Home Blog Page 4

19 నుండి 2వ స్థానం.. పంచాయతీ రాజ్ శాఖలో పవన్ మరో సెన్సేషనల్ రికార్డు!

Pawan Kalyan Tribal Village
Pawan Kalyan Tribal Village

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆద్వర్యం లో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖ కు దేశవ్యాప్తంగా ఎలాంటి ఖ్యాతి వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో జాతీయ పురస్కారాలు ఈ శాఖకు సొంతం అయ్యాయి. దేశ చరిత్ర లోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి ని చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రోడ్ల విషయం లో పవన్ కళ్యాణ్ తన అధికార యంత్రాంగాన్ని ఏ రేంజ్ లో పరుగులు తీయించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రామాల్లో అద్దాలు లాంటి రోడ్లను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంతే కాకుండా క్వాలిటీ విషయం లో పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీపడలేదు. స్వయంగా ఆయన ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. ఇకపోతే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గ్రామా సడక్ యోజన ద్వారా సర్వే నిర్వహించారు.

ఈ సర్వే లో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రోడ్ల నాణ్యత ని పరిశీలించారు. నాణ్యత విషయంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది. వైసీపీ హయాం లో ఇదే సర్వే నిర్వహించగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 19 వ స్థానంలో నిల్చింది. ఆ స్థాయి ర్యాంకు నుండి ఈ రేంజ్ కి ఎగబాకడం అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈ శాఖ ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సాధిస్తున్న ఈ విజయాలను చూసి , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా ఉంటేనే ఆయన ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారు , ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఓజీ నే , రాజకీయాల్లోనూ ఓజీ నే, ఆయనకు సాటి మరెవ్వరు లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ గ్రామీణాభివృద్ధి , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రేంజ్ ఫలితాలను తీసుకొని రాబోతుందో చూడాలి. ఈ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో రాబోతున్నాయని పవన్ కళ్యాణ్ నిన్న తన ఎమ్మెల్యేలు , ఎంపీల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రేపు తన రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవడం కోసం ముంబై కి వెళ్లనున్నారు. అనంతరం ఆయన కొన్ని వారాలు విశ్రాంతి తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం గా ఉండనున్నారు.

సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'లెనిన్'.. గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే!

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరగలేదు కానీ , విడుదల తర్వాత టాక్ వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ లో అక్కినేని సినిమాకు బుకింగ్స్ జరిగి చాలా కాలం అయ్యింది. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఏ రేంజ్ వసూళ్లు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అంచనాకి వద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అంటే షేర్ వసూళ్లు 5 నుండి 6 కోట్ల రూపాయిల మధ్యలో ఉంటుందని అంచనా. ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కృష్ణా , గుంటూరు , నెల్లూరు , రాయలసీమ , గోదావరి జిల్లాలు కలిపి ఈ చిత్రానికి మరో 2 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నైజాం ప్రాంతం లో అయితే 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అంటే షేర్ వసూళ్లు 2 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70 నుండి 1 కోటి రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు రావొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2 కోట్ల 90 లక్షల గ్రాస్ ఉంటుందని , షేర్ వసూళ్లు 1 కోటి 50 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీం.. ట్వీట్ వైరల్..

Pushpa 2 Movie Craze
Pushpa 2 Movie Craze

Allu Arjun Politics : ఈరోజు ఉదయం నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఏంటి ?, రాజకీయాల్లోకి రావడం ఏంటి?, చాలా విడ్డూరంగా ఉందే, పాన్ ఇండియా లెవెల్ లో భారీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ , పీక్ రేంజ్ కెరీర్ ని వదులుకొని ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అసలు వచ్చే సూచనలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదే?, అసలు ఏమి జరుగుతోంది అంటూ అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఈ వార్త ని ప్రచురించింది ఒక టాప్ వెబ్ సైట్, ఒక రాజకీయ పార్టీ కి చెందినది కాబట్టే, ఈ రేంజ్ లో సీరియస్ గా తీసుకున్నారు నెటిజెన్స్. అంతే కాదు , ఆ వెబ్ సైట్ కి వచ్చిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై లో ప్రశాంత్ కిషోర్ ని కలిశారట.

2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడానికి , అదే విధంగా ఈ ఏడాది తమిళనాడు లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సినీ నటుడు విజయ్ సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఏ రేంజ్ లో పనికొచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతనితో అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయమని రిక్వెస్ట్ చేశారట. అంతే కాదు , అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కూడా రాజకీయ పరంగా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది సదరు వెబ్ సైట్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందించింది. అల్లు అర్జున్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర మాట్లాడుతూ ‘మీరు ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తల ప్రచారానికి చెక్ పడింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని పెద్దలు అంటుంటారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి సంప్రదింపులు జరపకపోయుంటే , ఇలాంటి వార్తలు ఈ సమయం లో ఎందుకు వస్తాయి?, కచ్చితంగా ఎదో జరుగుతోంది, సోషల్ మీడియా లో లీక్ అయిపోవడం వల్ల, అల్లు అర్జున్ పీఆర్ టీం కావాలనే ఇలా అబద్దం చెప్పి ఉండొచ్చు కదా.. అల్లు అర్జున్ ఇప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవు, ఆయన టార్గెట్ 2034 ఎన్నికలు కాబట్టి , అల్లు అర్జున్ అప్పుడే ఈ విషయం పై సోషల్ మీడియా లో చర్చ ఎందుకు అనే ఉద్దేశ్యంతోనే తన పీఆర్ టీం తో ఇలా చెప్పించి ఉండచ్చేమో అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు నెటిజెన్స్.

ఇన్ని ఓటములు.. టీమిండియా కు గౌతమ్ గంభీర్ అవసరమా..

Gautam Gambhir mass warning
Gautam Gambhir mass warning

Gautam Gambhir : ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు సంధానకర్తగా వ్యవహరించాడని.. 2024 లో ఐపీఎల్ సాధించడంలో కొంతమేర పాత్ర పోషించాడని నమ్ముతూ గౌతమ్ గంభీర్ కు టీమిండియా మేనేజ్మెంట్ కోచ్ పోస్ట్ ఆఫర్ చేసింది. అతడి కోసం అనేక రకాల నిబంధనలు మొత్తం సడలించింది. అతని కోరినట్టుగా జీతభత్యాలు ఇస్తోంది. సౌకర్యాలు కల్పిస్తోంది. నచ్చిన స్టాఫ్ ను సమకూర్చింది. ఇన్ని చేసినప్పటికీ.. కోట్ల డబ్బు కుమ్మరించినప్పటికీ ఉపయోగం లేదు.

వైట్ బాల్ ఫార్మాట్ లో స్థాయి పోయింది. రెడ్ బాల్ ఫార్మాట్ లో ఏకంగా పునాదులే కదిలిపోయాయి. చరిత్రలో ఎన్నడు లేని ఓటమిలో నమోదయ్యాయి. ఇటువంటి స్థితిలో గౌతమ్ గంభీర్ టీమిండియా కు కోచ్ గా అవసరమా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన నాటికంటే.. రాకముందే టీమ్ ఇండియా పరిస్థితి గొప్పగా ఉన్నది. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి.

గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత స్వదేశంలో ఫస్ట్ టైం న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు వైట్ వాష్ కు గురైంది. వరుసగా మూడు టెస్టులు ఓడిపోయింది.

దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని టీమిండియా కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన ఓటములను ఎదుర్కొంది.

25 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై సౌతాఫ్రికా తో టెస్ట్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఏకంగా రెండు టెస్టులలో ఓటమిపాలైంది. పరుగు మొత్తం పోగొట్టుకుంది.

డబ్ల్యూటీసీ ని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా రెండుసార్లు టీమిండియా ఫైనల్ వెళ్ళింది. కానీ గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా వచ్చిన తర్వాత.. టీ మీడియా మూడోసారి ఫైనల్ వెళ్లలేకపోయింది.

సంత గడ్డమీద న్యూజిలాండ్ చేతిలో తొలిసారి టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది.

టీమిండియా చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఐరిష్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైంది. టి20 సిరీస్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ గడ్డమీద తొలిసారి టీమిండియా టి20 సిరీస్ కోల్పోయింది. ఏకంగా వరుసగా మూడు టి20 మ్యాచ్ లు ఓడిపోయింది. అంతర్జాతీయంగా టి20 చరిత్రలో టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని ఇంగ్లాండ్ చేతిలో మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో ఏకంగా 125 పరుగుల తేడాతో టీమిండియా దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది.

అటు వైట్ బాల్.. ఇటు రెడ్ బాల్.. ఏ ఫార్మాట్ చూసుకున్నా సరే టీమిండియాకు గౌతమ్ గంభీర్ గొప్పగా చెప్పుకునే విజయాలు అందించలేకపోయాడు. అసలు అతని మూర్ఖత్వం వల్ల టీమిండియా లో క్రీడా స్ఫూర్తి అంటూ లేకుండా పోయింది. రోహిత్ శర్మకు పొమ్మను లేక పొగ పెట్టాడు. విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ వెళ్లిపోయాడు. సూర్య కుమార్ యాదవ్ వైట్ బాల్ ఫార్మాట్ నుంచి తిరస్కరణకు గురయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గౌతమ్ శిక్షణలో టీమ్ ఇండియాకు ఎదురైన పరాభవాల మీద ఏకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.

భద్రాద్రి రాముడి మీద భారం వేసిన రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy
CM Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి భద్రాద్రి రాముడు అంటే చాలా ఇష్టం. అందువల్లే ఆయన శ్రీరామనవమి సందర్భంగా సతి సమేతంగా భద్రాచలం వస్తుంటారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తన భార్యతో కలిసివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.. కళ్యాణ ఉత్సవంలో పాల్గొంటారు. భద్రాద్రి రాముడి ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పక్కన పెడితే.. కేవలం యాదగిరి క్షేత్రం సేవలోనే తరించిపోతే.. రేవంత్ రెడ్డి మాత్రం భద్రాద్రి రాముడిని అక్కున చేర్చుకున్నారు. ఆయన ఆలయ అభివృద్ధికి సిద్ధమయ్యారు.. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు.

భద్రాద్రి రాముడి మీద ఉన్న ఇష్టాన్ని రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారు.. రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో వేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని జగన్నాధపురం ప్రాంతంలో బహిరంగ సభలో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు కేసీఆర్ కుటుంబానికి బహిరంగంగా సవాల్ విసిరారు. 2029 మే నుంచి జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182 కు పెరిగిపోతాయి. వీటిల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుంది.. భద్రాద్రి రాముడు మీద ఆన. ఇది ఖమ్మం ప్రజల మాట.. కెసిఆర్ కాచుకో.. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ ఎవరు వస్తారో రండి అంటూ” రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం కౌరవ వంశం గా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

వాస్తవానికి రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దగా నమ్మదు . గతంలో రామసేతు వ్యవహారం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయోధ్య రామాలయం నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకోలేదు. ఆలయ ప్రారంభోత్సవానికి రాలేదు. రాముడు గురించి ఎన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా మాట్లాడలేదు. ఇప్పుడు అయోధ్య వివాదం తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ గొంతు సవరించుకుంటున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రాముడికి అనుకూలంగా మాట్లాడారు.. ఏకంగా రాముడు మీద ఆనవేశారు. ఎంతైనా పూర్వపు రోజుల్లో రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేశారు.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అందువల్లే ఆయన ఇప్పుడు రాముడు గురించి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారని.. ఏకంగా భద్రాద్రి రాముడి మీద 2029 ఎన్నికల ఫలితాలను వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీసీసీఐ తదుపరి ప్లాన్.. గంభీర్ పోస్ట్ ఊస్టేనా..

gautam gambhir
gautam gambhir

Gautam Gambhir : ఐరిష్ సిరీస్ వైట్ వాష్ అయింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కోల్పోయింది. ఇది కూడా కలలో ఊహించలేదు. పైగా దారుణమైన ఓటములు ఎదురయ్యాయి. ఇది కూడా కలలో ఊహించలేదు. ఇన్ని ఉపద్రవాలు.. ఇన్ని ఇబ్బందులు ఇటీవల కాలంలో టీమిండియా ఎన్నడూ చూడలేదు. పైగా వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా కు తిరుగులేదు. అటువంటి జట్టు ఇబ్బంది పడడం.. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓడిపోవడం సగటు భారత క్రికెట్ అభిమానిని కలవర పాటుకు గురి చేస్తోంది.

గతంలో ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు.. వెంటనే జట్టు తేరుకునేది. సూపర్ ఆట తీరుతో ఆకట్టుకునేది. పోరాటాన్ని కొనసాగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేది. అందువల్లే టీమిండియా 2024.. 2026 లో పొట్టి ప్రపంచ కప్ లు అందుకుంది. అటువంటి స్థాయి ఉన్న జట్టు ఇప్పుడు అనామకమైన జట్ల చేతిలో ఓడిపోతోంది. జట్టు ఇలా ఓడిపోవడాన్ని మేనేజ్మెంట్ ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. ఆటగాళ్ల ఆట తీరు.. కోచ్ గంభీర్ వ్యవహార శైలి మీద తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన అసంతృప్తిలో బీసీసీఐ కనిపిస్తోంది.. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తుది జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ వేలు పెడుతూ ఇష్టానుసారంగా ప్లేయర్లను మార్చేస్తున్నాడు. ఇది కెప్టెన్ శ్రేయస్ ను గందరగోళానికి గురిచేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జట్టు మీద అయ్యర్ పట్టు సాధించ లేకపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందువల్లే టీం ఇండియా కనివిని ఎరుగని రేతులో రెండు వరుస సిరీస్ లను కోల్పోయింది.

జట్టు ఇలా ఓడిపోవడం పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్ర అసహనంతో కనిపిస్తోంది. అయ్యర్ మీద.. గంభీర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమ్ ఇండియా స్వదేశానికి రాగానే.. కాయకల్ప చికిత్స ఉంటుందని.. కచ్చితంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గంభీర్ శిక్షణలో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. రెడ్ బాల్ ఫార్మాట్ లో ఇప్పటికే జట్టు అట్టర్ ప్లాఫ్ అయింది. ఇప్పుడు ఆ దరిద్రం వైట్ బాల్ ఫార్మాట్ వరకు వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే టీమిండియా కొంప ముగిపోతుంది. కొంతకాలం పాటు క్రికెట్ మీద పెత్తనం సాగిస్తున్న టీమిండియా.. తన ప్రభను కచ్చితంగా కోల్పోతుంది.

అక్కడిదాకా పరిస్థితి రావద్దు అనుకుంటే.. టీమిండియా మెరుగైన స్థితిలో ఉండాలి అనుకుంటే.. కచ్చితంగా మార్పులు జరగాలి. ఒకప్పటి మాదిరిగా జట్టు ఉండాలి. అద్భుతమైన ఆట తీరు కొనసాగించాలి. ప్లేయర్లలో క్రీడా స్ఫూర్తి కనిపించాలి. ప్లేయర్లను పదేపదే మార్చకూడదు. సారథి విషయంలో కూడా మేనేజ్మెంట్ మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా జట్టు కోచ్ కు అధికారాలను కొంత మేరకు మాత్రమే పరిమితం చేయాలి. అప్పుడు మాత్రమే క్రికెట్లో ఒకప్పటి పెత్తనాన్ని టీమిండియా అందుకుంటుంది. లేకపోతే అంతే సంగతులు.


 

విదేశీ నిధుల కట్టడితో మోడీపై మత సంస్థల అక్కసు

modi matha swetcha

Narendra Modi : భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పించింది. అయితే ఈ హక్కు పేరుతో బలవంతం, మోసం, ప్రలోభాలు లేదా విదేశీ నిధుల ఆధారంగా జరిగే మత మార్పిడులు కూడా “మత స్వేచ్ఛ”లో భాగమేనా అనే ప్రశ్న చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విశ్వాసం వ్యక్తిగత నిర్ణయం కావాలి గానీ, ఆర్థిక లేదా ఇతర ప్రలోభాల ఫలితంగా మారకూడదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

భారత చరిత్రను పరిశీలిస్తే బౌద్ధం, జైనం, సిక్కు మతాలు తమ సిద్ధాంతాలు, తత్వాల ద్వారా ప్రజలను ఆకర్షించాయి. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, గురు గోవింద్ సింగ్ వంటి మహనీయులు తమ ఆలోచనలను ప్రచారం చేశారు. కానీ కాలక్రమేణా విదేశీ దండయాత్రలు, తరువాత వలస పాలనలో కొన్ని ప్రాంతాల్లో బలవంతపు లేదా ప్రలోభపూరిత మత మార్పిడులపై చారిత్రక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బలవంతపు మార్పిడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే విషయంపై విస్తృత ఏకాభిప్రాయం ఉంది.

స్వాతంత్ర్యం తర్వాత కూడా విదేశీ నిధుల సహాయంతో పనిచేసే కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తోంది. సేవా కార్యక్రమాల ముసుగులో మత మార్పిడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పలుమార్లు వెలుగులోకి రావడంతో కేంద్రం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) అమలును మరింత కఠినతరం చేసింది. విదేశీ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా ఖర్చు చేశాయి? వాటి వినియోగం చట్టబద్ధంగానే జరిగిందా? అనే అంశాలపై పారదర్శకతను తప్పనిసరి చేసింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనల ప్రకారం విదేశీ నిధుల వినియోగంపై పూర్తి లెక్కలు సమర్పించాలి. ఆడిటింగ్ తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలు, లైసెన్స్ రద్దు, నిధుల జప్తు వంటి చర్యలకు అవకాశం కల్పించింది. దీనివల్ల స్వచ్ఛంద సంస్థలు మరింత జవాబుదారీగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ చర్యలను సమర్థించేవారి వాదన ఏమిటంటే, సేవా కార్యక్రమాల పేరుతో మత మార్పిడులు జరగకుండా అడ్డుకోవడం, విదేశీ ప్రభావాన్ని నియంత్రించడం, దేశ భద్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని. మరోవైపు విమర్శకులు మాత్రం కొన్ని చట్టబద్ధంగా పనిచేస్తున్న ఎన్జీవోలు కూడా ఈ కఠిన నిబంధనల ప్రభావానికి గురవుతున్నాయని, పౌర సమాజ కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాదిస్తున్నారు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మత స్వేచ్ఛ అంటే వ్యక్తి తన మనస్సాక్షి ప్రకారం మతాన్ని ఎంచుకునే హక్కు. కానీ బెదిరింపులు, మోసం, డబ్బు, ఉద్యోగం, వైద్యం, విద్య వంటి ప్రలోభాల ద్వారా తీసుకునే నిర్ణయం నిజమైన స్వేచ్ఛా నిర్ణయమా అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే. రాజ్యాంగం కూడా ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్యం వంటి పరిమితులకు లోబడి మాత్రమే మత స్వేచ్ఛను గుర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల నియంత్రణలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేస్తోంది. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల వినియోగంపై పారదర్శకతను పెంచడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం ఒకవైపు అవసరమే అయితే, అదే సమయంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సేవా సంస్థలకు అనవసర ఇబ్బందులు కలగకుండా సమతుల్యతను పాటించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత.

ప్రజాస్వామ్యంలో మత విశ్వాసం వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛను ప్రలోభాలు, ఒత్తిళ్లు లేదా విదేశీ నిధుల ప్రభావంతో మలచే ప్రయత్నాలు జరిగితే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా పాలనలో భాగమే. అందుకే మత స్వేచ్ఛను కాపాడుతూనే చట్టవిరుద్ధ మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం, విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను నిర్ధారించడం అనే రెండు లక్ష్యాల మధ్య సమతుల్యతే భారత ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష.

విదేశీ నిధుల కట్టడితో మోడీపై మత సంస్థల అక్కసు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'లెనిన్' సక్సెస్ పై నాగ చైతన్య మౌనం.. సమంత పోస్ట్ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా..

Naga Chaitanya Samantha

Naga Chaitanya Samantha : అక్కినేని ఫ్యామిలీ ఈరోజు ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే మూడవ తరం వారసుడిగా ఇండస్ట్రీ లోకి భారీ హైప్ తో వచ్చిన అక్కినేని అఖిల్ , మొదటిసారి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 11 ఏళ్ళు అవుతున్నప్పటికీ , అఖిల్ కి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. హల్లో చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇక మిగిలిన సినిమాలు అఖిల్ , మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి చిత్రాలు దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. మూడవ తరంలో అక్కినేని ఫ్యామిలీ నుండి సూపర్ స్టార్ రాబోతున్నారని భారీ ఆశలు పెట్టుకుంటే , చివరికి ఇలా అయ్యిందేంటి?, అఖిల్ కెరీర్ లో అసలు సక్సెస్ చూస్తాడా ? అనే అనుమానాలు అక్కినేని ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.

సరిగ్గా అలాంటి సమయం లోనే నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లెనిన్’ చిత్రం సమాధానం ఇచ్చింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అఖిల్ ఈ రేంజ్ లో హిట్ కొట్టినందుకు ఆయన కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది. నాగార్జున అయితే మబ్బులో తేలుతున్నారు. అయితే అక్కినేని నాగ చైతన్య లో ఆ రేంజ్ సంతోషం లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే నేడు జరిగిన కేక్ కటింగ్ సంబరాల్లో అక్కినేని నాగ చైతన్య పాల్గొనలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి, ఇది నాగ చైతన్య సినిమా లెక్కలోకి వస్తుంది. రాకరాక వచ్చిన హిట్ , టీం తో కలిసి సంబరాలు చేసుకోవాలి కదా.

కానీ నాగ చైతన్య ఎందుకు రాలేదు అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు , మీడియా ముందు కనిపిస్తేనే వాళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్టా ?, వ్యక్తిగతం గా వాళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి, అవి బయటకు తెలియాల్సిన అవసరం లేదు , వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకొని ఉంటారని కొంతమంది అభిమానులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో అఖిల్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ గురించి చాలా గొప్పగా మాట్లాడుతారు. అదే విధంగా సమంత కూడా నేడు అఖిల్ కి ‘లెనిన్’ విడుదల సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పింది. సమంత తో క్లోజ్ గా ఉండడం నాగ చైతన్య కి నచ్చకపోవడం వల్లే, ఆయన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదా? అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, వీళ్లిద్దరు కలిసి సక్సెస్ మీట్ లో కనిపిస్తే , సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఈ రూమర్స్ కి చెక్ పడుతుంది.

తండ్రి కాళ్ళు పట్టుకొని వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన అక్కినేని అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni

Akhil Akkineni : అక్కినేని అఖిల్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు దాటింది. ‘మనం’ మూవీ లో ఒక చిన్న క్యామియో తో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ని చూసిన ఆడియన్స్ , అక్కినేని ఫ్యామిలీ నుండి మరో సూపర్ స్టార్ ఇండస్ట్రీ కి వచ్చేశాడు అని అంతా అనుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ‘అఖిల్ – ది పవర్ ఆఫ్ జువ్వ’ చిత్రంతో గ్రాండ్ గా హీరోగా వెండితెర అరంగేట్రం చేశారు అఖిల్. ఆ సినిమాకు భారీ రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ , ఫుల్ రన్ లో పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. ఇక ఆ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన ప్రతీ సినిమా అభిమానులను నిరాశపరుస్తూనే ఉంది. ఎన్నో ఆశల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది.

దీంతో బాగా గ్యాప్ తీసుకొని ‘లెనిన్’ మూవీ స్టోరీ ని ఓకే చేశారు అఖిల్. ఈ సినిమాకు అక్కినేని నాగార్జున తో పాటు , సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కూడా నిర్మాత బాధ్యతలు పంచుకునేందుకు ముందుకు వచ్చారు. అలా మూడేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అన్ని సెంటర్స్ లో అదిరిపోయాయి. అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఈ చిత్రం నిల్చింది. అక్కినేని అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తగ్గ ఫలితం రావడం తో , వారి కళ్ళల్లో ఆనందం తో నిండిపోయిన కన్నీళ్లు కనిపించాయి. ఎట్టకేలకు మా హీరో సక్సెస్ కొట్టేసాడు అనే ఆనందంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్కినేని అభిమానులు థియేటర్స్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి ఎలాంటి ఎమోషన్ ని ఇచ్చిందో , అఖిల్ కి అంతకు మించి వంద రేట్లు ఎక్కువ ఎమోషన్ ని రప్పించింది. ఈ సందర్భంగా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో , ANR విగ్రహం ఎదుట మూవీ టీం కేక్ కట్ చేసింది. అఖిల్ తో పాటు నాగార్జున కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అయితే అఖిల్ ఈ సందర్భంగా నాగార్జున కాళ్ళు పట్టుకొని , ఆ తర్వాత ఆయన్ని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడవడాన్ని చూసి అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ANR లేజసీ ని నాగార్జున విజయవంతంగా కొనసాగించడమే కాదు , నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లారు. కానీ ఆయన తనయుడు వరుసగా విఫలం అవుతూ రావడంతో , ఇక ఇతను హీరోగా పనికిరాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటి సమయంలో ఈ రేంజ్ హిట్ రావడం తో అఖిల్ తన ఎమోషన్ ని ఆపుకోలేకపోయారు.

లెనిన్ సక్సెస్ క్రెడిట్ నాగార్జున కి ఇవ్వాల్సింది...

Nagarjuna
Nagarjuna

Nagarjuna: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం భారీ డిజాస్టర్లను మూటగట్టుకొని వెనకడుగు వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను విశేషంగా అపరిస్తారు అనే ఒక టాక్ అయితే ఇండస్ట్రీ లో ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కొద్దిరోజుల నుంచి ఆయన ఒక సక్సెస్ ని సాధించడానికి విలవిల్లాడిపోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున ఎలాగైనా సరే అఖిల్ కెరీర్ నిలబెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగినట్టుగా తెలుస్తుంది. అందుకే లెనిన్ సినిమా విషయంలో నాగార్జున ఇన్పుట్స్ చాలా వరకు ప్లస్ అయ్యాయని ఆయన దగ్గరుండి మరి అన్ని చూసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే నాగార్జున సినిమా చూసి మూవీ బాగుంది అంటూ ఒక రివ్యూ అయితే ఇచ్చాడు. ఇక దానికి తగ్గట్టుగానే అఖిల్ డబ్బింగ్ ఎలా చెప్పాలి. తన మాడ్యులేషన్ లో కూడా ఎలాంటి ఒక స్పష్టత తీసుకురావాలి అనేది కూడా నాగార్జున దగ్గరుండి మరి చూసుకున్నారట… ఇక మొత్తానికైతే అఖిల్ కెరియర్ ను నిలబెట్టడానికి నాగార్జున తీవ్రమైన ప్రయత్నం చేశాడు.

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ను టాప్ హీరో చేయాలని అనుకున్న నాగార్జున కల ఇన్ని రోజుల పాటు కలగానే మిగిలిపోయింది. మరి ఇప్పటికైనా ఆయన లెనిన్ సినిమాతో సక్సెస్ ని సాధించాడు కాబట్టి టాప్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా? లేదంటే మరోసారి డీలా పడిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…

ఇక లెనిన్ సినిమా సక్సెస్ లో నాగార్జున క్రెడిట్ తప్పకుండా ఉంటుందని ఆయన ఒకటికి 10 సార్లు సినిమాని చూస్తూ ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి అనేది చెబుతూ వచ్చాడట. ఇక గత 20 రోజుల నుంచి నాగార్జున సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను పెట్టాడు.

ప్రస్తుతం ఆయన ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నప్పటికి ఆ సినిమా షూటింగ్ ను సైతం పక్కనపెట్టి ఈ సినిమా కోసమే తను అహర్నిశలు కష్టపడినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మొత్తానికైతే తన కొడుకుకి అనుకున్న విజయాన్ని కట్టబెట్టడంలో నాగార్జున సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

రూ. 4.58 లక్షల కోట్లతో ఏపీలో నయా ఇండస్ట్రియల్ హబ్.. ఆ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయా

Rayalaseema Industrial Hub
Rayalaseema Industrial Hub

Rayalaseema Industrial Hub: ఫ్యాక్షన్ గొడవలు.. బాంబులు.. కొట్లాటలు.. ప్రాణాలు తీయడాలు.. ఇవి సినిమాలో మాత్రమే కాదు.. రాయలసీమలో రియల్ గా జరిగేవి. ఐదు రూపాయల కోసం దారుణాలు జరుగుతాయని ఓ సినిమాలో చూపించారంటే.. రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రాయలసీమ.. కరువుకు కేరాఫ్ అడ్రస్. వలసలకు కేరాఫ్ అడ్రస్. దారిద్రానికి కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మారిపోయింది. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ తనముఖ చిత్రాన్ని ఈసారి పూర్తిగా మార్చుకుంటున్నది. ఒక నివేదిక ప్రకారం రాయలసీమ ప్రాంతంలో సుమారు 4.58 లక్షల పెట్టుబడులను కంపెనీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏకంగా 275 పారిశ్రామిక ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, కర్ణాటక సరిహద్దు చుట్టుపక్కల ప్రాంతాలు వివిధ రంగాల పెట్టుబడులతో నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఒకప్పుడు ఏమో గాని.. ఇప్పుడైతే అత్యంత ఆశాజనకమైన అభివృద్ధి ప్రాంతాలలో ఒకటిగా నిలవబోతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు భూమిగా పేరుగాంచింది. ఇప్పుడు పునర్పాదక ఇంధనం.. తయారీరంగం.. లాజిస్టిక్స్.. వంటి రంగాలలో మొత్తంగా 275 పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి. ఫలితంగా రాయలసీమ దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందబోతోంది.

రాయలసీమ లో అన్నమయ్య.. సత్యసాయి.. అనంతపురం.. నంద్యాల.. కడప.. కర్నూలు.. తిరుపతి వంటి ఏడు జిల్లాలు ఉన్నాయి.. ఈ ఏడు జిల్లాలు బెంగళూరు.. హైదరాబాద్.. చెన్నై నగరాలతో అనుసంధానం చేసే జాతీయ ప్రధాన రహదారులను కలిగి ఉన్నాయి. అనంతపురం కర్ణాటక సరిహద్దుకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సత్య సాయి పుట్టపర్తి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో హిందూపూర్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు 95 కిలోమీటర్లు.. నంద్యాల 150 కిలోమీటర్లు.. కడప 150 కిలోమీటర్లు.. అన్నమయ్య 140 కిలోమీటర్లు.. తిరుపతి 2.0 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

4.5 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా మొత్తంగా 3.57 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలుస్తోంది.. పునరుత్పాదక శక్తి తయారీ.. ఎలక్ట్రానిక్స్.. ఆహార శుద్ధి.. సిమెంట్.. లాజిస్టిక్స్.. వస్త్ర పరిశ్రమ వంటి రంగాలలో ఇక్కడ కర్మాగారాలు ఏర్పాటు కాబోతున్నాయి. అతిపెద్దదైన సౌర. పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాయలసీమ కేంద్రంగా మారబోతోంది.

ప్రధాన ప్రాజెక్టులు

గ్రీన్కో సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కర్నూలులోని పిన్నపురం ప్రాంతంలో ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రాజెక్టు మీద గ్రీన్కో కంపెనీ 30 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది.. ఈ ప్రాజెక్టు మొత్తం 5230 మెగా వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇందులో మూడు వేల మెగావాట్లు సౌర విద్యుత్.. 550 మెగావాట్లు పవన, 1680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీలు ఉన్నాయి.

జెెఎస్ డ బ్ల్యూ రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారం. కడప ప్రాంతంలో రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు జెెఎస్ డ బ్ల్యూ స్టీల్ 16,350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ కర్మాగారం ప్రారంభ సామర్థ్యం 2 ఎంటీపీఏ గా ఉంది. భవిష్యత్ కాలంలో అది 5 ఎంటీపీఏ కు విస్తరించే అవకాశం ఉంది. దీనిద్వారా పదివేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.

పునరుత్పాదక ఇంధన పార్కులు

సత్యసాయి అనంతపురం జిల్లాలో 72 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో మడకశిర సోలార్ పార్క్ ఏడువేల కోట్లతో ఏర్పాటు కాబోతోంది. యశస్వ పవర్ ప్రాజెక్ట్ 2 మెగా వాట్లు.. ఎన్టిపిసి సోలార్ పార్క్ 1.2 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కాబోతోంది.

రిలయన్స్ న్యూ ఎనర్జీ ప్రాజెక్టు..

సత్యసాయి జిల్లాలో 51,300 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో రాయలసీమలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఇండి చిప్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు కాబోతోంది. 14,000 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో నెలకు 10,000 నుంచి 50 వేల వేపర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.

తిరుపతిలో 2,500 కోట్ల వ్యయంతో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది. కంపెనీ వార్షిక ఉత్పత్తికి అదనంగా 9 లక్షల మోటారు సైకిళ్లను తయారుచేస్తారు. 5000 నుంచి 15వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ.. శ్రీ సిటీ ప్రాంతంలో 1000 కోట్ల ఖర్చుతో కొత్త ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ కొరియాలోని పేరుపొందిన పాదరక్షల తయారీ సంస్థ హ్వ సింగ్ అనే కంపెనీ 898 కోట్ల పెట్టుబడితో చిత్తూరులో తన మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తంగా 17,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది.

రిలయన్స్ రిటైల్ పానీయాల కేంద్రం కర్నూల్ లోని ఓర్వకల ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో వందల కోట్ల పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. 5000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు ఇవ్వబోతోంది.

ఇప్పుడు Yamaha నుంచి కూడా.. ఫ్లెక్సీ ఫ్యూయల్.. ధర ఎంతంటే..

Yamaha FZ Blue Flex
Yamaha FZ Blue Flex

Yamaha FZ Blue Flex: పెట్రోల్ ధరలతో పాటు వాతావరణ కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్లెక్సీ వాహనాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే Hero కంపెనీ నుంచి ఇప్పటికే స్ల్పెండర్ ఫ్లెక్సీ వెహికల్ ను తీసుకొచ్చార. ఇప్పుడు యమాహా మోటార్ ఇండియా కూడా తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ‘యామాహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్’ (Yamaha FZ Blue Flex) ను అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియంతో పాటు స్టైలిష్ బైక్ కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉండనుంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Yamaha FZ Blue Flex బైక్ లో E20 (20% ఇథనాల్) నుంచి E85 (85% ఇథనాల్) వరకు కలిపిన ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనంతో సులభంగా నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలు భారీగా తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజువారీ వాడకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేర్వేరు మోతాదుల ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా దీని ఇంజన్‌ను ప్రత్యేకంగా రీ-ఇంజనీరింగ్ చేశారు.

ఈ బైక్ లో 149cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను అమర్చారు. అయితే, ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికత కారణంగా సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే దీని పవర్‌లో స్వల్ప మార్పులు వచ్చాయి. ఈ ఇంజన్ 11.3 bhp పవర్‌ను, 12.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

లుక్స్ పరంగా ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ ఎఫ్‌జెడ్ సిరీస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఏరోడైనమిక్ బాడీవర్క్, కాంపాక్ట్ ఎగ్జాస్ట్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీటును అందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. నెగటివ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. అయితే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉండవు.

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం దీని ధరను రూ. 1,24,240 గా కంపెనీ నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ బయో-ఫ్యూయల్ విధానాలకు అనుగుణంగా యామాహా ఈ బైక్‌ను తీసుకువచ్చింది.

భద్రత కోసం ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ABS తో పాటు ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. తొలి దశలో ఈ బైక్ దేశంలోని ఇథనాల్ ఇంధన లభ్యత ఎక్కువగా ఉన్న ఆరు ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని యామాహా ‘బ్లూ స్క్వేర్’ డీలర్‌షిప్‌లలో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

రాయల్ లుక్.. ఉమ్మడి ఫ్యామిలీకి బెస్ట్.. ఈ కారు ధర ఎంతో తెలుసా..

Maruti Suzuki XL6
Maruti Suzuki XL6

Maruti Suzuki XL6: మారుతి సుజుకి కంపెనీ నుంచి ఇప్పటి వరకు సెడా నుంచి SUV వరకు అనేక కార్లు వచ్చాయి. అయితే MPVలో ఇప్పటి వరకు ఎర్టీగా గురించి మాత్రమే విన్నాం. కానీ బస్సులు, పెద్ద వాహనాల్లో ప్రయాణించే విధంగా తలపించే మరో కారు ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అదే XL6. ఈ కారు రాయల్ లుక్ తో పాటు ఉమ్మడి కుటుంబం కలిసి దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. మరి ఈ కారు ధర, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

మారుతి సుజుకి XL6 అనేది నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించబడే ఒక ప్రీమియం MPV. ఇది సాధారణ ఫ్యామిలీ కార్లలా కాకుండా, ఒక పవర్‌ఫుల్ SUV తరహా లుక్‌ను కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో ఉండే బోల్డ్ గ్రిల్, దాని గుండా సాగే క్రోమ్ లైన్ కారుకు మంచి రాయల్ లుక్‌ను ఇస్తాయి. నాలుగు చాంబర్లు కలిగిన క్వాడ్ LED హెడ్‌లాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్మోక్ గ్రే LED టెయిల్ లాంప్స్ రాత్రి వేళల్లో ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. దీనికి ఉండే 16 అంగుళాల డ్యూయల్ టోన్ మెషిన్డ్ అలాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ అప్పీయరెన్స్‌ను ఇస్తాయి.

ఈ కారులో 1.462 cc స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 101.64 Bhp పవర్‌ను, 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ అనుభవాన్ని సులభతరం చేయడానికి దీనిలో రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. లాంగ్ రైడ్స్ ఇష్టపడే వారి కోసం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, సిటీ ట్రాఫిక్‌లో హాయిగా డ్రైవ్ చేయడం కోసం 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి.

పెద్ద కారు అనగానే మైలేజ్ తక్కువ ఉంటుందేమో అనే అనుమానం అవసరం లేదు. దీనిలోని స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ (బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ మరియు ఐడిల్ స్టార్ట్-స్టాప్) వల్ల మైలేజ్ చాలా అద్భుతంగా వస్తుంది. పెట్రోల్ మాన్యువల్ గేర్ బాక్స్ లీటరుకు సుమారు 20.97 కి.మీ, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కు 20.27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ లో 26.32 కి.మీ వరకు వెళ్లొచ్చు.

ఈ కారులో 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది. సంగీత ప్రియుల కోసం ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. ఎండ కాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ,కారును మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకునే ‘సుజుకి కనెక్ట్’ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ కార్లో భద్రతకు పెద్దపీట వేసింది. ప్రయాణీకుల రక్షణ కోసం కారు బాడీని సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. బేస్ వేరియంట్ నుండి కారులో 4 నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS , EBD తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. మారుతి XL6 ప్రధానంగా మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ. 11.57 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 14.61 లక్షల వరకు అందుబాటులో ఉంది.

హైదరాబాద్ కు 3వ స్థానం.. ఇది అస్సలు ఊహించనది..

Hyderabad Footpath Ranking 2026
Hyderabad Footpath Ranking 2026

Hyderabad Footpath Ranking 2026: మన దేశంలో చాలా వరకు footpath లు ఆక్రమణకు గురై ఉంటాయి. ఈ నేపథ్యంలో
ప్రధాన నగరాల్లో పాదచారులకు అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఎక్కడెక్కడ ఉన్నాయో ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ ఓ నివేదిక ను విడుదల చేసింది. పాదచారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నడిచే ఫుట్‌పాత్‌లు ఎంత మేర అందుబాటులో ఉన్నాయనే అంశంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఈ నగరంలో ఉన్నాయో చూద్దాం..

స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ ప్రకారం..ఫుట్‌పాత్‌ ల నిర్వహణ దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌ల శాతం
లక్నో 28%, బెంగళూరు 25.9%,హైదరాబాద్ 15.1%, చెన్నై 13.9%, ముంబై, 5.5% గా ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే లక్నోలో పాదచారుల కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల మొదటి స్థానంలో నిలిచింది. నగర ప్రణాళికలో పాదచారుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు 25.9 శాతం ఫుట్‌పాత్‌లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 15.1 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. నగరంలో కొన్ని ప్రధాన రహదారులపై ఆధునిక ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేసినప్పటికీ, ఇంకా విస్తృత స్థాయిలో మెరుగుదల అవసరమని నివేదిక సూచించింది.చెన్నై 13.9 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై కేవలం 5.5 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. అధిక జనసాంద్రత, రహదారులపై ఆక్రమణలు, పరిమిత స్థలం వంటి కారణాల వల్ల ముంబైలో పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌లు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.

భారత నగరాల్లో ఎక్కువ మంది రోజూ నడిచి ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, వారికి తగిన ఫుట్‌పాత్‌లు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలు, పార్కింగ్, నిర్మాణ పనులు, అసమానమైన ఫుట్‌పాత్‌లు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
నివేదిక సూచించిన మార్గదర్శకాలు
పాదచారులకు అనుకూలమైన నగరాల అభివృద్ధి కోసం అన్ని నగరాల్లో వెడల్పైన, నిరంతరాయంగా కొనసాగే ఫుట్‌పాత్‌లు, దివ్యాంగులకు అనువైన ర్యాంపులు, జీబ్రా క్రాసింగ్‌లు, సురక్షిత రోడ్డు దాటే సౌకర్యాలు, మెరుగైన వీధి లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ నివేదిక స్పష్టం చేసింది. పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే నగరాలు నిజమైన అర్థంలో ప్రజలకు అనుకూలంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అఖిల్ కి సారీ చెప్పిన దర్శకుడు...

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు భారీ సక్సెస్ ని కొల్లగొట్టలేకపోయాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన భారీ డిజాస్టర్ గా మిగిలింది ఇప్పుడు ఎట్టకేలకు ఆయన లెనిన్ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సినిమా కథలో కొన్ని కీలకమైన విషయాలను అఖిల్ దగ్గరుండి మరి చూసుకున్నారట. మొదటి దర్శకుడు అఖిల్ చెప్పిన చేంజస్ కి ఒప్పుకున్నప్పటికి టీమ్ మొత్తం కలిసి డిస్కస్ చేసిన తర్వాత అఖిల్ చెప్పిన చేంజెస్ సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ఒప్పుకున్నారట.

మొత్తానికైతే ఇప్పుడు సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో దర్శకుడు అఖిల్ కి సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అఖిల్ మొదట్లో చెప్పిన కొన్ని చేంజెస్ లను దర్శకుడు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అవే సినిమాలో చాలా వరకు ప్లస్ అయ్యాయని అందరు చెబుతుంటే అందుకు ఈరోజు సారీ చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక రాబోయే రోజుల్లో అఖిల్ చాలా మంచి కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సక్సెస్ ని కాపాడుకుంటూ ముందుకు సాగితేనే ఆయన కెరియర్ టాప్ హీరో రేంజ్ లో దూసుకుపోతుంది.

లేకపోతే మాత్రం డీలా పడిపోవడం ఖాయం అని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అఖిల్ మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేయాలి. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన ఒక సక్సెస్ కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే అతనికి ఫ్యూచర్ ఉంటుంది. ఏ మాత్రం నెగ్లెట్ చేసిన కూడా ఆయన కెరియర్ అమాంతం పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది…

లెనిన్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో...

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని అఖిల్ సైతం ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ రాలేదు. దాంతో ఆయన ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో లెనిన్ సినిమాని చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ అఖిల్ దగ్గరికి రాకముందే మరొక స్టార్ హీరో వద్దకు వెళ్ళిందట. కానీ ఆయన ఈ కథనైతే రిజెక్ట్ చేశాడు. దాంతో దర్శకుడు అఖిల్ వద్దకు వెళ్ళాడు. ఈ సినిమా కథ అఖిల్ కి బాగా నచ్చి చేశాడు సూపర్ సక్సెస్ ను సాధించాడు.

ఈ కథ ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది అంటే నాచురల్ స్టార్ నాని దగ్గరికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. కానీ నాని మాత్రం ‘దసరా’ సినిమా తర్వాత ఆయన మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ కథకు తను బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో దర్శకుడు అతన్ని సంప్రదించారట. కానీ నాని మాత్రం ప్యారడైజ్ సినిమా బిజీలో ఉండడం వల్ల ఈ సినిమాని చేయలేనని చెప్పాడు.

దాంతో అఖిల్ దగ్గరికి వెళ్లి కథను వినిపించగా అతను ఈ సినిమా చేశాడు. దాంతో ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి అఖిల్ సిద్ధమయ్యాడు. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది.

ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతుందా ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాని ఓన్ చేసుకోగలుగుతున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక రెండు మూడు రోజుల సమయం అయితే పడుతుంది…అఖిల్ కెరియర్ లోనే ఈ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన మూవీ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

బై బై వైభవ్ సూర్య వంశీ..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: నిజమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వైభవ్ సూర్య వంశీ కనీసం కలలో కూడా ఊహించి ఉండడు.. తన పట్ల సోషల్ మీడియాలో ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతుందని అంచనా వేసి ఉండడు. నిన్నటిదాకా తనమీద పూలు చల్లిన అభిమానులు ఇలా రాళ్లు కూడా వేస్తారని భావించి ఉండడు. కానీ ఇప్పుడు తలచుకొని బాధపడడం తప్ప వైభవ్ సూర్య వంశీ చేసేదేమీ లేదు.

ఐరిష్ సిరీస్ కోసం వైభవ్ సూర్య వంశీని ఎంపిక చేశారు. అతడు మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. దీనికి తోడు ఆ సిరీస్ టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత సూర్య వంశీకి ఇంగ్లాండ్ సిరీస్లో ఆడే అవకాశం వచ్చింది. గతంలో అతడు అండర్ 19 వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ గడ్డమీద ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుపై సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఇప్పుడు కూడా సూర్య వంశీ అదరగొడతాడని.. దుమ్ము రేపు తాడని సగటు అభిమాని ఆశించాడు. కానీ అది సాకారం కాలేదు. పైగా సూర్యవంశీ ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

పదేపదే షార్ట్ పిచ్ బంతులు ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. ఒక సిక్సర్ లేదా ఫోర్ కొట్టి ఊపు తీసుకురావడం.. ఆ తర్వాత అవుట్ కావడం.. ఇలా సాగిపోయింది సూర్య వంశీ ఆట తీరు.. అసలు అలా ఎందుకు ఆడుతున్నాడు.. అలా ఎందుకు అవుట్ అవుతున్నాడు.. బ్యాటింగ్లో ఏమాత్రం మార్పు లేదు.. బంతులను ఎదుర్కొనే విధానంలో కొత్త తీరు కనిపించడం లేదు. ఇలా అయితే ఎలా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇటీవల ట్రై సిరీస్ లో కూడా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడి దూకుడు మామూలుగా ఉండదని.. అతడు టీమిండియాలోకి వస్తే రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయని అందరు అనుకున్నారు. కానీ అతడు ఆశించిన స్థాయిలో ఆట తీరు కొనసాగించడం లేదు. ఐపీఎల్ మాదిరిగా పరుగుల ప్రవాహాన్ని సృష్టించడం లేదు. ఇలా వస్తున్నాడు.. అలా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ఒక ఫోర్ లేదా సిక్సర్ కొట్టి.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఆ తర్వాత పేలని చిచ్చుబుడ్డి మాదిరిగా.. కాంతి విహీనంగా మారిపోతున్నాడు.

మొన్నటిదాకా అతని నామస్మరణ చేసింది సోషల్ మీడియా. అతడు అడుగుపెడితే మాస్.. బంతిని గట్టిగా కొడితే మాస్.. సిక్సర్ కొడితే మాస్ అన్నట్టుగా ఉపమానాలు రూపొందించింది. కానీ ఇప్పుడు అతని పరిస్థితి బై బై వైభవ్ సూర్యవంశీ.. కేవలం నువ్వు ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతావు.. బౌన్సీ మైదానాల మీద ఆడే సత్తా నీకు లేదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలకు సూర్య వంశీ ఎలాంటి సమాధానం చెప్పాడు.. ఐదో టి20 మ్యాచ్ లో తన సత్తా చూపిస్తాడా.. లేకుంటే తన దూకుడు పాలపొంగు అని సరిపెట్టుకుంటాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.