Home Blog Page 66

వైసీపీలోకి ఆ మాజీ.. గోల పెడుతున్న క్యాడర్!

YSRCP
YSRCP

MVS Murthi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంది. ఆ పార్టీ బలం పెంచుకున్నట్లు ఊహిస్తోంది. కానీ చాలా చోట్ల పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జులు బాధ్యతలు తీసుకోవడం లేదు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు కొద్దిమంది మాత్రమే. మిగతావారు రకరకాల కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముంగిట చూసుకోవచ్చు కదా అని భావిస్తున్న వారు ఉన్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతలు సైతం ఇప్పుడు పెద్దగా బయటకు రావడం లేదు. ఇప్పుడు వస్తే పార్టీ ఖర్చులు చూడాల్సి వస్తుందన్న భయంతో ఉన్నవారు కూడా ఉన్నారు. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. మంత్రి పదవులతో పాటు ఎంపీ పదవులు చేపట్టి ఆర్థికంగా బలపడిన వారు సైతం ముఖం చాటేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ఇలానే ముఖం చాటేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఇప్పుడు యాక్టివ్ అవుతుండడం విశేషం. అయితే విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థికంగా గట్టి నేత..
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంవీఎస్ మూర్తి ఉండేవారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మూర్తి 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థికంగా స్థితిమంతుడు తో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో కీలకమైన విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. టిడిపి అభ్యర్థిగా శ్రీ భరత్ అప్పట్లో పోటీలో నిలిచారు. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు. కేవలం త్రిముఖ పోటీ కావడంతో.. ఎంపీగా తక్కువ మెజారిటీతో విజయం సాధించారు మూర్తి. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో సొంత పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి మూర్తికి.

ఓడిన తరువాత..
2024 ఎన్నికల్లో ఎంవీఎస్ మూర్తి అభ్యర్థిత్వాన్ని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో బొత్స ఝాన్సీ లక్ష్మిని తెచ్చారు. ఎంవీఎస్ మూర్తిని విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు టిడిపి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవీఎస్ మూర్తి అయితే గెలుస్తారని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు మూర్తి. అయితే ఓడిపోయిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండిపోయారు.. ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీలో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. అందుకు కేడర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అదే పనిగా నాయకత్వానికి టచ్ లోకి వెళ్తున్న మూర్తిని త్వరలో ఏదో ఒక నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

94 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం కోసం తాపత్రయం..మాతృదేశంపై ఈ వృద్ధురాలి ప్రేమకు హాట్సాప్

Andhra Woman US Citizenship
Andhra Woman US Citizenship

Andhra Woman US Citizenship: బీటెక్ పూర్తయిందా.. ఏదో ఒక యూనివర్సిటీలో సీటు వచ్చిందా.. బ్యాంకు లోన్ తీసుకున్నామా.. ఫ్లైట్ ఎక్కడమే.. అక్కడే ఏదో ఒక యూనివర్సిటీలో చేరడం.. కాలేజీలో పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం.. ఆ తర్వాత ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవడం.. అనంతరం డాలర్ల వేట కొనసాగించడం.. స్థిరపడిన తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కోవడం.. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా సిటిజెన్ గా మారిపోవడం.. చాలామంది భారతీయులు చేస్తున్న పని ఇదే.

సంపాదన పిచ్చి.. హై ప్రొఫైల్ గా బతకాలని ఆశ.. స్టేటస్ మెయింటైన్ చేయాలని కోరిక.. ఇవన్నీ కూడా చాలామందిని అమెరికా దారి పట్టిస్తున్నాయి. ఫలితంగా వారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ.. దానికోసం ఇండియన్ సిటిజెన్షిప్ కూడా వదులుకుంటున్నారు. అంతేకాదు అక్కడే ఆస్తులు, అంతస్తులు సమకూర్చుకుంటున్నారు. అమెరికా వెళ్ళినవారు మళ్లీ ఇండియాకు తిరిగి రావాలి అనుకోవడం లేదు. అక్కడి సంపాదన వారిని ఇక్కడికి రానివ్వడం లేదు. అందువల్లే అమెరికాలో స్థిరపడుతున్న భారతీయులు ఏటికేడు పెరిగిపోతున్నారు. అయితే అటువంటి వారికి ఈ 94 సంవత్సరాల వృద్ధురాలు గొప్ప గుణపాఠం చెబుతున్నారు. దేశం కోసం సప్తసముద్రాలు దాటిన ఆమె.. ఇప్పుడు మాతృభూమి మీద ప్రేమను ప్రదర్శిస్తున్నారు.

అది గుంటూరు జిల్లా బాపట్ల. ఆమె పేరు మహా లక్ష్మమ్మ.. ఈమె గతంలోని అమెరికా వెళ్ళింది. ఈమె కుటుంబ సభ్యులు కూడా అక్కడి పౌరసత్వాన్ని పొందారు. మహాలక్ష్మమ్మకు 94 సంవత్సరాల వయసు.. ఇటీవల ఆమె బాపట్ల వచ్చారు. ఇంతటి వృద్ధాప్యంలో ఆమె అమెరికా పౌరసత్వాన్ని వద్దనుకుంటున్నారు. భారత పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. తన చివరి శ్వాస కూడా ఇక్కడే విడవాలని కోరుకుంటున్నారు.. తన అంత్యక్రియలు సొంత గ్రామాలను జరగాలని.. వీలైనంత త్వరగా తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని బాపట్ల కలెక్టర్ ను మహాలక్ష్మమ్మ కోరారు.

మహా లక్ష్మమ్మ 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలోనే ఉన్నారు. అయితే ఆమెకు బాపట్లలో ఇల్లు.. ఇతర ఆస్తులు ఉన్నాయి. దీనికి తోడు ఆమెకు మాతృభూమి అంటే విపరీతమైన మమకారం. అందువల్లే చివరి దశలో స్వదేశానికి వచ్చింది. ఇక్కడే కన్ను మూయాలని బలంగా కోరుకుంటున్నది. కానీ నేటి కాలంలో చాలామంది మన దేశ పౌరసత్వాన్ని సులువుగా వదులుకుంటున్నారు. అమెరికా లేదా ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. మాతృభూమి మీద మమకారాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. కేవలం డాలర్ల సంపాదనలో పడి.. డబ్బు మాత్రమే లోకమని బతికేస్తున్నారు. అటువంటి వారు మహాలక్ష్మమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలి.

రోజుకు ఆరు గంటల పని.. 14 లక్షల వేతనం.. త్వరపడండి..

China zoo hiring
China zoo hiring

China zoo hiring: నేటి కాలంలో చదివిన చదువుకు ఉద్యోగం లభించడం కష్టమైపోయింది. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక నరకం చూస్తున్నారు. ఇక కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కల్పన అనేది ఎండమావిలాగా మారిపోయింది. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయింది. ఫలితంగా నిరుద్యోగశాతం మరింత పెరుగుతోంది.ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాలి. అది కూడా శారీరక శ్రమ లేకుండానే.. జస్ట్ నిలబడితే చాలు. కంప్యూటర్ ను కావాల్సిన అవసరం లేదు. గంటలకు గంటలు కుర్చీలో కూర్చొని మెదడుకు మేత పెట్టాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఆరు గంటలు.. అది కూడా కొన్ని రకాల శబ్దాలు చేస్తే సరిపోతుంది. సంవత్సరానికి 14 లక్షలు వరకు వేతనం ఇస్తారు. అంతేకాదు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఇంతకీ ఈ ఉద్యోగం ఏంటి.. ఎక్కడ పని చేయాలి.. ఏం చేయాలి.. అనేకదా మీ డౌటు..

చైనా దేశంలో ఓ జూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. తమ జంతు ప్రదర్శనశాలకు వచ్చే పర్యాటకులను నవ్వించే ఉద్యోగం ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగం చేసే వారికి ప్రతి ఏడాది 14 లక్షల వరకు వేతనం ఇస్తామని ప్రకటించారు. రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాలని సూచించారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎలుగుబంటి డ్రెస్ వేసుకోవాలని.. పర్యాటకులను నవ్వించాలని నిబంధన పెట్టారు. కేవలం ఎలుగుబంటి మాదిరిగా శబ్దాలు చేస్తే సరిపోతుందని సూచించారు. అయితే ఈ వింత ఉద్యోగానికి ఇప్పటికే వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని నిర్వాహకులు అంచనా వేయలేదు.

కొంతకాలంగా చైనాలో కూడా నిరుద్యోగశాతం విపరీతంగా పెరుగుతోంది. అక్కడ తయారీ రంగంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. దీంతో చాలావరకు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పైగా తయారికి తగ్గట్టుగా వర్క్ ఆర్డర్లు లభించకపోవడంతో చాలా వరకు కంపెనీలు కూడా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అందువల్లే ఎలుగుబంటిలా నటించే ఉద్యోగానికి సైతం ఈ స్థాయిలో పోటీ ఉండడం విశేషం. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో జూ నిర్వాహకులు కూడా సందిగ్ధంలో పడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కలవర పడుతున్నారు. మరి ఆ ఉద్యోగం ఎవరికి రాసిపెట్టింది.. ఎవరికి ఆ 14 లక్షలు దక్కుతాయో చూడాల్సి ఉంది.

ఒక్క మగాడికి ఒక్క పెళ్ళామే సరిపోదట.. పెళ్ళాలు ఉండాలట.. ఈ మహిళ ఎమ్మెల్యే గారి తెలివికి దండం పెట్టాల్సిందే..

Sana Malik statement
Sana Malik statement

Sana Malik statement: మనదేశంలో చట్టసభలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు టెస్ట్ పెట్టాలి. ఆ టెస్టులో పాస్ అయిన వారికి మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం కల్పించాలి. ప్రజల ఓటు వేసి గెలిపించినప్పటికీ.. కచ్చితంగా ఆ టెస్ట్ నిర్వహించాలి. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే చట్ట సభకు అర్హులు అని కఠినమైన నిబంధన పెట్టాలి. ఇలాంటి నిబంధన లేకపోవడం వల్ల ఇదిగో ఇలాంటి పనికిమాలిన వారు చట్టసభలకు ఎన్నికవుతున్నారు.

ఇప్పటిదాకా బుద్ధిలేని పురుష ప్రజాప్రతినిధులు ఉన్నారు అనుకున్నాం.. కానీ ఇప్పుడు కొంతమంది మహిళా ప్రజా ప్రతినిధులు వారిని మించి పోతున్నారు. తమ బుద్ధిలేని వ్యాఖ్యలతో పరువు తీసుకుంటున్నారు. చివరికి అనకూడని మాటలు అంటూ.. చేయరాని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.

ఆమె పేరు సనా మాలిక్. మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఈమె ఎంత వరకు చదువుకున్న తెలియదు గాని.. పనికిమాలిన మాటలు మాట్లాడటంలో మాత్రం నెంబర్ వన్. అనేక సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలైంది. తాజాగా మరోసారి తన మందబుద్ధిని ప్రదర్శించుకుంది. ఈసారి ఏకంగా భారత్ లో కూడా పాకిస్తాన్ మాదిరిగా చట్టాలు ఉండాలని డిమాండ్ చేసింది. అంతేకాదు నిండు మహారాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి మీద జరిగిన చర్చలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. “ఖురాన్లో ప్రస్తావించిన అంశాలను పాకిస్థాన్ లో మాదిరిగానే భారతదేశంలో కూడా అమలు చేయాలి. ముస్లిం చట్టాలు బహు భార్యత్వాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్క మగాడికి ఒక్క భార్య సరిపోదు.. అతడికి భార్యలు కావాలి. కేవలం దీనిని మతం కోణంలో చూడకూడదు. ముసలి మహిళలు మాత్రమే వేధింపులకు గురి కావడం లేదు.. బహుభార్యత్వం అనేది ఇస్లాంలో ఉంది. దీనికి ముస్లిం చట్టాలు కూడా అనుమతిస్తున్నాయి. ఖురాన్ లో కూడా దీనికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని” ఆమె చెప్పింది.

దీనిపై శివసేన ఎమ్మెల్యేలు గట్టిగానే స్పందించారు. త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ ముస్లిం మహిళల గౌరవాన్ని పెంచితే.. సనా మాలిక్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది ఎటువంటి విధానాలకు నిదర్శనమో చెప్పాలని శివసేన ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై మాలిక్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తాను చెప్పలేదని.. ఖురాన్ మార్గదర్శకాలను మాత్రమే పాటించాలని చెప్పినట్టు ఆమె కవర్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఆ'గౌరవ' రిటైర్మెంట్.. లెక్కచేయని పీవీ సునీల్ కుమార్!

PV Sunil Kumar retirement
PV Sunil Kumar retirement

PV Sunil Kumar retirement: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారికి కూటమి ప్రభుత్వం వచ్చాక చుక్కలు కనిపించాయి. కొందరు అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లిపోయారు. మరికొందరిపై అయితే ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది. అటువంటి వారిలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఉన్నారు. మరో వైపు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. వీరిద్దరూ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఇంతలో శ్రీలక్ష్మి పై ఉన్న సస్పెన్షన్ వేటును తొలగించింది ప్రభుత్వం. కానీ పీవీ సునీల్ కుమార్ పై మాత్రం సస్పెన్షన్ తొలగించలేదు. మరో ఐపిఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఈ నెల చివర్లోనే పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఏపీ రోడ్డు భద్రత అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనపై ఎటువంటి కేసులు లేవు. దీంతో స్వేచ్ఛగా అయిన పదవీ విరమణ చేస్తారు.

శ్రీలక్ష్మి పై వేటు..
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి పై అభియోగాలు ఉన్నాయి. ఆమె గతంలో కూడా అరెస్టయ్యారు. ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్ కుమారి ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే మళ్లీ టిడిపిని ఆమె టార్గెట్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను అప్రధాన్య పోస్టులోకి పంపించారు. తరువాత సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తారు అనగా.. ఆమెపై ఉన్న సస్పెన్షన్ తొలగించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. దీంతో గౌరవప్రదంగా ఆమె పదవి విరమణకు మార్గం దొరికింది. కానీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఈ మినహాయింపు ఇవ్వలేదు.

అనేక అభియోగాలు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో పీవీ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టిడిపి నేతలను ఇబ్బంది పెట్టారన్నది ఆయనపై ఉన్న అభియోగం. ప్రధానంగా రఘురామకృష్ణం రాజు పై కస్టోడియల్ టార్చర్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. అప్పట్లో శాఖా పరంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని.. అగ్రిగోల్డ్ కేసు విచారణలో నిధులను గోల్మాల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే గతంలో ఐబి వెంకటేశ్వరరావు ఇదే మాదిరిగా వైసిపి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ న్యాయ పోరాటం చేసి తనపై ఉన్న సస్పెన్షన్ను పదవీ విరమణ రోజే ఎత్తించుకున్నారు. దీంతో గౌరవంగా ఆయన రిటైర్మెంట్ అయ్యారు. అదే పరిస్థితిలో పీవీ సునీల్ కుమార్ ఉన్నారు కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు.

ముందే ఊహించిన వైనం..
పీవీ సునీల్ కుమార్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ లో ఉన్నప్పుడు పదవీ విరమణ చేస్తే ఎటువంటి ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా పీవీ సునీల్ కుమార్ ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకు రాజకీయ అజెండా ఉంది. అంబేద్కర్ మిషన్ ద్వారా భారీగా ఒక వేదికను నడుపుతున్నారు. ఇలా పదవీ విరమణ చేసిన వెంటనే దానిని మరింత అభివృద్ధి చేసి వైసీపీ వైపు అడుగులు వేస్తారన్నది ఒక అంచనా. అందుకే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ అస్మదీయ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ నెలలో పదవీ విరమణ చేస్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

బూతులు తిట్టుకుంటున్న సమంత - శోభిత ఫ్యాన్స్.. హద్దులు దాటేశారుగా..

Samantha fans vs Shobhita Fans
Samantha fans vs Shobhita Fans

Samantha fans vs Shobhita Fans: సోషల్ మీడియా లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం సర్వ సాధారణమే. మా హీరో గొప్ప అంటే , మా హీరో గొప్ప అంటూ ఎల్లప్పుడూ ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు, అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మారిపోయింది ఈమధ్య. అయితే కేవలం హీరోల అభిమానుల మధ్య మాత్రమే కాదు, హీరోయిన్స్ అభిమానుల మధ్య కూడా ఫ్యాన్ వార్స్ తారా స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా సమంత , శోభిత ధూళిపాళ్ల ఫ్యాన్స్ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద యుద్ధమే నడుస్తోంది. వీళ్ళ పై వచ్చే కామెంట్స్ సమంత , శోభిత లు చూస్తే వాళ్లకు తలనొప్పి వస్తుందో లేదో తెలియదు కానీ , సాధారణ నెటిజెన్స్ కి మాత్రం కచ్చితంగా తలనొప్పి చిరాకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

అందులో ఆమె ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘మీరు పర్ఫెక్ట్ గా లేకుండా , ఎవరో ఒకరు మీ జీవితం లోకి అడుగుపెట్టి , దాన్ని ఫిల్ చేస్తారని అనుకుంటేనే తప్పులు జరుగుతాయి’ అంటూ ఆమె నేటి తరం యువత కి సూచన ఇస్తున్నట్టుగా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దీన్ని సోషల్ మీడియా లో సమంత శోభిత ని కావాలని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేసిందని, అందుకు గతం లో శోభిత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘అతను లేకుండా నా జీవితం సంపూర్ణం అవ్వదు’ అన్న మాటలకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా లో సమంత అభిమానులు షేర్ చేశారు. దీంతో శోభిత ఫ్యాన్స్ దీని పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు , అలా ఈ ఇద్దరి హీరోయిన్స్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో పెద్ద వార్ నడుస్తోంది ప్రస్తుతానికి.

అయితే సమంత ఫ్యాన్స్ శోభిత ని నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఏ చిన్న ఫోటో ని అప్లోడ్ చేసినా కామెంట్స్ లో శోభిత ని దారుణంగా దూషిస్తూ మండిపడుతున్నారు. సమంత కూడా రెండవ పెళ్లి చేసుకుంది , ఇప్పుడు గర్భం దాల్చింది , ఆమె వైవాహిక జీవితాన్ని అద్భుతంగా అనుభవిస్తోంది. అయినప్పటికీ కూడా శోభిత కి నెగెటివిటీ తప్పడం లేదు. ఒకప్పుడు సమంత కి కూడా ఇదే రేంజ్ నెగెటివిటీ సోషల్ మీడియా లో ఉండేది కానీ , ఆమెకు మయోసిటిస్ వ్యాధి సోకడం వల్ల, ఆమె పై నెటిజెన్స్ లో సానుభూతి ఏర్పడింది.

మరి కాసేపట్లో పెళ్లి.. కాబోయే మొగుడి చెంప పగలగొట్టింది..

Chhattisgarh Bride Slaps Groom
Chhattisgarh Bride Slaps Groom

Chhattisgarh Bride Slaps Groom: వధువు ముస్తాబయింది. వరుడు కూడా బ్రహ్మాండంగా తయారయ్యాడు. బంధువుల రాకతో ఆ ప్రాంతం మొత్తం హడావిడిగా ఉంది. మరికొద్ది గంటల్లో పెళ్లి
. ఆ తర్వాత అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. వచ్చిన బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు . కొందరైతే అలా చూస్తూ ఉండిపోయారు.

అది చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జాం జాగీర్ చాంపా జిల్లా. ఇక్కడ ముస్కాన్ ప్రధాన్ అనే యువతికి వివాహం కుదిరింది. సరిగ్గా ఈనెల 24న పెళ్లి జరగాల్సి ఉంది. సరిగ్గా 23వ తేదీ రాత్రి ముస్కాన్ స్వగ్రామమైన కోసుమాండ లో పెళ్ళికొడుకు ఊరేగింపుగా వచ్చాడు. 24న వివాహానికి ముస్కాన్ తరఫు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చిన వరుడు.. కారు దిగడానికి ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు. అంతేకాదు అతడు కనీసం కాలు తీసి కాలు వేసే అవకాశం కూడా లేదు. అతడికి వైకల్యం లేదు..

అతడు కనీసం కాలు కూడా కదపకపోవడానికి ప్రధాన కారణం వైకల్యం కాదు. ముమ్మాటికి అతడి మద్యపానం అలవాటు. పెళ్లి ఉందని తెలిసినప్పటికీ.. అతడు పీకల దాకా మద్యం తాగాడు. కనీసం అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కూడా లేదు. దీంతో అతగాడి వాలకం చూసిన ముస్కాన్.. మరో మాటకు తావు లేకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. అతడి చెంప చెల్లుమనిపించింది. ఇలాంటి తాగుబోతును తాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు గొడవ కూడా జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పెళ్లి కొడుకును తన ఇంటికి పంపించారు.

ముస్కాన్ చేసిన పనిని జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ అభినందించారు. అంతేకాదు నేటితరం అమ్మాయిలు ఇలానే ఉండాలని సూచించారు. ముస్కాన్ కు 5000 రూపాయల గౌరవ వేతనం ఇస్తూ కౌన్సిలర్ గా నియమించాడు. ఆమె చదువుకు తన వంతుగా సపోర్ట్ చేస్తారని ఆయన ప్రకటించారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రచారంలో ముస్కాన్ కౌన్సిలర్ గా పని చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా ముస్కాన్ తండ్రి కూడా తాగుబోతు. ఆమె చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి పెంచి ఆమెను ఇంత దాన్ని చేసింది. తనకు కాబోయే భర్త తాగుబోతు కావొద్దని ముస్కాన్ బలంగా కోరుకుంది. కానీ, తాగి వచ్చిన వాడే తాళి కట్టేందుకు సిద్ధం కావడంతో ముస్కాన్ తట్టుకోలేకపోయింది. అందుకు చెంప చెళ్లుమనిపించింది.

నలుగురు పిల్లల తల్లి పెళ్ళాంగా కావాలట.. ఈ 30 ఏళ్ల యువకుడు ఏం చేశాడో తెలుసా..

Uttar Pradesh Incident
Uttar Pradesh Incident

Uttar Pradesh Incident: వైవాహిక జీవితానికి సరైన ఈడు జోడు కావాలి అంటారు పెద్దలు. అలాంటి కఠినమైన నిబంధన కొనసాగిస్తున్నారు కాబట్టే మనదేశంలో ఇప్పటికీ వివాహ వ్యవస్థ.. కుటుంబ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. కానీ పాశ్చాత్య సంస్కృతి.. సోషల్ మీడియా వల్ల భారతీయులు కొంతకాలంగా కట్టు తప్పుతున్నారు. కఠినమైన నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చివరికి నవ్వుల పాలవుతున్నారు. ఈ సంఘటన కూడా అటువంటిదే.

అతని పేరు చందన్. ఇతడిది ఉత్తరకాండ రాష్ట్రంలోని ఆల్మోడ జిల్లా. ఇతడు వంట పని చేస్తుంటాడు. గతంలో ఇతడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా కాయం గంజ్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వంట పని చేశాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇతడికి పరిచయమైంది. ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. నలుగురు పిల్లలు కూడా. ఆమెతో ఇతడికి ఏర్పడిన సంబంధం వివాహేతర వ్యవహారానికి దారితీసింది. కొంతకాలం ఇద్దరు గట్టిగానే తమ సంబంధాన్ని కొనసాగించారు.

ఆ మహిళ భర్తకు వీరి వ్యవహారం తెలియడంతో వెంటనే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాడు. ఈ ఘటన కంటే ముందు చందన్ కు పెద్ద హోటల్లో పనిచేసే అవకాశం రావడంతో ముంబై వెళ్లిపోయాడు. ప్రతిరోజు ఆ మహిళతో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఇటీవల ఆ మహిళ భర్త ఫోన్ తీసుకొని స్విచాఫ్ చేశాడు. తన ప్రియురాలు ఫోన్ మాట్లాడడం మానివేసిన నేపథ్యంలో చందన్ ముంబై నుంచి కాయం గంజ్ ప్రాంతానికి వచ్చాడు. అంతేకాదు నేరుగా సెల్ఫోన్ టవర్ ఎక్కాడు. పైగా తను 112 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకుంటానని అతడు గట్టిగా అరిచాడు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడితో మాట్లాడారు. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అతడు కిందికి దిగి వచ్చాడు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ తరలించారు.

కూటమిలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP
YSRCP

YSRCP MLAs: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ జాబితాలో ఓ ముగ్గురు ఇప్పుడు తాజాగా చేరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ తో మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. అసలు టిడిపికి టచ్ లోకి ఎవరు వచ్చారు. టిడిపి వారిని తీసుకుంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. ఒకరిద్దరూ టిడిపి ఎమ్మెల్యేల విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారు లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. అటువంటి వివాదాస్పద ఎమ్మెల్యేలకు వైసీపీ టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వారు వైసీపీలోకి వెళ్లిన మరుక్షణం.. వైసీపీ నుంచి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

* రిజర్వుడు ఎమ్మెల్యేలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో రాయలసీమ నుంచి ఏడుగురు ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఓ ఇద్దరు గెలిచారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మరో ఇద్దరు ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, బాల నాగిరెడ్డి, టి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ దాసరి సుధా, విశ్వేశ్వర రాజు, మత్స్యలింగం, అమర్నాథ్ రెడ్డి, విరూపాక్ష తదితరులు ఉన్నారు. అయితే ఇందులో రిజర్వుడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అధికం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందులో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ నిర్ణయంతో విభేదిస్తున్నారు. వారంతా అసెంబ్లీకి వెళ్లాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక తీరడం లేదు.

* అదే జరిగితే మరుక్షణం..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారం అందుతుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండడం కంటే కూటమిలో చేరడం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చిన వారు ఉన్నారు. ప్రధానంగా ఓ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూటమితో పాటు మంత్రి నారా లోకేష్ కు టచ్ లోకి వెళ్లినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టిడిపిలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత సైతం అక్కడి ఎంపీ తో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన సైతం వైసీపీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీ నుంచి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు.. కూటమి వైపు రావడం ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఒక సంచలనమే.

ఆ రెండు నియోజకవర్గాల్లో జగన్ విఫల ప్రయోగాలు!

YS Jagan Failed Experiments
YS Jagan Failed Experiments

YS Jagan Failed Experiments: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని చూస్తోంది. ప్రధానంగా ప్రకాశం జిల్లా పై దృష్టి పెట్టింది. అక్కడ ఓ రెండు నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచారు. ముఖ్యంగా అద్దంకి తో పాటు పర్చూరు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావిస్తున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అద్దంకిలో చింతలపూడి అశోక్ కుమార్ ను ఇన్చార్జిగా నియమించారు. పర్చూరులో గాదె మధుసూదన్ రెడ్డిని ఇన్చార్జిగా నియామకం చేపట్టారు. కానీ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం లేదు. పైగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొత్త నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు.

* వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి..
అద్దంకి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు గొట్టిపాటి రవికుమార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయనకు వ్యక్తిగతంగా మంచి గ్రాఫ్ ఉంది. ఇప్పటివరకు ఆయన నాలుగు సార్లు గెలిచారు ఆ నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం మంచి బలం ఉంది. కానీ నాయకత్వం ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలవుతున్నారు. అందుకే గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ ముందు వైసీపీ అభ్యర్థులు తేలిపోతున్నారు. ప్రస్తుత వైసిపి ఇన్చార్జ్ కూడా ప్రజలతోపాటు వైసీపీ క్యాడర్ తో పెద్దగా మమేకం కాలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటు పర్చూరులో సైతం అదే పరిస్థితి ఉంది. అక్కడ టిడిపి మంచి బలం మీద ఉంది. ఇక్కడ ఏలూరు సాంబశివరావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన సరైన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం లేదు

* కరణం బలరాం ఉన్నా..
కరణం బలరామకృష్ణ రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ నేత ఉన్నారు. కానీ ఆయన చీరాలలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన పూర్వశ్రమం అద్దంకి. కానీ అక్కడ గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ను ఢీ కొట్టాలి అంటే కరణం బలరామకృష్ణమూర్తి అయితే సరిపోతారు. కానీ అందుకు కారణం బలరాం ఒప్పుకోవడం లేదు.. అయితే పూటకో లీడర్ ను తెచ్చి అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా పెడుతున్నారు. పర్చూరు పరిస్థితి కూడా అలానే ఉంది. అక్కడ టిడిపి స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు కూటమికి అండగా నిలబడుతున్నారు. అయితే ఆ రెండు నియోజకవర్గాల్లో జగన్ చేస్తున్న ప్రయోగాలు విఫలమవుతూనే ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల పై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందే అన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.

డేగ కళ్ళతో చూస్తున్నారు.. ఏపీ మత్తు వదిలిస్తున్నారు..

Andhra Pradesh Drug Control Campaign
Andhra Pradesh Drug Control Campaign

Andhra Pradesh Drug Control Campaign: 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో మత్తు కార్యకలాపాలు జోరుగా సాగాయి. మత్తు వ్యవహారాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఆ మత్తులో యువకులు రెచ్చిపోయారు. దారుణమైన కార్యకాల పాలకు పాల్పడ్డారు. అటువంటి వారి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. అంతేకాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది.

2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో మార్పు వచ్చింది. నెమ్మదిగా మత్తు వదలడం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం డేగ కళ్ళతో మత్తు కార్యకలాపాలకు పాల్పడే వారి మీద అత్యంత తీవ్రంగా దృష్టి పెట్టింది. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చింది. పకడ్బందీగా బృందాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ఏపీ మొత్తం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. నేడు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ నేపథ్యంలో 2024 నుంచి ఇప్పటివరకు ఏపీ రాష్ట్రం మత్తు వదిలించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం జిల్లాలో మత్తుకు కారణమయ్యే పంట సాగును పూర్తిగా నిర్మూలించింది కూటమి ప్రభుత్వం. దీనికి ఆపరేషన్ చైతన్యం అని పేరు పెట్టింది. మొత్తంగా 29, 840 ఎకరాల్లో రైతులు వేరే పంటలు పండించే విధంగా చైతన్యవంతం చేసింది. 325 కుటుంబాలకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే అవకాశం కల్పించింది

రాష్ట్రవ్యాప్తంగా 800 కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. మొత్తంగా 1.93 లక్షల మందిని తనిఖీ చేసింది. వారి వద్ద మంచి 61.8 కిలోల మత్తు పదార్థాలను.. 10 కిలోల మత్తు పదార్థాలకు సంబంధించిన విత్తనాలను.. ఏకంగా 9346 వాహనాలను స్వాధీనం చేసుకుంది.. మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడే వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 17 కేసులలో 10.4 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఈగల్.. విజిలెన్స్.. ఎన్ ఫోర్స్ మెంట్.. మాదకద్రవ్యాల నివారణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మెడికల్ షాప్ లో మత్తు పదార్థాల అమ్మకాన్ని పూర్తిగా నియంత్రించింది. అంతేకాదు రైల్వే శాఖ తో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. రైళ్ల ద్వారా రవాణా అవుతున్న మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మత్తుపదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుంది. వారి దగ్గర నుంచి 367 కిలోల మత్తు పదార్థాలను, 2426 మత్తు పదార్థాల తో రూపొందించిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 54 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా పొగాకు రైత స్కూల్ జోన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు మత్తు పదార్థాల నిరోధానికి.. నేరాలు అరికట్టడానికి.. బాధితుల కోసం సహాయం చేసేందుకు ప్రభుత్వం 1972 పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 897781972 పేరుతో వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది.

ఆపరేషన్‌ సిందూర్‌ అమరులు వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం!

Operation Sindoor
Operation Sindoor

Operation Sindoor: 2025, ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కల్పులు జరిపారు. మతం తెలుసుకుని మరీ హిందువులను మట్టుబెట్టారు. 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ దారుణ ఘటనకు ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. ఈ సైనిక చర్యలో దేశం కొంతమంది ధీర వీరులను కోల్పోయింది. వారి త్యాగాన్ని గుర్తుంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వారి పేర్లను ఏడాది తర్వాత అధికారికంగా ప్రకటించింది. జాతీయ యుద్ధ స్మారకంలో చేర్చింది.

అమరవీరులు వీరే..
ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.
ఈ వీరులందరూ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతూ అమరులయ్యారు. యోధుల పేర్లు ఇలా ఉన్నాయి.

1. సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌ (10వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌)
2. రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌ (జమ్మూ కాశ్మీర్‌ లైట్‌ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, 4వ బెటాలియన్‌)
3. లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌ (5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌)
4. హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ (237వ ఫీల్డ్‌ వర్క్‌షాప్‌)
5. సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌ (వాయుసేన 39వ వింగ్‌)
6. అగ్నివీర్‌ మురళీ నాయక్‌ (851వ లైట్‌ రెజిమెంట్‌)

వీరులకు గౌరవం..
రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌కు మరణానంతరం మూడవ అత్యున్నత యుద్ధ పురస్కారం ‘వీర చక్ర’ లభించింది. సార్జెంట్‌ సురేంద్ర కుమార్‌కు ‘వాయు మెడల్‌’ ఇచ్చి గౌరవించారు. ఈ పురస్కారాలు వారి అసాధారణ ధైర్యం, త్యాగానికి గుర్తుగా ఇచ్చారు.

తెలుగు వీరుడి త్యాగం..
అమరుల జాబితాలో అగ్నివీర్‌ మురళీ నాయక్‌ తెలుగు నేలకు చెందిన వ్యక్తి. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఆయన 2022లో అగ్నివీర్‌గా ఎంపికయ్యారు. మొదట పంజాబ్, అస్సాం ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. ఆయన త్యాగం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణం.

జాతీయ యుద్ధ స్మారకంలో శాశ్వత స్థానం..
కేంద్రం ఈ అమరవీరుల పేర్లను నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చేర్చింది. ఢిల్లీలోని ఇండియా గేట్‌ సర్కిల్‌ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై వారి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు. ఈ చర్య దేశం వారి త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని స్పష్టం చేస్తుంది.

ఈ వీరుల త్యాగం దేశ రక్షణకు అంకితమైన సైనికుల సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. వారి జ్ఞాపకం భారతీయులందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం

Giorgia Andriani

మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం భారీ బ్యాటరీ ఫోన్.. ఇక రోజంతా వాడుకోవచ్చు..

Realme P4x 4G
Realme P4x 4G

Realme P4x 4G: ప్రస్తుత కాలంలో మొబైల్ కొనాలని అనుకునేవారు బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారి కోసం Realme సంస్థ మిడ్ రేంజ్ పీపుల్స్ కోసం కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ఊహించని రేంజ్ ఫీచర్లతో సరికొత్త P4x 4G అనే స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయింది. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించే యూజర్లను ఇది బాగా సరిపోతుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Realme P4x 4G అనే ఈ స్మార్ట్‌ఫోన్ లోని అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ. ఎందుకంటే ఇందులో 8000 mAh భారీ టైటాన్ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఇలాంటి ఫోన్లలో 5000 లేదా 6000 mAh బ్యాటరీలు చూస్తుంటాం. ఈసారి కంపెనీ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చడం విశేషం. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు.

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఆటోఫోకస్ సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. ఇది పగటిపూట లేదా తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన, నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది.

ఈ ఫోన్ లో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లేను చూడొచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రావడం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ తో పాటు గేమింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు మరియు సాధారణ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI తో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఫోన్ కిందపడినా తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఆర్మోర్‌షెల్ ప్రొటెక్షన్ మరియు ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర MYR 799 గా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 16,500 నుంచి రూ. 18,200 వరకు ఉంటుంది.

భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ కలిసి కుట్ర?

India Border Tensions
India Border Tensions

India Border Tensions: భారత సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు సరిహద్దులో పాకిస్తాన్, పశ్చిమ సరిహద్దులో బంగ్లాదేశ్‌ ఇందుకు కారణం అవుతున్నాయి. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచెలను తెంచుకుని మన దేశంలోకి చొరబడేందుకు బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు ప్రయత్నిస్తున్నారు. రెండు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గమనిస్తే రెండు దేశాలు కలిసే ఈ కుట్ర చేసినట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌ సరిహద్దులో..
భారతదేశం బంగ్లాదేశ్‌ సరిహద్దులో కంచె నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. గతంలో అనేక ప్రాంతాల్లో కంచె లేకపోవడం వల్ల చొరబాట్లు, అక్రమ వలసలు పెరగడంతో ఈ చర్యలు ముందుకు సాగుతున్నాయి. మాల్దా జిల్లా వంటి సున్నిత ప్రాంతాల్లో ఇటీవల కంచెను తెంచి లోపలికి రావడానికి ప్రయత్నించిన గుంపులు బీఎస్‌ఎఫ్‌తో ఘర్షణకు దిగాయి. కొంతమంది ఆయుధాలతో వచ్చినట్లు నివేదికలు ఉన్నాయి. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పరిస్థితిని నియంత్రించడానికి కాల్పులు జరిపారు. బంగ్లాదేశ్‌ భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగి, అల్లర్లు చేసేవారిని వెనక్కి పంపుతామని తెలిపాయి. ఈ ఘర్షణల్లో బీఎస్‌ఎఫ్‌ 21 మందిని అరెస్టు చేసింది. ఈ సంఘటనలు బంగ్లాదేశ్‌లోని కొన్ని సంఘాలు (జమాతే ఇస్లామీ వంటివి) సరిహద్దును అంతర్జాతీయ సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జరిగాయి.

రాజస్థాన్‌ సరిహద్దులో పాకిస్తాన్‌..
రాజస్థాన్‌ సరిహద్దులో (జైసల్మేర్, బికనీర్‌ వంటి ప్రాంతాలు) కంచెను తెంచి లోపలికి రావడానికి ప్రయత్నించిన నలుగురు పాకిస్తానీలను భారత సైన్యం అరెస్టు చేసింది. వారి ఉద్దేశాలు, కుట్రలు ఏమిటో దర్యాప్తు జరుగుతోంది. అదే సమయంలో, సరిహద్దుకు సమీపంలో (15 కిలోమీటర్లలోపు) అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు (మసీదులు, మదరసాలు వంటివి) తొలగించే చర్యలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని మలానా గ్రామంలోని మదరసా తొలగించబడింది. సుమారు 300 మందికి నోటీసులు ఇచ్చినా స్పందించని వారి నిర్మాణాలపై బుల్డోజర్లతో చర్యలు తీసుకున్నారు.

ఏకకాలంలో జరిగిన ప్రయత్నాలు
ఈ ఉద్రిక్తతలు ఏకకాలంలో తూర్పు, పడమర సరిహద్దుల్లో జరగడం గమనార్హం. బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సమయంలో తూర్పు సరిహద్దు ఘర్షణలు, రాజస్థాన్‌లో హోం మంత్రి అమిత్‌ షా పర్యటన సమయంలో పడమర సరిహద్దు అరెస్టులు జరిగాయి. బీఎస్‌ఎఫ్‌ సీసీ కెమెరాలు, సెన్సార్లు వంటి ఆధునిక సాంకేతికతలతో బలోపేతమైంది. సువేందు అధికారి వంటి స్థానిక నాయకులు కూడా సహకరిస్తున్నారు. చొరబాటుదారులను వెనక్కి పంపే చర్యలు కొనసాగుతున్నాయి.

ఏ దేశమైనా తన సరిహద్దులను భద్రపరచుకోవడం ప్రాథమిక బాధ్యత. చొరబాట్లు, అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ వంటి సమస్యలు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. కంచె నిర్మాణం, ఆధునిక నిఘా వ్యవస్థలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు. బీఎస్‌ఎఫ్‌ వంటి బలగాలు చట్టబద్ధంగా, నియంత్రితంగా వ్యవహరించడం ముఖ్యం. అయితే, గుంపులు రావడం, కంచెలు తెంచడం వంటి సంఘటనల్లో బలవంతం ఉపయోగించడం చివరి మార్గం కావాలి. దౌత్యపరంగా పొరుగు దేశాలతో సమన్వయం అవసరం.

పెద్దారెడ్డి మళ్లీ మంటపెట్టడానికి రెడీ అయ్యారు.. కూటమి అలెర్ట్ అయ్యింది

Kethireddy Pedda Reddy
Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy: తాడిపత్రి.. నిత్యం ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది. తాజాగా వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ నిరసనకు దిగుతానని స్పష్టం చేయడంతో.. టిడిపి నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చి చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రతిసారి ఆయనను పోలీసులు నిలువరిస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తాడిపత్రిలో జెసి ఫ్యామిలీ వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. కూటమి సర్కార్ అక్రమ అరెస్టులకు నిరసిస్తూ తాడిపత్రిలో ఆందోళనకు దిగుతానని ప్రకటించారు పెద్దారెడ్డి. దీంతో పరిణామాలు మరింత తీవ్రమవుతాయని భావించిన పోలీసులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఆయన నివాసం చుట్టూ మోహరించారు.

* హై టెన్షన్ నియోజకవర్గం..
ఏపీలో హై టెన్షన్ నియోజకవర్గాల్లో తాడిపత్రి ఒకటి. 2019లో తొలిసారి తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు తిరుగులేదని భావించారు. అందుకే టిడిపి సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగేవారు. జెసి కుటుంబాన్ని ఎంతగానో టార్గెట్ చేశారు. వారి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని కూడా దెబ్బతీశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీని జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా జెసి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. సవాళ్లకు దిగారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ జెసి ఫ్యామిలీ విజయం సాధించింది. దీంతో అక్కడ సీన్ రివర్స్ అయింది. కానీ ఇప్పటికీ తనదే పై చేయి అన్నట్టు కేతిరెడ్డి వ్యవహరిస్తూనే ఉన్నారు. తాడిపత్రిలో తన పరివారంతో పైచేయి సాధించాలని చూస్తున్నారు.

* బహిష్కరణ వేటు..
కేతిరెడ్డి పెద్దారెడ్డి మూలంగా తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని భావించిన పోలీసులు.. ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. నియోజకవర్గం లోకి రాకుండా ఆంక్షలు విధించారు. అయినా సరే అప్పుడప్పుడు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాడిపత్రిలో పర్యటనలకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి తాడిపత్రిలో ఆందోళనకు దిగుతానని స్పష్టం చేశారు. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నేతల పై పెట్టిన కేసులు సంగతి ఏంటని వారు ప్రశ్నించారు. దీంతో పరిస్థితి మరోసారి అదుపు తప్పుతుందని పోలీసులు అంచనా వేశారు. అందుకే హౌస్ అరెస్ట్ చేశారు.

మరో మూడు రోజులు వానలే వానలు!

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. ఆ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదు అయ్యాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఇప్పటికే వర్షాలు ఆలస్యం అయ్యాయి. జూన్ రెండో వారంలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పుడు విస్తరణకు అవకాశం కలగడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.

* ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కొనసాగుతాయి. శుక్రవారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది. వర్షం పడే సమయంలో ఈదురు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెబుతోంది. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షాలు పడతాయని చెబుతోంది. గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. గుడివాడలో 3.5 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 3.5, నరసాపురంలో 3.3, భీమడోలులో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయింది.

* రాయలసీమలో సైతం..
వచ్చే మూడు రోజుల పాటు రాయలసీమలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షం పడే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో.. వర్షాల తీవ్రత కూడా రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఖరీఫ్ పనులు మరింత చురుగ్గా జరిపేందుకు ఛాన్స్ కలుగుతుంది రైతులకు. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.