Home Blog Page 49

అనిల్ రావిపూడి సినిమాలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోయిన చేస్తానంటున్న స్టార్ హీరో...

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో కమర్షియల్ సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధించిన వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. అయితే అతని సినిమాలో నటించడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అనిల్ రావిపూడి చేసే సినిమాల్లో క్రింజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని అతని సినిమాలు చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తాయని అంటుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతని సినిమాలను ఎక్కువగా చూసి భారీ కలెక్షన్స్ ని కట్టబెడుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరో సైతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చే సినిమాలో రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా అసలు పారితోషికం ఇవ్వకపోయిన పర్లేదు సినిమాలో నటిస్తాను అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే విక్టరీ వెంకటేష్ కావడం విశేషం… వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తోనే ఒక సినిమా చేస్తుండటం విశేషం…

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో హ్యాండిల్ చేస్తాడు. సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీతో సక్సెస్ ని సాధిస్తే ఆయన పదో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నవాడవుతాడు.

తను అనుకున్నట్టుగానే సక్సెస్ సాధిస్తాడా? వెంకటేష్ కి 5వ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ మూవీ తర్వాత ఆయన భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. దాంతో పాటుగా నాగార్జునతో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు…

జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్న తమిళియన్స్.. కారణం ఏంటంటే..

Jr NTR
Jr NTR

Jr NTR: మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎదుగుదల , మన హీరోల అద్భుతమైన టాలెంట్ ని చూసి , బాలీవుడ్ వాళ్లకు మాత్రమే కాదు , కోలీవుడ్ వాళ్లకు కూడా ఒక రేంజ్ అసూయ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ నరనరాల్లో దాగున్న ద్వేషాన్ని బయటపెడుతూ ఉంటారు తమిళ నెటిజెన్లు. అలాంటి సందర్భమే ఇప్పుడు ఒకటి వచ్చింది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ అని చిత్రాన్ని ప్రకటించారు. ఇది సుబ్రమణ్య స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే. తమిళియన్స్ అందరూ సుబ్రమణ్య స్వామిని ‘మురుగన్ ‘ అనే పేరుతో పిలుస్తారు. దాదాపుగా ప్రతీ ఒక్కరు ఆయన భక్తులే , విపరీతంగా ఆరాధిస్తుంటారు. తమిళియన్స్ అత్యధిక శాతం అడ్డబొట్టు ఎందుకు పెడుతారో చాలా మందికి అర్థం అవ్వదు.

అది మురుగన్ స్వామి మీద భక్తితోనే ఆ అడ్డబొట్టు పెడుతుంటారు. అలాంటి స్వామి పాత్రలో తమ తమిళ సూపర్ స్టార్స్ మాత్రమే కనిపించాలని వాళ్ళ కోరిక. కానీ ఆ పాత్రలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళు అసలు తీసుకోలేకపోతున్నారు. ‘మురుగన్’ పాత్రకు న్యాయం చేయగల సత్తా కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్, తల అజిత్ లకు మాత్రమే ఉందని , జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకు న్యాయం చేయలేరని, ఆయన ఆహార్యం , లుక్స్ ఈ పాత్రకు అసలు సరిపోవని, ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో ఆ రేంజ్ మార్కెట్ కూడా లేదని , ఇలా రకరకాల మాటలతో ఎన్టీఆర్ ని తక్కువ చేస్తూ , ఆయన అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం నిన్నటి నుండి చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా తమిళ నెటిజెన్స్ చాలా దీటుగానే సమాధానం ఇస్తున్నారు. సంస్కృత భాషలో ఎన్టీఆర్ కి ఉన్నటువంటి పట్టు , దేశంలో ఏ హీరో కి లేదని , ఆయన కాకపోతే , ఈ పాత్రకు ఎవ్వరూ న్యాయం చెయ్యలేరని ఎన్టీఆర్ అభిమానులు చాలా గట్టిగా వాదిస్తున్నారు.

అది ముమ్మాటికీ నిజమే. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఆహార్యం ఎలా ఉన్నా, సంస్కృత డైలాగ్స్ , నటన ని మ్యాచ్ చేసే హీరో ఇండియా లోనే ఎవ్వరూ లేరు. కుమార స్వామి పాత్రకు ఎన్టీఆర్ తప్ప, ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు, కాబట్టి అనవసరం గా మీకు ఇష్టమొచ్చినట్టు ఊహించుకొని గొడవలు పెట్టుకోకండి అంటూ నెటిజెన్స్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతుగా నిలిచారు. చూడాలి మరి ఈ గొడవ సోషల్ మీడియా లో ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది.

కర్ణుడిగా ప్రభాస్.. రాముడిగా మహేష్.. కుమార స్వామిగా ఎన్టీఆర్.. తదుపరి ఎవరు?

Prabhas Karna
Prabhas Karna

Prabhas Karna: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం పౌరాణిక పాత్రలకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. సరైన టేకింగ్ తో ఈ జానర్ సినిమాలో తీస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతున్నాయి , వసూళ్ల సునామీ కురుస్తోంది. ముఖ్యంగా రామాయణం , మహాభారతం వంటి ఇతఃసాలకు సంబంధించిన స్టోరీ లకు అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ తో అందిస్తే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. రీసెంట్ గా అలాంటి సందర్భాలు మనం చాలానే చూశాము . ఈ ట్రెండ్ ని గమనించిన మన స్టార్ హీరోలు , ఇలాంటి పాత్రలు పోషించడానికి ముందుకొస్తున్నారు. అందులో మొదటి వరుస ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ‘ఆదిపురుష్’ చిత్రం లో ఈయన శ్రీరాముడి క్యారెక్టర్ చేశారు. కానీ రామాయణం ని వక్రీకరించి డైరెక్టర్ ఇష్టమొచ్చినట్టు తీయడం తో ఆడియన్స్ ఈ చిత్రాన్ని డిజాస్టర్ ఫ్లాప్ చేశారు.

ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన కల్కి చిత్రం చేశారు. అందులో కర్ణుడి పాత్రలో కనిపించిన ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు, ప్రేక్షకులు కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యారు. ఎంతైనా మనకు బాగా ఇష్టమైన హీరోని , మనం నిత్యం ఆరాధించే దేవుడి పాత్రల్లో చూస్తే వచ్చే గూస్ బంప్స్ వేరు అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రభాస్ దారిలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నడిచారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వారణాసి’ లో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపుగా 20 నిమిషాల నిడివి ఉండబోతున్న ఈ సీక్వెన్స్ లో మహేష్ బాబు రాముడి గెటప్ లో కనిపిస్తే థియేటర్స్ లో ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక లేటెస్ట్ గా వీళ్ళిద్దరిని అనుసరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా కుమారి స్వామి పాత్రలో ఒక సినిమా చేయనున్నారు , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

ప్రస్తుతానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ , డ్రాగన్ పూర్తి అయిన వెంటనే మొదలు కానుంది. మన టాలీవుడ్ లో ఆరు మంది స్టార్ హీరోలు ఉండగా, అందులో ఇప్పటికే ముగ్గురు దేవుడి పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, బ్రో చిత్రాల్లో దేవుడి పాత్రల్లో నటించినప్పటికీ, అది పూర్తి స్థాయి భారీ స్కేల్ సినిమాలు కావు. ఇక అల్లు అర్జున్ చేతుల్లోకి ‘గాడ్ ఆఫ్ వార్ ‘ చిత్రం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక రామ్ చరణ్ ని అభిమానులు అర్జునుడు , హనుమంతుడు, శ్రీ రాముడు పాత్రల్లో చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు కూడా దేవుడి పాత్రల్లో కనిపిస్తారో లేదో చూడాలి.

అధికారికంగా వాయిదా పడిన నాని 'ది ప్యారడైజ్' చిత్రం.. కొత్త విడుదల తేదీ ఏంటంటే..

The Paradise
The Paradise

The Paradise: నేచురల్ స్టార్ నాని డ్రీం ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 21 న విడుదల చెయ్యాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు బయ్యర్స్ కి అధికారికంగా సమాచారం ఇచ్చింది మూవీ టీం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారట. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత జూన్ నెలకు షిఫ్ట్ అయ్యింది. అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఈ తేదీన కూడా ఈ చిత్రం రావడం లేదని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరిగింది . దీన్ని మూవీ టీం చాలా గట్టిగానే ఖండించింది. కానీ చివరికి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. అభిమానులు ఇలా ఈ చిత్రం తరుచు వాయిదా పడడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చెయ్యాలా?, లేదంటే డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈసారి ఒక విడుదల తేదీని ప్రకటిస్తే , మళ్లీ వాయిదా వేసే పరిస్థితులు ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క నాని కూడా ఈ సినిమా ఆలస్యం అవుతుండడం పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పై తీవ్రమైన అసహనం తో ఉన్నారట. వాస్తవానికి అయితే ఆయన ఈపాటికి సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ‘బ్లడీ రోమియో’ మూవీ షూటింగ్ లో ఉండాలి. అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే ‘బ్లడీ రోమియో’ చిత్రం ఈపాటికి 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యి ఉండేది. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వకపోవడం తో , ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది.

దీంతో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని పూర్తిగా ‘ఓజీ 2’ వైపుకి షిఫ్ట్ చేశారు. నవంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇలా ‘ది ప్యారడైజ్’ కారణంగా ఆయన ఏకంగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చింది. తీసిన సన్నివేశాలని రిపీట్ గా రీ షూట్స్ చేయడం , సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ బౌండెడ్ గా లేకపోవడం వల్లే, ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం అట. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 70 రోజుల సమయం పడుతుందట. అసలు ఈ ఏడాది విడుదల అవ్వడం అసాధ్యమే అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ బాధని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్.. ట్వీట్ వైరల్..

Pawan Kalyan And Bandla Ganesh
Pawan Kalyan And Bandla Ganesh

Pawan Kalyan health update : పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాలకు సంబంధించిన బాధతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఆయన ముంబై లోనే ధీరుభాయి అంబానీ హాస్పిటల్ కి చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. భుజాలకు జరిగిన గాయం తీవ్ర రూపం దాల్చిందని , వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పొలిటికల్ షెడ్యూల్స్ కొన్ని కమిట్ అయ్యి ఉన్నానని , వాటిని పూర్తి చేసుకున్న వెంటనే సర్జరీ చేయించుకుంటానని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా జనసేన పార్టీ హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా చెప్పడంతో అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. వారిలో పవన్ కళ్యాణ్ భక్తుడు , ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు . కాసేపటి క్రితమే ఆయన విషయం పై చింతిస్తూ ట్విట్టర్ లో వేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాత్రంతా నాకు నిద్ర లేదు , నా బుర్రలో ఒకటే ఆలోచన, దాదాపుగా 15 ఏళ్ళ నుండి మీరు నడుము , భుజం నొప్పులతో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటేనే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మేమంతా విలవిలలాడిపోతుంటాము, అలాంటిది మీరు ఇంతటి బాధని చిరు నవ్వు వెనుక దాచి జీవించడం నిజంగానే అసాధారణమైన విషయం. నాకు ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజులు ఒక్కసారిగా కళ్ళముందు ఫ్లాష్ అవుతున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుండి ఆరోజు మీరు పడిపోయిన క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం , ఇవన్నీ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి . ఆ సమయం లో మీరు మాటకు ప్రాణం ఇచ్చే మహా మనిషి లాంటి నిర్ణయం తీసుకున్నారు’.

‘ముందు ఈ సినిమాని పూర్తి చేద్దాం , నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు , ఇన్ని వందల మంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు ‘ అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లోనే దాచుకొని, ఆపరేషన్ వాయిదా వేసి , సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా మీరు నాకు ఇచ్చింది కేవలం ఒక సూపర్ హిట్ సినిమాని మాత్రమే కాదు , జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేని రుణాన్ని ఇచ్చారు. ఆ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలు అవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో , కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థం అవుతోంది’ అంటూ బండ్ల గణేష్ చాలా ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

bandla ganesh

సంక్రాంతి కి విడుదల కానున్న రవితేజ - శ్రీవిష్ణు మల్టీ స్టార్రర్.. డైరెక్టర్ ఎవరంటే..

Ravi Teja
Ravi Teja

Ravi Teja: మన టాలీవుడ్ లో మల్టీస్టార్రర్ మూవీస్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యంగ్ హీరోలు , సీనియర్ హీరోలతో కలిసి చేసే స్థాయి నుండి, ఒకే తరానికి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటించే స్థాయికి ఎదిగింది మన టాలీవుడ్. ఇలాంటి సమయం మరో క్రేజీ మల్టీస్టార్రర్ మన ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది. తొలిసారిగా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్నటువంటి మాస్ మహారాజ రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ లెవెల్ లో నిర్మించబోతున్నారు. దిల్ రాజు కి సంక్రాంతి సీజన్ ఎంత అద్భుతంగా కలిసొస్తుందో గతంలో మనం చాలానే చూసాము. ఆయన కెరీర్ లో అతికష్టమైన సమయంలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతి సీజన్ ఆదుకుంది.

అలాంటి హిస్టరీ ఉంది కాబట్టి , వచ్చే సంక్రాంతి కూడా ఆయనకు బాగా కలిసొస్తుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. గతం లో ఈయన శ్రీవిష్ణు తో రాజరాజ చోర, స్వాగ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. వీటిల్లో రాజరాజచోరా సూపర్ హిట్ అవ్వగా, స్వాగ్ చిత్రం ఫ్లాప్ అయింది. అయినప్పటికీ స్వాగ్ చిత్రం ఓటీటీ లో విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్, న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో శ్రీ విష్ణు ద్వారా దిల్ రాజు వద్దకు రావడం , ఆయన వెంటనే రవితేజ తో కలిపించి స్టోరీ ని వివరించడం , రవితేజ కి తెగ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన ఈ క్రేజీ మల్టీస్టార్రర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే , రీసెంట్ గానే ఆయన సింగిల్, విష్ణు విన్యాసం వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సన్నీ సంజయ్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తూనే , మరోపక్క తనకు సామజవరాగమనా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రామ్ అబ్బరాజు తో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన ఈ మల్టీస్టార్రర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు.

 

ఒక్కఛార్జింగ్ తో మూడు రోజుల బ్యాకప్.. పవర్ ఫుల్ ప్రాసెసర్.. ఈ ఫోన్ ఏందీ మామా ఇలా ఉంది.. !

OnePlus Nord N6
OnePlus Nord N6

OnePlus Nord N6: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగం విపరీతంగా ఉంది. దీంతో చాలా మంది బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉన్న ఫోన్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా Oneplus బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో విశేషమేంటంటే.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. అలాగే పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్ ను ఉంచారు. ఇంతకీ ఇది ఏ ఫోన్..? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్లండి..

వన్‌ప్లస్ నుంచి కొత్త మార్కెట్లోకి నార్డ్ N6 వచ్చింది. ఇందులో 8,000mAh భారీ బ్యాటరీ ఉంచారు. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ పెట్టి.. సాధారణంగా వాడితే మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం బ్యాటరీ సామర్థ్యమే కాకుండా, 7 సంవత్సరాల పాటు రోజువారీ వాడకంలోనూ బ్యాటరీ హెల్త్ 80 శాతం పైగా స్థిరంగా ఉండేలా దీనిని రూపొందించారు.

ఈ ఫోన్ లో 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉండటం వల్ల ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. మల్టీటాస్కింగ్, 5G కనెక్టివిటీ కోసం దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ ఎక్కువ సమయం వాడినా లేదా గేమింగ్ ఆడినా వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు

ఈఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్‌ను అందించారు సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో నడుస్తుంది. దీనిలో AI కాల్ సమ్మరీ, సర్కిల్ టు సెర్చ్ వంటి లేటెస్ట్ AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ N6 ధర సుమారు రూ. 18,000 నుంచి రూ. 22,000 మధ్య ఉండే అవకాశం ఉంది. రూ. 20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే బ్యాటరీ లైఫ్, నమ్మకమైన వన్‌ప్లస్ బ్రాండింగ్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక కొత్త వ్యక్తులకు ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు..

WhatsApp Username Feature
WhatsApp Username Feature

WhatsApp Username Feature: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీని మాతృసంస్థ మరో కీలక ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొత్త వ్యక్తితో చాట్ చేయాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌తో ఆ అవసరం లేకుండా పోనుంది. ముందుగా యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇది ఎలా ఉంటుంది? దీనిని ఎలా పొందాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి?

మొబైల్స్ లో యాప్స్ యూజ్ చేసేవారికి యూజర్‌నేమ్ అనేది ప్రత్యేకంగా ఉండే ఒక గుర్తింపు పేరు. భవిష్యత్తులో కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఫోన్ నంబర్‌కు బదులుగా ఈ యూజర్‌నేమ్‌ను షేర్ చేస్తే సరిపోతుంది. దీంతో వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా అపరిచితులు, వ్యాపార సంబంధాలు లేదా గ్రూపుల్లో పాల్గొనే వారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడనుంది.

తాజా వాట్సాప్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే కొంతమందికి యూజర్‌నేమ్ రిజర్వేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తోంది.నోటిఫికేషన్ రాకపోతే..Settings → Account → Username లేదా కొన్ని డివైస్‌లలో ప్రొఫైల్ సెక్షన్‌లో Create Username లేదా Reserve Username అనే ఆప్షన్ కనిపించవచ్చు. దీనిని సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతున్నందున అందరికీ ఒకేసారి అందుబాటులో ఉండదు.

ఒకే డిజిటల్ గుర్తింపును కొనసాగించాలనుకునే వారికి వాట్సాప్ మరో సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో ఉపయోగిస్తున్న యూజర్‌నేమ్ అందుబాటులో ఉంటే దానినే వాట్సాప్‌లో కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, చిన్న వ్యాపారాలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఫీచర్‌లో ప్రధాన ఉద్దేశం యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మరింత సురక్షితంగా ఉంచడం. యూజర్‌నేమ్ ద్వారా సంప్రదించినప్పుడు మీ ఫోన్ నంబర్ ఎదుటి వ్యక్తికి కనిపించదు. అలాగే వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ల కోసం పబ్లిక్ డైరెక్టరీ లేదా సెర్చ్ లిస్ట్ ఉండదు. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలుసుకోవాల్సిందే. దీంతో అనవసర సందేశాలు, స్పామ్ తగ్గే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే కొత్త వ్యక్తులతో తరచూ కమ్యూనికేట్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను గోప్యంగా ఉంచుతూ సురక్షితంగా సంభాషణలు కొనసాగించేందుకు ఇది కొత్త మార్గాన్ని అందిస్తుంది.

నీళ్లను అడ్డుకుంటే నరికేస్తాం.. సిందూ జలాల విషయంలో మొరుగుతున్న పాకిస్తాన్‌!

India Pakistan Water Dispute
India Pakistan Water Dispute

India Pakistan Water Dispute: 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ దాడిని పాకిస్తాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నిర్వహించారని భారత్‌ ఆరోపించి, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని అమలు నిలిపివేసింది. దీంతో రెండు దేశాల మధ్య నీటి వనరుల వివాదం తీవ్ర రాజకీయ రూపం తీసుకుంది. ఇరు పక్షాలు తమ తమ వాదనలను బలంగా వ్యక్తం చేస్తున్నాయి.

ఒప్పందం ఇదీ..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఆరు నదులను రెండు దేశాల మధ్య విభజించారు. తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌పై భారత్‌కు పూర్తి నియంత్రణ ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లో ఎక్కువ భాగం పాకిస్తాన్‌కు కేటాయించారు. దశాబ్దాలుగా ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాని అమలు ప్రశ్నార్థకంగా మారింది.

హోల్డ్‌లో పెట్టిన భారత్‌..
పహల్గామ్‌ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఒప్పందం అమలు నిలిపివేయబడుతుందని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదని భారత్‌ వాదిస్తోంది. గత ఆరు దశాబ్దాల్లో వాస్తవ పరిస్థితులు పూర్తిగా మారాయి కాబట్టి, ఒప్పందాన్ని ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా పునఃపరిశీలించాలని అభిప్రాయపడుతోంది.

భౌభౌ అంటున్న పాకిస్తాన్‌..
పాకిస్తాన్‌ భారత్‌ చర్యను ఏకపక్షంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడమని ఆరోపిస్తోంది. ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగా అమలులో ఉందని, ఏ దేశం ఒంటరిగా దాన్ని రద్దు చేయలేదు లేదా నిలిపివేయలేదని వాదిస్తోంది. పాకిస్తాన్‌కు రావాల్సిన నీటిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. నీటి భద్రతను జాతీయ భద్రతలో భాగంగా చూస్తున్నామని, దానికి ముప్పు ఏర్పడితే ఏ చర్యకైనా వెనుకాడబోమని రక్షణ శాఖ అధికారులు కూడా పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ నిపుణులతో సదస్సు నిర్వహించి తమ వాదనను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఉగ్రవాదమే అసలు సమస్య..
భారత్‌ ఉగ్రవాదం ఆపకుండా సహకారం కొనసాగదని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్‌ మాత్రం ఒప్పందం అంతర్జాతీయ చట్టం ప్రకారం శాశ్వతమని, నీటి హక్కులు ఎవరూ హరించలేరని బలంగా వ్యక్తం చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని భారత్‌ పునరుద్ఘాటిస్తుండగా, పాకిస్తాన్‌ ఈ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపై తీసుకెళ్లి తన స్థానాన్ని బలపరచుకోవాలని చూస్తోంది. ఈ వివాదం కేవలం నీటి వనరులకు మాత్రమే పరిమితం కాదు. ఉగ్రవాదం, దౌత్య సంబంధాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. గతంలో ఒప్పందం యుద్ధాలను కూడా అధిగమించింది. కానీ ఇప్పుడు దాన్ని ఉగ్రవాదం ఆపడానికి లివర్‌గా ఉపయోగించడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. నీటి వివాదం ఆర్థికంగా, వ్యవసాయంగా రెండు దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఒప్పందం పూర్తిగా రద్దు అయినా లేదా సవరణలు జరిగినా, దాని పరిణామాలు దక్షిణాసియా ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, నీటి వనరుల సమస్యలు ఎల్లప్పుడూ దౌత్యబద్ధంగా పరిష్కరించడం ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుంది.

మంచుకొండల్లో.. పాక్ కు కరెంట్ షాక్.. ఇదీ మోడీ మార్క్ ట్రీట్మెంట్.. దెబ్బ అదుర్స్ కదూ

Siachen Base Camp Electricity Project
Siachen Base Camp Electricity Project

Siachen Base Camp Electricity Project: హిమాలయ పర్వతాలు.. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన మీద చేసిన దుర్మార్గాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి. పాకిస్తాన్ చేసిన రక్తపాతానికి సజీవ సాక్షంగా కనిపించాయి. అయితే ఇకపై పాకిస్తాన్ మన మీద ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. రక్తపాతాన్ని ప్రవహింపజేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈసారి పాకిస్తాన్ దేశాన్ని కరెంట్ తో కొట్టింది. దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక దెబ్బకు మన జోలికి పాకిస్తాన్ రాదు.

ఇటీవల పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటి ప్రవాహం విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో కీలక ప్రాంతాలు ఎడారిగా మారిపోతున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా భారత్ పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. మన మీద కయానికి కాలు దువ్వుతూ.. శత్రు దేశాలతో చేతులు కలిపి ఇబ్బంది పడుతూ ఉన్న పాకిస్తాన్ దేశానికి మోడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఫలితంగా పాకిస్తాన్ దేశం ఇకపై నిశ్శబ్దంగానే కాదు.. అన్ని మూసుకొని కూర్చుంటుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్ బేస్ క్యాంప్ లో విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రసారానికి డీజిల్ జనరేటర్లు వాడేవారు. ఇది ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగా ఉండేది. పైగా ఈ ప్రాంతం సముద్రమట్టానికి 12 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని కాపాడుకునేందుకు భారత్ ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేది. ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా లేకపోవడం.. కమ్యూనికేషన్లకు అత్యంత అవసరం ఏర్పడడంతో ఇక్కడ డీజిల్ జనరేటర్ల ను ఉపయోగించేవారు. గతంలో సోలార్.. ఇతర స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఆశించినత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక ఇటీవల కాలంలో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాంతంలో నేషనల్ కరెంట్ గ్రిడ్ తో అనుసంధాదించాలని భావించారు. మొత్తంగా 1925 కోట్ల ఖర్చుతో ద్రాస్ ప్రాంతం నుంచి పదుం వరకు 189 కిలోమీటర్ల మేర 220 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్యాంగ్ ప్రాంతం నుంచి డిస్కెట్ వరకు 79 కిలోమీటర్ల పొడవున 220 కె.వి లైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు మొత్తం సెప్టెంబర్ లోపు పూర్తి కాబోతున్నాయి.

ఇక్కడ విపరీతంగా మంచు ఉంటుంది. గడ్డకట్టుకొని పోయే చలి ఉండటం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా కు విపరీతంగా అంతరాయం ఏర్పడుతూ ఉండేది. గ్రిడ్ తో దీనిని అనుసంధానించడం వల్ల ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. సైనికులకు వసతి కల్పిస్తారు. వేడినీరు కూడా అందిస్తారు. వైద్య సహాయం సకాలంలో కల్పిస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ దేశాన్ని మరింత ఇబ్బంది పట్టేందుకు మన సైన్యానికి అవకాశం ఏర్పడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలు పనిచేసేందుకు కరెంటు తోడ్పడుతుందని అధికారులు అంటున్నారు.

ఆ ఇద్దరు సీనియర్ల మధ్య నలిగిపోతున్న జగన్!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ బలం పుంజుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ల మధ్య పెద్ద వైరం నడుస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు గెలిచారు. అదే సమయంలో రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఓడిపోయారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి మాట నడిచేది చిత్తూరు జిల్లాలో. రాయలసీమలో సైతం ఆయన హవా ఉండేది. అటువంటిది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది.

* పెద్దిరెడ్డి హవా..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఏకంగా కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో సొంత పార్టీ వారు సైతం ఆయన కనుసన్నల్లో ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పేవి కావు. అందుకే అప్పట్లో ఆర్కే రోజాతో పాటు చెవిరెడ్డి లాంటివారు పెద్దిరెడ్డి విషయంలో చాలా గౌరవభావంతో ఉండేవారు. దానికి ప్రధాన కారణం భయం. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది.

* ఇద్దరి మధ్య విభేదాలు..
ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రాయలసీమను చూసేవారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నిత్యం తాడేపల్లి కార్యాలయంలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి విషయంలో పెద్దిరెడ్డి వైఖరి మారినట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో తాడేపల్లి లో చేరారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్ చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని నమ్ముతున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని.. ఆ ఇద్దరు నేతలను సర్ది చెప్పలేక జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

వైసీపీ సోషల్ మీడియా తిరుగుబాటు!

YSRCP Social Media
YSRCP Social Media

YSRCP Social Media: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అండ ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని రాజకీయం చేసింది. పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా పార్టీ నాయకత్వంపై తిరగబడుతోంది. దానికి కారణాలు లేకపోలేదు. వారికి చెల్లింపులు నిలిచిపోవడంతో ఎక్కడికి అక్కడే వారు ఎదురు తిరుగుతున్నారు. ప్రధానంగా ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు తో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ చూస్తే సజ్జల భార్గవ్ రెడ్డి ఈ చెల్లింపులను నిలిపివేయడంపై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎనలిస్టుల రూపంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడే ఓ ఇద్దరూ జర్నలిస్టులు ఇటీవల యూటర్న్ తీసుకున్నారు. దాని వెనుక ఉన్న కారణం కూడా అదే.

* ఆ జర్నలిస్ట్ పై కేసుతో..
ఓ ప్రముఖ ఛానల్ సీఈఓ గా వ్యవహరిస్తున్న ఓ జర్నలిస్టుపై ఇటీవల వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కుమార్తెను చూసేందుకు ఏకంగా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో.. కేంద్ర ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే వైసీపీతో పాటు అప్పట్లో గులాబీ పార్టీ భారీగా ఆయనకు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు టీవీ ఛానల్ ఏపీలో వైసీపీకి, తెలంగాణలో గులాబీ పార్టీకి అండగా నిలిచేది. అందుకే ఏపీలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సైతం సదరు న్యూస్ ఛానల్ సీఈఓ చూసారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏ కామెంట్స్ చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు ఆయన దిశ నిర్దేశం చేసేవారట.

* వ్యాపారానికి మళ్లింపులు..
సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను చూసేవారు సజ్జల భార్గవ్ రెడ్డి. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియాలో భారీగా నియామకాలు చేపట్టారు. చాలా ఏజెన్సీలు కూడా పనిచేసేవి. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ చెల్లింపులను నిలిపివేసింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి నగదు సాయం నిలిచిపోయింది. కానీ ఇలా సోషల్ మీడియాకు ఇవ్వాల్సిన నగదును సదరు జర్నలిస్టు తో పాటు సజ్జల భార్గవరెడ్డి పక్కదారి పట్టించారనేది ఒక ఆరోపణ. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలకు మళ్లించారని జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఈ చెల్లింపులు నిలిపివేశారు అనేది ఒక ప్రచారం. అయితే చెల్లింపులు నిలిచిపోవడంతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇప్పుడు ఆందోళనలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. తప్పకుండా దీని ప్రభావం పార్టీపై పడుతుందని భావిస్తున్నాయి.

50 వేల మంది వానర సైన్యం.. కుంభకర్ణుడితో యుద్ధం..'వారణాసి' మూవీలో అరాచకం..

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie: పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వారణాసి’. బాహుబలి సిరీస్ , #RRR వంటి గ్లోబల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడంతో , ఈ చిత్రం పై రాజమౌళి ముందు సినిమాలకంటే భారీ హైప్ ఏర్పడింది. కొంతమంది మూవీ లవర్స్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను నచ్చుతారు, కొంతమంది భారీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను నచ్చుతారు , కొంతమంది సైన్స్ ఫిక్షన్ సినిమాలను , మన పురాణాలకు సంబంధించిన కథలను నచ్చుతారు , ఈ జానర్స్ అన్నిటిని ఒకే సినిమాలో జోడించి తీస్తే , అదే ‘వారణాసి’. ఇందులో హీరో మహేష్ బాబు ని రాజమౌళి శ్రీ రాముడిగా చూపించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాముడి గెటప్ లో మహేష్ బాబు సన్నివేశాలను కూడా ఇది వరకే చాలా చిత్రీకరించారు.

వచ్చే నెల 6 నుండి హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమాకు అత్యంత కీలంగా మారే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. భారీ సెట్స్ ని ఏర్పాటు చేయగా, అందులో ‘వానరాల దాడి సీన్’ ని తెరకెక్కించబోతున్న రాజమౌళి. అందుకోసం ఆయన ఏకంగా 3600 మంది జూనియర్ ఆర్టిస్టులను బరిలోకి దించుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజువల్స్ ని జోడించి ఈ ఎపిసోడ్ ని ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. సెట్స్ లో పాల్గొనే 3600 మంది జూనియర్ ఆర్టిస్టులను VFX సహాయం తో మల్టిప్లై చేస్తూ , ఏకంగా 50000 మంది వానరులు లంకపై దాడి చేసేట్టుగా చూపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ ని అనుసరిస్తూ ‘కుంభకర్ణుడు’ తో శ్రీరాముడి మహాయుద్ధం సన్నివేశాన్ని కూడా చిత్రీకరించబోతున్నారు రాజమౌళి.

ఈ యుద్ధ ఘట్టం నిడివి వెండితెర పై దాదాపుగా 20 నిమిషాల వరకు ఉంటుందట. సాధారణంగా రామాయణం అంటే మన మేకర్స్ ఎల్లప్పుడూ రాముడు , రావణుడి మధ్య పోరాటాలనే చూపిస్తుంటారు , కానీ రాజమౌళి కాస్త భిన్నంగా ఆలోచిస్తూ కుంభకర్ణుడితో జరిగిన మహా యుద్దాన్ని వెండితెర పై ఆవిష్కరించబోతున్నారు. కేవలం ఈ యుద్ధ సన్నివేశం కోసం అసఙ్ఖారాల 200 కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారట. ఇటీవలే ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా రాజమౌళి అక్కడి ప్రేక్షకులకు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విజువల్ క్లిప్స్ ని ప్రదర్శించి చూపించారు. వాటికి అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి విజన్ కి తగ్గట్టుగా ఈ సినిమా ఔట్పుట్ వస్తే మాత్రం, ఈసారి హాలీవుడ్ రికార్డ్స్ డేంజర్ లో పడుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ఏప్రిల్ 7 న రాజమౌళి సృష్టించే అద్భుతాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది.

ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం

India Vs Ireland
India Vs Ireland

India Vs Ireland: ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా ప్లేయర్ల మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన నాటి నుంచి టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. దాదాపు 1000 కి పైగా రోజులు తన రికార్డును అత్యంత పదిలంగా ఉంచుకుంది. పెద్ద పెద్ద జట్లను సైతం ఓడించి.. వారి సొంత గడ్డల మీద గెలిచి ట్రోఫీలు అందుకుంది. 2024లో.. 2026లో టి20 వరల్డ్ కప్ లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది టీమిండియా.

భయంకరమైన బ్యాటింగ్.. అంతకుమించిన బౌలింగ్ కలిగి ఉన్న టీం ఇండియా అనామకమైన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం టీమిండియా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మాజీ ప్లేయర్లు కూడా ఆటగాళ్ల ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లలో.. టీమిండియా తొలి మ్యాచ్లో 183 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనది. రెండో మ్యాచ్ లో 155 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. పలువురు బ్యాటర్లు చెప్పుకోదగిన స్థాయిలో పరుగులు తీయలేదు.

టీమిండియా వైఫల్యం పట్ల మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్లు ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతారని.. బౌలింగ్ మైదానాల మీద ఆడలేరని ఇప్పటికే సునీల్ గవాస్కర్ దుమ్మెత్తి పోసాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడేందుకు అలవాటు పడిన ప్లేయర్లు.. విదేశీ మైదానాల మీద తడబడుతున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టీం మీడియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇటీవల ఓటమి పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు.. అసలు ఇలాంటి ఆటగాళ్లు ట్రోఫీ ఎలా గెలుస్తారని.. ఇలాంటి ప్లేయర్లు విదేశీ మైదానాల మీద ఎలా ఆడతారని ప్రశ్నించారు. కనీసం మైదానాల రూపకల్పన విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించాడు. ఐపీఎల్ నుంచి ప్లేయర్లు నేరుగా రావడం కూడా ఈ ఓటమికి ఒక కారణమని అతడు అభిప్రాయపడ్డాడు..

అశ్విన్ చేసిన వ్యాఖ్యలు రకరకాల చర్చలు కారణమయ్యాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపిక విధానం పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానం పై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తాయ్. ఐపీఎల్ ఫామ్ మీద ఆధారపడకుండా.. విభిన్న పరిస్థితుల్లో ఆటగాళ్లు చేసిన ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు.. ఐర్లాండ్ జట్టు బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ ను భారత జట్టు కోచ్ అయ్యర్ అభినందించిన తీరును కూడా ఇక్కడ అశ్విన్ ప్రస్తావించాడు. సింగిల్స్ మాత్రమే తీసి టీమిండియా బ్యాటర్లు పరువు తీసుకున్నారని.. కీలకమైన సమయాలలో సరైన ఇన్నింగ్స్ ఆడలేక చేతులెత్తేసారని.. ఈ ఓటమిని గుణపాఠం లాగా మార్చుకోవాలని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్లాట్ పిచ్ ల మీద పులులు.. బౌలింగ్ పిచ్ ల మీద పిల్లులు.. ఇదయ్యా టీమిండియా ప్లేయర్ల అసలు రూపం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
image.png

Displaying

చంద్రబాబు మదిలో ఆ ఇద్దరు!

Chandrababu
Chandrababu

Chandrababu: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెల రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆశవాహులు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఉండడంతో మూడు పార్టీల మధ్య రెండు పదవులు సర్దుబాటు కష్టం. అయితే గతంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు విషయంలో బిజెపితో పాటు జనసేనకు కేటాయింపులు చేసింది తెలుగుదేశం. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ రెండు స్థానాలను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు బిజెపి పెద్దలకు కూడా తెలియజేశారని ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆశావహులు 10 మందికి పైగా ఉన్నారు. వారికి సీట్ల సర్దుబాటు చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారితో పాటు పార్టీ కోసం పని చేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

* రెండు ఎమ్మెల్సీలు ఖాళీ..
వైసిపి హయాంలో గవర్నర్ కోటా కింద కడప జిల్లాకు చెందిన జాకియా ఖానం, పండు రవీంద్రబాబు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. వారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. వారి స్థానంలో ఇద్దరి ఎంపిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, మహాసేన రాజేష్, వర్ల రామయ్య లాంటి చాలామంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పిఠాపురం వర్మతో పాటు వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు టిడిపి కి కావాల్సిన నేతలు. గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఈ ఇద్దరికీ. అందుకే ఆ రెండు పదవులను వీరితో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

* వంగవీటి వారసుడికి..
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాపులపై విపరీతంగా ప్రభావితం చూపే వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా ఉన్న రాధాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రంగా వారసుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే.. టిడిపి అండగా నిలిచిందన్న సానుకూల వైఖరి ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ సైతం కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూటమి వైపు తీసుకు రావడం ద్వారా గట్టి సంకేతాలు పంపవచ్చు. అందుకే చంద్రబాబు రాధాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

* పిఠాపురం వర్మకు..
పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు పిఠాపురం వర్మ. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మది. అటువంటి వర్మ పవన్ కోసం తన సీటును వదులుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో.. వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగానే సాఫీగా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Displaying

వైసీపీలో ఆ మాజీ మంత్రి చాఫ్టర్ క్లోజ్!

Anil Kumar Yadav
Anil Kumar Yadav

Anil Kumar Yadav: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అలా కాకుంటే తప్పించేస్తాను అంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి పార్టీ నుంచి అవుట్ కావడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయనకు జగన్మోహన్ రెడ్డి చాన్స్ ఇవ్వరని కూడా తెలుస్తోంది. ఆయన మూలంగానే నెల్లూరు జిల్లాలో పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికలకు ముందు చాలామంది బలమైన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గ పరిణామాలు కూడా జరిగాయి. అందుకే నెల్లూరులో అసలు అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* రెడ్డి సామాజిక వర్గం దూరం..
నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడానికి అదే ప్రధాన కారణం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సొంత సామాజిక వర్గానికి కాదని అనిల్ కు అవకాశం ఇవ్వడంతో ఆయన నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలను లెక్కచేయలేదు. తనదంత జగన్ తో అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని సైతం అనిల్ కుమార్ యాదవ్ చాలా తక్కువ చేసి చూశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం పార్టీలో ఉండలేదు. మిగతా రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం అనిల్ కుమార్ యాదవ్ వైఖరి తోనే బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియడంతో నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి అనిల్ కుమార్ యాదవ్ను పంపించారు.

* కనిపించని నేత..
నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయిన తర్వాత అస్సలు కనిపించలేదు ఆ నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లాలో కూడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామంతో అనిల్ కుమార్ యాదవ్ కు కూడా అర్థమైంది. కానీ ఆయనకు ఉన్నది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ మాత్రమే. టిడిపి తో పాటు జనసేన విషయంలో అనిల్ ఎంతలా మాట్లాడారో తెలియనిది కాదు. ఆ రెండు పార్టీలను కాదని బిజెపి తీసుకునే అవకాశం లేదు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ కార్యకలపాల్లో పాల్గొనడం లేదు. అసలు ఏపీ వైపు చూడడం కూడా లేదు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బంగారం దొరికే భూమి.. కౌలు కోసం రైతుల పోటాపోటీ

Gold Found Land
Gold Found Land

Gold Found Land: అది ఆరు ఎకరాల భూమి.. రోడ్డు పక్కనే ఉంటుంది.. నీటి సౌకర్యం పర్వాలేదు. అది పూర్తిగా మెట్ట. పత్తి లేదా మొక్కజొన్న మాత్రమే సాగవుతుంది. కాస్త కష్టపడితే పసుపు పండించవచ్చు. ఇంకా ఎక్కువ కష్టపడితే మిరప కూడా సాగు చేయవచ్చు. కాలం అనుకూలిస్తే.. చీడపీడలు దాడి చేయకుంటే.. కూలీలు సకాలంలో దొరికితే.. మద్దతు ధర బాగుంటే ఎంతో కొంత రైతుకు గిట్టుబాటు అవుతుంది.

పైగా నేటి కాలంలో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఉన్నవారు భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలుకు తీసుకున్న వాళ్లు.. పెట్టుబడి ఖర్చులు భరించలేక ఎక్కువ కాలం వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు ఎకరాల భూమి కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కౌలుకు తీసుకోవడానికి చాలామంది రైతులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఒక రైతుకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కౌలుకు తీసుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇలా పోటీ పడటం వెనుక బంగారం లాంటి కారణం ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన ఒక రైతు నుంచి 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ఏరియా తండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈనెల 24న ఆ భూమిలో కలుపు సేకరిస్తుండగా మహిళా కూలీలకు బంగారం లభించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భూమి యజమాని ఆ కూలీలను విచారించి.. అసలు విషయం తెలుసుకున్నారు. బంగారం ఆభరణాలు కూలీలు చూపించగా.. ఆ భూ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ భూమిలో గతంలో ఆలయాలు ఉండేవి. 1991లో అప్పట్లో ఈ భూమి యజమానికి కొంత బంగారం కూడా దొరికింది.. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే పొలంలో ఒక వ్యక్తికి బంగారం దొరికింది. అంతేకాదు గతంలో ఈ ప్రాంతంలో దేవత విగ్రహాలు లభించాయి. నాడు బంగారం దొరికిన వ్యక్తులు.. మళ్లీ ఈ భూమి వైపు రాలేదు. ఆ బంగారం దొరికిన వారు ఆర్థికంగా స్థిరత్వం కూడా సాధించారు. మరోవైపు ఇటీవల దొరికిన బంగారాన్ని పంచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. దానిని తమకు అందించాలని ముందుగా భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ భూమిలో బంగారం దొరికినట్టు వార్తలు రావడంతో చాలామంది రాత్రిపూట ఇక్కడ సంచరిస్తున్నారు. బంగారం కోసం అన్వేషిస్తున్నారు.