Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Drug Control Campaign: డేగ కళ్ళతో చూస్తున్నారు.. ఏపీ మత్తు వదిలిస్తున్నారు..

Andhra Pradesh Drug Control Campaign: డేగ కళ్ళతో చూస్తున్నారు.. ఏపీ మత్తు వదిలిస్తున్నారు..

Andhra Pradesh Drug Control Campaign: 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో మత్తు కార్యకలాపాలు జోరుగా సాగాయి. మత్తు వ్యవహారాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఆ మత్తులో యువకులు రెచ్చిపోయారు. దారుణమైన కార్యకాల పాలకు పాల్పడ్డారు. అటువంటి వారి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. అంతేకాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది. 2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో మార్పు వచ్చింది. నెమ్మదిగా మత్తు వదలడం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం డేగ కళ్ళతో మత్తు […]

Andhra Pradesh Drug Control Campaign: 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో మత్తు కార్యకలాపాలు జోరుగా సాగాయి. మత్తు వ్యవహారాలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. ఆ మత్తులో యువకులు రెచ్చిపోయారు. దారుణమైన కార్యకాల పాలకు పాల్పడ్డారు. అటువంటి వారి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. అంతేకాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది.

2024 తర్వాత ఏపీ రాష్ట్రంలో మార్పు వచ్చింది. నెమ్మదిగా మత్తు వదలడం ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం డేగ కళ్ళతో మత్తు కార్యకలాపాలకు పాల్పడే వారి మీద అత్యంత తీవ్రంగా దృష్టి పెట్టింది. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చింది. పకడ్బందీగా బృందాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ఏపీ మొత్తం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. నేడు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ నేపథ్యంలో 2024 నుంచి ఇప్పటివరకు ఏపీ రాష్ట్రం మత్తు వదిలించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం జిల్లాలో మత్తుకు కారణమయ్యే పంట సాగును పూర్తిగా నిర్మూలించింది కూటమి ప్రభుత్వం. దీనికి ఆపరేషన్ చైతన్యం అని పేరు పెట్టింది. మొత్తంగా 29, 840 ఎకరాల్లో రైతులు వేరే పంటలు పండించే విధంగా చైతన్యవంతం చేసింది. 325 కుటుంబాలకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే అవకాశం కల్పించింది

రాష్ట్రవ్యాప్తంగా 800 కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. మొత్తంగా 1.93 లక్షల మందిని తనిఖీ చేసింది. వారి వద్ద మంచి 61.8 కిలోల మత్తు పదార్థాలను.. 10 కిలోల మత్తు పదార్థాలకు సంబంధించిన విత్తనాలను.. ఏకంగా 9346 వాహనాలను స్వాధీనం చేసుకుంది.. మత్తు పదార్థాల వ్యాపారానికి పాల్పడే వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 17 కేసులలో 10.4 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఈగల్.. విజిలెన్స్.. ఎన్ ఫోర్స్ మెంట్.. మాదకద్రవ్యాల నివారణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మెడికల్ షాప్ లో మత్తు పదార్థాల అమ్మకాన్ని పూర్తిగా నియంత్రించింది. అంతేకాదు రైల్వే శాఖ తో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. రైళ్ల ద్వారా రవాణా అవుతున్న మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మత్తుపదార్థాలను రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకుంది. వారి దగ్గర నుంచి 367 కిలోల మత్తు పదార్థాలను, 2426 మత్తు పదార్థాల తో రూపొందించిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 54 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా పొగాకు రైత స్కూల్ జోన్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు మత్తు పదార్థాల నిరోధానికి.. నేరాలు అరికట్టడానికి.. బాధితుల కోసం సహాయం చేసేందుకు ప్రభుత్వం 1972 పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 897781972 పేరుతో వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper