Home Blog Page 63

జగన్ పై ధర్మాన సోదరుల అలక!

Dharmana brothers
Dharmana brothers

Dharmana Brothers: వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తాడోపేడో తేల్చుకునేందుకు ధర్మాన సోదరులు సిద్ధమయ్యారన్న ప్రచారం శ్రీకాకుళం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ పై కొద్ది నెలల కిందట సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత కుటుంబ వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తూ వచ్చారు. ధర్మాన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కూడా చాలా సందర్భాల్లో. అయితే దువ్వాడ శ్రీనివాస్ పై కేవలం సస్పెన్షన్ వేటు కాదని.. పూర్తిగా పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ధర్మాన సోదరులు పట్టుబడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. లేనిపోని వివాదాలతో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అనేది ధర్మాన సోదరుల అభిప్రాయం.

* ఎంతగానో ప్రోత్సాహం..
కేవలం దువ్వాడ శ్రీనివాస్ లో ఉన్న దూకుడు తనం చూసి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. కింజరాపు ఫ్యామిలీని నియంత్రించేందుకు వీలుగా దువ్వాడ శ్రీనివాస్ కు ప్రోత్సాహం అందించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సరే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఒకానొక దశలో మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే 2024లో పార్టీ మొత్తం ఓడిపోయింది. అప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ పై నమ్మకం పెట్టుకుని మరీ జగన్ మోహన్ రెడ్డి చాన్స్ ఇచ్చారు. కానీ జగన్ అవకాశాలు ఇవ్వడం తప్పించి దువ్వాడ శ్రీనివాస్ నెగ్గుకు రాలేకపోతున్నారు అనేది హై కమాండ్ కు నివేదికలు అందాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రభంజనం వీచినా.. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ నెగ్గుకు రాకపోవడం వెనుక ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి ఉందన్నది ఒక నివేదిక.

* వైసీపీలోకి వస్తానన్న నమ్మకం..
తన కుటుంబ వ్యవహారాలను వీధిన పడేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. లేనిపోని వివాదాల్లో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఆ పరిణామాలు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనపై చర్యలు తీసుకోలేదు. కొద్ది నెలల తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ధర్మాన సోదరులు పనిగట్టుకుని తనపై సస్పెన్షన్ వేటు వేయించారు అని ఆరోపిస్తూ వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు కూడా ఆయన తాను తిరిగి వైసిపిలోకి వస్తానని.. ధర్మాన సోదరుల పని పడతానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి నేతను శాశ్వతంగా బహిష్కరించాల్సింది పోయి ఎంటర్టైన్ చేస్తున్నారు అంటూ ధర్మాన సోదరులు ఆగ్రహంతో ఉన్నారు. తక్షణం దువ్వాడ శ్రీనివాస్ పై శాశ్వత బహిష్కరణ చేయకపోతే తాము శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చేయమని భీష్మించుకుని కూర్చున్నారట. అందుకే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ యూటర్న్ తీసుకున్నారు. కింజరాపు ఫ్యామిలీని మళ్లీ టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మరి జగన్ ధర్మాన సోదరుల ఒత్తిడికి తలొగ్గుతారా? లేదా? అన్నది చూడాలి.

లలిత జ్యువెలర్స్ గుండు కిరణ్ కు ఏమైంది.. ఎందుకిలా..

Lalitha Jewellers
Lalitha Jewellers

Lalitha Jewellers: డబ్బు ఎవరికీ ఊరికే రాదు. మా సంస్థకు ఒకసారి రండి. ఇతర సంస్థలకు ఒకసారి వెళ్లండి. ధరలు పోల్చి చూసుకోండి. ఒకే ఒక ఈ ప్రకటనతో బంగారం వ్యాపారాన్ని మొత్తం పూర్తిగా మార్చేశాడు కిరణ్ అలియాస్ గుండు కిరణ్. పోటీ సంస్థలు సెలబ్రిటీలతో ప్రకటనలు రూపొందిస్తుంటే.. ఇతడు మాత్రం తనకు తానే ప్రచారం చేసుకున్నాడు. ఫలితంగా మీడియాలో ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. గోల్డ్ బిజినెస్ లో తమిళనాడు.. మలయాళం వ్యాపారులు ఎప్పటినుంచో కింగ్ మేకర్లుగా ఉన్నారు. అయితే వారిని అధిగమించాడు కిరణ్.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

లలిత జ్యువెలర్స్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసి అనేక శాఖలు ఏర్పాటు చేశాడు. లలిత జ్యువెలర్స్ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తమిళనాడు.. కేరళ వంటి ప్రాంతాలలో శాఖలు ఉన్నాయి. వీటిల్లో భారీగానే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు గుండు కిరణ్. ఎప్పటికప్పుడు తన వ్యాపారం గురించి.. తన సంస్థ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న బంగారు ఆభరణాల గురించి ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తూ.. వీక్షకులతో పంచుకుంటాడు.

ఇటీవల కాలంలో గుండు కిరణ్ కుమార్ తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. వ్యాపారంతో పాటు విహారయాత్రలకు ప్రాధాన్యమిస్తున్నాడు. వాటిని వీడియోలుగా రూపొందించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన స్నేహితులతో కలిసి అతడు ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కుర్మా తయారు చేశాడు. చపాతీలు కూడా తయారు చేశాడు. తన స్నేహితులకు వడ్డించాడు. పైగా ఇలా కూర్మ చేసుకుని తింటే.. అందులో చపాతీలను కలుపుకొని తింటే ఎంతో బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాదు గుండు కిరణ్ కుమార్ లో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది. ఎంతైనా కిరణ్ కుమార్ రేంజ్ వేరు. ఎందుకంటే అతడు వ్యాపారం చేయగలడు.. వంట కూడా చేయగలడు.. చివరికి తన బిజినెస్ ను తనే ప్రమోట్ చేసుకోగలడు.

దువ్వాడకు వైసిపి డోర్స్ క్లోజ్!

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ సౌండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. దీంతో కొత్తూరు స్టేషన్లో ఆయన హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఏం మాట్లాడలేదు.. జనసైనికుల పై కూడా ఏ వ్యాఖ్యలు చేయలేదు. మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే నన్న అనుమానాలు ఉన్నాయి. మొన్నటి వరకు ధర్మాన బ్రదర్స్ పై కామెంట్స్ చేసిన ఆయన ఇప్పుడు కింజరాపు బాబాయ్, అబ్బాయిలను టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇదంతా జగన్ దృష్టిలో పడేందుకే నన్న టాక్ ఉంది.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* కేవలం సస్పెన్షన్ మాత్రమే..
వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ విధించింది. పూర్తిగా బహిష్కరించలేదు. ఆయన వైఖరి మారి.. పార్టీ జిల్లా నేతలతో కలిసి పనిచేస్తే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ ఆయన శృతిమించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన దూకుడు తనం నచ్చవచ్చు కానీ.. ఆయన వల్ల మిగతా జిల్లా నాయకులు దూరం కావడంతో పాటు పార్టీలో క్రమశిక్షణ లోపం వస్తుందని జగన్మోహన్ రెడ్డికి నివేదికలు వెళ్లాయి. అయితే కొద్ది రోజులు వేచి చూస్తే ధోరణి అనుసరిద్దామని జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ సామాజిక వర్గం పేరు చెప్పి పార్టీని ఇరకాటంలో పెట్టడాన్ని సహించలేకపోతున్నారు అధినేత. అందుకే ఆయనకు వైసీపీలో డోర్స్ క్లోజ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

* పట్టించుకోని సజ్జల..
దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సహకారం ఉందన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు అన్ని జిల్లాల ముఖ్య నేతల కు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రతి జిల్లాలో ప్రధాన నేతలకు ఒక వ్యతిరేక వర్గాన్ని సిద్ధం చేస్తుంటారు సజ్జల. అలా ధర్మాన సోదరులకు వ్యతిరేకంగా ఉండే దువ్వాడకు సజ్జల భరోసా ఉండేది. కానీ రోజురోజుకు దువ్వాడ వ్యవహార శైలి శృతిమిస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి సైతం సజ్జలకు కీలక ఆదేశాలు ఇచ్చారట. దువ్వాడ శ్రీనివాస్ కు డోర్స్ క్లోజ్ చేయమని సూచించారట. కనీసం దువ్వాడ ఫోన్ కు సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పాండ్ కావడం లేదు. దీంతో రాజకీయ అవకాశాలు దువ్వాడ శ్రీనివాస్ కు క్లోజ్ అయినట్టే. మరి దువ్వాడ రాజకీయాలను ఎలా చేస్తారో చూడాలి.

సిఐ నాగరాజు బలి పశువు అయ్యారా..

CI Nagaraju Arrest
CI Nagaraju Arrest

CI Nagaraju Arrest: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. ఆయనను విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసుకు సంబంధించి రోజుకొక విషయాన్ని బయటపెడుతోంది. దీనికి తోడు పేరు పోగు క్రాంతి కుమార్ కేసు కూడా తెరపైకి వచ్చింది. క్రాంతికుమార్ తండ్రి.. ఎమ్మార్పీఎస్ నాయకుడు పేరు పోగు వెంకటేశ్వరరావు విజయవాడలో విలేకరుల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. క్రాంతి కుమార్ ఆత్మహత్య వెనుక సిఐ నాగరాజు ఉన్నారని ఆరోపించారు.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

అటు సాయి కృష్ణ.. ఇటు క్రాంతికుమార్ వ్యవహారాలు సిఐ నాగరాజుకు తలపోటుగా మారాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖలో పనిచేసేవారు నాగరాజును బలి పశువును చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సిఐ నాగరాజు మీద నాలుగు రోజుల క్రితం కేసు నమోదయింది. సాయి కృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.

సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. తన కుమారుడు కనిపించడం లేదని గతంలో ఆమె డీజీపీకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు మెట్లు ఎక్కింది. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీనిని విచారించిన కోర్టు డిజిపి కి.. నోటీసులు పంపించింది. అప్పుడు పోలీస్ శాఖలో చలనం వచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో ఒక్కొక్క అంశం తెరపైకి రావడంతో సాయి కృష్ణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత దీనిని వైసిపి తన రాజకీయాల కోసం వాడుకోవడం మొదలుపెట్టింది.

సిఐ నాగరాజు మీద ఫిర్యాదు చేయడానికి సాయి కృష్ణ తల్లి వెళ్లినప్పుడు.. ఆ కంప్లైంట్ మొత్తాన్ని అక్కడ ఉన్న పోలీసులు రాసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను పట్టుకొచ్చారని.. సిఐ నాగరాజు తన కొడుకుని కొట్టాడని.. చస్తే చస్తాడు.. చచ్చిన తర్వాత శవాన్ని దహనం చేస్తూ అన్నట్టుగా తనతో మాట్లాడారని సాయి కృష్ణ తల్లి చెప్పినట్టుగా పోలీసులు కంప్లెంట్ రాశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నాగరాజును అరెస్ట్ చేసింది. వాస్తవానికి నాగరాజు సాయి కృష్ణ వ్యవహారంలో ఏం చేశారో తెలియదు కానీ.. పోలీసులు మాత్రం కావాలని నాగరాజును బలి పశువును చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటిదాకా కేసు నమోదు చేయని పోలీసులు.. కేవలం నాలుగు రోజుల క్రితమే నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేయడం విశేషం.

పాలు పోసిన ఆ బాలుడు.. అడిషనల్ డీజీపీ అయ్యాడు!

Additional DGP Madireddy Pratap
Additional DGP Madireddy Pratap

Additional DGP Madireddy Pratap: కొంతమంది ఉన్నత స్థానాలకు వెళ్తే తమ మూలాలను మరిచిపోతారు. కనీసం గుర్తు పెట్టుకోరు కూడా. మరికొందరైతే తమకు తెలియదు అన్నట్టు ఉంటారు. అందుకు భిన్నంగా ఓ పోలీసు ఉన్నతాధికారి తన మూలాలను గుర్తు చేసుకుంటూ తన స్వగ్రామానికి వెళ్లారు. ప్రాథమిక స్థాయిలో తాను పడిన కష్టాలను, చేసిన పనులను ఇష్టంగా చెప్పుకున్నారు. తనను ఈ స్థాయికి ఎదిగేలా చేసినందుకు గురుభక్తి చాటుకున్నారు. గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనే అడిషనల్ డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్. ఏపీ రోడ్డు సేఫ్టీ అధారిటీ చైర్మన్ గా, అదనపు డీజీపీ క్యాడర్ అధికారిగా ఉన్నారు. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.. ఈ సందర్భంగా తన సొంత ఊరిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఆత్మీయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అప్పటి గురువుల ఆశీస్సులను పొందారు.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* నరసరావుపేటలోనే విద్య..
మాదిరెడ్డి ప్రతాప్ సొంత గ్రామం నరసరావుపేట. 1982లో స్థానికంగా ఉన్న ఎస్కేఆర్బిఆర్ స్కూల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువులతో ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం అడిషనల్ డీజీపీ క్యాడర్ తో రహదారి భద్రత విభాగం చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే తన ఈ స్థాయికి కారణమైన గురువులను కలుసుకొని వారిని సన్మానించారు. అది కూడా పోలీసు యూనిఫామ్ తో కావడం గమనార్హం.

* చిన్ననాటి విషయాలను గుర్తు చేస్తూ..
పదవీ విరమణ చేయనున్న మాదిరెడ్డి ప్రతాప్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.. తాను నరసరావుపేటలో పుట్టి పెరిగానని.. ఈ ప్రాంతంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను కష్టపడి చదువుకొని ఐపీఎస్ అధికారిగా ఎదిగిన విషయాన్ని ప్రస్తావించారు. తన తండ్రి వ్యవసాయం చేసే వారిని.. తన తల్లి పాలు విక్రయిస్తూ తనను ఇంతటి వాడిని చేశారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా పాలు పోసే వాడినని నాట్ సంగతులను గుర్తు చేసుకున్నారు. తనకు ఉద్యోగ జీవితం ఎంతో సంతృప్తి ఇచ్చిందని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాల్లో తాను కీలక బాధ్యతలు నిర్వహించామన్నారు. హైదరాబాదులో ఐటీ పరిశ్రమకు చంద్రబాబు ఆధ్యుడు అని పేర్కొన్నారు. అమరావతికి రైతులు ఉచితంగా భూములు ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. వారి త్యాగానికి, సౌందర్యానికి విలువ కట్టలేమని చెప్పారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి ప్రతాప్ కు నరసరావుపేటలో ఆత్మీయ సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

కొడాలి నాని కి జగన్ క్లాస్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి క్లాస్ పీకారా? పార్టీలో యాక్టివ్ విషయంలో సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారా? ఇదే పరిస్థితి మరో మూడు నెలలు కొనసాగితే గుడివాడకు కొత్త ఇన్చార్జిను నియమించే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డితో కొడాలి నాని భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల గురించి చర్చించినట్లు సమాచారం. ఏమాత్రం పనితీరు బాగాలేదని.. ఇలా అయితే మార్చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. అయితే జగన్ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ ఓడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్న కొడాలి నాని నియోజకవర్గానికి అందుబాటులోకి రాకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* బిజెపిలో చేరుతారని ప్రచారం..
అయితే ఇటీవల కొడాలి నాని బిజెపిలో చేరుతారని ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగింది. మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆలయాల సందర్శనకు వెళ్లారు. అయితే అంతకుముందు కొడాలి నానిని పిలిచి జగన్ ఒక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఈసారికి గుడివాడని విడిచిపెట్టి విజయవాడ ఎంపీ కి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొడాలి నాని ఒక్కసారిగా రియాక్ట్ అయినట్లు సమాచారం. బిజెపి నేతలతో తిరగడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇస్తే.. జగన్మోహన్ రెడ్డి తన లైన్లోకి వస్తారని కొడాలి నాని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొడాలి నాని తన తమ్ముడి కుమారుడ్ని వారసుడిగా ఏకపక్షంగా ప్రకటించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టినట్లు తెలుస్తోంది.

* వంశీ పరిస్థితి వస్తుందని..
గన్నవరంలో నెలల తరబడి వల్లభనేని వంశీ మోహన్ అందుబాటులోకి రాలేదు. దానికి కారణం ఆయన నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. కనీసం గుర్తుపట్టలేని విధంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు . తనపై కూడా అనేక రకాల కేసులు ఉండడంతో వల్లభనేని వంశీ పరిస్థితి తనకు ఎదురవుతుందని కొడాలి నాని కి తెలుసు. పైగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గుడివాడలో నెగ్గుకు రావడం అంత సులువు కాదు అని కొడాలి నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన నియోజకవర్గం మొఖం చూడడం లేదని సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇటీవల పిలిపించుకొని పూర్తిగా మాట్లాడినట్లు.. మరో నెల రోజుల్లో యాక్టివ్ కాకుంటే తన నిర్ణయం తాను తీసుకుంటానని ముఖం మీద చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

జగన్ పై వైసీపీ కాపు నేతల ఆగ్రహం!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీలో కాపుల చుట్టూ వైసిపి రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ తర్వాత కాపుల చుట్టూ మరింత రాజకీయ వేడి పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులను కూటమి అన్యాయం చేస్తోంది అని ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు ముద్రగడ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతవరకు ఆయన ముద్రగడను పరామర్శించకపోవడం ఏమిటనేది వైసిపి నేతలు ప్రశ్నిస్తున్న మాట.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* జగన్ కోసం తనను తాను తగ్గించుకుని..
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం కు పేరు ఉంది. అదే సమయంలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకి. అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కల్పించారు అనేది బహిరంగ రహస్యం. ఆపై మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కూడా సవాల్ చేశారు. అలానే మార్చుకున్నారు. జగన్ కోసం తన పెద్దమనిషి తరహాను కూడా తక్కువ చేసుకున్నారు ముద్రగడ. కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయారు ముద్రగడ.

* పరామర్శించకపోవడంపై..
మొన్ననే సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడని భావించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ కాపు జాతికే ఒక ఆదర్శంగా ఉన్న ముద్రగడ పద్మనాభం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత చొరవ చూపలేదు. పైగా ముద్రగడ వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రచారం సాగింది. ఆయన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తే అనుకున్న స్థాయిలో పట్టించుకోలేదని కూడా టాక్ నడిచింది. ఈ పరిణామాలతో వైసిపి కాపు నేతల్లో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది జగన్మోహన్ రెడ్డి పై. ఒక వైపు తమ ద్వారా కాపు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు ముద్రగడ విషయంలో నిర్లక్ష్యం చేయడంపై వారు ఆవేదనతో ఉన్నారట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి..

గొర్రెలు కాస్తూ 11 ఏళ్ల క్రితం తప్పిపోయాడు.. ఇప్పుడు తారసపడ్డాడు.. ;పాపం పసివాడు సినిమా రిపీట్

Narayanpet Hanumanthu
Narayanpet Hanumanthu

Narayanpet Hanumanthu: చిన్నప్పుడు ఆడుకుంటూనో.. ఊరికి వెళ్ళినప్పుడో ఓ పిల్లాడు తప్పిపోతాడు. అతడి కోసం తల్లిదండ్రులు తీవ్రంగా వెతుకుతారు. చివరికి ఏదో ఒకచోట ఆ బాబు దొరుకుతాడు. అతడిని పోల్చుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. తమ కొడుకే అని దగ్గరికి తీసుకుంటారు. కథ సుఖాంతం అవుతుంది.. ఇలాంటి సినిమాలు చాలానే చూశాం కదా.. ఇటువంటిది రియల్ లైఫ్ లో జరగడం కష్టం కదా.. కానీ ఇతడి జీవితంలో జరిగింది. జరగడం మాత్రమే కాదు అది మొత్తం సినిమాను తలపించింది.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

అతడి పేరు హనుమంతు. ఇతడిది నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం తీప్రాస్ పల్లి. హనుమంతు తల్లిదండ్రుల పేరు బీరప్ప, అంజమ్మ. బీరప్ప అంజమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో హనుమంతు చిన్నవాడు. 11 సంవత్సరాల క్రితం హనుమంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుతుండగా ఒకరోజు హనుమంతు తప్పిపోయాడు.

ఈ విషయం గొర్రెలు మేపడానికి తీసుకెళ్లిన వ్యక్తి బీరప్ప, అంజమ్మ దంపతుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారంతా అతడి కోసం గాలించారు. బంధువుల ఇళ్ల నుంచి మొదలు పెడితే.. అన్ని గ్రామాలలో తిరిగారు. ఇంత చేసినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో హనుమంతు మీద వారు ఆశలు వదిలేసుకున్నారు. అంతేకాదు హనుమంతు తప్పిపోయాడని.. అతడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పలు ప్రాంతాలలో పోస్టర్లు అంటించారు. పోస్టర్ల కింద తమ ఫోన్ నెంబర్లు నమోదు చేశారు.

నాడు తప్పిపోయిన హనుమంతు తమిళనాడు వెళ్ళాడు. చెన్నైలోని అనాధ ఆశ్రమంలో వసతి పొందాడు. ఈ నేపథ్యంలో ఇటీవల మనసు స్వచ్ఛంద సంస్థ సభ్యులు హనుమంతు వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు ఈనెల 25న తిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో టిప్రాస్ పల్లి గ్రామానికి చెందిన నర్సింహ అనే రాజకీయ నాయకుడు.. బీరప్ప. అంజమ్మ దంపతులు చెన్నై వెళ్లారు. హనుమంతును కలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అతడిని మనసారా హత్తుకుని.. బోరున ఏడ్చారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత హనుమంతు కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో మనసు అనే స్వచ్చంద సంస్థ నిర్వాహకులకు బీరప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా, హనుమంతు తప్పిపోయిన తీరు, మళ్లీ దొరికిన విధానం అచ్చం పాపం పసివాడు సినిమాను తలపిస్తోందని తిప్రాస్ పల్లి వాసులు చెబుతున్నారు.

వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

Team India Vs Ireland
Team India Vs Ireland

Team India Vs Ireland: టి20లో టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. 2024 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఏ ఒక్క సీరీస్ కూడా టీమిండియా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు ఏ జట్టు కూడా టీమ్ ఇండియాను ఓడించలేకపోయింది. సిరీస్ అందుకోలేకపోయింది. అయితే పెద్ద పెద్ద జట్లను ఓడించిన టీమిండియా.. అసలు ఏమాత్రం లెక్కలో లేని ఐర్లాండ్ ముందు తలవంచింది.. తలవంచడమే కాదు టి20 చరిత్రలోనే చెత్త రికార్డును నమోదు చేసింది.

ఐర్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. అంతేకాదు అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. టి20 చరిత్రలోనే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రెండుసార్లు తొలి మ్యాచ్లో ఓడిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది.. ఆ తర్వాత 2026 లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2022 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు సైతం తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. కానీ రెండుసార్లు ఓటమిపాలైంది మాత్రం టీమిండియా.

టీమిండియా ఇలా దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ ప్లేయర్లే. పసికూన అని ఐర్లాండ్ జట్టును టీమిండియా ప్లేయర్లు తేలికగా తీసుకున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా ఓడిపోవడానికి ప్రసిద్, వాషింగ్టన్ సుందర్ అని అభిమానులు మండిపడుతున్నారు. 16, 17 ఓవర్లలో వీరిద్దరూ ఏకంగా 46 పరుగులు ఇచ్చారు. దీనివల్ల ఐర్లాండ్ స్కోర్ 118 నుంచి 164 కు చేరింది. దీనికి తోడు శివం దుబే.. అభిషేక్ శర్మ.. వాషింగ్టన్ సుందర్ ఐర్లాండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్ లు నేలపాలు చేశారు. మరోవైపు టాపార్డర్ కూడా దారుణంగా ఆడింది ఏడుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఇలా ఆటగాళ్లు మొత్తం అత్యంత చెత్త ప్రదర్శన చేయడంతో ఐర్లాండ్ ముందు తలవంచుకోవలసి వచ్చింది.

ఒకవేళ ప్రసిద్ స్థానంలో వైభవ్ సూర్య వంశీని ఆడించి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సూర్యవంశీని ఆడించకుండా అతడిని డ్రింక్స్ బాయ్పా త్రకు పరిమితం చేశారని అభిమానులు విమర్శిస్తున్నారు. గౌతమ్ గంభీర్ నెత్తి మాసిన ప్రయోగాలు చేస్తున్నాడని.. దీనివల్ల టీమిండియా ఓడిపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ ముందు టీమిండియా లోపాలు ఇలా బయటపడితే.. ఇంగ్లీష్ జట్టు మీద సిరీస్ ఎలా గెలుస్తుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రెండో మ్యాచ్లో మేనేజ్మెంట్ ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూడాల్సి ఉంది.

శ్రీలక్ష్మీ లక్కీ.. ఇలాంటి ఛాన్స్ ఏ ఐఏఎస్ కు రాదంతే..

Srilakshmi IAS
Srilakshmi IAS

Srilakshmi IAS: భారతదేశంలో బ్యూరోక్రసీ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకుంటే అస్సలు పాలన నడవదు. అటువంటి అధికార గణం ఇప్పుడు రాజకీయ చట్రంలో ఇరుక్కుపోతోంది. వారి అడుగులకు మడుగులు ఒత్తి తమ కెరీర్ కి మాయని మచ్చ తెచ్చుకుంటున్నారు చాలామంది. అటువంటి వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ ఒకరు. ఈనెల 30న ఆమె పదవి విరమణ చేయనున్నారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేయాల్సిన శ్రీలక్ష్మి.. ఒక సాధారణ అధికారిణి గానే పదవీ విరమణ చేస్తుండడం నిజంగా దురదృష్టకరం. ఆమె స్వయంకృతాపం కూడా. అది కూడా పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు ఆమెపై ఉన్న సస్పెన్షన్ తొలగించడం ఉపశమనం కలిగించే విషయం.

Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

* అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు..
శ్రీ లక్ష్మీ మాదిరిగానే ఈ రాష్ట్రానికి డిజిపిగా వ్యవహరించాల్సిన ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సాధారణ పోస్టులోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయనను వెంటాడింది. వేటాడినంత పని చేసింది. కానీ తాను ఏ తప్పు చేయలేదని భావించిన వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ తెచ్చుకొని అదే రోజు రిటైర్ అయ్యారు. ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేశారు. కానీ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు. సస్పెన్షన్ లోనే రిటైర్ కాబోతున్నారు. అంతలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇప్పటికీ వారు వైసీపీ వీర విధేయత చాటుకుంటున్నారు.

* మానవతా దృక్పథంతో..
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు శ్రీలక్ష్మి. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె నిందితురాలు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ఇదంతా ఎవరికోసమో అనేది అందరికీ తెలుసు. పైగా 2019 నుంచి 2024 మధ్య ఏపీకి అధికారిగా వచ్చిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జూన్ పది నుంచి ఎలాంటి పోస్టింగ్ లేకుండా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో గడిపారు. కానీ ఆమె విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించింది కూటమి ప్రభుత్వం. ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ లో లేని ఏ అధికారికైనా.. రిటైర్మెంట్ అయ్యేలోపు ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి.. గౌరవప్రదంగా రిటైర్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఆమెకు సాంకేతికంగా ఒక పోస్టింగ్ ఇచ్చి పదవీ విరమణకు అనుమతి ఇచ్చింది. దీంతో వివాదాలు ఉన్నప్పటికీ శ్రీలక్ష్మి గౌరవప్రదమైన రిటైర్మెంట్ దక్కించుకున్నట్లు అయింది.

* వారిద్దరికీ నో ఛాన్స్..
జగన్ సర్కార్ హయాంలో ఐపీఎస్ అధికారులుగా ఉన్న పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులపై అనేక రకాల కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా ఉంటూ రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది పీవీ సునీల్ కుమార్ పై ఉన్న ఆరోపణ. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. కానీ ఈయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సస్పెన్షన్ లోనే ఈయన రిటైర్ కానున్నారు. అదే జరిగితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అటు వివాదాస్పద ఐపిఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయుల పరిస్థితి కూడా అదే. ముంబై నటి కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఈయన ఆగస్టు లో పదవీ విరమణ చేయనున్నారు. పీవీ సునీల్ కుమార్ మాదిరిగానే సీతారామాంజనేయులు పై కూడా సస్పెన్షన్ లో ఉంచి రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం న్యాయస్థానానికి వెళ్లి ఉపశమనం పొందవచ్చు తమ తప్పు లేదని భావిస్తే. కానీ వీరు వెళ్ళకపోవడం మాత్రం గమనించదగ్గ విషయం.

ఈ రాశుల వారికి ఈరోజు డబ్బే డబ్బు..

Today 27 June 2026 Horoscope
Today 27 June 2026 Horoscope

Today 27 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండడంతో అనుకున్న పలితాలు పొందుతారు. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో అధిక లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈరోజు శ్రీనివాసుడి ఆశీస్సులు ఉంటాయి. దీంతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకున్న దానికంటే ఈరోజు ఎక్కువగా లాభాను పొందే అవకాశం ఉంటుంది. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. కురుమ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈరోజు అధిక లాభాలు పొందుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా అధికారంలో నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉండడంతో లాభాలు పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. సొంత వాహనాలపై ప్రయాణం చేయకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అపారమైన అవకాశాలు అందుతాయి. ప్రణాళికల ద్వారా ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. గతంలో ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

సాయికృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్ : సీఐ నాగరాజుతోపాటు ఆ ముగ్గురు..

Sai Krishna Case
Sai Krishna Case

Sai Krishna Case: ఏపీలోనే సంచలనం సృష్టిస్తోంది సాయి కృష్ణ లాకప్ డె*త్ మిస్టరీ. తొలుత అదృశ్యం కేసుగా పోలీసులు భావించారు. ఆ దిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి కృష్ణ ఇప్పటికే మరణించాడని.. కస్టోడియల్ టార్చర్ పెట్టి చంపేశారని.. లాకప్ డె*త్ అని కేసు విచారణ చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తన చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసే క్రమంలో కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అందులో కస్టోడియల్ టార్చర్ అని తేల్చుతూ ఈ అంశాన్ని బయటపెట్టింది.

Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

* ఏ కేసులో స్పష్టత లేదు..
అయితే సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్లో సాయి కృష్ణ మరణాన్ని ధ్రువీకరించింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో సాయి కృష్ణ అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజుకు అప్పగించారు అని స్పష్టం చేసింది. కానీ అది ఏ కేసులో అని చెప్పడం లేదు. అసలు జగ్గయ్యపేట కేసులో అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఓ ల్యాండ్ డీల్ అంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. కానీ ఏ కేసులో సాయి కృష్ణను అదుపులో తీసుకున్నారు అనేది మాత్రం బయటపడడం లేదు. ఈ కేసు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ 20 కి పైగా కేసులు ఉన్నాయి సాయి కృష్ణ పై అని మాత్రం టాక్ నడుస్తోంది. సీఐ నాగరాజు కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేయవలసి వచ్చింది.. ఏ కేసులో చేయవలసి వచ్చింది అనేది మాత్రం చెప్పడం లేదు సిట్.

* ప్రైవేట్ వ్యక్తి పేరు..
అయితే సాయి కృష్ణ కస్ట్టోడియల్ టార్చర్ విషయంలో ఒక ప్రైవేటు వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ప్రధానంగా నిందితుడు సిఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సాయం చేశారని.. సీఐ స్నేహితుడు కూడా ఇందులో పాలుపంచుకున్నారు అనేది సీట్ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పరారీలో ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే సీఐ నాగరాజు స్నేహితుడు కూడా స్టేషన్కు వచ్చి పాల్గొన్నారని తెలియడం మాత్రం కొత్త మలుపు కనిపిస్తోంది. ఏదైనా సీఐ నాగరాజుకు ఆబ్లికేషన్ కేసులో సాయి కృష్ణ ఉన్నాడా? అసలు జగ్గయ్యపేట కేసుతో సిఐ నాగరాజు ప్రమేయం ఎందుకు? ఇలాంటి చిక్కుముడులు ఇంకా కొనసాగుతున్నాయి. అవి కొలిక్కి వస్తే కానీ.. ఈ కేసు మిస్టరీ వీడదు.

ముద్రగడకు క్యాన్సర్.. ఆందోళనలో అభిమానులు.. పరిస్థితి ఎలా ఉందంటే?

Mudragada Health
Mudragada Health

Mudragada Health: ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. గతంలో కూడా అనారోగ్యానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి సహాయంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఆయన వైద్య సేవలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరు పరామర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదు. అయితే దీని పైనే విమర్శలు వచ్చాయి. తన తండ్రి సేవలను వినియోగించుకున్న జగన్ ఆయనను చూడడానికి రాకపోవడాన్ని తప్పుపట్టారు ముద్రగడ కుమార్తె క్రాంతి. అయితే రోజురోజుకు ముద్రగడ ఆరోగ్యం పై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన ఏ రుగ్మతతో బాధపడుతున్నారు అనేది తెలియలేదు.

Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

* వయోభారం అనుకున్నారు..
అయితే ఇప్పుడు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి తీవ్రతరం అవుతున్న విషయం తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. అయితే అంత వయోభారంతో అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు ఏడుపదుల వయసు దాటింది. చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డితో సమకాలీకుడు. 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. వారితో పాటే అసెంబ్లీలో అడుగు పెట్టారు.

* హైదరాబాదులో చికిత్స..
అయితే అంతా వయోభారం అనుకున్నారు. గుండె సంబంధిత రుగ్మత అని భావించారు. కానీ ముద్రగడ మాత్రం క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్న మధ్యన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయనను చేర్పించగా.. వైద్య సేవల కోసం ఆర్థికపరమైన ఇబ్బందులతో మరో ఆసుపత్రికి మార్చినట్లు వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం పై కూడా విమర్శలు వచ్చాయి. గంజాయి బ్యాచ్ ను పరామర్శించడానికి సమయం ఉంది కానీ.. మా నాన్నగారిని పరామర్శించేందుకు టైం లేదా అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రశ్నించారు. ఈ తరుణంలో ముద్రగడ తన కుమార్తెను ఉద్దేశించి మాట్లాడిన పాత వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ముద్రగడ పరిస్థితి క్షీణిస్తోందని.. ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తుండడం మాత్రం చాలా బాధాకరం.

భూకంప వెనుజువెలాకు భారత్ గొప్ప సాయం..

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: భూకంపం వల్ల తీవ్ర సంకటంలో చిక్కుకున్న వెనెజువెలా ప్రజలకు భారతదేశం వెంటనే మద్దతు అందించింది. ఈ చర్య ద్వారా భారత్‌ తన మానవతా విలువలను మరోసారి ప్రపంచానికి చాటింది. వెనెజువెలాలో సంభవించిన భూకంపం కారణంగా దేశంలో తీవ్రమైన నష్టం జరిగింది. ప్రజల జీవితాలు కష్టతరమయ్యాయి. ఆసుపత్రులు, నివాసాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో తక్షణ వైద్య సహాయం, ఆహారం, మందులు వంటి అవసరాలు అత్యంత ముఖ్యమైనవి. అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అవసరం ఎంతో ఉంది.

Also Read: వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్ ఇక మారడా..

భారతదేశం అందించిన సహాయం..
ఈ విపత్కర పరిస్థితిలో భారత్‌ రెండు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాల ద్వారా మానవతా సాయం పంపింది. ఈ సాయంలో ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఫీల్డ్‌ హాస్పిటల్‌ యూనిట్‌ ఉంది. దీంతోపాటు 35 టన్నుల నిత్యావసర వస్తువులు, మందులు, వైద్య పరికరాలు కూడా ఉన్నాయి. ఈ సాయం వల్ల వెనిజులా ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీల్డ్‌ హాస్పిటల్‌ యూనిట్‌ అక్కడి ప్రజలకు నేరుగా చికిత్స అందించడానికి సహాయపడుతుంది. భారత్‌ ఈ చర్య ద్వారా వెనెజువెలా ప్రజల పక్షాన నిలబడి, సంకట కాలంలో అండగా ఉందని స్పష్టం చేసింది.

విదేశాంగ మంత్రి సందేశం..
విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఈ సాయం గురించి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ, కష్ట సమయంలో వెనెజువెలా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్రకటన భారత్‌ యొక్క మానవతా దౌత్య విధానాన్ని మరింత స్పష్టం చేసింది.

భారతదేశం ఈ సాయం ద్వారా తన విదేశాంగ విధానంలో మానవత్వం ఎంత ముఖ్యమైన స్థానం ఆక్రమించిందో చూపించింది. ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ తత్వం ఆధారంగా, భారత్‌ ఎప్పుడూ ప్రపంచంలో ఎక్కడైనా సహజ విపత్తులు జరిగినప్పుడు త్వరగా స్పందిస్తుంది. నేపాల్, ఇండోనేషియా, టర్కీ వంటి దేశాల్లో గతంలో కూడా ఇలాంటి సాయాలు అందించింది. ఈ చర్య వల్ల వెనిజులాతో భారతదేశ సంబంధాలు మరింత బలపడతాయి. చమురు, వాణిజ్యం వంటి రంగాల్లో ఇప్పటికే ఉన్న సంబంధాలు, ఇప్పుడు మానవతా సహకారంతో మరింత లోతుగా మారతాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ సాఫ్ట్‌ పవర్‌ పెరుగుతుంది. దక్షిణ దేశాల సంఘీభావాన్ని బలపరిచే ఈ చర్యలు, ప్రపంచ శాంతి, సహకారానికి దోహదపడతాయి. భారత్‌ ఇలాంటి సాయాల ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇస్తోంది. సంకట సమయంలో దేశాల మధ్య సరిహద్దులు లేని మానవత్వం మాత్రమే ముఖ్యం. ఈ చర్య వెనెజువెలా ప్రజలకు ఆశను కలిగించడమే కాకుండా, భారతదేశం బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరసత్వాన్ని నిరూపిస్తోంది.

పాపం శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్ గా ఫస్ట్ మ్యాచ్ లోనే పసికూనపై ఓటమి.. ఏం జరగనుంది..

India vs Ireland
India vs Ireland

India vs Ireland: ఐర్లాండ్ జట్టుతో మ్యాచ్.. టీమిండియా గెలుపు మీద ఎవరికి అనుమానాలు లేవు. పైగా అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే శివం దుబే వరకు భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఐర్లాండ్ జట్టుకు వారి సొంత దేశంలోనే చుక్కలు తప్పవని టీమిండియా అభిమానులు ఒక అంచనాకు వచ్చారు.. కానీ వారి అంచనాలు తప్పని ఐర్లాండ్ ప్లేయర్లు నిరూపించారు. బలమైన టీం ఇండియాను.. అదికూడా టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీం ఇండియాను.. ఇటీవల టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియాను ఓడించారు.

Also Read: వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్ ఇక మారడా.

ఐర్లాండ్ సాధించిన గెలుపు చిన్నది ఏం కాదు. వారు ఆషామాషిగా ఆడలేదు. బ్యాటింగ్ బాగా చేశారు. బౌలింగ్ బాగా వేశారు. ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. టీమిండియాలో అభిషేక్ శర్మ 50.. శివమ్ దుబే 25 మినహా మిగతా ప్లేయర్లు దారుణంగా ఆడారు.. సంజు శాంసన్ 5, ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ అయ్యర్ 3, వాషింగ్టన్ సుందర్ 9.. హర్షిత్ రానా 8, అర్ష్ దీప్ సింగ్ రెండు పరుగులు మాత్రమే చేశారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం అత్యంత దారుణం.

అయ్యర్ కు ఇది సారధిగా తొలి మ్యాచ్. వాస్తవానికి అతడు మ్యాచ్లో అదరగొడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 7 బంతులు మాత్రమే ఎదుర్కొని మూడు పరుగులు చేశాడు. అది కూడా అతి కష్టంగా.. ఇషాన్ కిషన్ అయితే ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సంజు కూడా నాలుగు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందర్ 12 బంతులు ఎదుర్కొని మరీ దారుణంగా 9 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ నిలబడతాడు అనుకుంటే.. అతడు కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.

టీమిండియా ఇలా ఆట తీరు కొనసాగించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐర్లాండ్ జట్టు పకడ్బందీగా ఆట తీరు కొనసాగించడం.. మ్యాచ్ కు ముందే ఐర్లాండ్ కెప్టెన్ టకార్.. తమకంటూ గేమ్ ప్లాన్ ఉందని చెప్పడం.. దానిని అమలులో పెట్టడం విశేషం. అందువల్లే టీం ఇండియా దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. టి20 క్రికెట్లో గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం ప్రారంభంలోనే వికటించింది.

సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టడం.. అయ్యర్ కు చోటు ఇవ్వడం.. ఐర్లాండ్ లాంటి అనామక జట్టు మీద ఓడిపోవడం.. వాటి పరిణామాలు సగటు భారతీయ అభిమానిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఓటమి ఇక్కడితోనే ఆగిపోతే సరిపోతుంది. ఇకపై కూడా కొనసాగితే గంభీర్ ను ఏ టీమ్ ఇండియా అభిమాని కూడా క్షమించడు. ఎందుకంటే అతడు చేసిన ప్రయోగం ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో దారుణంగా విఫలమైంది.. టి20 క్రికెట్ లో కూడా విఫలమైతే గంభీర్ త్వరలోనే అన్ని సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది.

నిన్న వెనుజువెలా.. నేడు జపాన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్.. వరుస భూకంపాలు.. యుగాంతమేనా..

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: వెనుజువెలా దేశంలో తీవ్రమైన భూకంపం చోటుచేసుకుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. దీనిని మర్చిపోకముందే జపాన్.. ఫిలిప్పీన్స్.. పాకిస్తాన్ దేశంలో వరుసగా భూకంపాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు వెనుజువెలా మాదిరిగా ఇక్కడ ఆస్తి నష్టం.. ప్రాణం నష్టం జరగలేదు.

వరుసగా భూకంపాలు రోజుల వ్యవధిలో చోటు చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి అకస్మాత్తుగా ప్రకంపనలకు గురికావడం.. భవనాలు నేలకూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణనష్టం.. ఆస్తి నష్టం సంభవిస్తోంది.. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరగడంతో నష్ట నివారణ చర్యలకు ఆస్కారం ఏర్పడటం లేదు. భూమి లోపల టెక్టోనియస్ ప్లేట్లల్లో ఆకస్మాత్తుగా కదలికలు.. ప్రకంపనలు ఏర్పడటం వల్ల భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెనుజువెలా ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం భూమికి 27 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో నష్టం అధికంగా ఉంది. అయితే పాకిస్తాన్, జపాన్, ఫిలిప్పిన్స్ ప్రాంతంలో వరుసగా ప్రకంపనలు ఏర్పడటం.. ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. భూమికి 29 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. సరిగ్గా కొద్ది వారాల క్రితం ఇక్కడ భూకంపం చోటుచేసుకుంది. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

జపాన్ దేశంలో భూకంపాలు సహజం. పాకిస్తాన్లో కూడా భూకంపాలు గతంలో అనేక సందర్భాలలో చోటుచేసుకున్నాయి. జపాన్ దేశంలో ఇవాటే ప్రీఫక్చర్ తీరంలో 6.9 నుంచి 7.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఇది సముద్రమట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉంది. టోక్యో నుంచి మొదలు పెడితే హోమ్షూ ద్వీపం వరకు ప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే ఈ స్థాయిలో భూకంపం ఏర్పడినప్పటికీ సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదు.

పాకిస్తాన్ దేశంలో 5.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కూడా ఇటువంటి నష్టాలకు సంబంధించిన వార్తలు రాలేదు. బలుచిస్తాన్ నుంచి మొదలుపెడితే గిల్గిత్ బాల్టిస్తాన్ వరకు భూకంపం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. వరుసగా ఇటువంటి విపత్తులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో యుగాంతం తప్పదా అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

'నా చెయ్యి.. నా ఇష్టం' అంటే చేతులు విరగ్గొడతా - సింగర్ సునీత

Singer Sunitha
Singer Sunitha

Singer Sunitha: ఈమధ్య కాలం లో హీరోయిన్లు , స్త్రీలు ధరించే దుస్తులపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. శివాజీ హీరోయిన్స్ దుస్తుల పై చేసిన కామెంట్స్ దగ్గర నుండి ఈ ప్రస్తావన మొదలైంది. అక్కడి నుండి , ఇప్పటి వరకు ఎదో ఒక సందర్భంలో ఈ అంశం పై చర్చలు నడుస్తూనే ఉన్నాయి, ప్రముఖ స్థానాల్లో ఉన్న ప్రతీ సెలబ్రిటీ ఈ అంశం పై స్పందించారు. వారిలో రీసెంట్ గా సింగర్ సునీత కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ‘నా దుస్తులు నా ఇష్టం అని కొంతమంది అంటున్నారు. అప్పుడు చూసేవాళ్లు కళ్ళు కూడా మా ఇష్టం , మా కళ్ళు అంటారు కదా’ అని సునీత చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి.

ఒక స్త్రీ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేసావు? అంటూ ఆమె పై తీవ్రమైన విమర్శలు చేశారు. కొంతమంది అయితే హద్దులు దాటి ‘నా చెయ్యి ..నా ఇష్టం, ఎక్కడైనా చేతులు వేసుకోవచ్చా?’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సింగర్ సునీత కాసేపటి క్రితమే తీవ్రమైన కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను మాట్లాడే మాటలు మిస్ లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. ‘నా శరీరం ..నా ఇష్టం’ అనే స్లోగన్ అర్థం నాకు బాగా తెలుసు. దాని అర్థం ఒకరి కంట్రోల్ లో ఉండకోవడం , స్వతంత్ర భావాలు ఉన్న నేను , నా శరీరం నా ఇష్టం అని అన్నాను. చూసేవాళ్ళు నా కళ్ళు నా ఇష్టం అనుకుంటారు అన్నది , సమాజం లో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి , వాళ్ళ గురించే నేను చెప్పాను. అంతే కానీ నా చెయ్యి , నా ఇష్టం అని ఎవరైనా అంటే , వాళ్ళ చేతులు విరగ్గొట్టడానికి ముందుండే వారిలో నేను ఒకరిని. కాబట్టి నా మాటలను వక్రీకరించండి , పూర్తిగా వీడియోలను చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది సింగర్ సునీత. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.