Homeఆంధ్రప్రదేశ్‌Roja Comments: జగన్ తో మొన్న స్టాలిన్ కు.. నేడు విజయ్ కు పోలిక పెడుతున్న...

Roja Comments: జగన్ తో మొన్న స్టాలిన్ కు.. నేడు విజయ్ కు పోలిక పెడుతున్న రోజా!

Roja Comments: కొన్ని విషయాలను కొందరే చెప్పాలి. కొన్ని రకాల ప్రకటనలు కొందరే చేయాలి. అందులోనూ రాజకీయంలో ఉన్నవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రకటనలు చేయాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. సీనియర్లు సైలెన్స్ పాటిస్తున్నారు. జూనియర్ లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా తటస్థ ఓట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రుచించే మాటలు వాడే నేతలకు పార్టీలో […]

Roja Comments: కొన్ని విషయాలను కొందరే చెప్పాలి. కొన్ని రకాల ప్రకటనలు కొందరే చేయాలి. అందులోనూ రాజకీయంలో ఉన్నవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ప్రకటనలు చేయాలి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. సీనియర్లు సైలెన్స్ పాటిస్తున్నారు. జూనియర్ లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇది కచ్చితంగా తటస్థ ఓట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రుచించే మాటలు వాడే నేతలకు పార్టీలో ప్రోత్సహిస్తున్నారు. తటస్థులతోపాటు కొత్త ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు జరగడం లేదు. పార్టీలో పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి విజయం పై జాతీయస్థాయిలో సైతం ఆశ్చర్యపడేవారు. కానీ ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో వేరే పార్టీ విజయంలో క్రెడిట్ వెతుక్కునే పరిస్థితి దాపురించింది.

* క్రెడిట్ ఆరాటం అవసరమా?
తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే దశాబ్దాలుగా వైరి వర్గాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయస్థాయిలో ఆ రెండు పార్టీలు చాలా ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేశాయి. అయితే వారి స్నేహమూ శాశ్వతం కాదు.. శత్రుత్వము ఉండదు. కరుణానిధితో చంద్రబాబు బాగానే ఉండేవారు. చంద్రబాబును జయలలిత గౌరవించేవారు. రాజశేఖర్ రెడ్డి తో సైతం వారికి సంబంధాలు ఉండేవి. కానీ అవి రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చేవి కావు. ఏ రాష్ట్ర రాజకీయం ఆ రాష్ట్రానికి ఉండేది. కానీ ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపు లో కూడా వైసిపి క్రెడిట్ వెతుక్కునే పరిస్థితికి వచ్చింది. 2019లో 151 సీట్లతో దేశం తన వైపు చూసుకునేలా విజయం సాధించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్. అటువంటి పార్టీ విజయ్ గెలుపులో క్రెడిట్ వెతుక్కోవడం ఏంటి. కచ్చితంగా ఏపీ ప్రజల్లో ఇదో నెగిటివ్ ఫీడ్ బ్యాక్.

* రోజా అడ్డగోలు వాదన..
గత రెండు రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియా చూస్తుంటే మాజీ మంత్రి రోజా ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఆమె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేశారు. స్టాలిన్ పాలనను జగన్ పాలనతో పోల్చారు. పనిలో పనిగా చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేశారు తమిళనాడులో. ఇప్పుడు అదే రోజా విజయ్ కోసం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో విజయ్ కు చాలా రకాల పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల విజయ్ గెలిచారని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. పది రోజుల కిందట ఇదే రోజా స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు. ఇప్పుడు అదే ఆమె జగన్మోహన్ రెడ్డితో విజయ్ కు పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. తటస్తులు యావగించుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper