవితం భారతి (భాగ్యశ్రీ బోర్సె) లో ప్రేమలో పడడంతో ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఊరిలో చాలా గొడవలకు, కుటుంబంలో బంధువుల మధ్య కలహాలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లెనిన్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా? ఈ మొత్త కథలో అదే కుటుంబ వారసుడు అయిన వసంత్(ప్రమోద్ పంజు) పాత్ర ఏంటి? లెనిన్ అసలు జైలుకు వెళ్ళిన కారణం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

దర్శకుడు మురళి కిషోర్ సినిమాను ఒక స్ట్రాంగ్ నోట్‌తో, బలమైన విలేజ్ సెటప్‌తో ప్రారంభించాడు. టేకాఫ్ బాగానే ఉన్నా కమర్షియల్ టెంప్లేట్ లోను ఫాలో కావడంతో ఫస్టాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీల మధ్య వచ్చే లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్, అఖిల్ పాత్ర స్లో-మోషన్ ఎలివేషన్ సీన్లు ఎక్కువ అవ్వడంతో మొదటి భాగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే, ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమా ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ లో వచ్చే మలుపులు, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రేక్షకులను కొంతవరకూ మెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొన్ని చోట్ల ఇంటరెస్టింగ్ గా కొన్ని చోట్ల రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది.

అఖిల్ అక్కినేని పర్ఫామెన్స్ సటిల్ గా, పాత్రకు తగ్గట్టుగా ఉంది. చదువురాని పల్లెటూరి కుర్రాడి గెటప్ సూట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో అఖిల్ ఆకట్టుకుంటాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె భారతి పాత్రలో చలాకీగా నటించడమే కాకుండా అఖిల కు జోడీగా కూడా సెట్ అయింది. ఎప్పటిలాగే శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. రాంకీ పాత్ర కూడా డీసెంట్ గా ఉంది. అయితే సినిమాలో సర్ప్రైజ్ మాత్రం కన్నడ నటుడు ప్రమోద్ పంజు. చాలా సీన్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు.

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని చెప్పలేం కానీ సినిమాకు హెల్ప్ అయింది. రెండు పాటలు బాగున్నాయి. లియోన్ బ్రిట్టో రూరల్ విజువల్స్‌ను, నైట్ షాట్స్‌ను తన కెమెరాలో చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. సినిమాలో పాత్రలు ఎక్కువ ఉండడంతో ఆ పాత్రలు రిజిస్టర్ అయ్యే సమయం కూడా ఉండదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ తీసుకోవడంతో రైటింగ్ వీక్ గా అనిపిస్తుంది. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది బెటర్ ప్రాడక్ట్ అని చెప్పవచ్చు. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపించే సినిమా.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. అఖిల్ మేకోవర్, సటిల్ యాక్టింగ్, ప్రమోద్ పంజు యాక్టింగ్

2. ప్రీ-క్లైమాక్స్ & క్లైమాక్స్ ఎపిసోడ్స్.

3. భాగ్యశ్రీ బోర్సే నటన, గ్లామర్.

సినిమాలో బాగలేనివి ఇవి:

1. ల్యాగ్ అనిపించే స్లో ఫస్టాఫ్

2. పెద్దగా ఇంపాక్ట్ లేని రొటీన్ లవ్ స్టోరీ.

3. కమర్షియల్ టెంప్లేట్ సీన్లు.

రేటింగ్: 2.5/5

ఫైనల్ వర్డ్: లెనిన్ పాస్ అయ్యెన్

 

 

మాధవ సారథ్యానికి ఏడాది.. పాస్ అయ్యాడా ?ఫెయిల్ అయ్యాడా?

PVN Madhav BJP
PVN Madhav BJP

PVN Madhav BJP: పీవీఎన్‌.మాధవ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సుపరిచితమైన పేరు. కమలం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ సారథిగా సరిగ్గా ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతృత్వంలో ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 జూలై 8న ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దగ్గుబాటి పురంధేశ్వరి నుంచి ఈ హోదా అందుకున్న ఆయన ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన యువ నాయకుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదివిన ఆయన 2017లో గ్రాడ్యుయేట్స్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గానికి చెందిన ఆయన తండ్రి పీవీ చలపతిరావు ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ కుటుంబ వారసత్వం, సంస్థాగత అనుభవం ఆయన నియామకానికి కారణమయ్యాయి.

బాధ్యతల స్వీకరణ
2025 జూలై 10న విజయవాడలో ఏబీవీపీ స్థాపన దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలో మాధవ్‌ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌కు పూలమాల వేసి, తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి మాలలు వేశారు. లెనిన్‌ సెంటర్‌ను విశ్వనాథ సత్యనారాయణ పేరిట మార్చాలని డిమాండ్‌ చేశారు. ‘పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, గ్రాస్‌రూట్‌ స్థాయిలో బలోపేతం చేస్తాం. ప్రతి కార్యకర్త నాయకుడిలా భావించి, క్రమశిక్షణతో, జాతీయ స్ఫూర్తితో పనిచేయాలి’ అని ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పురంధేశ్వరి ఆయన నాయకత్వంలో పార్టీ మరింత ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సారథిగా సంస్థాగత చర్యలు
మాధవ్‌ నాయకత్వంలో బీజేపీ సంస్థాగతంగా చురుకుగా ముందుకు సాగుతోంది. 2026 జూన్‌ 30న రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమించారు. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలపరచడానికి చేపట్టిన చర్య. ‘మన ఊరు – మన జెండా’ కార్యశాలలు నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలను గ్రామ గ్రామానికి, ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త జిల్లాలతో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయి నుంచి బూత్‌ వరకు నిర్మాణం పటిష్టం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత..
కూటమి ప్రభుత్వంలో బీజేపీకి నామినేటెడ్‌ పదవులు, స్థానిక సంస్థల టికెట్ల విషయంలో క్యాడర్‌లో అసంతృప్తి ఉందని ముందుగా చెప్పినట్లే ఉంది. అయితే మాధవ్‌ నాయకత్వంలో బీజేపీ మరింత ప్రాధాన్యత సాధించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడం, కూటమిలో బీజేపీకి మరిన్ని అవకాశాలు కల్పించడం వైపు దృష్టి పెట్టారు. రెండేళ్ల కూటమి పాలనలో రాజ్యసభలో రెండు సీట్లు, ఒక ఎమ్మెల్సీ సీటు దక్కినప్పటికీ, మరిన్ని కీలక పదవులు కోరుతున్నారు.

ఇటీవలి కార్యక్రమాలు..
2026 జూన్‌లో తిరుపతిలో ఎన్డీఏ విజయోత్సవ సభలో మాధవ్‌ మాట్లాడుతూ, ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్ల రాష్ట్ర అభివద్ధి వేగంగా జరుగుతోంది. రూ.14 లక్షల కోట్ల ప్రాజెక్టులు వాస్తవరూపం దాలుస్తున్నాయి’ అని చెప్పారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి విజయాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ప్రశంసించారు. యువతను వికసిత భారత్‌ కోసం రాజకీయాల్లోకి రావాలని, సాంకేతికత, ఆవిష్కరణలపై దష్టి పెట్టాలని సూచించారు.

మాధవ్‌ సారథ్యంలో కీలక అడుగులు..
మాధవ్‌ తన ఏడాది కాలంలో పార్టీ బలం గణనీయంగా పెరిగిందని, మరింత పుంజుకుంటామని చెప్పారు. సంస్థాగత నిర్మాణం బలపడిందని, అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అయితే క్యాడర్‌లో అధికారంలో ఉన్నామా అన్న అనుమానం ఉందని, ఇంకా జోరు పెంచాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు సీనియర్‌ నాయకులు నిశ్శబ్దంగా ఉన్నారని, స్థానిక సంస్థల టికెట్లలో బీజేపీకి తగిన వాటా రావాలని ఒత్తిడి ఉంది. అయితే మాధవ్‌ నాయకత్వంలో 28 జిల్లాల ఇన్‌ఛార్జిల నియామకం, గ్రామ స్థాయి కార్యక్రమాలు పార్టీని మరింత చురుకుగా మార్చాయని అభిప్రాయం కూడా ఉంది. మొత్తం మీద ఏడాదిలో సంస్థాగతంగా కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి, కానీ క్యాడర్‌లో మరిన్ని ఫలితాలు ఆశిస్తున్నారు.

ఇది మాధవ్‌ ఏడాది కాలంలో జరిగిన ముఖ్య అంశాల సమగ్ర సమీక్ష. పార్టీ బలోపేతం కోసం ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

టమాటో తోటలో ఆ పని.. దరఖాస్తులు కోరిన మహిళా రైతు.. వైరల్ వీడియో

Tomato Farm Jobs
Tomato Farm Jobs

Tomato Farm Jobs: నెలకు 12,000 జీతం.. ఉదయం 6 గంటలకు వేడివేడి టీ ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కూల్ డ్రింక్ ఇస్తారు. అంతేకాదు వచ్చే ఆదివారం నుంచి కోడికూర.. పూరి.. రాగి సంగటి పెడతారు. ఇంత వేతనం ఇస్తున్నారు.. ఈ స్థాయిలో టీ.. శీతలపానీయం. చికెన్.. పూరీలు.. రాగి సంగటి పెడుతున్నారు.. ఎందుకు.. అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదా..

నేటి కాలంలో వ్యవసాయ పనులకు కూలీలు సరిగా లభించడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో లేబర్ లభించడం లేదు. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకుని రావాల్సి వస్తోంది. ముఖ్యంగా యూపీ, బిహార్ నుంచి కూలీలు రెండు తెలుగు రాష్ట్రాలకు అధికంగా వస్తున్నారు. వరి నాట్లు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. మిర్చి కోతలు.. ఇతర పనుల చేయడానికి యూపీ,బిహార్ కూలీలు రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు.

కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ఒక మహిళ రైతు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆ మహిళ రైతు టమాటా తోటను సాగు చేస్తోంది. పండిన టమాటా కాయలను రకరకాల మార్కెట్లకు సరఫరా చేస్తోంది. కూలీల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రతినెల 12000 ఇస్తామని.. ఉదయం వేడి వేడి టీ.. మధ్యాహ్నం కూల్ డ్రింక్.. ప్రతి ఆదివారం చికెన్, పూరీలు.. రాగి సంగటి పెడతామని చెప్పింది. టమాట తోటలో పనిచేయడానికి ఆసక్తిగల అభ్యర్థులు తమ చేను దగ్గరికి రావాలని ఆమె సూచిస్తోంది. నెలపాటు శిక్షణ ఇస్తామని కూడా ఆమె అంటున్నది. టమాటా గింజలు వేయడం.. మొక్కలు నాటడం.. కాయలు తెంపడం వంటి వాటిపై ట్రైనింగ్ ఇస్తామని ఆమె చెబుతోంది. ఇలా ఇస్తేనే గింజలు సక్రమంగా వేస్తారని.. కొమ్మలు విరగకుండా కాయలు సక్రమంగా కోస్తారని.. గ్రేడింగ్ కూడా పకడ్బందీగా చేస్తారని ఆమె చెబుతోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో కూలీల కొరత పెరిగిన నేపథ్యంలో.. చాలామంది పెద్దపెద్ద రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. కూలీలను ఆకట్టుకునేందుకు కొంతమంది రైతులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహిళ రైతు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది.

ఇన్ స్టా గ్రామ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. మీరు ట్రై చేశారా

Instagram New Feature
Instagram New Feature

Instagram New Feature: ఇన్ స్టా గ్రామ్.. సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీని ద్వారానే తమ అప్డేట్ లు ఇస్తున్నారు. కొంతమంది దీని ద్వారా ఇన్ఫ్లుయన్సర్స్ గా మారిపోతున్నారు. దీని ద్వారా వచ్చే క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాప్ మొదట్లో అంతగా ఆదరణ సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్ వాడుతున్నారు.

మెటా కంపెనీ ఎప్పటికప్పుడు ఇందులో మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తోంది. యూజర్ల ఆసక్తిగా అనుగుణంగా కొత్త కొత్త మార్పులను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా యూజర్లకు న్యూ మ్యూజ్ ఇమేజ్ మోడల్ ను అనే ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. దీని ప్రకారం యూజర్లు పబ్లిక్ గా ఉన్న ఇతర అకౌంట్ లో ఫోటోలను ఏఐ ఇమేజెస్ క్రియేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. మన ఎకౌంటు పబ్లిక్ గా ఉంటేనే అందులో ఉన్న ఫోటోలను.. రీల్స్ ను ఇతరులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగకూడదు అనుకుంటే ఎకౌంట్ మొత్తాన్ని ప్రైవేట్ లో పెట్టుకోవాలి. లేదా సెట్టింగ్స్లో రీల్స్.. పోస్ట్ల షేరింగ్.. రీ యూస్ ఆప్షన్ మొత్తాన్ని డిజేబుల్ చేయాలి.

యూజర్లకు మెరుగైన అనుభూతి అందించడానికి ఇటువంటి ఫీచర్ తీసుకొచ్చామని మెటా కంపెనీ చెబుతోంది. కొంతకాలంగా దీని మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్న మెటా కంపెనీ ఆర్ అండ్ డి విభాగం.. మొత్తానికి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట్లో అమెరికా లో మాత్రమే దీనిని అందుబాటులో తీసుకొచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ వైస్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఆసక్తికరంగా ఉందని మెజారిటీ యూసర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకసారి కొత్త చిత్రాలు.. వీడియోలు రూపొందించడానికి ఆస్కారం ఏర్పడుతోందని యూజర్లు చెబుతున్నారు.

కొన్ని సందర్భాలలో ఇవి మిస్ యూస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని కొంతమంది యూజర్లు అంటున్నారు. కొంతమంది కావాలని కక్ష కట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు.. వీడియోలను రూపొందించి.. వేరే విధంగా వాడుకుంటే ఇబ్బంది ఉంటుందని.. అలాంటప్పుడు ఈ ఫీచర్ విషయంలో ఇంకా మెటా కంపెనీ అనేక జాగ్రత్తలు.. సెక్యూరిటీ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని యూసర్లు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ కొత్త ఫీచర్ సరి కొత్తగా ఉందని.. క్రియేటివిటీకి ఎక్కువగా ఆస్కారం కల్పించే విధంగా ఉందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు.