Home Blog Page 258

క్రూడ్ ఆయిల్ సెగతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్..

Iran Oil Sanctions Lifted
Iran Oil Sanctions Lifted

Iran Oil Sanctions Lifted: ఇది శుభవార్త. ముమ్మాటికీ ప్రపంచానికి ఉపశమనం కలిగించే వార్త. ధరల సెగతో అల్లాడుతున్న సగటు జీవికి జీవం పోసిన వార్త. ఇలా జరుగుతుందని.. ఇలా ఒక్కసారిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి ఈ పరిణామంతో ప్రపంచంలో మెజారిటీ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

కొంతకాలంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల ముడి చమరు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ కూడా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కరెన్సీల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. విదేశీ మారక ద్రవ్యాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల అన్ని దేశాలు వీపరితమైన ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆర్థికంగా పొదుపు పాటిస్తున్నాయి. అంతేకాదు చమురు ధరలు కూడా పెంచేస్తున్నాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రపంచమున నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పేసింది. శాంతి చర్చల తర్వాత ఇరాన్ ఆయిల్ మీద అమెరికా విధించిన ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా తస్నీం న్యూస్ వెల్లడించింది. అయితే ఈ రిలీఫ్ శాశ్వతంగా ఉండాలని.. దీంతోపాటు మిగతా అంశాలు కూడా ఎత్తివేయాలని ఇరాన్ మీడియా అభిప్రాయపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఈ ఆంక్షలు తాత్కాలికంగా కాకుండా.. శాశ్వతంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల గ్లోబల్ స్టాక్ మార్కెట్లు వేగం పుంజుకున్నాయి. లాభాల బాట పట్టాయి.

ఈ నిర్ణయం అమెరికా ఎప్పుడో తీసుకుంటే చాలా బాగుండేది. యుద్ధం చేసిన అమెరికా సాధించిన లక్ష్యాలు పెద్దగా కనిపించడం లేదు. పైగా అమెరికాకు తత్వం బోధపడింది. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందువల్లే ఇరాన్ చమురు మీద కాంక్షలు తొలగించింది. తాత్కాలికంగానైనా అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం.. భవిష్యత్ కాలంలో ప్రపంచ దేశాలకు అనేక రకాల మేళ్ళు చేకూర్చుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కు యుద్ధం వల్ల నష్టం ఎదురు కావడంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ప్రపంచ ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నారు.

మండే ఎండల్లో కేంద్రం చమురు మంట.. పెట్రో ధరలు పెంచేసింది.. ఈసారి ఎంతంటే..

Petrol Price Hike In India
Petrol Price Hike In India

Petrol Price Hike In India: ఇప్పటికే ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. సగటు జీవి జీవితం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం మరోసారి చమురు మంట పెట్టింది. వారంలో రెండోసారి ధరలు పెంచి.. చుక్కలు చూపించింది. దీంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల లీటర్ పెట్రోల్ మీద మూడు రూపాయలు.. లీటర్ డీజిల్ మీద మూడు రూపాయలు పెంచింది కేంద్రం. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చేసింది.. దేశవ్యాప్తంగా ధరలను విపరీతంగా పెంచేసింది. లీడర్ డీజిల్ మీద.. లీటర్ పెట్రోల్ మీద 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో చమురు ధరలు పెరగడం ఇది రెండవసారి.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల గుడి సరఫరా విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. ఫలితంగా నాలుగు రోజుల క్రితం లీటర్ పెట్రోల్ మీద, లీటర్ పెట్రోల్ మీద మూడు రూపాయలు చొప్పున కేంద్రం పెంచింది. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం వసూలు మొత్తాన్ని తాత్కాలికంగా ఆపేసింది.

పెట్రోల్ ధరలు దేశంలో ఎలా ఉన్నాయంటే..

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 98.64, కోల్ కతా లో 109.70, ముంబైలో 107.59, చెన్నైలో 104.49 ధర ఉంది.

డీజిల్ ధరలు

లీటర్ డీజిల్ ధర దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 91.58, కోల్ కతా లో 96.07, ముంబై 94.08, చెన్నై 96.11 గా ఉంది.

మొదటి నుంచి లోకేష్ కనకరాజ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో...

Lokesh Kanagaraj
Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు… ఆయన నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఖైదీ సినిమాతో కార్తీ ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చేసాడు. ఇక ఆ తర్వాత విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఉన్న అప్పులన్నీ తీర్చేశాడు. మొత్తానికైతే రజినీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో తడబడ్డప్పటికి ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి అతని ఇమేజ్ తార స్థాయికి వెళుతుందనే చెప్పాలి. లోకేష్ కనకరాజుని ఒక స్టార్ హీరో మాత్రం పక్కన పెట్టేసాడు అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే విక్రమ్ గా తెలుస్తుంది. గతంలో లోకేష్ కనకరాజు రాసుకున్న ఖైదీ సినిమాని మొదట విక్రమ్ తో చేద్దాం అనుకున్నారట. కానీ విక్రమ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అది కార్తీ దగ్గరికి వచ్చింది. ఇక ఆ తర్వాత లోకేష్ కనకరాజు విక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేయలేదు.

కారణం ఏంటి అంటే ఒకసారి దాన్ని రిజెక్ట్ చేశాడు కాబట్టి అతనితో సినిమా చేయాల్సిన అవసరం లేదని అనుకున్నట్టుగా ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే లోకేష్ కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ లతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే లోకేష్ కనకరాజుకి విక్రమ్ డేట్స్ ఇవ్వకపోయిన కూడా తను ఇతర హీరోల డేట్స్ తో సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ గా నిలపగలిగే కెపాసిటి తనకు ఉందని ప్రూవ్ చేసుకుంటున్నాడు…

ఇక లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ తో సినిమా చేసిన తర్వాత తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత అతను మరొక టైర్ వన్ హీరోని డైరెక్ట్ చేయాలని చూస్తున్నారట. ఇక ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

పగ్గాలు అందుకొని పది రోజులు కాలేదు.. విజయ్ పాలనలో ఇన్ని యూ టర్న్ లా..

CM Vijay
CM Vijay

CM Vijay: రాజకీయ నాయకులు నాలుక మడత పెట్టడం కొత్తేమీ కాదు. మడమ తిప్పడం కూడా వింత కాదు. పైగా దేశవ్యాప్తంగా క్రెడిట్ చోరీ రాజకీయాలు దర్జాగా సాగుతున్నాయి. గొప్పగా ఉంటే నాది అని.. చెత్తగా ఉంటే అవతలివాడిదని చెప్పుకోవడం ఇప్పటి కాలంలో అలవాటుగా మారింది. ఇలాంటి వ్యవహారాలకు తలలు పండిన రాజకీయ నాయకులు పాల్పడుతుంటారు. ఇది తప్పా? ఒప్పా? అనే విషయాలను పక్కన పెడితే.. ఇటువంటి వ్యవహారాలు రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోతున్నాయి.

తలలు పండిన రాజకీయాలు మాత్రమే కాదు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి పది రోజులు కూడా కావడం లేదు. పైగా ఆయన అధికారాన్ని దక్కించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. పుష్ప సినిమా మాదిరిగా సోఫాలు కూడా పంపించారు.. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏఐడీఎంకే మద్దతు తీసుకోబోనని చెప్పిన ఆయన.. కొద్ది రోజులకే మాట మార్చారు. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడానికి ఆయన అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకోవాలి.. అంతేకాదు ఇంకా అనేక రకాలుగా ఆయన నాలుక మడత పెడుతూనే ఉన్నారు. కేవలం ఈ పది రోజుల్లోనే ఆయన ఈ పని చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతమైన అధికారిగా విజయ్ నియమించుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. హేతువాద సంఘాలు తోడయ్యాయి. దీంతో విజయ్ వెనక్కి తగ్గక తప్పలేదు. పైగా జ్యోతిష్యుడి నియామకం పట్ల వెంటనే స్పందించారు విజయ్. 24 గంటల్లో అతడు నియామకాన్ని రద్దు చేశారు.

సనాతన ధర్మాన్ని డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి తీవ్రంగా విమర్శించారు. ఆ సమయంలో విజయ్ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు విజయ మంత్రివర్గంలో కీలక మంత్రి అధర్వ.. బహిరంగంగానే ఉదయనిది వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది ఆ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలను బయటపెట్టింది.

ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండే ఏ పార్టీ మద్దతు తీసుకోబోమని విజయ్ ప్రకటించారు. ఫ్లోర్ టెస్ట్ సమయంలో సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఏఐడీఎంకే కు చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకున్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతి మహిళకు 2500 ఆర్థిక సహాయం చేస్తామని విజయ ప్రకటించారు. అయితే ఆ పథకాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. పైగా ఇప్పుడు అమల్లో ఉన్న వెయ్యి రూపాయల పథకాన్ని కూడా నిలిపివేస్తామని.. దానిని పునర్ వ్యవస్థీకరిస్తామంటూ చెబుతున్నారు.

స్థూలంగా చూస్తే తమిళనాడు సీఎం పరిపాలనకు.. అరవింద్ కేజ్రివాల్ వ్యవహరించిన తీరుకు పెద్దగా తేడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో విజయ్ గురించి కొంతమంది గొప్పగా చెప్పవచ్చు. పి ఆర్ టీం రకరకాల వీడియోలను విడుదల చేయవచ్చు. కానీ అంతిమంగా ఫీల్డ్ రియాలిటీ మాత్రమే నిలబడుతుంది. ఎందుకంటే రీల్ కంటే రియల్ చాలా విలువైనది.

సూర్య విషయంలో ఎప్పుడు ఏదో తప్పు జరగడానికి కారణమేంటి...

Veerabhadhrudu Movie Analysis
Veerabhadhrudu Movie Analysis

Veerabhadhrudu Movie Analysis: సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘వీరభద్రుడు’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి షో తో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఓవరాల్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యకి తెలుగులో చాలామంది అభిమానులు ఉండటం వల్ల అతని సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలవడంతో అతని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వీరభద్రుడు రూపంలో అతనికి ఒక మంచి సక్సెస్ అయితే దక్కిందనే చెప్పాలి.

సూర్య సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఒక మోస్తరు సక్సెస్ లను మాత్రమే సాధిస్తున్నాయి. అంతే తప్ప ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలిగే సినిమాలను తను చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా సూర్య కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… వైవిధ్యభరితమైన పాత్రలను పోషించడంలో సూర్య ను మించిన వారు ఇంకెవరు లేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. అయినప్పటికి కలెక్షన్స్ విషయంలో మాత్రమే చాలా వరకు వెనకబడిపోతున్నాడు.

ఆ విషయంలో ఆయన క్లారిటీగా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని అందుకున్నవాడవుతాడు. ఇక సూర్య ఎందుకని ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాల విషయంలోనే చాలా వరకు కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఆయన ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు.

అతనికి ప్రతి క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పటికి తన నటన ఎలివేట్ అయ్యే కథలు తనకి రావడం లేదు. దాంతో అతని విషయంలోనే చాలా వరకు మిస్ఫైర్ అవుతుంది. మరి ఆయన అలాంటివి చూసుకొని మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తే అతన్ని ఆదరించడానికి చాలామంది తెలుగు ప్రేక్షకులు సైతం సిద్ధంగా ఉన్నారు…

ఈరోజు గజకేసరి యోగం ప్రభావం.. ఈ 5 రాశుల వారికి లక్కీ..

Today 19 May 2026 Horoscope
Today 19 May 2026 Horoscope

Today 19 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి గజకేసరి యోగం ప్రభావంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు గజకేసరి యోగం ప్రభావం ఉండనుంది. దీంతో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మహార్దశ పట్టణం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు ప్రణాళిక ప్రకారం గా ముందుకు వెళ్లడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. గ్రహాల అనుకూల తో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బంధువుల మధ్య విభేదాలు తొలగిపోతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కెరీర్ విషయంలో కీలకమైన మార్కులు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారంతో పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను వాయిదా వేయవచ్చు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారిపోతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారులు ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలు చక చకా జరిగిపోతాయి. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో నిరాశ చెందవచ్చు. గ్రహాల అనుకూలతతో ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములతో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కెరీర్ విషయంలో కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. దీంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను విడవకుండా ఉండాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

పారిపోతున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. వేటాడి పట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్..

Jogi Ramesh
Jogi Ramesh

Jogi Ramesh: మాజీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు వేటాడి వెంటాడి మరీ పట్టుకొని అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూస్తుంటే ఒక యాక్షన్ సినిమాని తలపిస్తుంది. బైక్ లో తన అనుచరుడితో కలిసి పారిపోతున్న జోగి రమేష్ ని, పోలీసులు జీప్ లో వచ్చి ఆపడం , ఆపినప్పటికీ కూడా ఆగకుండా జోగి రమేష్ పారిపోవడం తో పోలీసులు అతన్ని ఆపి , ఈడ్చుకొని జీపు ఎక్కించాల్సి వచ్చింది. ఎందుకు అరెస్ట్ చేశారు వంటి వివరాలు పూర్తిగా బయటకు రాలేదు కానీ , పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం పైన మాత్రం వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు . పోలీసులు రౌడీలు లాగా ప్రవర్తిస్తున్నారని , ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం లో భాగం గానే జోగి రమేష్ ని అక్రమంగా అరెస్ట్ చేసారని అంటున్నారు. అయితే జోగి రమేష్ అధికారం లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను చూస్తే , సామాన్యులకు కూడా ఇతని మీద జాలి కలగదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై , మంత్రి నారా లోకేష్ లపై గతం లో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి మరీ. పవన్ కళ్యాణ్ ని అయితే పిచ్చి కుక్క అంటూ సంబోధించాడు , అదే విధంగా అంబటి రామ్ బాబు అరెస్ట్ అయినప్పుడు కూడా నారా లోకేష్ పై నోరు పారేసుకున్నాడు. ఇలా నోరు పారేసుకున్నందుకే కార్యకర్తలు వేసిన కేసుల కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

పెద్ది' మూవీతో 'ఉత్తరాంధ్ర స్లాంగ్' కి గ్లోబల్ గుర్తింపు రానుందా..? ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Peddi team latest announcement
Peddi team latest announcement

Ram Charan Peddi : మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాయలసీమ యాస మీద వచ్చిన సినిమాలను చాలానే చూశాము , అదే విధంగా తెలంగాణ యాస మీద వచ్చిన సినిమాలను కూడా చాలానే చూశాము , కానీ ఉత్తరాంధ్ర యాస మీద వచ్చిన సినిమాలను చాలా తక్కువ చూశాము . నేడు విడుదల చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో విడుదల చేస్తోంది. ఇందులో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడం, అది కొంతమందికి అర్థం అవ్వడం, కొంతమందికి కాకపోవడం వల్ల డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ ని చూసి ఒక సినిమా పరిస్థితి ఏంటి అని ఊహించలేము , ట్రైలర్ లో అర్థం అవ్వని డైలాగ్స్ , థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవ్వొచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు.

అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే గ్లోబల్ వైడ్ గా ఉత్తరాంధ్ర యాస కి మంచి గుర్తింపు లభిస్తుంది. ‘పుష్ప’ చిత్రం ట్రైలర్ విడుదల రోజు కూడా, చిత్తూరు యాస అర్థం కాలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున గోల చేశారు. కానీ చివరికి ఆ సినిమాలోని డైలాగ్స్ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. రేపు ‘పెద్ది’ కి కూడా కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే , ఇదే రేంజ్ రెస్పాన్స్ రావొచ్చు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సినిమాలు ద్వారా మన రాష్ట్రాల్లోని ప్రదేశాలు, యాస గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ కి పరిచయం చేయడం శుభ పరిణామం, దీని వల్ల టూరిజం కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నుండి తదుపరి రాబోతున్న కంటెంట్ స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ నెల 22 న ఆ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. మరి ఈ సాంగ్ ఐటెం సాంగా?, లేకపోతే థీమ్ సాంగా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 2 న విజయనగరం లో , జూన్ 3 న హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండిట్లో ఎదో ఒక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా రాబోతున్నాడని టాక్.

'పెద్ది' ట్రైలర్ లో చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఎమోషన్స్ వేరే లెవెల్ ఉన్నట్టున్నాయి..

Ram Charan Peddi movie

Ram Charan Peddi movie : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా పై మొదటి నుండి అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మేకర్స్ చేస్తున్న ప్రొమోషన్స్ సినిమా పై మరింత హైప్ ని పెంచేలా చేశాయి. ఇక నేడు విడుదల చేసిన ట్రైలర్ అయితే అభిమానులకు తెగ నచ్చేసింది, ముఖ్యంగా రామ్ చరణ్ వేరియేషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కమాట లో చెప్పాలంటే పాపం ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లో ఎవ్వరూ గమనించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ముఖ్యంగా రామ్ చరణ్ రౌడీ గ్యాంగ్ ని ఎగురుకుంటూ ఉంటాడు, అప్పుడు పక్కనే నేల మీద ఒక మృతదేహం ఉంటుంది , అది ఎవరిదో కాదు జగపతి బాబు ది. ఈ చిత్రం లో ఆయన అప్పలసూరి అనే క్యారెక్టర్ చేశాడు. తన ఊరికి రైలు మార్గం కోసం పోరాడే ముసలాయన క్యారెక్టర్ లో ఇందులో జగపతి బాబు కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో ఇంకా బాగా గమనిస్తే , జగపతి బాబు అందరి కాళ్ళను పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆయన సన్నివేశాలు మొత్తం వేరే లెవెల్ లో వచ్చినట్టు ఉన్నాయి. అలా ఊరి కోసం పోరాడుతూ ప్రాణాలు వదులుతాడు , అతని పోరాటాన్ని ‘పెద్ది’ కొనసాగిస్తాడు , ఇదే స్టోరీ అనేది ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. జగపతి బాబు, రామ్ చరణ్ మధ్య ఫస్ట్ హాఫ్ లో చూపించే బాండింగ్ వేరే లెవెల్ లో ఉంటుందని, ఆడియన్స్ బాగా ఎమోషనల్ అయిపోతారని డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఇక ట్రైలర్ చివర్లో ‘పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ ఫీట్’ అనే కామెంటరీ వినిపిస్తుంది గమనించారా?, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది , బ్యాక్ ఆన్ ది ఫీట్ అంటే, పెద్ది మరోసారి తన కాళ్ళ పై నిలబడ్డాడు అని, అంటే ఇన్ని రోజులు సోషల్ మీడియా లో జరిగిన ప్రచారానికి తగ్గట్టుగానే , ఇందులో రామ్ చరణ్ తన కాళ్ళను కోల్పోతాడు అని అర్థం అవుతోంది. ఇలాంటి సీక్వెన్స్ లు సినిమాలో చాలానే ఉంటాయట, చివరి 45 నిమిషాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉండబోతుందని టాక్.

బండి భగీరథ్ కేసు.. మరో 10 మందికి నోటీసులు..కలకలం

Bandi Bhageerath arrest
Bandi Bhageerath arrest

Bandi Sai Bhageerath case : తెలంగాణలో ఇటీవల బండి సాయి భగీరథ్ పై నమోదై ఫోక్సో కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా తాజాగా మరో సెక్షన్ను పోలీసులు నమోదు చేశారు. ఇక బాధితురాలు మరియు ఆమె తల్లి ఫిర్యాదులో పేర్కొన్న స్నేహితులను పోలీసులు విచారించాలని నిర్ణయించారు.

స్నేహితుల పాత్రపై ఆరోపణలు.
బాధితురాలు తన ఫిర్యాదులో ఒక కీలక విషయం ప్రస్తావించారు. తనపై అఘాయిత్యాలు జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు అక్కడే ఉన్నారని, వారు ఘటనలను చూసి కూడా నిశ్శబ్దంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరం కాదని, ఒక సమూహం యొక్క మౌన సహకారం ఉందని సూచిస్తోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ స్నేహితులు కేసును రాజీకి తీసుకురావడానికి ప్రయత్నించారని బాధితుల వైపు నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా 10 మంది స్నేహితుల పేర్లను పోలీసులకు అందించారు.

పోలీసుల కీలక నిర్ణయం..
బాధితురాలి ఆరోపణలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆమె పేర్కొన్న పదిమందికి ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారు. ఇది కేసును మరింత విస్తృతంగా పరిశోధించడానికి సహాయపడుతుంది. స్నేహితులు ఎంతవరకు పాల్గొన్నారు, వారికి ఎంత సమాచారం ఉంది, రాజీ ప్రయత్నాల వెనుక ఉద్దేశ్యం ఏమిటి అనే అంశాలు స్పష్టమవుతాయి.

సాయి భగీరథ్ కేసు ద్వారా ఒకటి స్పష్టమవుతోంది. నేరాలు ఒంటరిగా జరగవు. చుట్టుపక్కల ఉన్నవారి మౌనం లేదా ప్రోత్సాహం కూడా నేరానికి భాగస్వామ్యం అవుతుంది. స్నేహితులు అనే పేరుతో ఎవరైనా చట్టానికి అతీతంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా, ఒత్తిడికి లొంగకుండా విచారణ చేపట్టాలి. బాధితురాలికి న్యాయం అందించడం ద్వారా మాత్రమే సమాజంలో ఇలాంటి సంఘటనలపై నమ్మకం పెరుగుతుంది. ఈ కేసు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

చార్లెట్‌లో ఘనంగా తానా ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమం

Adopt Street Program

TANA Adopt Street Program : అమెరికాలోని చార్లెట్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘అడాప్ట్ స్ట్రీట్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తానా స్వర్ణోత్సవాల సందర్భంగా కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సామాజిక బాధ్యత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

‘గుడ్ నేబర్ డే’ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చార్లెట్ ప్రాంతానికి చెందిన తానా నాయకులతో పాటు 50 మంది పిల్లలు, 50 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. చార్లెట్ నగరంలోని ఆండ్రే కెల్ టామ్ షార్ట్ కూడలిలోని ఇరువైపుల రహదారులను తానా ప్రతినిధులు దత్తత తీసుకుని పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి చార్లెట్ హౌజింగ్ అండ్ నైబర్‌హుడ్ సర్వీసెస్ అధికారి జొనాథన్ హిల్ హాజరై తానా సభ్యులకు సూచనలు చేశారు. సమాజ సేవలో తానా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా తానా దత్తత తీసుకున్న రహదారుల వద్ద ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నవారికి అల్పాహారం, కాఫీ, టీ అందించారు. చార్లెట్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఎట్ లార్జ్ డింపుల్ అజ్మీరా తానా చేపట్టిన సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ, స్వర్ణోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చార్లెట్‌లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కూడా పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి, రవి (నాని) వడ్లముడి తదితరులు కృషి చేశారు.

త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు..

Modi cabinet reshuffle

Modi cabinet reshuffle : కేంద్ర కేబినెట్ లో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నాయా? ప్రస్తుతం మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.. యూఏఈ, నెదర్లాండ్ లతో ఒప్పందాలు దేశానికి ఎంతో ఉపయోగం కానున్నాయి. అన్నీ చోట్ల రూమర్స్ వస్తున్నాయి. కేంద్ర కేబినెట్ లో మార్పులు వస్తాయని.. అన్నామలై రాజ్యసభతోపాటు కేంద్ర కేబినెట్ లో చేరుతారని టాక్ నడుస్తోంది.

మోడీ 2014లో , 2019లో వచ్చినా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే.. సగం కాలం పూర్తయ్యాక అంటే రెండేళ్ల తర్వాత మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ చేసి ఎవరు ఏ మంత్రి ఎలా చేస్తారని చూసి కేబినెట్ రీషఫల్ చేస్తారు. ఈ సారి కూడా ఆ పద్ధతుల్లో చేస్తారని బలంగా వినిపిస్తోంది.

ఈనెల 21వ తేదీన కేంద్రమంత్రుల శాఖల రిపోర్టు కార్డ్ ప్రజేంటేషన్ ఉంది. కేంద్రమంత్రుల పనితీరుపై రివ్యూ తర్వాత జరుగుతుంది. ఇక రెండోది రెండు సంవత్సరాల్లో వచ్చిన డెవలప్ మెంట్స్ చూసి మంత్రివర్గ ప్రక్షాణళ చేయనున్నారు. వచ్చే యూపీ సహా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ రీషఫుల్ చేస్తారు. కీలకమైన పెద్ద మంత్రుల శాఖల మార్పులుండవు. విదేశీ, ఆర్థిక , రక్షణ, రోడ్డు రవాణాలాంటి వాటిల్లో మార్పులుండవు.

త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు.

అక్షరాలా 20 లక్షల టిక్కెట్లు.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 'కరుప్పు(వీరభద్రుడు)' సాధించిన గ్రాస్ ఎంతంటే..

Karuppu Veerabhadrudu 3 Days Collections
Karuppu Veerabhadrudu 3 Days Collections

Karuppu Veerabhadrudu 3 Days Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ లో అతి కష్టమైన ఫేస్ ని ఎదురుకుంటున్న సూర్య ని చూసి , ఇక ఆయన ఇప్పట్లో సూపర్ హిట్స్ ని అందుకోవడం కష్టమే అని అనుకున్నారు అందరూ. కానీ రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూస్తుంటే , సూర్య రేంజ్ ఏంటి అనేది ఈ జనరేషన్ కుర్రాళ్లకు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఈ చిత్రానికి రెండవ రోజు , మూడవ రోజు నమోదైన వసూళ్లు తమిళ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న విజయ్ , రజినీకాంత్ , అజిత్ సినిమాల వసూళ్లను మించి ఉన్నాయి. ఇది సాధారమైన విషయం కాదు. మూడవ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట.

మన తెలుగు సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రెండవ రోజు కానీ , మూడవ రోజు కానీ నమోదు అవ్వలేదు. ఇకపోతే మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తమిళనాడు ప్రాంతం నుండి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తెలుగు రాష్ట్రాల నుండి 13 కోట్లు, కర్ణాటక రాష్ట్రం నుండి 10 కోట్లు , కేరళ రాష్ట్రం నుండి 6 కోట్ల 55 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 55 లక్షలు , ఓవర్సీస్ నుండి 41 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 122 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 7 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 6 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక కేవలం 40 లక్షల రూపాయిలను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని తెలుగు వెర్షన్ లో క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది.

గాలి కాలుష్యంతో కిడ్నీ వాపు..

Health effects of Air pollution
Health effects of Air pollution

Health effects of Air pollution: ప్రస్తుత కాలంలో గాలి కాలుష్యం ఊపిరితిత్తులను పాడు చేయడం మాత్రమే కాదు కిడ్నీలపై కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ప్రధానంగా వాహనాల నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగలో ఉండే చిన్నపాటి కణాలు, ప్రత్యేకించి పీఎం 2.5 (PM2.5) అనే పార్టికులేట్ మ్యాటర్ వల్ల కిడ్నీలపై మార్పులు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గమనించారు.

తాజాగా వెలుగు చూసిన డేటా ప్రకారం .. గాలిలో ఎక్కువగా పీఎం 2.5 ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం సుమారు నాలుగు రెట్లు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. అంటే గాలిలో ఈ హానికరమైన కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు కిడ్నీ సమస్య కోసం ఆసుపత్రుల్లో చేరే వారిసంఖ్య మిగతా ప్రాంతాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేకించి హై ట్రాఫిక్ రోడ్ల దగ్గర, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పొగలోని కణాలు కిడ్నీల లోపల చేరిన తర్వాత అక్కడ వాపు ను ప్రేరేపిస్తాయి, ఇది క్రమంగా కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీసి, వాటి ఫిల్టరింగ్ పనితీరు తగ్గేలా చేస్తోంది.

పరిశోధకులు చెప్పిన ప్రకారం.. ఈ గాలి కాలుష్యం కారణంగా కిడ్నీలు చిన్న వయసులోనే క్షీణించడం కూడా సంభవిస్తోంది. సాధారణంగా 50 నుంచి 60 సంవత్సరాల తర్వాత కిడ్నీలు క్షీణించడం కనిపిస్తుంటే.. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 30 నుంచి 40 సంవత్సరాల వయసులోనే కిడ్నీల పనితీరు గణనీయంగా పడిపోతోందని లేదా కిడ్నీ డిజీజ్‌లు ఏర్పడే అవకాశం పెరగడం గమనించారు. ఈ ప్రభావం ప్రత్యేకించి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ లాంటి క్రానిక్ సమస్యలు ఉన్న వారిలో మరింత తీవ్రంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే, గాలి కాలుష్యం కిడ్నీలను ‘సైలెంట్ ’‌గా దెబ్బతీసే ఒక కారకంగా పరిగణిస్తున్నారు.

గాలి కాలుష్యాన్ని తగ్గించడం, పీఎం 2.5 స్థాయిలను నియంత్రించడం, ప్రజలు మాస్క్‌లు ధరించడం, ఎయిర్ ఫిల్టర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వంటివి ఉపయోగించడం మొదలైన చర్యలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతాయని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా రోడ్డు పక్క ప్రాంతాల్లో చెట్లు పెంచడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మెరుగుపరచడం, పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని నియంత్రించే పాలసీలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇలా గాలి కాలుష్యం–కిడ్నీ ఆరోగ్యం మధ్య ఉన్న బంధం గురించి ప్రజా అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్య నుంచి కనీసం భాగం మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వట సావిత్రి వ్రతం ఈ ఏడాదిలో ఎప్పుడు చేయాలి..

Vata Savitri Vratam 2026 date
Vata Savitri Vratam 2026 date

Vata Savitri Vratam 2026 date: హిందూ సంప్రదాయంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాల్లో వట సావిత్రి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని సౌభాగ్యం, భర్త దీర్ఘాయుష్షు, కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత మహిళలు పాటిస్తారు. వట వృక్షం (మర్రిచెట్టు) చుట్టూ పూజలు నిర్వహిస్తూ సావిత్రి దేవిని స్మరించడం ఈ వ్రత ప్రత్యేకత. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది ఈ వ్రతం ఎప్పుడు చేయాలి?

సంప్రదాయం ప్రకారం.. వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య లేదా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి రెండుసార్లు కూడా ఈ వ్రతాన్ని నిర్వహించే ఆనవాయితీ ఉంది. మొదటిసారి వైశాఖ అమావాస్య రోజున, అంటే 2026 మే 16 శనివారం ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తున్నారు. రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి రోజున అంటే జూన్ 29న ఈ వ్రతాన్ని పాటించనున్నారు. ప్రాంతానుసారం తిథుల్లో తేడాలు ఉన్నా వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మాత్రం ఒకటే.

వట సావిత్రి వ్రతానికి మూలం మహాభారత కాలంలోని సావిత్రి –సత్యవాన్ కథ. సావిత్రి తన భర్త సత్యవాన్ ప్రాణాలను యమధర్మరాజు నుంచి తిరిగి పొందిన ఘట్టం ఈ వ్రతానికి ఆధారం. అపారమైన భక్తి, పట్టుదల, పతివ్రత్య మహిమతో సావిత్రి యముడినే ఒప్పించి తన భర్తను తిరిగి జీవింపజేసిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహిత మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతాన్ని ఎంతో విశ్వాసంతో ఆచరిస్తారు.

వట వృక్షాన్ని ఈ వ్రతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. మర్రిచెట్టు దీర్ఘాయుష్షుకు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. వృక్షం వేర్లు బ్రహ్మను, తొర్ర విష్ణువును, కొమ్మలు శివుడిని సూచిస్తాయని పురాణ విశ్వాసం. అందువల్ల వట వృక్షాన్ని ప్రదక్షిణలు చేస్తూ పూజించడం ద్వారా త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

ఈ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే స్నానం చేసి పసుపు, కుంకుమ, పూలతో పూజకు సిద్ధమవుతారు. కొత్త బట్టలు ధరించి, చేతులకు గాజులు, మంగళసూత్రంతో సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. అనంతరం వట వృక్షం వద్దకు వెళ్లి దీపారాధన చేసి, చెట్టు చుట్టూ పవిత్ర దారాన్ని చుట్టుతూ ప్రదక్షిణలు చేస్తారు. సావిత్రి – సత్యవాన్ కథను శ్రద్ధగా వింటారు లేదా చదువుతారు.

వట సావిత్రి వ్రతంలో ఉపవాసానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కొందరు మహిళలు రోజు మొత్తం నిరాహారంగా ఉంటే, మరికొందరు ఫలాహారం మాత్రమే తీసుకుంటారు. ఉపవాసంతో పాటు భక్తి, నియమ నిష్ఠలతో పూజలు చేస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం.

ప్రస్తుతం కూడా ఉత్తర భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక మహిళలు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలోనూ సంప్రదాయాలను కొనసాగిస్తూ కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఆచారంగా వట సావిత్రి వ్రతం నిలుస్తోంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, భార్యాభర్తల అనుబంధం, నమ్మకం, కుటుంబ విలువలకు ప్రతీకగా భావించబడుతోంది.

పెద్ది ట్రైలర్ లో స్టోరీ మొత్తం చెప్పేస్తాడుగా... ఇది శివరాజ్ కుమార్ కథ నా?

Peddi trailer story reveal
Peddi trailer story reveal

Peddi trailer story reveal: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తం చెప్పేశారు… విజయనగరం పక్కన ఉండే ఒక చిన్న గ్రామంలో ‘పెద్దిరాజు’ అనే ఒక కూలీ పని చేసుకునే యువకుడు ఉంటాడు. అతను క్రికెట్ లోనూ కుస్తీ పోటీల్లోనూ రన్నింగ్ రేస్ లోనూ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు. అందుకే ఆ ఊరు మొత్తం అతన్ని ఇష్టపడుతూ ఉంటారు.

ఇక ఈ క్రమంలోనే ఆ ఊరికి ఒక పెద్ద కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తొలగించడానికి పెద్ది తనకు తెలిసిన క్రికెట్, కుస్తీ, రన్నింగ్ రేస్ లను ఎలా వాడుకున్నాడు…దాని కోసం పెద్ది ఏం కోల్పోయాడు. అలాగే ఆ గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడు తన ప్రాంతాన్ని ఇతర వ్యక్తులకు ఎలా అడ్డుకున్నాడు. అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.

అయితే పోటీలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ మనిషి బతకడానికి నేల కావాలి అనే ఒక క్యారెక్టర్ లో శివరాజ్ కుమార్ కనిపించాడు. ఇక అతని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికే పెద్ది కృషి చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శివరాజ్ కుమార్ నుంచి మొదలైన కథ ఫైనల్ గా పెద్దితో ముగుస్తుంది… మొత్తానికైతే ఈ సినిమా కథ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు శర్మ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఎప్పటికప్పుడు రామ్ చరణ్ ని అడ్డుకునే క్యారెక్టర్ కూడా ఇదే కావడం విశేషం…ఇక ట్రైలర్ లో అన్ని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఏది పెర్ఫెక్ట్ గా డెలివరీ కానట్టుగానే అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ మాత్రం క్రికెటర్ గా, కుస్తీ ఫైటర్ గా, రన్నింగ్ రేసర్ గా అదిరగొట్టినట్టుగా అనిపిస్తుంది…

'పెద్ది' ట్రైలర్ రివ్యూ : రకరకాలుగా ఉంది మాస్టారు.. కానీ చివరి 30 సెకండ్స్ మాత్రం అదుర్స్..

Peddi Trailer Review
Peddi Trailer Review

Peddi Trailer Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ముంబై లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో ఈ ట్రైలర్ లాంచ్ జరిగింది. అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఈ ట్రైలర్ పై విధులకు ముందు నుండే అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. ట్రేడ్ కూడా ఈ ట్రైలర్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది . ఎందుకంటే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు కాబట్టి. అయితే అంతటి అంచనాల నడుమ విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం.

ఈ ట్రైలర్ లో బుచ్చి బాబు రామ్ చరణ్ విశ్వరూపాన్ని చూపించేసాడు. ఆయన ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతోంది. క్రికెట్ , కుస్తీ , రన్నింగ్ రేస్ , ఇలా అన్ని క్రీడల్లోనూ హీరో ప్రావిణ్యం ఉన్నవాడిని, సినిమాలో అతని జర్నీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లోని చివరి 30 సెకండ్లు వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాకు సంబంధించిన సోల్ మొత్తం ఆ 30 సెకండ్స్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది . నటుడిగా రామ్ చరణ్ మరోసారి తన విశ్వరూపం చూపించేశాడని చెప్పొచ్చు. సినిమాలో ట్రైలర్ లో చూపించిన చివరి సెకండ్స్ లోని ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కూర్చుంటే , మరో రంగస్థలం రిపీట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ట్రైలర్ లో మిస్ అయ్యింది ఏమైనా ఉందా అంటే , అది హై మూమెంట్స్. ఒక కమర్షియల్ స్టార్ హీరో నుండి అభిమానులు కోరుకునేది భారీ ఎలివేషన్స్ , అవి ఈ ట్రైలర్ లో కనిపించకపోవడమే పెద్ద మైనస్ అయ్యింది. అదే విధంగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా బాగా చిరాకు కలిగించేలా అనిపించింది. ఇక AR రెహమాన్ పాటల్లో చూపించిన దమ్ము , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో చూపించలేదని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ థియేట్రికల్ ట్రైలర్ యావరేజ్ రేంజ్ లో ఉంది. ఇది ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఎంత మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ఇకపోతే ఈ ట్రైలర్ లో శివరాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కచ్చితంగా ఆయన క్యారక్టర్ బాగా పేలినట్టు ఉంది. ఇక ఈ థియేట్రికల్ ట్రైలర్ ని మీరు కూడా వీక్షించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.