Homeఅంతర్జాతీయంChina zoo hiring: రోజుకు ఆరు గంటల పని.. 14 లక్షల వేతనం.. త్వరపడండి..

China zoo hiring: రోజుకు ఆరు గంటల పని.. 14 లక్షల వేతనం.. త్వరపడండి..

China zoo hiring: నేటి కాలంలో చదివిన చదువుకు ఉద్యోగం లభించడం కష్టమైపోయింది. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక నరకం చూస్తున్నారు. ఇక కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కల్పన అనేది ఎండమావిలాగా మారిపోయింది. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయింది. ఫలితంగా నిరుద్యోగశాతం మరింత పెరుగుతోంది.ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక ఉద్యోగానికి సంబంధించి […]

China zoo hiring: నేటి కాలంలో చదివిన చదువుకు ఉద్యోగం లభించడం కష్టమైపోయింది. ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక నరకం చూస్తున్నారు. ఇక కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల కల్పన అనేది ఎండమావిలాగా మారిపోయింది. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయింది. ఫలితంగా నిరుద్యోగశాతం మరింత పెరుగుతోంది.ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాలి. అది కూడా శారీరక శ్రమ లేకుండానే.. జస్ట్ నిలబడితే చాలు. కంప్యూటర్ ను కావాల్సిన అవసరం లేదు. గంటలకు గంటలు కుర్చీలో కూర్చొని మెదడుకు మేత పెట్టాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ ఆరు గంటలు.. అది కూడా కొన్ని రకాల శబ్దాలు చేస్తే సరిపోతుంది. సంవత్సరానికి 14 లక్షలు వరకు వేతనం ఇస్తారు. అంతేకాదు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఇంతకీ ఈ ఉద్యోగం ఏంటి.. ఎక్కడ పని చేయాలి.. ఏం చేయాలి.. అనేకదా మీ డౌటు..

చైనా దేశంలో ఓ జూ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. తమ జంతు ప్రదర్శనశాలకు వచ్చే పర్యాటకులను నవ్వించే ఉద్యోగం ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగం చేసే వారికి ప్రతి ఏడాది 14 లక్షల వరకు వేతనం ఇస్తామని ప్రకటించారు. రోజుకు ఆరు గంటలు మాత్రమే పనిచేయాలని సూచించారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎలుగుబంటి డ్రెస్ వేసుకోవాలని.. పర్యాటకులను నవ్వించాలని నిబంధన పెట్టారు. కేవలం ఎలుగుబంటి మాదిరిగా శబ్దాలు చేస్తే సరిపోతుందని సూచించారు. అయితే ఈ వింత ఉద్యోగానికి ఇప్పటికే వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని నిర్వాహకులు అంచనా వేయలేదు.

కొంతకాలంగా చైనాలో కూడా నిరుద్యోగశాతం విపరీతంగా పెరుగుతోంది. అక్కడ తయారీ రంగంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. దీంతో చాలావరకు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పైగా తయారికి తగ్గట్టుగా వర్క్ ఆర్డర్లు లభించకపోవడంతో చాలా వరకు కంపెనీలు కూడా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అందువల్లే ఎలుగుబంటిలా నటించే ఉద్యోగానికి సైతం ఈ స్థాయిలో పోటీ ఉండడం విశేషం. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో జూ నిర్వాహకులు కూడా సందిగ్ధంలో పడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కలవర పడుతున్నారు. మరి ఆ ఉద్యోగం ఎవరికి రాసిపెట్టింది.. ఎవరికి ఆ 14 లక్షలు దక్కుతాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper