Homeఎంటర్టైన్మెంట్Jayam Ravi Wife Controversy: 'నా భార్య నాపై చేతబడి చేసింది' అంటూ మీడియా ముందు...

Jayam Ravi Wife Controversy: ‘నా భార్య నాపై చేతబడి చేసింది’ అంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..

Jayam Ravi Wife Controversy: తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జయం రవి , గత కొంతకాలంగా మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది. నేడు ప్రెస్ మీట్ లో ఆయన తన భార్య ఆర్తి పై చేసిన కామెంట్స్ ని చూస్తుంటే, అయ్యో పాపం రవి అని అనిపించక తప్పదు. ఒక పెద్ద హీరో […]

Jayam Ravi Wife Controversy: తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి , యూత్ , మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జయం రవి , గత కొంతకాలంగా మానసికంగా టార్చర్ అనుభవిస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది. నేడు ప్రెస్ మీట్ లో ఆయన తన భార్య ఆర్తి పై చేసిన కామెంట్స్ ని చూస్తుంటే, అయ్యో పాపం రవి అని అనిపించక తప్పదు. ఒక పెద్ద హీరో ఎంతైనా ఇలా మీడియా ముందుకొచ్చి , తాను వ్యక్తిగతంగా ఎదురుకుంటున్న టార్చర్ గురించి చెప్తున్నదంటే ఆయన అభిమానులు ఎంత బాధకు గురి అవుతారో ఊహించుకోవచ్చు. నా భార్య ఆర్తి నుండి విడాకులు వచ్చేంత వరకు నేను అసలు సినిమాల్లో నటించను అని , పూర్తి చేసిన సినిమాలను కూడా విడుదల చెయ్యనని చెప్పుకొచ్చాడు రవి.

ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ రోజు నేను నా బిడ్డతో చెస్ ఆడుకునేవాడిని, వాళ్లంటే నాకు ప్రాణం, కానీ వాళ్ళని నన్ను కలవనివ్వకుండా చేస్తున్నారు, స్కూల్ కి వెళ్తే నన్ను రానివ్వకుండా బాడీ గార్డ్స్ ని ఏర్పాటు చేశారు , నాతో పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నారని, వాటిని కూడా బంద్ చేశారు. ఇన్ని రోజులు నా బిడ్డల యోగక్షేమాలను నేనే చూసుకున్నాను , స్కూల్ లో ఒక్కొక్కరికి 50 లక్షల ఫీజు కట్టేవాడిని’ అంటూ ఆయన బాధపడ్డాడు. ఇంకా మాట్లాడుతూ ‘ఇన్ని సినిమాలు చేశాను , ఇప్పటి వరకు నాకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదంటే మీరు నమ్ముతారా ?, నిజంగానే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు , ఆర్తి తో కలిపి జాయింట్ బ్యాంకు అకౌంట్ ఉంది, నేను ఒక్క రూపాయి అందులో నుండి తీసుకున్నా, నాకు ఫోన్ కాల్ వచేస్తాది , ఎందుకు డబ్బులు తీసుకున్నావ్ అని, నా కష్టార్జీతన్ని అనుభవించే స్వేచ్ఛ ని కూడా నాకు ఇవ్వలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

పెళ్ళికి ముందు నా తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేసుకోవద్దని నన్ను చాలా వరకు బ్రతిమిలాడారని , అప్పుడు మాట వినకపోవడం వల్ల , నేడు అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు జయం రవి. నన్ను పెళ్లి చేసుకోమని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నన్ను పెళ్లి చేసుకుందని , అప్పటి నుండి నేను నరకవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాని , నాపై చేతబడి కూడా చేయించిందని , ఇంత చేసి ఇప్పుడు తన పీఆర్ టీం తో నాపై సైబర్ బుల్లియింగ్ చేస్తుందని అంటున్నాడు రవి. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఇప్పుడు ఎంత మానసిక వేదన పడుతున్నానో మీకు అర్థం కావడం లేదు, నన్ను నేను బాధపెట్టుకోవడం మొదలు పెట్టా (ఆత్మహత్యాయత్నం), కచ్చితంగా నేను రాబోయే రోజుల్లో చనిపోతానేమో , కానీ నీకు మాత్రం నరకం మిగిలించి పోతాను’ అంటూ జయం రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper