Home Blog Page 62

ఓ సాధారణ పెయింటర్.. కర్ణాటక వచ్చాడు.. పోలీసులు పట్టుకొని విచారిస్తే.. పాక్ తో సంబంధాలు..

Mohammad Suhail
Mohammad Suhail

Mohammad Suhail: అతడు ఓ సాధారణ పెయింటర్. ఇతడిది ఉత్తరప్రదేశ్. కర్ణాటక వచ్చాడు. కర్ణాటక రాష్ట్రంలోని దావనగరే ప్రాంతంలో పెయింటింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని జీవిస్తున్నాడు. రోజు పనికి వెళ్లడం.. సాయంత్రం తన గదికి రావడం.. స్నానం చేయడం.. భోజనం చేయడం.. ఇవే అతడి దినచర్య. చుట్టుపక్కల వారికి కూడా సన్నిహితుడిగా మారిపోయాడు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ పోయేవాడు.

దావనగిరే ప్రాంతంలో అతడు ఓ రోజు పెయింట్ వేస్తుండగా.. ఒక్కసారిగా అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ స్థాయిలో రావడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. అక్కడితో ఒకసారి పోలీసులు రావడంతో స్థానికులు కూడా ఆందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రత్యేకమైన వాహనాలలో తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు వెల్లడించిన వివరాలు యావత్ దేశాన్నే నివ్వెర పరిచాయి.

పోలీసులు అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి పేరు మహమ్మద్ సుహేల్.. ఇతడికి పాతిక సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతడు ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్ పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ పరిధిలో లక్నౌటి గ్రామం. ఇతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. వాస్తవానికి పెయింటింగ్ అనేది బయటికి చూపించే ఎక్స్పోజర్ మాత్రమే. ఇతడు ఒక కరుడుగట్టిన తీవ్రవాది. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని బాంబుతో పేల్చి వేస్తానని ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక్కడికి రాడికల్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆన్లైన్ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులతో ఇతడికి సంబంధం ఉంది. వారితో నిత్యం వాట్సాప్ చాట్ చేస్తున్నాడు. ఆయుధాల గురించి కూడా చర్చిస్తున్నాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.

సుహేల్ తో పాటు దావనగరే ప్రాంతానికి చెందిన జమీల్ ఖాన్, తమకూరు ప్రాంతాన్ని చెందిన అల్లా బక్ష్ అనే ఇద్దరు యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా వీరి కదలికల మీద ఉగ్రవాద నిరోధక పోలీసు బృందాలు దృష్టిపెట్టాయి. వీరు బయట కనిపించే విధానం.. అంతర్గతంగా దేశంలో కుట్రలు చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు.. ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. పకడ్బందీ ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకొని జైలుకు తరలించారు.. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే వారి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలని.. అటువంటివారిని గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు.

సాయి కృష్ణ కేసులో మలుపు..కీలక ఆదేశాలు!

Sai Krishna Case
Sai Krishna Case

Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు. మృతి పై ఎన్ హెచ్ ఆర్ సి కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డిజిపితో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్రమంగా అపహరించారని.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసారని.. ఆ కారణంగా ఆయన మరణించారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్ళింది. దీనిపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో డిజిపి తో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీనిపై.

అదృశ్యం కాస్త.. కస్టోడియల్ టార్చర్..
హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై. తొలుత అదృశ్యం కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగింది. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తే తక్షణం సాయి కృష్ణను కోర్టులో హాజరు పరచాలని గడువు విధించారు కూడా. కానీ ఇంతలో ఈ ఘటన తీవ్రత పెరగడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసింది. రిమాండ్ రిపోర్టును ఇచ్చే క్రమంలో నాగరాజును కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారని స్పష్టం చేసింది. దీంతో సాయి కృష్ణ చనిపోయాడని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లింది. ఈ నేరాన్ని దాచేందుకు కొందరు పోలీస్ అధికారులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్మశానానికి తీసుకెళ్లి.. కాల్చి అవశేషాలను నదిలో కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు తో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతరులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని.. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

తీవ్ర స్పందన..
ఈ ఫిర్యాదు పై తీవ్రంగా స్పందించింది మానవ హక్కుల కమిషన్. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, కస్టోడియల్ డెత్.. రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత విలువైన జీవించే హక్కు పై ప్రత్యక్ష, ఘోరమైన దాడిగా అభిప్రాయపడింది. పోలీసులపై వచ్చిన ఆరోపణలు, అధికార దుర్వినియోగం, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలపై నమ్మకం కోల్పోవడానికి ప్రతి పంపిస్తున్నాయని.. సంరక్షకులే కుట్ర దారులు అయ్యారని తీవ్రంగా ఆక్షేపించింది మానవ హక్కుల కమిషన్. అందుకే సాయి కృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, మరణం, మృతదేహం తరలింపునకు బాధ్యులైన పోలీస్ అధికారులు వివరణ చెప్పాలని స్పష్టం చేసింది.

పుతిన్‌పై భారతీయుల నమ్మకం.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత!

Vladimir Putin
Vladimir Putin

Vladimir Putin: డొనాల్డ్‌ ట్రంప్‌.. వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఇద్దరు ప్రపంచంలో అగ్ర నాయకులు. భారత్‌కు ఇద్దరూ కావాల్సిన వారే. రష్యాతో భారత్‌కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య, సైనిక సహకారం కొనసాగుతోంది. ఇక అమెరికాతో మాత్రం సంబంధాలు భిన్నంగా ఉంటున్నాయి. దశాబ్దకాలంగా మెరుగు పడుతున్నాయి. అయితే అధ్యక్షుడిని బట్టి సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్యూరీ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన తాజా అంతర్జాతీయ సర్వేలో భారతీయులు ప్రపంచ వ్యవహారాలను నిర్వహించడంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఎక్కువ విశ్వాసం చూపించారు. 36 దేశాల్లో 42 వేల మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 51 శాతం మంది పుతిన్‌ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇలాంటి విశ్వాసం 39 శాతం మందికి మాత్రమే ఉంది. గత సంవత్సరం ట్రంప్‌కు భారతదేశంలో 51 శాతం మద్దతు ఉండగా, ఇప్పుడు అది గణనీయంగా తగ్గింది.

ట్రంప్‌ విధానాలపై భిన్నాభిప్రాయాలు..
ట్రంప్‌ గ్రాఫ్‌ పడిపోవడానికి ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే ప్రధాన కారణంగా సర్వే తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య సుంకాలు, వెనిజువెలా, ఇరాన్‌ సంక్షోభాల నిర్వహణపై మెజారిటీ భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కేవలం 32 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. యూఎస్‌ఏఐడీ వంటి సహాయక సంస్థల మూసివేత, గాజా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాల పరిష్కార విధానం కూడా భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి.

ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ రేటింగ్స్‌..
భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని 16 దేశాల్లో ట్రంప్‌ ప్రజాభిప్రాయం భారీగా పడిపోయింది. మొత్తం సర్వేలో పాల్గొన్నవారిలో 76 శాతం మంది ట్రంప్‌ నాయకత్వంపై ఎలాంటి నమ్మకం లేదని స్పష్టం చేశారు. కేవలం 23 శాతం మంది మాత్రమే ఆయనను సమర్థించారు. జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాలు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ట్రంప్‌కు అత్యల్ప రేటింగ్స్‌ వచ్చాయి. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం 66 శాతం మంది ట్రంప్‌ నిర్ణయాలను సానుకూలంగా స్వీకరించారు.

ఈ సర్వే ఫలితాలు అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం స్వతంత్ర స్థానాన్ని సూచిస్తున్నాయి. పుతిన్‌పై ఎక్కువ నమ్మకం వ్యక్తమవడం భారత్‌–రష్యా సంబంధాలను మరింత బలపరచవచ్చు. అదే సమయంలో ట్రంప్‌ విధానాలపై అసంతృప్తి భారత్‌–అమెరికా సంబంధాల్లో కొన్ని సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ నాయకత్వంపై నిరాశ బలంగా ఉండటం ఆయన విదేశాంగ విధానాలకు గట్టి సవాలుగా మారింది.

చిరంజీవి - బాలయ్య మధ్య పోటీ ఇప్పటికీ తగ్గట్లేదుగా..

Chiranjeevi Vs Balakrishna
Chiranjeevi Vs Balakrishna

Chiranjeevi Vs Balakrishna: కొంతమంది స్టార్ హీరోల మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటూనే వస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ ల మధ్య పోటీ అనేది గత 50 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంది అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు ఒకరి మీద ఒకరు పై చేయి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. రాబోయే సినిమాలతో కూడా భారీ పోటీ అయితే పెట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎంతోమంది వచ్చిన టైర్ వన్ హీరోలు సైతం పాన్ ఇండియాలో సంచలనాలను క్రియేట్ చేస్తున్నప్పటికి ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ మాత్రం తప్పడం లేదు.

వీళ్ళ సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే చాలు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం అయితే కలుగుతుంది. ఇక ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు డౌన్ అయిపోతారు అనే దాని మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య బాబుని చాలాసార్లు డామినేట్ చేస్తూ వచ్చాడు.

కొన్ని సందర్భాల్లో బాలయ్య కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేస్తూ చిరంజీవిని డామినేట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంటే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు మంచి సినిమాలను చేయాలి. అలాగే వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికి అది పర్సనల్గా కాకుండా సినిమాల పరంగా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

ఇక ఇప్పటివరకు మాస్ లో ఎవ్వరికి రాని గుర్తింపు వీళ్ళిద్దరు చేసిన సినిమాలతో తెచ్చుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం…కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారే సాటి అంటూ వాళ్ళ అభిమానుల్లో భారీ గుర్తింపునైతే తెచ్చుకున్నారు…ఇలాంటి హీరోలు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఆ పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే…

లైవ్ లో ఎఫైర్ల గోల బయటపెట్టిన ప్రముఖ నటుడు, ఆయన భార్య.. వైరల్ వీడియో..

Actor Affair Viral Video
Actor Affair Viral Video

Actor Wife Affair Viral Video: సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగిన అదొక పెను సంచలనంగానే మారుతుంది. సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాల్లో చిన్న చితక పాత్రలను చేస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ ఆచంట…ఈయన రంగస్థలం సినిమాతో గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు. నటుడిగా తనలోని పూర్తి స్థాయి యాక్టర్ ను బయటికి తీసిన సినిమా కూడా అదే కావడం విశేషం…

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన తన భార్య తో గొడవ పెట్టుకొని ఆ పంచాయతీ తెంపుకోవడానికి ప్రముఖ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు. ఇక లైవ్ లోనే ఆయన తన భార్యను బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. తన ఎఫైర్స్ గురించి చర్చిస్తున్నారు. తన భార్య సైతం తనకు లగ్జరీ లైఫ్ ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే తన భర్తకి విడాకులు ఇవ్వబోతున్నాను అంటూ ఆమె చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక చూసేవారు ఇదంతా నిజంగానే జరుగుతుందా అనేంత రేంజ్ లో స్క్రీన్ మీద నటించి మెప్పించారు. నిజానికి ఇది చాయ్ షాట్స్ ఆప్ వారు క్రియేట్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో డి ఫర్ డివోర్స్ అనే ఒక షార్ట్ సిరీస్ కోసం దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా దీనిమీద మహేష్ ఆచంట సైతం క్లారిటి ఇస్తానని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా తమ షార్ట్ సిరీస్ కి మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతోనే దీనిని ప్రమోషనల్ వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

దీనిమీద చాయ్ షార్ట్స్ యాజమాన్యం ఎలా స్పందిస్తారు. ప్రమోషనల్ గా వాడుకున్న వీడియో ఇంత వైరల్ అవ్వడంతో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదంతా చూసిన జనాలు మాత్రం ఈ రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రమోషన్స్ చేస్తూ వల్ల కంటెంట్ మీద హైప్ పెంచుతున్నారు…

 

View this post on Instagram

 

A post shared by Mahesh Achanta (@mahesh_achanta)

66 ఏళ్ల వయసులో ఆ ఘాటు రోమాన్స్ ఏంటి స్టార్ హీరో..?

Star Hero
Star Hero

Star Hero: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కంప్లీట్ యాక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్… ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు ఎవరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆచితూచి మరి అడుగులు ముందుకు వేస్తున్నాడు. 66 సంవత్సరాల వయసులో ఉన్న మోహన్ లాల్ సినిమాలో యాక్టింగ్ చేయడమే కాకుండా లైవ్ లో డాన్స్ లు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

జర్మనీలో జరిగిన ఒక ఈవెంట్లో భాగంగా మోహన్ లాల్ తెలుగు సినిమాలోని ఒక పాట మీద డాన్స్ చేశాడు. ఇక దాంతోపాటుగా బాహుబలి సినిమాలోని మనోహరి సాంగ్ కు కూడా అతను ఆడి పాడటం విశేషం… ఇక ఇదంతా చూసిన అతని అభిమానులు ఆనందపడుతున్నారు.

నిజానికి మోహన్ లాల్ ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ మాత్రమే ఆయన ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉన్నాడు అంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా తెలియజేస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మోహన్ లాల్ నుంచి ఇకమీదట చేయబోయే సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను షేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక మొత్తానికైతే మోహన్ లాల్ సీనియర్ హీరోలందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్టేజ్ మీద లైవ్ లో డ్యాన్స్ లు వేస్తూ తన అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా తను ఇప్పటికి చాలా యాక్టివ్ గా ఉన్నానని గొప్ప సబ్జెక్టులు తన దగ్గరికి తీసుకొస్తే చేయగలిగే కెపాసిటి తన దగ్గర ఉందని కూడా ఈ డ్యాన్స్ ద్వారా అందరికీ తెలిసేలా చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మోహన్ లాల్ ఇంతకుముందు తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు…

యుద్ధం మళ్లీ మొదలు.. మధ్య ప్రాచ్యంలో అలజడి.. చమురు, గ్యాస్‌ సంక్షోభం తప్పదా?

Middle East War
Middle East War

Middle East War: అమెరికా ఇరాన్‌పై చేసిన తాజా దాడులు మధ్యప్రాచ్యంలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం మొదలవుతుందన్న ఆందోళన నెలకొంది. ఇరాన్‌ ప్రతీకార చర్యలు తీసుకుంటే, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ మరోసారి తీవ్ర సంక్షోభంలోకి జారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత స్థిరత్వం వచ్చిన చమురు ఉత్పత్తి, సరఫరా గొలుసులు మళ్లీ అస్థిరమవుతాయనే భయం నెలకొంది.

గల్ఫ్‌ దేశాల ఆందోళన…
గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌ నుంచి వచ్చే ప్రతీకార దాడులకు భయపడుతున్నాయి. ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని ఉపయోగించి, ప్రాంతీయ లక్ష్యాలపై దాడి చేయవచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ఈ దేశాలు తమ చమురు ఉత్పత్తి సౌకర్యాలను రక్షించుకోవడం కష్టమవుతుంది. ఇది ఆర్థికంగా ఈ దేశాలు ఎంతో ఆధారపడి ఉన్న చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

చమురు ఉత్పత్తి, సప్లయ్‌పై ప్రభావం..
ఇప్పుడిప్పుడే ప్రపంచ చమురు ఉత్పత్తి కొంత స్థిరంగా మారుతోంది. కానీ ఈ దాడుల వల్ల ఆ స్థిరత్వం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇరాన్‌ ప్రతీకార చర్యలు తీసుకుంటే, చమురు ఉత్పత్తి తగ్గిపోవడం, రవాణా మార్గాలు అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లయ్‌ చైన్‌లు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఇలాంటి ఘర్షణలు వస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరగడం తప్పదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలపై మరింత భారం పడేలా చేస్తుంది.

హార్ముజ్‌ కీలకం..
ప్రపంచానికి ముప్పుహార్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్, అమెరికా మధ్య ఈ ప్రాంతంపై ఆధిపత్య పోరు జరిగితే, ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడే ప్రమాదం ఉంది. ఈ జలసంధి ద్వారా ప్రతిరోజూ లక్షల బ్యారెల్స్‌ చమురు ప్రయాణిస్తుంది. ఇక్కడ అంతరాయం కలిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుంది. గ్యాస్, చమురు ధరలు ఆకాశాన్నంటే, సాధారణ ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది.

గ్యాస్‌ కష్టాలు తప్పవా?
ఈ ఘర్షణలు కేవలం సైనిక సమస్యలతో ముగియవు. అవి నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇరాన్‌ ప్రతీకార చర్యలు తీసుకుంటే, చమురు ఉత్పత్తి, రవాణా బాగా దెబ్బతిని, గ్యాస్‌ ధరలు మళ్లీ పెరగడం ఖాయం. ఇప్పటికే అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఇలాంటి పరిణామాలు వస్తే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలపై భారం మరింత పెరుగుతుంది.

అమెరికా–ఇరాన్‌ మధ్య ఈ తాజా దాడులు ప్రపంచాన్ని మళ్లీ ఇంధన సంక్షోభం వైపు నెట్టే ప్రమాదం ఉంది. హార్ముజ్‌ జలసంధి వంటి కీలక ప్రాంతాలపై ఆధిపత్య పోరు ఏర్పడితే, దాని ప్రభావం చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన దేశాలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి. శాంతియుత పరిష్కారం లేకపోతే, గ్యాస్‌–చమురు కష్టాలు మళ్లీ తప్పవు.

ఉద్యోగుల కోసం బెస్ట్ 4 మ్యాక్సీ స్కూటర్స్.. ధర ఎంతో తెలుసా..

Maxi Scooters
Maxi Scooters

Maxi Scooters: ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులకు రోజువారీ ప్రయాణం అనేది ఒక పెద్ద సవాలు. ట్రాఫిక్‌ను తట్టుకుంటూ, సౌకర్యవంతంగా, అదే సమయంలో స్టైలిష్‌గా ఆఫీసుకు చేరుకోవడానికి ఇప్పుడు మ్యాక్సీ స్కూటర్లు అద్భుతమైన ఎంపికగా మారాయి. సాధారణ స్కూటర్ల కంటే పెద్ద సైజ్, పవర్‌ఫుల్ ఇంజన్, మెరుగైన లెగ్‌రూమ్ తో పాటు అద్భుతమైన మైలేజ్‌తో ఇవి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఈ స్కూటర్లను అందించే కంపెనీలు ఏవి? వీటి ధర ఎంత?

సుజుకి బెర్గ్మాన్ స్ట్రీట్ 125 (Suzuki Burgman Street 125):
మ్యాక్సీ స్కూటర్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో సుజుకి బెర్గ్మాన్ స్ట్రీట్ 125 ఒకటి. ఆఫీస్ గోయర్స్ బడ్జెట్‌కు సరిపోయేలా దీని ప్రారంభ ధర సుమారు రూ. 1.02 లక్షలుగా ఉంది. ఇందులో 124cc ఇంజన్ ఉంటుంది, ఇది మంచి మైలేజ్‌ను ఇస్తుంది. విశాలమైన సీటు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ డిజిటల్ కన్సోల్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

యమహా ఏరాక్స్ 155 (Yamaha Aerox 155):
స్పోర్టీ లుక్ , హై పర్ఫార్మెన్స్ కోరుకునే యువ ఉద్యోగుల కోసం యమహా ఏరాక్స్ 155 ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ. 1.48 లక్షల నుండి ప్రారంభమవుతుంది. యమహా ఆర్‌15 బైక్‌లో వాడే 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది అద్భుతమైన పికప్ మరియు వేగాన్ని అందిస్తుంది. ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వై-కనెక్ట్ యాప్ సపోర్ట్ మరియు సీటు కింద పెద్ద స్టోరేజ్ స్పేస్ దీని సొంతం. ఆఫీస్ జర్నీని ఇది మరింత థ్రిల్లింగ్‌గా మారుస్తుంది.

హీరో జూమ్ 160 అడ్వెంచర్ (Hero Xoom 160):
దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ నుండి వస్తున్న సరికొత్త అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్ ‘హీరో జూమ్ 160’. ఇది స్టైల్ మరియు రఫ్ అండ్ టఫ్ పర్ఫార్మెన్స్ కలయికగా రూపొందింది. ఇందులో 156cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది దాదాపు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షల బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద 14-ఇంచ్ వీల్స్, డ్యూయల్ పర్పస్ టైర్లు, కీ లెస్ ఇగ్నిషన్, రిమోట్ సీట్ ఓపెనింగ్ మరియు స్మార్ట్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆఫీస్ రోడ్లతో పాటు వీకెండ్ రైడ్స్‌కు కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

కీవే వియెస్ట్ 300 (Keeway Vieste 300):
పూర్తి లగ్జరీ, పవర్ మరియు రోడ్ ప్రెజెన్స్ ఆశించే వారి కోసం హంగేరియన్ బ్రాండ్ ‘కీవే వియెస్ట్ 300’ అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం కేటగిరీకి చెందినది కాబట్టి దీని ధర సుమారు రూ. 3.25 లక్షల వరకు ఉంటుంది ఇందులో శక్తివంతమైన 278cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, కీ లెస్ స్టార్ట్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మరియు భారీ 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ దీని ప్రత్యేకతలు. లాంగ్ డిస్టెన్స్ ఆఫీస్ ప్రయాణాలకు మరియు హైవే రైడింగ్‌కు ఇది ఒక లగ్జరీ సోఫాలాంటి అనుభూతిని ఇస్తుంది.

బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే సుజుకి బెర్గ్మాన్ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా స్పోర్టీ లుక్, పవర్ కావాలంటే యమహా ఏరాక్స్ లేదా హీరో జూమ్ 160 వైపు వెళ్ళవచ్చు. ఇక బడ్జెట్ పరిమితి లేని లగ్జరీ ప్రియులకు కీవే వియెస్ట్ 300 అల్టిమేట్ ఆప్షన్ కానుంది.

హీరోయిన్లతో లింకులు అంటగట్టారట.. కేటీఆర్‌ ఆవేదన అంతా ఇంతా కాదు!

KTR
KTR

KTR: కేటీఆర్‌ తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణలో పదేళ్లు మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు ముఖ్యమైన మంత్రిగా పెత్తనం చెలాయించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌కు గ్లోబల్‌ గుర్తింపు తెచ్చారు. ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో యువతలో, ఐటీ ఉద్యోగుల్లో మంచి క్రేజ్‌ పొందారు. అయితే.. కేటీఆర్‌ అధికారంలో ఉన్ననాటి నుంచే ఆయనపై డ్రగ్స్‌ ఆరోపణలు అప్పటి విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌ చేశాయి. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై డ్రగ్స్‌ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించేవారు. ఇక అధికారం కోల్పోయాక ఈ ఆరోపణలతోపాటు సినిమా హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటగట్టారు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ అక్రమ సంబంధాలపై ఆరోపణలు చేశారు. దీంతో కొన్ని అంశాల్లో ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేటీఆర్‌ ఆవేదన..
తాజాగా డ్రగ్స్, సినీమా నటులతో సంబంధాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలపై కేటీఆర్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. తాను సిగరెట్‌ కూడా తాగనని, అలాంటి నన్ను పట్టుకుని డ్రగ్స్‌ ఆరోపణలు చేశారని తెలిపారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ హీరోయిన్లతో సంబంధాలపైనా దుష్ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాలను పదే పదే ప్రచారం చేయడం వల్ల నిజమనే నమ్మకం కలుగుతుందన్నారు. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు పెట్టడం వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం చేశారన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం..
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదన్నారు. తనకు ఫ్యామిలీ ఉందని, ఇలాంటి ఆరోపణలతో వారు కూడా ఇబ్బంది పడతారన్నారు. ఎవరైనా వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు నేతల వ్యక్తిత్వం, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా, అభివృద్ధి, అక్రమాల పరంగా ఎదుర్కొవాలని హితవు పలికారు.

సోషల్‌ మీడియా చిలువలు పలువలు..
తనపై నాయకులు చేసే ఆరోపణలు సోషల్‌ మీడియాలో మరింతగా ట్రోల్‌ అవుతాయన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్లు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఆరోపణలు నిరూపితం కాకపోయినప్పటికీ వాటి ప్రభావం నాయకుని దైనందిన జీవితం, కుటుంబం, ప్రజాభిమానంపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ చెప్పిన ఆవేదనను వ్యక్తిగత ఘర్షణగా మాత్రమే అర్థం చేసుకోవడం సరిపోదు. ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఓ నేతను ప్రతిష్ఠాపరంగా నష్టం కలిగించే ప్రయత్నం, ప్రజా దృష్టిని విచ్చలవిడిగా చేయడమే.

'మేడిన్ ఆంధ్ర' బంగారం రెడీ!

Kurnool Gold:
Kurnool Gold:

Kurnool Gold: మార్కెట్లోకి ఆంధ్ర బంగారం వచ్చేసింది. మేడిన్ ఆంధ్ర బంగారానికి మార్కెట్లో చోటు దక్కింది. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఏపీ మ్యాప్ తో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతో ముద్రవేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబు బజారుకు చెందిన కొందరు వ్యాపారుల దగ్గర ఈ బిస్కెట్లు లభిస్తున్నాయి. బంగారం స్వచ్ఛత తెలిసేలా 999 నెంబర్ కూడా ముద్ర వేశారు. 24 క్యారెట్ల స్వచ్ఛత ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బిస్కెట్ విలువ అక్షరాల రూ.75 లక్షలు పై మాటే. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించినట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.

* కొద్దిరోజులు కిందటే ప్రారంభం..
కొద్ది రోజుల కిందటే సీఎం చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమితంగానే ఈ బంగారం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తిస్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈనెల 24న సీఎం ప్రారంభించిన వెంటనే కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరి మూర్తి తో పాటు పలువురు వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఈ బంగారాన్ని అందుకున్నారు. ఓ వ్యాపారి ఒక గోల్డ్ బిస్కెట్ను వినియోగదారులకు విక్రయించినట్లు కూడా చెప్పారు. అయితే ఏపీ బంగారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం మాత్రం నిజంగా శుభపరిణామం.

* జువెలరీ క్లస్టర్..
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ తో విదేశీ మరకద్రవ్యం దేశం దాటిపోదాంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి పన్నులు, రాయితీలు లేవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఏ పన్నులు వర్తిస్తాయో.. జొన్నగిరిలో బంగారానికి కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ గోల్డ్ మైనింగ్ ప్రారంభం కావడంతో.. జువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వల్లభనేని వంశీ మోహన్ ఔట్!

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది వివిధ కేసుల్లో అరెస్టు అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చి యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ మాత్రం అటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు గన్నవరంలో అడుగుపెట్టడం లేదు. సొంత వారి దగ్గరకు కూడా చేరడం లేదు. అదే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే విషయం. గన్నవరంలో వల్లభనేని వంశీ మోహన్ ను మార్చి కొత్త ఇన్చార్జిని తెస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఓ కాంగ్రెస్ మహిళా నేత పేరు వినిపిస్తోంది. ఆమె అయితేనే అక్కడ రాజకీయాలను తట్టుకోగలరు అనేది పొలిటికల్గా వినిపిస్తున్న మాట. వల్లభనేని వంశీ మోహన్ పై జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది.

* అందగాడుగా పేరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందగాడుగా వల్లభనేని వంశీ మోహన్ కు పేరు ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ మోహన్ అందాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారని.. ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అప్పటినుంచి వైసిపి అందగాడుగా వల్లభనేని వంశీ మోహన్ కు పేరు ఉంది. కానీ ఆ అందం జైలుకు వచ్చిన తర్వాత కనిపించలేదు సరి కదా.. అసలు పోల్చుకోలేకపోయారు కూడా. అంతలా కళావిహీనం అయ్యారు వల్లభనేని వంశీ మోహన్.

* అనుచిత వ్యాఖ్యలతో..
2019లో రెండోసారి టిడిపి తరఫున గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. రాజకీయాల్లో జంపింగులు సహజమే. కానీ అంతకుమించి అన్నట్టు వ్యవహరించారు వల్లభనేని. చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు చేయడంతో పాటు భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజంలో చులకన అయ్యారు. తలెత్తుకో లేని విధంగా మారారు. అయితే ఇప్పుడు అదే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం లో యాక్టివ్ గా లేకపోయేసరికి… జగన్మోహన్ రెడ్డి మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె సైతం బాధ్యతలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ప్రభాస్ ఏమోషనల్.. దాదాపు కన్నీళ్లు వచ్చాయి.. తప్పక చూడాల్సిన వీడియో

Prabhas
Prabhas

Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక బాహుబలి సినిమాతో ఆయన తనదైన రీతిలో నటించి మెప్పించాడు. బాహుబలి రెండు పార్టులు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్ ను పాన్ ఇండియాలో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో దానికంటే ముందు ప్లే అయిన వీడియో ఇప్పుడు పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది.

బాహుబలి 3 ఉండబోతుంది అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక అనౌన్స్ మెంట్ వీడియో అయితే వచ్చింది. అది ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే సినిమా యూనిట్ మొత్తం అందరూ కలిసి బాహుబలి 3 ఉంటుంది అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం అందరిని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రభాస్ సైతం ఈ సినిమా షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని అదొక ఎమోషనల్ జర్నీ అంటూ ఆయన మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి కూడా కన్నీళ్లు వస్తాయా ఆయన కూడా ఎమోషనల్ అవుతాడా అంటూ చాలా మంది వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ నుంచి ఏడుపును ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు.

ఇక ప్రతి సినిమాలో కూడా ఆయన భారీ ఫైట్లు, విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కాబట్టి నిజ జీవితంలో ప్రభాస్ ఎమోషనల్ గా ఉంటాడా? అనేది కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా బాహుబలి 2 పార్టులు ఎంత విజయాన్ని సాధించాయో దానికి మించిన సక్సెస్ ని ఈ మూడోవ పార్ట్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

మహేష్ బాబు ఆ రెండు విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీలో ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరిని తన యాక్టింగ్ తో ఫిదా చేస్తూ ఉంటాడు. అలాంటి మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించడం లేదు. దాంతో ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలోనే ఆయన భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ‘వారణాసి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పడుతున్న కష్టం ఏంటో తెలియాలంటే స్క్రీన్ మీద చూడాల్సిందేనని సినిమా యూనిట్ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు… ఇక ఈ మూవీ తర్వాత మహేష్ బాబు క్రేజ్ అమాంతం పెరుగుతుంది.

కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో ఒక రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమా విమర్శకులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే ఆయన సినిమా సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా అతనికి భారీ డిజాస్టర్లు దక్కే అవకాశాలైతే ఉన్నాయి.

ఎందుకంటే వారణాసి సినిమాతో టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతటి గ్రేస్ ను మ్యాచ్ చేయాలంటే ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. ఒకవేళ ఏ మాత్రం తగ్గినా కూడా భారీ విమర్శలను మూటగట్టుకునే ప్రమాదం ఉంది. ఇక యాక్టింగ్ విషయంలో కూడా ఆయన ఎక్కడ తగ్గకూడదు.

ది బెస్ట్ ఇస్తూనే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించగలిగినప్పుడు మాత్రమే ఆయన నెంబర్ వన్ హీరోగా మారగలుగుతాడు. ఈ రెండు విషయాలను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగినంత కాలం అతనికి ఏ డోకా ఉండదు అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు…

రాజమౌళి సినిమాల్లో డైలాగ్ రైటర్ కి గొప్ప పేరు ఎందుకు రాదంటే..?

Rajamouli
Rajamouli

Rajamouli: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. అలాంటి రాజమౌళి ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడుగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నంలో ఉన్నాడు. తన సినిమాలో అతనికి మాత్రమే ఎక్కువగా పేరు వస్తుంది. డైలాగ్ రైటర్స్ కి కానీ, కథ రచయితలకు గాని పెద్దగా పేరైతే రాదని చాలామంది చెబుతుంటారు. నిజానికి రాజమౌళి సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపైతే ఉంటుంది. కానీ మొత్తానికైతే క్రెడిట్ ఎక్కువగా రాజమౌళికే వెళుతుంది. కారణం ఏంటంటే ఆయన ప్రతీ క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అయి ప్రతిదీ తనే చూసుకుంటూ ఉంటాడు.

కాబట్టి తనకి ఆ క్రెడిబులిటీ అయితే దక్కుతుంది. ముఖ్యంగా ఆయన సినిమాల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాడు. ప్రతి క్రాఫ్ట్ నుంచి ది బెస్ట్ ఔట్ పుట్ ని రాబట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. అందువల్లే అతని సినిమాలను చూస్తే మనకు ఆ క్వాలిటి కనిపిస్తుంది. ఇక డైలాగ్స్ రైటర్ సైతం ది బెస్ట్ డైలాగ్స్ ఇస్తుంటారు.

అయితే రాజమౌళి సినిమా తర్వాత డైరెక్టర్లకి ఇతర సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ రాజమౌళి సినిమాలో చేసినందుకు డైలాగులకు స్పెషల్ గుర్తింపైతే ఇవ్వడం లేదంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమాలో డైలాగులు అనేవి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. సినిమా మీద హైప్ ని పెంచేవి కూడా అవే కాబట్టి వాటికి ఎప్పుడూ గుర్తింపైతే ఉంటుంది.

రాజమౌళి సినిమాలో డైలాగులకు పెద్దపీట వేస్తూ ఉంటాడు. కాబట్టి డైలాగ్ రైటర్ కి మంచి గుర్తింపు ఉంటుంది. కొందరు మాకు గుర్తింపు రావడం లేదు అని అనుకుంటే దానికి రాజమౌళి ఏం చేయలేడు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చేసే ప్రతి సినిమాలో అందరికంటే తనకే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. అవును నిజమే ఆయన అంతలా కష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఆ మాత్రం క్రెడిట్ పొందటంలో తప్పేమీ లేదు అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు…

బాహుబలి 3 మీద అంత బడ్జెట్ పెడుతున్నారా..?

Baahubali 3
Baahubali 3

Baahubali 3: రాజమౌళి ఏం చేసినా కూడా అది చాలా గ్రాండియర్ గా ఉంటుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ అంటూ ఒక వీడియో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో రావడానికి ముందు సినిమా యూనిట్ నుంచి ఒక అఫీషియల్ వీడియో అయితే రిలీజ్ అయింది. అది ఏంటి అంటే బాహుబలి 3 ఉంటుంది అంటూ సినిమా యూనిట్ మొత్తం చాలా స్పష్టంగా చెప్పారు.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి 3 సినిమా ఉంటే మాత్రం దానిని డిఫరెంట్ గా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. వారణాసి తర్వాత ‘బాహుబలి 3’ ని పట్టాలెక్కించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథను కూడా రెడీ చేసి పెట్టాడట. అయితే ఈ సినిమా కోసం దాదాపు 2500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించే అవకాశాలైతే ఉన్నాయట.

దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమాకి అంత మొత్తంలో బడ్జెట్ పెడితే మాత్రం ఆ సినిమా దాదాపు 5000 నుంచి 6000 కోట్ల వరకు కలెక్షన్స్ ని ఈజీగా రాబడుతుంది అని ట్రేడ్ పండితులు సైతం అంచనాలు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దినదిన అభివృద్ధి చెందుతున్నాడు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు.

ఇది చూసిన చాలా మంది అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే సినిమా ఇండస్ట్రీ ఇంకాస్త బాగుపడుతుందని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మనల్ని ఢీకొట్టే వారు ఎవరు ఉండరు అని ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు సైతం మనం చాటి చెప్పవచ్చు అంటూ మరి కొంతమంది విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఫొటో షేర్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు!

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ సమీపంలోని రోడ్డుకు ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ అని నామకరణం చేసింది. ఇది అంతర్జాతీయ దౌత్యరంగంలో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని సూచించే చర్య. ఇది కేవలం బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించే సంకేతం. ఈ గౌరవం గురించి వ్యక్తం చేసిన సంతోషంట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదికగా ఉపయోగించే ట్రూత్‌ సోషల్‌లో ఈ నామకరణాన్ని స్వాగతించారు. ‘‘హైదరాబాద్‌లో ‘ది న్యూ డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ ఇంతటి గౌరవం పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు నేనే’’ అని ఆయన పోస్ట్‌ చేశారు. ఇది కేవలం థాంక్స్‌ చెప్పడం కాదు. ఒక విదేశీ నాయకుడికి భారతదేశంలోని ఒక నగరంలో రోడ్డుకు పేరు పెట్టడం అనేది అరుదైన గౌరవం. దీనిని ట్రంప్‌ తొలి అధ్యక్షుడు అని పేర్కొనడం ద్వారా, ఈ చర్యను తన వ్యక్తిగత విజయంగా చూపించుకున్నారు. ట్రంప్‌ ఇక్కడ తనను ‘‘తొలి’’ అని చెప్పుకోవడం ద్వారా, ఈ గౌరవం తన ప్రత్యేకతను చాటుతుందని సూచించారు.

భట్టి విక్రమార్క ఫోటో షేరింగ్‌..
స్థానిక–అంతర్జాతీయ కనెక్షన్‌ను ట్రంప్‌ షేర్‌ చేసిన ఫొోటోలో డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్క, అమెరికా అంబాసిడర్‌ సెర్గియోతో కలిసి శిలాఫలకం ఆవిష్కరిస్తున్న దృశ్యం ఉంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను స్థానిక స్థాయిలో బలపరచడానికి జరిగిన కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తుంది. భట్టి విక్రమార్క లాంటి సీనియర్‌ నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చెబుతుంది. అంబాసిడర్‌ పాల్గొనడం ద్వారా, అమెరికా వైపు నుంచి కూడా ఈ గౌరవాన్ని అధికారికంగా ఆమోదించినట్లు అర్థం. ట్రంప్‌ ఈ ఫోటోను షేర్‌ చేయడం ద్వారా, ఆయన ఈ సంఘటనను తన అభిమానులు, మద్దతుదారులతో పంచుకుని, దాని ప్రభావాన్ని మరింత విస్తరించారు.

దౌత్య, వాణిజ్య సంబంధాలు..
ఈ నామకరణం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి అమెరికాతో వాణిజ్య, సాంకేతిక, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరచడం. హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ ఉండటం వల్ల, ఈ రోడ్డు పేరు మార్పు సింబాలిక్‌గా ఆ సంబంధాలను హైలైట్‌ చేస్తుంది. రెండు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడం. ట్రంప్‌ లాంటి ప్రభావవంతమైన నాయకుడికి ఇలాంటి గౌరవం ఇవ్వడం ద్వారా, తెలంగాణ భవిష్యత్తులో అమెరికా నుంచి మరిన్ని అవకాశాలను ఆశించవచ్చు. అయితే, ఇలాంటి చర్యలు కొన్నిసార్లు రాజకీయ వివాదాలకు కూడా దారితీస్తాయి. వ్యతిరేక పక్షాలు దీనిని ‘‘అధిక గౌరవం’’ అని విమర్శించవచ్చు. అయినప్పటికీ, దౌత్యరంగంలో ఇలాంటి చిన్న చిన్న చర్యలు సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఈ సంఘటన తెలంగాణను అంతర్జాతీయ దౌత్య పటంలో ఒక చిన్న కానీ ముఖ్యమైన స్థానంలో నిలబెట్టింది. ట్రంప్‌ స్పందన, ఫోటో షేరింగ్‌ ఈ గౌరవాన్ని మరింత విస్తృతం చేశాయి. ఇది రెండు దేశాల మధ్య నమ్మకం మరియు సహకారానికి ఒక చిన్న సంకేతం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరింత బలమైన సంబంధాలకు దారితీస్తాయని ఆశించవచ్చు.

బొత్స పై కూటమి గురి!

Botsa Satyanarayana
Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. పిసిసి అధ్యక్షుడి గా పని చేశారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి వినిపించింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన.. బీసీ నాయకుడిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. వైసీపీ కాపు రాజకీయాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ ను వ్యక్తిగతంగా నిర్వీర్యం చేయాలని చూస్తోంది కూటమి. విజయనగరం తో పాటు విశాఖలో ఆయన బలాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉంది.

* అనతి కాలంలోనే ఎదిగి..
ఒక సహకార సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్స అనతి కాలంలోనే విజయనగరం పై పూర్తి పొట్టు సాధించారు. తన కుటుంబ రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో తన వారే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని సక్సెస్ అయ్యారు. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గం వర్గాల్లో తన సొంత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సైతం తన మేనల్లుడు కు దక్కేలా చేసుకున్నారు. అయితే బొత్స హవాపై దృష్టి పెట్టారు మంత్రి నారా లోకేష్. మొన్నటి ఎన్నికల్లో గురిపెట్టి కొట్టడంతో విజయనగరంలో పూర్తిగా కూలిపోయింది బొత్స కోట.

* కారణం అదే..
అయితే మళ్లీ బొత్స ఇప్పుడు కాపు రాజకీయంతో వైసీపీకి కాపు కావాలని చూస్తున్నారు. దానికి ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అని భావిస్తోంది కూటమి. అందుకే బొత్స కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో వైసిపి పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా చూస్తోంది. వైసీపీ నుంచి టిడిపి తో పాటు జనసేనలో చేరికల సంఖ్య పెంచాలని భావిస్తోంది. గజపతినగరం నియోజకవర్గంలో బొత్స అప్పల నరసయ్య ఉండగా అక్కడ వైసీపీ శ్రేణులు టిడిపిలోకి క్యూ కడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయంలో పట్టు బిగిస్తున్నారు.

* చీపురుపల్లిలో ఖాళీ చేసేలా.
మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం లో సైతం వైసీపీ శ్రేణులను ఆకర్షించేందుకు కిమిడి కళా వెంకట్రావు ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున సైతం వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం లో సైతం వైసీపీ శ్రేణుల్లో విభేదాలు పతాక స్థాయిలో ఉన్నాయి. వాటిని సైతం క్యాష్ చేసుకునే పనిలో ఉంది టిడిపి కూటమి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వైసిపిని నిర్వీర్యం చేసి కూటమి వైపు టర్న్ చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ఉన్నారు మంత్రి నారా లోకేష్. బొత్స పై పూర్తిగా దృష్టిపెట్టారు.