Home Blog Page 267

మెగాస్టార్ తో రేణు దేశాయ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Renu Desai
Renu Desai

Renu Desai: సోషల్ మీడియా నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. హీరోయిన్ గా, మోడల్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా, ఈమెకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి గా నెటిజెన్స్ లో బాగా గుర్తింపు ఉంది. అయితే సోషల్ మీడియా లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచినప్పుడు ఒక సెక్షన్ ఆడియన్స్ ఈమెపై తీవ్రమైన నెగెటివిటీ చూపించడం వంటివి గతంలో మనం చాలానే చూశాము . అందుకు రేణు దేశాయ్ చాలా అసహనానికి గురి అవుతూ ఉండేది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టులకు కామెంట్ సెక్షన్ బ్లాక్ చేసింది. ఇకపోతే నేడు మెగాస్టార్ తో కలిసి దిగిన ఒక ఫోటోని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. మెగాస్టార్ అంటే మన టాలీవుడ్ మెగాస్టార్ కాదు , మలయాళం మెగాస్టార్ మమ్ముటి.

ఆయన్ని షూటింగ్ సెట్స్ లో కలిసిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ‘ఇది నాకు ఒక క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు. మమ్ముటి లాంటి లెజెండ్ తో కాస్త సమయం గడిపినా నా జన్మ ధన్యం అవుతుంది , ఒక్కసారైనా ఈ మూమెంట్ వస్తే బాగుండును అని నా జీవితం లో ఒక కోరిక ఉండేది , అది నేటితో నిజమైంది. ఆయన లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నా జీవితం లో ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మాకు కూడా మీలాటి అదృష్టం దొరికి ఉండుంటే బాగుండేది అంటూ మమ్మూటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

ఓటీటీ లో 'ధురంధర్ 2' కి వందల కోట్ల నష్టాలు.. మేకర్స్ పెద్ద పొరపాటు చేశారు..

Dhurandhar 2 OTT
Dhurandhar 2 OTT

Dhurandhar 2 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ‘ధురంధర్’ చిత్రం, సినిమాటిక్ అనుభూతికి పరాకాష్ట లాంటిది. ఒక సినిమాని ఎంత అద్భుతంగా తియ్యాలి , ఎంత ఎంగేజింగ్ గా తియ్యాలి , స్క్రీన్ ప్లే తో ఎలా ప్రేక్షకులను కట్టిపారేయొచ్చు వంటి విభాగాల్లో , ఫిలిం స్కూల్స్ కోచింగ్ కోసం ఈ చిత్రాన్ని విద్యార్థులకు చూపించవచ్చు. అలాంటి వెండితెర అద్భుతం ఇది. అందుకే ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించారు కేవలం హిందీ వెర్షన్ తోనే 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1870 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటికీ కూడా ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అయితే 50 రోజులు పూర్తి అయ్యాక ఓటీటీ లో విడుదల చేయాలి కాబట్టి , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ నెల 15 వ తారీఖు నుండి ఈ చిత్రం తెలుగు , తమిళం , హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఇది కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇండియన్ ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం కష్టం. ఎందుకంటే ఇండియా లో ఈ చిత్రం కేవలం జియో హాట్ స్టార్ లోనే అందుబాటులోకి రానుంది. ముందుగా ఈ నెల 15 నే ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా జూన్ 4 కి వాయిదా పడింది.

దీంతో ఈ చిత్రాన్ని మన పైరసీ రాయుళ్లు ఓవర్సీస్ నుండి HD ప్రింట్ డౌన్ లోడ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు. అత్యధిక శాతం ఇండియన్ ఆడియన్స్ ఇంటర్నెట్ లో ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసేస్తున్నారు. ఇలా జరగడం వల్ల, జియో హాట్ స్టార్ సంస్థకు నష్టం వందల కోట్లలోనే ఉంటుందని , ఒకేసారి విడుదల చేయకుండా చాలా పెద్ద తప్పు చేశారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ లో ఓవర్సీస్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారట. ముఖ్యంగా పాకిస్థాన్ దేశం లో ఒక్కసారిగా అందరూ ఈ చిత్రం ఓపెన్ చేయడం తో నెట్ ఫ్లిక్స్ ఆ దేశం లో కొంతసేపు క్రాష్ అయ్యిందని అంటున్నారు.

'పెద్ది' ట్రైలర్ లో విచిత్రమైన లుక్ లో జగపతి బాబు.. వీడియో వైరల్..

Jagapathi Babu Look In Peddi
Jagapathi Babu Look In Peddi

Jagapathi Babu Look In Peddi: సుకుమార్ స్కూల్ నుండి వచ్చే ప్రతీ డైరెక్టర్, కథ కంటే ఎక్కువగా క్యారెక్టర్స్ కి ప్రాధాన్యం ఇస్తుంటారు. సుకుమార్ తన శిష్యులకు అదే నేర్పించాడు. ముఖ్యంగా ఆయన ప్రియా శిష్యుడు బుచ్చి బాబు గురువు ని తూచా తప్పకుండ అనుసరించే మనిషి. సుకుమార్ ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇస్తాడో , బుచ్చి బాబు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తాడు. మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే తన మార్క్ ఏంటో అందరికీ చూపించాడు. ఇప్పుడు ‘పెద్ది’ కి కూడా ఆయన అదే ఫార్ములా ని అనుసరించాడు. ఈ చిత్రంలో కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక్కటే కాదు , ప్రతీ క్యారెక్టర్ కూడా హైలైట్ అవ్వబోతుంది అని హింట్స్ ఇస్తున్నాడు. ఎల్లుండి ట్రైలర్ లో చూపించబోయే క్యారెక్టర్స్ అన్నిటిని ఆయన రోజు కి ఒకటి రివీల్ చేస్తూ వస్తున్నాడు.

ముందుగా ఈ చిత్రం లో రామ్ చరణ్ కుస్తీ గురువు గా నటించిన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు, ఆ తర్వాత మీర్జాపూర్ ఫేమ్ దివ్యేన్డు క్యారెక్టర్ ని పరిచయం చేశారు , ఇక నేడు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు క్యారెక్టర్ ని పరిచయం చేశాడు . చాలా రోజుల క్రితమే జగపతి బాబు కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ఆయన ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. జగపతి బాబు మేక్ ఓవర్ ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగిన జగపతి బాబు ఈయనేనా?, ఇలా ఉన్నదేంటి?, బయటకు ఆయన ఆ గెటప్ లో వస్తే ఎవ్వరూ గుర్తు పట్టలేరు అంటూ కామెంట్స్ చేశారు అప్పట్లో.

అయితే నేడు ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేయగా , ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతోంది. ముందుగా ఆ గెటప్ ని చూసి అందరూ విలన్ క్యారెక్టర్ అనుకున్నారు , కానీ ఆయన తన ఊరి సమస్యల కోసం పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని ఈరోజు విడుదల చేసిన గ్లింప్స్ ని చూస్తే తెలుస్తోంది. కచ్చితంగా ఆయన కెరీర్ లో ఈ క్యారెక్టర్ ఒక ల్యాండ్ మార్క్ లాగా మిగిలిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. జూన్ 4 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని చూసి జనాలు రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఏ రేంజ్ లో మాట్లాడుకుంటారో , జగపతి బాబు క్యారెక్టర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటారని అంటున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

'పెద్ది' కి రెహమాన్ అందించిన సంగీతం నాకు నచ్చలేదు అంటూ డైరెక్టర్ బుచ్చి బాబు హాట్ కామెంట్స్..

Buchi Babu
Buchi Babu

Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది మూవీ టీం. అందులో భాగంగా డైరెక్టర్ బుచ్చి బాబు రీసెంట్ గా వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన సినిమా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి బుచ్చి బాబు చెప్పిన మాటలు వింటే , ఇంత స్థాయికి ఎదిగిన వాళ్ళు , ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని అనిపించక తప్పదు. కొద్దిగా ఫేమ్ రాగానే అతి చేసే సెలబ్రిటీలు , బుచ్చి బాబు రెహమాన్ గురించి చెప్పిన ఈ మాటలు వింటే మారుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం రెహమాన్ గారి ఇంటికి వెళ్ళాము. ఆయన మా కోసం అప్పటికే మూడు ట్యూన్స్ రెడీ చేసి ఉంచాడు. వాటిల్లో మొదటి ట్యూన్ వినగానే నచ్చలేదు సార్ అని చెప్పాను, అవునా , అయితే రెండవ ట్యూన్ విను అన్నాడు , అది కూడా బాగాలేదు అని చెప్పాను , పోనీ మూడవ ట్యూన్ విను అని అన్నాడు , అది కూడా నచ్చలేదు అని మొహమాటం లేకుండా చెప్పాను. అవునా, సరే ఇలా కూర్చో , కొత్తది చేద్దాం అనేవారు. నాకు అలా నచ్చలేదు అని ముఖం మీదనే చెప్పడం కరెక్ట్ కాదు అనే విషయం నాకు తెలియదు , నా పక్కన ఉన్న నలుగురు అలా మాట్లాడకూడదు అని చెప్తే, అబ్బా చాలా పెద్ద తప్పు చేశానే అని అనుకున్నాను. ఆ తర్వాత రెహమాన్ గారికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తే, నువ్వు వెయ్యి సార్లు రిజెక్ట్ చేసిన నేను ఏమి అనుకోను, మీరు సంతృప్తి చెందడమే నాకు కావాలి అన్నాడు’ అంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు.

కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ బుచ్చి బాబు. అలాంటి డైరెక్టర్ , ఆస్కార్ విజేత అందించిన మ్యూజిక్ ని రిజెక్ట్ చేసినప్పటికీ, చిరాకు పడకుండా , అతన్ని పూర్తిగా సంతృప్తి పరిచేంత వరకు ట్యూన్స్ ఇస్తూనే ఉన్నాడంటే , రెహమాన్ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది , అందుకే వాళ్ళ కెరీర్ కేవలం కొంత కాలం వరకే పరిమితం అవుతుంది , రెహమాన్ లాంటోళ్ళు దశాబ్దాల తరబడి ఇప్పటికీ టాప్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారంటే కారణం , వాళ్ళ ప్రవర్తన, ఓపిక , సహనం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉంటుంది.

4 నిమిషాల 35 సెకండ్ల విధ్వంసం.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ గ్లింప్స్ హైలైట్స్ ఇవే..

NTR Dragon Movie
NTR Dragon Movie

NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా , ఈ నెల 20 న ఆయన హీరో గా నటిస్తున్న ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే . కాసేపటి క్రితమే మూవీ టీం ‘APOCALYPSE’ అంటూ ఒక ట్వీట్ వేసింది. అంటే ‘ప్రపంచం మొత్తం నాశనం అవ్వబోతుంది’ అని దాని అర్థం. ఎన్టీఆర్ క్యారక్టర్ తాలూకు పవర్ ఫుల్ నేచర్ ని వివరించేందుకే ఈ పదాన్ని ఉపయోగించారు. అయితే ఇప్పటి వరకు టీజర్ , గ్లింప్స్ వీడియోస్ వంటివి కేవలం నిమిషం నిడివి తో , లేదా 2 నిమిషాల నిడివి తో విడుదల చేసేవారు. కానీ ‘డ్రాగన్’ గ్లింప్స్ వీడియో నిడివి ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్లు ఉండబోతుంది అట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇంత లెంగ్త్ తో ఇప్పటి వరకు ఒక్క గ్లింప్స్ కూడా రాలేదు.

ఈ నాలుగు నిమిషాల వీడియో లో ఎన్టీఆర్ మాస్ విద్వంసాన్ని ప్రశాంత్ నీల్ తన స్టైల్ లో చూపించాడట. ఎన్టీఆర్ లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని , ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఆయన్ని ఈ విధంగా చూపించలేకపోయారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ టీజర్ , గ్లింప్స్ వీడియోస్ తోనే విస్ఫోటనం సృష్టించడం లో దిట్ట. ఆయన మొదటి చిత్రం ‘కేజీఎఫ్’ టీజర్ విడుదల అయ్యినప్పుడు కూడా ఇంతే. అప్పటి వరకు కన్నడ ప్రజలకు తప్ప, ఈ ప్రశాంత్ నీల్ , యాష్ వంటి వారు ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ప్రపంచం మొత్తం దాని గురించే మాట్లాడుకోవడం జరిగింది. అది ప్రశాంత్ నీల్ విజన్ రేంజ్, ఇక కేజీఎఫ్ సీక్వెల్ టీజర్ తో కూడా ఆయన సృష్టించిన సునామీ మామూలుది కాదు.

ఆ తర్వాత విడుదలైన ‘సలార్’ టీజర్ కూడా మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకొని , అంచనాలను భారీగా పెంచేలా చేసింది. ఇక జూన్ 20 న విడుదల చేయబోయే ‘డ్రాగన్’ గ్లింప్స్ , ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి, ఇక ఈ గ్లింప్స్ వీడియో విడుదల అయ్యాక ఆ అంచనాలు ఏ రేంజ్ కి చేరుకుంటాయో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ కి తాత్కాలిక విరామం ఇచ్చారు. త్వరలోనే భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేయబోతున్నారు మేకర్స్.

ఇదేం అన్యాయం.. సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ పోరును ‘‘క్యాష్’’ చేసుకుంటున్నారు..

Sunrisers Vs RCB Ticket Prices
Sunrisers Vs RCB Ticket Prices

Sunrisers Vs RCB Ticket Prices: సీట్లు బాగుండవు. ఒకవేళ బాగున్నాయి అనిపించినప్పటికీ.. అందులో పావురాల రెట్టలు కనిపిస్తుంటాయి. దుమ్ము ధూళి.. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల అపరిశుభ్రం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట మ్యాచ్ చూడటమే ఇబ్బంది అనుకుంటే.. పైగా వేలకు వేలు టికెట్ల కోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడైతే అంతకుమించిన స్థాయిలో ధర పెంచారు. ఇలాంటి చోట క్రికెట్ మ్యాచ్ ఎలా చూడాలి.. జేబులకు చిల్లు పెట్టుకుని.. కార్పొరేటర్లకు ఇవ్వాలా.. దీనిని క్రికెట్ అంటారా.. ఇంతగనం రేట్లు ఎందుకు పెంచినట్టు.. ఎవరి కోసం పెంచినట్టు..

ఐపీఎల్ అనేదే ఒక పెద్ద దందా.. ఇటీవల గుజరాత్ ఆడిన మ్యాచ్ లు చూస్తే అది అర్థమవుతుంది. ఇంకా లోతుల్లోకి వెళ్లడం లేదు గానీ.. ఈ సీజన్లో డ్రీం లెవెల్ లాంటి మట్కా కంపెనీలకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆ లోటును ఇదిగో ఇలా భర్తీ చేస్తున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. క్రికెట్ అంటే అభిమానం ఉన్న ప్రేక్షకుల జేబులకు జేబు దొంగల కంటే దారుణంగా చిల్లులు పెడుతున్నారు. వందల ధరను వేలకు.. వేల ధరను అంతకుమించిన వేలకు పెంచి అభిమానులను దోచుకుంటున్నారు.

హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో ప్లే ఆఫ్ దాకా వచ్చింది. ఇటీవల గుజరాత్ చేతులో దారుణంగా ఓడిపోయింది. అత్యంత భీకరమైన బ్యాటింగ్ లైనపు ఉన్న హైదరాబాద్ జట్టు అలా ఆడటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్లేయర్లు కావాలని అవుట్ అయ్యారా.. గుజరాత్ ముందు కావాలని తలవంచారా.. సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ ముందు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. బెంగళూరు తో తలపడుతోంది. ఈ సీజన్లో బెంగళూరుతో తలపడిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది.

ప్లే ఆఫ్ ముందు బెంగళూరు తో తలపడుతున్న నేపథ్యంలో.. దీనికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. హైదరాబాద్ జట్టు సొంత గడ్డమీద ఆడుతున్న నేపథ్యంలో పెద్దలను విపరీతంగా పెంచారు. టికెట్ ధరలు ఈ స్థాయిలో పెంచడం పట్ల విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈనెల 22న ఉప్పల్ మైదానంలో బెంగళూరు తో ఈ మ్యాచ్ జరుగుతుంది. 950 రూపాయలు ఉన్న టికెట్ ధరను 2000కు పెంచారు. 1500 రూపాయల ఉన్న టికెట్ ధరను మూడు వేలకు పెంచారు. 1910 రూపాయల ధర ఉన్న టికెట్ 3500 కు.. 2500 ధర ఉన్న టికెట్ 4500, 4500 టికెట్ 6వేలకు.. 7వేల టికెట్ 10,000 కు, 23 వేల బాక్స్ టికెట్ 30 వేలకు.. 30 వేల రూపాయల కార్పొరేటర్ బాక్స్ టికెట్ 45 వేలకు పెంచేశారు.. అసలు ఈ స్థాయి లో ధరలు ఎందుకు పెంచారు.. కొత్త సినిమాల రిలీజ్ ముందు టికెట్ ధరలను పెంచేసినట్టు.. ఇలా ఎందుకు చేశారు అర్థం కావడం లేదని.. ఇలా పెంచి తమ జేబులకు చిల్లు పెడుతున్నారని అభిమానులు వాపోతున్నారు.

ఎద అందాలతో చంపమాకే..

Avneet Kaur
Avneet Kaur

'నా భార్య నాపై చేతబడి చేసింది' అంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..

Jayam Ravi Wife Controversy
Jayam Ravi Wife Controversy

Jayam Ravi Wife Controversy: తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జయం రవి , గత కొంతకాలంగా మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది. నేడు ప్రెస్ మీట్ లో ఆయన తన భార్య ఆర్తి పై చేసిన కామెంట్స్ ని చూస్తుంటే, అయ్యో పాపం రవి అని అనిపించక తప్పదు. ఒక పెద్ద హీరో ఎంతైనా ఇలా మీడియా ముందుకొచ్చి , తాను వ్యక్తిగతంగా ఎదురుకుంటున్న టార్చర్ గురించి చెప్తున్నదంటే ఆయన అభిమానులు ఎంత బాధకు గురి అవుతారో ఊహించుకోవచ్చు. నా భార్య ఆర్తి నుండి విడాకులు వచ్చేంత వరకు నేను అసలు సినిమాల్లో నటించను అని , పూర్తి చేసిన సినిమాలను కూడా విడుదల చెయ్యనని చెప్పుకొచ్చాడు రవి.

ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ రోజు నేను నా బిడ్డతో చెస్ ఆడుకునేవాడిని, వాళ్లంటే నాకు ప్రాణం, కానీ వాళ్ళని నన్ను కలవనివ్వకుండా చేస్తున్నారు, స్కూల్ కి వెళ్తే నన్ను రానివ్వకుండా బాడీ గార్డ్స్ ని ఏర్పాటు చేశారు , నాతో పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నారని, వాటిని కూడా బంద్ చేశారు. ఇన్ని రోజులు నా బిడ్డల యోగక్షేమాలను నేనే చూసుకున్నాను , స్కూల్ లో ఒక్కొక్కరికి 50 లక్షల ఫీజు కట్టేవాడిని’ అంటూ ఆయన బాధపడ్డాడు. ఇంకా మాట్లాడుతూ ‘ఇన్ని సినిమాలు చేశాను , ఇప్పటి వరకు నాకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదంటే మీరు నమ్ముతారా ?, నిజంగానే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు , ఆర్తి తో కలిపి జాయింట్ బ్యాంకు అకౌంట్ ఉంది, నేను ఒక్క రూపాయి అందులో నుండి తీసుకున్నా, నాకు ఫోన్ కాల్ వచేస్తాది , ఎందుకు డబ్బులు తీసుకున్నావ్ అని, నా కష్టార్జీతన్ని అనుభవించే స్వేచ్ఛ ని కూడా నాకు ఇవ్వలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

పెళ్ళికి ముందు నా తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేసుకోవద్దని నన్ను చాలా వరకు బ్రతిమిలాడారని , అప్పుడు మాట వినకపోవడం వల్ల , నేడు అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు జయం రవి. నన్ను పెళ్లి చేసుకోమని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నన్ను పెళ్లి చేసుకుందని , అప్పటి నుండి నేను నరకవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాని , నాపై చేతబడి కూడా చేయించిందని , ఇంత చేసి ఇప్పుడు తన పీఆర్ టీం తో నాపై సైబర్ బుల్లియింగ్ చేస్తుందని అంటున్నాడు రవి. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు ఎంత మానసిక వేదన పడుతున్నానో మీకు అర్థం కావడం లేదు, నన్ను నేను బాధపెట్టుకోవడం మొదలు పెట్టా (ఆత్మహత్యాయత్నం), కచ్చితంగా నేను రాబోయే రోజుల్లో చనిపోతానేమో , కానీ నీకు మాత్రం నరకం మిగిలించి పోతాను’ అంటూ జయం రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తున్నాయి.

సీఎం విజయ్ ఇంటికి వెళ్లిమరీ డిమాండ్ చేసిన కమల్ హాసన్..ఫోటోలు వైరల్..

Kamal Haasan Meets Vijay
Kamal Haasan Meets Vijay

Kamal Haasan Meets Vijay: తమిళ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత , ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొన్ని అభినందించదగినవి గా ఉండగా , మరికొన్ని మాత్రం విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయన చేస్తాను అని చెప్పిన కొన్ని పనులను వాయిదా వేశాడు , దీనిపై ప్రతి పక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతే కాకుండా అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద నెగెటివ్ కామెంట్స్ చేయడాన్ని టీవీకే పార్టీ ఖండించకుండా , సమర్ధించడం పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే నేడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ విజయ్ ఇంటికి వెళ్లి భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఈయన ప్రస్తుతం DMK పార్టీ తో ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు సీఎం విజయ్ పై సెటైర్లు విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన సమయం లో కూడా ఈయన విజయ్ పై విమర్శలు కురిపించాడు. అలాంటి వ్యక్తి నేడు విజయ్ ని కలవడం చూస్తుంటే , కచ్చితంగా రాబోయే రోజుల్లో ఎదో జరగబోతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కమల్ హాసన్ సీఎం విజయ్ ని కలిసిన సందర్భంగా ట్విట్టర్ లో ట్వీట్ వేస్తూ ‘నేడు నా సోదరుడు , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ ని కలవడం జరిగింది. మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాము , తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి విజయ్ తన ఆలోచనలు నాతో పంచుకున్నాడు , చాలా అద్భుతంగా అనిపించాయి. అదే విధంగా నేను కూడా మా సినీ ఇండస్ట్రీ తరుపున 6 డిమాండ్లను సీఎం ముందు పెట్టాను. తమిళనాడు ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకొని సినీ పరిశ్రమ అభివృద్ధి కి సహకరిస్తుందని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ DMK పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేడు విజయ్ ని కలవడం తో , భవిష్యత్తులో కమల్ హాసన్ టీవీకే పార్టీ లో చేరుతాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా , ఏదైనా జరగొచ్చు , శాశ్వత మిత్రులు ఉండరు , శత్రువులు ఉండరు, దశాబ్దాల నుండి DMK పార్టీ తో పొత్తులో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల్లో ఓడిపోగానే టీవీకే పార్టీ వైపు వచ్చేసింది. అలాంటిది కమల్ హాసన్ భవిష్యత్తులో విజయ్ తో చేతులు కలపకుండా ఉండదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

ఈ EVతో సిటీ లోనే కాదు.. లాంగ్ డ్రైవ్ కూడా చేయొచ్చు..

Simple Ultra Electric Scooter
Simple Ultra Electric Scooter

Simple Ultra Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్ల సంఖ్య రోజురోజకు పెరిగిపోతోంది. ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ సింపుల్ అల్ట్రా (Simple Ultra) ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగుపెట్టింది. అత్యంత ఆధునిక సాంకేతికత, అద్భుతమైన పవర్‌తో రూపుదిద్దుకున్న ఈ హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్, ప్రస్తుత EV మార్కెట్లోనే అత్యంత శక్తివంతమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. కేవలం సిటీ రైడింగ్‌కే పరిమితం కాకుండా, లాంగ్ రైడ్స్ చేయాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని డిజైన్ చేసింది. మరి దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఈ కథనంలోకి వెళ్లండి..

Simple Ultra స్కూటర్ యొక్క ప్రధాన ఆకర్షణ బ్యాటరీ రేంజ్. ఇందులో అమర్చిన భారీ 6.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (డ్యూయల్ బ్యాటరీ సెటప్) ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని (IDC రేంజ్) కంపెనీ పేర్కొంది. దీనివల్ల వాహనదారుల్లో ఉండే రేంజ్ ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. ఈ బ్యాటరీతో సిటీలో డ్రైవ్ చేసుకునేవారికి బాగా ఉపయోగపడతుంది.

ఈ స్కూటర్ సామర్థ్యం కోసం 8.8 kW PMSM మోటార్ ఉపయోగించారు. ఇది రోడ్డుపై అత్యంత వేగవంతమైన, స్థిరమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. నగరాల్లోని ట్రాఫిక్‌ను దాటుకుంటూ వెళ్లడానికే కాకుండా, హైవేలపై సుదూర ప్రయాణాలకు కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ఎంపికగా మారుతుంది.

సాంకేతికత పరంగా సింపుల్ అల్ట్రా సరికొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే 7 అంగుళాల లార్జ్ TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఉంచారు. దీని ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యాప్‌మైఇండియా (MapmyIndia) ఆధారిత నావిగేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి సదుపాయాలను యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, జియో ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

వినియోగదారుల విభిన్న రైడింగ్ అవసరాలకు అనుగుణంగా ఇందులో బహుళ రైడింగ్ మోడ్స్‌ను చేర్చారు. ఇందులో Eco X, Eco, Ride, Air, Sonic, మరియు Sonic X అనే ఆరు రకాల మోడ్స్ ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఎకో మోడ్స్‌ను, అత్యంత వేగవంతమైన పవర్ కావాలనుకునే వారు సోనిక్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి తోడు భద్రత కోసం ట్రాక్షన్ కంట్రోల్ (నాలుగు లెవెల్స్), హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, యాంటీ-థెఫ్ట్, టో అలర్ట్ మరియు స్కూటర్ కింద పడిపోతే పవర్ కట్ అయ్యే ‘డ్రాప్ సేఫ్’ ఫీచర్లను కూడా ఈ స్కూటర్ కలిగి ఉంది.

ఈత కొలనులో.. బి*కి*నీలో అనసూయ అందాలు

Anasuya Birthday Celebration
Anasuya Birthday Celebration

చివరికి ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ కూడా దిగదుడుపే

IND Vs PAK
IND Vs PAK

IND Vs PAK: ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే క్రీడ ఏదైనా ఉందంటే అది ఫుట్ బాల్ మాత్రమే. ఫుట్ బాల్ లో అనేక రకాలైన పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఆ పోటీలు అభిమానులకు అద్భుతమైన ఆట మజాను అందిస్తూనే ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తొలిసారి ఫుట్ బాల్ క్రికెట్ ముందు ఓడిపోయింది. కూడా భారత్, పాకిస్తాన్ ముందు తల వంచింది.

క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తూ ఉంటుంది. విపరీతమైన అభిమానుల ఆదరణ.. భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి ఐసీసీ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తుంది..

ఇక మన దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ల గురించి వివరించాల్సిన పనిలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో కచ్చితంగా పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ల ను ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాచులు కేవలం క్రికెట్ పరంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఫుట్ బాల్ ఆటను కూడా మించిపోతున్నాయి.

Luxury అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన మ్యాచుల జాబితాలో మూడు, ఐదు స్థానాలలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ గేమ్స్ ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ఏకంగా 1.5 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 2018 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 1.12 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్ 2014 ఫైనల్ మ్యాచ్ 1.1 బిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ను 950 మిలియన్ల మంది వీక్షించారు.

ఈ సంస్థ వీక్షణల ఆధారంగానే ఈ కేటగిరీలను ప్రకటించింది. ఆదాయం పరంగా ఏ మ్యాచులు ముందు వరుసలో ఉంటాయో చెప్పలేదు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆదాయం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. దాదాపు వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

ఆ ఇద్దరు దర్శకులు మాదక ద్రవ్యాలు కొట్టకపోతే సినిమా చేయలేరా..?

Film Directors Drug Addiction Controversy
Film Directors Drug Addiction Controversy

Film Directors Drug Addiction Controversy: ఆ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది… వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. వాళ్ళు చేసే సినిమాల పరిధి కూడా పెద్దగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తారు కాబట్టి ప్రేక్షకులకు స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ని చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ సినిమాలకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలను సక్సెస్ ఫుల్ గా నిలపడంలో దర్శకులు చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. కథ రాసుకున్నప్పటి నుంచి దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేంతవరకు దర్శకుడు అహర్నిశలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏ ఒక్క విషయంలో ఇబ్బంది జరిగిన కూడా సినిమా అవుట్ పుట్ లో తేడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అవి లేకపోతే వాళ్లు సినిమా చేసే ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. ఆ గంజాయి హైప్ లో ఉన్నప్పుడే వాళ్ళు అనుకున్న సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరిస్తారట.

గాంజాయి కొడుతూ సినిమా డైరెక్షన్ చేస్తున్న దర్శకులు ఎవరు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక ఇద్దరు దర్శకులు మాత్రం ఎప్పుడు అదే డోప్ లో ఉంటారట. ఒకవేళ అది కొంచెం తగ్గిన కూడా వాళ్ళ హై ఫీల్ తగ్గుతుందని భావిస్తారట.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్లు సినిమాలు చేయడం ఒక ఎత్తైతే వాళ్ళ హెల్త్ ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది అంటూ లభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అనేది అల్టిమేట్ కాబట్టి దానిని హై రేంజ్ లో చిత్రీకరించడానికి వాళ్ళను ఎప్పుడు అదే డోప్ లో ఉంచే విధంగా మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారట.

కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో ఫ్యూచర్ లో వాళ్ళు విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అంటూ కొంతమంది వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మనం చేసే పనిలో మన సంకల్ప బలంతో ముందుకు సాగితే బాగుంటుంది. అంతే తప్ప మిగతా వాటిని ఆసరాగా తీసుకుని ముందుకు సాగడం అనేది సరైనది కాదంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం దర్శకులకు సలహాలను ఇస్తున్నారు…

బల్లులు బాధపెడుతున్నాయా.. ఇలా ఇంట్లో నుంచి తరిమేయండి

Lizard Control Tips At Home
Lizard Control Tips At Home

Lizard Control Tips At Home: ఇంట్లో దోమలకు.. ఈగలకు రకరకాల మిషన్లు వచ్చాయి. వాటి ద్వారా ఈగలను, దోమలను నివారించవచ్చు. అవసరమైతే వాటిని పుట్టకుండా కూడా చేయవచ్చు. కుట్టకుండా కూడా దూరం పెట్ట వచ్చు. ఈగలు, దోమలు మాత్రమే కాదు.. ఇంట్లో కనిపించే శత్రువులు కూడా ఉంటాయి.. అవే బల్లులు. ఇవి ఎటువంటి హాని మనకు కలిగించకపోయినప్పటికీ.. రెట్టలు వేయడం.. ఇంట్లో గోడల మీద విపరీతంగా కదులుతూ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి ఆహార పదార్థాలను కూడా తినేస్తూ ఉంటాయి. బల్లి అత్యంత ప్రమాదకరమైనది.

బల్లి దేహం మొత్తం విష పూరితమై ఉంటుంది. అది గనుక పొరపాటున ఆహారంలో పడితే.. ఆ ఆహారం గనక మనం తింటే ప్రాణాలు పోతాయి. అందువల్లే బల్లులు ఇంట్లో ఉండకుండా.. ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బల్లులు కొన్ని సందర్భాల్లో వస్తూనే ఉంటాయి. తీవ్రంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించి ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు. బల్లులు ఇంట్లో ఉంటే కీటకాలను తినేస్తూ ఉంటాయి. తినేసిన తర్వాత రెట్టలు వేస్తూ ఉంటాయి. దీనివల్ల ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది.

బల్లులు చూసేందుకు చిన్నగానే ఉన్నప్పటికీ పెద్ద పెద్ద సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చిన్నచిన్న చిట్కాలతో బయటకు వెళ్లగొట్టవచ్చు. మిర్యాల పొడి నీటిలో కలిపి బల్లులు తిరిగే ప్రదేశాలలో పిచికారి చేస్తే అవి వెంటనే పారిపోతాయి. కోడిగుడ్డు పెంకుల వాసన కూడా బల్లులను బయటికి పరుగులు పెట్టేలా చేస్తుంది. నీరు, పుదీనా, నూనె కలిపి స్ప్రే చేసినా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు తీవ్రమైన వాసన కలిగి ఉంటాయి. వాటిని కూడా అక్కడక్కడా పెడితే బల్లులు దెబ్బకు పారిపోతూ ఉంటాయి.

బల్లులు ఇంట్లో ఆవాసం ఏర్పాటు చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు శుభ్రతను పాటించాలి. దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. బూజు వంటిది కనిపిస్తే వెంటనే శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు రూఫ్ క్లీనర్ తో ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటే బల్లుల వంటివి రావు.. ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలిగించవు.

సూర్య 'కరుప్పు (వీరభధ్రుడు)' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించని మాస్ ర్యాంపేజ్ ఇది..

Veerabhadrudu Collections
Veerabhadrudu Collections

Veerabhadrudu Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సూర్య సినిమాకు చాలా కాలం తర్వాత పబ్లిక్ లో ఇలా పాజిటివ్ టాక్ రావడం తో , సౌత్ రాష్ట్రాలన్నీ ఊగిపోయాయి. ఒక్క తమిళనాడు లో మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాల్లో , కేరళలో, కర్ణాటక లో ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సౌత్ లో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న మొట్టమొదటి హీరో సూర్య. ఇన్ని రోజులు ఆయనకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోవడం వల్ల , బాగా మార్కెట్ డౌన్ అయ్యింది. కానీ ఇప్పుడు మంచి సినిమా పడేలోపు అన్ని సెంటర్స్ లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. రాష్ట్రాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ముందుగా తమిళనాడు విషయానికి వస్తే , మొదటి రోజున 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్య కి ఇది బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ నుండి ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక నుండి 2 కోట్ల 10 లక్షలు, కేరళ నుండి 1 కోటి 80 లక్షల, నార్త్ ఇండియా నుండి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూస్తే ఈ చిత్రానికి 19 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి 9 కోట్ల 25 లక్షలు రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి, ఈ వీకెండ్ కి కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది, మొదటి వారమే పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యి , సూర్య కెరీర్ లో 14 ఏళ్ళ తర్వాత క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రంగా నిలబడబోతుంది. ఇక రెండవ రోజు అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, చూడాలి మరి ఈ చిత్రం ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది.

పెద్ది' ట్రైలర్ ని లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. సంచలనం రేపుతున్న ట్వీట్..

Peddi Trailer Leaked By Chiranjeevi
Peddi Trailer Leaked By Chiranjeevi

Peddi Trailer Leaked By Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు గాయపడ్డ సింహాలు లాగా మారిపోయారు. కాస్త డీసెంట్ కంటెంట్ ని ఇచ్చినా సరే, వేరే లెవెల్ కి తీసుకెళ్తాము అనేంతలా ఉన్నారు, అలాంటి సమయం లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కంటెంట్ ని వాళ్ళ ముందు పెట్టి ఊరిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటారు చెప్పండి ?, ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ బ్లాక్ బస్టర్ ని సూచిస్తుంది, కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాం అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక ఈ నెల 18 న విడుదల చేయబోయే ట్రైలర్ తో , ఆ నమ్మకం వెయ్యి రెట్లు పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురించి ఒక ట్వీట్ వేశాడు , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి, అభిమానుల్లో ట్రైలర్ పై మరింత అంచనాలు కలిగించేలా చేస్తోంది. చిరంజీవి లో ఈ స్థాయి ఉత్సాహం ఒక కంటెంట్ ని చూసి కలిగిందంటే , కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చిరంజీవి మాట్లాడుతూ ‘పెద్ది థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే చూశాను. జస్ట్ వావ్ అనిపించింది. రామ్ చరణ్ , బుచ్చి బాబు , రెహమాన్ ఒక్కొక్కరు తమ వైపు నుండి పోటీ పడుతూ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురు కలిసి రఫ్ఫాడించేసారు. ఎమోషన్స్ , ఎలివేషన్స్ , మ్యాడ్ నెస్ అన్నీ వేరే లెవెల్ లో ఉన్నాయి. అన్నట్టు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి’ అంటూ ఒక డైలాగ్ ని ట్రైలర్ నుండి లీక్ చేశాడు మెగాస్టార్.

‘మీరందరు నేను ఆడానని అనుకుంటున్నారను , కానీ నేను పోరాడాను సారూ.. ‘ క్షమించు బుచ్చి బాబు , ట్రైలర్ ని చూశాక, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక లీక్ చేసేశా అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. ట్రైలర్ నిడివి 3 నిమిషాలకు పైగానే ఉంటుందట. నిజంగా చిరంజీవి చెప్పినట్టు థియేట్రికల్ ట్రైలర్ ఉంటే, రామ్ చరణ్ కి మరో రంగస్థలం లాంటి సినిమా పడబోతోంది అనుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ కి రంగస్థలం స్థాయి సినిమా అంటే, వెయ్యి కోట్ల గ్రాస్ కచ్చితంగా కొల్లగొట్టగలదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఎల్లుండి ముంబై లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రీమియం ఫోన్ లవర్స్ కు బెస్ట్ మోడల్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..

Samsung Galaxy Z Flip 8 Launch Date
Samsung Galaxy Z Flip 8 Launch Date

Samsung Galaxy Z Flip 8 Launch Date: మొన్నటి వరకు కొన్ని మొబైల్స్ మార్కెట్లోకి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకునేవి. కానీ కొన్ని ఫోన్లు తయారీ దశలోనే బయటకు వచ్చి కొనుగోలుదారులను టెంప్ట్ చేస్తున్నాయి. వీటిలో Samsung Galaxy Z Flip 8 ఒకటి. ఈ మొబైల్ ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఇది Samsung నుంచి వచ్చే అత్యంత ముఖ్యమైన క్లామ్‌షెల్ ఫోల్డబుల్‌గా కనిపిస్తోంది. ఈ మొబైల్ డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి కీలక అంశాల్లో మెరుగుదలలు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

కొన్ని లీక్స్ ప్రకారం.. Samsung Galaxy Z Flip 8 మరింత సన్నగా, తక్కువ బరువుతో ఉండొచ్చు. దీనిని ఫోల్డ్ చేసినప్పుడు దాదాపు 13.2mm, ఓపెన్ చేసినప్పుడు 6.6mm thickness ఉంటుందని అంచనా. బరువు 180g వరకు తగ్గవచ్చని తెలుస్తోంది. అలాగే IP48 రేటింగ్ ఉండడంతో ధుమ్ము, ధూళి, నీటి బింధువుల నుంచి రక్షణగా ఉంటుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ వంటి సదుపాయాలు కూడా ఉండొచ్చు.

ఈ ఫోన్‌ బయట 4.1 అంగుళాల OLED Display, లోపల 6.9 అంగుళాల foldable OLED screen ఉండొచ్చని సమాచారం. రెండు స్క్రీన్‌లు కూడా 2,600 nits peak brightness తో పనిచేస్తూ HDR10+ support కలిగి ఉండే అవకాశం ఉంది. Foldable Display మీద crease చాలా తక్కువగా కనిపించేలా improved hinge, కొత్త OLED panel వాడొచ్చని లీక్‌లు చెబుతున్నాయి.

ప్రతీ మొబైల్ లో ప్రస్తుతం కెమెరా కీలకంగా మారింది. ఈ ఫోన్ కెమెరా విభాగంలో పెద్ద మార్పు కాకపోయినా, పనితీరు బాగానే ఉండొచ్చు. ప్రధానంగా 50MP రియర్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. వీటితో 4K 60fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 10-bit HDR, Super HDR support కూడా ఉండొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ లో Performance కోసం 2600 chip వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని మార్కెట్లలో Snapdragon 8 Elite Gen 5 కూడా ఉండొచ్చని ఇతర రిపోర్టులు చెబుతున్నాయి. RAM 12GB, storage 256GB లేదా 512GB ఉండొచ్చు. Battery విషయానికి వస్తే 4,300mAh capacity, 25W wired charging, 15W Qi2.2 wireless charging ఉండే అవకాశం ఉంది.

Galaxy Z Flip 8 Android 17 ఆధారిత One UI 9.0తో రావొచ్చని అంచనా. Samsung సాధారణంగా ఇలాంటి flagship devices‌కు 7 ఏళ్ల వరకు OS, security updates ఇస్తుంది. ధర విషయానికి వస్తే అమెరికాలో 949.99 డాలర్ల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని, భారత్‌లో సుమారు రూ. 1,15,999 నుండి రూ.1,19,999 మధ్య ధర ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. Samsung Galaxy Z Flip 8 2026 ఆగస్టు మొదటి వారంలో గ్లోబల్‌గా అందుబాటులోకి రావొచ్చు. భారత మార్కెట్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని కొన్ని స్పెక్స్ లిస్టింగ్స్ సూచిస్తున్నాయి.