Homeఎంటర్టైన్మెంట్Allu Arjun argument with star director: నన్నెందుకు హీరోగా తీసుకోలేదంటూ స్టార్ డైరెక్టర్ తో...

Allu Arjun argument with star director: నన్నెందుకు హీరోగా తీసుకోలేదంటూ స్టార్ డైరెక్టర్ తో కొట్లాడిన అల్లు అర్జున్.. అసలు ఏమైందంటే..

Allu Arjun argument with star director: కెరీర్ ప్రారంభం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చేవాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘గంగోత్రి’ నుండి ‘వరుడు’ వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా లవ్ స్టోరీ నే. ‘బద్రినాథ్’ చిత్రం నుండి తన పంధా మార్చాడు, ‘సరైనోడు’ చిత్రం నుండి మాస్ హీరో గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్ లవ్ స్టోరీస్ చేసే రోజుల్లో ఎన్నో సూపర్ హిట్ […]

Allu Arjun argument with star director: కెరీర్ ప్రారంభం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చేవాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘గంగోత్రి’ నుండి ‘వరుడు’ వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా లవ్ స్టోరీ నే. ‘బద్రినాథ్’ చిత్రం నుండి తన పంధా మార్చాడు, ‘సరైనోడు’ చిత్రం నుండి మాస్ హీరో గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్ లవ్ స్టోరీస్ చేసే రోజుల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాడు. అందులో ‘భద్ర’ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం పూర్తిగా మాస్ సినిమా కాదు , అలా అని పూర్తి స్థాయి లవ్ స్టోరీ కూడా కాదు , ఈ సినిమా అల్లు అర్జున్ చేసుంటే వేరే లెవెల్ ఉండేదని అప్పట్లో అందరూ అంటూ ఉండేవారు. అదే విధంగా ఆయనకు ఒక లవ్ స్టోరీ ని చూసిన తర్వాత ‘అబ్బా ఇది నేను చేసుంటే బాగుండేది కదా’ అని అనిపించిందట.

ఆ లవ్ స్టోరీ మరేదో కాదు ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’. అప్పటి వరకు హీరో గా, కొరియోగ్రాఫర్ గా ఇండియా లోనే టాప్ మోస్ట్ స్థానం లో ఉన్న ప్రభుదేవా, డైరెక్టర్ గా మారి చేసిన సినిమా ఇది. సిద్దార్థ్ , త్రిష లు హీరో హీరోయిన్లు గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన MS రాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఈ సినిమా అల్లు అర్జున్ కి అప్పట్లో పిచ్చి పిచ్చి గా నచ్చేసింది. నన్ను అతను ఒక రోజు కలిసినప్పుడు , నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం లో నన్ను హీరోగా తీసుకోవద్దని ఎందుకు అనిపించింది రాజు గారు అని అల్లు అర్జున్ అడిగాడు’.

‘నువ్వు చూసేందుకు చాలా రఫ్ & టఫ్ గా ఉంటాయి, నిన్ను ఫారిన్ కి చెందిన ఒక మిలినియర్ కొడుకుగా చూడలేకపోయాను , అందుకే సిద్దార్థ్ ని తీసుకున్నాను. అతను ఆ చిత్రం లో తన ప్రేమని గెలిపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ నీ స్పీడ్ కి కేవలం గంటలోనే నీ ప్రేమని గెలిపించుకోగలవు , కథ కి అది సూట్ అవ్వదు కాబట్టే నిన్ను తీసుకోలేదు అని చెప్పాను, అప్పుడు అల్లు అర్జున్ ఇది కూడా నిజమేనండి అని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు MS రాజు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసుంటే ఎలాంటి ఫలితం ఉండేది అనే అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper