Gold Investment: ద్రవ్యోల్బణం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో సంపదను కాపాడుకోవడానికి, దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలామంది బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కూడా. అయితే ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎవరికి సరిపోతుంది? వాటి ప్రయోజనాలు, పరిమితులు ఏమిటి? తెలుసుకుందాం.
బంగారం విలువ కాలక్రమేణా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి పరిస్థితుల్లో కూడా బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. షేర్ మార్కెట్‌లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు కూడా బంగారం పెట్టుబడులకు కొంత రక్షణ కల్పించే ఆస్తిగా భావిస్తారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మారినప్పుడు వీటి కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉంటుంది.అయితే దీర్ఘకాలికంగా ప్రతి పెట్టుబడిదారుడి పోర్ట్‌ఫోలియోలో కొంత శాతం బంగారం ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. వాటిలో ఇవి బెస్ట్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
గోల్డ్ ETFలు (Gold Exchange Traded Funds):
గోల్డ్ ETFలు స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అయ్యే బంగారం ఆధారిత పెట్టుబడి సాధనాలు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఉన్నవారు షేర్లను కొనుగోలు చేసినట్లే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇవి స్వచ్ఛమైన బంగారం ధరను అనుసరిస్తాయి. ఈ పెట్టుబడుల్లో బంగారాన్ని ఇంట్లో భద్రపరచాల్సిన అవసరం ఉండదు. స్వచ్ఛతపై ఎలాంటి సందేహం ఉండదు.
అవసరమైనప్పుడు మార్కెట్‌లో సులభంగా విక్రయించవచ్చు.మేకింగ్ ఛార్జీలు, నిల్వ ఖర్చులు ఉండవు. డిజిటల్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు:
డీమ్యాట్ అకౌంట్ లేని వారు కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్లు ప్రధానంగా గోల్డ్ ETFల్లో పెట్టుబడి పెడతాయి. ఒకేసారి పెద్ద మొత్తం లేదా నెలవారీ SIP రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉండదు. దీర్ఘకాలిక సంపద సృష్టికి అనుకూలం.
గోల్డ్ బిస్కెట్లు (Gold Bars/Biscuits):
పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు గోల్డ్ బిస్కెట్లను ఎంచుకుంటారు. ఇవి సాధారణంగా 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో ఉంటాయి. గ్రాముల నుంచి కిలోల వరకు వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం. దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఎంపిక. భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కొనుగోలు, విక్రయ సమయంలో ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు.
ఏ మార్గం బెస్ట్?
సురక్షితంగా, పారదర్శకంగా, మార్కెట్‌కు అనుసంధానమైన పెట్టుబడి కావాలంటే గోల్డ్ ETFలు మంచి ఎంపిక. ప్రతి నెల SIP ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు అనుకూలం. చేతిలో భౌతిక బంగారం ఉండాలనుకుంటే గోల్డ్ కాయిన్లు లేదా గోల్డ్ బిస్కెట్లు ఎంచుకోవచ్చు. చిన్న మొత్తాలతో డిజిటల్ రూపంలో ప్రారంభించాలనుకుంటే డిజిటల్ గోల్డ్‌ను పరిశీలించవచ్చు. అయితే దాని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం.
















జగన్ రాజకీయంలో 'ముద్రగడ' కుటుంబం!
Mudragada Family Controversy: ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన వైద్య సేవలకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై ముద్రగడ చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనమీద ఎన్నో అపవాదులు వేసుకున్నారు ముద్రగడ. కానీ పార్టీ నుంచి మాత్రం ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు సరి కదా.. ఇప్పుడు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైన భరోసా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం ముద్రగడను పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. దానిని తప్పు పట్టారు ముద్రగడ కుమార్తె క్రాంతి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రిని పరామర్శించే సమయం లేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ కు పరామర్శించే సమయం ఉంటుంది కానీ. పార్టీ కోసం పని చేసిన మా నాన్న లాంటి వారికి కనీసం సమయం కేటాయించలేరా అంటూ క్రాంతి నిలదీసినంత పని చేశారు.
* ఫ్యామిలీలో విభేదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ముద్రగడ పద్మనాభం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుటుంబంలోనే తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం ప్రయత్నం చేశారు. అయితే అది వైసిపి ప్రయోజనం కోసం పని చేసేందుకే అని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే ఆయనను దూరం పెట్టారు. దీంతో కుమారుడిని తీసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ముద్రగడ. కానీ తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమార్తె క్రాంతి మాత్రం జనసేనకు మద్దతు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం నేరుగా జనసేనలో చేరారు క్రాంతి. కానీ వైసీపీ వ్యూహాలకు లోబడి ముద్రగడ తన సొంత కుమార్తె పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.
* పరామర్శ లేదు..
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ముద్రగడను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ విషయాన్ని కుమార్తె క్రాంతి ప్రశ్నించేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ముద్రగడ కుమార్తెను తిట్టిన క్లిప్పింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముద్రగడ కుటుంబంలోనే చిచ్చుపెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి. మరోవైపు ఒక మహిళ న్యాయవాది ముద్రగడను ఆసుపత్రిలో పరామర్శిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నట్టు ప్రచారం చేసుకుంటుంది వైసిపి.
* ట్రాప్ లో పెద్దాయన..
ముద్రగడ పద్మనాభం వైసీపీ ట్రాప్ లో పడ్డారని ఇట్టే అర్థం అవుతోంది. వైసిపి కోసం పనిచేసే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని సైతం తాకట్టు పెట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు వైసీపీ రాజకీయం ఆ కుటుంబంలో కూడా కల్లోలం రేపుతోంది. ఈ సమయంలో భరోసా ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. ముద్రగడ కాకపోతే మరో కాపు నేత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ లాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఇతర కాపు నేతలు జాగ్రత్త పడితేనే మంచిది.