Home Blog Page 268

చివరికి ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ కూడా దిగదుడుపే

IND Vs PAK
IND Vs PAK

IND Vs PAK: ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే క్రీడ ఏదైనా ఉందంటే అది ఫుట్ బాల్ మాత్రమే. ఫుట్ బాల్ లో అనేక రకాలైన పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఆ పోటీలు అభిమానులకు అద్భుతమైన ఆట మజాను అందిస్తూనే ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తొలిసారి ఫుట్ బాల్ క్రికెట్ ముందు ఓడిపోయింది. కూడా భారత్, పాకిస్తాన్ ముందు తల వంచింది.

క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉంటుంది. విపరీతమైన అభిమానుల ఆదరణ.. భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి ఐసీసీ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తుంది..

ఇక మన దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ల గురించి వివరించాల్సిన పనిలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో కచ్చితంగా పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ల ను ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాచులు కేవలం క్రికెట్ పరంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆటను కూడా మించిపోతున్నాయి.

Luxury అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన మ్యాచుల జాబితాలో మూడు, ఐదు స్థానాలలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ గేమ్స్ ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఏకంగా 1.5 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 2018 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 1.12 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2014 ఫైనల్ మ్యాచ్ 1.1 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ను 950 మిలియన్ల మంది వీక్షించారు.

ఈ సంస్థ వీక్షణల ఆధారంగానే ఈ కేటగిరీలను ప్రకటించింది. ఆదాయం పరంగా ఏ మ్యాచులు ముందు వరుసలో ఉంటాయో చెప్పలేదు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆదాయం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. దాదాపు వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

ఆ ఇద్దరు దర్శకులు మాదక ద్రవ్యాలు కొట్టకపోతే సినిమా చేయలేరా..?

Film Directors Drug Addiction Controversy
Film Directors Drug Addiction Controversy

Film Directors Drug Addiction Controversy: ఆ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది… వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. వాళ్ళు చేసే సినిమాల పరిధి కూడా పెద్దగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తారు కాబట్టి ప్రేక్షకులకు స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ని చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో దర్శకులు చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. కథ రాసుకున్నప్పటి నుంచి దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేంతవరకు దర్శకుడు అహర్నిశలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ ఒక్క విషయంలో ఇబ్బంది జరిగిన కూడా సినిమా అవుట్ పుట్ లో తేడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అవి లేకపోతే వాళ్లు సినిమా చేసే ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. ఆ గంజాయి హైప్ లో ఉన్నప్పుడే వాళ్ళు అనుకున్న సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరిస్తారట.

గాంజాయి కొడుతూ సినిమా డైరెక్షన్ చేస్తున్న దర్శకులు ఎవరు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక ఇద్దరు దర్శకులు మాత్రం ఎప్పుడు అదే డోప్ లో ఉంటారట. ఒకవేళ అది కొంచెం తగ్గిన కూడా వాళ్ళ హై ఫీల్ తగ్గుతుందని భావిస్తారట.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్లు సినిమాలు చేయడం ఒక ఎత్తైతే వాళ్ళ హెల్త్ ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అంటూ లభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనేది అల్టిమేట్ కాబట్టి దానిని హై రేంజ్ లో చిత్రీకరించడానికి వాళ్ళను ఎప్పుడు అదే డోప్ లో ఉంచే విధంగా మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారట.

కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో ఫ్యూచర్ లో వాళ్ళు విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అంటూ కొంతమంది వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మనం చేసే పనిలో మన సంకల్ప బలంతో ముందుకు సాగితే బాగుంటుంది. అంతే తప్ప మిగతా వాటిని ఆసరాగా తీసుకుని ముందుకు సాగడం అనేది సరైనది కాదంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం దర్శకులకు సలహాలను ఇస్తున్నారు…

బల్లులు బాధపెడుతున్నాయా.. ఇలా ఇంట్లో నుంచి తరిమేయండి

Lizard Control Tips At Home
Lizard Control Tips At Home

Lizard Control Tips At Home: ఇంట్లో దోమలకు.. ఈగలకు రకరకాల మిషన్లు వచ్చాయి. వాటి ద్వారా ఈగలను, దోమలను నివారించవచ్చు. అవసరమైతే వాటిని పుట్టకుండా కూడా చేయవచ్చు. కుట్టకుండా కూడా దూరం పెట్ట వచ్చు. ఈగలు, దోమలు మాత్రమే కాదు.. ఇంట్లో కనిపించే శత్రువులు కూడా ఉంటాయి.. అవే బల్లులు. ఇవి ఎటువంటి హాని మనకు కలిగించకపోయినప్పటికీ.. రెట్టలు వేయడం.. ఇంట్లో గోడల మీద విపరీతంగా కదులుతూ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఆహార పదార్థాలను కూడా తినేస్తూ ఉంటాయి. బల్లి అత్యంత ప్రమాదకరమైనది.

బల్లి దేహం మొత్తం విష పూరితమై ఉంటుంది. అది గనుక పొరపాటున ఆహారంలో పడితే.. ఆ ఆహారం గనక మనం తింటే ప్రాణాలు పోతాయి. అందువల్లే బల్లులు ఇంట్లో ఉండకుండా.. ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బల్లులు కొన్ని సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించి ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు. బల్లులు ఇంట్లో ఉంటే కీటకాలను తినేస్తూ ఉంటాయి. తినేసిన తర్వాత రెట్టలు వేస్తూ ఉంటాయి. దీనివల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది.

బల్లులు చూసేందుకు చిన్నగానే ఉన్నప్పటికీ పెద్ద పెద్ద సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చిన్నచిన్న చిట్కాలతో బయటకు వెళ్లగొట్టవచ్చు. మిర్యాల పొడి నీటిలో కలిపి బల్లులు తిరిగే ప్రదేశాలలో పిచికారి చేస్తే అవి వెంటనే పారిపోతాయి. కోడిగుడ్డు పెంకుల వాసన కూడా బల్లులను బయటికి పరుగులు పెట్టేలా చేస్తుంది. నీరు, పుదీనా, నూనె కలిపి స్ప్రే చేసినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు తీవ్రమైన వాసన కలిగి ఉంటాయి. వాటిని కూడా అక్కడక్కడా పెడితే బల్లులు దెబ్బకు పారిపోతూ ఉంటాయి.

బల్లులు ఇంట్లో ఆవాసం ఏర్పాటు చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు శుభ్రతను పాటించాలి. దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. బూజు వంటిది కనిపిస్తే వెంటనే శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు రూఫ్ క్లీనర్ తో ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటే బల్లుల వంటివి రావు.. ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగించవు.

సూర్య 'కరుప్పు (వీరభధ్రుడు)' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించని మాస్ ర్యాంపేజ్ ఇది..

Veerabhadrudu Collections
Veerabhadrudu Collections

Veerabhadrudu Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సూర్య సినిమాకు చాలా కాలం తర్వాత పబ్లిక్ లో ఇలా పాజిటివ్ టాక్ రావడం తో , సౌత్ రాష్ట్రాలన్నీ ఊగిపోయాయి. ఒక్క తమిళనాడు లో మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాల్లో , కేరళలో, కర్ణాటక లో ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి హీరో సూర్య. ఇన్ని రోజులు ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడం వల్ల , బాగా మార్కెట్ డౌన్ అయ్యింది. కానీ ఇప్పుడు మంచి సినిమా పడేలోపు అన్ని సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ముందుగా తమిళనాడు విషయానికి వస్తే , మొదటి రోజున 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య కి ఇది బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ నుండి ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక నుండి 2 కోట్ల 10 లక్షలు, కేరళ నుండి 1 కోటి 80 లక్షల, నార్త్ ఇండియా నుండి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూస్తే ఈ చిత్రానికి 19 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి 9 కోట్ల 25 లక్షలు రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి, ఈ వీకెండ్ కి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది, మొదటి వారమే పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యి , సూర్య కెరీర్ లో 14 ఏళ్ళ తర్వాత క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రంగా నిలబడబోతుంది. ఇక రెండవ రోజు అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, చూడాలి మరి ఈ చిత్రం ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది.

పెద్ది' ట్రైలర్ ని లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. సంచలనం రేపుతున్న ట్వీట్..

Peddi Trailer Leaked By Chiranjeevi
Peddi Trailer Leaked By Chiranjeevi

Peddi Trailer Leaked By Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు గాయపడ్డ సింహాలు లాగా మారిపోయారు. కాస్త డీసెంట్ కంటెంట్ ని ఇచ్చినా సరే, వేరే లెవెల్ కి తీసుకెళ్తాము అనేంతలా ఉన్నారు, అలాంటి సమయం లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కంటెంట్ ని వాళ్ళ ముందు పెట్టి ఊరిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటారు చెప్పండి ?, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ బ్లాక్ బస్టర్ ని సూచిస్తుంది, కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక ఈ నెల 18 న విడుదల చేయబోయే ట్రైలర్ తో , ఆ నమ్మకం వెయ్యి రెట్లు పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురించి ఒక ట్వీట్ వేశాడు , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి, అభిమానుల్లో ట్రైలర్ పై మరింత అంచనాలు కలిగించేలా చేస్తోంది. చిరంజీవి లో ఈ స్థాయి ఉత్సాహం ఒక కంటెంట్ ని చూసి కలిగిందంటే , కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చిరంజీవి మాట్లాడుతూ ‘పెద్ది థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే చూశాను. జస్ట్ వావ్ అనిపించింది. రామ్ చరణ్ , బుచ్చి బాబు , రెహమాన్ ఒక్కొక్కరు తమ వైపు నుండి పోటీ పడుతూ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురు కలిసి రఫ్ఫాడించేసారు. ఎమోషన్స్ , ఎలివేషన్స్ , మ్యాడ్ నెస్ అన్నీ వేరే లెవెల్ లో ఉన్నాయి. అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి’ అంటూ ఒక డైలాగ్ ని ట్రైలర్ నుండి లీక్ చేశాడు మెగాస్టార్.

‘మీరందరు నేను ఆడానని అనుకుంటున్నారను , కానీ నేను పోరాడాను సారూ.. ‘ క్షమించు బుచ్చి బాబు , ట్రైలర్ ని చూశాక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక లీక్ చేసేశా అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ట్రైలర్ నిడివి 3 నిమిషాలకు పైగానే ఉంటుందట. నిజంగా చిరంజీవి చెప్పినట్టు థియేట్రికల్ ట్రైలర్ ఉంటే, రామ్ చరణ్ కి మరో రంగస్థలం లాంటి సినిమా పడబోతోంది అనుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ కి రంగస్థలం స్థాయి సినిమా అంటే, వెయ్యి కోట్ల గ్రాస్ కచ్చితంగా కొల్లగొట్టగలదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఎల్లుండి ముంబై లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రీమియం ఫోన్ లవర్స్ కు బెస్ట్ మోడల్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..

Samsung Galaxy Z Flip 8 Launch Date
Samsung Galaxy Z Flip 8 Launch Date

Samsung Galaxy Z Flip 8 Launch Date: మొన్నటి వరకు కొన్ని మొబైల్స్ మార్కెట్లోకి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకునేవి. కానీ కొన్ని ఫోన్లు తయారీ దశలోనే బయటకు వచ్చి కొనుగోలుదారులను టెంప్ట్ చేస్తున్నాయి. వీటిలో Samsung Galaxy Z Flip 8 ఒకటి. ఈ మొబైల్ ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఇది Samsung నుంచి వచ్చే అత్యంత ముఖ్యమైన క్లామ్‌షెల్ ఫోల్డబుల్‌గా కనిపిస్తోంది. ఈ మొబైల్ డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి కీలక అంశాల్లో మెరుగుదలలు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

కొన్ని లీక్స్ ప్రకారం.. Samsung Galaxy Z Flip 8 మరింత సన్నగా, తక్కువ బరువుతో ఉండొచ్చు. దీనిని ఫోల్డ్ చేసినప్పుడు దాదాపు 13.2mm, ఓపెన్ చేసినప్పుడు 6.6mm thickness ఉంటుందని అంచనా. బరువు 180g వరకు తగ్గవచ్చని తెలుస్తోంది. అలాగే IP48 రేటింగ్ ఉండడంతో ధుమ్ము, ధూళి, నీటి బింధువుల నుంచి రక్షణగా ఉంటుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ వంటి సదుపాయాలు కూడా ఉండొచ్చు.

ఈ ఫోన్‌ బయట 4.1 అంగుళాల OLED Display, లోపల 6.9 అంగుళాల foldable OLED screen ఉండొచ్చని సమాచారం. రెండు స్క్రీన్‌లు కూడా 2,600 nits peak brightness తో పనిచేస్తూ HDR10+ support కలిగి ఉండే అవకాశం ఉంది. Foldable Display మీద crease చాలా తక్కువగా కనిపించేలా improved hinge, కొత్త OLED panel వాడొచ్చని లీక్‌లు చెబుతున్నాయి.

ప్రతీ మొబైల్ లో ప్రస్తుతం కెమెరా కీలకంగా మారింది. ఈ ఫోన్ కెమెరా విభాగంలో పెద్ద మార్పు కాకపోయినా, పనితీరు బాగానే ఉండొచ్చు. ప్రధానంగా 50MP రియర్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. వీటితో 4K 60fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 10-bit HDR, Super HDR support కూడా ఉండొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ లో Performance కోసం 2600 chip వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని మార్కెట్లలో Snapdragon 8 Elite Gen 5 కూడా ఉండొచ్చని ఇతర రిపోర్టులు చెబుతున్నాయి. RAM 12GB, storage 256GB లేదా 512GB ఉండొచ్చు. Battery విషయానికి వస్తే 4,300mAh capacity, 25W wired charging, 15W Qi2.2 wireless charging ఉండే అవకాశం ఉంది.

Galaxy Z Flip 8 Android 17 ఆధారిత One UI 9.0తో రావొచ్చని అంచనా. Samsung సాధారణంగా ఇలాంటి flagship devices‌కు 7 ఏళ్ల వరకు OS, security updates ఇస్తుంది. ధర విషయానికి వస్తే అమెరికాలో 949.99 డాలర్ల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని, భారత్‌లో సుమారు రూ. 1,15,999 నుండి రూ.1,19,999 మధ్య ధర ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. Samsung Galaxy Z Flip 8 2026 ఆగస్టు మొదటి వారంలో గ్లోబల్‌గా అందుబాటులోకి రావొచ్చు. భారత మార్కెట్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని స్పెక్స్ లిస్టింగ్స్ సూచిస్తున్నాయి.

మొబైల్ లవర్స్ కు ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్’బంఫర్ ఆఫర్..

Amazon Great Summer Sale Offers
Amazon Great Summer Sale Offers

Amazon Great Summer Sale Offers: పండుగలు, పర్వదినాల్లో మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సైతం ఈ కామర్స్ సంస్థలు వినియోగదారలను ఆకర్షించేందుకు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్’ (Amazon Great Summer Sale) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశంగా చెప్పుకుంటున్నార. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, లాప్‌టాప్‌లతో పాటు ముఖ్యంగా టాబ్లెట్లపై ఊహించని రీతిలో భారీ డీల్స్, ఆఫర్లతో పాటు ఆకర్షణీయమైన తగ్గింపులను అమెజాన్ అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్లపై అమెజాన్ ఏకంగా 40 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో భాగంగా శామ్‌సంగ్ (Samsung), షియోమీ (Xiaomi), లెనోవో (Lenovo) వంటి ప్రముఖ ఆండ్రాయిడ్ బ్రాండ్లకు చెందిన సరికొత్త మోడళ్లు బడ్జెట్ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ వినియోగదారులకే కాకుండా, ప్రీమియం లుక్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం యాపిల్ ఐప్యాడ్ (Apple iPad) మోడళ్లపై కూడా ఈ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులు లభిస్తున్నాయి.

ఉదాహరణకు వన్ ప్లస్ ప్యాడ్ లైట్ (OnePlus Pad Lite)వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ అసలు ధర రూ. 19,999 కాగా.. Amazon Great Summer Sale సందర్భంగా వినియోగదారులు దీనిని కేవలం రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు, పాత మొబైల్స్ మార్చుకోవాలనుకునే వారి కోసం అమెజాన్ ఏకంగా రూ. 16,050 వరకు భారీ ఎక్స్‌చేంజ్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం ఎలాంటి అదనపు వడ్డీ లేని నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే OnePlus Pad Lite వినియోగదారుల నుంచి ఆదరణ పొందుతోంది. ఫీచర్ల పరంగా చూస్తే, ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది పెద్ద 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో చదువుకోవడానికి, సినిమాలు చూడటానికి, ఆఫీస్ పనులకు చక్కగా సరిపోతుంది. అంతేకాకుండా, ఇందులో అమర్చిన శక్తివంతమైన 9,340mAh బ్యాటరీ వినియోగదారులకు సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది, తద్వారా పదే పదే ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా రోజంతా నిరంతరాయంగా వాడుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఈ సేల్‌లో కొనుగోలుదారులు మరింత ఎక్కువ ఆదా చేసుకునేందుకు అమెజాన్ మంచి అవకాశం కల్పించింది. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ కార్డు వినియోగదారులు క్రెడిట్ కార్డు ద్వారా లేదా EMI లావాదేవీల ద్వారా కొనుగోళ్లు జరిపితే అదనంగా 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

అక్కడ విజయ్‌.. ఇక్కడ నేను.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha Comments: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశమంతా బెంగాల్‌వైపు చూసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఈసారి బీజేపీ ఓడించాలన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా అలాగే వచ్చాయి. తమిళనాడులో మరోమారు డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేవాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి.. ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దళపతి విజయ్‌. అనూహ్యంగా టీవీకే ఈ ఎన్నిల్లో 107 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. 2028లో తెలంగాణలో తమిళనాడు సీన్‌ రిపీట్‌ అవుతుందన్నార తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత. ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశం అయింది.

తమిళనాడు మోడల్‌..
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత వంటి సినిమా నటులు రాజకీయాల్లో విజయం సాధించిన చరిత్ర ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దళలపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ బలమైన డ్రావిడ పార్టీల (డీఎంకే, ఏఐఏడీఎంకే) ఆధిపత్యాన్ని సవాలు చేసి, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. యువత, ఫ్యాన్‌ బేస్, సామాజిక మీడియా, కొత్త ఆలోచనలతో విజయ్‌ అధికార పీఠం దగ్గరకు చేరుకున్నారు. కవిత ఈ మోడల్‌ను తెలంగాణకు అన్వయించాలని చూస్తున్నారు. తమిళ ప్రజలు కొత్త యువ నాయకత్వాన్ని కోరుకున్నట్లే, తెలంగాణలో కూడా అదే జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆశావాదం కాదు తెలంగాణ ఉద్యమ చరిత్ర, యువత అసంతృప్తి, మార్పు కోరుకునే వాతావరణాన్ని ఆమె లక్ష్యంగా చేసుకున్నారు.

కవిత రాజకీయ ప్రయాణం కొత్త అధ్యాయం..
కల్వకుంట్ల కవిత తెలంగాణ మాజీ సీఎం కుమార్తె. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ, ఎమ్మెలీ. తండ్రి పార్టీలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న ఆమె, ఇటీవల తన సొంత పార్టీ తెలంగాణ రక్షణ సేనను (టీఆర్‌ఎస్‌) ఏప్రిల్‌ 25న ప్రకటించారు. ఇది తండ్రి కేసీఆర్‌తో రాజకీయ వ్యత్యాసాల నేపథ్యంలో పెట్టిన పార్టీ. పార్టీ ప్రకటించిన రోజే కవిత యువత, రైతులు, విద్యార్థులు, పేద, మధ్య తరగతి ప్రజలు, బీసీలను లక్ష్యంగా చేసుకుని పాంచజన్యం పూరించారు. అయితే ఉచిత విద్యా, వైద్యం అందించడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. కవిత మాత్రం తమ పాంచజన్యాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.

తెలంగాణ తరహా అసాధ్యం..
తమిళనాడు తరహా రాజకీయాలు, ప్రజల ఆలోచనా విధానం తెలంగాణలో ఉండదు. కవిత ఆశించిన విధంగా ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా ఓటు వేయరు. కవిత ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు కూడా సాధ్యం కాదు. కవిత రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నారు. తమిళనాడులో ద్రవిడ పార్టీల ద్విపక్ష వ్యవస్థ బలహీనపడింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉంది. విజయ్‌ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. కవితకు ఇంకా ఎన్నికల పరీక్ష ఎదుర్కొనలేదు.తెలంగాణలో రైతు సమస్యలు, ఉద్యోగాలు, సంస్కృతి రక్షణ వంటి స్థానిక అంశాలు కవిత ఎజెండాలో కీలకం కావచ్చు.

కవిత ప్రకటన యువతలో ఆశలు రేకెత్తించవచ్చు, కానీ వాస్తవాలు కఠినం. తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, పార్టీల మధ్య పోటీ, ఆర్థిక–సామాజిక సమస్యలు ఉన్నాయి. విజయ్‌ విజయం సినిమా ప్రభావం, టైమింగ్‌ వల్ల సాధ్యమైంది. కవితకు ఇలాంటి మ్యాజిక్‌ ఉంటుందా అనేది భవిష్యత్‌ ఎన్నికలు నిర్ణయిస్తాయి. అయినా, కొత్త నాయకత్వం రావడం రాజకీయ వైవిధ్యాన్ని పెంచుతుంది. ప్రజలు మార్పును అంగీకరిస్తే, తెలంగాణలో కూడా కొత్త అధ్యాయం మొదలవవచ్చు.

పెద్ది మూవీ వల్ల బుచ్చిబాబు బాగా నష్టపోయాడా...

Buchibabu Peddi Movie
Buchibabu Peddi Movie

Buchibabu Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెగా హీరోలతో సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కలగంటూ ఉంటారు. ఇక మొదటి సినిమాతోనే మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు… ఉప్పెన సినిమాతో మెగా హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన దర్శకుడిగా బుచ్చిబాబు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత రాంచరణ్ ను హీరోగా పెట్టి చేస్తున్న పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే పెద్ది సినిమా ద్వారా బుచ్చిబాబు చాలా వరకు నష్టపోయాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే పెద్ది సినిమా స్టార్ట్ చేసిన తర్వాత సినిమా షూటింగ్ కొంతవరకు లేటయింది. దానికి తగ్గట్టుగానే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ చాలా వరకు లేట్ చేస్తూ వచ్చారు. దానివల్ల ఆయన సినిమా షూటింగ్ లేటవ్వడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క సినిమానే డైరెక్షన్ చేశాడు. ఇక ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ వెళ్తే యంగ్ డైరెక్టర్లు ఎప్పుడు ఎక్కువ సినిమాలను చేస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయగలిగితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. అలాగే ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్ లో ఉంటారు.

సినీ కార్మికులందరికి పని దొరుకుతుంది. వాళ్ళందరు ఎక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు అర్జించడానికి అవకాశం దొరుకుతుంది. తద్వారా మార్కెట్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలైతే ఉంటాయి. బుచ్చిబాబు రాబోయే రోజుల్లో సంవత్సరంలోపే ఒక సినిమాని చేసి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాడట.

వీలైనంత తొందరగా సినిమాలు చేస్తే బాగుంటుందని తన సన్నిహితుల దగ్గర కూడా చెబుతున్నాడట. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ తన వెనకాల ఉన్నాడు కాబట్టి బుచ్చిబాబు ఈరోజు టాప్ డైరెక్టర్ గా మారాడు. లేకపోతే మాత్రం తను మామూలు దర్శకుడిగా మిగిలిపోయేవాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరమని మరి కొంతమంది చెబుతున్నారు. పెద్ది సినిమా తర్వాత బుచ్చిబాబు షారుక్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతునాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం పెద్ది సినిమా రిలీజ్ అయితే గాని వీటన్నింటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశామైతే లేదు…

ప్రభాస్ కంటే అల్లు అర్జున్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా...సంచలనం రేపుతున్న బన్నీ ఫ్యాన్స్...

Prabhas And Allu Arjun
Prabhas And Allu Arjun

Prabhas Vs Allu Arjun Fans: తెలుగు సినిమా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన వాళ్లలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు అందరికంటే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలను చేసి ఎక్కువ సక్సెస్ లను సాధించాడు. అయితే బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ హీరో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ లాంటి రెండు భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ లాంటి హీరో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రభాస్ తో పాటు మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…

పుష్ప సినిమాతో ఎక్కడలేని గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం భారీ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలిపాయి. ఇక అలాంటి అల్లు అర్జున్ కి ప్రభాస్ పోటీ కానే కాదు అంటూ తన అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ప్రభాస్ తో పోటీపడే రేంజ్ లో అల్లు అర్జున్ ఉన్నప్పటికి ప్రభాస్ ను ఢీకొట్టే అంత కెపాసిటి ప్రస్తుతం అల్లు అర్జున్ కైతే లేదని కొంతమంది అంటున్నారు. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ తో పోలిస్తే ప్రభాస్ కి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనే టాప్ హీరో తనకంటే ఎవరికి ఎక్కువ అభిమానులు లేరు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక రాబోయే రోజుల్లో ఎవరైతే భారీ విజయాలను సాధించి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తారో వాళ్లే నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఎవరు సక్సెస్ సాధిస్తారు ఎవరు నెంబర్ వన్ పొజిషన్ కి చాలా దగ్గరగా వస్తారు. ఎవరు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో గా మారతారు అనేది తెలియాల్సి ఉంది…

హైదరాబాద్ పై మనసు పారేసుకున్న జగన్!

Jagan
Jagan

Jagan Affection Towards Hyderabad: వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో కూటమి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ తో పాటు పాదయాత్ర మొదలు పెట్టాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు బెంగళూరులో ఉంటే మూడు రోజులు తాడేపల్లి లో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో జగన్మోహన్ రెడ్డి హైదరాబాదుకు వచ్చేయాలని చూస్తున్నారు.

అప్పట్లో లోటస్ ఫండ్ నుంచి..
2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. అప్పట్లో సీఎం చంద్రబాబు హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించేవారు. జగన్మోహన్ రెడ్డి సైతం హైదరాబాదులోని లోటస్ ఫండ్ లో ఉంటూ ఏపీకి వచ్చేవారు. అటు తరువాత తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2012లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి.. 2019 వరకు అక్కడే ఉండి.. ఏపీకి రాకపోకలు సాగించేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లికి పరిమితమయ్యారు. అధికారం కోల్పోయాక బెంగళూరు ప్యాలెస్ కు చేరుకున్నారు. అయితే సాటి తెలుగు రాష్ట్రాన్ని విడిచిపెట్టి బెంగళూరు నుంచి రాకపోకలు సాగించడం పై విమర్శలు వస్తున్నాయి. అందుకే హైదరాబాద్ కు మకాం మార్చాలని చూస్తున్నారు.

ఆ విమర్శలకు చెక్ పెట్టాలని..
బెంగళూరు నుంచి తాడేపల్లికి వారం వారం విమానాల్లో రావడంతో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అదే హైదరాబాద్ అంటే ఎవరు విమర్శించలేరు. ఎందుకంటే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ హైదరాబాదు నుంచి ఏపీకి వస్తుంటారు. అందుకే జగన్ హైదరాబాద్ వెళ్తే కూటమి నేతలు విమర్శించలేరు. పైగా హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ఉంటారు. వారిని కలిసేందుకు కూడా వీలు పడుతుంది.. పైగా రాజకీయ మిత్రులందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఆ పై సెంటిమెంట్ పరంగా కూడా లోటస్ ఫండ్ కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు షిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు. రోజులవ్యవధిలోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆ రాష్ట్ర నేత!

Annamalai Rajya Sabha news
Annamalai Rajya Sabha news

Annamalai Rajya Sabha news: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్షణంలోనైనా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.. జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే ఈసారి ఏపీ నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఆ అవకాశం రాగా కృష్ణయ్య ద్వారా ఆ పదవిని భర్తీచేసింది బిజెపి. అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర రాష్ట్రానికి చెందిన నేతకు ఏపీ నుంచి బిజెపి రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో.. మూడింటిని టిడిపి ఉంచుకోనుందట. మిగతా ఒక్క పదవిని బిజెపికి కానీ.. జనసేనకు కానీ విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే బిజెపి మరోసారి ఏపీ నుంచి ప్రాతినిధ్యం కోరుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

ఆశావహులు అధికం..
అయితే ఏపీ బీజేపీలో చాలామంది ఈ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. కానీ ఈ పదవిని తమిళనాడుకు చెందిన అన్నామలైకు బిజెపి హై కమాండ్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నమలై పోటీ చేయలేదు. ఆయన ఎన్నికల వ్యూహానికి పరిమితం అయ్యారు. కానీ తమిళనాడులో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో అన్నామలై చాన్స్ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు వినిపించాయి.

అన్నామలైకు ఛాన్స్..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు నుంచి అన్నామలైకు రాజ్యసభకు చాన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో సనాతన ధర్మం గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు అన్నమలై. అక్కడ ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. అందుకే అన్నామలైకు రాజ్యసభ అవకాశమిచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలో బిజెపి హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లాలన్నది ప్రణాళికగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

పోలీసుల వేట.. బండి భగీరథ్‌ లొంగుబాట..!

Bandi Bhageerath surrender
Bandi Bhageerath surrender

Bandi Bhageerath surrender: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తనయుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సోకేసు నమోదైన విషయం తెలిసింది. ఈ కేసు కొట్టివేయాలని, ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని భగీరత్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టులో అతనికి ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో భగీరథ్‌ను అరెస్టు చేయాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది. దీంతో పోలీసులు వేట మొదలు పెట్టారు. భగీరథ్‌ కూడా తన రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో లొంగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల ఎదుట లొంగుబాటు..?
పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ కాసేపట్లో పోలీసు అధికారుల ముందు లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయ–పోలీసు వర్గాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. భగీరథ్‌ హైదరాబాద్‌లోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో లొంగిపోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం అతన్ని కేసు నమోదైన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, నేరుగా మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ సాఫీగా జరిగితే, న్యాయవ్యవస్థలో అతని విచారణ మరింత వేగంగా ముందుకు సాగవచ్చు. పోలీసుల చర్యలు పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

సన్నిహితుల ఇళ్లలో సోదాలు..
భగీరథ్‌పై పోలీసులు ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, నగరంలోని అతని సన్నిహితుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇది అతని సాధ్యమైన దాక్కును అడ్డుకోవడానికి భాగంగా చూడవచ్చు. ఈ చర్యలు అతని సరెండర్‌ను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు అనిపిస్తోంది. కేసు నేపథ్యం, పరిణామాలు పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది. బాలల రక్షణకు సంబంధించిన గంభీర ఆరోపణలు ఉన్నందున, ఈ వ్యవహారం సమాజంలో తీవ్ర చర్చనీయాంశమైంది. భగీరథ్‌ సరెండర్‌ అయితే, కేసు త్వరగా కోర్టు వరకు చేరుకునే మార్గం సుగమమవుతుంది.

ఈ కేసు విచారణ సమయంలో సాక్ష్యాలు, సాక్షుల సంరక్షణ వంటి అంశాలు కీలకం. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపవచ్చు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో, అధికారిక ప్రకటనల కోసం పోలీసు శాఖ వైపు దృష్టి సారించాల్సి ఉంది.

అస్సామీ బాలిక.. తెలుగు పాట.. పరవశించిపోయిన నారా లోకేష్..

Lokesh Helping Student
Lokesh Helping Student

Assam Girl Sings Telugu Song: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఊపిరి సలపని పని ఒత్తిడి ఉంటుంది. పైగా ఆయన క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటూ ఉంటారు. అధికారుల పనితీరులో లోపం ఉన్నప్పటికీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయరు. అధికారులను పనితీరు మార్చుకోవాలని సూచిస్తారు. అంతేతప్ప అనవసరమైన విషయాలలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయరు. పైగా ఆయనకు క్షేత్రస్థాయి పరిస్థితుల మీద విపరీతమైన కమాండింగ్ ఉంది. అందువల్లే పని చేయించుకునే విధానంలో ఆయన సానుకూల విధానాన్ని మాత్రమే పాటిస్తుంటారు. అందువల్లే నారా లోకేష్ ప్రజల మెచ్చిన మంత్రి అయ్యారు. మంగళగిరి ప్రజల అభిమాన నాయకుడయ్యారు.

సోషల్ మీడియాలో నారా లోకేష్ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను.. తాను మెచ్చిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాకుండా.. ఇటువంటి వినూత్నమైన అంశాలను కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటారు. అందువల్లే ఆయన చాలామందికి నచ్చుతారు. తాజాగా నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు విపరీతమైన చర్చకు దారి తీస్తోంది.

ఆ వీడియోలో ఒక బాలిక పాట పాడుతోంది. ఆ బాలిక ముఖ కవళికలను చూస్తే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అని అర్థమవుతుంది. ఆ అమ్మాయి అసాబ్ రాష్ట్రానికి చెందిన అదితి. ఈమె పుట్టింది అస్సాం రాష్ట్రంలో అయినప్పటికీ.. తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. పైగా తెలుగులో గీతగోవిందం అనే సినిమాలో వచ్చిందమ్మా అనే పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట విన్న నారా లోకేష్ ఒక్కసారిగా ఆనంద పరశుడైపోయారు. అంతేకాదు ఆ పాట పాడిన పాటకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

“ఆ అమ్మాయి గొంతు బాగుంది. ఆ పాట వింటుంటే ఆనందంగా ఉంది. భిన్నభాషలకు.. బిందమైన సంస్కృతులకు మన దేశం పుట్టిల్లు. ఇన్ని రకాల భిన్నత్వాలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజల హృదయం ఒకటిగానే ఉంటుంది. సంగీతం.. సంస్కృతి.. దేశ ప్రజలను ఏకం చేస్తాయి. ఇవి రాజకీయాల కంటే కూడా లోతుగా ప్రజల మధ్య బంధాలను ఏర్పరుస్తుంటాయి. ఇటువంటి క్షణాలు మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయని” నారా లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

నారా లోకేష్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత.. ఆదితి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. అసలు ఆమె ఎవరు.. నేపథ్యం ఎక్కడ.. తెలుగు ఇంత స్పష్టంగా ఎలా పాడగలుగుతుంది.. ఆమె గొంతు చాలా అందంగా ఉంది.. సినీ అవకాశాలు ఇస్తే ఆమె స్థాయి మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

రేవంత్ ఫోన్ ఎత్తడట.. అదీ రాహుల్ గాంధీ చేసినా.. కారణం బయటపెట్టేశాడు

Revanth Reddy Rahul Gandhi phone call
Revanth Reddy Rahul Gandhi phone call

Revanth Reddy Rahul Gandhi phone call: కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆలోచన కలిగే విధంగా చేస్తాయి. చివరికి అసలు విషయాన్ని బయటపడతాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు.. వ్యవహరించిన తీరు కూడా అలానే ఉంది.

రేవంత్ రెడ్డి ఓ సంస్థ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆయన అనేక విషయాలు మీద కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అందులో ప్రధానమైన విషయం ఒకటి ఉంది. ఆయన ఎవరు ఫోన్ చేసినా సరే ఎత్తకపోవడం. ఆయన ఫోన్ నెంబర్ కొంతమందికి మాత్రమే ఇవ్వడం.. ఈ విషయాన్ని చెప్పుకోవడంలో.. రేవంత్ రెడ్డి ఏమాత్రం భయపడలేదు. పైగా ఫోన్ ఎత్తే విషయంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులను.. ఇంకా రకరకాల సమస్యలను ఆయన బయటపెట్టారు. “ఎవడో నాకు ఫోన్ చేస్తాడు. ఏదో ఇబ్బంది ఉందని నేను ఎత్తుతాను. అవతలి వ్యక్తి బాగున్నవా అన్నా అంటాడు. అర్ధరాత్రి పూట 12 గంటలకు ఫోన్ చేసి.. ఏం చేస్తున్నావ్ అన్న.. అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర వ్యక్తిగత కార్యదర్శులు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ల వల్ల కూడా కాకపోతే అప్పుడు నాకు చెప్తారు. ఇక్కడ పని జరగడం ముఖ్యం. ఫోన్ కోసం విలువైన సమయాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చివరికి రాహుల్ గాంధీ విషయంలో కూడా తన ధోరణి మారలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఫోన్ చేస్తే ఎత్తకపోతే చివరికి రాహుల్ కూడా మెసేజ్ చేస్తున్నారని.. ఆ మెసేజ్ చూసుకొని తర్వాత తను ఫోన్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలతో పాటు తనకు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమని.. అలాంటి సమయంలో కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండలేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఫోన్లు మాట్లాడుతూనే కనిపిస్తారు. ప్రజలకు అందుబాటులో ఏమాత్రం ఉండరు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఫోన్ లను పక్కనపెట్టారు. ఏదైనా అత్యవసరమైతేనే మెసేజ్ చేస్తే తన వెంటనే అందుబాటులోకి వస్తానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

రేవంత్ మొదటినుంచి కూడా ఫోన్ వాడటం చాలా తక్కువ. ఆయన వ్యక్తులతో మాట్లాడేందుకు మాత్రమే ఆసక్తిని చూపిస్తుంటారు. అంతేతప్ప ఫోన్ మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోరు. తనను కలవడానికి వచ్చిన వార్త మాట్లాడుతుంటారు. ఆ ఆ సమయంలో ఎన్నిసార్లు ఫోన్ మోగినా సరే అటువైపు కనీసం కూడా చూడరు. ముఖ్యమంత్రి కాకముందు కూడా రేవంత్ రెడ్డికి ఇదే గుణం ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వ్యవహార శైలిని ఆయన కొనసాగిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చకపోయినప్పటికీ.. రేవంత్ ఆ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

విడాకులు తీసుకునేంత వరకు నేను సినిమాల్లో నటించను అంటూ స్టార్ హీరో సంచలన ప్రకటన..

Jayam Ravi Shocking Statement
Jayam Ravi Shocking Statement

Jayam Ravi Shocking Statement: ప్రముఖ తమిళ నటుడు జయం రవి గత కొంత కాలం గా తన భార్య ఆర్తి తో విడాకుల వ్యవహారం లో నలిగిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రముఖ సింగర్ కేనీషా ఫ్రాన్సిస్ తో కొన్నేళ్ల నుండి సహజీవనం చేస్తున్న ఆయన, ఆర్తి తో విడాకులు కోరుకుంటున్నాడు. కానీ ఆమె విడాకులు ఇవ్వకుండా, కొన్ని కండీషన్స్ పెడుతూ , జయం రవి ని పబ్లిక్ గా డీ ఫేమ్ చేసేలా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. దీనిపై జయం రవి నేడు చాలా తీవ్ర స్థాయిలో రెస్పాన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన చాలా సున్నితంగానే ఈ విషయాన్ని డీల్ చెయ్యాలని అనుకున్నాడు , కానీ హద్దులు దాటడం తో సహనం నశించి మీడియా ముందుకొచ్చి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘నేను మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను. ఇప్పటి నుండి నాకు విడాకులు వచ్చేంత వరకు , నేను సినిమాల్లో నటించబోవడం లేదు. నేను ప్రస్తుతం చేసిన సినిమాని కూడా విడుదల చెయ్యనివ్వను. ఇక పై నేను అవమానాలు తీసుకోలేను , హద్దులు దాటేసారు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారో, రండి , నేను ఇక్కడే ఉన్నాను , ఎంత ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో పెట్టండి. ఇక నుండి నేను సైలెంట్ గా ఉండాలని అనుకోవడం లేదు. ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ , అన్నీ తెగించే ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు నేను వదిలిపెట్టను’ అంటూ జయం రవి చెప్పుకొచ్చాడు . ఇండస్ట్రీ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి జయం రవి , అంతే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి స్థాయి ఉన్న ఈ హీరో , ఇలా మీడియా ముందుకొచ్చి , వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం అంటే , అతను ఎంతటి మనోవేదనకు గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

'పెద్ది' చివరి 40 నిమిషాలు ఆ ఇద్దరు హీరోల నట విశ్వరూపం చూడబోతున్నామా...

Peddi Overseas Collections
Peddi Overseas Collections

Peddi movie climax performance: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. రీసెంట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను హుక్ చేస్తుందని ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారని ఆ 40 నిమిషాలు సినిమా మొత్తానికి కీలకంగా మారబోతుంది అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. మొత్తానికైతే ఆ కామెంట్లను చూసిన మెగా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివర్లో రామ్ చరణ్ శివ రాజ్ కుమార్ వల్ల నట విశ్వరూపాన్ని చూపిస్తారట… దాంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ అంచనా వేస్తున్నారు.

ఇక బుచ్చిబాబు చెప్పినట్టుగా సినిమా ఉంటే పర్లేదు. కానీ ఏ మాత్రం తేడా జరిగిన కూడా అతను భారీ విమర్శలను మూటకట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో రామ్ చరణ్ మార్కెట్ భారీగా పడిపోయింది.

ఇక ఈ సినిమాతో అమాంతం ఆయన మార్కెట్ ని పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే రామ్ చరణ్ మాత్రం 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టే ఒక్క సినిమాని కూడా చేయకపోవడం అతన్ని తీవ్రంగా నిరాశ పరుస్తుందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ఆ లోటును భర్తీ చేస్తూ భారీ విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… రామ్ చరణ్ మొదటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియాలో రామ్ చరణ్ కెరియర్ ను డిసైడ్ చేసే సినిమా అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…