Homeబిజినెస్Toyota Glanza: ఈ కారును మార్కెట్లో కొనటోడే లేడు.. ఎందుకు డిమాండ్ లేదో తెలుసా

Toyota Glanza: ఈ కారును మార్కెట్లో కొనటోడే లేడు.. ఎందుకు డిమాండ్ లేదో తెలుసా

Toyota Glanza: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది Toyota Glanza. అయితే ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా మందగించాయి. 2026 మే నెలలో ఈ కారు ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయలేకపోయింది. గత కొన్ని నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన గ్లాంజా, ఈసారి మాత్రం అటు ఏడాది ప్రాతిపదికన, ఇటు నెలవారీ ప్రాతిపదికన తగ్గింపు అమ్మకాలను నమోదు చేసింది. అసలు ఈ కారు అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటంటే? […]

Toyota Glanza: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది Toyota Glanza. అయితే ఈ కారు అమ్మకాలు ఒక్కసారిగా మందగించాయి. 2026 మే నెలలో ఈ కారు ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయలేకపోయింది. గత కొన్ని నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన గ్లాంజా, ఈసారి మాత్రం అటు ఏడాది ప్రాతిపదికన, ఇటు నెలవారీ ప్రాతిపదికన తగ్గింపు అమ్మకాలను నమోదు చేసింది. అసలు ఈ కారు అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటంటే?

గణాంకాల ప్రకారం.. 2026 మే నెలలో టయోటా గ్లాంజా దేశవ్యాప్తంగా మొత్తం 3,198 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అయితే గత ఏడాది (2025) ఇదే మే నెలలో ఈ కారు ఏకంగా 4,753 యూనిట్ల విక్రయాలను సాధించి అదరగొట్టింది. గతేడాది అమ్మకాలతో పోల్చి చూస్తే.. ఈసారి గ్లాంజా అమ్మకాలు దాదాపు 33 శాతం మేర క్షీణించడం గమనార్హం. కంపెనీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

గ్లాంజా కేవలం గతేడాదితో పోలిస్తేనే కాకుండా, అంతకుముందు నెలతో పోల్చినా వెనుకబడింది. 2026 ఏప్రిల్ నెలలో ఈ కారు 3,360 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కానీ మే నెలకి వచ్చేసరికి ఆ సంఖ్య 3,198 యూనిట్లకే పరిమితమైంది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే సుమారు 5 శాతం అమ్మకాల తగ్గుదల నమోదైంది. ఈ నెలవారీ క్షీణత మార్కెట్లో కారు డిమాండ్ స్వల్పంగా తగ్గుతోందనే సంకేతాలను ఇస్తోంది.

టయోటా గ్లాంజా విక్రయాలు ఈ స్థాయిలో పడిపోవడానికి మార్కెట్లో మారుతున్న పరిస్థితులే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆటోమోబైల్ రంగంలో పెరుగుతున్న పోటీ, ముఖ్యంగా కాంపాక్ట్ , సబ్-కాంపాక్ట్ SUVల హవా పెరగడం హ్యాచ్‌బ్యాక్ కార్లపై ప్రభావం చూపుతోంది. వీటికి తోడు ఇతర బ్రాండ్ల నుంచి కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచులు వేగంగా మారడం కూడా గ్లాంజా అమ్మకాలు తగ్గడానికి కారణాలు కావచ్చు.

అయినప్పటికీ, నమ్మకమైన టయోటా ఇంజిన్, అద్భుతమైన మైలేజ్, ప్రీమియం ఫీచర్లు మరియు మెరుగైన రీసేల్ వాల్యూ కారణంగా టయోటా గ్లాంజా ఇప్పటికీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వినియోగదారులకు ఒక బలమైన, నమ్మకమైన ఎంపికగానే కొనసాగుతోంది. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈ కారు తిరిగి పుంజుకుంటుందేమో చూడాలి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper