Home Blog Page 65

సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న పవన్ కళ్యాణ్ 'పెంపుడు జంతువు'.. ఇది మామూలు మాస్ కాదు..

Pawan Kalyan Fans
Pawan Kalyan pet animal

Pawan Kalyan pet animal: ‘ఓజీ 2’ చిత్రం త్వరలోనే మొదలు అవ్వబోతుంది అనే వార్త వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా లో ఈ సినిమా మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చ, గంటల వ్యవధి లో లక్షల పోస్టులు పడుతున్నాయి. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియన్ బడా చిత్రాలకు మంచి హైప్ ఉంది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ‘ఓజీ 2’ కి వచ్చినంత క్రేజ్ ఏ చిత్రానికి రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ , సుజిత్ మధ్య జరిగిన స్టోరీ మీటింగ్ వీడియో బయటకు వచ్చింది. అంతే ఒక్కసారిగా సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించే చర్చ .

ముఖ్యంగా ఇందులో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి కథ ని వివరిస్తూ ‘స్నో మొత్తం బ్లడ్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఓజాస్ గంభీర ఇంట్రడక్షన్ షాట్’ అని అంటాడు , దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది , అదే వీడియో లో ‘అతనికి ఒక పెట్ (పెంపుడు జంతువు ) ఉంటుంది అన్నమాట’ అని సుజిత్ అనగానే, వెనుక డ్రాగన్ ఫోటో ని చూపిస్తారు. డ్రాగన్ లాంటి పవర్ ఫుల్ జంతువూ పేర్లతో సినిమాలు తీస్తుంటే , ఇక్కడ ఏకంగా అలాంటి జంతువూ ని హీరో పెంచుకుంటున్నట్టు చూపించారు, ఇది మామూలు మాస్ ఎలివేషన్ కాదు , థియేటర్స్ లో ఈ సన్నివేశం వచ్చినప్పుడు పరిస్థితి ఊహిస్తేనే దిమ్మి తిరిగి పోతుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ , నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో ఉండే ఎడిటర్స్ టాలెంట్ ఎలాంటిదో తెలిసిందే కదా.

పైగా ఇప్పుడు AI అందుబాటులోకి వచ్చింది. దీంతో ఒక్కొక్కరు తమ అద్భుతమైన క్రియేటివిటీ ని బయటకు తీస్తూ , డ్రాగన్ ని పవన్ కళ్యాణ్ ఎలా పెంచుకున్నాడో ఊహిస్తూ ఎడిటింగ్స్ చేస్తున్నారు. వాటికి నెటిజెన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మీమ్ పేజీలు అయితే అసలు ఆగడం లేదు. ప్రతీ గంటకు ఒక పోస్టు దింపుతూనే ఉన్నారు. వీటిని అన్నిటిని చూసాక అభిమానుల్లో ఒక కొత్త టెన్షన్ మొదలైంది, ఓజీ 2 లో డ్రాగన్ గురించి ఇంత హైప్ ఇస్తున్నారు , ఒకవేళ డ్రాగన్ ని సినిమాలో చూపించకపోతే పరిస్థితి ఏంటి?, అభిమానులు బాగా నిరాశకు గురి అవుతారేమో అంటూ పవన్ ఫ్యాన్స్ కొంత మంది సోషల్ మీడియా ద్వారా తమ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నారా.. ముందు ఈ 4 విషయాల గురించి తప్పక తెలుసుకోండి..

Long Drive Travel Tips
Long Drive Travel Tips

Long Drive Travel Tips: కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లడం ఒక మధురమైన అనుభవం. వీకెండ్ ట్రిప్స్, హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎక్కువగా హైవేలపైనే ప్రయాణిస్తుంటారు. అయితే వాహనం సరిగా లేకపోతే ఆనందకరమైన ప్రయాణం మధ్యలోనే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హైవేలపై అధిక వేగంతో ప్రయాణించే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే లాంగ్ ట్రిప్‌కు బయల్దేరే ముందు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ఈ 4 ముఖ్యమైనవి.

టైర్లు సరిగ్గా ఉన్నాయా..?
వాహన భద్రతలో టైర్ల పాత్ర అత్యంత కీలకం. టైర్లు ఎక్కువగా అరిగిపోయి ఉండటం, కట్‌లు లేదా పగుళ్లు ఉండటం ప్రమాదకరం. అలాగే టైర్లలో సరైన గాలి పీడనం లేకపోతే మైలేజ్ తగ్గడమే కాకుండా, హైవేపై టైర్ పేలిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. ట్రిప్‌కు వెళ్లే ముందు అన్ని టైర్లతో పాటు స్పేర్ టైర్ కూడా మంచి స్థితిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయి:
లాంగ్ డ్రైవ్‌లో ఇంజిన్ నిరంతరం ఎక్కువసేపు పనిచేస్తుంది. అందువల్ల ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉండటం చాలా ముఖ్యం. ఆయిల్ తక్కువగా ఉంటే ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే రేడియేటర్‌లో కూలెంట్ సరైన స్థాయిలో ఉండాలి. కూలెంట్ తక్కువగా ఉంటే ఇంజిన్ వేడెక్కి ప్రయాణం మధ్యలోనే వాహనం ఆగిపోయే పరిస్థితి రావచ్చు.

బ్రేకులు, బ్యాటరీ కండిషన్:
హైవేలపై వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేకులు సరిగా పనిచేయడం అత్యంత అవసరం. బ్రేక్ పెడల్ సాఫీగా ఉందా? బ్రేక్ ఆయిల్ సరిపడా ఉందా? అనే విషయాలను ముందుగానే పరిశీలించాలి. అలాగే బ్యాటరీ పాతదిగా ఉంటే లేదా చార్జింగ్ సమస్య ఉంటే వాహనం స్టార్ట్ కాకపోవచ్చు. బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రంగా ఉన్నాయా, ఛార్జ్ సరిగా ఉందా అని కూడా చెక్ చేయించుకోవడం మంచిది.

డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ కిట్:
వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (PUC) వంటి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉండాలి. వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టార్చ్, జంప్ స్టార్టర్ కేబుల్స్, టైర్ ఇన్‌ఫ్లేటర్, పంక్చర్ రిపేర్ కిట్, తాగునీరు వంటి అత్యవసర వస్తువులను కూడా కారులో ఉంచుకోవాలి. ఇవి అనుకోని పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి.

సురక్షిత ప్రయాణానికి ముందస్తు జాగ్రత్తలే రక్షణ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు వాహనాన్ని పూర్తిగా పరిశీలించడం వల్ల అనేక సమస్యలను ముందుగానే నివారించవచ్చు. అవసరమైతే సమీప సర్వీస్ సెంటర్‌లో ఒకసారి వాహనాన్ని తనిఖీ చేయించుకోవడం మంచిది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రయాణం మరింత సురక్షితంగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది.

మొన్న ట్రంప్‌కు.. నేడు నాటో చీఫ్‌కు.. వరుసగా ఇచ్చిపడేస్తున్న మోలోనీ!

Giorgia Meloni Comments NATO Chief
Giorgia Meloni Comments NATO Chief

Giorgia Meloni Comments NATO Chief: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇటీవల అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మాటకు మాట సమాధానం ఇచ్చారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సుకు ఇద్దరు దేశాధినేతలు హాజరయ్యారు. సదస్సు అనంతరం అమెరికా వెళ్లిన ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌లో సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగాలని ప్రాధేయపడిందని పేర్కొన్నారు. తర్వాత ఓ మీడియా సమావేశంలోనూ ఇదే వ్యాఖ్యలు చేశారు. దీంతో మెలోనీ దీటుగా సమాధానం ఇచ్చారు. ఇటలీ ఎవరినీ ప్రాధేయపడదని స్పష్టం చేశారు. ఎవరికోసం పాకులాడదని వెల్లడించారు. చీప్‌ మెంటాలిటీ తనది కాదని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్‌ నోరు మూసుకున్నారు.

తాజాగా నాటో చీఫ్‌ వ్యాఖ్యలు..
తాజాగా నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యల సందర్భంగా యూరప్‌లోని అమెరికా స్థావరాల నుంచి వేలాది విమానాలు ఎగిరాయని, వాటిలో ఇటలీలోని స్థావరాల నుంచి వందల సంఖ్యలో విమానాలు బయలుదేరాయని పేర్కొన్నారు. ఈ మాటలు ఇటలీ నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లు అభిప్రాయం కలిగించాయి.

ఖండించిన మోలోనీ..
ఫ్రాన్స్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం ముగింపులో మీడియాతో మాట్లాడిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రుట్టే వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించారు. ఆయన ఉత్సాహంగా మాట్లాడుతూ వేర్వేరు విషయాలను ఒకటిగా కలిపేశారని, ఇటలీ అనుమతించిన విమానాల స్వభావాన్ని తప్పుగా గ్రహించారని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరిగిన సైనిక దాడుల్లో ఇటలీ ఎలాంటి నేరుగా పాల్గొనలేదని ఆమె గట్టిగా చెప్పారు.

ఇటలీ ఇచ్చిన అనుమతులు ఏమిటి?
ఇటలీ రక్షణ శాఖ వెంటనే స్పందిస్తూ, అమెరికా స్థావరాల నుంచి కేవలం సాంకేతిక, లాజిస్టిక్, నిర్వహణ సంబంధిత విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. యుద్ధ కార్యకలాపాలు, దాడులు లేదా ఆయుధ మద్దతుకు సంబంధించిన ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదంతా దేశ రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే జరిగిందని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

విదేశాంగ మంత్రి కూడా..
ఇటలీ విదేశాంగ మంత్రి అంటోనియో తజానీ రుట్టే వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఉద్దేశం లాజిస్టిక్‌ సహకారం గురించి మాత్రమేనని, ఇటలీ యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పడం సరైనది కాదని వివరించారు. ఈ వివాదం ఇటలీలోని ప్రతిపక్షాలు ప్రభుత్వం నిజాలు చెప్పిందా అనే సందేహాలు లేవనెత్తడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మెలోనీ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ ఇరాన్‌ సంఘర్షణలో దేశానికి నేరుగా పాత్ర లేదని స్పష్టం చేస్తోంది.

మెలోనీ తన స్థిరమైన ధోరణితో శక్తివంతుల ముందు కూడా నిజాలను బయటపెట్టడంలో వెనకాడట్లేదు. మొన్నటి ట్రంప్‌ సంభాషణల్లో చూపించిన ధైర్యం ఇప్పుడు నాటో చీఫ్‌ విషయంలో కూడా కనిపిస్తోంది.

హైదరాబాద్ మెట్రో అంశంపై కేంద్రం తిరిగి కన్సల్టెంటుని ఎందుకు నియమించింది?

Hyderabad Metro Expansion

Hyderabad Metro Expansion : హైదరాబాద్ మెట్రో 2003లో మొదట ఏర్పాటుకు నిర్ణయించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపాదించారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో అది పడకేసింది. తిరిగి 2012లో శంకుస్థాపన జరిగింది. 2014లో ప్రభుత్వం మారి రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలోనూ ఎలైన్ మెంట్ మార్చాలని ఆలస్యం చేశారు. 2017లో ప్రారంభమైంది. దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో కీర్తి సంపాదించింది. ఆరోజుకు ఇది దేశంలోనే రెండోది.

ఆ తర్వాత కేసీఆర్ 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు విస్తరణ పనులు మొదలుపెట్టింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు విస్తరించాలని నిర్ణయించారు. కేసీఆర్ దిగిపోయాక రేవంత్ రెడ్డి ప్రయారిటీ కేసీఆర్ కు దక్కవద్దని విస్తరణకు మోకాలడ్డేశారు.

ఎల్ అండ్ టీ నష్టాల్లో ఉందని తెలిసి తెలంగాణ ప్రభుత్వమే దాన్ని టేకప్ చేశారు. వాళ్లు కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ప్రకారం 22వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్ అండ్ టీకి 13.5 వేల కోట్లు ఇచ్చేసి ఎల్ అండ్ టీకి ఒప్పందం చేసుకున్నారు.

హైదరాబాద్ మెట్రో అంశంపై కేంద్రం తిరిగి కన్సల్టెంటుని ఎందుకు నియమించింది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఎలన్ మస్క్ తరువాత మన భారతీయుడే.. ఈయన సంపద విలువ ఎంతో తెలుసా..

CEO Shankh Mitra
CEO Shankh Mitra

CEO Shankh Mitra: టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యధిక ప్యాకేజీ ( 158 బిలియన్ల డాలర్లు) అందుకుంటున్న సీఈఓగా మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాన్ని ఒక భారతీయుడు కైవసం చేసుకోవడం విశేషం. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) సంస్థ అయిన ‘వెల్‌టవర్’ (Welltower) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శంఖ్ మిత్రా ఏకంగా 821 మిలియన్ డాలర్ల వార్షిక ప్యాకేజీని అందుకున్నారు. మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 6,890 కోట్లు. ఈయన గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో భారతీయ ప్రతిభ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. నిన్న మొన్నటి వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నిఖేష్ అరోరా వంటి పేర్లనే విన్న గ్లోబల్ మార్కెట్.. ఇప్పుడు కోల్‌కతా వీధుల నుండి వాల్ స్ట్రీట్ టాప్ లీగ్‌లోకి దూసుకొచ్చిన శంఖ్ మిత్రా వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రముఖ బిజినెస్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీఈఓల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.

శంఖ్ మిత్రా విజయప్రస్థానం భారతదేశంలోనే ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఆయన, అక్కడి ప్రసిద్ధ జాదవ్‌పూర్ యూనివర్సిటీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన, ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పట్టా పొందారు. ప్రపంచ స్థాయి ఆర్థిక రంగంలో రాణించడానికి ఈ విద్యాభ్యాసం ఆయనకు బలమైన పునాది వేసింది.

ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత శంఖ్ మిత్రా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ‘పిడబ్ల్యుసి’ సంస్థలో ప్రారంభించారు. అక్కడ ఐదేళ్ల పాటు పనిచేసి ఫైనాన్స్, బిజినెస్ అడ్వైజరీ రంగాలపై పట్టు సాధించారు. ఆ తర్వాత ఫైడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ , సిటాడెల్ , మిలీనియం మేనేజ్‌మెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో సీనియర్ అనలిస్ట్‌గా, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్‌మెంట్లలో ఆయనకున్న అసాధారణ ప్రతిభ వాల్ స్ట్రీట్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సీనియర్ హౌసింగ్ (వృద్ధుల వసతి గృహాలు) రంగంలో పెట్టుబడులు పెట్టే ఎస్ అండ్ పీ 500 సంస్థ ‘వెల్‌టవర్’లో శంఖ్ మిత్రా 2016లో చేరారు. కేవలం రెండేళ్లలోనే, అంటే 2018 నాటికి ఆయన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అయ్యారు. ఆ తర్వాత తన లీడర్‌షిప్ స్కిల్స్‌తో కంపెనీని మరింత లాభాల్లోకి నడిపించి, అక్టోబర్ 2020లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో వెల్‌టవర్ షేర్ల విలువ అసాధారణంగా పెరగడం గమనార్హం.దీంతో శంఖ్ మిత్రా మార్కెట్ విలువ రూ. 6,890 కోట్లుగా మారింది.

జగన్ షరతు.. పార్టీకి దూరంగా ఆ మాజీ మంత్రి!

Jagan Condition On Anil Kumar Yadav
Jagan Condition On Anil Kumar Yadav

Jagan Condition On Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పద నేతలంతా యాక్టివయ్యారు. ఒకే ఒక్కరు తప్ప. ఆయనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయతతో వ్యవహరించే అనిల్ కుమార్ యాదవ్ కొద్దిరోజులుగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాడేపల్లి సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరమవుతారా? లేకుంటే వైసీపీకి దూరమయ్యారా? అన్నది మాత్రం తెలియడం లేదు. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ లాంటి వారు కూడా ఆక్టివ్ అయ్యారు కానీ.. అనిల్ జాడ లేకపోవడం నిజంగా చర్చకు దారితీస్తోంది.

రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించిన నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. 2009లో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019లో రెండోసారి వైసీపీ నుంచి గెలిచిన అనిల్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో మాత్రం నెల్లూరు అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. నరసరావుపేట పార్లమెంటు సీటును ఇచ్చారు. టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయారు. అక్కడ నుంచి కనిపించకుండా మానేశారు అనిల్ కుమార్ యాదవ్.

ఆ అసంతృప్తితో..
వైసీపీలో దాదాపు నేతలంతా క్రియాశీలకం అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నెల్లూరులో చిన్న చిన్న ప్రెస్ మీట్ లు పెట్టి జారుకుంటున్నారు. అయితే ఇప్పటికే నెల్లూరు సిటీ బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఆ నిర్ణయం నచ్చక అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వైపు రావడం లేదన్న ప్రచారం ఉంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే నెల్లూరులో తనకు ఎంతో నమ్మకస్తులైన నేతలను వదులుకున్నారు జగన్. ఇప్పుడు కష్టంలో ఉండగా ఈ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా జగన్ పక్కన నిలబడకపోవడం అనేది పొలిటికల్ వర్గాల్లో ఆశ్చర్యం వేస్తోంది. అసలు అనిల్ కుమార్ యాదవ్ తిరిగి యాక్టివ్ అవుతారా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు విషయంలో అనిల్ కు షరతు పెట్టడం వల్లే.. పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

చికెన్ ఈ కలర్లో ఉందా.. ఆరోగ్యానికి ముప్పే!

Chicken Color Health Warning
Chicken Color Health Warning

Chicken Color Health Warning: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే మాంసాహారాల్లో చికెన్ ఒకటి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చికెన్ ఎంత పోషకమైనదైనా.. అది తాజాగా లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వండే ముందు చికెన్ నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ కలర్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తాజాగా ఉండే చికెన్ ఏ కలర్ లో ఉంటుందంటే?

తాజాగా ఉండే చికెన్ సాధారణంగా లేత గులాబీ రంగులో కనిపిస్తుంది. దాని మాంసం మృదువుగా, తేమతో ఉన్నప్పటికీ అతిగా జిగటగా ఉండదు. ముఖ్యంగా తాజా చికెన్‌కు ఎలాంటి దుర్వాసన ఉండదు. సహజమైన మాంసం వాసన మాత్రమే ఉంటుంది. మార్కెట్‌లో చికెన్ కొనుగోలు చేసే సమయంలో వీటిని గుర్తించి కొనుగోలు చేయడం మంచిది. చికెన్ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి మరో సులభమైన పరీక్ష కూడా ఉంది. వేళ్లతో మాంసాన్ని స్వల్పంగా నొక్కితే అది వెంటనే మళ్లీ తన అసలు ఆకారంలోకి వస్తే చికెన్ తాజాగా ఉన్నట్లు భావించవచ్చు. ఇది మాంసం నాణ్యత బాగుందని సూచించే ప్రధాన సంకేతాల్లో ఒకటి.

అయితే చెడిపోయిన చికెన్‌లో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాంసం రంగు బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగులోకి మారవచ్చు. అలాగే పుల్లటి లేదా అసహ్యకరమైన దుర్వాసన వస్తుంది. చేతితో తాకినప్పుడు మాంసం జిగటగా, అతుక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. నొక్కినప్పుడు గుంత పడిపోయి తిరిగి సాధారణ స్థితికి రాకపోతే అది పాడై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి చికెన్‌ను వండి తింటే ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల అనుమానం వచ్చిన చికెన్‌ను ఉపయోగించకుండా పారేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

నిపుణుల సూచనల ప్రకారం చికెన్‌ను విశ్వసనీయ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత త్వరగా వండాలి లేదా ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వండేటప్పుడు చికెన్ పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కుటుంబాన్ని ఆహార సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షించుకోవచ్చు.

ఏసీ రిమోట్‌లోని ఈ రెండు బటన్లు వాడితే చాలు.. భారీగా విద్యుత్ ఆదా..

AC Remote Energy Saving Tips
AC Remote Energy Saving Tips

AC Remote Energy Saving Tips: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయినా కూడా వేడి తగ్గడం లేదు. దీంతో చాలా మంది ఏసీని ఇంకా వినియోగిస్తున్నారు. ఏసీ వినియోగంతో చల్లటి వాతావరణం నెలకొంటుంది. కానీ చల్లని గాలి ఎంత సౌకర్యాన్ని ఇస్తుందో, నెలాఖరులో వచ్చే విద్యుత్ బిల్లు అంతే ఆందోళన కలిగిస్తుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఏసీ రిమోట్‌లో ఉండే రెండు బటన్స్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. దీంతో కరెంట్ బిల్లుపై కూడా ప్రభావం పడుతుంది. ఈ రెండు బటన్స్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

స్లీప్ మోడ్ (Sleep Mode):
చాలా మంది రాత్రంతా 18 లేదా 20 డిగ్రీల వద్ద ఏసీని నడుపుతుంటారు. కానీ ఇది అవసరానికి మించి విద్యుత్‌ను ఖర్చు చేస్తుంది. Sleep Modeలో ఏసీ పనిచేస్తే గది చల్లదనం, శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత మధ్య సమతుల్యతను కాపాడేలా టెంపరేచర్‌ను క్రమంగా సర్దుబాటు చేస్తుంది. దీంతో నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండటమే కాకుండా విద్యుత్ ఖర్చు కూడా కొంత తగ్గుతుంది.రాత్రి పడుకునే సమయంలో శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. అందువల్ల మొదట అవసరమైనంత చల్లదనం ఉన్నా, అర్ధరాత్రి తర్వాత అదే స్థాయి కూలింగ్ అవసరం ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీల్లో Sleep Mode ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనిని ఆన్ చేస్తే ఏసీ గది ఉష్ణోగ్రతను బట్టి క్రమంగా 1 నుంచి 2 డిగ్రీల వరకు పెంచుతుంది. దీంతో కంప్రెసర్ నిరంతరం పనిచేయాల్సిన అవసరం తగ్గి విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

టైమర్ (Timer):
చాలా సందర్భాల్లో తెల్లవారుజామున వాతావరణం చల్లబడినా ఏసీ అలాగే నడుస్తూనే ఉంటుంది. దీంతో అనవసరంగా కరెంట్ వృథా అవుతుంది. దీనిని నివారించేందుకు Timer ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు రాత్రి పడుకునే ముందు ఉదయం 5 లేదా 6 గంటలకు ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా సెట్ చేస్తే, అవసరం లేని సమయంలో విద్యుత్ వినియోగం ఆగిపోతుంది.

వీటితో పాటు విద్యుత్ బిల్లును మరింత తగ్గించుకోవాలంటే ఏసీని 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం, గది తలుపులు, కిటికీలు బాగా మూసివేయడం, ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయడం, నేరుగా సూర్యరశ్మి గదిలోకి రాకుండా చూడడం వంటి అలవాట్లు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇన్వర్టర్ ఏసీలు సాధారణ ఏసీలతో పోలిస్తే తక్కువ విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది.

Sleep Mode, Timer ఫీచర్లు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఎంత మేర ఆదా అవుతుందనేది ఏసీ స్టార్ రేటింగ్, గది పరిమాణం, బయట ఉష్ణోగ్రత, మీరు ఎంచుకున్న టెంపరేచర్, వినియోగ సమయం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్లను సరిగ్గా ఉపయోగిస్తే సౌకర్యంతో పాటు విద్యుత్ బిల్లుపై కూడా కొంత భారం తగ్గించుకోవచ్చు.

'బాహుబలి 3' పై ప్రభాస్ సంచలన అప్డేట్.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదు..

Prabhas On Baahubali 3
Prabhas On Baahubali 3

Prabhas On Baahubali 3: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ‘బాహుబలి’ ఒక వరం లాంటిదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ కి మాత్రమే కాదు , ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కే గర్వకారణం మన బాహుబలి. అప్పటి వరకు ఒక లెక్క, బాహుబలి సిరీస్ వచ్చాక ఒక లెక్క. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సినిమాల కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉండేవి. కానీ బాలీవుడ్ లో సౌత్ సినిమాల ఆధిపత్యం మొదలైంది మాత్రం ‘బాహుబలి’ సిరీస్ తోనే. ఇక్కడి నుండే కేజీఎఫ్ సిరీస్ లు , పుష్ప సిరీస్ లు వచ్చి బాలీవుడ్ నుండి డామినేట్ చేయడం మొదలు పెట్టాయి. ఇన్నేళ్ల నుండి ఎన్నో సంచలనాత్మక బ్లాక్ బస్టర్స్ వచ్చాయి , కానీ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు ‘బాహుబలి 2’ ని ముట్టుకోలేకపోయాయ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది అనేది.

అయితే ఈ సిరీస్ ‘బాహుబలి 2’ తోనే ముగిసింది అనుకుంటే పెద్ద పొరపాటే, నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ప్రభాస్, రానా, అనుష్క కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ చివర్లో రానా మాట్లాడుతూ ‘రాజమౌళి ఇక్కడ లేరు, చెప్పొచో లేదో తెలియదు , ఇది ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చు కానీ , బాహుబలి 3 కి మాత్రం ఐడియా సిద్ధం గానే ఉంది. కచ్చితంగా మళ్లీ మీ ముందుకొస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు రానా. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే రాజమౌళి ఈ చిత్రం చేసేలోపు 2034 అవ్వొచ్చు. ఎందుకంటే వారణాసి తర్వాత ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్.

ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన కమిట్మెంట్స్ ఉన్నాయి , ఇవి పూర్తి అయ్యాక మాత్రమే ఆయన ‘బాహుబలి 2’ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్ కూడా తన కమిట్మెంట్స్ ని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టేలా ఉంది. హను రాఘవపూడి తో చేస్తున్న మూవీ చివరి దశలో ఉంది , అదే విధంగా సందీప్ వంగ తో ‘స్పిరిట్’, ఆ తర్వాత ‘కల్కి 2’, ‘సలార్ 2’, ప్రశాంత్ వర్మ మూవీ , ఇలా బోలెడన్ని ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయ్యి, రాజమౌళి కూడా తన కమిట్మెంట్స్ ని పూర్తి చేసుకున్న రోజు వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది.

పాక్‌కు ఎసరు పెడుతున్న ఆఫ్గాన్‌.. రష్యాతో తాలిబాన్‌ కీలక ఒప్పందం!

Afghanistan Russia Strategic Agreement
Afghanistan Russia Strategic Agreement

Afghanistan Russia Strategic Agreement: మూడున్నర దశాబ్దాల క్రితం సోవియట్‌ సేనలు అఫ్గానిస్తాన్‌ నుంచి వెనక్కి తగ్గడానికి ముల్లా ఒమర్‌ నేతృత్వంలోని ప్రతిఘటన ప్రధాన కారణం. ఇప్పుడు ఆయన కుమారుడు, ప్రస్తుత రక్షణ మంత్రి మహమ్మద్‌ యాకూబ్‌ ఒమర్‌ ముజాహిద్‌ రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గెయ్‌ షోయిగుతో కలిసి మే చివరి వారంలో మాస్కోలో సైనిక–సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి ముందు రష్యా 2025 ఏప్రిల్‌లో తాలిబన్లను నిషిద్ధ ఉగ్రవాద జాబితా నుంచి తొలగించింది. జూలైలో ప్రపంచంలో తొలి దేశంగా అఫ్గాన్‌ ఇస్లామిక్‌ ఎమిరేట్‌ను అధికారికంగా గుర్తించింది.

ఒప్పందంలోని ప్రధాన అంశాలు..
రష్యా, అఫ్గాన్‌ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఆర్థిక, శ్రామిక, రక్షణ రంగాల్లో విస్తృత సహకారాన్ని కలిగి ఉంది. తాలిబన్‌ పరిశ్రమల మంత్రి రష్యన్‌ కంపెనీలను లిథియం, రాగి, విలువైన రాళ్ల గనుల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించడానికి అఫ్గాన్‌ నుంచి కార్మికులు, నిపుణులను రష్యాకు తరలించే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది అఫ్గాన్‌కు కొంత ఆదాయం సమకూర్చే అవకాశం కల్పిస్తుంది.

ఉగ్రవాద నిరోధకతపై ఒప్పందం..
రష్యా అధినేత పుతిన్‌ గతంలోనే తాలిబన్‌ను ఈ పోరాటంలో భాగస్వామిగా ప్రకటించారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో 18 నుంచి 23 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారిలో మూడు వేల మంది ఐసిస్‌–కెకు చెందినవారని షోయిగు అంచనా వేశారు. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. భారత్‌ ఇప్పటికే ఏడాది నుంచి తాలిబన్‌ ప్రభుత్వంతో రహస్య సంప్రదింపులు కొనసాగిస్తోంది.

పాత సోవియట్‌ పరికరాల ఆధునికీకరణ..
ఒప్పందం ప్రకారం అఫ్గాన్‌లో ఉన్న పాత రష్యన్‌ హెలికాప్టర్లు, ట్యాంకులు, కవచ వాహనాల మరమ్మతు, నిఘా వ్యవస్థల ఆధునికీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీటికి అవసరమైన విడిభాగాలు రష్యా నుంచి సరఫరా అవుతాయి.

పాకిస్తాన్‌ ప్రాబలయ్యానికి దెబ్బ..
ఇంతకాలం అఫ్గాన్‌లోని పాత సోవియట్‌ ఆయుధాల నిర్వహణ కాంట్రాక్టులు పొందిన పాకిస్తాన్‌ను ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. రష్యా అందించే సాంకేతిక సహాయం, డ్రోన్‌ నిఘా వ్యవస్థలు తాలిబన్‌ సైనిక సామర్థ్యాన్ని పెంచి, పాక్‌కు భద్రతా సవాలుగా మారవచ్చు. అఫ్గాన్‌పై పాక్‌ పాత వ్యూహాత్మక పట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. రష్యా వంటి విశ్వసనీయ రక్షణ భాగస్వామి తాలిబన్‌తో సైనిక ఒప్పందం చేసుకోవడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. అఫ్గాన్‌ భూభాగం ద్వారా కశ్మీర్‌ కేంద్రిత ఉగ్రవాద సంస్థలకు ఆధునిక రష్యన్‌ సాంకేతికత, ఆయుధాలు చేరకుండా చూసుకోవడం ప్రధాన సవాల్‌.

రష్యా అఫ్గాన్‌లో పట్టు సాధించడంతో పాక్, చైనాల ప్రాబల్యం తగ్గితే, అది భారత్‌కు పరోక్షంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. చైనా అఫ్గాన్‌లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. రష్యా సహకారంతో స్థిరత్వం నెలకొంటే ఆ పెట్టుబడులు సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మధ్య ఆసియా ప్రాంతంలో రష్యా సైనిక ఆధిపత్యం చైనాకు పూర్తిగా నచ్చే అంశం కాదు.

భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల్లో కొత్త ఆశలు.. పర్యాటకులకు ఆహ్వానం!

India Bangladesh Relations
India Bangladesh Relations

India Bangladesh Relations: షేక్‌ హసీన ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. షేక్‌ హసీనాకు భారత్‌ ఆశ్రయం ఇచ్చిందన్న సాకుతో భారత్‌పై తాత్కాలిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. చైనా, పాకిస్తాన్‌తో సత్సంబంధాలు పెంచుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు భారత్‌ టూరిస్టు వీసాలను నిలిపివేసింది. ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇప్పుడిప్పుడే సంత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలోని భారత హైకమిషన్‌ జూన్‌ 28 నుంచి బంగ్లాదేశ్‌ పౌరుల టూరిస్ట్‌ వీసా దరఖాస్తులను స్వీకరించనుంది. హైకమిషనర్‌ దినేశ్‌ త్రివేది ఇండియన్‌ వీసా అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించి ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి దశలో ఢాకా, రాజశాహి, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు కేంద్రాల ద్వారా సేవలు ప్రారంభమవుతాయి. తర్వాత ఈ సౌకర్యాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు ఉన్నాయి.

కొత్త హైకమిషనర్‌ కీలక చర్య..
దినేశ్‌ త్రివేది ఇటీవల బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహాబుద్దీన్‌కు అధికార పత్రాలు సమర్పించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ చర్య రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత దృఢం చేయడమే లక్ష్యంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

2024లో నిలిపివేత..
గత ఏడాది బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి తీవ్రంగా ఉంది. అప్పటి ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో సాధారణ టూరిస్ట్‌ వీసాల జారీని నిలిపివేశారు. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపారం కోసం పరిమిత వీసా సేవలు కొనసాగాయి.

ఇరు దేశాల మధ్య తగ్గనున్న ఉద్రిక్తతలు..
భారత్‌ బంగ్లాదేశ్‌ పౌరులకు అత్యధిక వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత వీసా సేవలు పునరుద్ధరించినప్పటికీ రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్‌ వీసాలపై నియంత్రణలు కొనసాగాయి. ఇప్పుడు ఈ సేవలు మళ్లీ ప్రారంభించడం ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నట్లు సూచిస్తోంది.

ఈ చర్య వల్ల పర్యాటకం, వాణిజ్యం, వైద్య సేవలు, విద్యా మార్పిడులు, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే వాణిజ్యం, భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి పెండింగ్‌ అంశాలపై సహకారం పెరగవచ్చు. మొత్తం మీద రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త దశకు నాంది పలుకుతుందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు.

పూరి జగన్నాథ్ కెరీర్ ని ఆ హీరోయిన్ సర్వ నాశనం చేసిందంటూ ప్రముఖ నటుడు హాట్ కామెంట్స్..

Puri Jagannadh career controversy
Puri Jagannadh career controversy

Puri Jagannadh career controversy: మన టాలీవుడ్ మూవీ లవర్స్ అందరికీ బాగా ఇష్టమైన డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపిన లెజండరీ టాలెంటెడ్ డైరెక్టర్ ఆయన. ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ , లోకేష్ కనకరాజ్ , సందీప్ వంగ అంటున్నారు కానీ , వింటేజ్ పూరి జగన్నాథ్ తో పోలిస్తే వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు అని సినీ విశ్లేషకులు అంటుంటారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పోకిరి కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఈ సినిమాని ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా సంచలన విజయం సాధించిందంటే, పూరి ఎలాంటి టెక్నీషియన్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదు కానీ , ‘టెంపర్’ తర్వాత పూరి జగన్నాథ్ పూర్తిగా ఫార్మ్ కోల్పోయాడు, ఆయనలోని రైటింగ్ స్కిల్స్ పాతాళంలోకి పడిపోయాయి.

ఆయన లేటెస్ట్ సినిమాలను చూసిన ప్రతీ ఒక్కరు కూడా ఎలా ఉండే పూరి ఎలా అయిపోయారు అంటూ బాధ పడుతున్నారు. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ ఇలా పాతాళంలోకి పడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్ అని నటుడు అజాజ్ ఖాన్ చెప్పుకొచ్చారు. జ్యోతి లక్ష్మి సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య పరిచయం అయ్యిందని , ఆ సినిమా షూటింగ్ సమయం లో చార్మ్ ఏమి మాయ చేసిందో తెలీదు కానీ, పూరి జగన్నాథ్ పూర్తిగా ఆమె వశం అయిపోయారని , ఆమె మాయలో పడి బంగారం లాంటి భార్య పిల్లల్ని కూడా వదిలేశారని, కేవలం ఈమె కారణంగానే సౌత్ ఇండియా లో పూరి జగన్నాథ్ కి టాప్ హీరోలు గౌరవం ఇవ్వడం మానేశారని చెప్పుకొచ్చారు అజాజ్ ఖాన్. ఒకవేళ ఛార్మి పూరి జీవితం లో లేకపోయుంటే , ఈరోజు ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఉండేదని , జీవితాన్ని చేతులారా సర్వనాశనం చేసుకున్నారని చెప్పుకొచ్చారు అజాజ్ ఖాన్.

ఛార్మి తో జత కట్టిన తర్వాత పూరి జగన్నాథ్ ఆమె తో కలిసి నిర్మిస్తూ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. వాటిల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప, ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. పోనిలే టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమా తో అయినా ఫార్మ్ లోకి వచ్చారు , తదుపరి చిత్రం యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తో ‘లైగర్ ‘ సెట్ చేసుకున్నారు , ఇక తిరుగేలేదని అంతా అనుకున్నారు , కానీ ‘లైగర్ ‘ చిత్రం దారుణమైన పరాజయం పాలైంది, ఆ తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది , ఇప్పుడు పూరి ఆశలన్నీ విజయ్ సేతుపతి తో తీసిన ‘స్లం డాగ్’ మీదనే ఉన్నాయి, కనీసం ఈ సినిమా తో అయినా కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

ఆంధ్రా–తెలంగాణా ఉద్యోగాల వివాదం.. చిచ్చు పెట్టిన కవిత

Kavitha latest statement
Kavitha latest statement

Kavitha latest statement: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తెలంగా, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి పదేళ్లు దాటింది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ప్రకటించింది. పునర్విభజన చట్టంలో చేరింది. దీంతో ఇంతకాలం విద్య, ఉద్యోగాల్లో తెలంగాణవారు ఆంధ్రాలో, ఆంధ్రావారు తెలంగాణలో పోటీ పడ్డారు. విభజన చట్టం ప్రకారం గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి పాలన వారిది. ఎవరి కాలేజీలు వారివి, ఎవరి ఉద్యోగాలు వారిని ఈమేరకు తెలంగాణ కూడా అసెంబ్లీలో చట్టం చేసింది స్థానిక విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కాలని నిర్ణయించింది. ఇక 5 శాతం ఉద్యోగాల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌(తెలంగాణ రక్షణ సేన)అధ్యక్షురాలు కల్వకుంట్ల రెండ రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ‘ఆంధ్రాలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? తెలంగాణలో ఆంధ్రా పిల్లలకు ఎందుకివ్వాలి?’’ అనే ప్రశ్నలు మళ్లీ వేడిని రాజేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లుగా కొనసాగుతున్న స్థానికత, నిరుద్యోగం, వనరుల పంపిణీ సమస్యలను లేవనెత్తుతున్నాయి.

కవిత వ్యాఖ్యల వెనుక అర్థం..
కవిత హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ‘తెలంగాణ స్థానికత – సవాళ్లు’ అనే రౌండ్‌ టేబుల్‌లో మాట్లాడుతూ, తెలంగాణలో ఇంజినీరింగ్‌ చదివిన ఇతర రాష్ట్రాల(ముఖ్యంగా ఆంధ్రా) విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఆంధ్రాలో తెలంగాణ వాళ్లను నాన్‌–లోకల్స్‌ అని పిలిచి ఉద్యోగాలు నిరాకరించినప్పుడు, తెలంగాణలో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ముల్కీ రూల్స్‌ను పునరుద్ధరించాలని, గ్రూప్‌–1 వంటి నియామకాల్లో స్థానికులకు అన్యాయం జరిగిందని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటు తర్వాత స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ను బలపరుస్తున్నాయి.

ముల్కీ రూల్స్‌ నేపథ్యం..
1948 తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రంలో ముల్కీ రూల్స్‌ అమలులో ఉండేవి. స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ఉండేది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఈ నిబంధనలు కొనసాగాయి. 1969, 1972లో జరిగిన ఉద్యమాలు స్థానికత సమస్యను మరింత తీవ్రం చేశాయి. 2014లో తెలంగాణ విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల విభజన, స్థానిక నిర్వచనం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికతను నిర్దేశించే అధికారం రాష్ట్రాలకు ఉంది (భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 16). కానీ కోర్టులు దీనిని న్యాయబద్ధంగా, అతిశయోక్తి లేకుండా అమలు చేయాలని నిర్ణయిస్తాయి.

స్థానిక యువత ఆందోళన..
తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ‘‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. రాష్ట్ర వనరులు స్థానికులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోవడం సహజం. నిరుద్యోగం అధికంగా ఉన్న పరిస్థితిలో ఇది మరింత సమర్థనీయం. ఒక రాష్ట్రం స్థానికులకు ప్రాధాన్యత ఇస్తే, మరొకటి కూడా అలాగే చేయవచ్చు. ఇది రాష్ట్రాల మధ్య సమతుల్యతను తీసుకురావచ్చు. రాష్ట్రాలు తమ ఉద్యోగ నియామకాల్లో నివాస అర్హత నిబంధనలు పెట్టుకోవచ్చు. అనేక రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయి.

ప్రతికూలతలు, సవాళ్లు..
కవిత వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభజన భావనను మరింత బలపరుస్తాయి. తెలుగు భాష, సంస్కృతి ఒకటే అయినప్పటికీ, మనోళ్లు.. పరాయోళ్లు అనే భావన పెరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడిని దెబ్బతీస్తుంది. ఉద్యోగాలు కేవలం స్థానికత ఆధారంగా ఇవ్వడం వల్ల ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు తగ్గవచ్చు. ప్రైవేట్‌ రంగం, కంపెనీలు ఇప్పటికే మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సామర్థ్యం ప్రధానం కావాలి.

కవిత వ్యాఖ్యలు తెలంగాణ యువత ఆందోళనలను బహిరంగంగా లేవనెత్తాయి. స్థానికులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే ఇది రాజ్యాంగం, చట్టం, మెరిట్‌కు లోబడి ఉండాలి. రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకోవడం కాకుండా, తమ తమ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి. తెలుగు యువత ఒకటే. వారి భవిష్యత్తు రాజకీయ విభజనల్లో కాక, నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఆర్థిక అభివృద్ధిలో ఉంది. ఆ దిశగా అందరూ కలిసి పని చేస్తేనే నిజమైన పరిష్కారం సాధ్యం.

చూస్తుండగానే రెండు కోట్లు.. కంటెంట్ తో ఇన్ స్టాను దున్నేస్తున్న భారతీయుడు

Aryan Kelvin Instagram success
Aryan Kelvin Instagram success

Aryan Kelvin Instagram success: సోషల్ మీడియా చూడడం వేరు.. సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకోవడం వేరు. అలా నేటి కాలంలో చాలామంది సోషల్ మీడియాని ఉపయోగించి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. కార్పొరేట్ సంస్థలు.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అటువంటి వారికి విరివిగా అవకాశాలు ఇస్తున్నాయి. అందుకోసమే నేటి కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి తాపత్రయపడుతున్నారు.

మనదేశంలో సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వస్తాయి. పైగా నేటి కాలంలో సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించేవారు పెరిగిపోయారు. కేవలం సృజనాత్మకతను ఆసరాగా తీసుకొని.. సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు.

మనదేశంలో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన వారు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో ఇతడికి ముందు వరసలో చోటు ఉంటుంది. అతడి పేరు ఆర్యన్ కెల్విన్. ఇతడిది జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ ప్రాంతం. ఇతడు సోషల్ మీడియాలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇతడు వినూత్నమైన కంటెంట్ తో ఇన్ స్టా గ్రామ్ లో సంచలనం సృష్టించడం మొదలు పెట్టాడు. ఫలితంగా ఇతడు ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రియేటర్ తనే అని కెల్విన్ చెబుతున్నాడు.

ఆ వీడియోకు కేవలం 15 గంటల్లోనే రెండు కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. అంతే కాదు 15 లక్షల పైగా లైక్స్ వచ్చాయి. కెల్విన్ వినూత్నమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. దానికి తగ్గట్టుగా వ్యాఖ్యానాన్ని జత చేస్తూ ఉంటాడు. సమయానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటాడు. అతడి గొంతు కూడా చాలా బాగుంటుంది. అందువల్లే అతడు ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అతడు అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.. లక్షలలో సంపాదిస్తున్నాడు. ఉన్నత విద్యావంతుడైన ఇతడు.. తన క్రియేటివిటీ తో కంటెంట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకునే వారికి కూడా పాఠాలు చెబుతున్నాడు.

క్రికెట్ ఆడటం రాదు.. ఈ పిల్లి శాపనార్థాలకు కొదవలేదు.. అందుకే మిమ్మల్ని పాకీలు అనేది..

Rashid Latif latest comments
Rashid Latif latest comments

Rashid Latif latest comments: క్రికెట్ ఆడలేరు. మైదానంలో గట్టిగా నిలబడలేరు.. పూర్తిస్థాయి ఓవర్లలో బ్యాటింగ్ చేయలేరు. కానీ వంట వండడానికి పనికి వస్తారు. మా వాళ్ల రక్తంలోనే వంట ఉంది. క్రికెట్ లేదు.. ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ను ఉద్దేశించి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

వాటిని మర్చిపోకముందే.. మరొకడు తెరపైకి వచ్చాడు. వాడి పేరు లతీఫ్. గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడాడు. ప్రస్తుతం మహిళా టి20 వరల్డ్ కప్ జరుగుతుండడం.. అందులో ముందుగానే పాకిస్తాన్ జట్టు ఇంటికి వెళ్లడంతో లతీఫ్ తన అక్కసు మొత్తాన్ని బయట పెట్టుకున్నాడు. తమ జట్టు ఓడిపోయిన పర్వాలేదు గాని.. భారత్ గెలవకూడదు అన్నట్టుగా అతడు చేస్తున్న వ్యాఖ్యలు కంపరాన్ని కలిగిస్తున్నాయి.

“మహిళా టి20 వరల్డ్ కప్ లో మనం ఓడిపోయాం. మన ప్లేయర్లు దారుణంగా ఆడుతున్నారు. మన పరువు తీశారు. మన ఓడిపోయినా పర్వాలేదు.. మన శత్రువు భారత్ గెలవడానికి అవకాశం ఉండకూడదు. మన మాదిరిగానే గ్రూపు దశలోనే ఆ జట్టు ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం మీరు ప్రార్థనలు చేయండి. అల్లాను ఆరాధించండి. టీమిండియా గ్రూప్ దశలోని ఇంటికి వెళ్లి పోవాలని కోరండి. అప్పటివరకు మీరు నిద్రపోకండి” అంటూ మహిళా క్రికెటర్లకు లతీఫ్ సూచన చేశాడు.

ప్రస్తుత ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా మీద దారుణమైన ఓటమిని చవిచూసింది. జట్టులో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాల్సిన లతీఫ్.. ఇలా టీమ్ ఇండియా మీద తన ఆక్రోశాన్ని ప్రదర్శించడాన్ని క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మైదానంలో ఆట ద్వారా మాత్రమే సమాధానం చెప్పాలని.. అలా కాకుండా ఇలా పిల్లి శాపనార్ధాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మైదానంలో క్రికెట్ ఆడలేక.. ఇలా నోటికి పని చెప్పడం ఏంటని.. క్రికెట్ అనేది అద్భుతమైన ఆట అని.. అందులో ప్రొఫెషనలిజం మాత్రమే చూపించాలని.. అడ్డగోలుగా వ్యవహరిస్తే పాకిస్తాన్ జట్టు ఇక జన్మలో కూడా గ్రూప్ దశను దాటి ముందుకు వెళ్లలేదని సూచిస్తున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ మహిళల జట్టు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఏమాత్రం గొప్ప ప్రదర్శన చేయలేదు. బౌలింగ్లో.. బ్యాటింగ్లో.. ఫీల్డింగ్లో.. ఇలా అన్ని విభాగాలలో పాకిస్తాన్ జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది. కనీసం నిలబడి పరుగులు కూడా చేయలేక ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. అందువల్లే పాకిస్తాన్ దారుణమైన ఓటములను మూటగట్టుకుంది. గ్రూపు దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.

హీరోయిన్ 'కుష్బూ' కూతురు వివాహం.. టాలీవుడ్ సినీ తారల సందడి.. వీడియో వైరల్..

Khushbu daughter wedding
Khushbu daughter wedding

Khushbu daughter wedding: తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , హీరోయిన్స్ క్యాటగిరీలో సూపర్ స్టార్ స్థాయిని సంపాదించుకున్న కుష్బూ కూతురు అవంతిక పెళ్లి నిన్న తమిళనాడు లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ నుండి ప్రముఖ నటులంతా హాజరయ్యారు. వీళ్లందరినీ ఒకే చోట చూస్తుంటే , ఇండియన్ సూపర్ స్టార్స్ రీ యూనియన్ అని అనిపించింది. మన టాలీవుడ్ నుండి చిరంజీవి , నాగార్జున , వెంకటేష్, కోలీవుడ్ నుండి త్రిష, బాలీవుడ్ నుండి అనిల్ కపూర్ , జాకీ ష్రాఫ్ తదితరులు ఈ వివాహ మహోత్సవం లో పాల్గొని వధూవరులను ఆసీవాదించారు. ముఖ్యంగా చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున ఒక చోట కలుసుకొని , గ్రూప్ గ్యాంగ్ లాగా మాట్లాడుకోవడం చూసే ప్రేక్షకులకు చాలా గొప్పగా అనిపించింది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరియు జాకీ ష్రాఫ్ లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరి మధ్య ఈ రేంజ్ సాన్నిహిత్యం ఉంది అనే విషయం ఆడియన్స్ కి ఈ పెళ్లి ద్వారానే తెలిసింది. పెళ్లి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు వీళ్లిద్దరు కలిసే ఉన్నారు. సాధారణంగా ఇలాంటి రిలేషన్ మనం ఎక్కువగా చిరంజీవి , నాగార్జున మధ్య చూస్తుంటాము, ఈ ఈవెంట్ లో వాళ్లిద్దరూ కూడా ఎంతో సాన్నిహిత్యం గా ఉన్నారు కానీ , జాకీ ష్రాఫ్ తో చిరంజీవి సందడి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చింది ఈ కార్యక్రమంలో. ఇకపోతే పెళ్లి సమయం లో ప్రముఖ హీరోయిన్ త్రిష చిరంజీవి పక్కనే కూర్చొని సంభాషిస్తూ ఉండడం కూడా మరో హైలైట్ గా నిల్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ రాజకీయాల్లో త్రిష పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయం లో ఆమె చిరంజీవి తో సాన్నిహిత్యం గా ఉండడం మరింత హైలైట్ గా నిల్చింది.

త్రిష తో పాటు ఆమె కాబోయే భర్త , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ వివాహ మహోత్సవానికి వచ్చి ఉండుంటే మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండేది. సాధారణంగా అయితే ఇలాంటి ఈవెంట్స్ కి ఆయన వస్తుంటాడు , కానీ ఎందుకో నిన్న రాలేదు. ఇదంతా పక్కన పెడితే కుష్బూ జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అందరికీ తెలిసిందే. కచ్చితంగా ఈ పెళ్లి లో ఎన్టీఆర్ ని చూడొచ్చేమో అని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ వివాహ మహోత్సవానికి హాజరు కాలేదు . సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నటువంటి కుష్బూ కూతురు అవంతిక పెళ్లి వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

సోషల్ మీడియాలో.. నోటికి పని చెప్పారో.. పోలీసులు జైలుకి పంపిస్తారు

Social Media Misuse
Social Media Misuse

Social Media Misuse: సోషల్ మీడియా లేకుండా బతికే పరిస్థితి లేదు. కనీసం సోషల్ మీడియా చూడకుండా పది నిమిషాలు ఉండే అవకాశం లేదు. మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయిపోయింది. పోస్టులు పెట్టడం.. కామెంట్లు చేయడం.. కామెంట్లకు స్పందించడం.. ఒకప్పుడు సోషల్ మీడియాను ఇలానే వాడేవారు. ఇప్పుడు దూషించడానికి.. ఆరోపించడానికి.. విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు.

సోషల్ మీడియా చూస్తుంటే కొన్ని సందర్భాలలో పట్టరాని కోపం వస్తుంది. ఆపుకోలేని ఆవేశం కలుగుతుంది. ఆ సమయంలో మన స్పందనను గట్టిగానే తెలియజేస్తాం. అప్పుడు కొంచెం కఠినమైన పదాలను వాడుతూ ఉంటాం. ఒకప్పుడు ఇవి చెల్లుబాటు అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడితే.. నోరు ఉంది కదా అని జారితే దూల తీరిపోతుంది. ఇదే విషయాన్ని న్యాయపుణులు హెచ్చరిస్తున్నారు. దారుణంగా మాట్లాడటం.. అవమానకరంగా వ్యవహరించడం.. బెదిరింపు పదజాలాన్ని ఉపయోగించడం వంటి వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది

కోపంలో ఉన్నప్పుడు వాడే పదాలు.. కటకటాల వెనక్కి పంపిస్తాయి. ఆ సెక్షన్లు కూడా అత్యంత పదునుగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యల వల్ల సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. విద్వేషాలు రగిలే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తుల మీద కేసులు నమోదవు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అదే కాదు ఒకరిని ఉద్దేశించి అశ్లీలమైన పదాలు ఉపయోగించడం.. అవమానకరంగా మాట్లాడటం.. అసభ్యకరంగా వ్యవహరించడం వంటివి చేస్తే జైలు శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ గొడవలకు దారి తీసే విధంగా దూషణకు దిగితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. భావ ప్రకటనను స్వేచ్ఛాయుతంగా వాడుకోవాలి. అలాకాకుండా ఇతరుల గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉపయోగిస్తే.. ఆ తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది. అందువల్లే నోరు అదుపులో పెట్టుకోవాలి. సోషల్ మీడియాను జస్ట్ చూసి చూడనట్టు వదిలేయాలి.