Home Blog Page 50

మంచుకొండల్లో.. పాక్ కు కరెంట్ షాక్.. ఇదీ మోడీ మార్క్ ట్రీట్మెంట్.. దెబ్బ అదుర్స్ కదూ

Siachen Base Camp Electricity Project
Siachen Base Camp Electricity Project

Siachen Base Camp Electricity Project: హిమాలయ పర్వతాలు.. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన మీద చేసిన దుర్మార్గాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి. పాకిస్తాన్ చేసిన రక్తపాతానికి సజీవ సాక్షంగా కనిపించాయి. అయితే ఇకపై పాకిస్తాన్ మన మీద ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. రక్తపాతాన్ని ప్రవహింపజేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈసారి పాకిస్తాన్ దేశాన్ని కరెంట్ తో కొట్టింది. దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక దెబ్బకు మన జోలికి పాకిస్తాన్ రాదు.

ఇటీవల పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటి ప్రవాహం విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో కీలక ప్రాంతాలు ఎడారిగా మారిపోతున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా భారత్ పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. మన మీద కయానికి కాలు దువ్వుతూ.. శత్రు దేశాలతో చేతులు కలిపి ఇబ్బంది పడుతూ ఉన్న పాకిస్తాన్ దేశానికి మోడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఫలితంగా పాకిస్తాన్ దేశం ఇకపై నిశ్శబ్దంగానే కాదు.. అన్ని మూసుకొని కూర్చుంటుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్ బేస్ క్యాంప్ లో విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రసారానికి డీజిల్ జనరేటర్లు వాడేవారు. ఇది ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగా ఉండేది. పైగా ఈ ప్రాంతం సముద్రమట్టానికి 12 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని కాపాడుకునేందుకు భారత్ ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేది. ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా లేకపోవడం.. కమ్యూనికేషన్లకు అత్యంత అవసరం ఏర్పడడంతో ఇక్కడ డీజిల్ జనరేటర్ల ను ఉపయోగించేవారు. గతంలో సోలార్.. ఇతర స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఆశించినత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక ఇటీవల కాలంలో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాంతంలో నేషనల్ కరెంట్ గ్రిడ్ తో అనుసంధాదించాలని భావించారు. మొత్తంగా 1925 కోట్ల ఖర్చుతో ద్రాస్ ప్రాంతం నుంచి పదుం వరకు 189 కిలోమీటర్ల మేర 220 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్యాంగ్ ప్రాంతం నుంచి డిస్కెట్ వరకు 79 కిలోమీటర్ల పొడవున 220 కె.వి లైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు మొత్తం సెప్టెంబర్ లోపు పూర్తి కాబోతున్నాయి.

ఇక్కడ విపరీతంగా మంచు ఉంటుంది. గడ్డకట్టుకొని పోయే చలి ఉండటం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా కు విపరీతంగా అంతరాయం ఏర్పడుతూ ఉండేది. గ్రిడ్ తో దీనిని అనుసంధానించడం వల్ల ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. సైనికులకు వసతి కల్పిస్తారు. వేడినీరు కూడా అందిస్తారు. వైద్య సహాయం సకాలంలో కల్పిస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ దేశాన్ని మరింత ఇబ్బంది పట్టేందుకు మన సైన్యానికి అవకాశం ఏర్పడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలు పనిచేసేందుకు కరెంటు తోడ్పడుతుందని అధికారులు అంటున్నారు.

ఆ ఇద్దరు సీనియర్ల మధ్య నలిగిపోతున్న జగన్!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ బలం పుంజుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ల మధ్య పెద్ద వైరం నడుస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలిచారు. అదే సమయంలో రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఓడిపోయారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి మాట నడిచేది చిత్తూరు జిల్లాలో. రాయలసీమలో సైతం ఆయన హవా ఉండేది. అటువంటిది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది.

* పెద్దిరెడ్డి హవా..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఏకంగా కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో సొంత పార్టీ వారు సైతం ఆయన కనుసన్నల్లో ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పేవి కావు. అందుకే అప్పట్లో ఆర్కే రోజాతో పాటు చెవిరెడ్డి లాంటివారు పెద్దిరెడ్డి విషయంలో చాలా గౌరవభావంతో ఉండేవారు. దానికి ప్రధాన కారణం భయం. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది.

* ఇద్దరి మధ్య విభేదాలు..
ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రాయలసీమను చూసేవారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నిత్యం తాడేపల్లి కార్యాలయంలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి విషయంలో పెద్దిరెడ్డి వైఖరి మారినట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో తాడేపల్లి లో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని నమ్ముతున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని.. ఆ ఇద్దరు నేతలను సర్ది చెప్పలేక జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

వైసీపీ సోషల్ మీడియా తిరుగుబాటు!

YSRCP Social Media
YSRCP Social Media

YSRCP Social Media: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అండ ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని రాజకీయం చేసింది. పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా పార్టీ నాయకత్వంపై తిరగబడుతోంది. దానికి కారణాలు లేకపోలేదు. వారికి చెల్లింపులు నిలిచిపోవడంతో ఎక్కడికి అక్కడే వారు ఎదురు తిరుగుతున్నారు. ప్రధానంగా ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు తో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ చూస్తే సజ్జల భార్గవ్ రెడ్డి ఈ చెల్లింపులను నిలిపివేయడంపై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎనలిస్టుల రూపంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడే ఓ ఇద్దరూ జర్నలిస్టులు ఇటీవల యూటర్న్ తీసుకున్నారు. దాని వెనుక ఉన్న కారణం కూడా అదే.

* ఆ జర్నలిస్ట్ పై కేసుతో..
ఓ ప్రముఖ ఛానల్ సీఈఓ గా వ్యవహరిస్తున్న ఓ జర్నలిస్టుపై ఇటీవల వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కుమార్తెను చూసేందుకు ఏకంగా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో.. కేంద్ర ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే వైసీపీతో పాటు అప్పట్లో గులాబీ పార్టీ భారీగా ఆయనకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు టీవీ ఛానల్ ఏపీలో వైసీపీకి, తెలంగాణలో గులాబీ పార్టీకి అండగా నిలిచేది. అందుకే ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సైతం సదరు న్యూస్ ఛానల్ సీఈఓ చూసారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏ కామెంట్స్ చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు ఆయన దిశ నిర్దేశం చేసేవారట.

* వ్యాపారానికి మళ్లింపులు..
సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూసేవారు సజ్జల భార్గవ్ రెడ్డి. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియాలో భారీగా నియామకాలు చేపట్టారు. చాలా ఏజెన్సీలు కూడా పనిచేసేవి. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ చెల్లింపులను నిలిపివేసింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి నగదు సాయం నిలిచిపోయింది. కానీ ఇలా సోషల్ మీడియాకు ఇవ్వాల్సిన నగదును సదరు జర్నలిస్టు తో పాటు సజ్జల భార్గవరెడ్డి పక్కదారి పట్టించారనేది ఒక ఆరోపణ. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలకు మళ్లించారని జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈ చెల్లింపులు నిలిపివేశారు అనేది ఒక ప్రచారం. అయితే చెల్లింపులు నిలిచిపోవడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇప్పుడు ఆందోళనలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తప్పకుండా దీని ప్రభావం పార్టీపై పడుతుందని భావిస్తున్నాయి.

50 వేల మంది వానర సైన్యం.. కుంభకర్ణుడితో యుద్ధం..'వారణాసి' మూవీలో అరాచకం..

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie: పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వారణాసి’. బాహుబలి సిరీస్ , #RRR వంటి గ్లోబల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడంతో , ఈ చిత్రం పై రాజమౌళి ముందు సినిమాలకంటే భారీ హైప్ ఏర్పడింది. కొంతమంది మూవీ లవర్స్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను నచ్చుతారు, కొంతమంది భారీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను నచ్చుతారు , కొంతమంది సైన్స్ ఫిక్షన్ సినిమాలను , మన పురాణాలకు సంబంధించిన కథలను నచ్చుతారు , ఈ జానర్స్ అన్నిటిని ఒకే సినిమాలో జోడించి తీస్తే , అదే ‘వారణాసి’. ఇందులో హీరో మహేష్ బాబు ని రాజమౌళి శ్రీ రాముడిగా చూపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాముడి గెటప్ లో మహేష్ బాబు సన్నివేశాలను కూడా ఇది వరకే చాలా చిత్రీకరించారు.

వచ్చే నెల 6 నుండి హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమాకు అత్యంత కీలంగా మారే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. భారీ సెట్స్ ని ఏర్పాటు చేయగా, అందులో ‘వానరాల దాడి సీన్’ ని తెరకెక్కించబోతున్న రాజమౌళి. అందుకోసం ఆయన ఏకంగా 3600 మంది జూనియర్ ఆర్టిస్టులను బరిలోకి దించుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజువల్స్ ని జోడించి ఈ ఎపిసోడ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్స్ లో పాల్గొనే 3600 మంది జూనియర్ ఆర్టిస్టులను VFX సహాయం తో మల్టిప్లై చేస్తూ , ఏకంగా 50000 మంది వానరులు లంకపై దాడి చేసేట్టుగా చూపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ ని అనుసరిస్తూ ‘కుంభకర్ణుడు’ తో శ్రీరాముడి మహాయుద్ధం సన్నివేశాన్ని కూడా చిత్రీకరించబోతున్నారు రాజమౌళి.

ఈ యుద్ధ ఘట్టం నిడివి వెండితెర పై దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుందట. సాధారణంగా రామాయణం అంటే మన మేకర్స్ ఎల్లప్పుడూ రాముడు , రావణుడి మధ్య పోరాటాలనే చూపిస్తుంటారు , కానీ రాజమౌళి కాస్త భిన్నంగా ఆలోచిస్తూ కుంభకర్ణుడితో జరిగిన మహా యుద్దాన్ని వెండితెర పై ఆవిష్కరించబోతున్నారు. కేవలం ఈ యుద్ధ సన్నివేశం కోసం అసఙ్ఖారాల 200 కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారట. ఇటీవలే ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా రాజమౌళి అక్కడి ప్రేక్షకులకు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విజువల్ క్లిప్స్ ని ప్రదర్శించి చూపించారు. వాటికి అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి విజన్ కి తగ్గట్టుగా ఈ సినిమా ఔట్పుట్ వస్తే మాత్రం, ఈసారి హాలీవుడ్ రికార్డ్స్ డేంజర్ లో పడుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏప్రిల్ 7 న రాజమౌళి సృష్టించే అద్భుతాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది.

ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం

India Vs Ireland
India Vs Ireland

India Vs Ireland: ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా ప్లేయర్ల మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. దాదాపు 1000 కి పైగా రోజులు తన రికార్డును అత్యంత పదిలంగా ఉంచుకుంది. పెద్ద పెద్ద జట్లను సైతం ఓడించి.. వారి సొంత గడ్డల మీద గెలిచి ట్రోఫీలు అందుకుంది. 2024లో.. 2026లో టి20 వరల్డ్ కప్ లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా.

భయంకరమైన బ్యాటింగ్.. అంతకుమించిన బౌలింగ్ కలిగి ఉన్న టీం ఇండియా అనామకమైన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మాజీ ప్లేయర్లు కూడా ఆటగాళ్ల ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లలో.. టీమిండియా తొలి మ్యాచ్లో 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనది. రెండో మ్యాచ్ లో 155 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. పలువురు బ్యాటర్లు చెప్పుకోదగిన స్థాయిలో పరుగులు తీయలేదు.

టీమిండియా వైఫల్యం పట్ల మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్లు ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతారని.. బౌలింగ్ మైదానాల మీద ఆడలేరని ఇప్పటికే సునీల్ గవాస్కర్ దుమ్మెత్తి పోసాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడేందుకు అలవాటు పడిన ప్లేయర్లు.. విదేశీ మైదానాల మీద తడబడుతున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టీం మీడియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇటీవల ఓటమి పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు.. అసలు ఇలాంటి ఆటగాళ్లు ట్రోఫీ ఎలా గెలుస్తారని.. ఇలాంటి ప్లేయర్లు విదేశీ మైదానాల మీద ఎలా ఆడతారని ప్రశ్నించారు. కనీసం మైదానాల రూపకల్పన విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించాడు. ఐపీఎల్ నుంచి ప్లేయర్లు నేరుగా రావడం కూడా ఈ ఓటమికి ఒక కారణమని అతడు అభిప్రాయపడ్డాడు..

అశ్విన్ చేసిన వ్యాఖ్యలు రకరకాల చర్చలు కారణమయ్యాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక విధానం పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానం పై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తాయ్. ఐపీఎల్ ఫామ్ మీద ఆధారపడకుండా.. విభిన్న పరిస్థితుల్లో ఆటగాళ్లు చేసిన ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు.. ఐర్లాండ్ జట్టు బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ ను భారత జట్టు కోచ్ అయ్యర్ అభినందించిన తీరును కూడా ఇక్కడ అశ్విన్ ప్రస్తావించాడు. సింగిల్స్ మాత్రమే తీసి టీమిండియా బ్యాటర్లు పరువు తీసుకున్నారని.. కీలకమైన సమయాలలో సరైన ఇన్నింగ్స్ ఆడలేక చేతులెత్తేసారని.. ఈ ఓటమిని గుణపాఠం లాగా మార్చుకోవాలని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
image.png

Displaying

చంద్రబాబు మదిలో ఆ ఇద్దరు!

Chandrababu
Chandrababu

Chandrababu: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెల రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆశవాహులు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఉండడంతో మూడు పార్టీల మధ్య రెండు పదవులు సర్దుబాటు కష్టం. అయితే గతంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు విషయంలో బిజెపితో పాటు జనసేనకు కేటాయింపులు చేసింది తెలుగుదేశం. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ రెండు స్థానాలను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు బిజెపి పెద్దలకు కూడా తెలియజేశారని ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆశావహులు 10 మందికి పైగా ఉన్నారు. వారికి సీట్ల సర్దుబాటు చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారితో పాటు పార్టీ కోసం పని చేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

* రెండు ఎమ్మెల్సీలు ఖాళీ..
వైసిపి హయాంలో గవర్నర్ కోటా కింద కడప జిల్లాకు చెందిన జాకియా ఖానం, పండు రవీంద్రబాబు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. వారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. వారి స్థానంలో ఇద్దరి ఎంపిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, మహాసేన రాజేష్, వర్ల రామయ్య లాంటి చాలామంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పిఠాపురం వర్మతో పాటు వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు టిడిపి కి కావాల్సిన నేతలు. గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఈ ఇద్దరికీ. అందుకే ఆ రెండు పదవులను వీరితో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

* వంగవీటి వారసుడికి..
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాపులపై విపరీతంగా ప్రభావితం చూపే వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా ఉన్న రాధాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రంగా వారసుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే.. టిడిపి అండగా నిలిచిందన్న సానుకూల వైఖరి ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ సైతం కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూటమి వైపు తీసుకు రావడం ద్వారా గట్టి సంకేతాలు పంపవచ్చు. అందుకే చంద్రబాబు రాధాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

* పిఠాపురం వర్మకు..
పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు పిఠాపురం వర్మ. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మది. అటువంటి వర్మ పవన్ కోసం తన సీటును వదులుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో.. వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగానే సాఫీగా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Displaying

వైసీపీలో ఆ మాజీ మంత్రి చాఫ్టర్ క్లోజ్!

Anil Kumar Yadav
Anil Kumar Yadav

Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అలా కాకుంటే తప్పించేస్తాను అంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి పార్టీ నుంచి అవుట్ కావడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయనకు జగన్మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వరని కూడా తెలుస్తోంది. ఆయన మూలంగానే నెల్లూరు జిల్లాలో పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికలకు ముందు చాలామంది బలమైన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గ పరిణామాలు కూడా జరిగాయి. అందుకే నెల్లూరులో అసలు అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* రెడ్డి సామాజిక వర్గం దూరం..
నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడానికి అదే ప్రధాన కారణం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సొంత సామాజిక వర్గానికి కాదని అనిల్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలను లెక్కచేయలేదు. తనదంత జగన్ తో అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని సైతం అనిల్ కుమార్ యాదవ్ చాలా తక్కువ చేసి చూశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం పార్టీలో ఉండలేదు. మిగతా రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం అనిల్ కుమార్ యాదవ్ వైఖరి తోనే బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ను పంపించారు.

* కనిపించని నేత..
నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత అస్సలు కనిపించలేదు ఆ నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లాలో కూడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామంతో అనిల్ కుమార్ యాదవ్ కు కూడా అర్థమైంది. కానీ ఆయనకు ఉన్నది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ మాత్రమే. టిడిపి తో పాటు జనసేన విషయంలో అనిల్ ఎంతలా మాట్లాడారో తెలియనిది కాదు. ఆ రెండు పార్టీలను కాదని బిజెపి తీసుకునే అవకాశం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ కార్యకలపాల్లో పాల్గొనడం లేదు. అసలు ఏపీ వైపు చూడడం కూడా లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం దొరికే భూమి.. కౌలు కోసం రైతుల పోటాపోటీ

Gold Found Land
Gold Found Land

Gold Found Land: అది ఆరు ఎకరాల భూమి.. రోడ్డు పక్కనే ఉంటుంది.. నీటి సౌకర్యం పర్వాలేదు. అది పూర్తిగా మెట్ట. పత్తి లేదా మొక్కజొన్న మాత్రమే సాగవుతుంది. కాస్త కష్టపడితే పసుపు పండించవచ్చు. ఇంకా ఎక్కువ కష్టపడితే మిరప కూడా సాగు చేయవచ్చు. కాలం అనుకూలిస్తే.. చీడపీడలు దాడి చేయకుంటే.. కూలీలు సకాలంలో దొరికితే.. మద్దతు ధర బాగుంటే ఎంతో కొంత రైతుకు గిట్టుబాటు అవుతుంది.

పైగా నేటి కాలంలో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఉన్నవారు భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలుకు తీసుకున్న వాళ్లు.. పెట్టుబడి ఖర్చులు భరించలేక ఎక్కువ కాలం వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు ఎకరాల భూమి కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కౌలుకు తీసుకోవడానికి చాలామంది రైతులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఒక రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కౌలుకు తీసుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇలా పోటీ పడటం వెనుక బంగారం లాంటి కారణం ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన ఒక రైతు నుంచి 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ఏరియా తండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈనెల 24న ఆ భూమిలో కలుపు సేకరిస్తుండగా మహిళా కూలీలకు బంగారం లభించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భూమి యజమాని ఆ కూలీలను విచారించి.. అసలు విషయం తెలుసుకున్నారు. బంగారం ఆభరణాలు కూలీలు చూపించగా.. ఆ భూ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ భూమిలో గతంలో ఆలయాలు ఉండేవి. 1991లో అప్పట్లో ఈ భూమి యజమానికి కొంత బంగారం కూడా దొరికింది.. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే పొలంలో ఒక వ్యక్తికి బంగారం దొరికింది. అంతేకాదు గతంలో ఈ ప్రాంతంలో దేవత విగ్రహాలు లభించాయి. నాడు బంగారం దొరికిన వ్యక్తులు.. మళ్లీ ఈ భూమి వైపు రాలేదు. ఆ బంగారం దొరికిన వారు ఆర్థికంగా స్థిరత్వం కూడా సాధించారు. మరోవైపు ఇటీవల దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. దానిని తమకు అందించాలని ముందుగా భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ భూమిలో బంగారం దొరికినట్టు వార్తలు రావడంతో చాలామంది రాత్రిపూట ఇక్కడ సంచరిస్తున్నారు. బంగారం కోసం అన్వేషిస్తున్నారు.

ఫరియా అందాలు చూడతరమా?

Faria Abdullah photos
Faria Abdullah photos

కాపులు యూటర్న్.. పవనే అజెండా!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు కాపు అనే అంశం చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అది ఇప్పుడు కాదు. గతం నుంచి వస్తున్నదే. దానికి కారణం కాపుల మద్దతు ఏ పార్టీకి స్థిరంగా ఉండదు. ఆ సామాజిక వర్గం మద్దతు ఇస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపుల అంశమే ప్రధానంగా పనిచేస్తూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఉండడంతో కాపులంతా కూటమి వైపు నడిచారు. అందుకే వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే కాపులను వెనక్కి తీసుకురావడానికి వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు.

* వివాదం చేయాలని..
రాష్ట్రవ్యాప్తంగా కాపుల అంశానికి సంబంధించి ఏ వివాదాన్ని విడిచి పెట్టేందుకు వైసీపీ అంగీకరించడం లేదు. సాయి కృష్ణ ఘటనను మరింత వివాదాస్పదం చేసి కాపులను దూరం చేయాలని చూసింది కూటమి నుంచి వైసీపీ. కానీ ఆ ప్రయత్నం కూడా వికటించింది. సాయి కృష్ణ కుటుంబం వైసీపీ రాజకీయానికి చిక్కలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వెనువెంటనే అది లాకప్ మారడం అని తేల్చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు అవకాశం లేకుండా చేశారు.

* కాపుల మద్దతు సభ..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపుల పేరుతో సభలను ఏర్పాటు చేసి చీలిక తేవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే కొత్తగా ఆ కాపుల సభకు వచ్చిన కాపు నేతలు, పెద్దలు ఎవరూ లేకుండా పోయారు. అయితే నిన్న విజయవాడలో కాపుల సభ జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు, వివిధ రంగాల్లో పనిచేసిన నిపుణులు ఏకతాటి పైకి వచ్చారు. ఒక క్రమ పద్ధతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని.. ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం కాపు సామాజిక వర్గానికి ఉందని తేల్చి చెప్పారు. ఒక వ్యూహం ప్రకారమే డిప్యూటీ సీఎం స్థాయికి పవన్ వెళ్లగలిగారని.. ఆయన ద్వారా కాపుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకుందామని వారు చెప్పడం విశేషం.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. మళ్లీ 125 ఏళ్ల నాటి కరువు..

El Nino Effect India
El Nino Effect India

El Nino Effect India: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచే దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. ఎల్‌నినో కారణంగా ఏర్పడిన అసాధారణ వాతావరణ పరిస్థితులు రుతుపవనాలను బలహీనం చేశాయి. జూన్‌ నెలలోనే ఇంత తీవ్రమైన లోటు నమోదు కావడం వల్ల వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తీవ్రంగా లోటు వర్షపాత
జూన్‌ 1 నుండి 28 వరకు దేశవ్యాప్తంగా సాధారణంగా 149.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి కేవలం 85.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది 43 శాతం లోటును సూచిస్తుంది. రుతుపవనాల సీజన్‌ ప్రారంభ దశలోనే ఇంత భారీ లోటు ఏర్పడడం అసాధారణం. ఇది ఖరీఫ్‌ పంటల సాగు ప్రారంభాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఎల్‌నినో ప్రభావం ఎలా..
ఎల్‌నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణం. దీని వల్ల భారతదేశంపైకి వచ్చే రుతుపవనాల గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వర్షపాతం తగ్గుతుంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడి దేశంలో అసాధారణ వాతావరణం కలిగించింది. ఎల్‌నినో సాధారణంగా రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీని ప్రభావం రుతుపవనాల మొత్తం సీజన్‌పైనే పడే అవకాశం ఉంది.

చారిత్రకంగా అత్యల్ప వర్షపాతాలు..
గత 125 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదు.
1905లో 87.4 మిల్లీమీటర్లు
1926లో 100 మిల్లీమీటర్లు
2009లో 87.5 మిల్లీమీటర్లు
2014లో 95.3 మిల్లీమీటర్లు

ఈ అన్ని సంవత్సరాల్లో కంటే ఈసారి 85.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడం రికార్డు స్థాయి లోటును సూచిస్తుంది. 2009, 2014లో కూడా ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి అంతకంటే ఘోరంగా ఉంది.

315 జిల్లాల్లో తీవ్ర ప్రభావం..
దేశంలో మొత్తం 724 జిల్లాల్లో 315 జిల్లాల్లో వర్షపాత లోటు ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. ఈ జిల్లాల్లో వ్యవసాయం, మంచినీటి సరఫరా, పశువుల మేత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు.

ఏం చేయాలి?
ఈ లోటు వర్షపాతం రైతుల జీవనోపాధి, ఆహార భద్రత, ఆర్థిక వృద్ధిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఖరీఫ్‌ పంటల సాగు ఆలస్యం కావడం, పంటలు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. నీటి నిర్వహణ, చెరువులు, కాలువలు పునరుద్ధరణ చేయాలి. రైతులకు పంటల బీమా, ఆర్థిక సహాయం అందించాలి. వాతావరణ అంచనాలను బట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో ప్రభావం జూలై–ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలికంగా వాతావరణ మార్పులు, ఎల్‌నినో పెరగడం వల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు. ప్రభుత్వం, రైతులు, స్థానిక సంస్థలు కలిసి ముందుగానే సిద్ధం కావడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు.

'అమరావతి'పై వైసీపీ ఎలా ముందుకెళ్లాలంటే?!

Amaravati Capital
Amaravati Capital

Amaravati Capital: అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేస్తున్న వికటిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న అమరావతి రైతులను తన వద్దకు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అయితే అలా వచ్చిన రైతులు ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వానికి సహకరిస్తూ తమ భూములను ఇచ్చేశారు. మరోవైపు బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డిఏ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అమరావతిలో పర్యటనకు వెళితే అమరావతి రైతుల అడ్డుకున్నారు. మీకు అండగా నిలిచేందుకే వచ్చామని చెప్పినా వారు వినలేదు. దీంతో ప్రతిఘటన ఎదురై.. కోడిగుడ్లతో తరిమికొట్టారు. ఇది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవమానకరమే. అందుకే అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంటే మేలు అనేది విశ్లేషకుల మాట.

* అప్పట్లో ఉద్యమాన్ని అణచివేసి..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేశారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉక్కు పాదం మోపారు. ప్రజాస్వామ్య యుతంగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం, అమరావతి టు ఆలయాల సందర్శనకు వెళితే దాడులు చేయడం వంటివి చేశారు. స్మశానంతో సైతం పోల్చారు.. అది అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అమరావతి రైతుల మనసులో అలానే ఉండిపోయాయి. దాని పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

* ఇప్పుడు కొత్తగా పరిరక్షణ కమిటీ..
అమరావతి రైతుల పరిరక్షణ కోసం వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే అమరావతికి ఓకే చెప్పినట్టే కదా. కానీ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు ను కలుపుతూ క్యారిడార్ను ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ఒకవైపు మూడు రాజధానులు అన్నారు. అధికారం కోల్పోయేసరికి మావిగన్ సూచన చేశారు. ఇప్పుడేమో అమరావతి రైతుల పరిరక్షణ అంటూ బయలుదేరారు. అందుకే వైసిపి నేతలపై అమరావతి రైతులు దాడి చేసినంత పని చేశారు.

* రైతుల్లో ఆగ్రహానికి కారణం అదే..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు అధికార పక్షం చేసిన అమరావతి ప్రతిపాదనను జై కొట్టింది. అదే అమరావతి నిర్మాణాలను సెట్టింగులతో పోల్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్న విషయాన్ని చెప్పి అమరావతిని అలాగే వదిలేసింది. 2024లో అధికారం కోల్పోయాక అమరావతిపై మాట్లాడకుండా ఉండిపోయి ఉంటే బాగుండేది. ఒకవైపు రాజధానిని వేరే ప్రాంతానికి తరలించాలని మావిగన్ సూచించారు జగన్. ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇవన్నీ అమరావతి రైతుల్లో జగన్మోహన్ రెడ్డిని విలన్ చేస్తున్నాయి. అందుకే అమరావతి విషయంలో వైసీపీ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది.

వైసిపి భయం అదే!

YSRCP
YSRCP

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ పట్టు దక్కడం లేదు. పైగా పార్టీకి తప్పిదాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా అమరావతి విషయంలో మరోసారి కార్నర్ అయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రైతులు అడ్డుకోవడమే కాదు వైసిపి నేతల వెంటపడి మరి తరిమారు. దీంతో వారి మనసు మారలేదని అర్థం అయింది. ఈ పరిణామంతో ఓ రెండు జిల్లాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే నన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల వైఖరిలో మార్పు రాలేదని అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో కూడా ఆందోళన అదే. పైగా ఆ రెండు జిల్లాల నేతలు పై వివాదాస్పద ముద్ర ఉంది. వారి వైఖరితో పాటు వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయి.

* అప్పట్లో వైసీపీకి జై కొట్టినా..
2014 నుంచి 2019 మధ్య టిడిపి అధికారంలో ఉంది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ అందరి అభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది రాష్ట్ర రాజధానిగా. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతిని సమ్మతించారు. అదే అమరావతి పరిధిలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని.. అందుకే తాను శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకున్నానని చెప్పుకొచ్చారు జగన్. అమరావతి ప్రాంత రైతులు కూడా నమ్మారు. అంతులేని అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. చివరికి మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ సైతం ఓడిపోయారు అంటే ఏ స్థాయిలో అభిమానం చూపారో అర్థం అవుతుంది.

* అక్కడ టిడిపికి బలం..
వాస్తవానికి కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కనీసం ఉనికి చాటుకుంటూ వస్తూ వచ్చింది. ఒకటి రెండు స్థానాలను సైతం దక్కించుకునేది. కానీ 2019 ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో పార్టీ ఓడిపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అంతలా ప్రజలు వైసీపీని ఆదరిస్తే అమరావతిని వ్యతిరేకించారు. దాదాపు నిర్వీర్యం చేశారు. రాజధానితో ఆ రెండు జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావించిన ప్రజలకు నిరాశ ఎదురయింది. అయితే ఇప్పుడు అదే పనిగా అమరావతి పై కుట్రలు చేస్తుండడం.. రోజుకో మాట ఆడుతుండడంతో ఆ రెండు జిల్లాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు జిల్లాల పై ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ లాంటి వారి తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. అందుకే ఆ రెండు జిల్లాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు.. కర్ణాటక ఓట్లతోనే రేవంత్ గెలిచారట..

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు ఉన్నాయా.. కర్ణాటక ప్రజల ఓట్ల తోనే రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో గెలిచారా.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరించిందా.. సరిగ్గా ఇవే మాటలు చెబుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. 2018 నుంచి 2023 వరకు కొడంగల్ లో మొత్తం 30 వేల కొత్త ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించిన తీరు సరికొత్త చర్చకు దారితీస్తోంది.

కొడంగల్ నియోజకవర్గం లో 22 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కావిత ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో నమోదయ్యాయని కవిత సరికొత్త విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. 33,000 ఓట్లు అక్రమంగా ఉన్నాయని.. రేవంత్ రెడ్డి ఏకంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని కవిత ఆరోపించారు. “రేవంత్ గెలుపు వెనుక కర్ణాటక ఓటర్లు ఉన్నారు. అక్కడి నుంచి ఓటర్లను తీసుకువచ్చారు. అందువల్లే ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ముందుగానే కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెలవడానికి ఆయన అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుందని” కవిత ఆరోపించారు.

కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తొలగించారని.. బోధన్ నియోజకవర్గంలో ఏకంగా ఏడు వేల ఓట్లు తొలగించారని కవిత పేర్కొన్నారు. అంతేకాదు, దాదాపు లక్ష ఓట్ల వరకు కొడంగల్ నియోజకవర్గంలో మోడిఫికేషన్ జరిగిందని కవిత ఆరోపించారు. ఇవి సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు..”తెలంగాణ డబ్బులను కర్ణాటకకు పంపిస్తున్నారు. ఓటర్లను తీసుకొస్తున్నారు. చివరికి డబ్బుతో పాటు ఓట్లను కూడా బదిలీ చేశారు.. రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించింది” అనే అనుమానాలు తమకు కలుగుతున్నాయని కవిత ఆరోపించడం విశేషం.

“ఓ నటుడికి మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది. ఆయన ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని.. వాటిని తొలగించడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని” కవిత ఆరోపించడం విశేషం. ఇటువంటి ఓటర్లను తొలగించకపోతే ఎస్ ఐ ఆర్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి ఉపయోగం లేదని కవిత పేర్కొన్నారు.

రఘురామకృష్ణం రాజు అజెండా టిడిపికి నష్టమా? లాభమా?

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju

Raghurama Krishnam Raju: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా సభలు, సమావేశాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దళిత బహుజన సభలు అంటూ నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తున్నారు జడ శ్రావణ్ కుమార్ తో పాటు దళిత నేతలు. దీంతో టీడీపీ కూటమిలో సైతం ఒక ఆలోచన వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా రఘురామకృష్ణం రాజు సొంత అజెండాతో ముందుకు వెళుతుండగా.. ఆయనకు వ్యతిరేకంగా దళిత బహుజన సభలు జరుగుతుండడం ఇప్పుడు ఏపీలో సరికొత్త పరిణామం.

* నాలుగు నెలలుగా సొంత అజెండాతో..
గత నాలుగు నెలలుగా రఘురామకృష్ణం రాజు ఒక సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. హిందుత్వ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దానికి విపరీతంగా స్పందన వస్తోంది. ఆయనకు అభిమాన గణం కూడా పెరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదాన్ని వినిపించారు. కానీ రఘురామకృష్ణంరాజు స్థాయిలో మాత్రం కాదు. నేరుగా హిందూ ఆలయాల పరిరక్షణతో పాటు హిందుత్వవాదం గురించి ఎక్కువగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీంతో హిందుత్వ వాదం ఉన్న ప్రతి ఒక్కరు రఘురామకృష్ణం రాజును అభిమానిస్తున్నారు.

* తెర వెనుక బిజెపి..
తెలుగుదేశం పార్టీ కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు వెళ్తోంది. కానీ చాలామంది టిడిపి నేతలు ఈ పరిణామాలతో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. ఇక్కడే భిన్న వాదన వినిపిస్తోంది. టిడిపికి ఎటువంటి నష్టం జరగదు అని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. అసలు దళితులు టిడిపికి ఓటు వేయరని.. అటువంటప్పుడు వారితో రాజకీయం చేస్తున్న వారిని ఎందుకు భయపడాలని ప్రశ్నిస్తున్నారు. పైగా రఘురామకృష్ణంరాజు వెనుక ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ లాంటివి ఉన్నాయని.. దళిత క్రిస్టియానిటీని ఇప్పటికే బిజెపి వ్యతిరేకం అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎక్కువమంది. అయితే ఇది టిడిపికి నష్టం చేయకపోగా.. లాభం చేకూరుస్తుందన్న వారు ఉన్నారు. దళిత బహుజన్ సభల వెనుక వైసీపీ అజెండా ఉంటే.. రఘురామకృష్ణం రాజు హిందుత్వ ఓట్లను ఏకతాటిపైకి తెస్తున్నారు అన్నవారు కూడా ఉన్నారు. మరి ఈ సభలు, ఈ పరిణామాలు రాజకీయంగా ఏ పార్టీకి ఇబ్బందికరం అవుతాయి? ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తాయి? అనేది చూడాలి.

పీవీ సునీల్ కుమార్ కు అసలు పరీక్ష!

PV Sunil Kumar
PV Sunil Kumar

PV Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. సస్పెన్షన్ లోనే ఉండగా ఆయన రిటైర్ అవుతున్నారు. అయితే నేరుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అది అంత ఈజీ కాదు అని అర్థం అవుతోంది. ఎందుకంటే ఆయన ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి చేశారన్న అభియోగాలపై కేసులు నడుస్తున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ఆ కేసుల విచారణ అలానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఏ రాజకీయ పార్టీలో చేరి మైక్ అందుకున్నా.. ఆయనకు కేసులు తప్పవని తేలిపోయింది.

* వ్యతిరేకంగా జీవీ హర్ష కుమార్ కుమారులు
దళిత అజెండాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్నది సునీల్ కుమార్ ఆలోచనగా వార్తలు వచ్చాయి. అయితే సొంత సామాజిక వర్గం లోనే ఆయనపై వ్యతిరేక వర్గం భారీగా తయారయింది. భారీగా విదేశీ నిధులతో పాటు కొన్ని వర్గాల నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం జరిగింది అని.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయులు బయటకు తీశారు. సోషల్ మీడియా డొమైన్ లో పెట్టారు. అంబేద్కర్ మిషన్ ద్వారా లక్షలాదిమంది దళితులను సభ్యులుగా చూపుతూ ఆయన భారీ దందా చేశారు అనేది జీవి హర్ష కుమార్ కుమారుల వెర్షన్. పదవీ విరమణ చేసిన మరు క్షణం సొంత సామాజిక వర్గం నేతలు కచ్చితంగా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉంది.

* అధికారిక రక్షణ కరువు..
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా సునీల్ కుమార్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. కానీ వైసీపీ హయాంలో ఆయన రాజకీయ ప్రేరేపిత కేసులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టారు అనేది ఒక ఆరోపణ. అయితే ఇన్ని రోజులు సర్వీస్ లో ఉండడంతో ఆయనకు బ్యూరోక్రసి వ్యవస్థ రక్షణగా నిలిచేది. ఇకనుంచి ఆ పరిస్థితి కూడా ఉండదు. రాజకీయంగా కొంత రక్షణ రావచ్చు కానీ.. తన సర్వీస్ ప్రకారం ఆర్థిక రాయితీలు కూడా వర్తించవు. ఇలా అన్నింటా ముప్పేట దాడిని సునీల్ కుమార్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

నాగబాబును నియంత్రించుకుంటే కూటమికి కష్టమే!

Nagababu
Nagababu

Nagababu: కూటమి విడిపోవాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇటువంటి సమయంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, పొత్తు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిణితితో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందుకు వెళుతున్నారు. క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల కూటమిలో విభేదాలు వచ్చినా.. వాటిని ఎంకరేజ్ చేయడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు వల్ల మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. జన సైనికులను ఉత్సాహపరిచే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వికటిస్తున్నాయి.

* గతంలో చాలాసార్లు..
వాస్తవానికి నాగబాబు లో దూకుడు ఎక్కువ. గతంలో సినీ పరిశ్రమ విషయంలో జరిగిన పరిణామాలతో పాటు రాజకీయాల్లో ఆయన చేసిన ప్రకటనలు చాలాసార్లు వివాదాస్పదం అయ్యాయి. చిరంజీవి సౌమ్యుడు అనే పేరు ఉంది కానీ… నాగబాబు తీరుతో చిరంజీవి విమర్శలకు గురయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జనసేనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత పవన్ కళ్యాణ్ నాగబాబుకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబు కొన్ని ప్రకటనలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ నిన్న అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష జరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయ్యింది. జన సైనికులను ఉత్సాహపరిచే క్రమంలో ఆయన నోటి నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి. ఇది విపరీతంగా వైరల్ కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. మేమే పోటీ చేస్తామనలేదని.. కూటమిపరంగా మేం పోటీ చేస్తాం అని చెప్పానని కవరింగ్ ఇచ్చుకున్నారు నాగబాబు.

* పవన్ ఆదేశాలతో తగ్గిన నాగబాబు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై దూకుడుగా వ్యవహరించడం లేదు నాగబాబు. జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకున్నప్పుడు మాత్రమే నాగబాబు బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు వచ్చిన క్రమంలో నాగబాబు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తొలిసార్లు గుర్తు చేస్తూ జనసేన నేతలతో పాటు నాగబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అంటే టిడిపి మాత్రమే కాదని.. జనసేన సైతం ఉందన్న విషయాన్ని గ్రహించుకొని మాట్లాడాలన్నారు. చాలాసార్లు హితబోధ కూడా చేశారు.

* కూటమి జాగ్రత్త పడకపోతే..
కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఉండడంతో.. వాటి మధ్య చీలిక ఎప్పుడు తెస్తామా అన్న ఆలోచనలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ సమయంలో నాగబాబు లాంటివారు వారికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కూటమికి నష్టం. పైగా నాగబాబు లాంటివారు ప్రకటనలు చేస్తే తప్పకుండా కిందిస్థాయిలో సైతం విపరీతంగా ప్రభావం చూపుతుంది. అందుకే నాగబాబు లాంటి వారిని నియంత్రించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పై ఉంది. నాగబాబు సైతం బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇకనుంచి. ఈ విషయంలో తప్పకుండా పవన్ అప్రమత్తం అవుతారు. దిద్దుబాటు చర్యలకు దిగుతారు అని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి.