Home Blog Page 47

హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం.. ఇకపై పర్మినెంట్ గా ఉండేది అక్కడే..

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి రోజుకు ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అతని గురించి జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ఎవరు ఎలా అనుకున్న సరే.. ఎలా ప్రచారం చేసినా సరే హార్దిక్ పాండ్యా తన దారిలో తాను వెళుతూనే ఉంటాడు. తాను అనుకున్నది చేస్తూనే ఉంటాడు. ఆట నుంచి మొదలుపెడితే వై వాహిక జీవితం వరకు.. మైదానం నుంచి మొదలు పెడితే ఐపీఎల్ వరకు.. ఇలా ప్రతిదాంట్లో హార్దిక్ పాండ్యా తన మార్క్ చూపిస్తూనే ఉంటాడు.

హార్దిక్ పాండ్యా కెరియర్ ప్రస్తుతం అంత గొప్పగా సాగడం లేదు. వైవాహిక జీవితం కూడా అంత గొప్పగా లేదు. భార్యకు విడాకులు ఇచ్చాడు. మరొక యువతి తో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో అతని ప్రదర్శన మెరుగ్గా లేదు. సారథిగా విఫలమయ్యాడు. ఆటగాడిగా కూడా ఫ్లాఫ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో అతడు ముంబై జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదని తెలుస్తోంది. ముంబై జట్టు నుంచి బయటకు వస్తాడని.. లక్నో జట్టుకు మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా. అతడు ప్రస్తుతం బీసీసీఐ శిక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. బీసీసీఐ శిక్షణ కేంద్రం బెంగళూరులో ఉంది. అతడు పూర్తిస్థాయిలో చికిత్స పొందేందుకు.. పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్లే అతడు బెంగళూరుకి తన మకాం మొత్తం మార్చాడని సమాచారం. బెంగళూరులో అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఒక ప్రాపర్టీని అతడు కిరాయికి తీసుకున్నట్టు సమాచారం. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రాంతాన్ని తనకు ట్రైనింగ్ బేస్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు వైట్ బాల్ క్రికెట్ ఆడాలని పాండ్యా నిర్ణయించుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా కు అందించడంతోపాటు.. 2028లో ఒలంపిక్స్ లో మెడల్ అందుకోవడం తన గోల్ అని పాండ్యా చెప్పినట్టు తెలుస్తోంది. పాండే ఇప్పటికే తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ కోచ్ లను నియమించుకున్నట్టు సమాచారం.. అతనితోపాటు మిహికా కూడా అక్కడే ఉంటునట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్ తో టి20 సిరీస్..అతనిపై వేటు.. వైభవ్ సూర్య వంశీకి చోటు..

India vs England T20 Series
India vs England T20 Series

India vs England T20 Series: ఐర్లాండ్ జట్టు చేతిలో సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా మరో ఛాలెంజింగ్ టోర్నీకి సిద్ధమైంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ఓడిపోవడంతో.. ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడిలోనే ఇంగ్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది.. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది.

ఐర్లాండ్ మైదానాలకు.. ఇంగ్లాండ్ మైదానాలకు పెద్దగా తేడా ఉండదు. అందువల్లే టీం ఇండియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఈ క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోకుండా.. సిరీస్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కూర్పు పట్ల రకరకాల చర్చలు సాగుతున్నాయి. అంతేకాదు టీమిండియా ముందు ఉన్న సవాళ్ల గురించి కూడా మాజీ ప్లేయర్లు చర్చిస్తున్నారు.

ఐర్లాండ్ చేతిలో దారుణమైన ఓటమి తర్వాత భారత జట్టు పై అందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టాలని కోరుతుంటే.. మరికొందరేమో గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్లేయర్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి 2023 తర్వాత భారత్ ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. టి20 ప్రపంచ కప్ 2028 పరంపరలో భారత జట్టు ఓడిపోయిన తొలి టి20 సిరీస్ ఇదే. మొదటి సిరీస్ లోనే టీ మీడియా ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ ఓటమి ని కారణంగా చూపి మొత్తానికి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగని ప్లేయర్ల నిర్లక్ష్యాన్ని సహించకూడదు. ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా అదరగొట్టాలంటే కచ్చితంగా ఆట తీరు మారాల్సిందే.

ఐర్లాండ్ సిరీస్ కు ముందు సంజీవ్ అద్భుతంగా ఆడాడు. టి20 ప్రపంచ కప్ లో అదరగొట్టాడు. కానీ ఐర్లాండ్ సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ల్లో అతడు కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇక వైభవ్ సూర్య వంశీ రిసర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.. తొలి మ్యాచ్లో సంజు అట్టర్ ప్లాఫ్ అయినప్పటికీ.. రెండో మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించారు. అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో అదరగొట్టినప్పటికీ.. రెండవ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో కిషన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సంజు స్థానం ప్రమాదంలో పడిందని విశ్లేషకులు అంటున్నారు. అతడిని పక్కన పెట్టి సూర్య వంశీని ఆడించే అవకాశం లేకపోలేదు.

ఇంగ్లాండ్ తో టి20 సిరీస్: ఈ తెలుగోడి పరిస్థితి ఏంటి.. కలవర పెడుతున్న ఫామ్

Tilak Varma
Tilak Varma

Tilak Varma: బ్యాటింగ్ సమర్థవంతంగా చేస్తాడు. బంతులను గట్టిగా కొడతాడు. క్లిష్ట పరిస్థితుల్లో నిలబడతాడు. పరుగులు చేయడంలో వేగాన్ని ప్రదర్శిస్తాడు. స్థానం లభిస్తోంది.. మేనేజ్మెంట్ అతని మీద పూర్తిస్థాయిలో నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది. కానీ అతడు మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బంతులను గట్టిగా ఎదుర్కొని వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. పొట్టి ఫార్మాట్లో వేగంగా పరుగులు చేయకపోతే జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కు ఐర్లాండ్ సిరీస్ ద్వారా తెలిసి వచ్చింది.

ఐలాండ్ సిరీస్లో తొలి మ్యాచ్లో 21 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. రెండో మ్యాచ్లో 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వాస్తవానికి తిలక్ గనక నిలబడి ఉంటే టీమిండియా కచ్చితంగా రెండవ మ్యాచ్లో గెలిచి ఉండేది. ఫలితంగా ఈ స్థాయిలో ఒత్తిడి ఉండేది కాదు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. భారీ సిక్సర్ కొట్టిన తర్వాత.. తిలక్ వర్మ సహనాన్ని కోల్పోయాడు. అనవసరమైన బంతిని కొట్టి వికెట్ పోగొట్టుకున్నాడు. అతడు అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది. ఒక పరుగు తేడాతో ఓటమిపాలైంది.

తిలక్ వర్మ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఐపీఎల్ 2025 నుంచి స్పిన్నర్ల బౌలింగ్లో అతడి స్ట్రైక్ రేట్ 115.50 మాత్రమే కావడం విశేషం. టి20 ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవారు స్పెండర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. కానీ తిలక్ వర్మ ఆ పని చేయలేకపోతున్నాడు. పరుగులు తీయడం కాదు కదా.. సింగిల్స్ కు మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్ ద్వారా అది బయటపడింది. ఇటీవల ఐపీఎల్లో కూడా తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడా లేకపోయాడు. అతడి లోపాన్ని సవరించుకోలేకపోతున్నాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో రెండవ మ్యాచ్లో అతడు హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. ఎక్కువ బంతులు తీసుకోవడం పట్ల మాజీ క్రికెటర్లు అసహన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే.. తిలక్ వర్మ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అతడు జట్టు కోసం కాకుండా.. తనకోసం బ్యాటింగ్ చేశాడని వ్యాఖ్యానించాడు.

వాస్తవానికి కృష్ణమాచారి వ్యాఖ్యలు తిలక్ వర్మ నిజమైన ఆట తీరును ప్రతిబింస్తోంది. ఎందుకంటే ఐర్లాండ్ బౌలర్ల బౌలింగ్ లో తిలక్ వర్మ అత్యంత నిదానంగా బ్యాటింగ్ చేశాడు. కనీసం దూకుడు కొనసాగించలేకపోయాడు. అందువల్లే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి ఎక్కువైంది. అతడు గనక స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఉంటే కచ్చితంగా టీమిండియా వేరే ఫలితాన్ని సాధించేది. ఇప్పటికైనా ఆలోపాన్ని అతడు సవరించుకుంటే మంచిది. లేకపోతే అతడికి జట్టులో చోటు దక్కడం కష్టమే.

మహేష్ బాబు 'AMB సినిమాస్' పై భారీ జరిమానా.. కారణం ఏంటంటే..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: హైదరాబాద్ లోని మోస్ట్ పాపులర్ థియేటర్స్ లో ఒకటి ‘AMB సినిమాస్’. హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ అవ్వడం తో , రీసెంట్ గా బెంగళూరులో డాళ్బీ స్క్రీన్స్ తో ప్రారంభించారు. అక్కడ కూడా ఈ థియేటర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రేక్షకులకు తిరుగులేని థియేట్రికల్ అనుభూతిని కలిగిస్తూ, మహేష్ బాబు, సునీల్ నారంగ్ కలిసి నిర్మించిన ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ విభాగం పై GST ట్యాక్స్ తగ్గించింది. అయినప్పటికీ AMB సినిమాస్ అధిక GST ట్యాక్స్ ప్రేక్షకుల నుండి వసూళ్లు చేస్తుందని ఫిర్యాదు రావడంతో GSTAT ఈ థియేటర్స్ కి భారీ జరినామా విధించింది. మొత్తం మీద 1.7 కోట్ల రూపాయలకు గాను AMB సినిమాస్ తక్షణమే 35 లక్షల రూపాయిల జరినామా కట్టాలని GSTAT ఆదేశాలు జారీ చేసింది.

AMB సినిమాస్ తో పాటు మరో 5 థియేటర్స్ ఇలా అధిక GST ట్యాక్స్ ని జనాల నుండి వసూళ్లు చేస్తున్నట్టు గుర్తించిన GSTAT , ఆ థియేటర్స్ కి కూడా జరినామా విధించింది. అందులో కూకట్ పల్లి లో ఫేమస్ థియేటర్ అయినటువంటి భ్రమరాంబ సినిమాస్ కూడా ఉండడం గమనార్హం. ఈ థియేటర్ కి 11 లక్షల 80 వేలు జరినామా కట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జ్యోతి థియేటర్ కి 19 లక్షల 80 వేలు, కుమార్ థియేటర్ కి 2.5 లక్షలు , ASR సినిమాస్ కి 9.6 లక్షలు , విశ్వనాధ్ థియేటర్ కి 9 లక్షలు జరిమానా విధించారు. అంతే కాదు ఈ జరిమానా కి 18 శాతం వడ్డీ కూడా జత చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీంతో సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కూడా AMB సినిమాస్ పై పలు ఆరోపణలు వచ్చాయి. మహేష్ బాబు ఈ ప్రాపర్టీ కి సంబంధించిన పన్నులు కట్టడం లేదని అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇప్పుడు మరోసారి అధిక GST పన్నులు వసూలు చేస్తున్నారంటూ వార్తలు రావడం తో , ఆయనపై సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. మరి దీనిపై మహేష్ బాబు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. త్వరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘AMB క్లాసిక్’ అనే మల్టీప్లెక్స్ కూడా మొదలు కానుంది. ఇలాంటి కీలక సమయంలో ఇలాంటి చిక్కుల్లో పడడం దురదృష్టకరం.

మేఘాలతో ముచ్చట్లు చెబుతారా.. వర్షాలతో సయాటలాడతారా.. మనదేశంలో ఈ ప్రాంతం ఎక్కడుందంటే..

Meghalaya
Meghalaya

Meghalaya: ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చాలామంది భారతీయులు విహారయాత్రలకు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతున్నారు. విదేశాలకు వెళ్లడం మంచిదే.. కానీ మన దేశంలో కూడా అంతకుమించిన అందాలు.. ప్రకృతి సోయగాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో మేఘాలయ ముందు వరుసలో ఉంటుంది.

మేఘాలయ పేరులోనే మేఘముంది. ఇక్కడ ఎత్తైన కొండలు.. ఈశాన్య ప్రాంతంలో ఉన్న అడవులు.. అనుభూతి చెందాలే గాని.. ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా గొప్పగానే ఉంటుంది. జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. మేఘాలు రారమ్మని కబురు పెడతాయి. వర్షాలు సరికొత్త ఆనందాన్ని అందిస్తుంటాయి. ఇక్కడ ప్రతి ప్రయాణం ఒక మధురంగా.. జీవితకాల జ్ఞాపకంగా సాగిపోతూ ఉంటుంది

మేఘాలయ రాజధాని షిల్లాంగ్.. ఇక్కడ అడుగుపెట్టగానే బ్రిటిష్ హిల్ స్టేషన్ లాంటి సౌకర్యం ఉంటుంది.. వార్ట్స్ లేక్ దగ్గర సాయంత్రం దగ్గరగాలి అద్భుతంగా ఉంటుంది. చిరపుంజి ప్రాంతంలో మేఘాలు చేతికి అందె ఎత్తులోనే ఉన్నట్టు కనిపిస్తుంటాయి.. నోహ్ ఖలీకై ఫాల్స్ నుంచి పడే ధారలు అద్భుతంగా ఉంటాయి. సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ జీవితకాల అనుభూతిని అందిస్తుంటాయి. డాకిలో ప్రాంతంలో ఉన్న ఉంగాట్ రివర్ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందులో ప్రయాణిస్తుంటే దారిలో తేలుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. లివింగ్ రూటు బ్రిడ్జి కూడా ప్రకృతిలో ఒక భాగంలాగా కనిపిస్తూ ఉంటుంది.

మేఘాలయ ప్రాంతంలో జలపాతాల మధ్య ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కల్పిస్తూ ఉంటుంది. గుహవాటి విమానాశ్రయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఐదు రోజులపాటు ట్రిప్ చేస్తే మేఘాలయ మొత్తాన్ని చూసి రావచ్చు. మావ్ లిన్నాంగ్, చిరపుంజి, డాకి రివర్, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, షిల్లాంగ్ ప్రాంతాలు చూడొచ్చు

హైదరాబాద్ నగరం నుంచి మేఘాలయ వెళ్లడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. బడ్జెట్లోనే పూర్తి కావాలంటే ఒక్కొక్క వ్యక్తికి 28 వేల నుంచి 35 వేల వరకు అవుతుంది. ఒకవేళ స్టాండర్డ్ కంఫర్ట్ ప్లాన్ కావాలి అనుకుంటే 40 ల నుంచి 55000 వరకు ఖర్చవుతుంది. ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే 70 వేల నుంచి 95 వేల వరకు ఖర్చవుతుంది. గుహవాటి నుంచి షిల్లాంగ్ ప్రాంతం వరకు రోడ్డు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ స్టే చార్జెస్ ప్రతి రాత్రి దాదాపు 2000 నుంచి 5000 వరకు ఉంటాయి.

ప్రీమియం రెస్టారెంట్ లో ఉండాలి అనుకుంటే ₹7,000 నుంచి 15000 వరకు ఖర్చు పెట్టుకోవాలి. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. ప్రైవేట్ క్యాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి గుహవాటి ప్రాంతానికి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారు విజయవాడ బెంగళూరు లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరు ద్వారా గుహవాటి చేరుకోవచ్చు.

బలూచ్ ప్రజల గొంతుక ఇతడు.. 17 ఏళ్లుగా పాకిస్తాన్ తొక్కి పెడుతూనే ఉంది..

Baloch National Movement
Baloch National Movement

Baloch National Movement: అతడు అన్యాయాన్ని తట్టుకోలేడు. అక్రమాన్ని సహించలేడు. దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు. అందువల్లే అతడు ఆ ప్రాంతానికి నాయకుడు అయ్యాడు. దీన ప్రజల గొంతుక అయ్యాడు. అటువంటి వ్యక్తులను రాజ్యం ఎప్పటికీ కూడా ఒప్పుకోదు. అంతేకాదు తొక్కేస్తూ ఉంటుంది. అటువంటి పనిని పాకిస్తాన్ ప్రభుత్వం చేసింది. కానీ అతని గురించి వేలాదిశక్తులు. పోరాడుతున్నాయి. అందులో అతని కుమార్తె కూడా ఉంది.

అతని పేరు మహమ్మద్ బలూచ్.. ఇతడు వైద్యుడు.. బలూచ్ నేషనల్ మూమెంట్ (బి.ఎన్.ఎం) సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. బలోచ్ ప్రాంతానికి స్వేచ్ఛ కోసం ఇతడు చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాడు. అయితే ఇతడిని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు 17 సంవత్సరాలుగా అతడిని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. అయితే ఇప్పటికే అతడు జీవించి ఉన్నాడా.. లేక పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసిందా.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

మహమ్మద్ కోసం అతడి కుమార్తె నసీం తీవ్రంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన 17 సంవత్సరాలుగా ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక నాయకుడి పరిస్థితి ఇలా ఉంటే.. అక్కడ సాధారణ ప్రజల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్యమాలను.. స్వేచ్ఛ కోసం గొంతెత్తుతున్న వ్యక్తులను ఏ విధంగా తొక్కేస్తుందో ఇది ఉదాహరణ మాత్రమే. కేవలం మహమ్మద్ మాత్రమే కాదు.. చాలామంది వ్యక్తులను పాకిస్తాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. కఠినమైన కారాగారాలలో ఉంచుతోంది. ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ వారిని బయట ప్రపంచానికి చూపించడం లేదు.. దీనిని బట్టి పాకిస్తాన్ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారికి.. హక్కుల కోసం పోరాడే వారికి.. న్యాయం కోసం నినదించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని విదేశీ జర్నలిస్టులు కూడా అంటున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో ఒత్తిడి పెడుతున్నప్పటికీ.. చివరికి బలుచ్ ప్రజల పోరాటమే గెలుస్తుందని బి ఎన్ ఎం నాయకులు అంటున్నారు.

మహమ్మద్ కోసం ఆయన కుమార్తె నసీం తీవ్రంగా పోరాటాలు చేస్తున్నారు. ఈమె పాకిస్తాన్లో మానవ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2009లో తన తండ్రి అదృశ్యమైన నాటి నుంచి ఆమె పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈమె బలూచ్ లో యాక్షన్ కమిటీ నాయకురాలుగా పనిచేస్తున్నారు. 2014లో క్వెట్టా ప్రాంతం నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈమెను అనేకసార్లు పాకిస్తాన్ బలగాలు అడ్డుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే అవకాశాన్ని కూడా లేకుండా చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకున్న వేలాది మంది కోసం ఈమె పోరాటాలు చేస్తూనే ఉన్నారు.

భారత్లోకి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్.. సంచలన పరిణామం

Pakistan Occupied Kashmir
Pakistan Occupied Kashmir

Pakistan Occupied Kashmir: కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి కార్యకలాపాలు అక్కడ వేగంగా సాగుతున్నాయి. అత్యంత కఠినమైన ప్రాంతంలో కూడా విద్యుత్ సౌకర్యం.. రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు ప్రజాస్వామ్య విధానంలో అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు ఎప్పుడెప్పుడు భారతదేశంలో విలీనం కావాలని చూస్తున్నారు. అందువల్లే కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు.

ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ అక్కడి ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా ఆర్మీపై ఇటీవల దాడులు కూడా చేశారు. దీంతో అక్కడ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోని అక్కడి ప్రజలు తమ నిరసన స్వరూపాన్ని మరో విధంగా మార్చారు. దీంతో పాకిస్తాన్ దేశానికి షాక్ తగిలినంత పని అయింది.

ఇప్పటికే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు నిరసనలను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాము పాకిస్తాన్లో భాగం కాదంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.. మీరు ఇచ్చే రేషన్ మాకు అవసరం లేదు.. మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు.. నిత్యావసరాలు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. కానీ మాకు వేరే దారి ఉంది. మేము కచ్చితంగా మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాం. అంటూ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో నిరసనలు చేపడుతున్న ప్రజలు నినదిస్తున్నారు. రావల్కోట్ ప్రాంతంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

గడిచిన నెల రోజులుగా రావల్కోట్ ప్రాంతంలో ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాలని.. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని.. అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తాము నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ వారం థియేటర్స్ మరియు ఓటీటీ లోకి రాబోతున్న కొత్త సినిమాలు ఇవే..

This Week Release Movies
This Week Release Movies

This Week Release Movies: మూవీ లవర్స్ కి ఈ వారం పండగే అని చెప్పొచ్చు. థియేటర్స్ లోకి వెళ్లి చూద్దాం అనుకునేవాళ్లకు , వీకెండ్ లో ఇంట్లో కూర్చొని మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్లకు మంచి టైం పాస్ దొరకనుంది. వరుసగా క్రేజీ సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ముందుగా థియేటర్స్ లో రాబోయే సినిమాల విషయానికి వస్తే , జులై ౩న భారీ బడ్జెట్ తో కొత్త హీరో విరాట్ కర్ణ ‘నాగబంధం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు అభిషేక్ నూమా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసింది ఈ చిత్రం, మరి థియేటర్స్ లో విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇదే రోజున సత్య దేవ్ హీరో గా నటించిన ‘రావు బహదూర్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా, ‘C/O కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కించిన సినిమా ఇది. జులై 3 న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ వంటివి చూస్తుంటే , ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమాలాగా అనిపిస్తోంది. పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి గూస్ బంప్స్ అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే రోజున బాలీవుడ్ లో స్పై యూనివర్స్ నుండి ‘ఆల్ఫా ‘ అనే చిత్రం రాబోతుంది. అలియా భట్, శార్వరి , బాబీ డియోల్ , అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో , హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మరి థియేటర్స్ లో విడుదలయ్యాక సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఓటీటీ లో కూడా జులై 3 న క్రేజ్ వెబ్ సిరీస్ లు , సినిమాలు వస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ లో ‘గుర్తుకొస్తున్నాయి’ అనే యూత్ ఫుల్ మూవీ, అదే విధంగా సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘సూపర్ సుబ్బు’ అనే మూవీ నెట్ ఫ్లిక్స్ లో జులై 3 న విడుదల కాబోతున్నాయి. ఇక రీసెంట్ గా హాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ‘అబ్సెషన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంట్ రూపం లో అందుబాటులోకి రానుంది. అదే విధంగా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషించిన ఇసుక పట్నం అనే వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రానుంది.

'వారణాసి' సీక్వెల్ పై రాజమౌళి హాట్ కామెంట్స్.. ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడేంటి..

Varanasi sequel
Varanasi sequel

Varanasi sequel: ఈమధ్య కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో నడుస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సరిగ్గా హ్యాండిల్ చేస్తే , ఈ సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ వద్ద వేల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం వంటివి కూడా చూసాము. కొన్ని సినిమాలకు అయితే అవసరం లేకపోయినా కూడా , కేవలం బ్రాండ్ ఇమేజ్ ని ఉపయోగించుకొని సీక్వెల్స్ తీసి డబ్బులు పిండుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఇలాంటి సమయం లో కథ కి తగ్గట్టు , కేవలం ఒక పార్ట్ ఉంటే సరిపోతుంది , రెండు భాగాలు అవసరం లేదు అని అనుకునే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి కూడా ఒకరు. బాహుబలి చిత్రానికి సీక్వెల్ అవసరం కాబట్టే, ఆయన సీక్వెల్ చేశారు. అదే రాజమౌళి #RRR కి సీక్వెల్ చేయలేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి.

అయితే గత కొంతకాలంగా ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకు రెండవ భాగం కూడా మొదలు అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే దీనిపై రాజమౌళి రీసెంట్ గానే విదేశాల్లో జరిగిన ‘యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్’ లో పాల్గొనగా , అక్కడి విలేఖరులు ఈ సీక్వెల్ ప్రస్తావన ని ఆయన ముందుకు తీసుకొని రావడం తో , రాజమౌళి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ వారణాసి చిత్రాన్ని కేవలం ఒక్క భాగం లోనే తెరకెక్కిస్తున్నామని , దీనికి సీక్వెల్ అవసరం ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశ చెందారు. రాజమౌళి తో రెండో సారి పనిచేసే అదృష్టం మా హీరోకి కలుగుతుందేమో అని ఆశపడ్డామని , ఇప్పుడు సీక్వెల్ లేదని చెప్పడం తో బాధాకరం అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను అక్టోబర్ లోపు పూర్తి చేస్తామని ఇదే ఫిలిం ఫెస్టివల్ లో చెప్పుకొచ్చారు రాజమౌళి. డిసెంబర్ నెల నుండి ప్రొమోషన్స్ మొదలుపెట్టే ప్లాన్ లో కూడా ఉన్నట్టు సమాచారం. ఇకపోతే జులై 6 నుండి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో ‘వారణాసి’ లేటెస్ట్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ లో శ్రీరాముడి కుంభకర్ణుడితో యుద్ధం చేసే ముందు లీడ్ సన్నివేశాన్ని 3000 కు పైగా జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించాలని అనుకుంటున్నారట రాజమౌళి. సినిమాలోనే ఈ సీన్ పెద్ద హైలైట్ గా నిలుస్తుంది. ఏప్రిల్ 7 న అంతర్జాతీయ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా , బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.

తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేయబోతున్న హీరో సూర్య.. సీఎం విజయ్ కి చెక్..

Suriya political entry
Suriya political entry

Suriya political entry: మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్స్ కి పార్టీ పెట్టగానే సీఎం అయ్యేంత రేంజ్ ప్రస్తుతానికి ఎవరికీ లేదు. అప్పట్లో ఎన్టీఆర్ కి జరిగింది , ఆ తర్వాత చిరంజీవి కి కూడా జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ అంచనాలు తప్పాయి. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో లాగానే తమిళనాడు లో కూడా సినీ హీరోలకు ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే సీఎం అయ్యే రేంజ్ ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే తలపతి విజయ్ TVK పార్టీ ని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి మొదటి ప్రయోగం లోనే సీఎం అయిపోయారు. దీంతో తమిళనాట మరికొంత మంది హీరోలకు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆశ కలిగిందని లేటెస్ట్ గా తమిళ మీడియాలో జోరుగా వినిపిస్తున్న మాట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని స్టార్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్న సూర్య , రీసెంట్ గానే ‘కరుప్పు’ మూవీ తో భారీ కం బ్యాక్ ఇచ్చి 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా సినిమాల్లో లేకపోవడం , అజిత్ కూడా సినిమాల సంఖ్య బాగా తగ్గించడం తో , తమిళనాడు లో ఏకైక నేటి తరం సూపర్ స్టార్ గా మిగిలిపోయారు సూర్య. ఈ గ్యాప్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని , విజయ్ లాగా మినిమం గ్యారంటీ డైరెక్టర్స్ తో సందేశాత్మక సినిమాలు చేసి, వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని , ఆ ఫేమ్ తో రాజకీయాల్లోకి రావాలని సూర్య చూస్తున్నట్టు లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.

దీనిపై నేషనల్ మీడియా కూడా రీసెంట్ గానే ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటికే సూర్య ‘అగారం ఫౌండేషన్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కొన్నేళ్ల నుండి నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదంతా రాజకీయాల్లోకి రావడానికి సూర్య ఏర్పాటు చేసుకున్న ఆయుధాలు అని , రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. అయితే సూర్య తమిళనాడు టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకరే కానీ , ఆయనకు విజయ్ కి అజిత్ కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లేదు. అందుకే వరుసగా బ్లాక్ బస్టర్స్ ని కొట్టి , జెన్ జీ ఆడియన్స్ లో ఫ్యాన్ బేస్ ని పెంచుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనేది ఆయన ప్లాన్, చూడాలి మరి ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది.

దొంగలు కనిపిస్తే చాలు పట్టుకొని.. టేప్ తో కట్టేస్తున్నాడు .. ఎవరితను.. ఏమా కథ..

Man catches thieves
Man catches thieves

Man catches thieves: దొంగలను పట్టుకుంటాడు. వారు దోచుకున్న సొమ్మును మొత్తం కక్కిస్తాడు. అవసరమైతే వారిని చంపేస్తాడు. ప్రజల ముందు దోషిగా నిలబెడతాడు.. చదువుతుంటే ఎన్నో సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదూ. కానీ ఇతగాడు మాత్రం ఆ సినిమాల నుంచి భారీగానే స్ఫూర్తి పొందినట్టు ఉన్నాడు. అందువల్లే సమాజానికి మేలు కలిగించే పని చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దొంగలకు సింహ స్వప్నం లాగా నిలుస్తున్నాడు. ప్రాంతం కాదు.. ఒక రాష్ట్రం కాదు.. ఒక దేశం మొత్తం ఇతడి పేరు పలకరిస్తోంది. కలవరిస్తోంది. సోషల్ మీడియా మొత్తం ఇతడు పేరు మారు మోగిపోతుంది.

మెక్సికో తెలుసు కదా.. అమెరికాకు పక్కనే ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఒక దేశం ఇది. గతంలో ఈ దేశంలో మెరుగైన ఉపాధి అవకాశాలుండేవి. ప్రజలు కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండేవారు. కానీ కొంతకాలంగా అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో చాలామంది డబ్బు కోసం రకరకాల దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెక్సికో దేశంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించే వారి సంఖ్య పెరిగిపోయింది. సైడ్ లాక్ వేసినప్పటికీ.. దానిని అత్యంత చాకచక్యంగా తీస్తూ ద్విచక్ర వాహనాలను దొంగలు తస్కరిస్తున్నారు. ఆ తర్వాత ఆ వాహనాలను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు.

ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు పెరిగిపోయాయి. పోలీసులు గస్తి కాస్తున్నప్పటికి దొంగలు దొరకడం లేదు. అయితే ఇటువంటి దొంగలకు ఒక వ్యక్తి సింహ స్వప్నం లాగా నిలుస్తున్నాడు. నిలవడం మాత్రమే కాదు దొంగలను అక్కడికక్కడే పట్టుకుంటూ.. దేహ శుద్ధి చేస్తున్నాడు. అంతేకాదు వారి దొంగిలించిన బైక్లను కూడా అక్కడే ఉంచి.. దొంగలకు అసలు సిసలైన శిక్ష విధిస్తున్నాడు.

మెక్సికో దేశంలో దొంగతనాలు భారీగా జరుగుతున్న నేపథ్యంలో.. వారిని బ్యాట్మన్ అవతారంలో ఉన్న వ్యక్తి పట్టుకుంటున్నాడు. పట్టుకోవడం మాత్రమే కాదు.. వారిని స్తంభాలకు కట్టేసి.. చుట్టూ టేపు చుట్టేస్తున్నాడు. వారు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను అక్కడే ఉంచి.. ప్రజలకు తెలిసేలా చేస్తున్నాడు. అంతమంది పోలీసులు ఉన్నప్పటికీ ఈ దొంగలను పట్టుకోలేకపోయారు. కానీ ఆ బ్యాట్మన్ మాత్రం కేవలం 10 రోజుల్లోనే ఐదుగురిని పట్టుకున్నాడు. మెక్సికోలోని మోరెనో ప్రాంతంలో ఈ బ్యాట్మన్ స్టోరీ సంచలనం కలిగిస్తోంది.. అతడిని అక్కడ జనాలు బ్యాట్మన్ అని పిలుస్తున్నారు. మాకోసం వచ్చిన గొప్ప వీరుడు అంటూ పేర్కొంటున్నారు. కానీ పోలీసులు మాత్రం అతడి గురించి తెగ శోధిస్తున్నారు. తాము చేయాల్సిన పని అతడు చేయడంతో.. తమకు పని లేకుండా పోయిందని వారు వాపోతున్నట్టు తెలుస్తోంది.

మనసులో ఏముందో కూడా చెప్పేస్తుందట.. కొత్త ఏఐ.. ఇక కష్టమే..

Brain2Qwerty-V2
Brain2Qwerty-V2

Brain2Qwerty V2: మెటా కంపెనీ ఇటీవల ప్రకటించిన Brain2Qwerty V2 అనే ఏఐ వ్యవస్థ మెదడు కార్యకలాపాలను నేరుగా టెక్ట్స్‌గా మార్చగలదు. మాట్లాడలేని వ్యక్తులు తమ మనసులో ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది కొత్త మార్గం తెరుస్తోంది. శస్త్రచికిత్స లేదా మెదడులో ఏమీ అమర్చకుండానే ఈ సాంకేతికత పని చేస్తుంది. ఇది మెదడు–కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ రంగంలో ఒక ముఖ్యమైన అడుగు.

నాన్‌–ఇన్వేసివ్‌ సాంకేతికత..
ఈ వ్యవస్థ మాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (ఎంఈజీ) అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఇది మెదడు నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలను బయట నుంచే రికార్డ్‌ చేస్తుంది. ఇన్వేసివ్‌ పద్ధతుల్లా మెదడులో ఎలక్ట్రోడ్లు లేదా ఇంప్లాంట్లు అవసరం లేదు. ఇది సురక్షితంగా, సులభంగా ఉపయోగించవచ్చు. ఇతర ఇన్వేసివ్‌ సిస్టమ్స్‌తో పోలిస్తే ఇది విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సహాయపడుతుంది.

ఎలా పని చేస్తుంది?
వాలంటీర్లు QWERTY కీబోర్డ్‌పై వాక్యాలు టైప్‌ చేస్తున్నప్పుడు ఎంఈజీ హెల్మెట్‌ ద్వారా వారి మెదడు సిగ్నల్స్‌ను సంగ్రహిస్తారు. ఈ సిగ్నల్స్‌ను ఏఐ మోడల్‌ విశ్లేషించి టెక్ట్‌ట్‌గా మార్చుతుంది. ఇది రియల్‌–టైమ్‌లో పని చేస్తుంది. డీప్‌ లెర్నింగ్, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ సహాయంతో శబ్దం నిండిన మెదడు డేటాను అర్థవంతమైన వాక్యాలుగా మార్చగలదు.

ట్రయల్స్‌లో సాధించిన ఫలితాలు..
మంది వాలంటీర్లతో సుమారు 22 వేల వాక్యాలపై శిక్షణ ఇచ్చిన తర్వాత, సిస్టమ్‌ సగటున 61 శాతం వర్డ్‌ అక్యూరసీ సాధించింది. ఉత్తమ పనితీరు కలిగిన వ్యక్తిలో 78 శాతంవర్డ్‌ అక్యూరసీ నమోదైంది. సగం కంటే ఎక్కువ వాక్యాలు ఒక్క పదం లోపంతోనే సరిగ్గా డీకోడ్‌ అయ్యాయి. ఇది ఇతర నాన్‌–ఇన్వేసివ్‌ పద్ధతుల కంటే గణనీయంగా మెరుగైనది.

సాధ్యమయ్యే అనువర్తనాలు..
ఈ సాంకేతికత మాట్లాడలేని వ్యక్తుల ముఖ్యంగా మెదడు గాయాలు, స్ట్రోక్‌ లేదా నరాల సమస్యలు ఉన్నవారు తమ ఆలోచనలను వ్యక్తం చేయడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో ఇది వైద్య రంగంలోనే కాకుండా రోజువారీ కమ్యూనికేషన్‌లో కూడా మార్పు తీసుకురావచ్చు. మెటా ఈ కోడ్, డేటాను ఓపెన్‌ సోర్స్‌ చేయడం వల్ల పరిశోధకులు ఇంకా మెరుగుపరచడానికి సులభంగా ఉంటుంది.

ఇంకా అక్యూరసీని మెరుగుపరచాలి. ఎంఈజీ డివైస్‌లు పెద్దవి, ఖరీదైనవి కాబట్టి రోజువారీ ఉపయోగానికి అనుకూలంగా మార్చాలి. ఆలోచనల గోప్యత, డేటా భద్రత వంటి నైతిక సమస్యలు కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అయినప్పటికీ, ఈ పరిశోధన మెదడు–కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించింది. భవిష్యత్తులో ఇది మిలియన్ల మందికి కమ్యూనికేషన్‌ సామర్థ్యాన్ని పునరుద్ధరించే సాధనంగా మారవచ్చు. మెటా వేసిన ఈ అడుగు సాంకేతికత మానవ సామర్థ్యాలను విస్తరించడంలో ఎంత దూరం వెళ్లగలదో చూపిస్తోంది. ఇంకా మెరుగైన వెర్షన్లు వచ్చే వరకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

ప్రాచీన చరిత్రను తాగుతున్న పాకిస్తాన్.. మరో కొత్త నాటకం

Pakistan
Pakistan

Pakistan: పాకిస్తాన్‌ ఇటీవల తన 5 వేల ఏళ్ల పురాతన వారసత్వాన్ని బలంగా ప్రచారం చేస్తోంది. సింధు నాగరికతలోని హరప్పా, మొహంజోదారో, తక్షశిల వంటి ప్రదేశాలు, విశ్వవిద్యాలయాలు తమవని చెప్పుకుంటూ ప్రభుత్వ స్థాయిలోనే ఈ కథనాన్ని ముందుకు తెస్తోంది. 1947లో ఏర్పడిన దేశం తనకు సుదీర్ఘ చరిత్ర, సుసభ్య సంస్కృతి ఉందని నొక్కి చెప్పడం వెనుక కేవలం చారిత్రక ఆసక్తి మాత్రమే కాదు. ఇది రాజకీయ, సాంస్కృతిక, గుర్తింపు సంబంధిత అవసరాల నుంచి ఉద్భవించిన ప్రయత్నం.

అరబ్‌ దేశాలతో గుర్తింపు సంక్షోభం..
పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఉన్నప్పటికీ, అరబ్‌ దేశాల నుంచి పూర్తి గుర్తింపు లభించడం లేదు. అరబ్బుల దుస్తులు ధరించినా, ఇస్లాం అనుసరించినా పాకిస్తానీలను రెండో తరగతి ముస్లింలుగా చూడటం జరుగుతోంది. ఇస్లాం ఒకటే అయినప్పటికీ, జాతీయవాదం వేరు అనే వాస్తవం అనేక ముస్లిం దేశాల మధ్య యుద్ధాలకు దారితీసింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్‌కు ఒక ద్వంద్వ సవాలు ఎదురవుతోంది. పూర్తిగా అరబ్‌ గుర్తింపును అంగీకరించలేకపోతూ, తమ ప్రాచీన చరిత్రను తవ్వి చూపించడం ద్వారా స్వతంత్ర గుర్తింపు కోరుతోంది.

ఇస్లామిక్, జాతీయ గుర్తింపు ప్రయత్నం..
భారత్‌ను కౌంటర్‌ చేయడానికి సాంస్కృతిక వ్యూహంభారత్‌ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికాస్‌ విరాసత్, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వసుదైక కుటుంబం వంటి భావనల ద్వారా తన ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేస్తోంది. సుశృతుడు, నటరాజు వంటి వ్యక్తుల ద్వారా వైద్యం, నృత్యం రంగాల్లో భారత్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. పాకిస్తాన్‌ ఈ ప్రచారాన్ని కౌంటర్‌ చేయడానికి తన భూభాగంలో ఉన్న సింధు నాగరికతను తనదిగా చెప్పుకుంటోంది. సింధు, సరస్వతి నాగరికతలు తమవని చెప్పడం ద్వారా ప్రపంచ వేదికపై భారత్‌తో సమాన స్థాయిలో నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇది రాజకీయంగా, సాంస్కృతికంగా భారత్‌ను సవాలు చేసే వ్యూహంగా కనిపిస్తోంది.

వారసత్వంపై ద్వంద్వ వైఖరి..
పాకిస్తాన్‌ ఒకవైపు సింధి, పంజాబీ పేర్లు, వసంతోత్సవం వంటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు రంజిత్‌ సింగ్‌ విగ్రహాలు ధ్వంసం, గురునానక్‌ జన్మస్థలంలో విధ్వంసం, హిందూ మందిరాల నాశనం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాము సికిందర్‌ (అలెగ్జాండర్‌) అనుచరులమని చెప్పుకుంటూ, పురుషోత్తముడు, పశుపతి, శక్తి పీటాల వంటి స్థానిక సంస్కృతి మూలాలను పూర్తిగా స్వీకరించడం లేదు. ఇది 5 వేల సంవత్సరాల చరిత్రను చెప్పుకునేంతవరకు మాత్రమే పరిమితమైన ఆసక్తిగా కనిపిస్తోంది. నిజమైన సాంస్కృతిక అనుబంధం లేకపోవడం వల్ల ఈ ప్రచారం లోతుగా నాటుకోలేకపోతోంది.

నిలదొక్కుకోవడానికి..
పాకిస్తాన్‌కు ఇస్లామిక్‌ గుర్తింపు, ప్రాచీన స్థానిక సంస్కృతి మధ్య ఉన్న ఈ ద్వంద్వం ప్రధాన సమస్యగా మారింది. అరబ్‌ దేశాలు పూర్తిగా స్వీకరించని పరిస్థితిలో, ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తన పురాతన నాగరికతను ఆధారంగా చేసుకుంటోంది. అయితే ఈ ప్రయత్నం కేవలం రాజకీయ అవసరం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తోంది

పాకిస్తాన్‌ ఈ ఉద్యమం ద్వారా తన గుర్తింపు సంక్షోభాన్ని పరిష్కరించాలని చూస్తోంది. కానీ సంస్కృతిని పూర్తిగా తిరస్కరించలేకపోవడం, అరబ్‌ గుర్తింపు కూడా పూర్తిగా లభించకపోవడం వల్ల ఈ ద్వంద్వం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ వేదికపై తన స్థానాన్ని బలపరచుకోవడానికి చరిత్రను ఉపయోగించడం అనేది ఆధునిక రాజకీయాల్లో సాధారణ వ్యూహం అయినప్పటికీ, దాని విజయం నిజమైన సాంస్కృతిక సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది.

అగ్నిపర్వతం నుంచి బంగారం.. ఈ అద్భుతం ఎక్కడ.. ఎందుకిలా..

Volcano gold formation
Volcano gold formation

Volcano gold formation: సాధారణంగా అగ్నిపర్వతాలు లావాలు విరజిమ్ముతూ ఉంటాయి. ఈ లావా కూడా పరిమాణ క్రమంలో కరకరకాల పదార్థాలుగా మారిపోతూ ఉంటుంది. భూమిలో కలిసిన తర్వాత అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి.. ఖనిజాలుగా మారిపోతూ ఉంటుంది. లావా ప్రవహించిన ప్రాంతం చాలా విభిన్నంగా ఉంటుంది. లావా ప్రవహించినచోట అనేక రకాల మార్పులు మాత్రమే కాదు.. భూమి ఉపరితలం పైన సారవంతమైన మృత్తికలు కూడా ఏర్పడుతుంటాయి. ఇవి పంట ఉత్పత్తికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి.

ఈ భూమ్మీద అత్యంత మంచు ప్రాంతం గా పేరుపొందిన అంటార్కిటికా ఖండంలో మాత్రం అగ్నిపర్వతాలు బద్దలవుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. సహజంగా అగ్నిపర్వతాలు బద్దలవుతున్నప్పుడు ముందుగా దుమ్ము ధూళి బయటకు వస్తుంది. ఆ తర్వాత వేడి వేడి లావా కూడా బయటికి వస్తుంది. కొన్ని సందర్భాలలో విచిత్రమైన ద్రవం కూడా బయటికి వస్తూ ఉంటుంది. భూమి అంతర్భాగంలో పెరిగిన ఉష్ణోగ్రత వల్ల ఇలాంటి అగ్నిపర్వతాల విస్పోటనం జరుగుతూ ఉంటుంది. ఈ విస్ఫోటనం అంచనాలకు అందనిస్థాయిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో లావా కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ ఉంటుంది. రోజుల తరబడి అది వేడిగానే ఉంటుంది.

అంటార్కిటికా ఖండంలో బద్దలవుతున్న అగ్నిపర్వతాలలో మౌంట్ ఎరే బేస్ కూడా ఒకటి. అయితే దీని నుంచి వస్తున్న లావాలో బంగారం కూడా ఉంటుంది. ముడి బంగారం కణాలు ఇందులో కనిపిస్తున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 19 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ భూగర్భంలో గోల్డ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. అగ్నిపర్వతాలు వేడిగా ఉన్నప్పుడు ఈ నిల్వలు కరిగిపోతున్నాయి. అవి ద్రవ, వాయు రూపంలో బయటికి వస్తున్నాయి. అయితే ఈ బంగారం మీద లావా దాదాపు 20 నుంచి 60 మైక్రాన్ ల మేర ఉండడంతో సేకరించడానికి వీలు కావడం లేదు. అందువల్లే ఆ బంగారం అలానే ఉండిపోతుంది.

ఇటీవల కాలంలో కొంతమంది పరిశోధకులు అక్కడ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటార్కిటికా ఖండంలో కేవలం బంగారం మాత్రమే కాకుండా.. ఖరీదైన ఖనిజాలు అనేక ఉన్నాయి. కాకపోతే వాటిని సేకరించడం అంత సులభం కాదు. అక్కడ ఉష్ణోగ్రత – డిగ్రీలలో ఉంటుంది. విపరీతమైన చలి ఉంటుంది. మంచు దట్టంగా పరుచుకొని ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఖనిజాలను సేకరించడం సాధ్యం కాదు

ఒకప్పుడు 10 వేల కార్ల అమ్మకాలు.. ఇప్పుడు 300.. దారుణంగా పడిపోయిన మోడల్..

Renault Kwid sales
Renault Kwid sales

Renault Kwid sales: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్తలో సంచలనం సృష్టించిన చిన్న కారు ‘రెనాల్ట్ క్విడ్’. ప్రస్తుతం ఈ కారు తీవ్రమైన అమ్మకాల క్షీణతను ఎదుర్కొంటోంది. ఆకర్షణీయమైన SUV తరహా డిజైన్, బడ్జెట్ ధర, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా విడుదలైన తొలి రోజుల్లోనే ఈ కారు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఒక దశలో నెలకు సగటున 10 వేలకుపైగా యూనిట్లు విక్రయిస్తూ, ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి వంటి దిగ్గజాలకే గట్టి పోటీని ఇచ్చి బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. కానీ ఇటీవల దీని అమ్మకాలు తీవ్రంగా పడిపోవడానికి కారణమేంటో చూద్దాం..

ఆటోమోబైల్ మార్కెట్లో పెరిగిన పోటీ, కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులతో రెనాల్ట్ క్విడ్ కారు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. మే 2026 అమ్మకాల నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కేవలం 300 రెనాల్ట్ క్విడ్ కార్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఒకప్పుడు వేలల్లో అమ్ముడైన ఈ కారు, ఇప్పుడు వందల సంఖ్యకు పరిమితం కావడం గమనార్హం. గత ఏడాది (2025) ఇదే మే నెలలో కంపెనీ 540 యూనిట్ల క్విడ్ కార్లను విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య మరింత దిగజారింది. అంటే ఏడాది వ్యవధిలోనే ఏకంగా 240 యూనిట్ల అమ్మకాలు తగ్గాయి. శాతం పరంగా చూస్తే ఇది 44.44 శాతం క్షీణతగా నమోదైంది. ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో కస్టమర్ల ఆసక్తి క్రమంగా తగ్గుతోందనడానికి క్విడ్ విక్రయాల గణాంకాలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఇక పవర్‌ట్రెయిన్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. క్విడ్‌లో ఫీచర్ల పరంగా కంపెనీ రాజీ పడలేదు. ఇందులో 999 సీసీ సామర్థ్యం గల 1.0-లీటర్, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 BHP పవర్, 91 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు అనుగుణంగా ట్యూన్ చేసిన ఈ ఇంజన్, ట్రాఫిక్‌లో సాఫీగా డ్రైవింగ్ అనుభూతిని అందించడమే కాకుండా, హైవేపై కూడా తగిన పనితీరును కనబరుస్తుంది.

అయినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్లు మైక్రో-SUVలు, కాంపాక్ట్ SUVల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో క్విడ్ వంటి ఎంట్రీ లెవెల్ కార్లకు ఆదరణ కరువైంది. రానున్న రోజుల్లో రెనాల్ట్ సరికొత్త అప్‌డేట్స్ లేదా ఆఫర్లతో క్విడ్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తుందేమో చూడాలి.

ఓ బందిపోటు దొంగ ముఖ్యమంత్రి కే దమ్కీ ఇచ్చాడు.. చివరికి ఏమైందంటే..

Chambal dacoit
Chambal dacoit

Chambal dacoit: విక్రమార్కుడు సినిమా చూశారా.. అందులో చంబల్ లోయలో టిట్ల అనే బందిపోటు దొంగ ఉంటాడు. అక్కడ ఒక సమాంతర వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటాడు. దోపిడీలు.. దుర్మార్గాలు చేస్తూ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు. ఇప్పుడంటే అటువంటి వాళ్లకు అవకాశం లేదుగానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వరకు అటువంటి దొంగలు ఉత్తర భారత దేశంలో విచ్చలవిడిగా వ్యవహరించేవారు. ప్రజలకు నరకం చూపించేవారు. డబ్బులు.. ఖరీదైన వస్తువులనే కాదు.. ఇంట్లో ఆడవాళ్లను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేవారు.. అటువంటి వారిలో ఇతడు ముందు వరుసలో ఉంటాడు. ఏకంగా ముఖ్యమంత్రి కే భయం అంటే ఏంటో చూపించాడు. చివరికి ఇలా మిగిలిపోయాడు.

అతడి పేరు గుర్జర్.. చంబల్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన దొంగల్లో ఒకడు. ఇతడు దొంగల ముఠాకు నాయకుడిగా ఉండేవాడు. దోల్పూర్ డాంగ్ లోయలో ఎన్నో సంవత్సరాల పాటు తన సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. హత్యలు చేయడం.. దోపిడీలకు పాల్పడటం.. దొంగతనాలు చేయటం.. వసూళ్లకు తెగబడటం.. మనుషులను అపహరించడం.. ఆయుధాలను సమకూర్చుకోవడం వంటి వాటి కింద ఇతడి మీద నేరాలు నమోదయ్యాయి. రాజస్థాన్ నుంచి మొదలుపెడితే మధ్యప్రదేశ్ వరకు ఇతర మీద 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి..

గుర్జర్ రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర ఉండేవారు. నాడు ఆమెకు సంబంధించిన దోల్పూర్ పాలస్ మొత్తాన్ని పేల్చేస్తానని ఇతడు బెదిరించాడు. ఆ స్టేట్మెంట్ ద్వారా అతడు ఒక్కసారిగా జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచాడు. చాలా సంవత్సరాల పాటు పరారీలో ఉన్నాడు. 8 సంవత్సరాల క్రితం భయాన ప్రాంతంలో అప్పటి ఎస్పీ భరత్ పూర్ మాలిని ఎదుట లొంగిపోయాడు.

ఆ తర్వాతనే రాజస్థాన్ లోని అత్యంత కఠినమైన భద్రత ఉండే అజ్మీర్ జైల్లో వేశారు. శిక్ష అనుభవిస్తున్న అతడు ఉన్నట్టుండి చనిపోయాడు. అయితే ఇది హత్య అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడు బ్యారక్ లోనే చనిపోవడం .. పోలీసులకు అనుమానాలు కలిగిస్తోంది. అదర్ చనిపోయినప్పుడు మరొక ఖైదీ కూడా అక్కడే ఉన్నాడు. ఫోరెన్సిక్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. జైలు నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఖైదీలు మొత్తం బ్యారక్ లలోనే ఉంటారు. బ్యారక్ లు తెరిచిన తర్వాత జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. అందులో గుర్జర్ మృతదేహం కనిపించింది. అయితే ఇతడిని భరత్పూర్ ప్రాంతానికి చెందిన కరడుగట్టిన హంతకుడు విష్ణు చంపాడని తెలుస్తోంది. అతడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.గుర్జర్ ఉన్న బ్యారక్ లోనే విష్ణు ఉండటం పోలీసులు అనుమానాలకు కారణం.

ఈ కారును మార్కెట్లో కొనటోడే లేడు.. ఎందుకు డిమాండ్ లేదో తెలుసా

Toyota Glanza
Toyota Glanza

Toyota Glanza: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది Toyota Glanza. అయితే ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా మందగించాయి. 2026 మే నెలలో ఈ కారు ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయలేకపోయింది. గత కొన్ని నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన గ్లాంజా, ఈసారి మాత్రం అటు ఏడాది ప్రాతిపదికన, ఇటు నెలవారీ ప్రాతిపదికన తగ్గింపు అమ్మకాలను నమోదు చేసింది. అసలు ఈ కారు అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటంటే?

గణాంకాల ప్రకారం.. 2026 మే నెలలో టయోటా గ్లాంజా దేశవ్యాప్తంగా మొత్తం 3,198 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అయితే గత ఏడాది (2025) ఇదే మే నెలలో ఈ కారు ఏకంగా 4,753 యూనిట్ల విక్రయాలను సాధించి అదరగొట్టింది. గతేడాది అమ్మకాలతో పోల్చి చూస్తే.. ఈసారి గ్లాంజా అమ్మకాలు దాదాపు 33 శాతం మేర క్షీణించడం గమనార్హం. కంపెనీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

గ్లాంజా కేవలం గతేడాదితో పోలిస్తేనే కాకుండా, అంతకుముందు నెలతో పోల్చినా వెనుకబడింది. 2026 ఏప్రిల్ నెలలో ఈ కారు 3,360 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కానీ మే నెలకి వచ్చేసరికి ఆ సంఖ్య 3,198 యూనిట్లకే పరిమితమైంది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే సుమారు 5 శాతం అమ్మకాల తగ్గుదల నమోదైంది. ఈ నెలవారీ క్షీణత మార్కెట్లో కారు డిమాండ్ స్వల్పంగా తగ్గుతోందనే సంకేతాలను ఇస్తోంది.

టయోటా గ్లాంజా విక్రయాలు ఈ స్థాయిలో పడిపోవడానికి మార్కెట్లో మారుతున్న పరిస్థితులే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆటోమోబైల్ రంగంలో పెరుగుతున్న పోటీ, ముఖ్యంగా కాంపాక్ట్ , సబ్-కాంపాక్ట్ SUVల హవా పెరగడం హ్యాచ్‌బ్యాక్ కార్లపై ప్రభావం చూపుతోంది. వీటికి తోడు ఇతర బ్రాండ్ల నుంచి కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచులు వేగంగా మారడం కూడా గ్లాంజా అమ్మకాలు తగ్గడానికి కారణాలు కావచ్చు.

అయినప్పటికీ, నమ్మకమైన టయోటా ఇంజిన్, అద్భుతమైన మైలేజ్, ప్రీమియం ఫీచర్లు మరియు మెరుగైన రీసేల్ వాల్యూ కారణంగా టయోటా గ్లాంజా ఇప్పటికీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వినియోగదారులకు ఒక బలమైన, నమ్మకమైన ఎంపికగానే కొనసాగుతోంది. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈ కారు తిరిగి పుంజుకుంటుందేమో చూడాలి.