Homeఎంటర్టైన్మెంట్Venu Swamy TVK Party: TVK పార్టీ పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆవేశంతో ఊగిపోతున్న...

Venu Swamy TVK Party: TVK పార్టీ పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆవేశంతో ఊగిపోతున్న విజయ్ ఫ్యాన్స్..

Venu Swamy TVK Party: సినీ , రాజకీయ సెలబ్రిటీల జాతకాలు చెప్తానంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వేణు స్వామి , ఎలాంటి తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకుంటున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆయన పేరు అషు రెడ్డి మ్యాటర్ లో కూడా బలంగానే వినిపిస్తూ ఉంది. అయితే నాగ చైతన్య , శోభిత దంపతులు 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకోవడం వల్ల, […]

Venu Swamy TVK Party: సినీ , రాజకీయ సెలబ్రిటీల జాతకాలు చెప్తానంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వేణు స్వామి , ఎలాంటి తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకుంటున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆయన పేరు అషు రెడ్డి మ్యాటర్ లో కూడా బలంగానే వినిపిస్తూ ఉంది. అయితే నాగ చైతన్య , శోభిత దంపతులు 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకోవడం వల్ల, వేణు స్వామి ఈ జాతకులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఆయన చిన్నగా మరోసారి తన స్వరాన్ని వినిపించేందుకు ముందుకు వస్తున్నాడు. రెండు రోజుల క్రితమే , భవిష్యత్తులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టీ పెడతాడని , ముఖ్యమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు .

ఆయన మాట్లాడుతూ విజయ్ సీఎం గా ఎక్కువ కాలం కొనసాగాడని , ఆయన పదవి ఊడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు . దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విజయ్ ఫ్యాన్స్ వేణు స్వామి పై తీవ్రమైన విమర్శలు చేస్తూ మండిపడుతున్నారు. గతం లో ఇలాగే చాలా చెప్పావు , వై ఎస్ జగన్ 2024 లో గెలుస్తాడని అన్నావు , కానీ కనీయం అతనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు, ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతాయని అన్నావు , పాన్ ఇండియా ని షేక్ చేసే బ్లాక్ బస్టర్స్ రీసెంట్ గానే ఆయనకు పడ్డాయి , ఇలా ఒక్కటా రెండా ఎన్నో చెప్పావు అంటూ విజయ్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అయితే వేణు స్వామి జాతకం చెప్పలేదని , కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూసే ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నాడని , ఎందుకంటే విజయ్ కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడని , ఆ ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న దానినే వేణు స్వామి జాతకం గా చెప్పాడని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper