Home Blog Page 269

రేవంత్ ఫోన్ ఎత్తడట.. అదీ రాహుల్ గాంధీ చేసినా.. కారణం బయటపెట్టేశాడు

Revanth Reddy Rahul Gandhi phone call
Revanth Reddy Rahul Gandhi phone call

Revanth Reddy Rahul Gandhi phone call: కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆలోచన కలిగే విధంగా చేస్తాయి. చివరికి అసలు విషయాన్ని బయటపడతాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు.. వ్యవహరించిన తీరు కూడా అలానే ఉంది.

రేవంత్ రెడ్డి ఓ సంస్థ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆయన అనేక విషయాలు మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అందులో ప్రధానమైన విషయం ఒకటి ఉంది. ఆయన ఎవరు ఫోన్ చేసినా సరే ఎత్తకపోవడం. ఆయన ఫోన్ నెంబర్ కొంతమందికి మాత్రమే ఇవ్వడం.. ఈ విషయాన్ని చెప్పుకోవడంలో.. రేవంత్ రెడ్డి ఏమాత్రం భయపడలేదు. పైగా ఫోన్ ఎత్తే విషయంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులను.. ఇంకా రకరకాల సమస్యలను ఆయన బయటపెట్టారు. “ఎవడో నాకు ఫోన్ చేస్తాడు. ఏదో ఇబ్బంది ఉందని నేను ఎత్తుతాను. అవతలి వ్యక్తి బాగున్నవా అన్నా అంటాడు. అర్ధరాత్రి పూట 12 గంటలకు ఫోన్ చేసి.. ఏం చేస్తున్నావ్ అన్న.. అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర వ్యక్తిగత కార్యదర్శులు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ల వల్ల కూడా కాకపోతే అప్పుడు నాకు చెప్తారు. ఇక్కడ పని జరగడం ముఖ్యం. ఫోన్ కోసం విలువైన సమయాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చివరికి రాహుల్ గాంధీ విషయంలో కూడా తన ధోరణి మారలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఫోన్ చేస్తే ఎత్తకపోతే చివరికి రాహుల్ కూడా మెసేజ్ చేస్తున్నారని.. ఆ మెసేజ్ చూసుకొని తర్వాత తను ఫోన్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలతో పాటు తనకు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమని.. అలాంటి సమయంలో కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండలేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఫోన్లు మాట్లాడుతూనే కనిపిస్తారు. ప్రజలకు అందుబాటులో ఏమాత్రం ఉండరు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఫోన్ లను పక్కనపెట్టారు. ఏదైనా అత్యవసరమైతేనే మెసేజ్ చేస్తే తన వెంటనే అందుబాటులోకి వస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

రేవంత్ మొదటినుంచి కూడా ఫోన్ వాడటం చాలా తక్కువ. ఆయన వ్యక్తులతో మాట్లాడేందుకు మాత్రమే ఆసక్తిని చూపిస్తుంటారు. అంతేతప్ప ఫోన్ మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోరు. తనను కలవడానికి వచ్చిన వార్త మాట్లాడుతుంటారు. ఆ ఆ సమయంలో ఎన్నిసార్లు ఫోన్ మోగినా సరే అటువైపు కనీసం కూడా చూడరు. ముఖ్యమంత్రి కాకముందు కూడా రేవంత్ రెడ్డికి ఇదే గుణం ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వ్యవహార శైలిని ఆయన కొనసాగిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చకపోయినప్పటికీ.. రేవంత్ ఆ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

విడాకులు తీసుకునేంత వరకు నేను సినిమాల్లో నటించను అంటూ స్టార్ హీరో సంచలన ప్రకటన..

Jayam Ravi Shocking Statement
Jayam Ravi Shocking Statement

Jayam Ravi Shocking Statement: ప్రముఖ తమిళ నటుడు జయం రవి గత కొంత కాలం గా తన భార్య ఆర్తి తో విడాకుల వ్యవహారం లో నలిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రముఖ సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ తో కొన్నేళ్ల నుండి సహజీవనం చేస్తున్న ఆయన, ఆర్తి తో విడాకులు కోరుకుంటున్నాడు. కానీ ఆమె విడాకులు ఇవ్వకుండా, కొన్ని కండీషన్స్ పెడుతూ , జయం రవి ని పబ్లిక్ గా డీ ఫేమ్ చేసేలా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీనిపై జయం రవి నేడు చాలా తీవ్ర స్థాయిలో రెస్పాన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన చాలా సున్నితంగానే ఈ విషయాన్ని డీల్ చెయ్యాలని అనుకున్నాడు , కానీ హద్దులు దాటడం తో సహనం నశించి మీడియా ముందుకొచ్చి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘నేను మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను. ఇప్పటి నుండి నాకు విడాకులు వచ్చేంత వరకు , నేను సినిమాల్లో నటించబోవడం లేదు. నేను ప్రస్తుతం చేసిన సినిమాని కూడా విడుదల చెయ్యనివ్వను. ఇక పై నేను అవమానాలు తీసుకోలేను , హద్దులు దాటేసారు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారో, రండి , నేను ఇక్కడే ఉన్నాను , ఎంత ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో పెట్టండి. ఇక నుండి నేను సైలెంట్ గా ఉండాలని అనుకోవడం లేదు. ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ , అన్నీ తెగించే ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు నేను వదిలిపెట్టను’ అంటూ జయం రవి చెప్పుకొచ్చాడు . ఇండస్ట్రీ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి జయం రవి , అంతే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి స్థాయి ఉన్న ఈ హీరో , ఇలా మీడియా ముందుకొచ్చి , వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం అంటే , అతను ఎంతటి మనోవేదనకు గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

'పెద్ది' చివరి 40 నిమిషాలు ఆ ఇద్దరు హీరోల నట విశ్వరూపం చూడబోతున్నామా...

Peddi Overseas Collections
Peddi Overseas Collections

Peddi movie climax performance: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. రీసెంట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను హుక్ చేస్తుందని ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారని ఆ 40 నిమిషాలు సినిమా మొత్తానికి కీలకంగా మారబోతుంది అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. మొత్తానికైతే ఆ కామెంట్లను చూసిన మెగా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివర్లో రామ్ చరణ్ శివ రాజ్ కుమార్ వల్ల నట విశ్వరూపాన్ని చూపిస్తారట… దాంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ అంచనా వేస్తున్నారు.

ఇక బుచ్చిబాబు చెప్పినట్టుగా సినిమా ఉంటే పర్లేదు. కానీ ఏ మాత్రం తేడా జరిగిన కూడా అతను భారీ విమర్శలను మూటకట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో రామ్ చరణ్ మార్కెట్ భారీగా పడిపోయింది.

ఇక ఈ సినిమాతో అమాంతం ఆయన మార్కెట్ ని పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే రామ్ చరణ్ మాత్రం 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టే ఒక్క సినిమాని కూడా చేయకపోవడం అతన్ని తీవ్రంగా నిరాశ పరుస్తుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఆ లోటును భర్తీ చేస్తూ భారీ విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… రామ్ చరణ్ మొదటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియాలో రామ్ చరణ్ కెరియర్ ను డిసైడ్ చేసే సినిమా అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

బాలయ్య బాబు నాగార్జున వివాదం ముగిసినట్టేనా..లెనిన్ కోసం నట సింహం రాబోతోందా..

Balakrishna Nagarjuna controversy
Balakrishna Nagarjuna controversy

Balakrishna Nagarjuna controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వాళ్ళలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళు నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా నిలబడి ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తే నాగార్జున రొమాంటిక్, భక్తి రస ప్రధానమైన సినిమాలను కూడా చేస్తున్నాడు. వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నలుగురు ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి స్టార్ హీరోలతో పోటీపడుతూ వీళ్ళు వందల కోట్ల కలెక్షన్స్ రాబోతున్నారు అంటే మామూలు విషయం కాదు. ఇక కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబుకి నాగార్జునకి మధ్య కొన్ని విభేదాలా లైతే వచ్చాయి.

వారిద్దరి మధ్య మాటలైతే లేవు అదే డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మాటలు కలిశాట. కొంతమంది ప్రొడ్యూసర్లు వీళ్లను కలిపి ఒక పార్టీని కూడా అరేంజ్ చేశారని అందులో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయేలా మాటలైతే కలిపారట.

అందుకోసమే నాగార్జున కొడుకు అయిన అఖిల్ హీరోగా చేస్తున్న సినిమాలో బాలయ్య బాబు ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. నందమూరి నటసింహం బాలయ్య బాబు రేంజ్ లోనే ఆ క్యారెక్టర్ అయితే ఉంటుందట. అఖిల్ సైతం బాలయ్య బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు.

మొత్తానికైతే బాలయ్య ఈ సినిమాలో చేస్తున్నాడనే విషయాన్ని ఎక్కడ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. థియేటర్ లోనే ఈ న్యూస్ ని బ్లాక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోవడం ఖాయం అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

మహేష్ బాబు సినిమాను రీమేక్ చేయాలని చూసిన సూర్య..కానీ వర్కౌట్ కాలేదుగా..

Suriya remake of Mahesh Babu movie
Suriya remake of Mahesh Babu movie

Suriya remake of Mahesh Babu movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు మహేష్ బాబు…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ సక్సెస్ లను సాధించిన ఆయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద 100% ఎఫర్ట్స్ పెట్టి నటిస్తున్నాడు. చాలా సన్నివేశాల్లో డూప్ లేకుండానే నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రాజమౌళి పెట్టే టార్చర్ ని భరిస్తూ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ విషయంలో మహేష్ బాబు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక వారణాసి సినిమా ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

కాబట్టి ఈ సినిమా నుంచి మరొక టీజర్ ని వదిలితే బాగుంటుందని రాజమౌళి అభిమానులు, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళం లో సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో రిలీజ్ చేసి చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సూర్య… తమిళ్ సినిమా ఇండస్ట్రీ నటుడు అయినప్పటికి తెలుగులో అతనికి చాలా మంచి క్రేజ్ ఉంది.

ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాని తమిళంలో సూర్య రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాను విజయ్ రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే పోకిరి మూవీ కావడం విశేషం…

ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాని మొదట సూర్య చేయాలనుకున్నాడు. కానీ విజయ్ అంతకుముందే వేరే ఒక ప్రొడ్యూసర్ తో సినిమా రైట్స్ ని తీసుకొని తనే హీరోగా ఈ సినిమాని చేయడం అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. నిజానికి సూర్య కనక ఈ సినిమా చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు…

పెట్రోల్ బంక్ ల పై కీలక అప్డేట్.. ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 10 గంటలకే.. ఎందుకీ నిర్ణయమంటే..

Petrol bunk new timings
Petrol bunk new timings

Petrol bunk new timings: కోవిడ్ సోకినప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఆర్థికంగా ఇబ్బంది లేదు. కొంతమేర సడలింపులు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా లేదు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో చోటుచేసుకుంటున్న యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అమెరికా పూటకో మాట చెబుతోంది. ఇరాన్ రకరకాల ప్రకటనలు చేస్తోంది. ఇలా చూస్తుంటే ప్రపంచం ఏమైపోతుందో.. ఇకముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

పశ్చిమాసియా ప్రాంతంలో క్రూడ్ ఆయిల్ అధికంగా ఉంటుంది. భారత్ లాంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశాలకు అక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బంది ఎదురైతే మన దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది కాబట్టి… క్రూడ్ ఆయిల్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం చోటు చేసుకుంటున్నది. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది. డాలర్ విలువ విపరీతంగా పెరుగుతోంది. రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ నేపద్యంలోనే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి పడకముందే ప్రభుత్వం మేల్కొంది. పొదుపు చర్యలు మొదలుపెట్టింది. దుబారాకు చరమగీతం పాడేందుకు సిద్ధమైంది.

ఇప్పటికీ ప్రధానమంత్రి తన వాహనాల శ్రేణిలో చాలా వరకు తగ్గించుకున్నారు. అని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే పెట్రోల్ బంకులు నిర్వహించాలని.. దీనికి అనుమతులు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖను రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం.. వర్చువల్ మీటింగ్. లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచన చేయాలని. దీనివల్ల రిటైల్ అవుట్లెట్ లో విద్యుత్ ఆదా అవుతుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో అత్యవసరంగా వెళ్లే వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తారని.. దానికోసం పూర్తిస్థాయిలో ఇందనం అందుబాటులో ఉంటుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యయ నియంత్రణకు శ్రీకారం చుట్టారు. తన శ్రేణిలో వాహనాలను తగ్గించుకున్నారు. మిగతా మంత్రులు కూడా అదే బాటలో ఉన్నారు. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలను తన వాహన శ్రేణిలో ఉంచాలని చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది.

రూపాయి అత్యంత చెత్త ప్రదర్శన.. ఆసియాలోనే అతి తక్కువ విలువ?

Indian rupee worst performance
Indian rupee worst performance

Indian rupee worst performance: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా అమెరికా–ఇరాన్‌ వార్‌ ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా భారత రూపాయి అత్యంత చెత్త ప్రదర్శనతో ఆసియాలోనే అత్యంత కనిష్టానికి పడిపోయింది. 2026లో అత్యంత బలహీన విలువైన కరెన్సీగా డారల్‌తో రూ.95.8 కి పడిపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధిక నష్టపోయిన కరెన్సీగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 6.5 శాతం పైగా విలువ కోల్పోయింది. పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కేవలం బాహ్య కారణాల వల్ల మాత్రమే కాదు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఖాతా లోటు, మార్కెట్‌ నియంత్రణలు, ఎఫ్‌పీఐ నిష్క్రమణ, ఆఫ్‌షోర్‌–ఆన్‌షోర్‌ అనిశ్చితి, గ్లోబల్‌ ఏఐ మార్పులు, సేవల ఎగుమతి సమస్యలు వంటి అంతర్గత నిర్మాణాత్మక సమస్యలు కూడా దీనికి దోహదపడ్డాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్లను అమ్మకం చేసి ఆకస్మిక పతనాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఆసియా దేశాల విలువ ఇలా..

ఇండోనేషియా రూపియా..
భారీ ఒత్తిడి ఇండోనేషియా రూపియా విలువ డాలర్‌కు 17,600 స్థాయి దాటి 4.6 శాతం వరకు బలహీనపడింది. డాలర్‌ బలం, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, ప్రభుత్వ బాండ్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు ఇందుకు కారణమని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోనేషియా అంటోంది. తక్కువ ట్యాక్స్‌–టు–జీడీపీ నిష్పత్తి, లోతులేని ఆర్థిక మార్కెట్లు ఇలాంటి షాకులకు సులభంగా గురవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంకా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని ఆశావాదం వ్యక్తం చేస్తోంది.

ఫిలిప్పైన్స్‌ పెసో..
రాజకీయ అనిశ్చితి తోడు ఫిలిప్పైన్స్‌ పెసో కూడా కొత్త రికార్డు నిమ్న స్థాయికి చేరుకుంది. డాలర్‌తో 61.64కి పడిపోయి సుమారు 4 శాతం నష్టపోయింది. బలమైన డాలర్, అధిక వడ్డీ రేట్లతోపాటు రాజకీయ అనిశ్చితి కూడా ఈ పతనానికి కారణమవుతోంది. వైస్‌ ప్రెసిడెంట్‌ సారా డూటర్టెపై ఇంపీచ్‌మెంట్‌ విచారణ నేపథ్యంలో మార్కెట్లు అదనపు రిస్క్‌ ప్రీమియం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ కొరియా వాన్‌..
మూలధన పలాయనం దక్షిణ కొరియా వాన్‌ డాలర్‌కు 1,498 స్థాయి చుట్టూ తిరుగుతూ ఈ ఏడాది 3 శాతం వరకు బలహీనపడింది. స్థానిక రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ అనిశ్చితుల నుంచి రక్షణ కోసం అమెరికా మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది దేశంలో మూలధన పలాయనానికి దారితీస్తోంది.

థాయ్‌ బాట్‌..
ఆయిల్‌ ధరలు, బంగారం ప్రభావం థాయ్‌ బాట్‌ 2.6 శాతం తగ్గి 32.58 స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియా యుద్ధం, డాలర్‌ సేఫ్‌ హేవెన్‌ డిమాండ్, తగ్గిన బంగారం ధరలు, బ్యాంక్‌ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ రిజర్వ్‌ నిర్వహణ వంటివి దీనిని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దిగుమతి ముడి పదార్థాల ఖర్చు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

హాంకాంగ్‌ డాలర్‌..
పెగ్‌ వ్యవస్థ రక్షణహాంకాంగ్‌ డాలర్‌ ఈ ఏడాది 0.6 శాతం మాత్రమే బలహీనపడింది. 7.85 ఫ్లోర్‌ స్థాయిని దాటకుండా కట్టుబాటు వ్యవస్థ ఉండటం వల్ల హాంకాంగ్‌ మానిటరీ అథారిటీ అవసరమైతే డాలర్లు విక్రయించి రక్షణ కల్పిస్తోంది.

తైవాన్‌ డాలర్‌..
వ్యతిరేక ధోరణితో తైవాన్‌ డాలర్‌ మాత్రం స్వల్పంగా 0.3 శాతం తగ్గినా, కొన్ని రోజులు బలమైన లాభాలు సాధించింది. ఎగుమతిదారులు డాలర్‌ నిల్వలను స్థానిక కరెన్సీకి మార్చడం ఇందుకు ప్రధాన కారణం.

2026లో ఆసియా కరెన్సీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి బాహ్య కారణాలతోపాటు ప్రతి దేశం యొక్క అంతర్గత ఆర్థిక బలహీనతలను కూడా బయటపెడుతోంది. భారత రూపాయి సవాళ్లు మరింత లోతైనవి కావడం ఆందోళన కలిగిస్తోంది.

పాకిస్తాన్‌ కోసం ట్రంప్‌ త్యాగం.. జియోపాలిటిక్స్‌లోకొత్త మలుపు

Trump Stock Trades
Trump Stock Trades

Trump Pakistan geopolitical strategy: పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్‌తో కలిసి దాదాపు నెల రోజులు తీవ్రమైన దాడులు చేశారు. అయితే ఇరాన్‌ ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. అమెరికాకు చుక్కలు చూపించింది. అమెరికాకు అండగా నిలిచిన గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. 50 రోజుల తర్వాత ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కుదిరింది. ఇది తాత్కాలికమే. అయితే ఈ సీజ్‌ఫైన్‌కు కారణం పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ మన దాయాది దేశాన్ని పొగడ్తలతో ముంచెతుతున్నాడు.

చైనా పర్యటన ముగించుకుని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ ఒప్పందానికి అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక యుద్ధ విరామం కాదని, దీని వెనుక మూడు దేశాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలు దాగి ఉన్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటినుంచో అమెరికా, చైనా, ఇరాన్‌ మధ్య సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. ఇరాన్‌పై ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్‌ తన సరిహద్దు భద్రత, ఆర్థిక సవాళ్లు, మతపరమైన సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అమెరికాను ఒత్తిడి చేసి ఉండవచ్చు. ట్రంప్‌ పాక్‌ ప్రధాని, ఫీల్డ్‌ మార్షల్‌ను ‘అద్భుతమైన వ్యక్తులు‘ అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ప్రతీక. గతంలో ట్రంప్‌ పాలనలోనే పాకిస్తాన్‌కు సహాయం తగ్గించిన సందర్భాలు ఉన్నా, ప్రస్తుతం భారత్‌–పాక్, ఇరాన్‌–పాక్‌ సంబంధాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

తాత్కాలిక ఉపశమనమా? వ్యూహాత్మకమా?
ట్రంప్‌ ప్రస్తుతానికి ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించే ప్రణాళిక లేదని ప్రకటించారు. అయితే ఇది తాత్కాలికంగా అదుపులో ఉంచాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక ఒత్తిడి, ఇతర మధ్యప్రాచ్య దేశాలతో ఉన్న సంబంధాలు, చైనా ప్రభావం వంటి అంశాలను కలిపి చూస్తే వ్యూహాత్మక నిర్ణయమని తెలుస్తోంది. ఇరాన్‌ ఆర్థికంగా, సైనికంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. సీజ్‌ఫైర్‌ ద్వారా అమెరికా తన లక్ష్యాలను సాధించుకుని, అవసరమైతే తిరిగి ఒత్తిడి పెంచే స్థితిలో ఉండాలని చూస్తోంది.

ప్రాంతీయ ప్రభావాలు…
ఇరాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం పాక్‌కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే భారత్‌తో ఉన్న సంబంధాల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలికంగా అమెరికా–ఇజ్రాయిల్‌ ఒత్తిడి కొనసాగవచ్చు. ట్రంప్‌ శైలి ప్రకారం ‘డీల్‌ మేకింగ్‌‘ ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఒక దేశానికి ఫేవర్‌ చేసి మరొకటి నుంచి లాభం పొందే విధానం.

ట్రంప్‌ వ్యాఖ్యలు సాధారణమైనవిగా అనిపించినా, వాటి వెనుక ఉన్న వ్యూహాత్మక లెక్కలు ప్రపంచ రాజకీయాలను మళ్లీ ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. పాకిస్తాన్‌కు చేసిన ఈ ’ఫేవర్‌’ ఎంతకాలం కొనసాగుతుంది, దీని ఫలితాలు ఏమిటి అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడూ స్నేహాలు లేదా వ్యతిరేకతలపై కాకుండా, స్వార్థాలు, వ్యూహాలపై ఆధారపడి ఉంటాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.

ఇలా చేస్తే పుచ్చకాయేంటి.. ఏం తిన్నా సరే.. అంతే సంగతులు.. దిగ్భ్రాంతి కలిగిస్తున్న వీడియో

Viral food safety video
Viral food safety video

Viral food safety video: ఆ మధ్య ముంబైలో పుచ్చకాయ తిని ఓ కుటుంబంలో నలుగురు చనిపోయారు. బిర్యానీ తిన్న తర్వాత వారు పుచ్చకాయ తినేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుచ్చకాయ తిన్న తర్వాత బిర్యాని తింటే ప్రమాదకరమని చాలా మంది వైద్యులు చెప్పేశారు. దీంతో దేశవ్యాప్తంగా పుచ్చకాయల అమ్మకాలు పడిపోయాయి. ఈ దశలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. వారు తిన్న పుచ్చకాయలు ప్రమాదకరమైన జింక్ సల్ఫేట్ ఉందని గుర్తించారు. కొంతమంది కావాలని ఆ పుచ్చకాయలో జింక్ సల్ఫేట్ ఎక్కించారని.. అందువల్లే చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు పై విచారణ కొనసాగుతోంది.

ఆ కుటుంబం పుచ్చకాయ తిన్న తర్వాత.. ఎందుకు చనిపోయింది అనే విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మనదేశంలో మరో ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుచ్చకాయ తిన్న తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు. షియోపూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఇంద్ర కుమార్, ఆయన కుమారుడు వినోద్ గురువారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం వారు ఉదయం పుచ్చకాయ తిన్నారు. అది తిన్న తర్వాత వారి ఆరోగ్యం దారుణంగా మారిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఇంద్ర కుమార్ చనిపోయాడు. వినోద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇంద్ర కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు

మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన తర్వాత మరోసారి పుచ్చకాయ మీద దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొంతమంది పుచ్చకాయలో ప్రమాదకరమైన అవశేషాలు ఉన్నాయని చెబుతుంటే.. మరి కొందరేమో పుచ్చకాయ త్వరగా పెరగడానికి.. రంగు రావడానికి ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇవి ఇలా సాగుతుండగానే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియో కాస్త చాలామందిలో ఆందోళన రేకెత్తిస్తోంది.

ఆహార పదార్థాలను కవర్ చేయకుండా.. బహిరంగంగా అలానే ఉంచితే ఎంత ప్రమాదమో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోలో కోసి ఉన్న ఒక పుచ్చకాయ ముక్క ఉంది. పుచ్చకాయ ముక్కలు బల్లి వచ్చి తినడం మొదలు పెట్టింది. ఇలాంటి ఆహారాన్ని గమనించకుండా గనుక తింటే ఫుడ్ పాయిజన్ అవుతుందని.. ఆ తర్వాత ప్రాణాలు పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి ఆహార పదార్థమైనా సరే మూత పెట్టి ఉంచాలని.. తెరిచి ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

గర్ల్ ఫ్రెండ్ తో హార్థిక్ పాండ్యా పెళ్లి.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

Hardik Pandya Mahika Sharma
Hardik Pandya Mahika Sharma

Hardik Pandya Mahika Sharma: ముంబై ఇండియన్స్ సారధిగా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. వరుసగా మూడు సీజన్లలో తన స్థాయి ఆట తీరు కొనసాగించలేకపోయాడు. దీంతో పాండ్యా ప్రస్థానం ముంబై జట్టులో ముగిసే అవకాశం కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కూడా లక్నో లేదా కోల్కతా జట్టుకు సారథిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం మహిక శర్మ అనే యువతి తో సంబంధం లో ఉన్నాడు. వీరిద్దరూ పీకల లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కనిపిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెకేషన్ కూడా వెళ్తున్నారు. హార్థిక్ పాండ్యా ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు మహిక హాజరవుతున్నారు. వీరిద్దరూ తమ రిలేషన్ దాచుకోవడానికి ఏమాత్రం భయపడటం లేదు.

హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం మహీకా అని అతని అభిమానులు విమర్శిస్తున్నారు. ఆమె అతడి జీవితం రాకముందు హార్దిక్ ఆటతీరు గొప్పగా ఉండేదని.. ఇప్పుడు అధమ స్థాయి ప్రదర్శన చేస్తూ హార్దిక్ పాండ్యాలు విమర్శలు మూట కట్టుకుంటున్నాడని అతడి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిక శర్మ విషయంలో రకరకాల ఆరోపణలు చేస్తున్న హార్దిక్ అభిమానులు ఇబ్బంది పడే వార్త ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. మహికాను ఈనెల 22న హార్థిక్ పాండ్యా పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రియురాళ్లతో హోటల్ గదిలోకి రావడానికి అనుమతి లేదని ఇటీవల బిసిసిఐ నిబంధన విధించింది. దీంతో మహిక ను విడిచిపెట్టి ఉండలేక హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బీసీసీఐ విధించిన నిబంధనకు చెక్ పెట్టేందుకు తనకు ఇంతకుమించిన మార్గం లేదని అందువల్లే పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై హార్దిక్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఇవన్నీ కూడా ఊహాగానాలని.. ఇప్పుడప్పుడే హార్దిక్ పెళ్లి చేసుకోలేడని.. దానికి ఇంకా సమయం పడుతుందని అతని అభిమానులు చెబుతున్నారు.

మహేష్ బాబు రెస్టారంట్ లో లంచ్ చెయ్యాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..ఒక్క వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

Mahesh Babu restaurant price list
Mahesh Babu restaurant price list

Mahesh Babu restaurant price list: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు , వ్యాపార రంగం లో కూడా గొప్పగా సక్సెస్ సాధించిన సెలబ్రిటీ అనే సంగతి మన అందరికీ తెలిసిందే , ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంపాదించిన ప్రతీ రూపాయిని చాలా తెలివిగా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి, లాభాలు రప్పించుకోవడం అనేది మహేష్ బాబు కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే హైదరాబాద్ లో ఆయన AMB సినిమాస్ స్థాపించి , దానికి ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేసాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ థియేటర్స్ లో ఫ్లాప్ సినిమాలను చూసేందుకు కూడా ఏ మాత్రం వెనుకడుగు వెయ్యరు ఆడియన్స్, ఎందుకంటే అలాంటి థియేట్రికల్ అనుభూతిని ఆ థియేటర్ ఇస్తుంది కాబట్టి. హైదరాబాద్ ‘AMB సినిమాస్’ పెద్ద హిట్ అవ్వడంతో , రీసెంట్ గానే బెంగళూరు లో కూడా మొదలు పెట్టారు , అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.

మహేష్ బాబు సినిమాల్లో బిజీ గా ఉంటే , ఈ వ్యాపార వ్యవహారాలన్నీ ఆయన సతీమణి నమ్రత శిరోడ్కర్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇకపోతే మహేష్ బాబు కి కేవలం థియేటర్స్ మాత్రమే కాదు , ఒక లగ్జరీ రెస్టారంట్ కూడా ఉంది. ఎలా అయితే ఆయన హైదరాబాద్ , బెంగళూరు లో ఏషియన్ సంస్థ తో కలిసి థియేటర్స్ ని రన్ చేస్తున్నాడో, అదే ఏషియన్ సంస్థ తో కలిసి ‘AN రెస్టారంట్’ ని రన్ చేస్తున్నాడు. ‘మినర్వా కాఫీ షాప్’ కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తోంది. హైదరాబాద్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఈ రెస్టారంట్ ని నడుపుతున్నారు. అయితే రీసెంట్ గానే ఒక యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారంట్ కి వెళ్లి , సోషల్ మీడియా లో బిల్ ని షేర్ చేయగా, అది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది .

హోటల్ వాతావరణం చాలా రాయల్ గా ఉందని , ఒక ప్యాలస్ లోకి అడుగుపెడితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో , ఈ హోటల్ లో కూడా అలాంటి అనుభూతియే లభిస్తుందని, ఫుడ్ టేస్ట్ కూడా వేరే లెవెల్ లో ఉండరు ఆ బ్లాగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ అతను షేర్ చేసిన బిల్ పేపర్ లో , ఫుడ్ ఐటమ్స్ రేట్ ని చూసి నెటిజెన్స్ షాక్ కి గురి అవుతున్నారు. బయట మార్కెట్ లో కేవలం 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ ధర ఇక్కడ ఎంతో తెలుసా?, అక్షరాలా 299 రూపాయిలు. అదే విధంగా మనకు బయట కేవలం 40 రూపాయలకు దొరికే డైట్ కోక్ ధర ఇక్కడ ఎంతో తెలుసా?, 180 రూపాయిలు. అదే విధంగా ఒక చికెన్ టీకా స్టార్టర్ ధర 725, మతం బిర్యానీ ధర 600 రూపాయిలు అట. ఈ రెస్టారంట్ ప్రత్యేకతలు ఇంకా చూడాలంటే ఈ క్రింది వీడియో ని చూసేయండి.

సీఎం విజయ్ అన్నా.. నీ సింప్లిసిటీ సూపర్.. ఫిదా అంతే

CM Vijay
CM Vijay

CM Vijay simplicity viral news: ఒకప్పుడు జనాలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సి వచ్చేది. పైగా ఆ పనులు జనాలకు రీచ్ కావాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా వచ్చేసింది. ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి జీవితాన్ని మొత్తం సోషల్ మీడియా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దానిని ఆధారంగా చేసుకుని చాలామంది సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీలు అయినవారు తమ స్థానాన్ని మరింత గొప్పగా కాపాడుకుంటున్నారు.

రాజకీయాలలో ఒకప్పుడు సోషల్ మీడియా ప్రభావం అంతగా ఉండేది కాదు. ఇప్పుడు రాజకీయాలను మించి సోషల్ మీడియా ఎదిగిపోయింది. అది రాజకీయ నాయకుడికి సోషల్ మీడియాలో ఖాతా ఉంది. గ్రూపులు.. ఇతర వ్యవహారాల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ప్రత్యేక బృందాలను కొనసాగిస్తున్నారు. ప్రజలలో రీచ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఇండియావ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత.. ఇంకా కొంతమంది పేరు పొందిన నాయకుల తర్వాత విజయ్ చుట్టూ తిరుగుతోంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించడానికి ఆయన అనేక రకాల కష్టాలు పడ్డారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సంచలన నిర్ణయాలతో దేశ రాజకీయాలలోనే చర్చనీయాంశమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. విజయ్ ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు నోట్ బుక్.. పెన్నుతో కనిపించారు. సభ్యులు మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. వాస్తవానికి విజయ్ తలుచుకుంటే ఆపిల్ ఐపాడ్.. ఇంకా అత్యాధునిక పరికరాలు ఆయన చేతి ముందు వచ్చి వాలిపోతాయి. ఆయనప్పటికీ ఆయన అవి కోరుకోలేదు. అసెంబ్లీలో ఆయన నోట్ బుక్ లో నోట్ చేసుకున్న పాయింట్లు.. ఆయన వ్యవహరించిన తీరుకు గుర్తుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. సెక్రటేరియట్ కు వచ్చేముందు విజయ్ సొంతంగా క్యారియర్ తెచ్చుకుంటున్నారు. ఇంట్లో భోజనం మాత్రమే తింటున్నారు. తన కాన్వాయ్ కూడా చాలావరకు తగ్గించుకున్నారు. ఇటీవల తమిళనాడులో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే అమ్మాలని.. గుర్తింపు కార్డు ఇస్తేనే మద్యం విక్రయించాలని.. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు.. గుడి, బడి, మసీదు, చర్చి దగ్గర మద్యం షాపులు ఉండకూడదని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం విజయ్ చుట్టూ తిరుగుతోంది. విజయ్ పెట్టుకున్న పీఆర్ బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. చూడాలి మరి విజయ్ ఇంకా ఎన్ని రోజులు సోషల్ మీడియాను తన చుట్టూ తిప్పుకుంటారో..

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

దీనమైన స్థితిలో పాపులర్ నటి.. అర్థ రాత్రి నడి రోడ్డు మీద వదిలేశారు..

Pavala Shyamala
Pavala Shyamala

Pavala Shyamala latest news: ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యినటువంటి పావలా శ్యామల గత కొంతకాలం నుండి ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు నటిగా రోజుకు వేలరూపాయిలు సంపాదించే ఈమె , ఇప్పుడు కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈమెకు మొదట్లో మన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేసి ఈమె సమస్యని అందరి దృష్టికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత చిరంజీవి , రామ్ చరణ్ వంటి వారు కూడా ఆర్ధిక సాయం చేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈమెకు నెలకు పది వేల రూపాయిలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈమెకు కష్టాలు తీరలేదు.

రీసెంట్ గానే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స కోసం కూకట్ పల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కానీ దురదృష్టం కొద్దీ ఆమె వద్ద డబ్బులు లేకపోవడం తో క్యాబ్ లో వెనక్కి పంపించేశారు. అర్థ రాత్రి ఆ క్యాబ్ డ్రైవర్ శ్యామల ని వైజంక్షన్ రోడ్డు పై వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ఎటు వెళ్లాలో అర్థం అవ్వని శ్యామలా , ఫుట్ పాత్ పై కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. పాపులర్ నటి కాబట్టి , అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆమెని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఆర్కీ ఫౌండేషన్ కి తరలించారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో , సీరియల్స్ లో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న పావలా శ్యామలా పరిస్థితి ఇంతటి దయనీయంగా మారడం అందరూ శోచించాల్సిన విషయం. ఆమె పరిస్థితి పై సినీ ప్రముఖులు మరోసారి స్పందించి సహాయం చేస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే ఒక పాపులర్ నటి ఇంత ఇబ్బందులు పడుతుంటే, మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఏమి చేస్తుంది?, మనకి తెలిసి కేవలం పావలా శ్యామల ఒక్కటే ఉంది , కానీ ఇలాంటి నటీనటులు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉండే ఉంటారు, వీళ్లందరి కోసం ఒక ఫౌండేషన్ లాంటిది నడుపుతూ , ఆశ్రయం ఎందుకు కలిపించడం లేదు?, ఇలాంటి మంచి పనులకు ఉపయోగపడని మా అస్సోసియేషన్ ఎందుకు ?, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒకవేళ ఇలాంటి వాళ్ళను చేరదీసి , వాళ్ళ బాగోగులు చూసుకునే కార్యక్రమం తలపెడితే చిరంజీవి , బాలకృష్ణ లాంటి వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు కదా?, ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయడం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.

మహేష్ బాబు ట్రిప్స్ వెనకున్న రహస్యం ఇదేనా..

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu foreign trips: ప్రస్తుతం మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో అడపదడప సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఒకానొక సమయంలో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు అని అందరి చేత ప్రశంసలను అందుకున్నాడు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇక మహేష్ బాబు తను షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో గడపాల్సిన టైమ్ ను వాళ్ళకి కేటాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అతను ఇలా చేస్తాడట. అలాగే మహేష్ బాబు తన ఫ్యామిలీతో సంవత్సరానికి ఒక నాలుగైదు ట్రిప్పుల కైనా వెళుతూ ఉంటాడు.

వెళ్లిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన పిల్లలకి ప్రపంచాన్ని పరిచయం చేయాలని అలాగే తను చేస్తున్న వర్క్ పట్ల రిలాక్సేషన్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అలాంటి ట్రిప్స్ ని ప్లాన్ చేస్తూ ఉంటారట… మొత్తానికైతే ఆయన దేశం నలుమూలాల ట్రిప్పులు వేస్తూ తన ఫ్యామిలీతో బీభత్సమైన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

నిజానికి సినిమా హీరోలు చాలామంది హీరోయిన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళలో మహేష్ బాబు నమ్రత లు మాత్రమే కలిసి మెలిసి ఉంటున్నారు. రోజు రోజుకి వల్ల మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక వాళ్ళలా లైఫ్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీ లో ఇంకెవరూ ఉండరనుకుంటా…

ఇక వీళ్లిద్దరు ఇలాంటి రూమర్లు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా చాలా ప్రశాంతంగా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక నమ్రత మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ అతనికి సరిపడా కథలను సెలెక్ట్ చేస్తుంటుంది. అందువల్లే మహేష్ బాబుకి నమ్రత అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఏది ఏమైనా కూడా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు…

కొడాలి నానికి క్లాస్ పీకిన జగన్!

Jagan Warns Kodali Nani
Jagan Warns Kodali Nani

Jagan Warns Kodali Nani: విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తాడేపల్లి కార్యాలయంలో పార్టీ ముఖ్య లతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలను అప్రమత్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు నిర్వహించాలని భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలు అందుబాటులో ఉండాలని తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలాసేపు కొడాలి నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు కొడాలి నాని. ఇకనుంచి యాక్టివ్ కావాల్సిందేనని కొడాలి నాని కి జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త గట్టిగానే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో..

నిలిచిన వైసిపి కార్యక్రమాలు..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేశారు కొడాలి నాని. కానీ రావి వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓడిపోయారు. భారీ మెజారిటీతో గెలిచారు వెంకటేశ్వరరావు. గెలిచిన నాటి నుంచి వెంకటేశ్వరరావు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో టిడిపి గ్రాఫ్ కూడా పెరుగుతుంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఏవి జరగడం లేదు. కనీసం పర్యవేక్షణ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండేళ్ల పాటు కాలం గడిచిపోయింది. కానీ ఇక అలానే విడిచి పెడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే కొడాలి నాని ని పిలిపించి మాట్లాడారు. యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కొడాలి నానికి జగన్ క్లాస్ పీకినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం..
గుడివాడ నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున.. రెండుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కొడాలి నాని. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇంతలోనే అనారోగ్యానికి గురయ్యారు. అయితే కోలుకున్నాక తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని అంతా భావించారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు. త్వరలో కొడాలి నాని రాబోతున్నారని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. కానీ ఎప్పటికీ రావడం లేదు కొడాలి నాని. కేసులకు భయపడి రావడం లేదన్న విమర్శ ఉంది.. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతావా? లేకుంటే తప్పుకుంటావా? అని అడిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే పార్టీలో దూకుడుగా ఉంటూ చాలా రకాల ఇబ్బందులు పడుతున్న వైనాన్ని కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీకి చావోరేవో లాంటివని.. కచ్చితంగా యాక్టివ్ కావాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

రాజమౌళి - అల్లు అర్జున్ కాంబోలో భారీ బడ్జెట్ తో సినిమా..

Rajamouli-Allu Arjun Combo Film
Rajamouli-Allu Arjun Combo Film

Rajamouli-Allu Arjun Combo Film: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకుడు రాజమౌళి మూస ధోరణిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీ ని కొత్త పుంతలు తొక్కించాడు. అలాగే వరుసగా సక్సస్ లను సాధించి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పెంచాడు. 12 సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించి తనకంటు సెపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సక్సెస్ లను సాధించినప్పటికి రాజమౌళికి వచ్చిన గుర్తింపు వేరే ఏ దర్శకుడికి రాలేదు.

పాన్ ఇండియాలో 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటి వరకు ఆయన తెలుగులో ఉన్న టైర్ వన్ హీరోలతో సినిమాలు చేశాడు. ఒక్క పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లను మినహాయిస్తే మిగిలిన అందరితో మూవీస్ చేశాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు.

కాబట్టి అతనితో సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి అల్లు అర్జున్ తో ఎలాగైనా సినిమా చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ సైతం రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తే బాగుంటుందని అతని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ సైతం తన ఇమేజ్ పెరగాలి అంటే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాల్సిందే అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు…

ఇక రాజమౌళి ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి మరొక సంవత్సర సమయం పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సైతం ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత రాజమౌళితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద అటు రాజమౌళి, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు…

రంగస్థలం, అనిమల్ సినిమా తరహాలోనే పెద్ది మూవీ తెరకెక్కిందా...

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi movie inspired by blockbuster films: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి భారీ ఇమేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన పెద్ది సినిమా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని రామ్ చరణ్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించిన వాళ్ళలో రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక తను అనుకున్నట్టుగానే పెద్ది సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. పెద్ది సినిమా నిడివి మూడు గంటల రెండు నిమిషాలు వచ్చినట్టుగా తెలుస్తుంది.

గతంలో రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా కూడా మూడు గంటలకు పైన రన్ టైమ్ ఉండడంతో ఆ సినిమా మీద అప్పట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. అయినప్పటికి సినిమాలోని ఎమోషన్ పర్ఫెక్ట్ గా కుదరడంతో ప్రేక్షకులందరు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇక రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా కూడా మూడు గంటలకు పైన నిడివి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కూడా బీభత్సమైన హైప్ తో వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో సినిమా సూపర్ సక్సెస్ సంపాదించుకోవడమే కాకుండా ఒక కల్ట్ క్లాసికల్ మూవీగా నిలిచిపోయింది…ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల మాదిరిగానే పెద్ది సినిమా కూడా పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఇప్పుడు పెద్ది సినిమా ఏ మేరకు విజయాన్ని సాధిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది…