Home Blog Page 256

నాగార్జున చేయాల్సిన ఆ సూపర్ హిట్ మూవీ బాలకృష్ణ దగ్గరికి ఎలా వెళ్ళింది..

Nagarjuna missed super hit movie
Nagarjuna missed super hit movie

Nagarjuna missed super hit movie: సినిమా ఇండస్ట్రీ ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగార్జున డిఫరెంట్ సినిమాలను ట్రై చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఆయన కమర్షియల్ సినిమాలతో పాటు రొమాంటిక్ సినిమాల వైపు పెద్ద పీట వేస్తూ వచ్చాడు. అలాగే ప్రేమ కథ చిత్రాలను సైతం చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక పౌరాణికానికి సంబంధించిన సినిమాలను సైతం ఆడపదడప చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందాడు. ఇక నాగార్జున చేయాల్సిన ఒక సినిమాని నందమూరి బాలకృష్ణ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయంలో చాలా మందికి తెలియదు… కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన ‘బొబ్బిలి సింహం’ సినిమా కథ మొదట నాగార్జున దగ్గరికి వెళ్లిందట.

ఆ కథ ను విన్న నాగార్జున అంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో తను చేస్తే వర్కౌట్ అవుతుందో లేదో అనే ఉద్దేశ్యంతో ఆ కథనైతే రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత బాలయ్య బాబు ఆ కథను ఎంచుకొని సూపర్ సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన ది బెస్ట్ సినిమాల్లో ‘బొబ్బిలి సింహం’ మూవీ కూడా ఒకటిగా నిలిచిందనే చెప్పాలి.

సీనియర్ హీరో అయిన బాలకృష్ణ ఇప్పటికి ఏమాత్రం తగ్గడం లేదు. బొబ్బిలి సింహం సినిమా ను మిస్ చేసుకున్నందుకు నాగార్జున చాలావరకు బాధపడ్డాడట. నిజానికి నాగార్జున ఈ సినిమా చేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చేదో తెలియదు. బాలయ్య చేశారు కాబట్టే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది…

ఇక ప్రస్తుతం బాలయ్య బాబు, నాగార్జునకి మధ్య మాటలైతే లేవు. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఇద్దరు మధ్య మాటలు లేవు. కాబట్టి ఇద్దరు కలిసి నటించడం అనేది అసాధ్యమనే చెప్పాలి…

ప్రపంచ దేశాలు వణికి పోయాయి.. మోదీ ఒక్కడే ధైర్యంగా వెళ్ళగలిగాడు.. ప్రతీ భారతీయుడి రోమాలు నిక్కబొడిచే స్టోరీ...

Inspiring story of Narendra Modi
Inspiring story of Narendra Modi

Inspiring story of Narendra Modi: ఒక్క విమానం లేదు. వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. వెళ్లడానికి ధైర్యం సరిపోవడం లేదు. దీనికి తోడు యుద్ధమేఘాలు.. మిసైల్స్ ఎటువైపు వస్తాయో తెలియదు. ఒక రకంగా ఆకాశం నిర్మాణంగా ఉన్నప్పటికీ భయానకమైన వాతావరణం. ప్రపంచ దేశాలు మొత్తం జ్వరం వచ్చిన పేషంట్ లాగా వణికి పోతున్నాయి. ఇరాన్ గగనతల మీద కనీసం విమానం కాదు కదా.. పక్షులు ఎగిరెందుకు కూడా సాహసించడం లేదు. రకంగా అత్యంత ప్రమాదకరమైన జోన్ అది. దీనికి తోడు అంతర్జాతీయ విమానయాన సంస్థల మొత్తం తమ రూట్లను వేరే వైపు మళ్లించుకున్నాయి. గ్లోబల్ ఫ్లైట్స్ మొత్తం ఇరాన్ ఆకాశాన్ని వదిలేశాయి. సేఫ్ షెల్టర్ల వైపు వెళ్లిపోయాయి.

రాడార్లు మొత్తం ఇరాన్ బోర్డర్ ను ఖాళీగా చూపిస్తున్నాయి. కనీసం అటు వైపు పక్షులు కూడా కనిపించడం లేదు. నిర్మలమైన ఆకాశం.. అంతకు మించిన భయంకరమైన శబ్దం.. అటువంటి చోట ఒక విమానం మెరుపు వేగంతో వచ్చేసింది. అడవిలో సింహం మాదిరిగా గంభీరంగా ప్రయాణాన్ని ప్రారంభించింది. దానికి భయం అనేది తెలియదు. భయానికి భయం పుట్టించే స్థాయి దానిది. శత్రువుల గుండెలలో మిసైల్స్ వేసినట్టుగా పరుగులు పెట్టింది. ఆ విమానం మీద మూడు రంగుల జెండా సగర్వంగా ఎగిరింది. దానిమీద ఎయిర్ ఇండియా వన్ అనే పేరు మెరిసిపోతోంది. అందులో ఉన్నది మరెవరో కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ.

యుద్ధం జరుగుతున్న వేళ.. మిస్సైల్స్ దూసుకు వస్తున్న వేళ.. అభిమానంలో నరేంద్ర మోడీ ప్రయాణించారు. ప్రపంచ దేశాలు అధినేతలు విమానాలు ఎక్కడానికే భయపడుతున్నారు. ఆయన మాత్రం అందులో ప్రశాంతంగా కూర్చున్నారు. సంబంధించిన ఫైల్స్ మొత్తం పరిశీలిస్తున్నారు. ప్రపంచం మొత్తం లైవ్ మ్యాప్ లో.. రాడార్ స్క్రీన్ చూస్తూ ఆశ్చర్యపోయింది. అంతటి శూన్యంలో.. యుద్ధ మేఘాలు అలముకున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలా వెళ్ళిపోవడం ప్రపంచ దేశాలు అధినేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు అంతటి ధైర్యం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న వారి నుంచి వ్యక్తం అయింది. వాస్తవానికి ఇది ఒకప్పటి భారతదేశం అయి ఉంటే.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రధానమంత్రి ఇలాంటి ధైర్యం చేసేవారు కాదు. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. ఆయనను టచ్ చేయాలంటే చాలా ఉండాలి. ఆయన అభిమానాన్ని అడ్డుకోవాలంటే అంతకుమించి ఉండాలి. ఇప్పటి కాలంలో అవి ఎవరికీ లేవు. అందువల్లే ఆయన విమానం దూసుకుపోయింది. ఒకవేళ ఆ విమానానికి ఎవరైనా అడ్డువస్తే ఉగ్ర నరసింహ అవతారం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ స్థాయి.. ఆయన నాయకత్వ పటిమ.. ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.

మోడీ.. నాట్ ఏ లీడర్
మోడీ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్
హి ఇస్ ఏ పవర్ ఫుల్ లీడర్
ఎంటైర్ లీడర్ ఆఫ్ ది వరల్డ్
ఏబోవ్ ది స్కైస్.

అమెరికా గ్రీన్ సిగ్నల్.. భారత్ కు మళ్లీ రష్యా ఆయిల్!

India Russia oil imports latest news
India Russia oil imports latest news

India Russia oil imports latest news: అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమడి సంక్షోభం నెలకొంది. ఇరాన్ హర్మూజ్ జల సందిని మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు సరఫరా అయ్యే తమరు నూకలు హర్మూజ్ వద్ద నిలిచిపోయాయి. ఇదే సమయంలో అమెరికా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి పై ఆంక్షలు విధించింది. దీంతో ఇబ్బందికర పరిస్థితిలో ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం పెరుగుతుండడంతో రష్యా ఆయిల్ దిగుమతికి అమెరికా గతంలో రెండుసార్లు అనుమతి ఇచ్చింది. భారత్ దిగుమతి గడువు రెండు రోజుల క్రితం ముగిసింది.

గడు మరో మారు పెంపు..
చమురు స్థిరత్వం కోసం అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యూహాలను మళ్లీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. జూన్ 17 వరకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రకటన, భారత్ వంటి దేశాలకు మరింత వ్యూహాత్మక స్వేచ్ఛను అందించేలా కనిపిస్తోంది.

ఆంక్షల మినహాయింపు వెనుక..
గతంలో విధించిన ఆంక్షల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వడం ద్వారా అమెరికా, ఇంధన సరఫరా గొలుసులో అస్థిరతను తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలను కొంతవరకు నియంత్రణలో ఉంచడానికి ఉద్దేశించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ పరిస్థితులు, భూ-రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇలాంటి తాత్కాలిక విధానాలు సాధారణమవుతున్నాయి. అయితే ఈ మినహాయింపు కేవలం ఆర్థిక అవసరాల నుంచి పుట్టినదేనా లేదా రాజకీయ సంకేతాలు కూడా ఉన్నాయా అనేది చర్చనీయాంశం. ఏదేమైనా, ఇది రష్యా ఆయిల్‌పై ఆధారపడిన దేశాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పిస్తోంది.

భారత్‌కు గుడ్ న్యూస్వా..
భారత్ ఇప్పటికే రష్యా నుంచి గణనీయమైన మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు చేస్తోంది. అమెరికా ఈ తాత్కాలిక అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దిగుమతులను మరింత పెంచే సాధ్యత ఉంది. ఇది దేశంలోని ఇంధన ఖర్చులను తగ్గించడంతోపాటు, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడవచ్చు.అయినప్పటికీ, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న స్పష్టం చేసినట్లు, ఈ కొనుగోళ్లు అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా స్వతంత్ర నిర్ణయంగా కొనసాగుతున్నాయి. ఇది భారత్ విదేశి విధానంలో స్వాతంత్ర్యం, బహుముఖ సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఏ దేశం ఒత్తిడికి లొంగకుండా తన శక్తి అవసరాలను తీర్చుకోవడం ఆర్థిక దృఢతకు నిదర్శనం.

ఈ నిర్ణయం తాత్కాలికమైనప్పటికీ, ఇంధన మార్కెట్‌లో రష్యా పాత్రను మళ్లీ బలోపేతం చేసే అవకాశం ఉంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి సదవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య నిబంధనలు, పర్యావరణ లక్ష్యాలు, పునరుత్పాదక ఇంధనాల మార్పిడి వంటి అంశాలను కూడా సమతుల్యం చేసుకోవడం కీలకం.

సిక్కోలు కాంతారా 'కాళీమాత'.. చూస్తే గగుర్పాటు!

Srikakulam Kantara Kali Mata temple
Srikakulam Kantara Kali Mata temple

Srikakulam Kantara Kali Mata temple: ఏ ప్రాంతంలోనైనా గ్రామ దేవతలు ప్రత్యేకం. అష్టదిక్పాలకులుగా.. గ్రామాన్ని సుభిక్షంగా, శుభప్రదంగా ఉంచేది గ్రామ దేవతలు. అందుకే గ్రామ దేవతలను నిత్యం పూజలు చేస్తుంటారు ప్రజలు. చల్లదనంతో గ్రామ దేవత కరుణాకటాక్షాలు ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. గ్రామ దేవత వేడుకలు జరుపుతుంటారు. అయితే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మాత్రం ఈ గ్రామ దేవత పండుగలు ప్రత్యేకం. ముఖ్యంగా అక్కడ కాళీమాత నృత్యం ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారి పండుగ జరుగుతుంది అంటే కచ్చితంగా కాళికామాత డాన్స్ ఉండాల్సిందే.. అంతలా పెనవేసుకుపోయింది ఆ నృత్యం. కాంతారా సినిమా మాదిరిగా.. ప్రత్యేక వేషధారణలో కాళికామాత ఉద్దానం పండుగలు కీలక పాత్ర పోషిస్తుంది అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.

జానపద కళారూపం..
కాళికమ్మ నృత్యం అనేది భక్తి, ఉగ్రరూపం ప్రదర్శించే ఒక అద్భుతమైన జానపద కళారూపం. అమ్మవారి పండుగలతో పాటు ఉత్సవాల్లో కాళికామాత నృత్యం ఉండాల్సిందే. చివరకు ఇంటి పండుగలో సైతం ఈ నృత్య కళారూపం లేనిదే సందడి ఉండదు. కలకత్తా కాళీ మాత మాదిరిగా ప్రత్యేక వేషధారణతో అమ్మవారి నృత్యం చేస్తున్నట్టు మాదిరిగా కళాకారులు తమ అభినయాన్ని చాటుతుంటారు. కళ్లకు కాటుక, తలపై కిరీటం, మెడలో కపాల హారాలతో ఉగ్రరూపంతో నర్తిస్తుంటారు కళాకారులు.

అచ్చం కాంతరాగా..
ఉద్దానంలో కాళీమాత వేషధారణలు చూస్తే.. కాంతారా సినిమా మాదిరిగా ఉంటుంది ఉగ్రరూపం. అయితే ఈ వేషధారణతో కనిపించే కళాకారులు ప్రత్యేక నిష్ఠలు అవసరం. బయటకు చూపించే రక్తపు నాలికతో అచ్చం అమ్మవారిని తలపిస్తారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డాన్సులు చేస్తుంటారు. ఈ ప్రాంత ప్రజల నమ్మకాలు, దైవ రహస్యాలను చాటిచెబుతాయి కాళికామాత నృత్యాలు. చెడును అణచి.. మంచిని కాపాడే శక్తిగా చూపిస్తారు. ప్రస్తుతం ఉద్దానం వ్యాప్తంగా అమ్మవారి పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో కాళికామాత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

తెలంగాణ అధికారి.. 100 కోట్ల అవినీతి.. ఇది రికార్డులకే రికార్డు..

Telangana officer Kumar corruption case
Telangana officer Kumar corruption case

Telangana officer Kumar corruption case: కళ్ళు చెదిరే నగదు.. అంతకు మించిన స్థాయిలో బంగారం.. వెండి అయితే కిలోల్లో.. ప్లాట్లు లెక్కకు మిక్కిలి.. ఖరీదైన గడియారాలు అంతకుమించి.. కరెన్సీ ని లెక్కించి యంత్రాలు పనిచేయకుండా ఆగిపోయాయి. బంగారాన్ని తూకం వేస్తుంటే అధికారుల బుర్రలు బద్దలైపోయాయి. అక్రమ ఆస్తుల వివరాలను లెక్కిస్తుంటే సిబ్బందికి ఊపిరి ఆగినంత పని అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వందల కోట్ల ఆస్తులను వెనకేశాడు. అవన్నీ కూడా అక్రమంగా సంపాదించాడు. చివరికి ఏసీబీ అధికారుల తనిఖీలో దొరికిపోయాడు.

తెలంగాణ ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ లో మెరుపు దాడులు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ తనిఖీలు మొదలయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసం ఉంటున్న మల్లాపూర్ లోని వెంకటరమణ కాలనీలో తనిఖీలు మొదలు పెట్టిన అధికారులు 1.05 లిక్విడ్ క్యాష్ సీజ్ చేశారు. ఒక దశలో కరెన్సీ కట్టలను లెక్కించే క్రమంలో యంత్రాలు మోరాయించినట్లు తెలుస్తోంది. కేజీ బంగారు ఆభరణాలు.. ఇతర ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుమార్ పేరు మీద నిజామాబాద్ ప్రాంతంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆస్తులను అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో 9 విలాసవంతమైన ప్లాట్లు ఉన్నాయి. బంగారం, భూములు, ఇతర ఆస్తులను లెక్కిస్తే.. వాటి విలువ 100 కోట్లుగా తేలింది. కుమార్ నివాసంతో పాటు.. పలుచోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కుమార్ మీద అధికారులకు చాలా ఫిర్యాదులు అందాయి. కొద్దిరోజులుగా కుమార్ మీద ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలను రూడీ చేసుకున్నారు. అనేక ఆధారాలు సేకరించిన తర్వాత మంగళవారం మెరుపు దాడులు మొదలుపెట్టారు. ఉదయం నుంచి ఇప్పటివరకు అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు.. మెట్రో వాటర్ సప్లై బోర్డులో కుమార్ కొంతకాలంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్మును తన జేబులో వేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే కాదు.. పై స్థాయి అధికారులకు కూడా తలనొప్పిగా మారిపోయారు. దీంతో ఇన్ని రోజులకు కుమార్ అవినీతి బాగోతం బయటపడింది.

మహాశివుడి కపాల దండ వెనుక స్టోరీ ఇదే..

Shiva Kapala Story
Shiva Kapala Story

Shiva Kapala Story: హిందూ పురాణాల ప్రకారం.. పరమశివుడు అనేక విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. అందులో అత్యంత భయానకమైన, రహస్యమయమైన రూపాల్లో ఒకటి “కపాల మాలధారి” రూపం. శివుడి మెడలో కనిపించే కపాల దండ లేదా పుర్రెల హారం వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం భయానక అలంకారం మాత్రమే కాదు.. జీవితం, మరణం, అహంకారం గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రతీకగా భావిస్తారు. అ సందేశం ఏంటంటే?

పురాణాల ప్రకారం ..ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు తనకు ఐదు తలలు ఉండటంతో అహంకారానికి లోనయ్యాడని చెబుతారు. ఆ గర్వాన్ని తగ్గించేందుకు శివుడు కాలభైరవ రూపం ధరించి బ్రహ్మ ఐదో తలను ఖండించాడని కథ ఉంది. అయితే బ్రహ్మహత్య పాపం కారణంగా ఆ కపాలం శివుడి చేతికి అంటుకుపోయింది. అప్పటి నుంచి శివుడు భిక్షాటన చేస్తూ తిరిగాడని, చివరికి కాశీలో ఆ పాప విమోచనం పొందాడని పురాణాలు వివరిస్తాయి. ఈ సంఘటన తర్వాత శివుడి కపాల రూపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని చెబుతారు.

శివుడి కపాల దండకు మరో ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. ఈ పుర్రెలు మనుషుల జనన–మరణ చక్రాన్ని సూచిస్తాయని తత్వవేత్తలు చెబుతారు. ఎంత శక్తివంతుడైనా, ధనవంతుడైనా చివరికి శరీరం మట్టిలో కలిసిపోతుందనే సత్యాన్ని శివుడు తన అలంకారంతో గుర్తుచేస్తాడని భావిస్తారు. అంటే అహంకారం, లోభం, మోహం అన్నీ తాత్కాలికమే అని ఈ రూపం బోధిస్తుంది.

కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం శివుడి మెడలోని కపాలాలు గత యుగాల్లో జన్మించిన జీవుల ప్రతీకలు. కాలానికి అధిపతి అయిన మహాకాలేశ్వరుడు సృష్టి, స్థితి, లయలను నియంత్రిస్తాడనే భావనను ఈ రూపం తెలియజేస్తుంది. అందుకే శివుడిని స్మశానవాసి , భూతనాథుడు , కాలభైరవుడు వంటి పేర్లతో కూడా పిలుస్తారు.

దేవతలకే భయం కలిగించే శివుడి ఈ ఉగ్రరూపం వెనుక భక్తులకు రక్షణ భావన దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. చెడును నాశనం చేసి ధర్మాన్ని కాపాడేందుకు శివుడు భయంకర రూపం ధరించాడని విశ్వాసం. అందుకే ఆయన ఉగ్రంగా కనిపించినా భక్తుల పట్ల మాత్రం కరుణామూర్తిగా ఉంటాడని శైవాగమాలు పేర్కొంటాయి.

శివుడి కపాల దండ మనిషికి ఒక గొప్ప జీవన సత్యాన్ని నేర్పుతుంది. శరీరం నశించేదే అయినా ఆత్మ శాశ్వతమనే భావనను గుర్తుచేస్తుంది. జీవితం తాత్కాలికమని తెలుసుకుని ధర్మబద్ధంగా జీవించాలని, అహంకారాన్ని విడిచిపెట్టాలని శివతత్వం సందేశం ఇస్తుంది. అందుకే శివుడి ఈ భయానక రూపాన్ని భక్తులు భయంతో కాకుండా భక్తి, ఆధ్యాత్మికతతో ఆరాధిస్తారు.

రోజు ఆలస్యంగా నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు తప్పవు

Late Night Sleeping
Late Night Sleeping

Late Night Sleeping: ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేసేవారితో పాటు యువత.. మొబైల్ ఫోన్లు, OTTలు, సోషల్ మీడియా కారణంగా అర్థరాత్రి తర్వాతే నిద్రపోతున్నారు. మళ్లీ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో నిద్రగడియారం దెబ్బతింటోంది. అయితే ప్రతిరోజూ రాత్రి 11 తర్వాత నిద్రపోవడం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ (సర్కేడియన్ రిథమ్‌) దెబ్బతినడంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో చూద్దాం..

రోగనిరోధక శక్తి తగ్గిడం:
రాత్రి వేళల్లో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఈ సమయంలో కణాలను పునరుద్ధరిస్తుంది. కానీ ఆలస్యంగా నిద్రపోతే ఈ ప్రక్రియ సరిగా జరగదు. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

గుండెకు ముప్పు:
రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం వల్ల రక్తపోటు పెరగడం, గుండెపై ఒత్తిడి అధికమవడం జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇదే అలవాటు కొనసాగితే హైబీపీ, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

మధుమేహం, బరువు పెరుగుదల:
ఆలస్యంగా నిద్రపోయేవారిలో జీవక్రియ (మెటబాలిజం) మందగిస్తుంది. దీంతో శరీరం చక్కెరను సరిగ్గా వినియోగించుకోలేక మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే రాత్రిళ్లు ఆకలి ఎక్కువై జంక్ ఫుడ్ తినే అలవాటు పెరగడం వల్ల ఊబకాయం సమస్య కూడా ఎదురవుతుంది.

మెదడు పనితీరుపై ప్రభావం:
నిద్ర సరిపోకపోతే ఏకాగ్రత తగ్గిపోతుంది. చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, పని మీద దృష్టి పెట్టలేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు, ఉద్యోగుల్లో పనితీరు తగ్గడానికి ప్రధాన కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యానికి ముప్పు:
రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండేవారిలో ఒత్తిడి, ఆందోళన, చిరాకు ఎక్కువగా కనిపిస్తాయి. కొందరిలో డిప్రెషన్ లక్షణాలు కూడా పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి తీసుకుని భావోద్వేగాలను నియంత్రిస్తుంది. కానీ నిద్రలేమి వల్ల ఈ ప్రక్రియ దెబ్బతింటుంది.

ఎంతసేపు నిద్ర అవసరం?:
పెద్దవారు రోజుకు కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పని కారణంగా ఆలస్యంగా నిద్రపోవాల్సి వచ్చినా, మధ్యలో అంతరాయం లేకుండా పూర్తి నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

మంచి నిద్ర కోసం చిట్కాలు ఇవే..:
నిద్రకు గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించాలి. రాత్రి సమయంలో టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలు తగ్గించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. గది ప్రశాంతంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే నిద్ర నాణ్యత మెరుగవుతుంది

చివరి మ్యాచ్ ఆడకుండానే ఐపిఎల్ కు ధోనీ గుడ్ బై

MS Dhoni
MS Dhoni

MS Dhoni IPL Retirement: ఎల్లో జెర్సీ, ధోని.. ఈ రెండింటిని వేరుగా చూడలేం. ఎందుకంటే చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో ధోనిది సింహం లాంటి పాత్ర. ఒత్తిడి.. ఓటములు.. విమర్శలు.. ప్రతికూలతలు.. ప్రతి బంధకాలు.. ఇలా ఎన్ని ఉన్నా సరే ధోని వాటన్నిటిని అధిగమించాడు. తనతో పాటు మిగతా ప్లేయర్లు కూడా అధిగమించేలా చేశాడు. అందుకే చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలపగలిగాడు.

ఎల్లో జెండాను అనేక సందర్భాలలో రెపరెపలాడించిన ధోనిని ఎల్లో ఆర్మీ తలా అని పిలుచుకుంటూ ఉంటుంది. చివరికి మహేంద్ర సింగ్ ధోని కాస్త తలా ధోని అయిపోయాడు. అందువల్లే ధోని లేని ఎల్లో ఆర్మీని చూడడం కష్టమైపోయింది. అందువల్లే చెన్నై మేనేజ్మెంట్ ధోనిని పక్కన పెట్టడం లేదు. అతడి కోసం ఎన్నో చేస్తోంది. జట్టు కోసం కూడా ఎన్నో చేయాలని ధోనికి ఉంది. కాకపోతే ఆరోగ్యం సహకరించడం లేదు.

ఈ సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చిదంబర స్టేడియంలో చెన్నై జట్టు ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు తరఫున ధోని రంగంలోకి దిగుతాడని అందరు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. పైగా ధోని సతీమణి సాక్షి, కుమార్తె జీవా ఎల్లో అవుట్ ఫిట్ ఆకట్టుకున్నారు. దీంతో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ ధోనికి చివరిదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చివరి మ్యాచ్ ఆడకుండానే ధోని ఐపిఎల్ కు వీడ్కోలు పలికాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత చెన్నై ఆటగాళ్లు మైదానంలో సందడి చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చెన్నై జట్టు ఆటగాళ్లలో ధోని కూడా ఉన్నాడు. జట్టు ప్లేయర్లతో కలిసి ధోని ఫోటో కూడా దిగాడు. ఆ తర్వాత గ్రౌండ్ స్టాప్ తో ఫోటోలు దిగాడు. అభిమానులు అడిగితే సెల్ఫీలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఇవన్నీ జరిగాయి కాబట్టి ధోని వచ్చే ఐపిఎల్ సీజన్ లో కనిపించడని చర్చ నడుస్తోంది. మరోవైపు ధోని రిటర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఏదో ఒక రూపంలో చెన్నై జట్టుతో అతడు కొనసాగుతూనే ఉంటాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

గ్రామాల్లో, చిన్న పట్టణాల వారికి సరైన ఫోన్ ఇదే.. ధర ఎంతంటే..

Lava Shark 2 5G
Lava Shark 2 5G

Lava Shark 2 5G: మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆకట్టుకునే మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తుంటాయి. అలాంటి కంపెనీల్లో LAVA ఒకటి. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా ‘లావా షార్క్ 2 5G’ (Lava Shark 2 5G)అనే మొబల్ త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో విడుదలైన లావా షార్క్ 5G కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా ఉండనుంది. అంతేకాకుండా ఈ కొత్త మొబైల్ లో ప్రత్యేకంగా కెమెరా, డిజైన్, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండడంతో గ్రామీణ యూజర్లను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉంటుందంటే?

Lava Shark 2 5G భారత మార్కెట్‌లో మే నెలలోనే లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా సూచించింది. ఈ కొత్త ఫోన్ ను చూస్తే ఐఫోన్ లా కనిపించే విధంగా మోడర్న్ డిజైన్ చేశారు. దీని కెమెరాను చూస్తే ప్రీమీయం ఫోన్ అని అంటారు. ఇందులో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుందని లీక్ అయిన సమాచారం భట్టి తెలుస్తోంది. అలాగే ఇది90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా Unisoc చిప్‌సెట్‌, T765 ఆక్టా‑కోర్ 5G ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫోన్లో డేటా స్పీడ్ తో పాటు మల్టీటాస్కింగ్ కోసం సరిపోతుంది.

బేస్ వేరియంట్‌లో 4GB RAM, 64GB స్టోరేజీ ఉండనుంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. ఈ కొత్త షార్క్ 2 5Gలో 50MP AI అవెంస్‌డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఈ కెమెరాతో డే లైట్ పిక్చర్స్, ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్‌ బెటర్ అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఫ్రంట్ కెమెరా కోసం 5MP లేదా 8MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా.. రోజంతా వినియోగించినా సపోర్టు చేయనుంది. ఈ బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5G, 4G VoLTE, Wi‑Fi, బ్లూటూత్ 5.0, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు సౌకర్యాన్ని అందిస్తాయి.

షార్క్ 5G లాగానే ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత స్కిన్ తో పనిచేసే అవకాశం ఉంది. ఇది డేట్ సేఫ్ చేసిన సెక్యూరిటీ అప్‌డేట్లు మరియు స్మూత్ UI ఇస్తుంది. బడ్జెట్ ప్రైస్‌లో 5G కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్. ఇందుకంటే దీనిని రూ.8,000 రేంజ్‌లోనే విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణాల్లో ఉండేవారికి ఈ మొబైల్ బాగా ఉపయోగపడనుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ పై కూడా ఆఫర్ల ఉండే అవకాశం ఉంది. అయితే విడుదలయ్యే నాటికి వాటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో డేం*జర్ వెదర్.. వీరు ఇంట్లోనే ఉండడం మంచిది..

IMD Weather Alert
IMD Weather Alert

IMD Weather Alert: అధిక ఉష్ణోగ్రతలతపై భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మే 19 నుంచి ఎండ వేడి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ , సూర్యాపేట, భద్రాద్రి- భూపాలపల్లి, ములుగు, మహబూబూబాద్ జిల్లాలో 45 నుంచి 47 సెల్సియస్ డిగ్రీ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. అధికారిక ప్రకటనల ప్రకారం..తాగజా తెలంగాణలో మే 18న జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 20, 21వ తేదీల్లో కూడా మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. మంగళవారం (మే 19)న ఏపీలోని పలు జిల్లాలలో 44 నుంచి 46 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని APSDMA అంచనా వేసింది.

ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా మారడంతో ఉదయం 11:00 నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య అత్యవసరంకాకపోతే ఇంటి నుండి బయటకు రావొద్దని IMD, APSDMA అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో సౌర వికిరణం, వాతావరణ ఉష్ణోగ్రత కలిసి హీట్‌స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని పేర్కొంటున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బయటకు వెళ్లేవారు లేదా బయట నుంచి ఇంటికి వచ్చిన వారు తరచుగా నీళ్లు తాగాలి. తేలికపాటి దుస్తులను ధరించాలి. తలకు రుమాలు లేదా టోపీ వాడాలి. ముఖ్యమైన పనులు అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ ను చేస్తే చూడాలనుకుంటున్నారా..?కష్టమే..?

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. 2014వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2024వ సంవత్సరంలో ఆయన ఏపీ రాష్ట్రంలో గవర్నమెంట్ ను ఫామ్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తున్నాడు. ఇక గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ సంవత్సరం చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో కాస్త నిరాశపరచాడు. ఇక ఏది ఏమైనా కూడా తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటానని గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఈ క్రమంలోనే అతని నుంచి ఎలాంటి సినిమాలు వచ్చిన కూడా అతన్ని ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటి అంటే పొలిటీషియన్ పాత్ర కావడం విశేషం…తను సినిమాలో సీఎం పాత్ర చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో ఆయన చేసే మంచి ఎలా ఉంటుందో చూపిస్తే నిజ జీవితంలో కూడా ఆయన అలాంటి పనులు చేయడానికి కట్టుబడి ఉంటారు.

అలాగే సగటు ప్రేక్షకులకు సైతం పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలాంటి పనులు చేయబోతున్నాడో ఆ సినిమా ద్వారా చూపిస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. అయితే తన స్వప్రయోజనాల కోసం సినిమాని తీసి ప్రేక్షకుల మీద రుద్దడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటివరకు తనకు వచ్చిన చాలా పొలిటిషన్ క్యారెక్టర్ లను తిరస్కరించాడు…

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అను నేను’ సినిమా కథని కూడా మొదట పవన్ కళ్యాణ్ కి వినిపించారు. కానీ అందులో హీరో సీఎం గా ఉండడం తనకి ఇష్టం లేకపోవడం వల్లే ఆ సినిమాను రిజెక్ట్ చేశారని తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి…

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమా అప్డేట్ రేపు రానుందా...ఆ గెటప్ లో తారక్ పోస్టర్ వస్తుందా..?

Trivikram NTR Movie Update
Trivikram NTR Movie Update

Trivikram NTR Movie Update: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు మాత్రమే చాలా మంచి గుర్తింపైతే లభించింది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. మొదట రైటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి..ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ఒక పౌరాణిక సినిమాని సైతం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కుమారస్వామి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో పాటు భారీ ఎలివేషన్స్ సైతం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇక రేపు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించలేకపోతున్నాడు. గతంలో వరుసగా ఏడు విజయాలను సాధించిన ఆయన ‘వార్ 2’ సినిమాతో భారీగా డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే తను సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో సైతం పెను సంచలనాన్ని సృష్టిస్తాననే క్లారిటి ఎన్టీఆర్ ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ తన స్టామినా ఏంటో చూపిస్తేనే ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే స్థాయికి వెళ్తాడు.

లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోతారనే చెప్పాలి. రేపు ఉదయం 11 గంటల10 నిమిషాలకు త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాలోని ఎన్టీఆర్ కుమార స్వామి గెటప్ లో ఉన్న ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారట…

భారత్‌పై అణు దాడికి పాక్ ప్లాన్.. చైనా షాకింగ్ రియాక్షన్!

India Pakistan Nuclear Tension
India Pakistan Nuclear Tension

India Pakistan Nuclear Tension: భారత్‌తో సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మన చుట్టూ ఉన్న దేశాలు మనపై కుట్రలు చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్, చైనా భారత్‌కు నిరంతర సవాలుగా మారాయి. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్ చైనా నుంచి సేకరించిన అధునాతన క్షిపణులు, డ్రోన్లను వాడింది .

చైనా ఆయుధ సహకారం..
పాకిస్తాన్ సైనిక బలాన్ని పెంచడంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికి పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా తయారీవేనని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ సరఫరా మరింత పెరిగి, పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంటోంది.

భారత్ పై దాడికి అణు సాయం కోరిన పాక్..
తాజాగా పాకిస్తాన్ భారత్ పై దాడి చేసేందుకు మన సహాయం చేయాలని చైనాను కోరింది. అయితే ఎందుకు చైనా నిరాకరించింది. ఒక ముఖ్యమైన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా చైనా నుంచి రహస్యంగా అణు సహాయం కోరింది. ‘డ్రాప్ సైట్’ అనే పరిశోధనా సంస్థ విడుదల చేసిన ఈ నివేదికలో పాక్ జలాంతర్గామి ఆధారిత అణు స్ట్రైక్ వ్యవస్థలు, అధునాతన అణు సామర్థ్యాల కోసం అభ్యర్థన చేసినట్లు పేర్కొన్నారు. అయితే చైనా ఈ అభ్యర్థనను స్పష్టంగా తిరస్కరించింది. ప్రపంచ అణు ఆయుధ వ్యాప్తి నిరోధక నిబంధనలను కారణంగా చూపించింది. దక్షిణాసియాలో అణు అస్థిరత పెరిగే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సముద్ర అణు సామర్థ్యం కోసం..
పాకిస్తాన్ ప్రధానంగా సముద్ర ఆధారిత “సెకండ్ స్ట్రైక్” సామర్థ్యం కోసం సహాయం కోరింది. ఇది ప్రత్యర్థి తొలి దాడి చేసిన తర్వాత కూడా అణు ప్రతిస్పందన ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. భూ, గగన తల అణు ఆస్తులు ధ్వంసమైనా, గుర్తించరాని జలాంతర్గాముల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం దీని లక్ష్యం.

భారత్ కు ఇప్పటికే సామర్థ్యం..
భారత్ ఇప్పటికే ఐ ఎన్ ఎస్ అరిహంత్ వంటి న్యూక్లియర్ సబ్‌మెరీన్లతో ఈ రంగంలో బలమైన స్థానం సాధించింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ దశాబ్దాలుగా ఇలాంటి సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

గ్వాదర్ పోర్ట్ ఒప్పందం..
ప్రతిపాదన లీక్ అయిన పత్రాల ప్రకారం, అణు, సైనిక సహాయం బదులుగా పాకిస్థాన్ గ్వాదర్ పోర్టును చైనాకు శాశ్వత సైనిక స్థావరంగా అందజేయాలని ప్రతిపాదించింది. ఇలాంటి అభివృద్ధి అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు వ్యూహాత్మక సమతుల్యతను పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సంఘటనలు దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నాయి.

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన సరిహద్దు భద్రత మరియు అణు సన్నాహాలను ఇన్నింకా బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఇది.

అనిల్ రావిపూడి కోసం వెంకటేష్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడా..?

Venkatesh And Anil Ravipudi
Venkatesh And Anil Ravipudi

Venkatesh And Anil Ravipudi: కమర్షియల్ సినిమాలతో సక్సెస్ లను సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మాత్రం చేసిన సినిమాలన్నింటితో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. ఇక ఇలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా 100% సక్సెస్ రేట్ ను కలిగి ఉన్న దర్శకుడిగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. బావ బామ్మర్దుల నేపథ్యంలో ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. అయితే ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక డిఫరెంట్ కోణంలో ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన ప్రొడ్యూసర్ అనిల్ రావిపూడి తో ఈ విషయాన్ని చర్చించారట.

అనిల్ మాత్రం వెంకటేష్ ని కొంతవరకు తన రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పారట. దాంతో వెంకటేష్ సైతం సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి తన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని తగ్గించాడు. సినిమా సక్సెస్ అయిన తర్వాత అతనికి మిగిలిన మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రొడ్యూసర్లు సైతం ఒక క్లారిటీ తో ఉన్నారట.

ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుస సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి వరుసగా తొమ్మిది విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పదోవ విజయాన్ని సైతం సాధించి వరుసగా 10 సక్సెస్ లను అందుకున్న దర్శకుడిగా పేరు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

బాలయ్య బాటలోనే నడుస్తున్న చిరంజీవి...సక్సెస్ వస్తుందా..?

Chiranjeevi And Balakrishna
Chiranjeevi And Balakrishna

Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన నుంచి వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లి ప్రజారాజ్యం అనే పార్టీ ని అక్కడ సక్సెస్ అవ్వలేక తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికైతే సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి పెద్దగా సక్సెసులైతే దక్కడం లేదు. దాంతో ఎలాగైనా సరే మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సంవత్సరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు… ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

ఇంతకుముందు బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వయసుగల క్యారెక్టర్ లో నటించాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తనకి 20 సంవత్సరాల కూతురు కూడా ఉంటుందట. మరి ఈ సినిమాని ఎమోషనల్ డ్రామా తరకెక్కించాలనే ప్రయత్నంలో బాబీ ఉన్నాడు.

కమర్షియల్ హంగులను ఏమాత్రం మిస్ అవ్వకుండా మాస్ ఎలిమెంట్స్ సైతం సినిమాలో మిగతం చేస్తూ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపడానికి బాబీ ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? తద్వారా చిరంజీవికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

చిరంజీవి ఈ సినిమా స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అందుకే బాబీ తో తొందరగా సినిమాను స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. బాబీ సైతం ఈ సినిమాని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది…

బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమాలో క్లైమాక్స్ ఇలా ప్లాన్ చేశారా..?

Balakrishna Gopichand Malineni Movie
Balakrishna Gopichand Malineni Movie

Balakrishna And Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక బాలయ్య బాబు సైతం తన తదుపరి సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సన్నీ డియోల్ ను హీరోగా పెట్టి ‘జాట్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో అతనికి బాలీవుడ్ లో కూడా చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దాంతో ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమాని లాన్ ఇండియా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో గోపీచంద్ మలినేని ఉన్నారట.

ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడట. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఇంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో చేయనటువంటి ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఈ మూవీలో ఉండబోతుందట. ఇంతకీ ఏం ప్లాన్ చేశారనే విషయాన్ని క్లారిటిగా చెప్పడం లేదు.

కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది… మొత్తానికైతే తెలుగులో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన బాలయ్య బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

వచ్చే నెలలో ఆ రెండు బిల్లులు.. చంద్రబాబు గట్టెక్కిస్తారా..

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపునకు సంబంధించి మరోసారి కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంట్లో పెట్టి వెనక్కి తీసుకుంది కేంద్రం. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. సాధారణ మెజారిటీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. కానీ మూడింట రెండో వంతు లేకపోవడంతో మహిళా బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. వెంటనే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి తీసుకుంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతోనే ఆ రెండు బిల్లులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అయితే వచ్చే నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రెండు బిల్లులను మరోసారి ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు బిల్లులకు సంబంధించి ఒకదానితో ఒకటి సంబంధం ఉండడంతో.. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం నడుము బిగించినట్లు తెలుస్తోంది.

* అన్ని రాష్ట్రాల్లో సమానంగా..
ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఉత్తరాదితో పోల్చుకుంటే తగ్గుతాయి అన్నది ఒక వాదన. తద్వారా దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయి అన్న ఆందోళన ఉంది. ఆ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% నియోజకవర్గాలు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 50 శాతానికి పెంచుతామని.. ఇది అన్ని రాష్ట్రాలకు సమాన వర్తింపు అని చెబుతోంది కేంద్రం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు అనేది జరిగిపోవాలని చూస్తోంది. కానీ ఆ రెండు బిల్లులకు.. మూడంట రెండో వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం. ఇప్పుడు ఆ బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం పెట్టినట్లు తెలుస్తోంది.

* ఇతర నేతలతో సంబంధాలు..
దేశవ్యాప్తంగా జాతీయస్థాయి నేతలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వారితో చంద్రబాబు పని చేశారు. అందుకే ఇప్పుడు ఆ రెండు బిల్లులకు అవసరమైన బలం సాధించే బాధ్యతను చంద్రబాబుకు కట్టబెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని.. అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని చంద్రబాబు జాతీయస్థాయిలో వివిధ పార్టీల నేతలను ఒప్పించనున్నారు. ఈ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఇది ఉండదని.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సమానంగా నియోజకవర్గాల పెంపు ఉంటుంది అని వివరించే ప్రయత్నం చేస్తారు. తనకున్న పరపతిని, పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు ఈ పని పూర్తి చేయాలని కేంద్ర పెద్దలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లులను ముందుకు తీసుకెళ్లాలి అన్నది కేంద్ర పెద్దల ఆలోచన. మరి అందులో ఎంతవరకు సక్సెస్ కనిపిస్తుందో చూడాలి.