HomeతెలంగాణTelangana boy viral story: కోట్ల మందిని నవ్విస్తున్న ఈ బుడ్డోడు తెలంగాణ పిల్లాడే.. ఆ...

Telangana boy viral story: కోట్ల మందిని నవ్విస్తున్న ఈ బుడ్డోడు తెలంగాణ పిల్లాడే.. ఆ నవ్వుల వెనుక కథ

Telangana boy viral story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ మీమ్ చూసినా, ఏ ట్రోల్ వీడియో చూసినా ఒక కుర్రాడు టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వుతూ కనిపిస్తాడు. ఆ స్వచ్ఛమైన నవ్వుతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న ఆ కుర్రాడి పేరు అరుణ్. ఒక సామాన్య లారీ క్లీనర్ స్థాయి నుంచి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన అరుణ్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ కుర్రాడు నార్త్ […]

Telangana boy viral story: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ మీమ్ చూసినా, ఏ ట్రోల్ వీడియో చూసినా ఒక కుర్రాడు టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వుతూ కనిపిస్తాడు. ఆ స్వచ్ఛమైన నవ్వుతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న ఆ కుర్రాడి పేరు అరుణ్. ఒక సామాన్య లారీ క్లీనర్ స్థాయి నుంచి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన అరుణ్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ కుర్రాడు నార్త్ ఇండియన్ లేదా విదేశీ కుర్రాడు అని అనుకుంటున్నారు. కానీ ఈయన తెలుగువాడే అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మాలపల్లి (నల్లపుచ్చట పల్లి) గ్రామానికి చెందిన అరుణ్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా అబ్బకపోవడంతో, కుటుంబ భారానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే లారీ క్లీనర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. నెహ్రూ అనే లారీ డ్రైవర్ వద్ద సహాయకుడిగా చేరుతూ, కష్టాలను నవ్వుతూ స్వీకరిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అరుణ్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఒకరోజు డ్రైవర్ నెహ్రూతో కలిసి లారీలో వెళ్తున్న అరుణ్, దారి మధ్యలో టీ తాగడానికి ఆగారు. ఇద్దరూ టీ గ్లాసులు పట్టుకుని తాగుతుండగా, నెహ్రూ సరదాగా ఒక జోక్ వేశాడు. ఆ జోక్ అరుణ్ కు ఎంతలా నచ్చిందంటే, తన చేతిలో వేడివేడి టీ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. టీ వొలికి చెయ్యి కాలుతున్నా సరే, ఆ బాధ అతని ముఖంలో ఎక్కడా కనిపించలేదు. కేవలం చేతిని దులుపుకుంటూ, ఆనందంతో ఊగిపోతూ నవ్వడం కొనసాగించాడు.

అరుణ్ యొక్క ఆ నిజాయితీతో కూడిన నవ్వును చూసిన డ్రైవర్ నెహ్రూ, వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. కృత్రిమమైన నవ్వులు, నటించే వ్యక్తుల మధ్య అరుణ్ నవ్వులో ఉన్న ‘ప్యూర్ ఎనర్జీ’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మీమర్స్ కి ఇది ఒక అద్భుతమైన కంటెంట్ లా దొరకడంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సందర్భానికి అరుణ్ నవ్వుతున్న విజువల్స్ వాడటం మొదలుపెట్టారు.

ఒక్క రాత్రిలో స్టార్ అయిన అరుణ్ గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కటిక పేదరికం, రోజంతా లారీ క్లీనర్ గా శ్రమించే జీవితం ఉన్నప్పటికీ.. చిన్న జోక్ కే అంతలా ఆనందపడటం అతని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. సంతోషం అనేది మనం వెతుక్కునే చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుందని అరుణ్ నిరూపించాడు. ప్రస్తుతం అరుణ్ సోషల్ మీడియాలో ఒక పెద్ద ‘స్టార్’గా మారిపోయి అందరినీ అలరిస్తున్నాడు.
https://youtu.be/C3yj5Wbx5RE

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper