Homeహెల్త్‌Marigold Flower Benefits: బంతి పూలే కదా అని.. తేలిగ్గా తీసి పారేయకండి.. శాస్త్రవేత్తల ప్రయోగంలో...

Marigold Flower Benefits: బంతి పూలే కదా అని.. తేలిగ్గా తీసి పారేయకండి.. శాస్త్రవేత్తల ప్రయోగంలో తేలింది ఏంటంటే..

Marigold Flower Benefits: ఈ భూమ్మీద అనేకరకాల వస్తువులుంటాయి. అనేక రకాల పువ్వులు కూడా ఉంటాయి. పువ్వులు చూసేందుకు అందంగా ఆకర్షణగా ఉంటాయి. అందువల్లే అమ్మాయిలు వాటిని ధరించడానికి ఇష్టపడుతుంటారు. దేవాలయాలలో పూజలకు, అభిషేకాలకు పువ్వులను విరివిగా వాడుతూ ఉంటారు. అయితే కొన్ని పువ్వులు మాత్రం అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కుంకుమపువ్వు ఇందుకు బలమైన ఉదాహరణ. ఇప్పటివరకు కొన్ని రకాల పువ్వులు మాత్రమే ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మనం తెలుసుకున్నాం. శాస్త్రవేత్తల […]

Marigold Flower Benefits: ఈ భూమ్మీద అనేకరకాల వస్తువులుంటాయి. అనేక రకాల పువ్వులు కూడా ఉంటాయి. పువ్వులు చూసేందుకు అందంగా ఆకర్షణగా ఉంటాయి. అందువల్లే అమ్మాయిలు వాటిని ధరించడానికి ఇష్టపడుతుంటారు. దేవాలయాలలో పూజలకు, అభిషేకాలకు పువ్వులను విరివిగా వాడుతూ ఉంటారు. అయితే కొన్ని పువ్వులు మాత్రం అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కుంకుమపువ్వు ఇందుకు బలమైన ఉదాహరణ.

ఇప్పటివరకు కొన్ని రకాల పువ్వులు మాత్రమే ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మనం తెలుసుకున్నాం. శాస్త్రవేత్తల ప్రయోగాలలో కూడా ఇదే తేలింది. కానీ తొలిసారి బంతిపూలలో సరికొత్త ప్రోటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో బయటపెట్టారు. బంతిపూలలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నట్టు.. పోషకాల నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఏ సి ఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా తాజాగా తెలిసిన నివేదిక ప్రకారం.. పెరుగుతున్న జనాభా.. వాతావరణ మార్పుల నేపథ్యంలో బంతిపూలను స్థిరమైన ప్లాంట్ ప్రోటీన్ ఫోర్స్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

బంతిపూలలో 20 నుంచి 20 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. ఆమెను ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పువ్వుల నుంచి సేకరించిన సారం ప్రోటీన్ కొరతని తీర్చగలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బంతి మొక్కలు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బంతిముక్కలను ప్రత్యేకమైన పద్ధతుల్లో పెంచుతున్నారు. వాటి ద్వారా పూల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఆ పువ్వులను కేవలం అలంకరణ.. ఇతర వాటికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనలో ప్రోటీన్ ఉన్నట్టు తేలిన నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో బంతిపూలను ప్రోటీన్ల సేకరణ కోసం ఉపయోగిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

బంతిపూలతో ప్రోటీన్ సేకరణ మాత్రమే కాకుండా.. వివిధ రకాలైన ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసేది కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే బంతిపూలు చూసేందుకు గాఢమైన పసుపు రంగులో ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తుంటాయి. పంటచేలకు సోకే చీడపీడలను నివారిస్తాయి. ఈ పూలల్లో క్యాన్సర్ నిరోధకాలు కూడా ఉన్నట్టు ఇటీవలి పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో బంతిపూలను మందులు తయారీకి కూడా వాడతారని వార్తలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper